Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

ఎనుబదిఅయిదవ అధ్యాయము - గ్రహశుభాశుభపరిజ్ఞానవర్ణనము

శుభోవాప్య శుభో వాపి కథం కాలో మహీతలే | జ్ఞాయతే భార్గవశ్రేష్ఠ! తన్మమాచక్ష్వ పృచ్ఛతః || 1

మార్కండేయ ఉవాచ:

కృత్తికా యామ్యవాయవ్యే నాగవీ ధ్యుత్తరోత్తరే | గజవీధీ హ్యుదజ్‌మధ్యే ప్రాజాపత్యాదయ స్త్రయః || 2

ఐవరాణ హ్యుదగ్‌బాగే ఆహోరాత్ర చతుష్టయమ్‌ | మధ్యే వర్గే తధా వీధీ ఫల్గునీ ఋక్షయో ర్ద్వయోః || 3

మధ్యే మధ్యేతు గోవీధి ఆ జాద్యం భ చతుష్టయమ్‌ |

మధ్య యామే జరద్గుస్స్యా త్త్రితయం శ్రవణాదికమ్‌ || 4

యమ్యోత్తరేణ తు మృగా హస్త చిత్రే ప్రకీర్తితే |

అజా దక్షిణ మధ్యే తు విశాఖా మైత్రయో స్స్మతాః || 5

అమీయామ్య యామ్యేతు శక్రాద్యం భచతుష్టయమ్‌ |

వైశ్వానరం పథం ప్రాహు స్తమేవాత్యంత దారుణమ్‌ || 6

ఉదయా స్తమయాభ్యాంచ చారేణ చ తధా గ్రహాఃఆ | ఉత్తరాసు శుభాఃప్రోక్తాః దక్షిణా స్త్వశుభావహాః || 7

వజ్రు డిట్లు పలికెను :- ఓ భార్గవ శ్రేష్టా ! ఈ మహీ తలమున కాలము ఇది శుభ##మైనది ఇది అశుభ##మైనదనికాని యెట్టు తెలియవచ్చునో మిమ్ము అడుగుచున్నాను. దానిని తెలుపుడు.

మార్కండేయుడిట్లు చెప్పెను :- నక్షత్ర (రాశి) చక్రము. సూర్యగమనమునకు సంబంధించి మూడు మార్గములుగ విభజించి బదినది. వీనియందు ఉత్తర గతిని ఐరావతము, దక్షిణ గతిని వైశ్యానరము, మధ్యగతిని జరద్గవము అందురు. ప్రతి మార్గమునకును మూడేసి వీధులు గలవు. వాని వ్యవస్ధ యీక్రింద చూపబడు చున్నది.

1. ఐరావత మార్గము నాగవీధి గజవీధి ఐరావతవీధి

అశ్విని రోహిణి పునర్వసు

భరణి మృగశిర పుష్యమి

కృత్తిక ఆరుద్ర అశ్లేష

2. జరద్గర మార్గము ఋషభవీధి గోవీధి జరద్గవవీధి

మఘ హస్త విశాఖ

పుబ్భ చిత్త అనూరాధ

ఉత్తర స్వాతి జ్యేష్ఠ

3. వైశ్వానరమార్గము అజవీది మృగవీది వైశ్వావరవీధి

మూల శ్రావణం పూ.భాద్ర

పూ, షాఢ ధనిష్ఠ ఉ.భాద్ర

ఉ. షాఢ శతభిషము రేవతి

గమనిక: పైవిషయమున విష్ణుధర్మోత్తరమహాపురాణగతశ్లోకములు సరిగాలేక సమన్వయమున కనకూలపడనందున ఇదేవిషయము శ్రీ దేవీభాగవతములో చెప్పబడినదానిని నిచట చూపుట యైనది.

సుప్రభా రశ్మిమ న్తశ్చ నాగవీధ్యాం యదా గ్రహాః |

న తదస్తి శుభం లోకే యన్న పశ్యన్తి మానవాః || 8

విరశ్మయో వివర్ణాశ్చ వైశ్వానర పధాశ్రితాః | న తదస్తి శుభం రామ! య న్న కుర్యు ర్జగత్త్రయే || 9

రోహిణీ శకటం భింద్యు ర్గ్రహా యది భ##వే త్తధా | నాశః ప్రజానాం క్రూరశ్చ విశేషేణాత్ర లక్ష్యతే || 10

సౌరార సూర్యాః క్రూరాస్తు తధా క్షీణశ్చ చంద్రమాః |

క్రూరై ర్యుక్తో బుధ శ్చైవ రాహుః కేతు స్తధైవ చ || 11

శేషా స్సౌమ్య గ్రహాః ప్రోక్తాః మునిభి స్తత్త్వ దర్శిభిః |

రోహిణీ కృత్తికా పిత్ర్యం వైష్ణవం మైత్రమేవ చ || 12

పీడయన్తో గ్రహా హన్యు ర్దిశం వరుణ పాలితామ్‌ | పూర్వస్యాం దిశి దృశ్యన్తే సర్వతారాగ్రహాయది || 13

ప్రాచ్యానాంతు తదా రాజ్ఞాం భ##వే త్పీడా సుదారుణా |

వైశ్వానర మార్గము మిగుల దారుణమైనది. చ్రిహములు ఈమార్గములందలి నక్షత్రము లందున్నప్పుడు అశుభ ఫలితముల నిచ్చును. అయాగ్రహదులు తమ తమ ఉదయాస్తమయములను రాశి సంచారమను ననుసరించి యుత్తర భాగమున నున్న గ్రహములు శుభములు. దక్షిణ భాగముననున్నవి అశుభమును కలిగించును. గ్రహము లెప్పుడు నాగ వీధి యందు మంచి కాంతిని తేజః కిరణము లను పొందియుండునో అపుడు లోకమున మానవులు పొందని శుభ##మేదియు నుండదు. (అన్ని శుభములు చేకూర్చును) అట్లే గ్రహమలు వైశ్వానర వీధి నాశ్రయించి తమ తేజః కిరణములను ప్రకాశమానిమగు వన్నెను కోల్పోయి యుండునో అప్పుడట్లున్న గ్రహములు జగత్త్రయమున తాము చేయజాలని శుభ##మేదియు నుండదు. (అన్ని శుభములు చేయునని తాత్పర్యము) గ్రహములెపుడు రోహినీ శకటమును భేదించునో అపుడు ఈ లోకమున ప్రజలకు విశేషమగ క్రూరమైన నాశము కలుగును. ఏదేని గ్రహమ వృషభ రాశికి సంబంధించిన ముప్పది భాగములలో మొదటి భాగమునుండి పదు నేడవ భాగమన నుండగా ఆ గ్రహము యొక్క శరమక్రాంతి వృత్త మునకు దక్షిణ దిశగా రెండు భాగముల (డిగ్రీల) కంటే నెక్కువగా నున్నచో అట్లున్నంత కాలము ఆ గ్రహము రోహిణీ శకటమును - అనగా శకటా కారమున నమరియున్న అయిదు తారలతో నేర్పడు రోహిణీ నక్షత్రమును భేదించును అని జ్యోతిశాస్త్రమున గ్రహగణిత సిద్ధాంతమున చెప్పబడినది. (చూ-సూర్యసిద్ధాంతము భగ్రహయుత్యధికారము 13శ్లో)

మధ్యే చ యది దృశ్యన్తే మద్యదేశ నివాసినామ్‌ || 14

వారుణ్యాం యది దృశ్యన్తే తాం దిశం పీడ యన్తిచ |

హీనాధికం చరన్త శ్చ వ్యభ్రే దర్శనం గతాః || 15

ధూమాయన్తో జ్వలన్తోవా వేదయన్తి మహద్భయమ్‌ | ఏకా న్తరిత నక్షత్రగతా స్స్యుశ్చే ద్గ్రహా దివి || 16

మాలా నామ భ##వేద్యోగో మధ్యదేశ క్షితీశహా |

ప్రాస శ్చక్రం ధను ర్వజ్రం సస్యానాం క్షుద్రవృషిదాః || 17

గ్రహా భయావహా నిత్యం శృంగాటశ పురోగమాః | భ##వేయురేకర్జగతా స్త్రిభి రూర్ధ్వం యదా గ్రహాః 18

వినాశాయైవ లోకానాం విజ్ఞేయా స్సుమహీక్షితామ్‌ |

ఏకేన యదివా ద్వాభ్యాం గ్రహాభ్యం సహితో గురుః || 19

శ##నై శ్చరో వా దృశ్యేత తదా దుర్భిక్ష మాదిశేత్‌ |

చిత్రాయాం లోహితో యత్ర ములే దేవగురు స్తధా || 20

భార్గవ శ్చ శ్రవిష్ఠాను తదా ఘోరం భయం భ##వేత్‌ | కృత్తికాసు శ##నైశ్చారీ విశాఖాసు బృహస్పతిః || 21

స్థితౌ ప్రజానాం పీడాయై వృష్టి మ న్త ర్దివం భ##వేత్‌ |

పా గ్ద్వారేషు చరన్‌ భేషు సౌరో వక్ర మియా ద్యది || 22

పృథివీం పీడయే త్సర్వాం పూర్వదేశం విశేషతః |

రౌద్రే హస్తే తధై వాప్యే అహిర్బుధ్న్యే శ##నైశ్చరః || 23

యదోదయం ప్రమధ్యేత తదా నశ్యన్తి పార్థివాః |

సౌమ్యే త్వాష్ట్రే శ్రవిష్ఠాను స్థితే సౌరే మహీక్షితః |

సర్వపీడాం సమర్హన్తి యధా యాన్తి యమా న్తికమ్‌ |

పూర్వాం పరాశాం సంప్రాప్తౌ భృగు జీవౌ పరస్పరం || 25

సప్తమర్షగతౌ స్యాతాం తదా దేవో న వర్షతి | అపర్వణి శశాంకార్కౌ త్వష్టా నామ మహాగ్రహః || 26

అపృణోతి తమ శ్శ్యామః సర్వలోక విపత్తయే | ఉదయాస్తమయే భానో శ్చంద్రస్య చ యదా భ##వేత్‌ || 27

పరివేష స్తదా రాజాక్షిప్రం వధ మవాప్నుయాత్‌ | సకలం చేదహ స్సూర్యో రాత్రిం చేత్సకలాం శశీ || 28

పరివేషీ భ##వేద్రాజా తత్రాపి వధ మర్హతి | ద్వి సూర్యే గగనే వృద్ధిం క్షత్రియాణాం వినిర్దిశేత్‌ || 29

ద్విచంద్రే బ్రాహ్మణానాం తు చాధిక్యం ప్రలయాయ తు |

ఉదయా స్తమ¸° యత్ర సోమార్కౌ రక్తమండలౌ || 30

స చాత్రాభ్రాణి దృశ్యన్తే తన్మహాభయ లక్షణమ్‌ | చంద్రమాః జన్మ నక్షత్రం పరిత్యజతి యస్య తు || 31

శ్యావో రూక్షోపసవ్యం తు తస్య విద్యా దుపద్రవమ్‌ |

అత్యన్తాదర్శనె రాహో స్తథా చాత్యన్తదర్శనె || 32

ప్రజా పీడా వినిర్దేశ్యా వ్యాధి దుర్భిక్ష తస్కరైః | య న్నక్షత్ర గతో రాహు ర్గ్రసతే చంద్ర భాస్కరౌ || 33

తజ్జాతానాం భ##వే త్పీడా యే నరా శ్శాన్తి వర్జితాః |

గ్రహోపసృష్టే నక్షత్రే గ్రహణం తు యదా భ##వేత్‌ || 34

తదా పీడా వినిర్దేశ్యా సైనికానాం నృపై స్సహ |

గృహీతో రాహుణా చంద్రః సూర్యోవా గగనాచ్చ్యుతః || 35

ఉల్కాని హన్యా త్తత్రాన్యో రాజా రాజ్యం కరిష్యతి | గృహీతౌ పరివేషే తౌ యదా చంద్ర దివాకరౌ || 36

సమన్తా త్పీడ్యతే దేశ శ్శస్త్రకోపశ్చ జాయతే | మేఘై స్సంఛాద్యతే రాహుః అతివర్షతి వా యదా || 37

ఆకాల జై స్తదా రాజ్ఞో భయం విద్యా దుపస్థితమ్‌ | య న్నక్షత్రా గతే సూర్యే ఛిద్రంవై సంప్రపద్యతే ||

తజ్జాతః పార్థివః క్షప్రం యమలోకం గమిష్యతి | తామ్రకుంకుమ రూక్షాభో ఘృత హారిద్రసన్నిభః || 39

బంధు జీవ నిభో భానుః శిశిరాద్యేషు శస్యతే | అస్వచ్ఛవర్ణః పరుషో లేవనః ఖండ మండలః || 40

సచ్ఛిద్రే రజసా ధ్వస్త ఉల్కా ద్యుపహతోపివా |

మండలా దస్య సంస్థానం మేఘైశ్చాయుధ సన్నిధైః || 41

ఉదయా స్తమయే ఛన్నః పార్థివానాం న శశ్యతే | పక్షాదౌ చాపసంస్థానే యుద్ధం శశిని నిర్దిశేత్‌ || 42

గ్రహములలో శని అంగారకుడు సూర్యుడు, క్షీణచంద్రుడు, క్రూరగ్రహ సమేతుడైన బుధుడు, రాహు కేతువులు ఇవి క్రూరలు. మిగిలినవి సౌమ్యగ్రహములని జ్యోతిస్తత్వవేత్తల అభిప్రాయము. గ్రహములు రోహిణీ, కృత్తిక, మఖ, శ్రవణము అనూరాధ అను నీనక్షత్రములలోనున్న గ్రహములు పశ్చిమదిక్కువారికి పీడను హానినికలిగించును. తారాగ్రహములు తూర్పుదిక్కున నున్నకాలమున నాదేశపు రాజులకును, మధ్యభాగముననున్నపుడు మధ్యనివాసులకును పడమట నున్నపుడు ఆదిక్కునవారికి మిగుల దారుణమగు పీడలగును. గ్రహములు (తమనిజపద్ధతికంటె) ఎక్కువగగాని, తక్కువగగాని సంచరించుట మేఘములు లేని నిర్మలాకాశమునకూడ నచట కనపడవలసిన గ్రహము అకస్మాత్తుగా కనపడక పోవుట, గ్రహమునుండి పొగ, మంటలు లేచుచున్నట్లు కనబడుట జరిగినచో అట్లు కనపడు ప్రదేశములవారికి మహాభయము కలుగును. ఆకాశమున గ్రహములన్నియు ఒక నక్షత్రమును విడిచి దాని తరువాత నక్షత్రమున (ఏకాంతరితముగ) నున్నచో మాలాయోగ మనంబడును. ఇది సంభవించినపుడు మద్యదేశరాజులకు ప్రజలకు హానికలుగును. ఇట్లే ప్రాసము, చక్రము, ధనుస్సు వజ్రము అనెడి యోగములు గ్రహగతిలో సంభవించినపుడు (ఇట్టి వన్నియు గ్రహ గణితశాస్త్రమునుండి తెలియవలెను) సస్యములకు అపకారకమగు క్షుద్రవృష్టి సంభవించును. గ్రహగతిలో శృంగాటక యోగము సంభవించినచో -దానిలోనున్న గ్రహములు లోకములకు భయము కలిగించును. గ్రహములు ఒక నక్షత్రము నుండి దానితరువాత మూడు నక్షత్రములను వదలి నాల్గవ నక్షత్రమును అను ఈ క్రమమున నున్నచో రాజులకు లోకమునకు వినాశము కలుగును, బృహస్పతిగాని శనిగాని ఒకటి లేదా రెండు గ్రహములతో కూడియున్నచో దుర్భిక్షము కలుగును. చిత్తలోనంగారకుడు, మూలలో బృహస్పతి, ధనిష్ఠలో శుక్రుడు, కృత్తికలో శని, విశాఖలో బృహస్పతి యున్నపుడు వర్షములుకురియవు. శనితూర్పు దిక్కునందలి నక్షత్రములలో సంచిరించుచు వక్రించినచో సమస్త పృధివి. విశేషించి పూర్వ (తూర్పు) దేశమును పీడించును. ఆ శనియే ఆర్ద్ర, హస్త, పూర్వాషాఢ పూర్వాభాద్ర నక్షత్రములలో ఉదయము (మౌఢ్యమినుండి) నొందినచో రాజులకు నాశనము కలుగును. రోహిణి, చిత్ర, ధనిష్ఠ, ఈ నక్షత్రములలో శనియున్నచో రాజులకు సన్నిపీడలు కలుగుటయేగాక యమలోకమును పొందుదురు, బృహస్పతియు, శుక్రుడును అను వీరిలోనొకరు తూర్పు మరిమొకరు పడమటదిక్కులకు సంబంధించిన నక్షత్రముల యందుండి, పరస్పరము ఏదవనక్షత్రముననున్నచో అనావృష్టి యేర్పడును. పర్వకాలము (పూర్ణిమ, అమా) కాకయే చంద్రసూర్య లను త్వష్ట అను మహాగ్రహము కప్పివేసినపుడు ఆ యేర్పడిన నల్లచీకటి సర్వలోకములకు విపత్తిని కల్పించును. సూర్యచంద్రుల ఉదయాస్తమయ కాలములందు వారికి సరికేషమేర్పడినచో రాజునకు మరణమేర్పడును. పగటి కాలమంతయు, సూర్యునకుగాని, రాత్రికాలమంతయు చంద్రునికిగాని పరివేషమేర్పడినచో కూడ రాజు మృతిపొందును. ఆకాశముననిర్వురు సూర్యులు కనబడినచో క్షత్రియులకు, ఇద్దరు చంద్రులు కనబడినచో బ్రాహ్మణులకు శుభము కలుగును. ఉదయాస్తమయ కాలములందలి చంద్రసూర్యులు ఎర్రని మండలములుకల్గు ఆసమయమున ఆకాశమున మేఘములు కనబడనిచో లోకమునకు నాశముకలుగును. ఇది మహాభయలక్షణము. చంద్రుడు ఎవ్వని జన్మనక్షత్రమును వదలి దానికి రెండవనక్షత్రముననుండి శ్యాప వర్ణము కలిగి, రూక్షుడై అపసవ్యముగ కనపడునో అట్టివానికి నుపద్రవము కల్గును. ఏనక్షత్రమున రాహువు బొత్తుగా కనబడకపోవుట, అధికముగ కనబడుట జరిగినచో వ్యాధి దుర్భిక్ష తస్కరాదిపీడయు ప్రజలకు కలుగును. ఏనక్షత్రమున రాహువువలన చంద్రసూర్యగ్రహణములేర్పడునో అనక్షత్రజాతులకు పీడకలుగును. శాంతిచేసి కొనిన యెడల నివృత్తములగును. ఏదేని గ్రహమున్న నక్షత్రములో గ్రహణము సంభవించిన యెడల రాజులకును సైనికులకును పీడకలుగును. గ్రహణము పట్టియుండిన చంద్రుడుకాని సూర్యుడుకాని ఆకాశమునుండి క్రిందికి జారిపడినటుల కనపడినను, ఉల్కలు కనపడినను అట్లుకనపడిన దేశపురాజును పర రాజులుచంపి రాజ్యమేలుదురు. అట్లేగ్రాహణకాలమున చంద్రసూర్యులకు పరివేషముకలిగినచో అట్లుకనపడిన దేశమున నంతట పీడలును ఆయుధోపద్రవములను కలుగును. రాహువును మేఘములు కప్పివేయుటగాని అకాల మేఘములు అతిగా వర్షము కురియుటగాని జరిగినచో నాదేశపు రాజునకు భయము సంభవించును. సూర్యుడు ఏ నక్షత్రముననుండగా సూర్యునియందు ఛిద్రమునకనపడునో అనక్షత్రజాతుడగురాజు శీఘ్రముగా మరణించును.

ఈ భానుభిద్రమును గుర్తించువిధము : సూర్యుడుశిశిరఋతువున తామ్రవర్ణము వసంతమున కుంకుమవర్ణము గ్రీష్మమున రూక్షవర్ణము వర్షర్తువున ఘృతవర్ణము, శరత్తున హరిద్రావర్ణము హేమంతమున మంకెనపూవు వర్ణముకలిగియుండుటప్రశస్తము. దీనికిభిన్నముగ కనబడుట భానుఛిద్రము. అట్టిసమయమున సూర్యడు స్వచ్ఛవర్ణము లేకుండుట పరుషవర్ణము కలిగి కనిపించుచున్న ట్లుండుట సూర్య బింబము ఖండితమైనట్లుండుట, ధూళితో కప్పివేయబడుట ఉల్కలు మున్నగు జ్యోతిస్సులతో నుపహతమగుట తన మండల స్థానమును తప్పి ఆ స్థానమున నుండుట మున్న గునవికూడ మరికొన్ని భానుఛిద్రలక్షణములు. సూర్యడు తన ఉదయాస్తమయ కాలములందు ఆయుధాకృతిగల మేఘములతో కప్పివేయబడుట రాజులకు క్షేమకరముగాదు. శుక్లకృష్ణములలో నేపక్షవు అది సమయము నందైనను చంద్రుడు ధనూరాశియందుండుట యుద్ధోపద్రవమును కలిగించును.

లాభ స్తేషాం జయస్తేషాం యత్ర దృష్టం భయం తతః |

సమకోటి విశాలశ్చ కించిద్వా ప్యుత్తరో న్నతః || 43

మాసాదౌ చంద్రమా శ్శస్తో వామ ఏవ విపర్యయః |

మండలే నాంతరీకుర్వన్‌ శృంగే సా యది వా స్పృశేత్‌ || 44

తారాగ్రహం తదా కుర్యా ద్భయం జనపదే శశీ | శుక్లపక్షస్య వా పృద్ధిర్లోకే క్షేమ సుభిక్షదా || 45

సా సితేతర వక్షస్య పృదివ్యాం సైవ శశ్యతే | శ్రవణభ్యుదితే భౌమః పుష్యే పక్రమియా ద్యది || 46

ప్రాజా పత్యుదిత శ్చంద్రో నాశాయ స్యా న్మహీక్షితామ్‌ |

గతాగతం యదా కుర్యా న్మఘా మధ్యేన లోహితః ||

తదా భవత్య నావృష్టిః పాండ్యోరాజా వినశ్యతి | ఫల్గునోరుదయం క్భత్వా వక్రస్వ్యా ద్వైశ్వ దైవకే || 43

ప్రజాపత్యే ప్రవాసశ్చ త్రైలోక్యం తత్ర పీడ్యతే | ధ్రువేషు వైష్ణవే మూలే శాక్రేచ విచరన్‌ కుజః || 49

ఘోరాం కరో త్యనావృష్టిం కృత్తికాసు మఘాసుచ | కార్తికేశ్వయుజే పౌషే చాషాఢే శ్రావణ బుధః || 50

దృష్టో లోకే భయాయ స్యా న్మాఘ వైశాఖయో స్తధా | ఆకస్మాద్యత్ర దృశ్యేత దివా దేవ పురోహితః || 51

రాజా వా మ్రియతే తత్ర స వా దేశో వినశ్యతి | థాహ స్సర్వం యదా శుక్రో దృశ్యతేథ మహాగ్రహః 52

తదా త్వ గ్న్యాధిభి ర్గ్రామాన్‌ బాధతే నగరాణి చ | కార్తికేతు యదా మాసి కుర్వాతేస్తమయో ద¸° || 53

తదహ్నాం నవతిం పూర్ణం భువి దేవో న వర్షతి | శ##నైశ్చరో దేశ పీడాం దేశ నక్షత్ర పీడనే ||

ధ్రువం కరోతి రాజేంద్ర ! నిత్యం చార వశేన తు |

సప్తాహా న్తర్గతా యే వై దివ్యపార్థివ నాభసాః ||

గ్రహోపరాగే తీవ్రాస్స్యు రుత్పాతా స్స్వఫలేషు తే || 55

ఏకస్మిన్‌ యది మాసే స్యా ద్గ్రహణం చంద్ర సూర్యయోః |

బ్రహ్మక్షత్ర విరోదాయ విపరీత వివృద్ధయే ||

యస్మిన్‌ దలశ్యేత నక్షత్రే విశాఖాయాం ప్రధూవవత్‌ |

తద్దేశ జాతా పీడా స్యాత్‌ బుధ కేతు మహాగ్రహాః || 57

ఉల్కాద్యభి హతే సూర్యే కేతుభి ర్వా విధూమితే | అగన్త్యేవా ధ్రువే వాపి ప్రజా పీడాం వినిర్దిశేత్‌ || 58

ఉల్కయాభిహతా రూక్షా స్ఫురణా రజసా యుతాః | ఋషయ స్తప్తలోకానాంవినాశాయచ భూభృతామ్‌ || 59

కృత్తికాభి స్సహోదేతి శాంకరీం దిశ మాశ్రితః |

కుమారీ ప్రీతితో హన్యాల్లోకే నృప కుమారకాన్‌ || 60

సమాగమే గ్రహాణాం తు చంద్రమా శ్శప్యతే హ్యుదక్‌ |

నక్షత్రా ణాం చ రాజేంద్ర ! దక్షిణన న శస్యతే || 61

రాహుః కేతుః కుజః శుక్రః చంద్రేణ సహ యాయిసః |

బుధో జీవశ్చ సారశ్చ నాగరా రవిణా సహ || 62

యాయినా విజితే పౌరే రాజ్ఞాం స్యా ద్యాయినాం జయః |

యాయిగ్రహే పౌరజితే పురా రాజ్ఞాం జయో మృధే || 63

పౌరేణ విజితే పౌరే పౌరైః పౌరక్షయం పదేత్‌ |

యాయినా యాయిని హతే యాయిభ్యో యాయినాం క్షయః || 64

గ్రహాణాం చే ద్భవే త్సామ్యం సామ్యం రాజ్ఞాం వినిర్దిశేత్‌ |

జయా జ¸° నరేంద్రాణాం నిర్ధేశ్యౌ గ్రహ విద్భుధైః || 65

గ్రహారూఢ చ్యుత స్థానాత్‌ స్ఫురేణ విజితో గ్రహః |

విజితో జయ లింగై శ్చ కృష్ణః శ్యామద్యుతీ స్తధా || 66

ఉదజ్‌ మార్గగతి స్స్నిగ్ధో విమలో విమల ప్రభః |

బృహద్రూపోశుక్ర శ్చ విజయీ కధితో గ్రహః || 67

నదేయమేతచ్చపలస్య లోకే న నాస్తికస్యా ధమ పూరుషస్య |

గుహ్యం మునీనా మపి పార్ధివేంద్ర! మయేరితం కాల వినిశ్చయంతే || 68

ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ప్రధమఖండే మార్కండేయ వజ్రసంవాదే గ్రహ శుభాశుభ పరిజ్ఞాన వర్ణనం నామ పంచాశీతి తయోధ్యాయః.

చంద్రశృంగోన్నతి ఫలములు: పక్షాదియందు చంద్రుడు ధనురాకారమన (సమశృంగములతో) కనబడినయెడల అట్లు కనబడిన దేశమున యుద్దమును సూచించును. అట్లుయుద్ధభయము కనబడినను ఆప్రదేశగతజనులకు పర్యవసానమున లాభము జయము చేకూరును. అనగా మాసాదియందు చంద్రునకు శృంగములు కలికొని, కొంచెము ఉత్తరశృంగోన్నతిలోగాని విశాల రేఖతోగాని కనపడినచో శుభము ఇందుకు భిన్నముగ కనబడినచో అశుభము కలుగును. ఈ చంద్రుడు తన మండలరేఖలోపలికి రెండు శృంగములను నిమిడ్చుకొని గాని, లేదా వానిని తాకిగాని కనబడినచో నీస్థితిని తారాగ్రహమందురు. ఇట్లుకనబడిన దేశమున భయము కనబడును. శుక్లపక్షములో కలుగునిట్టి చంద్రవృద్ధి వలన లోకమున క్షేమమును సుబిక్షమును కలుగును.

కృష్ణ పక్షమున కలుగు పైన చెప్పిన శృంగోన్నతి భేదము అశుభఫల ప్రదమగును. శ్రవణ నక్షత్రమున కుజుడు (తన అస్తమయ స్థితి నుండి) ఉదయించుట గాని పుష్యమీ నక్షత్రమున వక్రించుట గాని సంభవించినచో ఆదేశ రాజులకు నాశము కలుగును. అంగారకుడు (కుజుడు) మఘ నక్షత్రమున నుండగా వక్రించిన యెడల అనావృష్టియు, పాండ్యదేశ రాజునకు యనాశమును కలుగును. ఆతడే పుబ్బ, ఉత్తర నక్షత్రములలో నుదయించుట ఉత్తరాషాఢ యందు వక్రించుట రోభిణీ నక్షత్రమున నస్తమించుట జరిగినచో త్రిలోకములకు పీడ సంభవించును. అతడే శ్రవణము, మూల జ్యేష్ఠ, కృత్తిక, ధ్రువ (ధనిష్ట?) నక్షత్రము లందు సంచరించు నపుడు ఘోరమగు అనావృష్టిని కలిగించును. కార్తిక, పుష్య, ఆషాడ, మాసములందు బుధుడు దర్శనమిచ్చినచో అట్లు కనపడిన దేశవాసులకు తీవ్ర భయము సంభవించును. మాఘ వైశాఖ మాసములలో ఆకస్మాత్తుగ పగలు బృహస్పతి కనపడినచో ఆదేశరాజునకు మరణముగాని ఆ దేశ ప్రజలకు నాశముగాని సంభవించును. శుక్రుడు పగలంతయు కనపడినచో ఆ దేశమందలి నగరములకును గ్రామములకును అగ్ని భయమేర్పడును. శని కార్తిక మాసము నందు అస్తమయమును గాని ఉదయమును గాని పొందిన యెడల అనాడు మొదలు తొంబది దినముల వరకు వర్షము కురియనే కురియదు. చారవశమున శని యెప్పుడు ఏదేశపు నక్షత్రమున సంచరించునో ఆదేశమునకు పీడ కల్గును. (ఈ దేశమునకీ నక్షత్ర మను సంగతి జ్యోతిశాస్త్రము వలన తెలిసి కొన నగును.) గ్రహములకు ఉపరాగము (గ్రహణము) కలిగిన తరువాత ఏడు దినముల లోపున దివ్య, పార్థివ, నాభసములను తీవ్రములగు నుత్పాతములు సంభవించినను, ఒకే మాసమున సూర్య చంద్రులకు నుపరాగము సంభవించిన యెడల బ్రాహ్మణులకు క్షత్రియులకు అశుభము తదితర వర్ణములకు శుభమును సంభవించును. బుంధుడుగాని, కేతువుగాను, మహాగ్రహము (రాహువు) గాని విశాఖా నక్షత్రమునందు సంచరించుచు పొగబారినట్లు కనపడిన యెడల ఆ నక్షత్రపు దేశముల వారికి పీడ కల్గును. సూర్యుడు ఉల్కలచేగాని ధూమకేతువులచే గాని అభిహతుడగుట ఆగస్త్యుడు గాని ధ్రువుడు గాని పొగబారినట్లు అగపడుట సంభవించిన యెడల ప్రజలకు పీడ కలుగును. సప్తర్షులు ఉల్కలచే నభిహతులై గాని ధ్రుపుడు రూక్షపర్ణ యుతులై గాని ధూళితో గప్ప బడిన ప్రకాశము కలవారుగ గాని కనపడినచో జనులకును రాజులకును నాశము కల్గును. చంద్రుడు కృత్తికా నక్షత్రముతో గూడి ఈశాన్య దిక్కునుండి యుదయించిన యెడల నట్లు కనపడిన రాజకుమారులకు హానియు, రాజకుమార్తెలకు శుభమును కలుగును. చంద్రుడు ఉదక (ఉత్తర దిగ్గత) నక్షత్రములో నుండగా నతనికి నితర గ్రహ సమాగమము జరిగిన యెడల జనులకు శుభము: దక్షిణ నక్షత్ర సమాగమము కలిగిన యెడలి అశుభము కలుగును.

గ్రహ యుద్ధము--- ఈ విషయమున రాహువు కేతువు కుజుడు శుక్రుడు చంద్రుడు ఈ అయిదుగురు యీయి (ముట్టడిచేయు) గ్రహములన బడుదురు. బుధుడు బృహస్పతి శని రవి ఈ నలుగురును నాగరులు. వీరు తమ నగరమున నుండి ముట్టడింపబడువారు. యాయి గ్రహముచేత నాగరగ్రహము ఓడింప బడినచో అట్టి కాలమున యుద్ధ యాత్రచేయు ప్రభువులకు జయము కలుగును. అట్లుకాక నాగరగ్రహముచే యాయీగ్రహము జయింప బడినచో నట్టి నాగరగ్రహ సంబంధులగు రాజులు యాయి గ్రహ సంబంధి రాజుల నోడింతురు. లేదా నాగరుల చేతులలో రాజులు నాశన మందుదురు. అట్లే నాగర గ్రహము చేతిలో నాగరగ్రహము ఓడినచో ఆ దేశమందలి పౌరులు (నాగరులు) నాగరుల చేతిలోనే నాశమొందుదురు. యాయి గ్రహము చేతిలో యాయిగ్రహమోడినచో రాజుల చేతిలో రాజులకే నాశము కలుగును. ఈ విధముగ గ్రహములకు రాజులకు సామ్యము నిర్ణయించుకొని గ్రహ యుద్ధ విషయమున రాజులకు కలుగు శుభా శుభముల నిర్ణయించ వలయును. కాంతి హీనుడగుట కంపించుట పొగబారుట మొదలైనవి కలిగిన గ్రహము ఓడినట్లును నిర్ణయింపనగును. ఉత్తర మార్గమున సంచరించుట నున్ననై స్వచ్ఛమై నిర్మల కాంతి గలదై పెద్దరూపము గలదై మిగుల ప్రకాశవంతమై కనపడు గ్రహము గ్రహయుద్ధమున జయించునట్లు తెలియ వలెను. ఓ రాజేంద్రా! నేను నీకు తెల్పిన యీ కాల వినిశ్చయము మునులకు గూడ గుహ్యమైనది. దీనిని చూపలునకు నాస్తికునకు నీచ స్వభావము గల వానికి తెలుపరాదు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రధమఖండమున గ్రహశుభాశుభ పరిజ్ఞానవర్ణనమను నెనుబదియైదవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters