Sri Devi Bhagavatam-1    Chapters   

అథ సప్తమో%ధ్యాయః

అథ తం పతితం దృష్ట్వా విష్ణు ర్విష్ణుపురీం య¸° | మనసా శంకమాన స్తు తస్య హత్యాకృతం భయమ్‌. 1

ఇంద్రో%పి భయసంత్రప్తో యయా వింద్రపురీం తతః | మునయో భయసంవిగ్నా హ్యభవ న్నిహతే రిపౌ. 2

కి మస్మాభిః కృతం పాపం యదసౌ వంచితః కిల | ముని శబ్దో వృథా జాతః సురేశస్య చ సంగతమ్‌. 3

అస్మాకం వచనా ద్వృత్రో విశ్వాస మగమ త్కిల విశ్వాసఘాతినః సంగా ద్వయం విశ్వాసఘాతుకాః. 4

ధిగియం మమతా పాపమూల మేవ మనర్థకృత్‌ | యదస్మాభి శ్చలం కృత్వా శపథై ర్వంచితో%సురః. 5

మంత్రకృ ద్బుద్ధిదాతా చ ప్రేరకః పాపకారిణామ్‌ | పాపభా క్సభ##వే న్నూనం పక్షకర్తా తథైవ చ 6

విష్ణునా%పి కృతం పాపం మత్సాహయ్య మవాప్తవాన్‌ | వజ్రం ప్రవిశ్య యేనాసౌ పాతితః సత్త్వమూర్తినా. 7

నూనం స్వార్థపరః ప్రాణీ న పాపాత్త్రాస మశ్నుతే|హరిణా హరిసంగేన సర్వథా దుష్కృతం కృతమ్‌. 8

ద్వా వేవ స్తః పదార్థానాం ద్వావేన నిధనంగతౌ | ప్రథమ శ్చ తురీయశ్చ ¸° త్రిలోక్యాం తు దుర్లభౌ. 9

అర్థకామౌ ప్రశస్తౌ ద్వౌ సర్వేషాం సమ్మతౌ ప్రి¸° | ధర్మ ధర్మేతి వాగ్విదో దంభో%యం మహతామపి. 10

మునయో%పి మనస్తాప మేవం కృత్వా పునః పునః | జగ్ముః స్వా నాశ్రమానేవ విమనస్కా హతోద్యమాః. 11

త్వష్టాతు నిహతం శ్రుత్వా పుత్ర మింద్రేణ భారత | రురోద దుఃఖసంతప్తో నిర్వేద మగమత్పునః. 12

యత్రాసౌ పతిత స్తత్ర గత్వా వీక్ష్య తథాగతమ్‌ | సంస్కారం కారయామాస విధివ త్పారలౌకికమ్‌. 13

స్నాత్వా%స్య సలిలం దత్త్వా కృత్వా చైవౌర్ధ్వ దైహికమ్‌ | శశాపేంద్రం స శోకార్తః పాపిష్ఠం మిత్రఘాతుకమ్‌. 14

యథే మే నిహతః పుత్రః ప్రలోభ్య శపథైర్భృశమ్‌ | తథేంద్రో%పి మహద్దుఃఖం ప్రాప్నోతు విధినిర్మితమ్‌. 15

ఇతి శప్త్వా సురేశానాం త్వష్టా తాపసమన్వితః | మేరోః శిఖర మాస్థాయ తపస్తేపే సుదుష్కరమ్‌. 16

ఏడవ అధ్యాయము

నహుషు డింద్రాసన మెక్కుట

అటు పిమ్మట విష్ణువు వృత్రహత్యవలని భయముతో తన మదిలో శంకించుచు వైకుంఠమేగెను. ఇంద్రుడును భయభ్రాంతితో స్వర్గమేగెను. వృత్రుడు చనిపోగా మునులును భయోద్విగ్నమానసులై యిట్లు దలంచిరి : ఇంద్రుని సాంగత్యము చేత మన మునిశబ్దము వ్యర్థమైనది. వైరిని వంచించి మనమును పాపము మూటకట్టుకొంటిమి. వృత్రుడు మన మాటల మీద నమ్మకముంచుకొని యుండెను. విశ్వాసఘాతుకుని గూడుటచే మనమును విశ్వాసఘాతుకులమైతిమి. ఛీ! ఈ మమకార మెంత చెడ్డది. ఇది పాపమూలము. అనర్థదాయకము. దానివలననే మన మసురునిచేత ప్రతినలు చేయించి యతని కన్ను మొఱగితిమి. పాపాత్మునిపక్ష మవలంబించువాడును అతనిని పాపమునకు పురికొల్పువాడును పాపబుద్ధి గలిగించువాడును పాపాలోచనలు చేయువాడును పాపమనుభవించి తీరుదురు. విష్ణువు సైతమింద్రునకు సాయము చేయుట కతని వజ్రములో దాగి వృత్రుని చంపించి పాపము చేసెను. విష్ణునంతటి వాడింద్రునకు సైదోడుగ నిలిచి పాపము చేసెనే! ఇక స్వార్థపరుడగు ప్రాణి పాపాచరణమేలచేయడు? ఈ లోకములందలి నాల్గు పురుషార్థములలో మొదటిది ధర్మము. చివరిది మోక్షము. ఈ రెండును దుర్లభములు. ఇవి నేడు మాసిపోయినవి. ప్రతి ప్రాణికి నర్థకామములు గొప్పవి. ప్రీతిపాత్రములు. ఎంతగొప్పవాడైనను ధర్మపన్నాలు వల్లించుచు దంభాచారి యగును. ఇట్లు మునులు పశ్చాత్తాపముజెంది దిగులుతో చేయునదిలేక తమ తమ యాశ్రమముల కరిగిరి. ఇట విశ్వకర్మయును తన పుత్రుడింద్రునిచేతిలో చచ్చుటెఱిగి వగచి వగచి నిర్వేద మొందెను. విశ్వకర్మ వృత్రుడు చచ్చిపడిన చోటికేగిచూచి యతనికి యథావిధానముగ నూర్ధ్వలోక సంస్కారములొనరింప జేసెను. విశ్వకర్మ స్నానమొనర్చి తర్పణాది కర్మలొనరించిన పిమ్మట శోకార్తుడై మిత్రద్రోహిపాపియగు నింద్రునిట్లు శపించెను : నా సుతుడెట్లు శపథములతో వంచింపబడి చచ్చెనో యింద్రుడు నట్లే విధివశమున దుఃఖములందుగాక! ఇట్లు విశ్వకర్మ యింద్రుని శపించి తాపస వృత్తిలో మేరు శిఖరములందు ఘోరతపమాచరించెను.

జనమేజయ ఉవాచ :

హత్వా త్వాష్ట్రం సురేశో%థ కామవస్తామవాప్తవాన్‌ | సుఖం వా దుఃఖ మేవాగ్రే తన్మే బ్రూహి పితామహ. 17

వ్యాసః: కిం పృచ్ఛసి మహాభాగ సందేహః కీదృశ స్తవ | అవశ్య మేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్‌. 18

బలిష్టై ర్దుర్బలై ర్వా%పి స్వల్పం వా బహు వా కృతమ్‌ | సర్వథైవ హి భోక్తవ్యం సదేవాసురమానుషైః. 19

శక్రాయేత్థం మతిర్దత్తా హరిణావృత్రఘాతినే | ప్రవిష్టో%థ పవిం విష్ణుః సహాయః ప్రత్యపద్యత. 20

న చాపది సహయో%భూ ద్వాసుదేవః కథంచన | సమయే స్వజనః సర్వః సంసారే%స్మి న్నరాధిప. 21

దైవే విముఖతాం ప్రాప్తే న కో%ప్యస్తి సహాయవాన్‌ | పితా మాతా తథా భార్యా భ్రాతావా%థసహోదరః. 22

సేవకోవా%పి మిత్రంవా పుత్రశ్చైవ తథౌరసః | ప్రతికూలే గతే దైవే న కో% ప్యేతి సహాయతామ్‌. 23

భోక్తా పాపస్య పుణ్యస్య కర్తాభవతి సర్వథా | వృత్రం హత్వా గతాః సర్వే నిస్తే జస్కః శచీపతిః. 24

శేపుస్తం త్రిదశాః సర్వే బ్రహ్మ హే త్యబ్రువిన్‌ శ##నైః | కోనామ శపథాన్‌ కృత్వా సత్యం దత్వా వచః పునః. 25

జిఘాంసతి స విశ్వస్తం మునిం మిత్రత్వ మాగతమ్‌ | దేవగోష్ఠ్యాం సురోద్యానే గంధర్వాణాం సమాగమే. 26

సర్వత్రైవ కథా తస్య విస్తార మగమ త్కిల | కిం కృతం దుష్కృతం కర్మ శ##క్రేణాద్య జిఘాంసతా. 27

వృత్రం ఛలేన విశ్వస్తం మునిభి శ్చ ప్రతారితమ్‌ | వేదప్రమాణ ముత్సృజ్య స్వీకృతం సౌగతం మతమ్‌. 28

యదయం నిహతః శత్రు ర్వంచయిత్వా%తి సాహసాత్‌ | కో నామ వచనం దత్వా విపరీత మథాచరేత్‌. 29

వినా శక్రం హరిం వా%పి యథా%యం వినిపాతితః | ఏవం విధాః కథా శ్చాన్యాః సమాజేష్యభవన్భృశమ్‌. 30

జనమేజయుడిట్లనెను : పితామహా! సురేశుడు వృత్రుని సంహరించి సుఖపడెనా? దుఃఖములనుభవించెనా? నాకు తెల్పుము. అన వ్యాసుడిట్లనెను : మహాత్మా? నీవే మడుగుచున్నావు? నీ సందేహమేమి? ఏ ప్రాణియైన శుభాశుభకర్మముల ఫలము తప్పక అనుభవించవలసినదే! నరులుగాని సురులుగాని బలశాలిగాని దుర్బలుడుగాని యతడు చేసిన కర్మము కొలదిదైనను గొప్పదైనను దానిఫల మతడనుభవించవలసినదే. ఇంద్రుడు వృత్రుని చంపుటకు పూనుకొనెను. అంతలో శ్రీహరి యింద్రుని బుద్ధిని ప్రేరేచి యతని వజ్రమునజేరి సాయపడెను. కాని, యింద్రుడాపదలలో తలమున్కలుగ నున్నప్పుడు వాసుదేవుడు సాయపడలేదు. కనుక రాజా! ఈ లోకమునందు సమయమున కాదుకొనువాడే స్వజనుడనబడును. దైవము ప్రతికూలించినచో సాయపడు వాడొక్కడు నుండడు. తల్లి తండ్రి భార్య సోదరుడు సేవకుడు-మిత్రుడు-ఔరసులు వీరిలో నేయొక్కడును దైవము ప్రతికూలించినో తోడుపడడు. పాపముగాని పుణ్యముగాని దానినిజేసినవాడే యనుభవించగలదు. వృత్రుడు చావగ సురలెల్లరు వెళ్లిరి. ఇంద్రుడు తేజోహీనుడయ్యెను. సురలంద ఱింద్రుడు బ్రహ్మఘాతుకుడని యతనిని నిందించిరి. ఇంద్రుడు శపథములుచేసి సత్యవాక్కులు పలికెను. అతడు తనకు మనసిచ్చి నమ్మిన మునిపుత్రుని వంచించి వధించెనని గంధర్వులు సురోద్యానములందు గుమిగూడి గుసగుసలాడుకొనిరి. వారెల్లెడల నింద్రుని నిందించుచుండిరి. ఆ వార్త యంతట ప్రాకెను. ఇంద్రు డెంతటి దుష్కార్య మాచరించెను! ఇంద్రుడు వృత్రుని కంట దుమ్ముకొట్టి యతనిని పొట్టనుబెట్టుకొనెను. ఇంద్రుడు వేదప్రమాణమును మంటగలిపెను. అతడు బుద్ధ మతమును స్వీకరించెను గాబోలు! ఇంద్రుడుగాబట్టి తన శత్రునకు మాట యిచ్చియు నతనిని మోసగించి చంపెను కాని, మరెవ్వడును మాటయిచ్చి యింతటి ఘోరవైపరీత్యమునకు తలపడడు. ఇంతటి పనికి బూనుకొనుట కింద్రునకు విష్ణునకు దక్క మరెవ్వనికి గుండెలుండును? అనుమాటలు సమాజము లందు వినవచ్చుచుండెను.

శుశ్రావేంద్రో%పి వివిధాః స్వకీర్తే ర్హానికారికాః | స్య కీర్తి ర్హతా లోకే ధిక్తసై#్యవ కుజీవితమ్‌. 31

యం దృష్ట్వా పథి గచ్ఛంతం శత్రుః స్మేరముఖో భ##వేత్‌ | ఇంద్రద్యుమ్నో%పి రాజర్షిః పతితః కీర్తిసంక్షయాత్‌. 32

స్వర్గా దకృతపాపో%సౌ పాపకృత్కిం న పాత్యతే | స్వల్పే%పరాధే%పి నృపో యయాతిః పతితః కిల. 33

నృపః కర్కటతాం ప్రాప్తో యుగా నష్టాదశైవ తు | భృగుపత్నీ శిరశ్ఛేదా ద్భగవాన్‌ హరి రచ్యుతః. 34

బ్రహ్మశాపా త్పశోర్యోనౌ సంజాతో మకరాదిషు | విష్ణు శ్చ వామనో భూత్వా యాచనార్థం బలేర్గృహే. 35

గతః కి మపరం దుఃఖం ప్రాప్నోతి దుష్కృతీ నరః | రామో%పి వనవాసేషు సీతావిరహజం బహు. 36

దుఃఖం చ ప్రాప్తవా నోరం భృగుశాపేన భారత | యథేంద్రో%పి బ్రహ్మహత్యా కృతం ప్రాప్యమహద్భయమ్‌. 37

న స్వాస్థ్యం ప్రాప గేహే%సౌ సర్వసిద్ధి సమన్వితే | పౌలోమీ తం సభాహీనం దృష్ట్వా ప్రోవాచ వాసవమ్‌. 38

విశ్వసంతం భయత్రస్తం నష్టసంజ్ఞం విచేతనమ్‌ | కింప్రభో%ద్య భయార్తో%సి మృతస్తే దారుణో రిపుః. 39

కా చింతా వర్తతే కాంత! తవ శత్రునిషూదన | కస్మాచ్చోచసి లోకేశ ! నిఃశ్వస న్ర్పాకృతో యథా. 40

నాన్యో%స్తి బలవాన్‌ శత్రు ర్యేన చింతాపరోభవాన్‌ | ఇంద్రః: నారాతిర్బలవాన్మే%స్తినశాంతిర్నసుఖంతథా. 41

బ్రహ్మహత్యాభయా ద్రాజ్ఞి! బిభేమి సతతం గృహే | నందనం న సుఖాకారం నామృతం న గృహం వనమ్‌. 42

గంధర్వాణాం తథా గేయం నృత్య మప్సరసాం పునః | న త్వం సుఖకరా నారీ నానాచ సురయోషితః. 43

న తథా కామధేనుశ్చ దేవవృక్షః సుఖప్రదః కిం కరోమి క్వ గచ్ఛామి క్వ శర్మ మమ జాయతే. 44

ఇట్టి మాట లింద్రుని కీర్తికి మచ్చ గల్గించునట్టివి. వీని నింద్రుడును వినెను. ఎవ్వని కీరితి లోకమున నిందల పాలయ్యెనో వాని బ్రదుకొక బ్రదుకా? అట్టి నష్టకీర్తిగలాడు త్రోవను నడుచుచుండగ గని వైరులు పరిహసింతురు. తొల్లి యింద్రద్యుమ్నుడను రాజర్షియుండెను. అతని యశమునకు హాని గల్గుట వలన నతడు స్వర్గపతితు డయ్యెను. కనుక పాపచారి యేల పతితుడు గాకుండును? మునుపు కొలది యపరాధమునకే యయాతి రాజు స్వర్గచ్యుతుడయ్యెను. అతడు పదునెనిమిది యుగములవఱకు కర్కట యోనిలో పుట్టెను. పూర్వ మచ్యుతుడగు జనార్దనుడు భృగుపత్ని శిరమును ఖండించెను. విష్ణువు బ్రహ్మశాప ఫలితముగ వరాహదిపశు యోనులం దుద్భవించెను. అతడు బిచ్చమెత్తుటకు వామనుడై బలి యింటికేగెను. ఇక పాపాత్ముడగు నరుడు వీరికంటే మిక్కుటమైన దుఃఖము లందకుండునా? అలనాడు దశరథరాముడు సైతము వనములందు సీతావియోగ దుఃఖము లందెను. ఈ రఘురాముడును ఘోరదుఃఖము లనుభవించెను. అదియును భృగుశాపముననే కలిగెను. అట్లే యింద్రుడును బ్రహ్మహత్యాపాపముతో భయవిహ్వలు డయ్యెను. అతడు తన భవనమందును సుఖముగ వసింపలేకుండెను. అతడు తేజోహీనుడగుటగని శచీదేవి యిట్లనెను : 'ఓ స్వామీ! నీవు చేష్ట లుడిగి భయభ్రాంతుడవై నిట్టూర్పులతో నేల లోలోన కుములుచున్నావు నీ శత్రువు మడిసెను గదా! కాంతుడా! నీ కిక దిగు లేల? ఒక పామరుని వలె నిట్టూర్చుచు శోకింతువేల? నీ కింక ప్రబలశత్రు వెవ్వడును లేడు. ఇక నీ కెవ్వరును చింత గల్గించరు.' ఇంద్రుడిట్లనెను : నాకు ప్రబలశత్రువు లేడు. కాని నాకు శాంతి సుఖములు కొరవడినవి. రాణీ! బ్రహ్మహత్యాభీతిచే దురపిల్లుచున్నాను. నా కీ నందన వనము అమృతము గంధర్వగానములు అచ్చరల నర్తనములు పెక్కు దేవకామినులు నీవును కల్పవృక్షము కామధేనువును నిందేదియును నాకు చిత్తశాంతి గల్గించుటలేదు. ఇక నేమి చేతును? ఎక్కడి కేగగలను? నాకు సుఖమెక్కడిది?

ఇతి చింతాపరః కాంతే న లభే సుఖ మాత్మని | ఇత్యుక్త్వా వచనం శక్రః ప్రియాం పరమకాతరామ్‌. 45

నిర్జగామ గృహా న్మందో మానసం సర ఉత్తమమ్‌ | పద్మనాళే ప్రవిష్టో%సౌ భయార్తః శోకకర్శితః. 46

ప్రాజ్ఞాయతన దేవేంద్ర స్త్వభిభూతశ్చ కల్మషైః | ప్రతిచ్ఛన్నో వసత్యప్సు చేష్టమానివోరగః. 47

అసహాయ స్తురాషాడై చ్చింతార్తో వికలేంద్రియః | తతః ప్రణష్టే దేవేంద్రే బ్రహ్మహత్యాభయార్దితే. 48

సురా శ్చింతాతురా శ్చాస న్నుత్పాతాశ్చాభవ న్నథ | ఋషియః సిద్ధగంధర్వా భయార్తా శ్చాభవ న్భృశమ్‌. 49

అరాజకం జగత్సర్వ మభిభూత ముపద్రవైః | అవర్షణం తదా జాతం పృథివీ క్షీణవైభవా. 50

విచ్ఛిన్న స్రోతసో నద్యః సరాంస్యనుదకాని వై | ఏవం త్వరాజకే జాతే దేవతా మునయ స్తథా. 51

విచార్య నహుషం చక్రుః శక్రం సర్వే దివౌకసః | సంప్రాప్య నహుషో రాజా ధర్మిష్ఠో%పి రజోబలాత్‌. 52

బభూవ విషయాసక్తః పంచబాణ శరాహతః | అప్సరోభి ర్వృతః క్రీడ న్దేవోద్యానేషు భారత. 53

శక్రపత్నీ గుణాన్‌ శ్రుత్వా చకమే తాం స పార్థివః | ఋషీ నాహ కి మింద్రాణి నోపగచ్ఛతి మాం కిల. 54

భవద్భి శ్చామరైః సర్వైః కృతో%హం వాసవ స్త్విహ | ప్రేషయధ్వం సురాః కామం సేవార్థం మమవైశచీమ్‌. 55

ప్రియం చే న్మమ కర్తవ్యం సర్వథా మునయో%మరాః | అహ మింద్రో%ద్య దేవానాం లోకానాంచ తథేశ్వరః. 56

ఆగచ్ఛతు శచీ మహ్యం క్షిప్ర మద్య నివేశనమ్‌ | ఇతి తస్య వచః శ్రుత్వా దేవా దేవర్షయ స్తథా. 57

కాంతా! ఇట్టి తీరని వంతలో మునుగుట వలన సుఖముగ నుండలేకున్నాను. ఇట్లింద్రుడు చింతాతురయగు తన పత్నితో బలికి తన గృహము వెడలి మానస సరోవరముజేరి యందొక పద్మనాళమునం దార్తితో కృశించి దాగియుండెను. పాపము చేసి తిరస్కృతు డగుటచే నింద్రు నెవ్వరును గుర్తింపజాలకుండిరి. ఇట్లతడు కదలని పామువలె పడియుండెను. అతడు నిస్సహాయుడై దీనుడై వికలుడై నీట దాగియుండెను. బ్రహ్మహత్యా భయమున నింద్రు డిట్లు వెడలుట సురలు తెలిసికొని చింతామగ్నులైరి. ఉత్పాతములు పెక్కులు సంభవించెను. ఋషులు సిద్ధ గంధర్వులు భయార్తులైరి. ఇట్టి యుపద్రవముల వలన జగమంతయు నరాజకమయ్యెను. నేలపై వానలు లేవు. పంటలు పండుట లేదు. నదులు పిల్లకాల్వలయ్యెను. కాసారము లెండిపోయెను. ఇట్టి యరాజకములు పెక్కులుప్పతిల్లగ మునులు సురలు తమలోతా మాలోచించుకొనిరి. వారు నహుషు నింద్రునిగ చేసిరి. నహుషుడు ధర్మిష్ఠుడే కాని రజోగుణమున కన్నుమిన్ను గాననివాడు. అతడు మదనబాణపీడితుడై విషయలోలు డయ్యెను. నందనోద్యానము నం దచ్చరలతోగూడి విచ్చల విడిగ క్రీడింపసాగెను. ఇంద్రాణి సుగుణములు విని యామెను మదిలో కాంక్షించెను. అతడు ఋషుల కిట్లనెను : 'ఇంద్రాణి నన్ను జేరరాదేల? మీరు దేవతలందఱు కలిసి నన్ను సురపతిగ జేసితిరి గదా! కనుక మీరు నాకు ప్రియము గూర్ప దలంచినచో మీ రామెను నా సేవలకు పంపుడు. ఇపు డీ దేవతలకు లోకములకు నింద్రుడను నేను. ఈశ్వరుడను నేను. వెంటనే శచి నా చేరువకు రావలయును.' అను నహుషుని మాటలు దేవతలు దేవర్షులు వినిరి.

గత్వా చింతాతురాః ప్రోచుః పౌలోమీం ప్రణతాస్తతః | ఇంద్రపత్ని దురాచారో నహుష స్త్వా మిహేచ్ఛతి. 58

కుపితో%స్మా నువాచేదం ప్రేషయధ్వం శచీమిహ | కిం కుర్మ స్తదధీనాః స్మో యేనేంద్రో%యం కృతః కిల 59

తచ్ఛ్రుత్వా దుర్మనా దేవీ బృహస్పతి మువాచహ | రక్ష మాం నహుషా ద్ర్బహ్మం స్తవాస్మి శరణం గతా. 60

బృహస్పతిః: నభేతవ్యం త్వయాదేవి నహుషా త్పాపమోహితాత్‌ | నత్వాందాస్యామ్యహంవత్సేత్యక్త్వా ధర్మం సనాతనమ్‌. 61

శరణాగత మార్తం చ యోదదాతి నరాధమః | స ఏవ నరకం యాతి యావదాభూత సంప్లవమ్‌. 62

స్వస్థా భవ పృథుశ్రోణి న త్యక్ష్యేత్వాం కదాచన.

ఇతి శ్రీదేవిభాగవతే మహాపురాణ షష్ఠస్కంధే సప్తమో%ధ్యాయః.

అపుడు వారు చింతార్తులై యింద్రాణిని జేరి ప్రణమిల్లి యిట్లనిరి : 'ఓ యింద్రాణీ! నహుషుడు దురాచారి. నిన్ను కోరుచున్నాడు. అతడు కోపముతో నిన్ను తన చెంతకు పంపుడని మమ్ము పంపెను. మే మతని నింద్రునిగ జేసితిమి. ఇపుడు మన మతని చేతిలోనివారము. ఇంకేమి చేయగలము?' అన విని దీనయునార్తయునై శచీదేవి బృహస్పతి కిట్లనెను : 'ఓ బ్రాహ్మణోత్తమా ! నిన్ను శరణు వేడుచున్నారు. నన్ను నహుషుని బారినుండి కాపాడుము' అన బృహస్పతి యిట్లనెను : ఓ దేవీ! నహుషుడు పాపి. కామమోహితుడు. అతనికి వెఱవకుము. నేను సనాతన ధర్మమును కాదని నిన్నతని కప్పగించను. శరణాగతుడగు దుఃఖార్తుని విడిచినవాడు ప్రళయపర్యంతము దుర్విపాక నరకము గూలును.

ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి షష్ఠ స్కంధమందు నహుషు డింద్రు డగుట యను సప్తమాధ్యాయము

Sri Devi Bhagavatam-1    Chapters