Sri Matsya Mahapuranam-1    Chapters   

చతురశీతితమోధ్యాయః.

గుడపర్వతదానమ్‌.

ఈశ్వరః : అతఃపరం ప్రవక్ష్యామి గుడపర్వత ముత్తమమ్‌ |

యత్ప్రదానాన్నర స్స్వర్గ మాప్నోతి సురపూజితమ్‌. 1

ఉత్తమో దశభి ర్భారై ర్మధ్యమః పఞ్చభి ర్మతః | త్రిభి ర్భారైః కనిష్ట స్స్యా త్తదర్ధే నాల్పవిత్తవా9. 2

తద్వ దావాహనం పూజా హేమవృక్షసురార్చనమ్‌ | విష్కమ్భపర్వతాం స్తద్వ త్సరాంసి వనదేవతాః. 3

హోమం జాగరణం చైవ లోకపాలాధివాసనమ్‌ | ధాన్యపర్వతవ త్కుర్యా దిమం మన్త్రముదీరయేత్‌. 4

యథా దేవేషు విశ్వాత్మా ప్రవరో7 యం జనార్దనః | సామవేదస్తు వేదానాం మహాదేవస్తు యోగినామ్‌. 5

ప్రణవ స్సర్వమన్త్రాణాం నారీణాం పార్వతీ యథా | తథా రసానాం ప్రవర స్సదైవేక్షురసో మతః. 6

మమ తస్మా త్పరాం లక్ష్మీం ప్రయచ్ఛ గుడపర్వత |

యస్మా త్సౌభాగ్యదాయీ త్వం +భ్రాతా త్వం గుడపర్వత. 7

నివాసశ్చాపి O పార్వత్యా స్తస్మా త్త్వం పాహి సర్వదా |

అనేన విధినా యస్తు దద్యా ద్గుడమయం గిరిమ్‌. 8

పూజ్యమాన స్స గన్దర్వై ర్గౌరీలోకే మహీయతే | తతః కల్పశతాన్తేతు సప్తద్వీపాధిపో భ##వేత్‌. 9

ఆయురారోగ్యసమ్పన్న శ్శత్రుభి శ్చాపరాజితః.

ఇతి శ్రీమత్స్యమహాపురాణ గుడపర్వతదానమహాత్మ్య కథనం

నామ చతురశీతితమో7ధ్యాయః.

ఎనుబది నాలుగవ అధ్యాయము

గుడపర్వత దానము

ఈశ్వరుడు నారదునకిట్లు చెప్పెను : ఇపుడికమీదట గుడ పర్వత దానవత్రమును తెలిపెదను. అది ఉత్తమమయినది. దానినాచరించినవారు సురల పూజలనందుకొనుచు స్వర్గమున సుఖింతురు. దీనికై పది ­బారువులు కాని ఐదు బారువులు కాని తగినంత ధనములేని వారు ఒకటిన్నర బారువులుకాని బెల్లమును వినియోగించ

_______________________________________________________________

+ శ్రాంతాత్మా O పార్వత్యాస్తస్మా చ్ఛాన్తిం ప్రయచ్ఛ మే

­24 తులములు= 1 సేరు; 5సేరులు;= 1వీసె; 8వీసెలు= 1 మణుగు; 20 మణుగులు= 1 బారువ.

వలెను. ధాన్య పర్వత దానమందువలెనే ఆవాహనమును పూజయు హేమ వృక్షముల అమరికయు విష్కంభ పర్వతములను సరస్సులను వనములను దేవతలను వినాస్యము చేయవలెను. హోమమును జాగరణమును లోకపాలాధి వాననమును (అమరికను) కూడ ధాన్య పర్వత దానమందువలెనే. దాన మంత్రము:) దేవతలయందు విశ్వాత్ముడగు జనార్దనుడును వేదములయందు ప్రణవమును స్త్రీయందు పార్వతియును శ్రేష్ఠమయినట్లు రసములలో ఇక్షు (చెరకు) రసము శ్రేష్ఠము. కావున గుడ పర్వతమా| నాకుమేలగు లక్ష్మిని ఇమ్ము. నీవు పార్వతికి నివాసమవు; కావున నీవు నన్నెల్లప్పుడును కాపాడుము. ఈవిధానమున గుడ పర్వత దానముచేసిన వారు గంధర్వులచే కీర్తిగానము చేయబడుచు గౌరీ లోకమున సుఖింతురు. ఇట్లు నూరు కల్పములయిన తరువాత నప్తద్వీపాధి పతియై జన్మించి ఆయురారోగ్య సంపన్నుడై శత్రువులకు అజేయుడై వర్ధిల్లును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున గుడ పర్వత దానమహాత్మ్య కథనమను ఎనుబది నాలుగవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters