Sri Matsya Mahapuranam-1    Chapters   

నవమో7ధ్యాయః

మన్వన్తరవివరణమ్‌

సూతః: ఏవం శ్రుత్వా మనుః ప్రాహ పునరేవ జనార్దనమ్‌ | పూర్వేషాం చరితం బ్రూహి మనూనాం మధుసూదన. 1

మత్స్యః: మన్వన్తరాణి సర్వాణి మనూనాం చరితం చ యత్‌ | ప్రమాణం చైవ కాలస్య తదుత్పత్తిం సమాసతః. 2

ఏకచిత్తః ప్రశాన్తాత్మా శృణు మార్తాణ్డనన్దన | యామా నామ పురా దేవా హ్యాస న్త్స్వాయమ్భువే న్తరే. 3

పూర్వే చ ఋషయ స్సర్వే యే మరీచ్యాదయ స్స్మృతాః | అగ్నీధ్ర శ్చాతిబాహుశ్చ పుత్త్ర స్సవన ఏవ చ. 4

జ్యోతిష్మా న్ద్యుతిమా& హవ్యో మేధా మేధాతిథి ర్వసుః | స్వాయమ్భువసై#్యవ మనో ర్దశైతే వంశవర్ధనాః. 5

ప్రతిసర్గ మమీ కృత్వా జగ్ము స్తే పరమం పదమ్‌ | ఏత త్స్వాయమ్భువం ప్రోక్తం స్వారోచిష మతః పరమ్‌. 6

స్వారోచిషస్య తనయా శ్చత్వారో దేవవర్చసః | నభో నభస్యః* ప్రభృతి ర్భరతః కీర్తివర్ధనాః. 7

దత్తో నిశ్చ్యవన స్త్సమ్భః ప్రాణః కాశ్యప ఏవచ | ఊర్వో బృహస్పతిశ్చైవ సప్త సప్తర్షయోభవ&. 8

తతో దేవాస్తు తుషితా స్మ్సృతా స్స్వారోచిషేన్తరే | హవీన్ద్ర స్సుకృతో మూర్తి రాపోజ్యోతి రయస్స్మయః.

వసిష్ఠస్య సుతా స్సప్త యే ప్రజాపతయ స్తదా | ద్వితీయ మేత త్కథితం మన్వన్తర మతఃపరమ్‌. 10

తృతీయం తు ప్రవక్ష్యామి తథా మన్వన్తరం శుభమ్‌ | మనుర్నా మోత్తమో యత్ర దశ పుత్త్రా నజీజనత్‌.

ఇష స్సహస్య ఊర్జశ్చ శుచి శ్శుక్ల స్తథైవ చ | మధుశ్చ మాధవశ్చైవ నభస్యోథ నభ స్తథా. 13

సహః కనీయా నేతేషా ముదారః కీర్తివర్ధనః | భానవ స్తత్ర దేవా స్స్యు రూర్జా స్సప్తర్షయ స్త్సృతాః. 12

* కౌకరణ్డిః కురణ్డిశ్చ దాఖ్యః ఖణ్డః ప్రవాహణః | మితశ్చ సంమితశ్చైవ సపై#్తతే యోగవర్ధనాః. 14

నవమాధ్యాయము

మన్వంతర వివరణము

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పనారంభించెను : మనువు (సత్యవ్రతుడు) మత్స్యనారాయణుడు చెప్పిన ఈ విషయమును విని ఆ స్వామితో ఇంకను ఇట్లు పలికెను: మధుసూదనా! పూర్వులగుమనువుల చరితమును నాకు వినిపింపుము. అన మత్స్యమూర్తి ఇట్లు పలికెను: సూర్యపుత్త్రా! అన్ని మన్వంతరములను మనువుల చరితమును మన్వంతర కాల పరిమాణమును వారి ఉత్పత్తిని సంక్షేపముగా అంతయు తెలిపెదను. ఏక చిత్తుడవయి ప్రశాంతమగు మనస్సుతో వినుము.

(ప్రతి మన్వంతరమునకు మనువుల భేదమును బట్టి ఆ కాలమున ఆరాధ్యులగు దేవతలును వేదములను విద్యలను యజ్ఞాది కర్మానుష్ఠానములను ప్రవర్తిల్లజేసిన ఋషులును సృష్టిని సాగించిన మను పుత్త్రులును వేరు వేరుగా ఉందురు. అనువాదకుడు).

స్వాయంభువ మన్వంతరమున యాములు అనువారు దేవతలు. లోగడ తెలిపిన మరీచి మొదలుగా నారదుని వరకును గల పది మందియు ఋషులు. ఆ గ్నీధ్రుడు అతి బాహుడు పుత్త్రుడు సవనుడు(లు) జ్యోతిష్మాన్‌ ద్యుతిమాన్‌ హవ్యుడు మేధ మేధాతిథి వసువు అను పది మంది కుమారులు. వీరు ప్రతిసర్గమును (పాంచ భౌతికములగు శరీరములు గల ఆయా ప్రాణి విశేషముల సృష్టిని) జరిపి వీరు పరమ పదమున కేగిరి.

స్వారోచిషమనువునకు నభుడు నభస్యుడు ప్రభృతి భరతుడు అను నలుగురు కుమారులు. దత్తుడు నిశ్చ్యవనుడు స్తంబుడు ప్రాణుడు కాశ్యపుడు ఊర్వుడు బృహస్పతి అనువారు ఏడు మంది ఋషులు. తుషితులు అనువారు దేవతలు. వసిష్ఠుని కుమారులగు హవి ఇంద్రుడు సుకృతుడు మూర్తి ఆపుడు జ్యోతి అయస్మయుడు అను ఏడుగురును సృష్టిని కొనసాగించు ప్రజాపతులు.

___________________________________________

* ప్రభృతిర్భావనః. * కౌకరణ్డిశ్చబుద్ధిశ్చసఖ్యః ప్రవహణస్మ్సృతిః.

ఉత్తముడు మనువుగా ఉండగా ఆయన కుమారులు పది మందియు ప్రజాపతులు. వారు ఇషుడు సహస్యుడు ఊర్జుడు శుచి శుక్లుడు మధుడు మాధవుడు నభస్యుడు నభుడు సహుడు అనువారు. ఈ కడపటి వాడు ఉదారుడు చాల కీర్తి శాలియును. భానువులు అనువారు ఊర్జులు అను గణము వారు సప్తఋషులు. వారి పేరులు కౌకరండికుడు కురండి దాఖ్యుడు ఖండి ప్రవాహణుడు మితుడు సంహితుడు అనునవి.

మన్వన్తరం చతుర్థం తు తామసం నామ విశ్రుతమ్‌ | ¨ కవిః పృథు స్తథా చాగ్ని రశ్వః కపిల ఏవ చ.

* తథైవ జన్యధీమన్తౌ మునయ స్సప్త తామసే | సాధ్యా దేవగణా యత్ర కథితా స్తామసేన్తరే. 16

అకల్మష స్తథా ధన్వీ తపోబల తపోధనౌ | తపోరతి స్తపస్యశ్చ సుతపాశ్చ పరన్తపః. 17

తపోద్యుతి స్తపోనాధ స్సర్వే సఙ్గ్రామ విత్తమాః | తామసస్య సుతా స్సర్వే దశ వంశవివర్ధనాః. 18

పఞ్చమస్య మనో స్తద్వ ద్రైవతస్యాన్తరం శృణు | దేవబాహు స్సుబాహుశ్ప పర్జన్య స్సోమపో మునిః. 19

హిరణ్యరోమా సప్తాక్ష స్సపై#్తతే ఋషయస్మ్సృతాః | దేవాశ్చ భూతరజస స్తథా ప్రకృతయ స్మ్సృతాః. 20

అరుణ స్తత్త్వదర్శీ చ ధృతిమా& హవ్యప స్స్వజిత్‌ | యుక్తో నిరుత్సుక స్సత్యో నిమేషోన్తః ప్రకాశకః.

ధర్మవీర్యబలోపేతా దశైతే రైవతాత్మజాః | చాక్షుషస్యాన్తరే దేవా లేఖా నామ పరిశ్రుతాః. 22

వసవోథ ప్రవాచాథ పారిసూవా దివౌకసః | చాక్షుషస్యాన్తరే ప్రోక్తా దేవానాం పఞ్చ యోనయః. 23

భృగు స్సుధామా విరజా స్సహ్సిష్ణు ర్నాద ఏవ చ | వివస్వా నత్రినామా చ సప్త సప్తర్షయోపరే. 24

ఊరుప్రభృతయ స్తద్వ చ్చాక్షుషస్య సుతా దశ | ప్రోక్తాః స్వాయమ్భవే¨వంశే యే మయా పూర్వమేవ తు.

అన్తరం చాక్షుష సై#్యత న్మయా తే పరికీర్తితమ్‌ | సప్తమం చ ప్రవక్ష్యామి య ద్వైవస్వత ముచ్యతే. 26

అత్రిశ్చైవ వసిష్ఠశ్చ కశ్యపో గౌతమ స్తథా | భరద్వాజ స్తథా యోగీ విశ్వామిత్రః ప్రదాపవా&. 27

జమదగ్నిశ్చ సపై#్తతే సామ్ప్రతం యే మహర్షయః | సాధ్యా విశ్వే చ రుద్రాశ్చ మరుతో వసవోశ్వినౌ. 28

ఆదిత్యాశ్చ సురా స్తద్వ త్సప్త దేవగణా స్మ్సృతాః | ఇక్ష్వాకు ప్రముఖాశ్చాపి తస్య పుత్త్రాః స్మృతా భువి. 29

నాలుగవది యగు తామసమన్వంతరమున కవి పృథువు అగ్ని అశ్వుడు కపిలుడు జన్యుడు ధీమాన్‌ అనువారు సప్తఋషులు. సాధ్యులు అను గణమువారు దేవతలు. అకల్మషుడు ధన్వి తపోబలుడు తపోధనుడు తపోరతి తపస్యుడు సుతపుడు తపోధ్యుతి తపోనాథుడు అను తామసుని కుమారులు పది మందియు యుద్ద విద్యల నెరిగిన వారిలో శ్రేష్ఠులును వంశవృద్ధి చేయు వారును ఐరి.

రైవత మన్వంతరమున దేవ బాహుడు సుబాహుడు పర్జన్యుడు సోమపుడు ముని హిరణ్యరోముడు సప్తాక్షుడు అనువారు సప్త ఋషులు. భూతరజసులు అను గణము వారు దేవతలు. రైవతుని కుమారులు అరుణుడు తత్త్వ దర్శి ధృతిమాన్‌ హవ్యపుడు స్వజిత్‌ యుక్తుడు నిరుత్సుకుడు సత్యుడు నిమేషుడు అంతఃప్రకాశకుడు అనువారు పదిమందియు ధర్మము వీర్యము బలము కలవారు. వీరు ఆ మన్వంతరమున ప్రజావృద్ధి చేయువారు.

చాక్షుష మన్వంతరమున లేఖులు వసువులు ప్రవాచులు పారిసూవులు దివౌకసులు అను ఏడు తెగల దేవతలుందురు. భృగువు సుధాముడు విరజుడు సహిష్ణుడు నాదుడు వివస్వాన్‌ అత్రి అనువారు సప్త ఋషులు. లోగడ (అధ్యా. 4) తెలిపిన ఊరువు పురుడు శతద్యుమ్నుడు తపస్వి సత్యవాక్‌ కవి అగ్నిష్టోముడు అతిరాత్రుడు సుదృష్టి అభిమన్యుడు అను పది మందియు చాక్షుషుని కుమారులు ప్రజావృద్ధి చేయువారు.

___________________________________________

¨ కావ్యః. * అహన్యహన్యనామానౌ

¨ చేమే * భృగుర్వరేణ్యశ్చ్యవనస్సువృత్తోధృతిరేవచ

వైవస్వత మన్వంతరమున అత్రి వసిష్ఠుడు కశ్యపుడు గౌతముడు భరద్వాజుడు విశ్వామిత్రుడు జమదగ్నిఅనువారు సప్త ఋషులు. సాధ్యులు విశ్వేదేవులు రుద్రలు మరుత్తులు వసువులు అశ్వినులు ఆదిత్యులు అను ఏడు దేవ గణములు ఉండును. ఇక్ష్వాకువు మొదలగు కుమారులు ప్రజావృవృద్ధి చేయువారు.

మన్వన్తరేషు సప్త స ప్త మహర్షయః | కృత్వా ధర్మస్వ సంస్థానం ప్రయాన్తి పరమం పదమ్‌. 30

సావర్ణేస్తు ప్రవక్ష్యామి మనో ర్భావి తథా7న్తరమ్‌ | అశ్వత్థామా శరద్వాంశ్చ కౌశికో గాలవ స్తథా. 31

శతానన్దః కాశ్యపశ్చ రామశ్చ ఈషయస్మృతాః | *ధృతి ర్వరీయా న్పవన స్సువర్ణో విష్ణురేవచ. 32

చరిష్ణు రిజ్య స్సుమతిర్‌ బృహతక్షత్త్రశ్చ వీరవాన్‌ | భావినో దశ సావర్ణే ర్మనోః పుత్త్రాః ప్రకీర్తితాః. 33

రౌచ్యాదయ స్తథా7న్యేపి మనవ స్సమ్ప్రకీర్తితాః | రుచేః ప్రజాపతేః పుత్త్రో రౌచ్యో నామ భవిష్యతి. 34

మను ర్భూతే స్సుత స్తద్వ ద్భౌత్యో నామ భవిష్యతి | తతస్తు మేరుసావర్ణి ర్బ్రహ్మసూను ర్మనుస్మ్సృతః.

క్రతుశ్చ ఋతుధామా చ విష్వక్సేనో మను స్తథా |అతీతానాగతాశ్చైతే మనవ స్సప్త కీర్తితాః. 36

పూషణో యుగసాహస్ర మేభి ర్ధ్యాతా నరాధిప | సఙ్కీ ర్తితం సర్వ మిదం మయా తు పృథివీపతే. 37

స్వే స్వే7 న్తరే సర్వ మిద ముత్పాద్య సచరాచరమ్‌ | కల్పావసానే తే సర్వే ముచ్యన్తే బ్రహ్మణా సహ. 38

ఏతే యుగసహస్రాన్తే వినశ్యన్తి పునఃపునః | బ్రహ్మాద్యా విష్ణుసాయుజ్యం యాన్తి యాస్యన్తి వై ద్విజాః.

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మత్స్యమను సంవాదే చతుర్దశ

మన్వన్తరానుకీర్తనం నామ నవమో7ద్యాయః.

అన్ని మన్వంతరములందును ఏడేసి మంది మహర్షులు ధర్మ వ్యవస్థ చేసి పరమ పదమును చేరెదరు.

సావర్ణి మన్వంతరమున అశ్వత్థామ శరద్వాన్‌ కౌశికుడు గాలవుడు శతానందుడు కాశ్యపుడు రాముడు అనువారు స ప్త ఋషులు. ధృతి వరీయాన్‌ పవనుడు సువర్ణుడు విష్ణుడు చరిష్ణుడు ఇజ్యుడు సుమతి బృహత్‌క్షత్త్రుడు వీర్యవాన్‌ అనువారు పది మంది సావర్ణి కుమారులును ప్రజావృద్ధి చేయువారు.

వీరు కాక రౌచ్యుడు మొదలగు మరికొందరు మనువులును కాబోవుదురు. రుచి అను ప్రజాపతికి కుమారుడు రౌచ్యుడు. భూతి అను ప్రజాపతికి కుమారుడు భౌత్యుడు. వీరును కాబోవు మనువులలోనివారు.

తరువాత బ్రహ్మకుమారుడగు మేరుసావర్ణి మనువు అగును.

క్రతువు ఋతుధాముడు విష్వక్సేనుడు అనువారు మరి ముగ్గురు మనువులు.

ఇట్లు గడచిన వారు ఆరు మందియు గడచుచున్న వై వస్వతమనువును రానున్న మనువులు ఏడు మందియు మనువులు చెప్పబడినారు. ఇట్లు మొత్తము పదు నలుగురు మనువులు.

వీరు వేలకొలది దేవ యుగముల కాలము తపమాచరించి ఆ శ క్తిచే లోకసృష్టిని ప్రజాపాలనమును జరుపుదురు.

రాజా ! ఇది యంతయు నీకు ఇట్లు తెలిపితిని.

ఈ మనువులు అందరును తమ తమ అంతరములలో చరాచర ప్రాణులతో నిండిన జగత్తును సృష్టించి పాలింతురు. తుదకు కల్పాంతమునందు బ్రహ్మతో పాటు ముక్తిని పొందుదురు.

(ఈ సృష్టియును కల్పమును ఒకటి మాత్రమే కాదు. సృష్టులును కల్పములును అనంతములు. ప్రతి సృష్టి యందును కల్పమునందును ఇట్లే బ్రహ్మలును మనువులును మరల మరల పుట్టుచు పోవుచుందురు. కనుక) వీరు వేలకొలది దేవ యుగములు మగిసిన తరువాత మరల మరల నశించుచుందురు. ఆ క్రమములో బ్రహ్మ మనువులు మొదలగు వారు విష్ణు సాయుజ్యమును పొందుదురు. ఇక ముందును ఇట్లే పొందనున్నారు.

(ఇచ్చట సావర్ణి అను మనువులు ఐదు మంది. వీరిలో మొదట చెప్పిన సావర్ణి ఎవరో స్పష్టముగా చెప్పబడ లేదు. మరియును మిగిలిన మనువులు కాని వారివారి అంతరములలో ఉండెడి స ప్తృఋషులును దేవతలును మనుపుత్త్రులును కాని చెప్పబడలేదు.)

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున మత్స్యమను సంవాదమున మన్వంతరాను కీర్తనమను నవమాధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters