Sri Matsya Mahapuranam-2    Chapters   

ద్వాత్రింశదుత్తర ద్విశతతమో7ధ్యాయం

రాజధర్మాః- అతివృష్ట్యాద్యుత్పాతా స్తచ్ఛాన్తిశ్చ.

గర్గః : అతివృష్టి రనావృష్టి ర్దుర్భిక్షయోభయం స్మృతమ్‌| అనృతై త్రిదినం ముక్త్వా వృష్టిరేజ్ఞయా భయానకా. 1

అనభ్రే వైకృతాశ్చైవ విజ్ఞేయా రాజమృత్యవే| శీతోష్ణానాం విపర్యాసే నృపాణాం రిపుజం భయమ్‌. 2

శోణితం వర్షతే యత్ర తత్ర శస్త్రభయం భ##వేత్‌| అఙ్గారపాంసువర్షే తు నగరం తద్వినశ్యతి. 3

మజ్జాస్థి స్నేహమాంసానాం జనమారభయం భ##వేత్‌| ఫలం పుష్పం తథా ధాన్యం పరేణాతిభయాయ తు. 4

పాంసుజన్తుఫలానాంచ వర్షణ రోగజం భయమ్‌| ఛిద్రమన్న ప్రవర్షేణ సస్యానాం భీతివర్ధనమ్‌. 5

విరజస్కే రవౌ వ్యభ్రే యదా చ్ఛాయా న దృశ్యతే| దృశ్యతే తు ప్రతీపా వా తత్ర దేశభయం భ##వేత్‌. 6

నిరభ్రే చాథ రాత్రౌ వా శ్వేతం యమ్యోత్తరేణచ| ఇన్ద్రాయుదం యదా చోల్కాపాతం (శ్‌) చైవ భ##వే ద్యది. 7

దిగ్ధాహపరివేషౌచ గన్ధర్వ నగరం తథా| పరచక్రభయం బ్రూయాద్దేశోపద్రమేవచ. 8

సూర్యేన్దు పర్జన్య సమీరణానాం యాగస్తు కార్యో విధివ ద్ద్విజేన్ద్రైః| ధనాని గౌః కాఞ్చన దక్షిణాశ్చ దేయా ద్విజానా మఘనాశ హేతోః. 9

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ రాజధర్మే అతివృష్ట్యాద్యుత్పాత శాన్తి కథనం నామ

ద్వాత్రింశదుత్తర ద్విశతతమో7ధ్యాయః.

రెండు వందల ముప్పది రెండవ అధ్యాయము.

అతివృష్ట్యా 77ద్యుత్పాతములు -తచ్ఛాంతి.

గర్గుడిట్లు చెప్పెను ; అతివృష్టియు అనావృష్టియు ఈ రెండును కరవునకు నిమిత్తములు ; అనృతువునందు మూడు దినములకు మించి ఎగతెగని వాన కురియుట

భయహేతువు ; మేఘములు లేకయే మెరయుట- ఉరుముట పిడుగులు పడుటవంటి వైకృత్యములు జరిగినతో రాజు మరణించును ; శీతోష్ణ వ్యత్యాసమయినచో రాజులకు శత్రుభయము ; రక్తపు వాన కురిసినచో శస్త్ర భయమేర్పడును; బొగ్గులు నిప్పుకణికలు ధూలి వర్షించినచో నగర నాశమగును ; మజ్జ ఎముకలు నూనె మాంసము వర్షించినచో జనమృత్యుభయము ; ఫలపుష్ప ధాన్యములు కురిసినచో శత్రుభయము; ధూళి ప్రాణులు పండ్లు వర్షించినచో రోగభయము ; అన్నవర్ష మయినచో దేశమున ఛిద్రములును సస్యములకు భీతియు కలుగును ; ఆకసమున ధూళిలేకయే మేఘములు లేకయు రవి ప్రకాశించుచున్నను నీడ కనబడకపోయినను ఎదురు రూపుతో (తలక్రిందుగా) కనబడినను దేశభయమగును ; ఆకసమున మేఘములు లేనపుడు కాని రాత్రి వేళ కాని దక్షిణపు కొనలో గాని ఉత్తరపు కొనయందుగాని తెల్లని ఇంద్రధనుస్సు కనబడినను ఉల్కాపాతమును దిగ్ధాహముగు పరివేషమును ఏర్పడి నను గంధర్వ నగరము కనబడినను పరచక్ర (శత్రుసేనవలన) భయమును దేశోపద్రమును కలుగును ;ఈ నిమిత్తతముల శాంతికై సూర్యచంద్ర వర్జన్య దేవతలనుద్దేశించి ద్విజశ్రేష్ఠులచే యథావిధి యాగము జరిపించవలెను ; ధనము గోవులు సువర్ణము దక్షిణలుగా బ్రాహ్మణులకీయవలెను; దోష శాంతి యగును.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున రాజధర్మమున అతివృష్ట్యాద్యుత్పాతములును తచ్ఛాంతియునను రెండు వందల ముప్పది రెండవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters