Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందల అరువది ఏడవ అద్యాయము - రణభూమివర్ణనము

మార్కండేయః : ఆదిత్యే స్త మనుప్రాప్తే సంధ్యాకాలే సుదారుణ | నివర్తయామాస రథం యుధాజిద్భరతస్య చ || 1

నివర్తయానశ్చ రథం భరతం వాక్య మబ్రవీత్‌ | సంగ్రామ వేదినీం పశ్య: స్వకృతాం రఘునందన!|| 2

గంధర్వాంగ సమాకీర్ణాం హతకుంజర భూషనామ్‌ | తురంగమ గణా కీర్ణాం వరాయుధ ధరాం ధరామ్‌ || 3

సంపూర్ణ చంద్ర ప్రతిమై ర్దష్టోష్ఠైః చారుకుండలైః | భ్రుకుటీ తట దుష్ప్రేక్ష్యైర్మస్తకైర్భాతి మేదినీ || 4

పంచ శీర్షోరగా కారైః వరాంగద విభూషణౖః బాహుభి ర్భాతి శూరాణాం వసుధా వసుధాధిపః 5

పద్మపత్ర దళాకారైః గంధర్వాణాం తథా వరైః | భాతి సాయక విచ్ఛిన్నైః స పద్మేవ వసుంధరా || 6

హస్తి హస్త సమాకారైః గంధర్వాణాం తథా కరైః విభాతి వసుధాకీర్ణా వర చందన భూషితైః || 7

త్వ దేవ శర నిర్భిన్నై ః గండశైలోపమై ర్గజైః ఉద్భాస్త జీవితై ః పశ్య ! వినికీర్ణం ధరాతలమ్‌ || 8

ఆవిష్కృత రదైశ్చాశ్వై ర్వివృతాక్షై స్తథైవచ | పతితై రావృతాం పశ్య: తురంగై ర్మేదినీం రణ || 9

ఆతపత్రై శ్శశాంకాభై శ్చామరై శ్చ విరాజితామ్‌ | యోక్రైః ఖలీనైః పల్యానైః కుథాభిః కంబుభిస్తదా || 10

కేశైర్దండై స్తథా చాపైః ప్రాసైః ఖడ్గైః పరశ్వథైః శ##రై ర్నానా ప్రకారైశ్చ నానా నామాంకితైః శుభైః || 11

ముకుటై రంగదైర్హారైః కుండలై రపిశోభితా | రఘునాధ భువం పశ్య: కారుణ్యపి మనోహరామ్‌ || 12

గంధర్వాన్‌ భక్ష్యమాణాంశ్చ క్రవ్యాద్భిర్మృగ పక్షిభిః | పశ్య! త్వం చారుసర్వాంగం సర్వాభరణ భూషితమ్‌ || 13

ఆకృష్యమాణం నిమ్నేఘ క్రవ్యాద్భిః కుణవద్రణ | గాత్రైశ్చలద్భి ర్ధృశ్యన్తే జీవంతైర్థివ పార్థివ! 14

మార్కండేయుడనియె. అదిత్యుడస్తమింప సుదారుణమై సంధ్యవేళకాగా యుధాజిత్తు భరతుని రథమును మరలించెను. మరలించుచు భరతుంగని మేనమామ యిట్లనియె. రఘునందన నీవు సేసిన యీ యుద్ధభూమింగనుము. ఎట జూచిన గంధర్వుల శరీరములే కూలిన యేనుగులే గుఱ్ఱములే చెల్లచెదరైన యాయుధములు పెదవులు గఱచుకొని కుండలములతో కనుబొమలట్లేముడివడియున్న తలలతో పాములట్లున్న రంగదములతోడి బాహువులతో నీరణభూమి విలసి%్‌లుచున్నది . తామరరేకులట్టి వీరిహస్తములతో పద్మాలంకృతమైనట్లున్నది యీ వసుంధర. నీ యొక్కని బాణములనేయిన్ని యేనుగులుకూలి పెనుగొండలట్లిక్కడ పడియున్నవి. పళ్లువెలివెట్టి కనుగ్రుడ్లు తిరుగుడుపడి కూలిన గుఱ్ఱములు చంద్రునట్టి గొడుగులు చామరములు తెగి పడియున్నవి. కళ్లెములు ఖలీనములు పల్యాణములు కుథలు శంఖములు జూలు తెగిన గుఱ్ఱములతో - దండములు విండ్లు ప్రాసములు కత్తులు కటార్లుమున్నగు నాయుధములతో నీభూమి చిమ్ముకొని యున్నది. ఈరణరంగము సర్వాంగ సుందరము సర్వాభరణ భూషితమునై యున్నది చూడుము.

సన్నిధానంతు యోదానం వివృతం కరపంకజమ్‌ | ధనుర్గ్రాహా జ్ఞాత కిణం భక్షితేన పతత్త్రిభిః || 15

అర్ధసంభక్షితై ర్వక్త్రైస్తథా సంపూర్ణ భక్షితైః దుర్వృత్తాన్‌ పశ్య గంధర్వాన్‌శాపాదివ! మహీక్షితామ్‌ || 16

అనాగసాం నరేంద్రాణాం గంధర్వైర్యత్పరా కృతమ్‌ | భూయస్తదేవ సమరే గంధర్వాణాం త్వయా కృతమ్‌ || రణాజిరే పిశాచానాం గంధర్వాన్‌ పశ్య! రాఘవ! 17

యక్షాణాం రాక్షసానాంచ శతశోథ సహస్రశః | గంధర్వ మాంస లుబ్థానాం సతతం క్షతజాశినామ్‌ || 18

సముద్రదారా స్సంప్రాప్తాః క్రవ్యాదాఃక్షుధితా భృశం | త్వయైతేషాం పరా తృప్తిః వృతాద్య రణమూర్దని || 19

నానా విధాని రూపాణి పశ్య ! క్రవ్య భూజాం రణ | కేచిత్‌ స్థూలాః కృశాః కేచిత్‌ ప్రాంశవో లఘవోపరే || 20

లంబ భ్రూజఠరాః కేచిత్‌ తథా చిపిటనాసికాః వృత్తాక్షః కేకరాక్షాశ్చ దంతురాః సువిభీషణాః || 21

తథా చైవోర్ధ్వరోమాణో మహాదంష్ట్రా మహాముఖాః | పురస్తాత్‌ పార్శ్వయో ర్ఘోరాః పశ్చా దంగదయోః పరే || 22

నానా విధానాం సత్వానం సదృశైశ్చ తథా ననైః | నానావేషధరా రౌద్రా నానా వికృత దర్శనాః || 23

సింహ చర్మాం బర ధరాః వ్యాఘ్ర చర్మాం బరా స్తథా | ఆహూయన్తే దశ న్త్యన్యే హరన్త్యన్యే సృగుత్తమమ్‌ || 24

అన్యే స్కంధం సమారోప్య మాంసం రక్తం తదాగమన్‌ | రక్తా పగాసు క్రీడన్తి త్వత్కృతాసు యథా సుఖమ్‌ || 25

స్నపయన్తి రుధిరై శ్చాన్యే పాయయన్తి పరే సృజమ్‌ | రక్తం కృత్వా కపోలేషు కృత్వోత్సంగే పునః పునః || 26

భార్యాభిశ్చ సహై వాన్యే పిబన్తి రుధిరం రణ| పాయ యన్తి తథైవాన్యే రామా రామానుజా స్వయమ్‌ || 27

భార్యా కరధృతే ష్వన్యే కపాలేషుపి బన్త్య సృక్‌ | కౌంజరేషు కపాలేషు పిజన్త్యన్యే సృగుల్బణాః || 28

శిశూన్‌ స్కంధగతాన్‌ కృత్వా తృప్తా నృత్యన్తి చాపరే | హస్త మాదాయ పత్నీనాం నృత్యన్త్యన్యే తథైవచ || 29

నృత్యన్త్యన్యే హసన్త్యన్యే వికృత్తైశ్చ తథా కరైః గాయన్త్యన్యే స్వపన్త్యన్యే కలహాయన్తి చాపరే || 30

కుణ పాంశ్చ తథైవా న్యే త్యజన్త్యన్యే మహీతలే | అన్యాం శ్చా దాతు మిచ్ఛన్తి గృహ్ణన్తి చ తథా పరాన్‌ || 31

కుర్వన్తి కలహాం శ్చాన్యే కుణపార్థాయ కుత్సితాః | ఉత్కృత్య మాంసా న్యశ్నన్తి కేచిద్గా త్రైర్విభూషితాః || 32

భుక్త్వా చాస్థీని మజ్జాశ్చకేచి దశ్నన్తి రాఘవ | భరతస్య ప్రసాదేన తృప్తాఃస్మ ఇతి చాపరే || 33

పరస్పరం చ భాషన్తే పరం హర్షము పాగతాః | నిత్యం భవతు రాజ్ఞాంచ యుద్ధం వైరం నృశంసతా || 34

బలం సహాయాః పుష్టిశ్చ యేన తృప్యామహే వయం | ఏవ మేతే వాదన్తశ్చ ప్వరై శ్చ వివిధైర్జగుః || 35

రథం తథాన్యే వీక్షన్తే సస్నేహా భృశ దుర్‌దృశాః | ఏవం స భరతః శ్రీమాన్‌ మాతులేన ప్రదర్శితమ్‌ || 36

పశ్యన్‌ రణాజిరం ప్రాయా ద్యేన రాజగృహం పునః | సోపశ్యన్నగదా భ్యాశే వాయవ్యాస్త్ర విహిమోతమ్‌ || 37

మాంసముదిను రాబందులు మొదలైనవి పీకికొని పల్లములకు లాగికొని పోగదలుచున్న నీ శరీరములతో నీనేల నీజనము బ్రతికియున్నారా? యనిపించుచున్నది బాణములు పెక్కు పేర్లు చెక్కడినవి యెటజూచినం దెగిపడియున్నవి. నరుకువడిన యోధుల చేతులంభీకికొని తినుచున్నవి చూడు మీపులుగులను. నీరపరాధుల నెందరనో రాజుల మట్టువెట్టిన యీ గంధర్వులు తొల్లి సేసిన పాపము యొక్క ఫలానుభవమునకు నీవు కారణమైనాడవు. మాంసలుబ్ధులై యక్ష రాక్షస పిశాచములు పీకికొని సగము కొన్ని నిండగొన్ని తిన్న యీ కుణపములతో నీరణభూమి యెంతవికారముగనున్నదో గనుగొనుము, ఈ కూలిన మానవులు కొందరు స్థూలురు. కొందరు బక్కచిక్కినారు ఉన్నతులు పొట్టివాండ్రు కనుబొమలు కడుపులు వ్రేలాడవేసినారు. ఇరువైపుల తెగి బాజుబందులు భుజకీర్తులు పడియున్నవి. నానాజంతువులంబోలియున్నవి మొగములు. వేషములు పెక్కులు వికారదర్శనులు సింహము పులి తోళ్లుగట్టుకొన్నారు. రౌద్రులు భూతప్రేతపిశాచము లొండొరులం బిల్చికొనుచున్నవి. కొరకుచున్నవి నవ్వుచున్నవి మంచి వెచ్చని రక్తమును ద్రాగుచున్నవి త్రాగించుచున్నవి స్త్రీ పిశాచములు యక్షరాక్షస్వవర్గము పుర్రెలలో రక్తమునింపి పురుష పిశాచములచే త్రాగించుచున్నవి. ఏనుగుకపాలములనిండ నింపి రక్తముందెగ త్రాగుచున్నవి. శిశువులం భుజముపై నెక్కించుకొని నత్యము సేయుచున్నవి. భార్యలచేయి చేతంబట్టుకొని నర్తనము సేయుచున్నవి. వికారముగ నవ్వుచున్నవి కుణపములకై కుమ్ములాడుచున్నవి. పీకిపీకినంజుడు ఆ స్థిమజ్జారసధాతువులందెగదిని యిది భరతస్వామి ప్రసాదమని తృప్తికొని గంతులు వేయుచున్నవి. ఒండొరులకుం జెప్పుచున్నవి. నిత్యమును రాజులకు యుద్ధములగుగాక! మనకడుపులునిండుగాక యనుచున్నవి. వివిధములగు అరుపులు కూతలు పెట్టుచున్నవి. కూలిన రథములోనికి పైకినెగిరి చూచుచున్నవి.

సైన్యంతత్పార్థి వేంద్రాణాం వ్రజన్తం సమరా దిమమ్‌ | దృష్ట్వా తే భరతం సర్వే రణ రేణు సముక్షితమ్‌ || 38

సంగ్రామే జయినం వీర మభ్యనందన్త పార్థివాః | స సమేత్య మహాభాగైః పరిష్వజ్య చ పార్థివాన్‌ ||

సాంత్వయిత్వాచ దర్మాత్మా శిబిరాణి వ్యసర్జయత్‌ || 39

తత స్స తాం మాతుల రాజధానీం ప్రహృష్ట యోధార్యజనాభిరామామ్‌ | వివేశ రాత్రౌ రఘువంశనాధః సంస్తూయమానః స్తుతిభిర్నృసింహైః || 40

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే రణభూమి వర్ణనం నామ నప్త షష్ట్యుత్తర ద్విశతతమోధ్యాయః.

ఇట్లు మాతులుడు చూపిన రణరంగణముం గనుచు రాజగృహమునకు జనెను. ఆ నగర ప్రాంతమున వాయవ్యాస్త్రమున నెగిరిపడి మూర్చపడి తెలివివచ్చిన గంధర్వ సైనికులను రాజులను భరతుడు సూచెను. వారును రణధూళిగ్రమ్మిన భరతునిం జయమంది మరలిన వీరునిగని అభినందంచిరి. వారితో నతండును గూడికొని వారింగౌగలించుకొని యాధర్మ ప్రభువువారి ననునయించి వారివారి శిబిరములకంపెను. అవ్వల నత్యానంద భరితులైన యోధులతో ఆర్యులతో (పూజ్యులు పెద్దలునైన వారితో) నతిరమ్యమయిన మేనమామాగారి రాజధాని నారాత్రి మహానుభావులచే గొనియాడబడుచు రఘువంశనాథు డతడు ప్రవేశించెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమున ప్రథమఖండమున రణభూమివర్ణనమను రెండువందల యదువది యేడవ యధ్యాయము

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters