Brahmapuranamu    Chapters   

2అష్టావింశో7ధ్యాయః

కోణాదిత్యమాహాత్మ్యమ్‌

బ్రహ్మఉవాచ

శ్లో|| తత్రాస్తే భారతే వర్షే దక్షిణోదధిసంస్థితః| ఓఢ్రదేశ ఇతి ఖ్యాతః స్వర్గమోక్షప్రదాయకః || 1

సముద్రా దుత్తరం తావ ద్యావ ద్విరజమండలమ్‌|| దేశో7సౌ పుణ్యశీలానాం గుణౖః సర్వై రలంకృతః || 2

తత్ర దేశ ప్రసూతా యే బ్రాహ్మణాః సంయతేంద్రియాః| తపః స్వాధ్యాయనిరతా వంద్యాః పూజ్యాశ్చ తే సదా|| 3

శ్రాద్ధే దానే వివాహేచ యజ్ఞేవా చార్యకర్మణి | ప్రశస్తాః సర్వకార్యేషు తత్ర దేశోద్భవా ద్విజాః || 4

షట్కర్మనిరతాస్తత్ర బ్రాహ్మణా వేదపారగాః | ఇతిహాసవిదశైవ పురాణార్థవిశారదాః || 5

సర్వశాస్త్రార్థకుశలా యజ్వానో వీతమత్సరాః | అగ్నిహోత్రరతాః కేచిత్‌ కేచిత్‌ స్మార్తాగ్నితత్పరాః || 6

పుత్రదారధనైర్యుక్తా దాతారః సత్యవాదినః | నివసంత్యుత్కలే పుణ్య యజ్ఞోత్పవవిభూషితే|| 7

ఇతరే7పి త్రయో వర్ణాః క్షత్రియాధ్యా స్సుసంయతాః | స్వకర్మనిరతాః శాంతా స్తత్ర తిష్ఠంతి ధార్మికాః || 8

కోణాదిత్య ఇతి ఖ్యాత స్తస్మిన్‌ దేశే వ్యవస్థితః | యం దృష్ట్యా భాస్కరం మర్త్యః సర్వపాపైః ప్రముచ్యతే ఃః 9

తా|| దక్షిణ సముద్ర తీరమం దోఢ్రదేశము గలదు. అది స్వర్గ మోక్షప్రదము. సముద్రమునకుత్తరముగా విరజమండలము సరిహద్దుల దాక అది యున్నది. అచటి బ్రాహ్మణులు జితేంద్రియులు. తపస్స్వాధ్యాయనికతులు. వంద్యులు పూజ్యులును. యజ్ఞదాన వివాహాది శుభకర్మములందు శ్రాద్ధాదులయందు వీరు చాలా ప్రశస్తులు. షట్కర్మనిరతులు. ఇతిహాస పురాణార్థ విశారదులు. సర్వశాస్త్రార్థ సమర్థులు. మాత్సర్యహీనులు పుత్ర దారధనక్షేత్రసంపన్నులు. సత్యవచనులు. దాతలు. క్షత్రియాది వర్ణముల వారును స్వధర్మనిరతులు ధార్మికులు శాంతులు. ఆ దేశమందు కోణాదిత్యుడను పేర సూర్యభగవానుడు వెలసి యున్నాడు. తద్దర్శనము సర్వపాప నికృంతనము.

యనయః ఊచుః

శ్రోతు మిచ్ఛామ తద్భ్రూహి క్షేత్రం సూర్యస్య సాంప్రతమ్‌| తస్మిన్‌ దేశే సురశ్రేష్ఠ యత్రాస్తే స దివాకరః || 10

బ్రహూవాచ

లవణ స్యోదధే స్తీరే పవిత్రే సుమనోహరే | సర్వత్ర వాలుకాకీర్ణే దేశే సర్వగుణాన్వితే || 11

చంపకాశోక వకులైః కరవీరైః సపాటలైః | పున్నాగైః కర్ణికారైశ్చ వకులై ర్నాగకేసరై ః || 12

తగరై ర్థవ బాణౖశ్చ అతిముక్తైః సకుబ్జకై ః మాలతీ కుంద పుషై#్పశ్చ తథాన్యై ర్మల్లికాదిభిః || 13

కేతకీవనషండైశ్చ సర్వర్తు కుసుమోజ్వలై ః | కదంభై ర్లకుచైః శాలైః పనసై ర్దేవడారుభిః || 14

సరలైః ర్ముచుకుందైశ్చ చందనైశ్చ సితేతరైః | అశ్వత్థైః సప్తపర్ణైశ్చ ఆమ్రైరామ్రాతకైస్తథా || 15

తాలై ః పూగఫలైశ్చైవ నారికేలైః కపిత్థకైః అన్యైశ్చ వివిధై ర్వృక్షై ః సర్వతః సమలంకృతమ్‌ || 16

క్షేత్రం తత్ర రవేః పుణ్య మాస్తే జగతి విశ్రుతమ్‌ | సమంతా ద్యోజనం సాగ్రం భుక్తి ముక్తి ఫల్రపదమ్‌ || 17

అస్తే తత్ర స్వయందేవః సహస్రాంశుఃదివాకరః కోణాదిత్య ఇతి ఖ్యాతో భుక్తిముక్తి ఫలప్రదః || 18

ఆ దేశమందు కోణాదిత్యుడను పేర సూర్యభగవానుడు వెలసియున్నాడు. లవణ సముద్రోత్తరతీరము వాలుకాకీర్ణము. మనోహరము సర్వపుష్ప ఫల భరిత తరు సుందరము రమారమి సార్థయోజనవిశాలముగా నచట సూర్యక్షేత్రతము భక్తి ముక్తి ప్రదము. అది నానాతరులతా సుందరము.

మాఘే మాసే సితే పక్షే సప్తమ్యాం సంయతేంద్రియః|క్మతోపవాసో యత్రైత్య స్నాత్వాతు మకరాలయే || 19

కృతశౌచో విశుద్ధాత్మా స్మరన్‌ దేవం దివాకరమ్‌ | సాగరే విధివతే స్నాత్వా శర్వర్యంతే సమాహితః || 20

దేవా నృషీ న్మనుష్యాంశ్చ పితౄన్‌ సంతర్ప్య చ ద్విజాః ఉత్తీర్య వాససీ ధౌతే పరిదాయ సునిర్మతే || 21

ఆచమ్య ప్రయతో భూత్వా తీరే తస్య మహోదధేః | ఉపవి శ్యోదయేకారే ప్రాజ్ముఖ స్సవితు స్తథా || 22

విలిఖ్య పద్మం మేధావీ రక్తచందనవారిణా | అష్టపత్రం కేసరాఢ్యం వర్తులం చోర్థ్వకర్ణికమ్‌ || 23

తిలతండులతోయంచ రక్త చందనసంయుతమ్‌ | రక్తపుష్పం సదర్భంచ ప్రక్షిపే త్తామ్రభాజనే || 24

తామ్రాభావే7ర్క పత్రస్య పుటే కృత్వా తిలాదికమ్‌|పిధాయ తన్ముని శ్రేష్ఠాః పాత్రం పాత్రేణ విన్యసేత్‌ || 25

కరన్యాసాంగవిన్యాసం కృత్వాంగైః హృదయాదిభిః|ఆత్మానం భాస్కరం ధ్యాత్వా సమ్యక్‌ శ్రద్ధాసమన్వితః || 26

మధ్యే చాగ్నిదలే ధీమాన్‌ నైఋతే శ్వసనే దలే | కామారిగోచరే చై ప పునర్మధ్యే చ పూజయేత్‌ || 27

ప్రభూతం విమలం సార మారాధ్యం పరమం సుఖమ్‌|సంపూజ్య పద్మ మావాహ్య గగనా త్తత్ర భాస్కరమ్‌ || 28

కర్ణికోపరి సంస్థాప్య తతో ముద్రాం ప్రదర్శయేత్‌ | కృత్వా స్నానాదికం సర్వం ధ్యాత్వా తం సుసమాహితః || 29

సితపద్మోపరి రవిం తేజోబింబే వ్యవస్థితమ్‌ | పింగాక్షం ద్విభుజం రక్తం పద్మపత్రారుణాంబరమ్‌ || 30

సర్వలక్షణ సంయుక్తం సర్వాభరణభూషితమ్‌ | నురూపం వరదం శాంతం ప్రభామండల మండితమ్‌ || 31

ఉద్యంతం భాస్కరం దృష్ట్యా సాంద్రసిందూరసన్నిభమ్‌ | తతస్త త్పాత్ర మాదాయ జానుభ్యాం ధరణీంగతః|| 32

కృత్వా శిరసి తత్పాత్ర మేకచిత్తస్తు వాగ్యతః | త్య్రక్షరేణతు మంత్రేణ సూర్యా యార్ఘ్యం నివేదయేత్‌ || 33

అదీక్షితస్తు తసై#్యవ నామ్నై వార్ఘ్యం ప్రయచ్ఛతి | శ్రద్ధయా భావయుక్తేన భక్తి గ్రాహ్యో రవి ర్యతః || 34

అగ్నినిర్‌ ఋతి వాయ్వేశ మధ్య పూర్వాదిదిక్షుచ | హృచ్ఛిరశ్చ శిఖావర్మ నేత్రాణ్యస్త్రంచ పూజయేత్‌ || 35

దత్వార్ఘ్యం గంధ ధూపంచ దీపం నైవేద్యమేవచ | జప్త్వా స్తుత్వా నమస్కృత్వా ముద్రాం బధ్వా విసర్జయేత్‌ || 36

యే వార్ఘ్యం సంప్రయచ్ఛంతి సూర్యాయ నియేతేంద్రియాః | బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః స్త్రియః శూద్రాశ్చ సంయతాః || 37

భక్తిభావేన సతతం విశుద్ధేనాంతరాత్మనా | తే భుక్త్వాభిమతాన్‌ కామాన్‌ ప్రాప్నువంతి పరాం గతిమ్‌ || 38

త్రైలోక్యదీవకం దేవం భాస్కరం గగనే చరమ్‌ | యే సంశ్రయంతి మనుజా స్తే స్యుః సుఖస్య భాజనం || 39

యావన్నదీయతే చార్ఘ్యం భాస్కరాయ యథోతితమ్‌ | తాప న్నపూజయే ద్విష్ణుం శంకరం వాసురేశ్వరమ్‌ || 40

తస్మాత్‌ ప్రయత్న మాస్థాయ దద్యా దర్ఘ్యం దినే దినే | ఆదిత్యాయ శుచిర్భూత్వా పుషై#్ప ర్గంఢై ర్మనోరమైః || 41

ఏవం దదాతి యశ్చార్ఘ్యం సప్తమ్యాం సుసమాహితః | ఆదిత్యాయ శుచిః స్నాతః స లభే దీప్సితం ఫలమ్‌ || 42

మాఘమాస శుక్ల సప్తమినాడు వేకువ నక్కడిసముద్రమున స్నానముచేసి దేవ ఋషి పితృ తర్పణము చేసి ధౌత వస్త్రములు దాల్చి యాచమించి యమ్మహోదధియం దుదయవేళ నాసీనుడై రక్తచందనజలముల సూర్యునకు ఎనిమిదిరేకులు గల కేసరావృతమైన వర్తులాకార పద్మమును (అష్టదళ పద్మమును) గర్ణికతో గూడ లిఖించి తిల తండుల తోయముల రక్తచందనముతో గూర్చి రక్తపుష్పములు దర్భలు రాగిపాత్ర యందుంచి యాదావిని మరొక పాత్రతో మూసి అంగన్యాస కరన్యాసములు చేసి తనను భాస్కరునిగా ధ్యానించి శ్రద్ధతో నడుమ నగ్నిదళమందు నైఋతి వాయవ్య ఈశాన్యస్థాన మధ్యయందు పూజచేయ వలెను. (కేసరము - కింజల్కము)

ఆ పద్మమును నారాదించి యందు గగనమునుండి భాస్కరుని నాహ్వానించి తామర పువ్వు దుద్దు మీద ప్రతిష్టించి ముద్రా ప్రదర్శనము చేసి రెండు భుజములు తేనెరంగు కన్నులు గల వానినిగా నరుణపద్మారుణాంబరధారిగా సర్వాభరణ భూషితునిగా సర్వలక్షణ లక్షితునిగా శాంతమూర్తిగా వరదముద్రాధారిగా ప్రభామండల మండితునిగా సాంద్రసిందూర వర్ణునిగ నుదయ భాస్కరుని ధ్యానించి మోకాళ్ళపై గూర్చుండి యా పాత్రము నెత్తి శిరంబున దాల్చి త్య్రక్షర మంత్రముతో సూర్యున కర్ఘ్యమీయవలెను. సూర్యమంత్ర దీక్షలేనివాడు. సూర్యనామముతోనే యర్ఘ్య మీయనగును. ఆగ్నేయ-నైఋతి, వాయు-ఈశ-మధ్య పూర్వాది దిశలందు-హృదయ-శిర శ్శిఖా-కవచ- నేత్ర అస్త్రముల పూజింపవలెను. ఆర్ఘ్యమర్పించి గంధ ధూప దీప నైవేద్యాదు లొసంగి జపము జేసి నమస్కరించి స్తుతించి ముద్రాబంధముతో విసర్జనము చెప్పవలెను. భక్తితో నిట్లర్కునకర్ఘ్యమిచ్చిన పుణ్యులు భుక్తిముక్తులను బడయుదురు. త్రైలోక్య దీపసుడైన భాస్కరదేవుని గగన సంచారి నెవ్వరాశ్రయింతు రాజనులు సుఖ భాజనులు. భాస్కరున కర్ఘ్య మీయకుండ విష్ణుశంకలసురేశ్వర నర్చింప గూడదు.

రోగా ద్విముచ్యతే రోగీ విత్తార్థీ లభ##తే ధనమ్‌ | విద్యాం ప్రాప్నోతి విద్యార్థీ నుతార్థీ పుత్రవాన్‌ భ##వేత్‌ || 43

యం యం కామ మభిధ్యాయన్‌ సూర్యా యార్ఘ్యం ప్రయచ్ఛతి | తస్య తస్య ఫక్షేం సమ్యక్‌ ప్రాప్నోతి పురుషః సుధీః | 44

స్నాత్వావై సాగరే దత్వా సూర్యా యార్ఘ్యం ప్రణమ్యచ| నరోవా యది నారీవా సర్వకామఫలం లఖేత్‌ || 45

తతః సూర్యాలయం గచ్ఛేత్‌ పుష్ప మాదాయ వాగ్యతః | ప్రవిశ్చ పూజయే ద్భానుం కృత్వా తు త్రిః ప్రదక్షిణమ్‌ 46

పూజయేత్‌ పరయా భక్త్యా కోణార్కం మునిసత్తమాః గంధై పుషై#్పస్తరా దీసైర్థూపై ర్నైవేద్య కైరపి|| 47

దండవత్‌ ప్రణిపాతైశ్చ జయశ##బ్దై స్తథా స్తవై ః | ఏవం సంపూజ్య తం దేవం సహస్రాంశుం జగత్పతిం || 48

దశానా మశ్వమేధానాం ఫలం ప్రాప్నోతి మానవః| సర్వపాపవినిర్ముక్తొ యువా దివ్యవపుర్నరః || 49

సప్తావరాన్‌ సప్తవరాన్‌ వంశా నుద్ధృత్య భోద్విజాః | విమానే నార్కవర్ణేన కామగేన సువర్చసా || 50

ఉపగీయమానో గంధర్వైః సూర్యలోకం సగచ్ఛతి|భుక్త్వా తత్ర వరాన్‌ భౌగాన్‌ యావ దాభూతనంప్లవమ్‌ || 51

పుణ్యక్షయా దిహాయాతః ప్రవరే యోగినాం కులే | చతుర్వేదో భ##వే ద్విప్రః స్వధర్మ నిరతః శుచిః | 52

యోగం వివస్వతః ప్రాప్య తతో మోక్ష మవాప్నుయాత్‌|చైత్రే మాసి సితే పక్షే యాత్రాం మదనభంజికామ్‌ || 53

యః కరోతి నర స్తత్ర పూర్వోక్తమ్‌ స ఫలం లభేత్‌ | శయనోత్థా7పనే భానోః సంక్రాంత్యాం విషువే యనే ||54

వారే రవే స్థిథౌ చైవ సర్వకాలే7థవా ద్విజాః | యే త్రత యాత్రాం కుర్వంతి శ్రద్ధయా సంయతేంద్రియాః ||

విమానే నార్క వర్ణేన సూర్యలోకం వ్రజంతి తే | అస్తే తత్ర మహాదేవః స్తీరే నదనదీపతేః || 56

రామేశ్వర ఇతి ఖ్యాతః సర్వకామ ఫలప్రదః | యే తం పశ్యంతి కామారిం స్నాత్వా సమ్య జ్మహోదథౌ || 57

గంధైః పుషై#్పస్తథా థూపై ర్థీపై ర్నై వేద్యకై ర్వరైః | ప్రణిపాతై స్తథా స్తోత్రై ర్గీతై ర్వాద్యై ర్మనోహరైః || 58

రాజసూయఫలం సమ్య గ్వాజిమేధఫలం తథా | ప్రాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం తథా || 59

కామగేన విమాసేన కింకిణీజాలమాలినా | ఉపగీయమానా గంధర్వైః శివలోకం వ్రజంతి తే || 60

ఆభూతసంప్లవమ్‌ యావ ద్భుక్త్వా భోగా న్మనోరమాన్‌ | పుణ్యక్షయా దిహాగత్య చాతుర్వేదా భవంతి తే || 61

శాంకరం యోగ మాస్థాయ తతో మోక్షం వ్రజంతి తే | యస్తత్ర సవితుః క్షేత్రే ప్రాణాం స్త్యజతి మానవః || 62

స సూర్యలోక మాస్ధాయ దేవవ న్మోదతే దివి | పున ర్మానుషతాం ప్రాప్య రాజా భవతి థార్మికః || 63

యోగం రవేః సమాసాద్య తతో మోక్ష మవావ్ను యాత్‌ | ఏవం మయా మునిశ్రేష్ఠాః ప్రోక్తం క్షేత్రంసుదుర్లభమ్‌ ||

కోణార్క స్యోదధేస్తీరే భుక్తిముక్తిఫలప్రదమ్‌ |

ఇతి శ్రీబ్రాహ్మే మహాపురాణ కోణాదిత్య మాహాత్మ్య కీర్తనం నామ ఆష్టావింశో7ధ్యాయః.

రోగవిముక్తి-ధనసంపత్తి-విద్యాసిద్ధి-పుత్ర పౌత్రాభివృద్ధి యన్నియు దీన గల్గును. చేతం బూవులు ధరించి సూర్యాలయమున కేగవలయును. మూడుమార్లు ప్రదక్షిణము చేయవలెను. ఆ మీద నా దేవుని పూజింపవలెను. దాన దశాశ్వమేధ ఫలము కల్గును, తుదకు సూర్యుడట్లువెలుగు విమానము నెక్కి గంధర్వులచే నుపగీయమానుడయి సూర్యభక్తుడు సూర్యలోకమందును. తిఱిగి వచ్చి యోగి కులమం దుదయించి భానుయోగమునంది ముక్తినందును. చైత్రశుక్ల మందు మదనభంజికయను (కామదమనము) యాత్రనుజేసియు నీ ఫలమందును. శయనోత్థానైకాదశీతిధులందు భానుసంక్రమణమందు నీ యాత్ర చేసిన వారు విమాన యానులై భానులోకమరిగెదరు. ఆ సముద్ర తీరమున రామేశ్వరుడను పేర శివుడున్నాడు. అయన నర్చించినవారికి రాజ సూయ ఫల మొదవును. కామగమైన విమానమున నీమున్ను చెప్పిన ప్రభావముతో శివపురికేగును. ఈ రవి క్షేత్రమున మేను బాసిన జీవి సూర్యలోకమంది మానవ జన్మమెత్తి ధార్మిక ప్రభువై సూర్యసారూప్యమంది మోక్ష మందును. ఇది కోణార్కస్వామి మహిమ.

ఇది శ్రీబ్రహ్మపురాణమందుకోణాదిత్యమాహాత్మ్యవర్ణన మను ఇరువది యెనిమిడవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters