Sri Matsya Mahapuranam-1    Chapters   

పంచాశో7ధ్యాయః.

ఆదిత్యశయనవ్రతమ్‌.

నారదః : 

ఉపవాసే ష్వశ క్తస్య తదేవ ఫల మిచ్ఛతః | అనాయాసేన రోగాద్వా కిమిష్టం వ్రత ముచ్యతామ్‌. 1

శ్రీఈశ్వరః : ఉపవాసే ష్వశక్తానాం నక్తభోజన మిష్యతే |

యస్మి న్ర్వతే తదప్యస్తి శ్రూయతాంవై వ్రతం మహత్‌. 2

ఆదిత్యశయనం నామ యథావ చ్ఛఙ్కరార్చనమ్‌ | యేషఫు నక్షత్రయోగేషు పురాణజ్ఞాః ప్రచక్షతే. 3

యదా హస్తేన సప్తమ్యా మాదిత్యస్య దినం భ##వేత్‌ | సూర్యస్య వారే సంక్రాన్తి స్తథిఃస్యా త్సర్వకామదా. 4

ఉమామ హేవ్వరస్యార్చా మర్చయే త్సూర్యనామభిః | సూర్యార్చాం శివలిఙ్గంచ న గృ హే పూజయే ద్యతః. 5

త్విషాంపతే శ్శివస్యాపి న బేదో దృశ్యతే క్వచిత్‌ |

యస్మా త్తస్మా న్మునిశ్రేష్ఠ గ్రహేశంతు సమర్చయేత్‌. 6

ఏబది ఐదవ అధ్యాయము.

ఆదిత్యశయన వ్రతము.

నారదుడు ఈశ్వరు నిట్లు ప్రశ్నించెను: ఉపవాసములు చేయుటకు శ క్తిలేని వారై కాని వ్యాధిబాధవలనకాని అనాయాసముగా ఇదే పైని చెప్పిన ఫలమును కోరువారు చేయదగిన వ్రతము నుపదేశించుము. అనగా ఈశ్వరు డిట్లు చెప్పెను: ఉపవాసము చేయ శ క్తిలేనివారు నక్తము (పగలు ఉపవసించి రాత్ని భుజించుట) భుజించి చేయదగిన మమా వ్రతమును కలదు. చెప్పెదను; వినుము. ఈ వ్రతమునకు ఆదిత్య శయనమని పేరు. ఆయా నక్షత్రములు కల దినములందు (సూర్యాభేదభావనతో) శంకరు నర్చించవలయును. న ప్తమీతిథి-ఆదిత్యవారము-హస్తనక్షత్రము-సూర్యుడు ఏదేని రాశియందు ప్రవేవించులట-ఈ నాలుగు అంశములును కలిసిన దినమున ఈ వ్రతము చేసినచో అన్ని కోరికలును నెరవేరును. గృహమునందు సూర్యప్రతలిమ శివలింగము ఈ రెంటిని పూజించరాదు. (ఏదో ఒకటి మాత్ర ముండవలెను.) అదికాక రవి శివులకు భేదములేదు. కనుక రవి నామములతో శివమూర్తిని (కాని లింగమును కాని) పూజించవలెను.

హస్తేచ సూర్యాయ నమోస్తు పాదా వర్కాయ చిత్రాసు చ గుల్ఫదేశమ్‌ |

స్వాతీషు జఙ్ఘే పురుషోత్తమాయ ధాత్రే విశాకాసుచ జానుదేశమ్‌. 7

తథా7నురాధాసు నమో7భిపూజ్య మూరుద్వయంచైవ సహస్రభానోః |

జ్యేష్ఠా స్వనఙ్గాయ నమోస్తు గుహ్య మిన్ద్రాయ సోమాయ కటిం చ మూలే. 8

పూర్వోత్తరాషాఢయుగేచ నాభిం త్వాష్ట్రే నమ స్సప్తతురఙ్గమాయ |

తీక్షాంశ##వేచ వ్రవణచ కుక్షిం పృష్ఠం ధనిష్ఠాసు వికర్తనాయ. 9

వక్షస్థ్సలం ధ్వాన్తవినాశయ జలాధిపరేక్ష ప్రతిపూజనీయమ్‌ |

పూర్వోత్తరాభాద్రపదద్వయేచ బాహు నమ శ్చణ్డకరాయ పూజ్యౌ. 10

సామ్నామధీశాయ కరద్వయంచ సమ్పూజనీయం ద్విజ రేవతీషు |

నఖాని పూజ్యాని తథాశ్వినీషు నమోస్తు సప్తాశ్వధురన్దరాయ.11

కఠోరధామ్నే భరణీషు కణ్ఠం దివాకరాయే త్యభిపూజనీయమ్‌ |

గ్రీవాగ్నిఋక్షే7ధర మమ్బుజేశం సమ్పూజయే న్నారద రోహిణీషు. 12

మృగోత్తమాజ్గే దశనాః పురారే స్సమ్పూజనీయా రవయే నమస్తే |

నమస్సవిత్రేతి చ శాఙ్కరేచ నాసాభిపూజ్యాథ పునర్వసౌచ. 13

లలాట మమ్భోరుహవల్లభాయ పుష్యే7లకా వేదశరీరధారిణ |

సార్పే7థ మౌళిం విబుధ ప్రియాయ మఘాసు కర్ణావితి గోగణశ. 14

పూర్వాసు గోబ్రాహ్మణనన్దనాయ నేత్రాణి సమ్పూజ్యతమాని శమ్భోః |

అథో త్తరాఫల్గునివై భ్రువౌచ విశ్వేశ్వరాయేతి చ పూజనీ¸°. 15

నమోస్తు పాశాఙ్కుశ పద్మశూల కపాలఖడ్గేషు ధనుర్ధరాయ |

గజాసురానఙ్గపురాన్ధకాది వినాశమూలాయ నమశ్శివాయ. 16

ఇత్యాది శస్త్రాణిచ పూజయిత్వా విశ్వేశ్వరాయేతి శిరోభిపూజమ్‌ |

1. సూర్యాయనమః-హస్తనక్షత్రే-పాదౌ పూజయామి; 2. అర్కాయనమః-చిత్రాసు-గుల్ఫౌ పూజయామి; 3. పురుషోత్తమాయ నమః-స్వాతీషు-జంఘే పూజయామి; 4. ధాత్రేనమః విశాఖాసు-జామనీ పూజయామి; 5. సహస్రభానవేనమః-అనురాధాసు-ఊరూ పూజయామి; 6. అనంగాయ ఇంద్రాయనమః-జ్యేష్ఠాసు- హ్యం పూజయామి; 7. సోమాయనమః- మూలే-కటిం పూజయామి; 8. త్వష్ట్రే సప్తతురంగమాయనమః- పూర్వాషాఢోత్తరాషాఢయోః-నాభిం పూజయామి; 9. తీక్షాణంశ##వేనమః శ్రవణ-కుక్షిం పూజయామి; 10. విక ర్తనాయనమః-ధనిష్ఠాసు-పృష్ఠం పూజయామి; 11. ధ్వాంత వినాశనాయనమః-శతభిషక్షు-వక్షఃస్థలం పూజయామి; 12. చండకరాయనమః-పూరన్వాభాద్రాసు ఉత్తరాభాద్రాసు-బాహూ పూజయామి; 13. సామ్నామధీశాయ నమః-రేవతీషు-హస్తౌ పూజయామి; 14. సప్తాశ్వధురంధరాయ నమః అశ్వినీషు-నఖాని పూజయామి; 15. కఠోరధామ్నే నమః-భరణీషు-కంఠం పూజయామి; 16. దివాకరాయనమః-కృత్తి కాసు-గ్రీవాం పూజయామి; 17. అంబుజేశాయనమః-రోహిణీషు-అధరం పూజయామి; 18. రవయేనమః-మృగశీర్షే-దంతాన్‌ పూజయామి; 19. సవిత్రేనమః-ఆర్ద్రాసు-నాసికాం పూజయామి; 20. అంభోరుహవల్లభాయనమః-పునర్వసౌ-లలాటం పూజయామి; 21. వేదశరీరధారిణనమః-పుష్యే అలకాన్‌ పూజయామి; 22. విబుధప్రియాయనమః-ఆశ్లేషాసు-శిరః పూజయామి; 23. గ్రహగణశాయనమః మఖాసు-కర్ణౌ పూజయామి; 24. గోబ్రాహ్మణనందనాయనమః-పూర్వఫల్గునీషు-నేత్రాణి పూజయామి; 25. విశ్వేశ్వరాయనమః-ఉత్తర ఫల్గునీషు భ్రవౌ పూజయామి; అను ఈ మంత్రములతో ఆయా నక్షత్రములు గల దినములందు ఆయా అవయవములందు ప్రధాన భావనతో సర్వాంగ పూజను ప్రతిదినము నక్తవ్రత పూర్వకముగా జరుపుచుండవలెను. ప్రతి దినమునను శివుని ఉద్దేశించి ఈ చెప్పబోవు అర్థము కల మంత్రముతో స్తుతి చేయుచు శివుని శిరమున పూజ సేయవలెను: ''పాశాంకుశ పద్మ శూలకపాల ఖడ్గబాణ ధనుర్ధారియు గజాసురుడు-మన్మథుడు-త్రిపురాసురులు-అంధకదానవుడు మొదలగువారి వినాశమునకు కారణమునగు శివునకు నమస్కారము.''

భో క్తవ్య మత్రైవ మతైలశాక మమాంస మక్షార మబుక్తశేషమ్‌. 17

ఇత్యేవం ద్విజ నక్తాని కృత్వా దద్యా త్పున ర్వశీ | శాలేయతండులప్రస్థ మౌదుమ్బరమయే ఘృతమ్‌. 18

సంస్థాప్య పాత్రే విప్రాయ సహిరణ్యం నివేదయేత్‌ | సప్తమే వస్త్రయుగ్మంచ పార్వణ త్వధికం భ##వేత్‌.

చతుర్దశేతు సమ్ర్పాప్తే పారనే నారదాబ్దికే | బ్రాహ్మణా న్భోజయే ద్భక్త్యా గుడక్షీరఘృతాదిభిః 20

కృత్వా7థ కాఞ్చనం పద్మ మష్టపత్రం సకర్ణికమ్‌ | శుద్ధమష్టాఙ్గుళం తచ్చ పద్మరాగదళాన్వితమ్‌. 21

శయ్యాం సులక్షణాం కృత్వా విరుద్ధగ్రన్ధివర్జితామ్‌ | సోపధానవితానాంచ స్వాస్తీర్ణవ్యజనాశ్రయామ్‌. 22

పాదుకోపానహచ్ఛత్ర చామరాసనదర్పణౖః | భూషణౖరపి సంయుక్తాం ఫలవస్త్రాను లేపనైః. 23

తస్మి న్నిధాయ తత్పద్మ మలఙ్కృత్య గుణాన్వితామ్‌ |

కపిలాం వస్త్రసంయుక్తాం సుశీలాంచ పయస్వినీమ్‌. 24

హేమశృఙ్గీం రౌప్యఖురాం సవత్సాం కాంస్యదోహినీమ్‌ |

దద్యా న్మన్త్రేణ పూర్వాహ్ణే అభిజి న్నాభిలఙ్ఘయేత్‌. 25

యథైవాదిత్య!శయన మశూన్యం తవ సర్వదా| కాన్త్యా ధృత్యా శ్రియా రత్యా తథా మే సన్తు వృద్ధయః. 26

యథా న దేవా శ్శ్రేయాంసం త్వదన్య మనఘం విదుః |

తథా మా ముద్ధరాశేష దుఃఖసంసార సాగరాత్‌. 27

తతః ప్రదక్షిణీకృత్య ప్రణమ్యచ విసర్జయేత్‌ | శయ్యాగవాది తత్సర్వం ద్విజస్య భవనం నయేత్‌. 28

ఈ పూజా వ్రత దినములందు తైలము (మాంసాహారులు కూడ) మాంసము ఉప్పు (కారము-పులుపు) లేని భోజనము చేయవలెను. ఇది పదునాలుగు సంవత్సరములు చేయవలసిన వ్రతము-ప్రతి సంవత్సరమును వ్రతము కడపటి (ఇరువది ఐదవ) దినమున కుంచెడు మంచి వరిబియ్యమును మేడి పాత్రలో నేతిని బంగారమును బ్రాహ్మణునకు దాన మీయవలెను. ఏడవ సంవత్సరపు వ్రతములో వస్త్రముల జతనుకూడ ఈయవలెను. పదునాల్గవ సంవత్సరపు వ్రతములో భక్తితో బ్రాహ్మణులకు గుడక్షీర ఘృతాదికముతో భోజనములు పెట్టవలెను. ఎనిమిది అంగుళముల వ్యాసముకల బంగారు పద్మమును ఎనిమిది రేకులు నడుమ దుద్దు కల దానిని చేయించవలయును. రేకులయందు పద్మరాగములు తాపటము చేయవలెను. ముడులు కాని ఎదురు నాలుకలు కాని లేని కొయ్యతో మంచము చేయించవలెను. దిండ్లు-చాందనీలు-పరపు విసనకర్రలు-పాదుకలు-చెప్పులు-గొడుగు-చామరములు కాలిపీటలు-అద్దములు-అలంకారములు-ఫలములు-వస్త్రములు-గంధ ద్రవ్యములు అమర్చవలెను. ఆ మంచము పై ఆ పద్మమును అన్ని అమరికలతో ఉంచవలెను. పొడువని కపిల గోవును పాలిచ్చు దానిని దూడ కలదానిని వస్త్రములతో బంగారు కొమ్ములతో వెండిగిట్టలతో అలంకరించవలెను. పాలు పిదుకు కంచు పాత్రతో కూడ ఈ యావును-పై సామగ్రిని బ్రాహ్మణునకు మధ్యాహ్నము గడువకుండ దానమీయవలెను. దానము ఇచ్చునపుడు ఈ యర్థము కల మంత్రము చెప్పవలెను: ''ఆదిత్యా! నీ పడక ఎల్లప్పుడును కాంతితో నిబ్బరముతో శోభతో ఆనందముతో నిండియుండునట్లే నాకును ఈ అన్ని వృద్ధులును కలుగుగాక! దేవతలు కూడ నీకంటె మరెవ్వరిని పూజ్యునిగా తలచరు కావున (నీ వందర దేవతల కంటె గొప్పవాడవు కావున) నన్ను అశేష దుఃఖ సంసార సాగరమునుండి ఉద్ధరింపుము.'' పిమ్మట (బ్రాహ్మణునకు ప్రదక్షిణము చేసి అతనిని పంపవలయును. ఈ దాన ద్రవ్యములను ఆ విప్రుని ఇంటికి చేర్చవలెను.

నైత ద్విశీలాయ న నాస్తికాయ కుతర్కదుష్టాయ వినిన్దకాయ |

ప్రకాశనీయం వ్రత మిన్దుమౌళే ర్యశ్చాపి నిన్దా మధికాం విధత్తే. 29

భక్తాయ దాన్తాయచ గుహ్య మేత దాఖ్యేయ మానన్దకరం శివస్య |

ఇదం మహాపాతకహృ న్నరాణా మప్యక్షయం వేదవిదో వదన్తి. 30

న బన్ధుపుత్త్రై ర్న బలై ర్వియుక్తః పత్నీభి రానన్దకర స్సురాణామ్‌ |

నాభ్యేతి రోగం నచ శోచ్యదుఃఖం యా చాథ నారీ కురుతే7తిభక్త్యా. 31

ఇదం వసిష్ఠేన పురా7ర్జునేన కృతం కుబేరేణ పురన్దరేణ |

యత్కీ ర్తనాద ప్యఖిలాని నాశ మాయాన్తి పాపాని న సంశయో7త్ర. 32

ఇతి పఠతి శృణోతి వా య ఇత్థం రవిశయనం పురుహూతవల్లభ స్స్యాత్‌ |

అపినరకగతా న్పితౄ నశేషా నపి దివ మానయతీహ యః కరోతి. 33

ఇతి శ్రీమత్స్య మహాపురాణ మత్స్యమనుసంవాదా న్తర్గతేశ్వరనారదసంవాదే ఆదిత్యశయనవ్రత కథనం నామ పఞ్చపఞ్చాశో7ధ్యాయః.

ఈ వ్రతమును నాస్తికుడు కుతర్క దుష్టుడు నిందకుడు అగువానికి చెప్పరాదు. ఇది విని వాడింకను అధిక నింద చేయును. ఇంద్రియ నిగ్రహము కల భక్తునకు చెప్పవలెను. ఇది శివున కానందకరము; పాతకహరము; అక్షయ పుణ్యప్రదము. దీని నాచరించిన స్త్రీకిని పురుషునకును బంధుపుత్త్ర పరివారములు దేవతాప్రీతి లభించును. రోగ శోక దుఃఖములు కలుగవు. దీనిని పూర్వము వసిష్ఠుడు అర్జునుడు కుబేరుడుఉ ఇంద్రుడు చేసిరి. దీనిని కీర్తించినను పాపములు నశించును. దీనిని చదివినను వినినను ఇంద్రుడు ప్రీతి చెందును. ఆచరించినచో వాని పితరులు నరకము లందున్నను స్వర్గమునకు పోయి సుఖింతురు.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున ఆదిత్యశ యన వ్రతమను ఏబదియైదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters