Sri Matsya Mahapuranam-2    Chapters   

ఏకోనసప్తత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

మండపలక్షణమ్‌.

సూతః : అథాత స్సమ్ర్పవక్ష్యామి మణ్డపానాం తు లక్షణమ్‌ | మణ్ణపప్రవరాన్వక్ష్యే ప్రాసాదస్యానురూపతః. 1

త్రివిధా మణ్డపాః కార్యా జ్యేష్ఠమధ్యకనీయసః | నామత స్తా న్ర్పవక్ష్యామి శృణుధ్వ మృషిసత్తమాః. 2

పుష్పకః పుష్పభద్రశ్చ సువ్రతో7మృతమన్థనః | కౌశల్యో బుద్ధిసఙ్కీర్ణో గజభద్రో భయావహః. 3

శ్రీవత్సో విజయశ్చైవ వాస్తుకీర్తి శ్శ్రుతింజయః | యజ్ఞభద్రో విశాలశ్చ సుశ్లిష్ట శ్శత్రుమర్దనః. 4

భాగపఞ్చో నన్దనశ్చ మానవో మానభద్రకః | సుగ్రీవో హరితశ్చైవ కర్ణికారశ్శతర్దికః. 5

సింహశ్చ శ్యామభద్రశ్చ శశకశ్చ తథైవచ | సప్తవింశతి రాఖ్యాతా లక్షణం శృణుత ద్విజాః. 6

స్తమ్భా యత్ర చతుష్షష్టిం పుష్పక స్స ఉదాహృతః | ద్విషష్టిః పుష్పభద్రస్తు షష్టి స్సువ్రత ఉచ్యతే. 7

అష్టపఞ్చాశక స్తమ్భః కథ్యతే7మృతమన్థనః | కౌశల్య ష్షట్చ పఞ్చాశ చ్చతుః పఞ్చాశతా పునః. 8

నామ్నాతు బుద్ధిసఙ్కీర్ణో ద్విహీనో గజభద్రకః | జయావహసప్తు పఞ్చాశ చ్ఛ్రీవత్స స్తద్ద్విహీనకః. 9

విజయ స్తద్విహీన స్స్యా ద్వాస్తుసఙ్కీర్తిక స్తతః | ద్వాభ్యామేవ ప్రహీయేత తతశ్శ్రుతిజయో7పరః. 10

చత్వారింశద్యజ్ఞభద్ర స్తద్విహీనో విశాలకః | షట్త్రింశ##శ్చైవ సుశ్లక్షోణ ద్విహీన శ్శత్రుమర్దనః. 11

ద్వాత్రింశ ద్భాగపఞ్చస్తు త్రింశద్భి ర్నన్దన స్స్మృతః | అష్టావిం శన్మానవస్తు మానభద్రో ద్విహీనకః. 12

చతుర్వింశస్తు సుగ్రీవో ద్వావింశో వర్షణో మతః | వింశతిః కర్ణికార స్స్యా దష్టాదశ శతర్దికః. 13

సింహో భ##వేద్ద్విహీనశ్చ శ్యామభద్రో ద్విహీనకః | సుభద్రస్తు తథా ప్రోక్తో ద్వాదశస్తమ్భ ఉచ్యతే.14

రెండు వందల అరువది తొమ్మిదవ అధ్యాయము.

మండప లక్షణము.

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: ఇంతవరకును తెలిసికొనిన దేవాలయ నిర్మాణాదికమునకును దేవతా పూజోత్సవాదులకును ఉపయుక్తము కావున ఇపుడిక మండపముల లక్షణమును తెలిపెదను; ప్రాసాద (దేవాలయ) మునకు అనురూపముగా నుండు మండపశ్రేష్ఠములను తెలిపెదను వినుడు; జ్యేష్ఠము మధ్యమము కనిష్ఠము అని మూడు విధములుగా మండప నిర్మాణము చేయవచ్చును; ఋషిసత్తములారా; వాటిని నామగ్రహణముతో మొదట తెలిపి తరువాత వాని లక్షణమును తెలిపెద వినుడు; ఇవి మొత్తము ఇరువది ఏడు విధములు; ఇవి అరుపది నాలుగు స్తంభములు మొదలు పండ్రెండు స్తంభముల వరకు రెండేసి స్తంభముల వంతున తగ్గుటతో ఏర్పడును; 1. పుష్పకము - 64 స్తంభములు కలది; 2. పుష్ప భద్రము-62 స్తం; 3. సువ్రతము-60 స్తం; 4. అమృత మంథనము-58 స్తం; 5. కౌశల్యము-56 స్తం; -. బుద్ధి సంకీర్ణము - 54 స్తం; 7. గజభద్రము - 52 స్తం; 8. జయావహము-50 స్తం; 9. శ్రీవత్సము-48 స్తం; 10 విజయము-46 స్తం; 11. వాస్తుకీర్తి-4 స్తం; 12. శ్రుతింజయము-42 స్తం; 13. యజ్ఞభద్రము-40 స్తం; 14. విశాలము-38 స్తం; 15. సుశ్లిష్టము -36 స్తం; 16. శత్రుమర్దనము-24 స్తం; 17. భాగపంచము-32 స్తం; 18. నందనము-30 స్తం; 19. మానవము-28 స్తం; 20. మానభద్రకము-26 స్తం; 21. సుగ్రీవము-24 స్తం; 22. హరితము-22 స్తం; 23. కర్ణికారము-20 స్తం; 24. శతర్ధికము-18 స్తం; 25. సింహము-16 స్తం; 26. శ్యామభద్రము-14 స్తం; 27. శశక(సుభద్ర)ము-12 స్తం.

మణ్డపాః కథితా స్తుభ్యం యథావల్లక్షణాన్వితాః | త్రికోణం వృత్తమధ్యంతు హ్యష్టకోణం ద్విరష్టకమ్‌. 15

చతుఃకోణంచ కర్తవ్యం సంస్థానం మణ్డపస్య తు | రాజ్ఞాం చ విజయం చైవ శత్రూచ్చాటన మేవచ. 16

పుత్రలాభస్త్స్రియః పుష్టి స్త్రికోణాదిక్రమా ద్భవేత్‌ | ఏవంతు శుభదః ప్రోక్తో హ్యన్యథాతు భయావహః.

చతుష్షష్టిపదం కృత్వా మధ్యే ద్వారం ప్రకల్పయేత్‌ | విస్తారాద్ద్విగుణోచ్ఛ్రాయ స్త్రిభాగాచ్చ కటిర్భవేత్‌.

విస్తారార్ధో భ##వే ద్గర్భో భిత్తయో7న్యా స్సమన్తతః | గర్భపాదేన విస్తీర్ణం ద్వారం త్రిగుణ మాయతమ్‌. 19

తథా ద్విగునవిస్తీర్ణముఖ స్తద్వ దుదుమ్బరః | విస్తారపాదప్రతిమం బాహుళ్యం శాఖయో స్మ్సృతమ్‌. 20

త్రిపఞ్చసప్తనవభి శ్వాఖాభి ర్ద్వార మిష్యతే | కనిష్ఠం మధ్యమం జ్యేష్ఠం యథాయోగం ప్రకల్పయేత్‌. 21

విస్తారా ద్ద్విగుణోచ్ఛ్రాయా చ్చత్వారింశద్భి రున్నతమ్‌ |

అఙ్గుళానాం శతం సార్ధం చత్వారింశ త్తథోన్నతమ్‌. 22

త్రింశద్వింశోత్తరం చాన్యత్‌ ధన్యముత్తమ మేవతు |

శతం చుతుర్భిః సహితం వాతన్నిర్గమనంభ##వేత్‌. 23

అధికం దశభి స్తద్వ త్తథా షోడశభి శ్శతమ్‌; | శతమానం తృతీయం తు నవత్యాశీతిభి స్తథా. 24

దశ ద్వారాణి చైతాని క్రమేణోక్తాని సర్వదా | అన్యాని వర్జనీయాని మ(మా) నసోద్వేగదాని తు. 25

ఇంతవరకును నీకు యథావత్‌గా (శాస్త్రమునందును సంప్రదాయమునందును ఉన్నవి యున్నట్లు) లక్షణము లతో కూడిన మండపములను తెలిపితిని; మండప సంస్థానము (మండప నిర్మాణమునకై సిద్ధపరచు భూప్రదేశపు ఆకృతి - The ground plan for a Mandapa) 1. త్రిభుజముగాగాని 2. వృత్తముగాగాని 3. అష్టభుజాకృతితోగాని 4. షోడశ భుజాకృతితోగాని 5. చతుర్భుజాకృతి (Square shape)తోగాని యుండవచ్చును; ఇవి వరుసగా 1. రాజులకు విజయమును 2. శత్రూచ్చాటనమును (భయపెట్టి పారదోలుట) 3. పుత్త్రలాభము 4. స్త్రీ సమృద్ధి 5. పుష్టి - కలిగించును; ఈ చెప్పిన విధములలో ఏదో యొక రూపమున నిర్మించిన మండపము శుభావహము; మరియొక విధముగ నిర్మించినది భయావహము (చూ. పుట - 293)

మండప నిర్మాణ వ్యవస్థః మండప నిర్మాణమునకై నిర్ణయించుకొనిన ప్రదేశమును (సంస్థాన భూమి పై నుండు ప్రదేశమును) చతుఃషష్టిపద రూపమున (64సమ చతురస్రములుగా) విభజించుకొనవలయును; ఇట్టి విభాగములలో నట్టనడిమి విబాగములందుండునట్లు (4-5 పదములయందుండునట్లు ద్వారమునుంచవలయును; ద్వారపు వెడలుపు ఎంతయుండునో ఆవాకిటి ఎత్తు అంతకు ద్విగుణముండవలయును; *ద్వారపు కటి (గడియ) ద్వారపు వెడల్పులో మూడవవంతు పొడవున

*మత్స్య-269 అ.కటిః గడియ (ఇది తెలుగు పదమే సంస్కృతమున చేరెనా? అనిపించు ప్రయోగము; ఇచ్చటనే 'శాఖా-చెక్క'; (తలుపులు మొదలగు వానిని ఎన్ని చెక్కలు కలిపి చేయవచ్చును? అను విషయమునకై ఇదియు తెలుగుపదమే సంస్కృతమున చేరెనా? అనిపించు ప్రయోగము.

నుండవలయును; మండపమందు మండప గర్భము ఉండును; ఇది మండపపు మొత్తము వెడల్పులో సగముండవలయును; అనగా చతుష్షష్టి పద విభజనానుసారము ఎటునుండి చూచినను 3-4-5-7 పదములలో ఏర్పడు చదరమున ఇదియుండ వలయును; ఈ మండపమునకును నాలుగువైపులను గోడలుండును; దీనికిని ముందువైపున ద్వారము గర్భపు వెడలుపుతో నుండును; ఈ ద్వారపు పొడవు (ఎత్తు) ఈ వెడలుపునకు మూడింతలుండవలయును; లేదా ఈ గర్భమండప ద్వారపు వెడల్పు ఇంతకు రెట్టింపు ఉన్నను (అనగా గర్భమండపపు వెడల్పులో సగము) ఉండవచ్చును; ఈ ద్వారపు తలుపులు మేడి కొయ్యతో చేయవలయును; ద్వారశాఖలు (నిలువుకమ్ములు) ద్వారపు వెడల్పులో నాల్గవవంతు మందముతో (వెడల్పుతో నుండవలయును; తులుపును మూడుగాని ఐదుగాని ఏడుగాని చెక్కలను కలిపి చేయవచ్చును. 1. ఇది ద్వార నిర్మాణమునందు ఒక పద్ధతి; ఇట్లుకాక జ్యేష్ఠ మధ్యమ కనిష్ఠ భేదమున - ఒక్కొక్క భేదములో మరల మూడేసి విధములతోనైన ద్వారమేర్పరచవచ్చును: ఎట్లన - 2. నూట నలువది 3 నూట ముప్పది 4. నూట ఇరువది అంగుళముల ఎత్తుతో నుండునవి జ్యేష్ఠ పరిమాణపు ద్వారములు; ఇవి ధన్యములు ఉత్తమములును; 5. నూట నాలుగు 6. నూటపది 7. నూట పదునారు అంగుళముల ఎత్తుతో నుండు ద్వారములు మధ్యమ పరిమాణక ద్వారముల వర్గములనందలివి; 8. నూరు 9. తొంబది 10. ఎనుబడి అంగుళముల ఎత్తుతో నుండు ద్వారములు మూడును కనిష్ఠ పరిమాణక ద్వారముల వర్గము నందలివి; ఈ క్రమమున చెప్పిన పది ద్వారములును సర్వదా గ్రాహ్యములు; ఇతర విధములగు కొలతలతో నుండు ద్వారములు వర్జించవలయును; ఏలయన అవి మానసోద్వేగకరములు.

ద్వారవేధం ప్రయత్నేన సర్వవాస్తుషు వర్జయేత్‌ | వృక్షకోణభ్రమిద్వారస్తమ్భకూరధ్వజాద (జైర) పి. 26

కుడ్యశ్వభ్రేణ వా విద్దం ద్వారం న శుభదం భ##వేత్‌ | క్షయశ్చ దుర్గతిశ్చైవ ప్రవాసః క్షుద్భయం తథా.

దౌర్భాగ్యం బన్ధనం రోగో దారిద్ర్యం కలహం తథా | విరోధశ్చార్థనాశశ్చ సర్వ వేదా ద్భవే త్క్రమాత్‌.

పూర్వేణ ఫలినో వృక్షాః క్షీరవృక్షాస్తు దక్షిణ | పశ్చిమేన జలం శ్రేష్ఠం పద్మోత్పలవిభూషితమ్‌. 29

ఉత్తరే సరళై స్తాలై శ్శుభా స్యా త్పుష్ప వాటికా | సర్వతస్తు జలం శ్రేష్ఠం స్థిర మస్థిర మేవ వా. 30

పార్శ్వత శ్చాపి కర్తవ్యం పరివారాలయాదికమ్‌ | యామ్యే తపోధనస్థాన ముత్తరే మాతృకాగృహమ్‌. 31

మహానసం తథాగ్నేయే నైరృత్యే7థ వినాయకమ్‌ | వారుణ శ్రీనివాసస్తు వాయవ్యే గృహమాలికా. 32

ఉత్తరే యజ్ఞశాలా తు నిర్మాల్యస్థాన ముత్తరే | వారుణ సోమదైవత్యే బలి నిర్వాపణం స్మృతమ్‌. 33

పురతో వృషభస్థానం శేషే స్యా త్కు సుమాయుధః | బలిం వాపి తథైశానే విష్ణోశ్చ జలశాయినః. 34

ఏవ మాయతనం కుర్యాత్కుణ్డమణ్డప సంయుతమ్‌ |

ఘణ్డావితానక సతోరణచిత్రయుక్తం నిత్యోత్సవ ప్రముదితేన జనేన సార్ధమ్‌. 35

యః కారయే త్సురగృహం వివిధద్వజాఙ్కం శ్రీ స్తం న ముఞ్చతి సదా దివిపూజ్యతే సః |

ఏవం గృహార్చన విదావపి శక్తిత స్స్యా త్సంస్థాపనం సకలమన్త్ర విదానయుక్తమ్‌. 36

గోవస్త్రకాఞ్చనహరిణ్యధరా ప్రదానం దేయం గురుద్విజవరేషు తథా7న్నదానమ్‌. 37

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మణ్డపలక్షణాదికథనం నామ

ఏకోనసప్తత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

సర్వ వాస్తులయందును ప్రయత్నముతో ద్వారవేధము లేకుండునట్లు చూడవలయును; వృక్షము - కోణము - భ్రమి (గాలిచక్రము - కుమ్మరిసారె - గానుగ లోనగునవి) ఇతరులఇంటిద్వారము - స్తంభము - బావి - ధ్వజము - (జెండా) - గోడ - గోయి - ఇట్టివాని వేధ పొందిన ద్వారము హాని కలిగించును; వీనిచే - క్షయము - దుర్గతి ప్రవాసము - క్షుద్భయము - దౌర్భాగ్యము - బంధనము - రోగము - దారిద్ర్యము - కలహము - విరోధము - ధననాశము - ఇట్టి ఫలములు కలుగును.

ఈ మండలపు ఆవరణములో తూర్పున పండ్లచెట్లు - పాలుగల (మర్రివంటి) చెట్లు దక్షిణమందును పశ్చిమమునను కలువలతో తామరలతో అలంకృతమయియుండు జలము (జలాశయము) ఉత్తరమున సరళ తాళాది వృక్షములును పుష్పవాటికయును ఉండవలయును; ఇవికాక ఈ అన్ని దిక్కులందును అవకాశమున్న చోటులందు స్థిరమయినచో (ప్రవహించినది) అస్థిరమయినచో (ప్రవహించునది) నీరు ఉండుటమంచిది.

ఇదే ఆవరణమునందు దక్షిణమున తపోధన (అనుష్ఠానమో జపములో తపములో పారాయణమో యోగసాధనమో చేసికొను వారి ) స్థానమును ఉత్తరమున (సప్త) మాతృకాగృహములును ఆగ్నేయమున వంటశాలయు నైరృతమున వినాయక గృహమును పడమట విష్ణుని గృహమును వాయవ్యమున (యాత్రికుల వసతికై) గృహముల వరుసయు ఉత్తరమున యజ్ఞశాలయు ఉత్తరముననే నిర్మాల్యస్థానమును పడమటగాని సోమదేవతాక స్థానమునందు (ఉత్తరమున) గాని బలి నిర్వపణ స్థానమును ముందువైపున వృషభ స్థానమును(పడమట)శేష స్థానమునందు మన్మథ స్థానమును ఈశాన్యము నందు జలమునందు శయనించియుండు విష్ణుని స్థానమును - ఈ విధముగ కుండములతోను మండపములతోను కూడిన ఆయతన (దేవాలయ) మును నిర్మింపజేయవలయును. ప్రక్కలందు పరివార శాలలుండవలెను.

ఘంటలు మేలుకట్టులు వివిధ తోరణములు (మహాద్వారములు) నిత్సోత్సవములు దర్శింపవచ్చి ఆనందముతో నిండియుండు జనులు వివిధ్వజ విశేషములు ఉండునట్లు దేవాలయమును ఎవరు నిర్మింతురో వారిని ఇహమున లక్ష్మి ఎన్నడును విడువదు; వారు వరమున స్వర్గమునందు పూజలనందుకొనుచు సుఖములనందుదురు; ఇదే విధముగ గృహ మందును యథాశక్తిగా సకల మంత్రములతో శాస్త్రోక్త విధానములతో అర్చన విధానమును వ్యవస్థ చేసికొనవలయును; ఆయా ప్రక్రియ సందర్భములయందు గురువులకును ద్విజులకును గోవస్త్ర హిరణ్య భూదానములను చేయవలయును; ఎల్లరకును అన్నదానము చేయవలయును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున ప్రాసాద (దేవాలయ) లక్షణమునందు మండవ లక్షణాది కథనమను రెండు వందల అరువది తొమ్మిదవ యధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters