Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట పదమూడవ అద్యాయము - భోగదేహ వర్ణనము

రామః-భోగదేహం కధం త్వక్త్వా జీవో గర్భం ప్రపద్యతే | భోగ దేహశ్చ కఃప్రోక్తః తం మమాచక్ష్వ పృచ్ఛతః ||

పుష్కరః- ఆతి వాహిక గర్భస్య దేహో భవతి భార్గవ! | కేవలం తం మనుష్యాణాం మృత్యుకాల ఉపస్థితే ||

యామ్యైర్నరైర్మనుష్యాణాం తచ్ఛరీరం భృగూత్తమః | నీయతే యామ్యమార్గేణ నాన్యేషాం ప్రాణినాం ద్విజః ||

మనుష్యాః ప్రతి పద్యన్తే స్వర్గం నరక మేవ చ | నైవాన్యే ప్రాణివనః కేచిత్‌ సర్వే తే ఫల భోగినః ||

శుభానా మశుభానాం వా కర్మణాం భృగునందన! | సంచయః క్రియతే లోకే మనుషై#్య రేవ కేవలం ||

తస్మా న్మనుష్యస్తు మృతో యమలోకం ప్రపద్యతే | నాన్యః ప్రాణీ మహాభాగ| ఫలయోనౌ వ్యవస్థితః ||

గచ్ఛన్‌ లోకే ప్రపన్యస్య పురుషస్య తథా యమః | యోనీ శ్చ నరకాం శ్చైవ నిరూపయతి కర్మణామ్‌ ||

పూజనీయ శ్చతే తేన వైవస్వ త మపశ్యత | మరణానంతరం ప్రోక్తం తరిశ్చాం గర్భ సంభవమ్‌ ||

వాయు భూతాశ్చ తే గర్భం ప్రపద్యన్తే న సంశయః |

పరుశురాముడు:- జీవుడు భోగ శరీరమును విడిచి యెట్లు గర్భముం బ్రవేశించును? భోగ దేహమన నేది? యాన తిమ్మన; పుష్కరుడనియె. మరణ సమయము రాగానే అతి వాహిక జీవునకు ఒక శరీరమేర్పడును. యమకింకరులా శరీరమును యామ్య మార్గమున (దక్షిణ దిక్కుదారిని) గొంపోవుదురు. మనుష్యేతరులా దారింబోరు. మనుష్యులు స్వర్గమునకు నరకమునకు బోవుదురు. ఇతర ప్రాణులట్లుపోరు. ఆ జీవులు కేవలము ఫలమును మాత్రమనుభవింతురు. మంచి కాని చెడ్డ గాని చేసిన కర్మ యొక్క ఫలము యొక్క సంచయమును మనుష్యులు మాత్రమే చేయుదురు. మనుష్యకృత కర్మఫలము మాత్రమే దేశకాలాంతరము లందనుభవయోగ్యముగత నిలువచేయబడునన్న మాట. అందుచే జనిపోయిన మనుష్యుడొక్కడే యమలోకము, నందును. మఱి యే యితర ప్రాణియు కర్మ ఫలము కారణముగాగల యోనియందుండదు. యమలోకమందు యముడు తనను చేరిన మానవునికి వాడమభవించవలసిన నరకములను వాడు తిరిగి యెత్తవలసిన జన్మములను నిరూపించును. ఆ దైవము ఆదరించు ఆ ప్రాణులాయముని గాంచిరి. పశు పక్షులకు మరణము తరువాత తిరిగి పుట్టుట చెఫ్చబడినది. అవి వాయురూపము నంది తిరిగి గర్భముం బ్రవేశించును. సందియము లేదు.

మనుష్యస్తు మృతో రామ! నీయతే యమ మందిరమ్‌ ||

తధా కర్మాను రూపేణ యమం పశ్య త్యసౌ తతః | ఘోరం పాప స్థథా ధర్మేనివిష్ట స్సౌమ్య దర్శనమ్‌ ||

ధర్మిష్టః పూజ్యతే తత్ర హ్యాసనే నోదకేన చ | పాశ బద్ధ గలః పాపః పీడ్యతే వై యమాగ్రతః ||

చిత్ర గుప్తా స్తత స్తస్య స్వర్గం నరక మేవ చ | నివేదయన్తి ధర్మజ్ఞ! స తు పిండాశన స్తతః ||

తథా త్యక్త్వాతు తద్ధేహం ప్రేత దేహం ప్రపద్యతే | ప్రేతలోకే తు వసతి ర్వర్షం తస్య తు కీర్తితా ||

క్షత్తృష్ణే ప్రత్యహం తత్ర భవతో భృగునందన! అహోరాత్రం తు తత్రాపి మానుష్యం పరికీర్తితమ్‌ ||

ఆమశ్రాద్ధా స్తథా దత్తా భుజ్యన్తే తత్ర మానవైః | అతివాహిక దేహా త్తు ప్రేత పిండై ర్వినా నరః ||

న హి మోక్ష మవాప్నోతి పిండాం స్తత్రైవ సోశ్నుతే | కృతే సపిండీకరణ నర స్సంవత్సరా త్పరమ్‌ ||

ప్రేత దేహం సముత్సృజ్య భోగ దేహం ప్రపద్యతే | తదాదౌ భుజ్యతే తత్ర యత్‌స్తోకం భృగునందన ||

భోగ దేహా వుభౌ ప్రోక్తా శుభాశుభక సంజ్ఞ కౌ | భోగ దేహం శుభం తస్య దేవ రూపస్య జాయతే ||

నానా ప్రకార మశుభం విరూపం ఘోర దర్శనమ్‌ | యాదృశం తస్య మానుష్యం రూప మాసీ త్పురాతనమ్‌ ||

కించిత్తస్య తు సాదృశ్యం తత్రాపి ప్రతి పద్యతే | భుక్త్వా స భోగదేహేన యధాకాలం త్రి విష్టవమ్‌ ||

కర్మణ్యల్పావ శేషే తు త్రిదివా ద్వినిపాత్యతే | త్రిదివా త్పతితం తస్య భోగ దేహం తు రాక్షసాః ||

భక్షయన్తి తదా భూమే వికృతా భీమ దర్శనాః | పాపే తిష్ఠతి చే త్స్వర్గే తేన భుక్తం తథా ద్విజ! ||

తదా ద్వితీయం గృహ్ణాతి భోగ దేహం తు పాపినమ్‌ | భుక్త్వా పాపం తు తే పశ్చాత్తేన భుక్తం త్రివిష్టపమ్‌ ||

శుచీనాం శ్రీమతాం గేహే స్వర్గ భ్రష్టోభి జాయతే | పుణ్య తిష్ఠతి చేత్పాపం తేన భుక్తం తదా భ##వేత్‌ ||

తస్మిన్‌ సంభక్షితే దేహే శుభం గృహ్ణాతి విగ్రహమ్‌ | కర్మ ణ్యల్పావశేషే తు నరకాదపి ముచ్యతే ||

ముక్తస్తు నరకాద్యాతి తిర్యగ్యోని మసంశయమ్‌ | తత్రా ప్యశేషతః పాపం నత దశ్నాతి భార్గవః ||

తతోవవేషం మానుష్యం భుంక్తేసౌ కృత లక్షణః ||

రజ్జుర్యధా స్యా ద్భహు తంతు బద్ధా | వికర్షణ శక్తిమతీ గురూణామ్‌ |

స్వర్గాయ పుణ్యం, నరకాయ పాపం తథా నృణాం స్యా దిహ భార్గవాగ్ర్య ||

ఇతి శ్రీ పిష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే భోగదేహవర్ణనం నామ త్రయోదశోత్తర శతతమోధ్యాయః || 113

మనుష్యుడు మాత్రము చనిపోయినవాడు యమ మందిరమునకు గొంపోబడును. కర్మానుసారముగ నతడక్కడ యమునింజూచును. పాపాత్ముడా కాలుని ఘోర రూపుంగా జూచును. ధర్మనిష్ఠుడు ప్రసన్న మూర్తింగా యముని జూచును. ధర్మాత్ముడక్కడ ఆసనము అర్ఘ్య పాద్యాదులతో పూజింపబడును. పాపి కంఠమున కురివేయబడి యముని ముందు పీడింపబడును. అటుపైని చిత్రగుప్తులు వానికి స్వర్గమో నరకమో నిర్ణయించి నివేదింతురు. ఆ జీవి జ్ఞతులు పెట్టు పిండముందినుచు నా శరీరముం గూడ విడిచి ప్రేత శరీరముం బొందును. వానికి ప్రేతలోకమందు నివాస మొక్క సంవత్సరమని చెప్పబడినది.

అక్కడ ప్రతి దినమును వాని కాకలి దప్పికలు గల్గుచుండును. మనుష్యుని కున్న పగలు రాత్రియునక్కడ నుండును. కొడుకులు పెట్టిన ఆమ (పచ్చి ద్రవ్య) శ్రాద్ధములు అక్కడ మానవు లనుభవింతురు. ప్రేత పిండములు లేకుండా నరుడు అతివాహక దేహమునుండి ముక్తి నంనలేడు. ఈ పెట్టిన పిండముల నీతడక్కడనే తినును. సపిండీకరణమను శ్రాద్ధ విశేషము పెట్టగా సంవత్సరము తరువాత ప్రేత దేహము విడిచి భోగ దేహమును బొందును. అచట ముందుగ నల్పముగా నున్న కర్మ యొక్క ఫలమనుభవించును: భోగ దేహములు శుభాశుభకములు రెండు. శుభ భోగ దేహమున న త డు దేవతా స్వరూపుడుగ నుండును. అశుభ దేహము వికృత రూపము ఘోరముగా కనిపించును. మనుష్యుడుగా నున్నపుడున్న ఆ ప్రాత రూపము పోలిక యుండును. ఇక్కడ ఆశుభ కర్మను భోగ దేహముతో నెంతకాల మనుభవించవలెనో అంతకాలము ననుభవించి కొలది కర్మరూపులు వికృతాకారులు నగు రాక్షసులు భక్షింతురు. పాపాత్ముడు స్వర్గ మందుండెనేని పుణ్య ఫలానుభవము కాగానే రెండవ భోగ దేహమును పాపిష్ఠమైన దానిని స్వీకరించును. దానిచే పాపముం గుడిచి పిదప స్వర్గము ననుభవించును. స్వర్గభ్రష్టుడు ఆచారవం తులు శ్రీమంతులునగు వారి యింటం బుట్టును. పుణ్యమున్నవాడు ముందుపాపము ననుభవించును. అట్లు పాపభక్షణము కాగానే శుభ శరీరమును బొందును. పాపము కొంచెము మిగిలియున్న తరి నాతడు నరకము నుండి విముక్తుడగును. నరకమునుండి ముక్తుడైన వాడు పశు పక్షి జన్మము నందును. ఆ పశు పక్షి జన్మమందు గూడ పాపము నిశ్శేషముగ గుడువడు. అందువలన మనుష్య జన్మలో నా మిగిలిన కర్మ శేషముతో తదనురూముగా నేర్పడిన లక్షణములు గలవాడై యనుభవించును. పెక్కు తంతువులతో బేనబడిన పగ్గమెట్లు బరువైన పదార్థములు నెత్తుటకు శక్తి గలదగునో అట్లె ఓ భార్గవ శ్రేష్ఠా! పుణ్యము స్వర్గమునకు పాపము నరకమునకు మానవుల లాగుటకు సమర్దమగును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమునందు భోగ దేహ వర్ణనమను నూట పదమూడవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters