Sri Matsya Mahapuranam-1    Chapters   

ఏకనవతితమో7ధ్యాయః.

శర్కరాపర్వతదానమ్‌.

ఈశ్వరః : అథాత స్సమ్ర్పవక్ష్యామి శార్కరాచల ముత్తమమ్‌ l

యస్య ప్రదానా ద్విష్ణ్వర్కరుద్రా స్తుష్యన్తి సర్వదా. 1

అష్టభి శ్శర్కరాభారై రుత్తమ స్స్యా న్మహాచలః l చుతుర్భి ర్మధ్యమః ప్రోక్తో భారాభ్యా మధమ స్స్మృతః.

భారేణ చార్ధభారేణ కుర్యా ద్య స్స్వల్పవిత్తవాన్‌ l విష్కమ్భపర్వతా న్కుర్యా త్తురీయాం శేన మానవః. 3

ధాన్యపర్వతవత్సర్వ మాపాద్యామరసంయుతమ్‌ l మేరోరుపరి పతద్వచ్చ స్థాప్యం హేమతరుత్రయమ్‌. 4

మన్దారః పారిజాతశ్చ తృతీయః కల్పపాదపః l ఏవం వృక్షత్రయం మూర్ధ్ని సర్వేష్వపి నివేశ##యేత్‌ . 5

హరిచన్దనమన్దారౌ పూర్వ పశ్చిమభాగయోః l నివేశ్యొ సర్వశైలేషు విశేషాచ్ఛర్కరాచలే . 6

మన్దరే కామదేవస్తు ప్రత్యగ్వక్త్రస్సదా భ##వేత్‌ l గన్దమానమధ్యేతు ధనద స్స్యా దుదఙ్ముఖ. 7

ప్రాఙ్ముఖో హేమ మూర్తిస్తు హంసస్స్యా ద్విపులాచలే l హైమీ సుపార్శ్వే సురభి ర్దక్షిణాభిముఖీ భ##వేత్‌ . 8

ధాన్యపర్వతవత్సర్వ మావాహనముఖాదికమ్‌ l కృత్వా7థ గురవే దద్యా న్మధ్యమం పర్వతోత్తమమ్‌. 9

ఋత్విగ్భ్య శ్చతుర శ్శైలా నిమా న్మన్త్రా నుదీరయేత్‌ l

సౌభాగ్యామృతసారో7యం పరమ శ్శర్కరాచలః 10

తస్మాదానన్దకారీ త్వం భవ శైలేన్ద్ర సర్వదా l అమృతం పిబతాం యేతు నిపేతు ర్భువి శీకరాః. 11

దేవానాం తత్సముత్థో7యం పాహి న శ్శర్కరాచల l మనోభవధనుర్మధ్యా దుద్భూత శ్శర్కరాచలః 12

తొంబది యొకటవ అధ్యాయము.

శర్కరా పర్వత దానము-ధర్మమూర్త్యుపాఖ్యానము.

ఈశ్వరుడు నారదునకు ఇట్లు చెప్పెను: ఇకమీదట శర్కరా పర్వతదాన విషయము తెలిపెదను. అది ఉత్తమము. దాని దానమున విష్ణు రవి రుద్రులు శాశ్వత తృప్తి నందుదురు. దీనికై ఎనిమిదికాని నాలుగుకాని రెండుకాని బారువల చక్కెర కావలెను. శక్తిలేనివారు ఒక బారువతోనో అరబారువతోనైన చేయవచ్చును. మొత్తము చక్కెర తూకములో నాలుగవ వంతుతో విష్కంభ పర్వతముల చేయవలెను. ధాన్య పర్వతమునందువలెనే ఆయా పర్వతములను వానిపై దేవతలను నిలుపవలయును. అందునను మేరు పర్వతముపైని మిగిలిన వానిమీదను మందార పారిజాత-కల్ప వృక్షములనెడు మూడు (జాతుల కల్ప) వృక్షములను బంగారుతో చేయించి అమర్చవలెను. వాని శిరోభాగములందు హరి చందనము-మందారము (అను కల్ప వృక్షజాతు)లను ఆ పర్వతముల తూర్పు పడమరలందమర్చవలెను. ఇవి (లోగడ చెప్పిన) అన్ని పర్వతములందును విశేషించి శర్కరాచలమునందును చేయవలెను. విష్కంభ పర్వతము లందును-మందరమున పడమటి మొగముగా మన్మథుడుండవలెను. గంధమాదనమున కుభేరుడు ఉత్తరపు మొగమై ఉండవలెను. విపుల పర్వతమున హంస ప్రతిమ తూర్పుమొగమై ఉండవలెను. సుపార్శ్వమున కామధేనువు దక్షిణపు మొగమై ఉండవలెను. అవాహన హోమాదికమంతయు ధాన్య పర్వతమునందువలెనే. పైవలెనే నడిమి పర్వతమును ఆచార్యునకును విష్కంభ పర్వతములను ఋత్విక్కులకును ఈయవలెను. దానమంత్రము: శర్కరాచలము ఉత్తమమును సౌభాగ్యామృతసారమును;

ఇట్టి నీవు మాకు సదా ఆనందము కలుగజేయుము. దేవతలు అమృతము త్రావునపుడు నేలపై చిందిపడిన అమృత బిందువులే చక్కెర అయ్యెను. దానితో ఏర్పడిన శర్కరాచలమా! నన్ను రక్షించుము. మన్మథుని ధనువునడుమనుండి ఉత్పన్న మీ శర్కరాచలము. అట్టి నీవు శర్కరాచలమా! మమ్ము సంసార సాగరమునుండి రక్షించుము.

తన్మయో7సి మహాశైల పాహి సంసారసాగరాత్‌ l యో దద్యా చ్ఛర్కరాశైల మనేన విధినా నరః. 13

సర్వపాపవినిర్ముక్త స్స యాతిcశివమన్దిరమ్‌l చన్ద్రతారార్క సఙ్కాశ మధిరుహ్యానుజీవిభిః. 14

సహైవ యాన మాతిష్ఠే త్సతు విష్ణుప్రభోదివి l తతః కల్పశాతన్తేతు సప్తద్వీపాధిపో భ##వేత్‌ .15

ఆయురారోగ్యసమ్పన్నో యావజ్జన్మాయుతత్రయమ్‌ l భోజనం శక్తితో దద్యా త్సర్వశైలే ష్వమత్సరః. 16

సర్వత్రాక్షారలవణ మశ్నీయా త్తదనుజ్ఞయా l పర్వతోపస్కరా న్త్సర్వా న్ర్పాపయే ద్ర్బాహ్మణాలయమ్‌.

ధర్మమూర్త్యుపాఖ్యానమ్‌.

ఆసీత్పురా బృహత్కల్పే ధర్మమూర్తి ర్నరాధిపః l సుహృచ్ఛక్రస్య నిహతా యేన దైత్యాస్సహస్రశః. 18

సోమసూర్యాదయో యస్య తేజసా విగతప్రభాః l భవన్తి శతశో యేన శత్రవశ్చ పరాజితాః. 19

యదృచ్ఛారూపధారీచ మనుష్యే ష్వపరాజితః l తస్య భానుమతీ నామ భార్యా త్రైలోక్యసున్దరీ . 20

లక్ష్మీరివ స్వరూపేణ నిర్జితామరసున్దరీ l రాజ్ఞ స్తస్యాగ్రమహిషీ ప్రాణభ్యోపి గరీయసీ . 21

నారీదశసహస్రాణాం మధ్యే శ్రీరివ జాయతే l నృపకోటి సహస్రేణ కదాచి న్న ప్రముచ్యతే . 22

కదాచి దాస్థానగతః పప్రచ్ఛ స్వపురోధసమ్‌ l విస్మయేనాన్వితో రాజా వసిష్ఠ మృ

షిసత్తమమ్‌ .23

భగవ న్కర్మణా కేన మమ లక్ష్మీ రనుత్తమా l కస్మాచ్చ విపులం తేజో మచ్ఛరీరే పదోత్తమమ్‌. 24

ఈ విధానముతో శర్కరా శైలదానము చేసినవారు వెంటనే విష్ణుని కాంతివంటి కాంతి కలవారై తనఅనుజీవులతో కూడ చంద్రతారా సూర్యులవలె ప్రకాశించు విమానము నెక్కి సర్వపాప వినిర్ముక్తులై శివ భవనమున కేగుదురు. ఇట్లు

______________________________________________

Oహరి

నూరు కల్పములచట సుఖించి మరల కల్పాది సృష్టియందు వరుసగా ముప్పదివేల జన్మముల వరకు ఆయురారోగ్యసంపన్నుడగు సప్త ద్వీపాపధిపతిగా జన్మించుచుండును.

అన్ని పర్వత దానములందును ఇతరులతో పోటీపడక తన శక్తి కొలది భోజన దానము చేయవలెను. అన్ని వ్రతములయందును ఆ పెద్దల యనుమతితో ఉప్పు కారము (పులుపు) లేని ఆహారము తినవలెను.

పిమ్మట పర్వతోపస్కరములగు సామగ్రులన్నియు ఆయా బ్రాహ్మణుల యిండ్లకు పంపవలయను.

దర్మమూర్త్యుపాఖ్యానము.

పూర్వము బృహత్కల్పమునందు ధర్మముర్తి యను రాజుండెడివాడు. అతడు ఇంద్రునకు మిత్రుడు; వేల కొలదిగా రాక్షసుల జంపినవాడు; సోమ సూర్యాది జ్యోతిస్సుకంటెను తేజశ్శాలి. వందలకొలది శత్రువుల నోడించిన వాడు; ఎవరిచేతను ఓటమి నెరుగనివాడు; కామరూపము ధరించగలవాడు. అతని పట్టపురాణి భానుమతియనునామె త్త్రైలోక్య సుందరి; అమర సుందరులను కూడ అందమున జయించినదియును లక్ష్మీ దేవివలె రూపము కలదియును; ఆమె ఆ రాజునకు ప్రాణముల కంటెను మిన్నగా ప్రీతిపాత్రురాలు కూడను; రాజునకు గల పదివేల మంది స్త్రీజనములో ఆమె సాక్షాత్‌ లక్ష్మివలె శోభించుచుండెడిది. వారిని వాది అధీనస్థులగు వేల కోటుల రాజులును ఎప్పుడును విడిచియుండెడి వారుకారు.

ఒకనాడా రాజు తన సభలోనున్న తన పురోహితుడగు వసిష్ఠుని జూచి మిగుల ఆశ్చర్యముతో నిట్లు ప్రశ్నించెను: ''భగవన్‌!ఏ (సత్‌) కర్మకు ఫలముగా నాకు ఇంత ఉత్తమమగు లక్ష్మియు నాశరీరమున సదా ఇంత ఉత్తమమగు విపుల తేజమును సిద్ధంచినది?''

వసిష్ఠః: పురా లీలావతీనామ వేశ్యా శివపరాయణా l తయా దత్త శ్చతుర్దశ్యాం గురవే లవణాచలః . 25

హేమవృక్షామరైస్సార్ధం యథావ ద్విధిపూర్వకమ్‌ l శూద్ర స్సువర్ణకారశ్చ నామ్నా సాణ్డో7భవ త్తదా.

భృత్యో లీలావతీగేహే తేన హైమా వినిర్మితాః l తరవో7 మరముఖ్యాశ్చ శ్రద్ధదాయుక్తేన పార్థివ. 27

అతిరూపేణ సమ్పన్నా ఘటయిత్వా వినా భృతిమ్‌ l ధర్మకార్య మితి జ్ఞాత్వా నగృహ్ణాతి కథంచన. 28

+ఉల్లాసితాశ్చ తత్పత్న్యా సౌవర్ణామరపాదపాః l లీలవతీ గిరేః పార్శ్వే పరిచర్యాచ పార్థవ. 29

కృతా తాభ్యా మశాఠ్యేన ద్విజశుశ్రూషణాదినా l సాచ లీలావతీ వేశ్యా కాలేన మహతా తథా. 30

సర్వపాపవినిర్ముక్తా జగామ శివమన్దిరమ్‌l యో7సౌ సువర్ణకారోపి దరిద్రో7ప్యతిసత్యవా&.31

న మూల్య మాదా ద్వేశ్యాత స్స భవానిహ సామ్ర్పతమ్‌ l సప్తద్వీపతి ర్జాత స్సూర్యాయుతసమప్రభః.

భార్యా సువర్ణకారస్య తరవో హేమనిర్మితాఃl సమ్మగుల్లాసితా భక్త్యా సేయం భానుమతీ తవ . 33

ఉల్లాసనా దుత్కటరూప మస్యా స్సఞౌత మస్మి న్ర్పమదాధిపత్యమ్‌ l

యస్యాత్కృతం తత్పరిచారకర్మ అనుద్ధతాభ్యం లవణాచలస్య. 34

తస్మాచ్చ లోకేష్వపరాజితత్వ మారోగ్యసౌభాగ్యయుతాచ లక్ష్మీః l

తస్మాత్త్వమప్యత్ర విధానపూర్వం ధాన్యాచలాదీ న్దశధా కురుష్వ. 35

తథేతి సమ్పూజ్య స ధర్మమూర్తిః పాదౌ వసిష్ఠస్య దదౌచ సర్వా& l

ధాన్యాచలాదీ న్విధివత్పురారే ర్లోకంగతో7 సౌ సురపూజ్యమానః. 36

పశ్యేత్తు భక్త్యా యది దీయమానం స్పృశేదథో యః పురుషో దరిద్రః l

శృణోతి భక్త్యాథ మతిం దదాతి వికల్మష స్సోపి దివం ప్రయాతి. 37

______________________________________________

+ఉజ్జ్వాలితాశ్చ

దుఃఖస్య ప్రశమముపైతి *పూజ్యమానై శ్శైలేన్ద్రై ర్బవభయభేదనై ర్మనుష్యః l

యః కుర్యాదితి ముని పుఙ్గవేహ భక్త్యా శాన్తాత్మా సకలగీరీన్ద్ర సమ్ప్రదానమ్‌. 38

ఇతి శ్రీమత్స్యమహాపురాణ ఈశ్వరనారదసంవాదే శర్కరాచల దానమాహాత్మ్య కథనం నామైకనవతితమో7 ధ్యాయః.

వసిష్ఠుడు రాజునకిట్లు సమాధానము ఇచ్చెను: పూర్వము శివుడే తనకు పరమాశ్రయముగా భావించు లీలావతియను వేశ్య యుండెను ఆమె( ఒక) చతుర్దశినాడు తన ఆచార్యునకు లవణ పర్వతమును యథావత్‌ గా విధానానుసారము సువర్ణ వృక్షదేవతా ప్రతిమలతో కూడ దానమిచ్చెను. ఆ లీలావతియింట భృత్యుడుగా ఆశ్రితుడుగా 'సాండుడు' అను పేరుగల శూద్రుడు సువర్ణకారుడుండెను. అతడు (ఈవ్రతమునకై) శ్రద్ధాయుక్తుడై బంగారు చెట్లను దేవతా ప్రతిమలను చేసి ఇచ్చెను. ఇది దేవ కార్యము గదాయను మంచి తలంపుతో వాటిని మిగుల రూప సంపన్నములుగా నిర్మించియు వేతనము ఏమియు తీసికొనలేదు. ఆతని భార్యయును ఆ వృక్ష ప్రతిమలకును దేవతా ప్రతిమలకును మెరుగు పెట్టెను. ఇంతేకాక ఆ శూద్ర దంపతులిద్దరును లీలావతి దానము చేయ సిద్ధపరచిన లవణ పర్వత సమీపమున బ్రహ్మణ సేవాది రూపమున ఏమాత్రమును కపటము లేని సేవ ఎంతయో చేసిరి. ఆ లీలావతి యను వేశ్యయును చాల కాలము (అట్లు జీవించిన) తరువాత సర్వపాప వినిర్ముక్తురాలయి శివలోకము చేరెను. తాను దరిద్రుడగు బంగారు పని వాడై యుండియు అతి సత్యవంతుడై (ఈ పనికై) భృతి తీసికొనని ఆతడే నీవు (ధర్మమూర్తియను రాజు) గా ఇపుడున్నావు. సప్త ద్వీపాధిపతివి- పదివేల సూర్యల తేజస్సువంటి తేజస్సు కలవాడవు అయినావు. తన భర్త చేసిన బంగారు చెట్లకు భక్తితో మెరుగు పెట్టిన అలనాటి సువర్ణకారుని భార్య నీయీ భానుమతి; ఆ మెరుగుపెట్టిన పుణ్యముననే ఈమెకు నేడీ మేరమీరిన రూపమును ఇంతులందరలో మేలిదనము కలుగుటయునైనది. ఏమియు పొగరులేక లవణాచలదాన వ్రతకాలమున బ్రాహ్మణాదుల పరిచర్యలు చేసినందున అపరాజితుడవై ఆరోగ్య లక్ష్మీ సౌభాగ్యములనందగలిగితివి.

కావున నీవు ఇపుడును విధాన పూర్వకముగా ధాన్యాచలాది దశవిధ పర్వత దానములను ఆచరించుము.

అనిన వసిష్ఠుని పాదములను ధర్మమూర్తి సంపూజించి ధాన్యా చలాదికములు అన్నియు అట్లే దానమిచ్చెను. తత్ఫలముగా సుర పూజ్యమానుడగుచు శివలోక ప్రాప్తుడయ్యెను.

ఇంతేకాదు. దరిద్రులేయైనను ఈ పర్వతదాన వ్రతములు జరుగుచుండగా చూచినను వానిని తాకినను ఈ విషయములు వినినను ఇతరులకు తెలిపినను అట్టివాడును పాపవిముక్తుడై స్వర్గము చేరును. ఈ పర్వత దానములన్నియు సంసారభయ నాశకమలు: దేవ పూజ్యమానములు. వీని ప్రభావమున మానవుడు దుఃఖశాంతి నొందును. వీని నన్నిటిని భక్తితో నాచరించినవాడు ఆత్మశాంతి నందుననుటలో సంశయమేలేదు.

ఇట్లని ఈశ్వరుడు నారదునకు తెలిపెను.

ఇది శ్రీమత్య్సమహాపురాణమున ఈశ్వర నారద సంవాదమన శర్కరా చలదాన మాహాత్య్మ కథనమను తొంబదియొకటవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters