Sri Matsya Mahapuranam-2    Chapters   

అష్టస ప్తత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

కనకకామధేనుదానవిధానమ్‌.

శ్రీ మత్స్యః : అథాత శ్శృణు భూపాల కామధేనువిధిం పరమ్‌| సర్వకామఫలం నృణాం మహాపాతకనాశనమ్‌. 1

లోకేవాహనం తద్వ ద్దోమః కార్యో 7ధివాసనమ్‌| తులాపురుషవత్కుర్యా

త్కుణ్డమణ్డవేదికమ్‌. 2

స్వల్పే త్యేకాగ్ని వ త్కుర్యా ద్గురేక స్సమాహితః| కాఞ్చనస్య విశుద్ధస్య ధేనుం వత్సంచ కారయేత్‌. 3

ఉత్తమా పలసాహస్రీ తదర్ధోనతు మధ్యమా| కనీయసీ తదర్ధేన కామధేనుః ప్రకీర్తితా. 4

శక్తిత స్త్రిపలాదూర్ధ్వం మశక్తో 7పీహ కారయేత్‌| వేద్యాం కృష్ణాజినం న్యస్య గుడప్రస్థసమన్వితమ్‌. 5

న్యసే దుపరి తాం ధేనుం మహారత్నై రలఙ్కృతామ్‌| కుమ్భాష్టకసమోపేతాం నానాఫలసమన్వితామ్‌. 6

తథాష్టాదశధాన్యాని సమన్తా త్పరికల్పయేత్‌| ఇక్షుదణ్డాష్టకం తద్వ న్నానాఫలసమన్వితమ్‌. 7

భాజనం చాసనం తద్వ త్తామ్పదోహనకం తథా| కౌశేయ వస్త్రద్వయం సంయుతాం గాం దీపాతపత్రాభరణాభిరామామ్‌. 8

సచామరాం కుణ్డలినీం సఘణ్డాం సువర్ణశృఙ్గీం పరి రూప్యపాదామ్‌| రసైశ్చ సర్వైః పరితో 7భిజుష్టాం హరిద్రయా పుష్పఫలై రనేకైః. 9

అజాజికుస్తుమ్బురుశర్కరాదిభి ర్వితానకం చోపరి పఞ్చవర్ణమ్‌| స్నాత స్తతో మఙ్గళ##వేదఘోషైః ప్రదక్షిణీకృత్య నపుష్పహస్తః. 10

ఆవాహయే త్తాం గురుణోక్తమన్త్రై ర్ధ్విజాయ దద్యాదథ దర్భపాణిః| త్వం సర్వదేవగయణమన్ధిర మఙ్గభూతా విశ్వేశ్వరి త్రిపథగోదధి పర్వతానామ్‌. 11

త్వద్ధానశస్త్రశకలీకృతపాతకౌఘః ప్రాప్తో 7స్మి నిర్వృతి మతీవ పరాం నమామి| లోకే యథేప్సితఫలార్థవిధాయినీం త్వా మాసాద్య కోహి భువి దుఃఖ ముపైతి మర్త్యః. 12

సంసారదుఃఖశమనాయ యతస్వ కామం త్వాం కామధేను మితి దేవగణా వదన్తి| అమన్త్రితాయ గుణశీల గుణాన్వితాయ విప్రాయ యః కనకధేను మిమాం ప్రదద్యాత్‌. 13

ప్రాప్నోతి ధామ స పురన్ధరదేవ జుష్టం కన్యాగణౖః పరివృతః పద మిన్దుమౌళేః. 13

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ మహాదానానుకీర్తనే కనక కామధేను ప్రదానికో

నామ అష్టసప్తత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

రెండు వందల డెబ్బది ఎనిమిదవ అధ్యాయము.

కనక కామధేను దాన విధానము.

శ్రీ మత్స్యడు మనువునకు ఇట్లు చెప్పెను: భూపాలా! ఇపుడిక షోడశ మహాదాన క్రమమునందలి కనక కామధేను దాన విధానమును వినుము; ఇది పరమమయినది- మానవులకు సర్వకామములను ఇచ్చునది మహాపాతక నాశనమయి నది; తులాపురుష దానమందువలెనే ఇందును కుండములు మండపము వేదికలు లోకేశావాహనము హోమము అధివాసనము జరుపవలయును; అల్ప ప్రక్రియయైనచో ఎక్కువమంది ఋత్విజులతో పనిలేక ఏకాగ్ని విధానమున ఆచార్యుడు ఒక్కడే సమాహితుడై ఆయా కార్యములు జరుపవలెను; మేలిమి బంగారుతో ఆవును దూడను చేయించవలయును ; వేయి- ఐదు వందలు- రెండు వందజల ఏబది - పలముల బంగారము దీనికై ఉపయోగించుట ఉత్తమ మధ్యమాధమ విధానములు; ఎంతో అశక్తుడైనచో మూడు పలములకు తక్కువ కాని ఎంత బంగారుతోనైన ఇవి చేయించవచ్చును; వేదికయందు కృష్ణాజిన మును పరచి ప్రస్థ పరిమాణక గుడమును దానిపై నుంచి నూతన వస్త్రము దానిపై పరచి దానిపై మహారత్నాలంకృత మగు ఆధేను వత్సముల నుంచవలయును; ఆ దగ్గరలో ఎనిమిది పూర్ణ కుంభములు నానా ఫలములు అష్టాదశ ధాన్యములు ఎనిమిది చెరకు గడలు ఆసనము పాత్రలు పాలు పితుకుటను రాగి పాత్రము రెండు పట్టు వస్త్రములు దీపములు ఛత్త్రములు ఆభరణములు చామరములు కుండలములు ఘంటలు బంగరు కొమ్ముల సొమ్ములు వె ండి కాలి గిట్టలు సర్వ విధ రసములు పసుపు- అనేక పుష్పఫలముల నుంచవలయును ;జీలకర్ర ధనియాలు చక్కెర (కలిపి చేసిన పొడి) ఉంచవలెను ; ఐదు వన్నెల వితానకమును (మేలు కట్టును) అమర్చవలయును.

తరువాత మంగళ వేదధ్వనులతో యజమానుడు స్నానమాడి అగ్న్యాదికమును బ్రహ్మణులను ధేనువత్సములను ప్రదక్షిణించి పూవులు దోసిట పట్టుకొని దర్భపాణియై గురువు చెప్పి మంత్రములతో ధేనువు నామంత్రించి తరువాత అవి విప్రునకు ఈయవలెను.

''విశ్వేశ్వరివగు కామధేనూ! నీవు సర్వదేవ గణములకు గృహ భూతురాలవు ; (నీయందు సకల దేవతలు నివసింతురు: ) గంగానదికిని సముద్రములకును పర్వతములకును నీవు అంగ(శరీర) భూతురాలవు; నిన్ను దానముచేయుట ఆయుధముగానై నాపాతకరాసులు ఖండితములు కాగా అత్యంతము ఉత్తమమగు ఆనందమును పొందుచున్నాను; ఇట్టి నిన్ను నమస్కరించుచున్నాను; యథేష్ట ఫల ప్రదాయినివి నీవుండగా ఈ భూలోకమునందలి ఏ మానవుడు దుఃఖములను పొందును ? నీవు మా సంసార దుఃఖములను శమింపజేయుటకై మిక్కిలిగ ప్రయత్నింపుము; అట్లు ప్రయత్నింతువు; కామములను తీర్తువు; కావుననే నిన్ను దేవతలు కూడ కామధేను వు అనుచున్నారు . ''

ఇట్లు ధేనువును ఆమంత్రించిన తరువాత యజమానుడు తాను మంత్రించి(ఆహ్వానించి) తెచ్చుకొన్న గుణశీల సమన్వితుడగు విప్రునకు ఈ కనక కామధేనువును దానమీయవలయును ;దాని ఫలముగా నతడు దేవకన్యా గణములతో కూడినవాడయి ఇంద్రాది దేవతలు కూడ ఆశ్రయింపగోరు శివ స్థానమును పొంది సుఖించును.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున షోడశ మహాదానాను కీర్తనమున కనక కామధేను ప్రదానికమను రెండు వందల డెబ్బది ఎనిమిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters