Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

పదునారవ యధ్యాయము - ధనుర్భాణలక్షణము

పుష్కరః : ధనుర్ధ్రవ్య త్రయం లోహం శృంగంచారుచభార్గవ! | జ్యాద్రవ్యత్రితయం చర్మవంశ భంగం త్వచస్తధా ||

వంశ త్వగ్వంశ చాపంతు కర్తవ్యం భృగునందన | అన్వేషు రామ! చాపేషు శేషద్రవ్య మిదం భ##వేత్‌|| 2

ప్రమాణం నాత్ర నిర్ధిష్టం చాపయోశ్శార్జ లోహయోః | దారు చాప ప్రమాణంతు శ్రేష్ఠం హస్త చతుష్టయమ్‌ || 3

తదర్ధసమహీనే తు ప్రోక్తే మధ్య కనీయసీ | ముష్టి గ్రాహ్యాణి వృత్తాని మధ్యే సర్వాణి కారయేత్‌ || 4

స్వల్పా కోటిస్తు వారాక్షణాం శార్జలోహమయా ద్విజ! | కామినీ భ్రూలతా77కారా కోటిః కార్యా సుసంస్కృతా || 5

పృథగ్వా దారుమిశ్రోవా లోహశార్జేత్గు కారయేత్‌ | శార్జం స్నాయుచితం కార్యం రుక్మబిందు విభూషితమ్‌|| 6

కుటిల స్ఫుటితం చాపం సచ్ఛిద్రం చన శస్యతే | హస్తిభగ్నా ద్రుమా యేచ విద్యుద్దగ్ధా స్తథా చ యే || 7

ఆగమా దేవతావేశ్మ తాపసాశ్రమ సంభవాః | శ్మశాన సంభావా యే చ న తే కార్యాః కథం చ న || 8

ప్రాణినాం య స్సజాత్యేన శృంగీ యుధి నిపాతితః | తచ్ర్ఛుంగం వర్జయే చ్చాపే నిత్యం శార్‌ఙ విచక్షణః || 9

లోహాని రామ! చత్వారి శస్యన్తే చాపకర్మణి | సువర్ణం రజతం తామ్రం తధా కృష్ణాయసం ద్విజ! || 10

కాంచనం చాపరత్నంతు సరత్న మపి కారయేత్‌ | మాషిషం శారభం శార్జం రౌహీజం చాపి కారయేత్‌ || 11

వార్‌క్షం చందనజం శ్రేష్ఠం వైతసం ధాన్వతం తధా | సాల శాల్మలి కాశానాం కకుభస్యాం 7జనస్యచ || 12

వంశస్య చ మహాభాగ ! సర్వశ్రేష్ఠ తమం విదుః | శరద్గృహీతైః కాష్ఠైస్తు చాపం కార్యం ప్రయత్నతః || 13

వంశానామపి తచ్ర్ఛేష్ఠం యత్ర గంగా మహానదీ | సాలానా మపి తచ్ర్ఛేష్ఠం గోమతీ యత్ర భార్గవ ! || 14

వితస్తా కూలజం శ్రేష్ఠం వేతసీనాం తధైవ చ | ఏనం ద్రవ్య మయం కార్యం చాపం లక్షణ సంయుతమ్‌ || 15

గ్రహణం లక్షణంచాస్య భవిష్యతి చ ఖడ్గవత్‌ | సుఖగ్రాహం దృష్టికాంతం శరమోక్ష సుఖం తధా || 16

శ్లక్‌ష్ణం శ్లిష్ఠం సుసంస్థానం సారవన్తం సుసంహతమ్‌ | అవనామ సుఖం నిత్యం పుం నామ నవలోత్కటమ్‌ || 17

ఏత దీదృశకం శ్రేష్ఠం చాపరత్నం విదుర్భుధాః | రాజ్ఞా చాపస్య కర్తవ్యా పూజా బాణవరస్య చ || 18

పుష్కరుడనియె: ధనుర్ద్రవ్యత్రయము 1 లోహము 2 శృంగము(కొమ్ము) 3 దారువు(కర్ర)జ్యాద్రవ్యత్రయము 1 చర్మ 2 వంశభంగము 3 త్వక్కు. వెదురుతో త్వక్కు బాణమును జేయవలెను. ఇతర ధనుస్సు లందు దేవదారు శేషద్రవ్యమగును. చాపములకు కొమ్ముతో లోహముతో జేసిన బాణమునకు నిక్కడ చేప్పబడలేదు. దారు చాపము నాల్గుహస్తములది శ్రేష్ఠము. దానిలో సగము మధ్యము చాపము. ఆసగముకంటె దగ్గినది హీన చాపము. అన్నిధనుస్సులకు నడిమి భాగములు వృత్తములగా (గుండ్రముగా) గుప్పిటం చుట్టుట కనువుగా జేయవలెను, వృక్షమయములయిన (దారువములయిన) విండ్లకు వింటికొప్పు (ధనుష్కోటి) స్వల్పముగా (చిన్నదిగా) నుండవలెను. అది కొమ్ముతో గాని లోహముతో గాని చేయబడవలెను. ఆధనుష్కోటి స్త్రీయొక్క భ్రూలతవలె (కనుబొమలవె) వంపుగా తీర్చి చక్కగా చేయవలెను. ఇనుపవింటి కొప్పు మాత్రము విడిగా దారు మిశ్రమముగా జేయవచ్చును. కొమ్ముతో జేసినవింటిన స్నాయువులతో (కండరములు) నిండినది బంగారపు చుక్కలతో నలంకిరింప బడినదియుం గావింపవలెను. ధనుస్సు కుటిలము (వంకర తిరిగినది) విరిగినది ఛిద్రములు గలదియునైన మంచిదిగాదు, ఏనుగులు విరచినవి పిడుగుపడినవి దేవాలయములందలివి తాపసాశ్రమ మందలివి శ్మశానములోని ద్రవ్యములతో జేయబడినది నిషిద్ధములు. కొమ్ముగల జంతువు సజాతిమృగముచే గూల్పబడి నేని దాని కొమ్ము వింటికి నిషిద్ధము. చాప నిర్మాణములో నాల్గులోహములు ప్రశస్తములు 1 సువర్ణము 2 వెండి 3 రాగి 4 కృష్ణాయసము ఉక్కు కాంచన చాప రత్నమును రత్నములతో గూడ పొదుగవలెను. మాహిషము (గేదికొమ్ముతో చేసినది) శారభము (శరభమృగము కొమ్ముతోజేసినది) రౌహిజము (చేపకొమ్ముచేజేసినది) అని మూడు రకములు శృంగధనుస్సులు. వృక్షములలో చందనపు కర్రతోజేసిన శ్రేష్ఠము, వైతసము (ప్రబ్బలి)తో జేసినది ధాన్వతము వేతసము సాల శాల్మలి (బూరుగు) కాశ కకుభ అంజనము వంశములతో జేసినది శ్రేష్ఠములు, వాంశము సర్వ శ్రేష్ఢము. శరద్దృతువులో నరికి తెచ్చిన వృక్షములతోనే విల్లును ప్రయత్నించి తయారు చేయవలెను. గంగా మహానదీ తీరమందలివి మంచివి. గోమతీ తీరమందలి సావృక్షములు వెదళ్ళు విల్లులకు శ్రేష్ఠములు. వితస్తానదీ తీరజమైన కర్రలు వైతసములు ధనుస్సులకు శ్రేష్ఠములు. ఈ ద్రవ్యములతోడి చాపములు సలక్షణములు. ఈ ధనుస్సులయొక్క గ్రహణము (పట్టుట) లక్షణము ఖడ్గమునకువలెనే యుండును. సుఖగ్రాహము = సుఖముగా బట్టుట కనువయినది దృష్టి కాంతము = చూచుట కింపైనది శర మోక్ష సుఖము = బాణము సంధించి వదులటకు సుఖకరమునై యుండునది, శ్లక్షణము = నునుపైనది శ్లిష్టం సుసంస్థానం = చక్కని నిర్మాణము గల పారవంతము సుసంహతము బాగుగా వంచుటకు సుఖముగా నుండునది. ఇటువంటి విల్లు పరమశ్రేష్ఠమని పండితు లెరుంగుదురు. రాజు వింటికి బాణములకు బూజచేయవలెను.

నిత్యం దేవకులే రామ! ఖడ్గస్య చ విశేషతః | అయస శ్ఛా7థ వంశస్య శరస్యా7థ శరో భ##వేత్‌ || 19

శరవంశౌ గ్రహీతవ్యౌ శరత్కాలే భృగూత్తమ ! | శరాః కిరాతజాః శ్రేష్ఠాః కాంచీపుర సమీపతః || 20

తేభ్యో7పి తే శ్రేష్ఠతమాః స్కన్దజన్మ మహీభవాః | స్నిగ్ధా నిమగ్న పర్వాణః సారవన్తః సమాహితాః || 21

ఋజవో మధువర్ణాభాః సుజాతాః శారదా దృఢాః | స్నాయు శ్లిష్టాః సునేత్రాశ్చ సుపుంఖాః కలవాససః || 22

తైలధౌతాశ్చ కర్తవ్యా రుక్మపుంఖ విభూషణాః | తధా విషమ పర్వాణః ఫలైశ్చ వ్రణ వర్జితైః || 23

ఏకం త్రిపుంఖం కర్తవ్యం రాజహంస చ్ఛదోత్తరమ్‌ | రుక్మపుంఖః సువర్ణాగ్ర మయః ఫల మను త్తమమ్‌ || 24

స్నాయుబద్ధం బలం తస్య రుక్మబంధం తు కారయేత్‌ | వజ్రైశ్చ లక్షణోపేతైః చిత్రితం తంతు కారయేత్‌ || 25

గ్రహణం తస్య కర్తవ్యం సాంవత్సర కరాన్‌ నృపైః | తస్య పూజా సదా కార్యా సా7భిషేక సమా భ##వేత్‌ || 26

యత్రాయా మభిషేక చ మంగళేషు చ కర్మసు |

స పతాకే తు తంచాపం సపతాకంతు కారయేత్‌ | మాంగళ్యం తన్నరేన్ధ్రాణాం కథితం భృగునందన! || 27

యే చాపరత్నం వినతం తు భూపాః సువర్ణ రత్నో పచితః సదైవ|

బాణన సాకం వరిపూజయన్తి భవ న్తి తే రామ! న విపన్నదుఃఖాః || 28

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే చాపశర లక్షణంనామ షోడశో7ధ్యాయః

పరశురామ! దేవకులమందు దేవతలతోపాటు కత్తికిని ఇనుము వెదురు ఱల్లుతో జేసిన వింటికిని బాణమునకును బూజ చేయవలెను. శరత్కాలములో శరవంశములు గ్రహింపవలెను. కాంచీపుర సమీపమందలి కిరాత దేశజ శరములు (ఱల్లుకర్రలు) ఇందులకు శ్రేష్టములు. వాటికంటె నెక్కువ శ్రేష్ఠములు స్కందజన్మభూమిలో (కుమారస్వామి జనించిన ప్రదేశములో) బుట్టినవి. స్నిగ్ధములు (నునుపైనవి) కణుపులు పైకిదేరనివి సారవంతములు (గట్టివి) చక్కగా జేయబడినవి సూటిగానుండినవి తేనెరంగు గలవి సుజాతములు చక్కనిచోట పుట్టినివి శరత్కాలమందలి దుబ్బుకర్రలతో జేయబడినవి స్నాయుశ్లిష్ఠములు = కండరములతో గట్టిగ జుట్టబడినవి సునేత్రములు = మంచి కణపు గల వాసములు శ్రేష్టములు. తుప్పు పట్ట కుండుటకు నూనె రాచి మెరుగుబెట్టవలెను. బంగారుపిడితో నలంకృతములు. పుంఖము = పిడి. విషమపర్వములు = బేసిగణుపులు గలవి వ్రణములు లేనివి ఫలములు గలవి అనగా నరుకుట పగుళ్లులేని ములుకులుగలవి. రాజహంస ఱక్కల యీకెలు గలవిగా యుండలెను. బంగారు ములికి బంగారు ములికికొన, యినుపములికి గలవిగా బెక్కరకముల బాణముల నుపయోగింపవలెను. కండరములతో (స్నాయువులతో) గట్టిగ బిగించి బంగారు పిడి వేయింపవలెను. ఆబాణము మీద సలక్షణమైన వజ్రములు చిత్రముగా పొదుగవలెను. రాజా బాణములకు జ్యౌతిషికుని చేతినుండి యందుకొనవలెను. ఆబాణములనకు నిత్యము పూజ చేయవలెను. ఆదియభిషేకము వంటిదే. జైత్రయాత్రయందు, పట్టాభిషేకమందు మంగలకార్యములందు ధ్వజారోహణముతో జరిపించు వానియందు ధనుస్సునకు గూడ పతాకము గట్టవలెను. అది రాజులకు మాంగళ్యము (మంగలకరము) అని శాస్త్రములందు జెప్పబడినది. ఏరాజులు బంగారముతో రత్నములు పొదిగిన చాపరత్నములను, బాణములతో గూర్చి ఎక్కడ పూజింతురో వారు దుఃఖములం బాయుదురు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున చాపశర లక్షణమను పదునారవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters