Sri Matsya Mahapuranam-1    Chapters   

పంచాశో7ధ్యాయః.

అజామీఢవంశ వర్ణనమ్‌.

సూత ః : అజామీఢస్య నీలిన్యాం నీల స్సమభవ త్సుతః | నీలస్య తపసోగ్రేణ సుశాన్తి రుదపద్యత. 1

పురజిచ్చ సుశాన్తేస్తు పృథుశ్చ పురజి త్సుతః | భద్రాశ్వః పృథుదాయాదో భద్రాశ్వతనయా న్ఛృణు. 2

ముద్గలశ్చ జయశ్చైవ వారాహశ్చ వృథుస్తథా | యవీయా నతివిక్రాన్తః కపిలశ్చైవ పఞ్చమః. 3

పఞ్చానాం చైవ పఞ్చాలా స్తేషాం జనపదా స్స్మృతాః |

పఞ్చానాం రక్షిణో హ్యేతే దేశానామితి న శ్ర్శుతమ్‌. 4

ముద్గలస్యాపి మౌద్గల్యాః క్షత్త్రోపేతా ద్విజాతయః | ఏతే హ్యఙ్గిరసః పక్షే సంస్థితాః కణ్వముద్గలాః. 5

ముద్గలస్య సుతో జజ్ఞే బ్రహ్మిష్ఠ స్సుమహాయశాః | ఇన్ద్రసే నాహ్వయ స్తస్య వన్ధ్యాశ్వ స్తస్య చాత్మజ;. 6

వన్ధ్యాశ్వాన్మిథునం జజ్ఞే మేనకాయా మితి శ్రుతిః | దివోదాసస్తు రాజర్షి రహల్యా చ యశస్వినీ. 7

శరద్వతస్తు దాయాద మహల్యా సంప్రసూయత | శతానన్ద మృషిశ్రేష్ఠం తస్యాపి సుమహాతపాః. 8

తస్య సత్యధృతి ర్నామ ధనుర్వేదస్య పారగః | ఆసీ త్సత్యధృతే శ్శుక్ల మమోఘం ధార్మికస్య తు. 9

స్కన్నం రేత స్సత్యధృతే ర్దృష్ట్వా చాప్సరసం జలే|

మిథునం తత్ర సఞ్జజ్ఞే తస్మి న్త్సరసి సంశ్రితమ్‌. 10

తత స్సరసి తస్మింస్తు క్రమమాణం మహీపతిః | దృష్ట్యా జగ్రాహ కృపయా శన్తను ర్మృగయాగతః. 11

ఏతే శరద్వతః పుత్త్రా ఔచథ్యా గౌతమాః పరే | అత ఊర్ధ్వం ప్రవక్ష్యామి దివోదాసస్యవై ప్రజాః. 12

దివోదాసస న్తతిః.

దివోదాసస్య దాయాదో ధర్మో మిత్రాయతి ర్నృపః | మైత్రాయణావరస్సోపి మైత్రేయస్తు తత స్స్యృతః.

ఏతే వంశధృతో దక్షాః క్షత్త్రభేదాస్తుత భార్గవాః| రాజా చైత్యవరో నామ మైత్రేయస్య సుత స్మ్సృతః. 14

అథ చైత్యవరా ద్విద్వాస్త్సుదాస స్తస్య చాత్మజః |

ఏబదియవ అధ్యాయము

పూరు వంశమున అజామీఢ - దివోదాస - చైద్య - శంతను వంశములును

భవిష్యద్రాజ వంశములును

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పసాగెనుః అజామీఢునకు నీలినియందు నీలుడు అతనికి మహా తపఃఫలముగా సుశాన్తి అతనికి పురజిత్‌ అతనికి పృథుడు అతనికి భద్రాశ్యుడు అతనికి ముద్గలుడు జయుడు వారాహుడు పృథుడు కపిలుడు కలిగిరి. వీరు ఐదుగురు ఐదు భాగములుగా నున్న పంచాల జనపదములకు పాలకు లయిరి. వీరిలో ముద్గలునకు మౌద్గల్యులు అను పేర ప్రసిద్ధులయిన క్షత్త్రధర్ములగు బ్రాహ్మణులు కుమారులై వంశవృద్ధి చేసిరి. వీరు సంవృతాంగి రసుని వంశమునందలి కాణ్వాయనుల కోవలోనివారై కణ్వ ముద్గలు లనబడిరి. ముద్గలునకు బ్రహ్మత త్వవేత్తలలో ఉత్తముడును మహాయశుడును నగు ఇంద్రసేనుడు అతనికి వంధ్యాశ్వుడు అతనికి మేనకయందు దివోదాసుడను రాజర్షియ యశస్వినియగు అహల్యయునను కవలు కలిగిరి. అహల్యకు శరద్వంతునివలన ఋషిశ్రేష్ఠుడగు శతానందుడు అతనికి సుమహాతపుడు అతనికి ధనుర్వేదపారగుడగు సత్యధృతి కలిగిరి. ధార్మికుడు అమోఘ రేతస్కుడునగు అతడు జలమునందుండి ఒక అచ్చరను చూడగా అతని రేతస్సు స్కన్నమయి ఆ సరస్సునందు పడెను. దానియందే ఆ రేతస్సువలన ఒక స్త్రీ శిశువును ఒక పురుష శిశువును జనించిరి. వేటకు వచ్చిన శంతనుడు ఆ పరిసరములందు తిరుగుచు అచట నడయాడుచున్న ఆ శిశువుల జంటను కృపతో తీసుకొని కాపాడెను. (వీరే కృపుడు - కృపి - ద్రోణుని భార్య - అనువారు.) దివోదాసునకు మిత్రాయతి - మైత్రాయణుడు అనువారు వారిలో మిత్రాయతికి మైత్రేయుడు అతనికి చైత్యవరుడు అతనికి సుదాసుడు కలిగిరి.

అజామీఢా త్పున ర్జాతః క్షణ వంశే తు సోమకః. 15

సోమకస్య సుతో జన్తు ర్హతే తస్మి స్ఛతంబభౌ ః పుత్త్రాణా మాజమీఢస్య సోమకస్య మహాత్మనః. 16

మహిషీ త్వాజమీఢస్య ధూమినీ పుత్త్రగృద్ధినీ | పుత్త్రాభావే తప స్తప్త్వా శతవర్షాణి దుశ్చరమ్‌. 17

హుత్వా7గ్నిం విధివ త్సమ్య క్పవిత్రీకృతభోజనా | అగ్ని హోత్రకు శేష్వేవ సుష్వాప సుమహావ్రతా. 18

తస్యాం విధూతపాపాయా మాజమీఢ స్సమేయివా9 | క్షత్త్రం సఞ్జనయామాస ధూమవర్ణం శతాగ్రజమ్‌. 19

ఋషి స్సంవరణో జజ్ఞే కురు స్సంవరణా త్తతః | యః ప్రయాగ మతిక్రమ్య కురుక్షేత్ర మకల్పయత్‌. 20

కృషై#్యవ తు మహారాజో వర్షాణి సుబహూ స్యథ | కృష్యమాణ సత్త శ్శక్రః «తత స్తసై#్మ వరం దదౌ.

పుణ్యం చ రమణీయం చ కురుక్షేత్రం చ తత్స్మృతమ్‌|

తస్యాన్వవాయ స్సు మహాన్యస్య నామ్నా తు కౌరవాః. 22

_________________________________________

*భయాత్తసై#్మ

కురోస్తు దయితాః పుత్త్రా స్సుధన్వా జఘ్ను రేవ చ | పరిక్షిచ్చ మహాతేజాః ప్రజన శ్చారి మర్దనః. 23

సుధన్వనస్తు దాయాదః పుత్త్రో మతిమతాం వరః | చ్యవన స్తస్య పుత్త్రస్తు రాజా ధర్మార్థతత్త్వవిత్‌. 24

త్యాగశీలః క్రిమి ర్నామ ఈష్టే యజ్ఞా స్మహాతపాః |

క్రిమేః పుత్త్రో మహావీర్యః ఖ్యాత ఇన్ద్రసమో విభుః. 25

చైద్యోపరిచరో వీరో వసుర్నా మాన్తరిక్షగః | చై ద్యోపరిచరా జ్జజ్ఞే గిరికా సప్త వై సుతా9. 26

చైద్యవంశః.

మహారథో మగధరా డ్విశ్రుతో యో బృహద్రథః | పుత్రశ్రవాః కుశ##శ్చైవ చతుర్థో హరివాహనః. 27

పఞ్చమశ్చ యజుశ్చైవ మత్స్యః కాలస్తు సప్తమః | బృహద్రథస్య దాయాదః కుశాగ్రో నామ వీర్య వా9.

కుశాగ్రస్యాత్మజశ్చైవ వృషభో నామ విశ్రుతః | వృషభస్య తు దాయాదః పుష్పవా న్నామ పార్థివః. 29

పుష్పఃపుష్పవతశ్చైవ రాజా సత్యధృతి స్మ్సృతః | సుధన్వా తస్య దాయాద స్తస్మా త్సర్వశ్చ జజ్ఞివా9.

సర్వస్య భువనః పుత్త్ర స్తస్మా జ్జజ్ఞే బృహద్రథః | ద్వే తస్య శకలే కాలే (జాతే) జరయా సన్ధితశ్చ సః. 31

జరయా సన్ధితో యస్మా జ్జరాసన్ధస్తు స స్మృతః | జేతా స సర్వక్షత్తృస్య జరాసన్ధో మహాబలః. 32

జరాసన్ధస్య పుత్త్రస్తు సహదేవః ప్రతాపవాన్‌| సహదేవాత్మజ శ్ర్శీమా న్త్సోమవి త్సుమహాయశాః. 33

శ్రుతశ్రవా స్సోమవిదో మాగధాః పరికీర్తితాః |

సుదాసునకు సంతతిలేక వంశము క్షీణించు సమయమున అజమీఢునకు సోమకుడను కుమారుడు కలిగెను. అతనికి జంతుడు అను కుమారుడు కలిగి సంతతి లేకయే హతుడయ్యెను. ఇట్టి స్థితిలో మరల సోమకునకు నూటొక్క మంది కుమారులు కలిగిరి. అది ఎట్లు జరిగెననగా - ఆజమీఢుడు (అజమీఢుని కుమారుడు) అగు ఈ సోమకుని భార్య పేరు కూడా ధూమిని. ఈమె తనకు సంతానము లేకపోయినందున మరల సంతానముపై వాంఛ కలిగినదయి నూరు సంవత్సరముల పాటు దుశ్చరమగు తపస్సాచరించెను. విధానము ననుసరించి అగ్నిని వేల్చెను. పవిత్రమగు హవిష్యా ద్యాహారమునే తినెను. ఉత్తమములగు వ్రతముల నియమముల పాటించుచు అగ్నిహోత్రమునకు అమర్చిన (వేదిక చుట్టునున్న) దర్భలయందే నిద్రించెను. ఇట్లామె విధూతపాప ( పాపములను దూరము చేసికొన్నది) కాగా అట్టి ఆమెతో సంగమించిన ఈ ఆజమీఢుడగు సోమకునకు అమెయందు మొదట ధూమవర్ణుడగు కుమారుడు కలిగెను. ఆ పొగ రంగుతో తన తేజము ఆ(సం)వరింపబడినందున ఆ క్షత్త్ర ఋషి సంవరణుడనబడెను. ఆ తరువాత ఈ సంవరణునకు సోదరులుగా సోమకునకు మరి నూరుమంది కుమారులు కలిగిరి. సంవరణుని కుమారుడు కరువు. ఈ కురుపు తమ పూర్వ రాజధానియగు ప్రతిష్టానము (ప్రయాగ) దాటి కురుక్షేత్రము వరకు రాజ్యము విస్తరింపజేసెను. ఎట్లన - అతడు అనేక సంవత్సరములపాటు తాను సేద్యముచేసి ఆ ప్రదేశమును పంట పొలమునుగా చేసెను. అందుచే దానికి కురుక్షేత్రము(కురురాజు చేసిన పంటచేను) అను పేరు వచ్చెను. పంటకు అనుకూలముకాని భూమిని తన కృషిచే పంట పొలముగా మార్చుటకతడు చేసిన యత్నమునకు మెచ్చి ఇంద్రుడు ఆ ప్రదేశము పుణ్యమును రమణీయమునగునట్లు వరమునిచ్చెను. అతనిబట్టి ఆ వంశము చాలా గొప్పది. కావుననే ఆ వంశమువారికి కౌరవులను పేరు వచ్చెను. అతనికి సుధన్వన్‌ జఘ్ను (హ్ను)వు పరీక్షిత్‌ ప్రజనుడు అనువారు కలిగిరి. సుధన్వునకు మతిమంతులలో శ్రేష్ఠుడు చ్యవనుడు అతనికి ధర్మార్థ తత్త్వవేత్తయు త్యాగశీలుడును మహాతపస్వియు యజ్ఞకర్తయు అగు 'క్రిమి' అతనికి ఇంద్రసముడు మహావీర్యుడు సమర్థుడు అంతరిక్షమునందు పయనించువాడు అగుటచే ఉపరిచరుడు అనబడు వసువనునతడు కుమారుడయ్యెను. ఇతడు చేది దేశరాజు కనుక చైద్యుడు. అతనికి గిరికయందు మహారథుడై మగధరాజుగా ప్రసిద్ధుడైన బృహద్రథుడు పుత్త్రశ్రవసుడు కుశుడు హరివాహనుడు యజువు మత్స్యుడు కాలుడు అను ఏడుగురు కుమారులు కలిగిరి.

వారిలో బృహద్రథునకు కుశాగ్రుడు అతనికి వృషభుడు అతనికి పుష్పవాన్‌ అతనికి పుష్పుడు అతనికి సత్యధృతి అతనికి సుధన్వుడు అతనికి సర్వుడు అతనికి భువనుడు అతనికి బృహద్రథుడు అతనికి అతని భార్యలయందు జనించిన రెండు శకలములను 'జర' అనునామె సంధించుటచే కలిగిన జరాసంధుడు కలిగిరి. ఇతడు మహాబలుడై సర్వక్షత్త్రి యవిజేత యయ్యెను. అతనికి సహదేవుడు అతనికి సోమవిత్‌ అతనికి శ్రుతశ్రవుడు కుమారులయిరి. ఇది మాగధుల వంశము.

యజు స్త్వజనయ త్పుత్త్రం సురథం నామ పార్థివమ్‌. 34

సురథస్యతు దాయాదో వీరో రాజా విడూరథః | విడూరథసుతశ్చాపి సార్వభౌమ ఇతి స్మృతః. 35

­ సార్వభౌమా జ్జయత్సేనో రజత స్తస్య చాత్మజః |

¡ రజతస్య మహాభౌమ స్త్వయుతాయు స్తతో7భవత్‌. 36

అక్రోధనో7యుతాయోశ్చ తస్మా ద్దేవాతిథి స్మ్సృతః | దేవాతిథేస్తు దాయాదో దక్ష ఏవ బభూవ హ. 37

దక్షా జ్జజ్ఞే భీమ సేనో దిలీప స్తస్య చాత్మజః | దిలీపస్య ప్రదీపస్తు తస్య పుత్త్రా స్త్రయ స్మ్సృతాః. 38

దేవాపి శ్శన్తను శ్చైవ బాహ్లీకశ్చేతి తే తథా | బాహ్లీకస్య చ దాయాదా స్సప్త బాహ్లీశ్వరా స్మ్సృతాః. 39

దేవాపిస్తు హ్యపధ్యాతః ప్రజాభి రభవన్మునిః | ఋషయః : ప్రజాభిస్స కిమర్థం వై అపధ్యాతో నృపాత్మజః. కో దోషో రాజపుత్త్రస్య ప్రజాభి స్సముదాహృతః |

సూతః : కిలాసీ రాజపుత్త్రస్తు కుష్ఠీతం నాభ్య పూజయ&. 41

కార్యే వై తత్ర దేవానాం క్షత్రం ప్రతి ద్విజోత్తమాః | భవిష్యం కీర్తయిష్యామి శన్తనోస్తు నిబోధత. 42

శన్తను స్త్వభవ ద్రాజా విద్వాంసో వై మహాభిషక్‌ | ఇమం చోదాహర న్త్యత్ర శ్లోకం ప్రతి మహాభిషక్‌. 43

యం యం కరేణ స్పృశతి జీర్ణం రోగిణ మేవ వా | పున ర్యువా చ భవతి తస్మా త్తం శన్తనుం విదుః.

శన్తనువంశః.

ఏతదర్థం శన్తనుత్వం ప్రజాభి రిహ కీర్తితమ్‌ | తతో7వృణో త్స భార్యార్థం శన్తను ర్జాహ్నవీం నృపః.

తస్యాం దేవవ్రతం నామ కుమారం జనయ ద్విభుః | కాలీ విచిత్రవీర్యం తు దా శేయా7జనయ త్సుతమ్‌.

శన్తనోర్దయితం పుత్త్రం శాన్తాత్మాన మకల్మషమ్‌ | కృష్ణద్వైపాయనశ్చైవ క్షేత్రే వైచిత్ర వీర్యకే. 47

ధృతరాష్ట్రం చ పాణ్డుం చ విదురం చాప్యజీజనత్‌ |

ఉపరిచరవసు కుమారులలో ఐదవవాడగు యజువునకు సురథుడు అతనికి విదూరథుడు అతనికి సార్వభౌముడు అతనికి జయత్సేనుడు అతనికి రజతుడు అతనికి మహాభౌముడు అతనికి అయుతాయువు అతనికి అక్రోధనుడు అతనికి దేవాతిథి అతనికి దక్షుడు అతనికి భీమసేనుడు అతనికి దిలీపుడు అతనికి ప్రదీపుడు అతనికి దేవాపిశంతను బాహ్లికులను ముగ్గురు కుమారులు కలిగిరి. వీరిలో బాహ్లీకునకు ఏడుగురు కుమారులు (బాహ్లికదేశపు రాజులు) బాహ్లికేశ్వరు లనబడిరి. దేవాపిని ప్రజలు అసహించుకొనుటచే అతడు ముని యయ్యెను.

అనగా ఋషులు సూతు నిట్లడిగిరి: ''రాజపుత్త్రుడగు ఆ దేవాపియందు ఏ దోషమున్నందున ప్రజలు అతనిని అసహించుకొనిరి?'' అనగా సూతు డిట్లనెను. అతనికి బొల్లి (తెల్ల కుష్ఠు) వ్యాధి ఉండెను. అందుచే ప్రజలు అతనిని ఆదరముతో చూడక అసహించుకొనిరి. దీనికిని క్షత్త్రియుల విషయమున దేవతలు సంకల్పించిన ఒకానొక కార్యమే హేతువయ్యెను. అందుచే మహాభిషక్‌ అనియు శంతనుడనియు బిరుదనామములు గల రెండవ రాజపుత్త్రుడు రాజయ్యెను. ఏలయన అతడు మహావిద్వాంసుడు. అతని విషయమున ఈ పురాతన శ్లోకము చెప్పుదురు. ''శిథిల శరీరుని కాని (వృద్దుని కాని) రోగిని కాని అతడు ఎవరిని తన చేతితో తాకునో అతడు మరల యువకుడు అగును. అందుచే అతనిని ''శంతనుడు-శం-సుఖమును; తనోతి-వృద్ధి చేయువాడు-అందురు.'' అతడు జాహ్నవిని వివాహమాడగా ఆమెయం దతనికి దేవవ్రతుడను కుమారుడు కలిగెను. అతనికే పుత్త్రియగు 'కాలి'యందు శంతనునకు ప్రీతిపాత్రుడు శాంతాత్ముడు ఆకల్మషుడు నగు విచిత్రవీర్యుని క్షేత్రమున (భార్యలగు అంబిక-అంబాలికలయందు) ధృతరాష్ట్రుడు పాండుడు అను కుమారులను (శూద్రియందు) విదురుని కృష్ణద్వైపాయనుడు ఉత్పాదించెను.

__________________________________________

­ సార్వభౌమా జ్జయత్సేనః పచితి స్తస్య ¡ పచితేస్తు

ధృతరాష్ట్రస్తు గాన్ధార్యాం పుత్త్రాణాం జనయ చ్ఛతమ్‌. 48

తేషాం దుర్యోధనో జేష్ఠ స్సర్వక్షత్త్రస్య స ప్రభుః |

మాద్రీ రాజ్ఞః పృథా చైవ పాణ్డో ర్భార్యే బభూవతుః. 49

దేవదత్తా స్సుతాః పఞ్చ పాణ్డో రర్థే తు జజ్ఞిరే | ధర్మా ద్యుధిష్ఠిరో జజ్ఞే వాతా జ్జాతో వృకోదరః. 50

ఇన్ద్రా ద్దనఞ్జయశ్చైవ శక్రతుల్యపరాక్రమః | విఖ్యాతౌ వై సుతౌ మాద్రీ సుషువే ద్విజసత్తమాః. 51

నకులం సహదేవం చ మాద్య్రశ్విభ్యా మసూయత | పఞ్చైవ పాణ్డవేభ్యస్తు ద్రౌపద్యాం జజ్ఞిరే సుతాః 52

ద్రౌపద్యజనయ జ్యేష్ఠం ప్రతివిన్ద్యం యుధిష్ఠిరాత్‌ | శ్రుతసేనం భీమసేనా చ్ఛతకీర్తిం ధనఞ్జయాత్‌. 53

చతుర్థం శ్రుతవర్మాణం నకులా త్సమ్ప్రసూయత | సహదేవా చ్ఛతానీకం ద్రౌపదేయాః ప్రకీ ర్తితాః 54

తేభ్యః పరే పాణ్డవేయా ష్షడేవాన్యే మహారథాః | హైడిమ్బో భీమసేనస్య పుత్త్రో జజ్ఞే ఘటోత్కచః. 55

సుభద్రాయాం తథా పార్థా దభిమన్యు రజాయత | ¸°ధేయం దేవకీ చైవ పుత్త్రం లేభే యుధిష్ఠిరాత్‌. 56

కాశ్యా జలధరా భీమా జ్జజ్ఞే వై సర్వగం సుతమ్‌ | సుహోత్రం తనయం మాద్రీ సహదేవా త్ప్రసూయత.

కరేణుమత్యాం చైద్యాయాం నిరమిత్రస్తు నాకులిః | అభిమన్యోః పరీక్షిత్తు పుత్త్రః పరపురఞ్జయః. 58

జనమేజయః పరీక్షితః పుత్త్రః పరమధార్మికః | బ్రహ్మాణం కారయామాస మఖే వాజసనేయకమ్‌. 59

స వైశ మ్పాయనేనైవ శప్తః కిల మహర్షిణా | న స్థాస్యతీహ దుర్బుద్ధే తవైవ వచనం భువి. 60

యావ త్థ్సాస్యతి లోకే త్వం తావదేవ ప్రవత్స్యసి | క్షత్త్రస్య విజయం జ్ఞాత్వా తతః ప్రభృతి సర్వశః.

అభిగమ్య స్థితాశ్చైవం నృపం చ జనమేజయమ్‌ | తతః ప్రభృతి శాపేన క్షత్త్రియస్య తు యాజినః. 62

క్షత్త్రస్య యాజినః కేచి చ్ఛాపా త్తస్య మహాత్మనః | పౌర్ణమాసేన హవిషా ఈజే తస్మి న్ర్పజాపతిమ్‌. 63

స వైశమ్పాయనేనైవ ప్రవిశ న్వారిత స్తతః | పరీక్షిత స్సుత స్సో వై పౌరవో జనమేజయః. 64

ద్వి రశ్వమేధ మాహృత్య మహావాజసనేయకః | ప్రవర్తయిత్వా తత్సర్వ మృషి ర్వాజసనేయకమ్‌. 65

వివాదే బ్రహ్మణా సార్ధ మభిశప్తో వనం య¸° | జనమేజయా చ్ఛతానీక స్తస్మా జ్జజ్ఞే సువీర్యవా&. 66

తత స్తం వై శతానీకం పుత్త్రం రాజ్యే7భ్యషేచయత్‌ | అథాశ్వమేధేన తత శ్శతానీకస్య వీర్యవా&. 67

జజ్ఞే7ధిసీమకృష్ణాఖ్య స్సామ్ర్పతం యో మహాయశాః |

తస్మి& శాసతి రాజ్యం తు యుష్మాభి రిద మాహృతమ్‌. 68

దుష్కరం దీర్ఘసత్రం వై త్రీణి వర్షాణి పుష్కరే | వర్షద్వయం కురుక్షేత్రే దృషద్వత్యాం ద్విజోత్తమాః.

ధృతరాష్ట్రునకు గాంధారియందు దుర్యోధనాదులు నూరుగురును పాండునకు పృథ(కుంతి)యందు ధర్మవాయు దేవేంద్రులవలన యుధిష్ఠిర భీమార్జునులు మాద్రియందు అశ్విదేవుల వలన నకులసహదేవులు కుమారులయిరి. ఈ ఐదుగురికి ద్రౌపదియందు వరుసగా ప్రతివింద్య శ్రుతసేన శతకీ ర్తి శ్రుతవర్మ శతానీకులు కలిగిరి. వీరుకాక ధర్మజునకు దేవకి అను నామెయందు ¸°ధేయుడు భీమునకు హిడింబయందు ఘటోత్కచుడు కాశీరాజ పుత్త్రియగు జలధరయందు సర్వగుడు అర్జునునకు సుభద్రయం దభిమన్యుడు నకులునకు చేదిరాజ పుత్త్రియగు కరేణుమతియందు నిరమిత్రుడు సహదేవునకు మాద్రి అను నామె యందు సుహోత్రుడు కుమారులయిరి. అభిమన్యునకు శత్రుధనవిజేతయగు పరీక్షిత్‌ అతనికి పరమ ధార్మికుడగు జనమేజయుడు కలిగిరి.

జనమేజయుడు ఒక యజ్ఞములో *వాజసనేయియగు బ్రాహ్మణుని బ్రహ్మగా వరించెను. అది చూచి సహించక వైశంపాయన మహర్షి జనమేజయుని నిట్లు శపించెను: ''దుర్బుద్ధీ! నీ మాట ఈ లోకమునందు (నీ దేశమునందే) చెల్లక పోవుగాక! నీవు ఈ లోకమున జీవించియుండగనే దేశము విడిచి ప్రవాసమునకు పోదువుగాక!'' అని మరియు జనమే జయునకు యజ్ఞాధికారములేదని అతనిని యజ్ఞములు చేయవలదని వైంశపాయనుడు వారించెను. ఈతనికి యాజులు (యజ్ఞములు చేయించినవారు) నశింతురనియు అతడు శపించెను. అయినను రాజిది లెక్క పెట్టలేదు. ఇందు క్షత్త్రియుడే గెలిచెనని కొందరు బ్రాహ్మణులు అతని నాశ్రయించి యుండిరి. కొందరు వైశంపాయన శాపమున నశించిరి. జనమేజయుడును పౌర్ణమాసేష్టితో ప్రజాపతిని (యజ్ఞేశ్వరుని) ఆరాధించెను. తరువాత నాతడు వాజసనేయక విధానముతోనే రెండుమారులు అశ్వమేధయాగము చేసెను. మహావాజసనేయు డనుకీ ర్తి పొందెను. కాని వైంశపాయనుతోడి వాదమున అతనిచే అభిశప్తుడై బ్రహ్మగా తన యజ్ఞములందుండిన వాజసనేయ బ్రాహ్మణునితో కలిసి అడవులకు పోయెను. జనమేజయుని కుమారుడు శతానీకుడు. అతడు మహావీర్యవంతుడు. జనమేజయుడు అతనిని రాజ్యమునందభిషేకించెను. శతానీకుడు చేసిన అశ్వమేధయాగ ఫలముగా అతనికి అధిసీమ కృష్ణుడను కుమారుడు కలిగెను. ఇప్పుడు అతడు పాలన సేయుచున్నాడు. అతని పాలన కాలములోనే మీరీ దుష్కరమగు దీర్ఝసత్రయాగము చేయుచున్నారు. ఇప్పటికిది మూడు సంవత్సరములు పుష్కర క్షేత్రమున జరిగినది. రెండేండ్లపాటు కురుక్షేత్రమున దృషద్వతీనదీ తీరమున జరిగినది. (ప్రస్తుతము నైమిశారణ్యమున జరుగుచున్నది.)

భవిష్యద్రాజకథనమ్‌.

ఋషయః : * భవిష్య చ్ర్ఛోతు మిచ్ఛామో భవతో రోమహర్షణ |

పురా కిల యదేతద్వై వ్యతీతం కీర్తితం త్వయా. 70

యేషు వై స్థాస్యతి క్షత్త్ర ముత్పత్స్యన్తే నృపాశ్చ యే |

తేషా మాయుః ప్రమాణంచ నామత శ్చైవ తా న్నృపా&. 71

కాలం యుగప్రమాణం చ యుగదోషా న్యుగక్షయమ్‌| సుఖదుఃఖం యుగస్యాస్య ధర్మాధర్మ విచేష్టితమ్‌. 72

ఏతత్సర్వం ప్రసఙ్ఖ్యాయ పృచ్ఛతాం బ్రూహి నః ప్రభో |

సూతః : యథా మే కీర్తితం పూర్వం వ్యాసే నాక్లిష్టకర్మణా. 73

భావ్యం కలియుగం చైవ తథా మన్వన్తరాణి చ | అనాగతాని సర్వాణి బ్రువతో మే నిబోధత. 74

అత ఊర్ధ్వం ప్రవక్ష్యామి భావినో యే నృపా స్తథా | ఇక్ష్వాకో రన్వయే చైవ పౌరవే చాన్వయే చ యే. 75

యేషు సంస్థాస్యతే తద్వ ద్య దిక్ష్వాకుకులం స్మృతమ్‌| తా న్త్సర్వా న్కీర్తయిష్యామి భవిష్యే కథితా న్నృపాన్‌.

తేభ్యో7పరే యే7ప్యన్యే చ ఉత్పత్స్యన్తే నృపాః పునః |

క్షత్త్రియాః పౌరవా శ్శూద్రాస్తథా7న్యే తు బహిశ్చరాః. 77

ఆన్ధ్రాః పౌణ్డ్రాః కళిఙ్గాశ్చ చూళికా యవనా స్తథా | కైవర్తాభీరశబరా యేచాన్యే వ్లుెచ్ఛజాతయః. 78

పర్యాయతః ప్రవక్ష్యామి నామతశ్చైవ తా న్నృపా& | అధిసీమకృష్ణో యశ్చైషాం ప్రథమం వ ర్తతే నృపః.

తస్యాన్వవాయే వక్ష్యామి భవిష్యా న్కథితా న్నృపా& | అధిసీమకృష్ణపుత్త్రస్తు lవిచక్షు ర్భవితా నృపః.

గఙ్గయాతు హృతే తస్మి న్నగరే నాగసాహ్వయే |

¡ త్యక్త్వా విచక్షు ర్నగరం కౌసు(శా)మ్బ్యాం తు నివత్స్యతి. 81

___________________________________________

* భవిష్యంశ్రోతుమిచ్ఛామః ప్రజానాం l నృచకో భవితా ¡ నృచకో నగరం త్యక్త్వా

« శుక్లయజుశ్శాఖీయులను వాజసనేయులు అందురు.

భూరిశ్రేష్ఠ స్సుత స్తస్య తత శ్చిత్రరథ స్మ్సృతః | భవిష్యా7ష్టౌ సుతా స్తస్య మహాబలపరాక్రమాః. 82

శుచిద్రథ శ్చిత్రరథా ద్వృష్టిమాంశ్చ శుచిద్రథాత్‌ | వృష్టిమత స్సు షేణశ్చ భవిష్యతి పున ర్నృపః. 83

తస్మా త్సుషేణా ద్భవితా సునీథో నామ పార్థివః | నృపాత్సునీథా ద్భవితా ¸నృచక్షు స్సుమహాయశాః. 84

నృచక్షుషస్తు దాయాదో భవితా వై సుఖీలవః | సుఖీలవసుతశ్చాపి భావీ రాజా పరిప్లవః. 85

పరిప్లవసుతశ్చాపి భవితా సుతపా నృపః మేధావీ తస్య దాయాదో భవిష్యతి నృపస్య తు. 86

మేధావిన స్సుత శ్చాపి భవిష్యతి పురఞ్జయః | కురుభావ్య స్సుత స్తస్య నిర్మమ స్తస్య చాత్మజః. 87

బృహద్రథో నిర్మమాద్వై వసుధామో బృహద్రథాత్‌ | వసుధామా చ్ఛతానీకో భవిష్యోదయన స్తతః. 88

భవిష్యోదయనా ద్వీరో రాజా భావీ మహీనరః | మహీనరాత్మజశ్చైవ దణ్డపాణి ర్భవిప్యతి. 89

దణ్డపాణ ర్నిరామిత్రో నిరామిత్రాత్తు క్షేమకః | అస్యానువంశశ్లోకోయం గీతో విపై#్రః పురాతనైః. 90

బ్రహ్మక్షత్త్రస్య యా యోని ర్వంశో దేవర్షి సత్కృతః |

క్షేమకం ప్రాప్య రాజానం సంస్థాస్యతి స వై కలౌ. 91

ఇత్యేష పౌరవో వంశో యథావ దిహ కీర్తితః | ధీమతః పాణ్డుపుత్త్రస్య అర్జునస్య మహాత్మనః. 92

ఇతి శ్రీమత్స్యమహాపురాణ చన్ద్రవంశానువర్ణనే పూరువం

శానుకీర్తనంనామ పఞ్చాశో7ధ్యాయః.

చన్ద్రవంశ స్సమాప్తః.

ఇది విని ఋషులు సూతునిట్లడిగిరి: ''రోమహర్షణా! నీవు ఇంతవరకును గడచిన వృత్తాంతములు చెప్పితివి. ఇకమీదట భవిష్యద్వృత్తాంతములను నీనుండి వినగోరుచున్నాము. ఇకమీదట క్షత్త్ర ధర్మము ఎవరియందు నిలుచును? కాబోవు రాజులెవ్వరు? వారి ఆయుఃప్రమాణము వారి పేరులు కాలము-యుగ ప్రమాణము యుగదోషములు యుగ క్షయము యుగములందలి సుఖదుఃఖ ధర్మాధర్మములు విచేష్టితములు ఇవి అన్నియు మాకు చెప్పవేడుచున్నాము.''

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పనారంభించెను: అద్భుతములను చేయగల మహానుభావుడు వ్యాసుడు నాకు చెప్పియున్న విధమున ఇక రాబోవుచున్న కలియుగమును మన్వంతరములను రానున్న విషయములను తెలిపెదను. ఇక్ష్వాకు పూరు వంశములందు రాబోవు రాజులను వీరుకాక ఆంధ్ర పౌండ్ర కళింగ «చూళిక యవన కైవర్తాభీర శబరులు ఇతర వ్లుెచ్ఛ జాతుల రాజులు ఈ మొదలగు శూద్ర జాతీయులు భారతదేశమునకు బయటినుండి వచ్చి ఈ దేశమును ఏలనున్న రాజులను క్రమమున పేర్కొందును. వినుడు.

ఇపుడు (ఈ పురాణ కథాకాలమున) పాలించుచున్న అధిసీమ కృష్ణునకు విచక్షుడు కుమారుడయి పాలనచేయును. అతని కాలమున హస్తినాపురము గంగలో కొట్టుకొనిపోగా అతడు కౌసుం (శాం) బిని రాజధానిగా చేసి కొనును. అతనికి భూరిశ్రేష్ఠుడు అతనికి చిత్రరథుడు అతని ఎనిమిదిమంది కుమారులలో శుచిద్రథునకు వృష్టిమాన్‌ అతనికి సుషేణుడు అతనికి సునీథుడు అతనికి నృచక్షుడు అతనికి సుఖీలవుడు అతనికి పరిప్లవుడు అతనికి సుతపుడు అతనికి మేధావి అతనికి పురంజయుడు అతనికి కురుభావ్యుడు అతనికి నిర్మముడు అతనికి బృహద్రథుడు అతనికి వసుధాముడు అతనికి శతానీకుడు అతనికి భవిష్యోదయనుడు అతనికి మహీనరుడు అతనికి దండపాణి అతనికి నిరామిత్రుడు అతనికి క్షేమకుడు కుమారులగుదురు.

__________________________________________

¸ నృచక్రస్సు

« చూళికులు-పఠానులలో ఒక తెగవారు యవనులు-గ్రీసు టర్కీ మొదలగు దేశములవారు; కైవర్తులు-పల్లెకారులు; ఆభీరాః-అహీర్‌ అనబడు జాతివారు; శబరాః-చెంచుబోయ మొదలగు జాతులవారు.

ఈ క్షేమకుని విషయమున పురాతనులు పలికిన గీతము ఇట్లున్నది: ''దేవతులను ఋషులును సత్కరించుచుండిన బ్రహ్మక్షత్త్ర జాతుల బ్రాహ్మణుల-క్షత్త్రియుల-(బ్రాహ్మణ ధర్మమును అనుసరించి ప్రవర్తించి దానినుద్ధరించు క్షత్త్రియుల-క్షత్త్ర ధర్మమును పాటించు బ్రాహ్మణుల) ఏయోని (జన్మము) ఏవంశము (ఈ భారతదేశమున) కలదో అదియంతయు ఈ కలియుగమున క్షేమకరాజును ఆశ్రయించి వర్ధిల్లును.''

ఋషులారా! మీకు ఇట్లు ఈ పౌరవవంశ చరితమును ఉన్నది ఉన్నట్లు వివరించితిని. దీనిలో ప్రధానుడుగాను ఈ చెప్పిన వంశమునకు ఒకమూల పురుషుడుగాను నున్న మహాత్ముడు అర్జునుడు.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానువర్ణనమున పౌరవవంశానుకీర్తన మను

ఏబదియవ అధ్యాయము-చంద్రవంశ కథనము ముగిసినది.

Sri Matsya Mahapuranam-1    Chapters