Brahmapuranamu    Chapters   

అథ అష్టావింశదధికద్విశతతమో7ధ్యాయః

ప్రజాగరేణ విష్ణు మహిమగానఫలమ్‌

వ్యాస ఉవాచ

ఏకాదశ్యా ముభే పక్షే నిరాహారః సమాహితః l స్నాత్వా సమ్య గ్విధానేన ధౌతవాసా జితేంద్రియః ll 1

సంపూజ్య విధివ ద్విష్ణుం శ్రద్ధయా సుసమాహితః l పుషై#్ప ర్గంధై స్తథా దీపైర్ధూపైర్నై వేద్యకై స్తథా ll 2

ఉపహారై ర్బహువిధై ర్జపై#్య ర్హోమ ప్రదక్షిణౖః l స్తోత్రై ర్నానావిధై ర్దివ్యై ర్గీతవాద్యై ర్మనోహరైః ll 3

దండవ త్ప్రణిపాతైశ్చ జయశ##బ్దై స్తథో త్తమైః l ఏవం సంపూజ్య విధివ ద్రాత్రౌ కృత్వా ప్రజాగరమ్‌ ll 4

కథాం వా గీతికాం విష్ణో ర్గాయ న్విష్ణుపరాయణః l యాతి విష్ణొః పరం స్థానం నరో నా స్త్యత్ర నంశయః ll 5

రాత్రిప్రజాగరముతో విష్ణుమహిమగానమునకు ఫలము

lLiLi²R…V xmsORPQª«sVVÌÁLiµR…Vƒ«sV GNSµR…bdP¼½´j…ƒy²R…V Dxmsª«szqsLiÀÁ úaRPµôðy¸R…VVNRPVòQ\®²… ÛÍÁxqs=gS „sµ³yƒyƒ«sVryLRiª«sVV ryõƒ«sª«sW²T… ª«sV²R…VgRiVª«sxqsòQûª«sVV µ³R…LjiLiÀÁ ÑÁ¾»½[Liúµj…¸R…VV\®²… „sµ³j…ª«s»`½ gS úaRPµôðR…»][ ª«sVƒ«sxqsV=¬sÖÁzms „sxtñsv„s xmsoxtsQöª«sVVÌÁ»][ xqsVgRiLiµ³R…ª«sVVÌÁ»][ µk…xmsµ³R…Wxms\®ƒs®ªs[µR…ùª«sVVÌÁ»][ ‡Áx¤¦¦¦§„sµ³R…ª«sVÌÁgRiV Dxms¥¦¦¦LRiª«sVVÌÁ»][ ÇÁxmsx¤¦Ü[ª«sVúxmsµR…OTPQß᪫sVVÌÁ»][ ƒyƒy„sµ³R…ª«sVÌÁgRiV r¡òú»R½ª«sVVÌÁ»][ µj…ª«sùª«sVVÌÁV ª«sVƒ¯[x¤¦¦¦LRiª«sVVÌÁVƒ«sgRiV gki»R½ªyµR…ùª«sVVÌÁ»][ µR…Li²R…ª«s»`½gS ƒ«sª«sVryäLRiª«sVVÌÁ»][ D»R½òª«sVª«sVVÌÁgRiV ÇÁ¸R…V aRP‡ôÁª«sVVÌÁ»][ xmspÑÁLiÀÁ LSú¼½¸R…VLiµR…V úxmsÇØgRiLRiª«sVV¿Á[zqs „sxtñsv¬s¸R…VLiµR…V xmsLRiª«sVúaRPµôðR… NRPÖÁgji A ª«sVx¤¦¦¦¬ds¸R…VV¬s NRP´R…ÌÁƒ¯[ gki¼½NRPÌÁƒ¯[ gSƒ«sª«sVV ¿Á[zqsƒ«s¿][ ƒ«sLRiVÌÁV „sxtñsv¬s róyƒ«sª«sVVƒ«sV F~LiµR…VµR…VLRiV. Bµj… ¬saRPè¸R…Vª«sVV. @¬s ªyùxqsV²R…V xmsÖÁZNPƒ«sV.

మునయ ఊచుః

ప్రజాగరే గీతికాయః ఫలం విష్ణో ర్మహామునే l బ్రూహి తచ్ర్ఛోతు మిచ్ఛామః పరం కౌతూహలం హి నః ll 6

ఓ వ్యాసముహామునీ! ప్రజాగరము చేసి గీతికాగానము చేయుటవలన కలుగు ఫలమును వినగోరుచున్నాము. అని మునులు అడిగిరి.

వ్యాస ఉవాచ

శృణుధ్వం మునిశార్దూలాః ప్రవక్ష్యా మ్యానుపూర్వశః l గీతికాయాః ఫలం విష్ణో ర్జాగరే య దుదాహృతమ్‌ ll 7

అవంతీ నామ నగరీ బభూవ భూవి విశ్రుతా l తత్రా77స్తేభగవా న్విష్ణుః శంఖచక్రగదా ధరః ll 8

తస్యా నగర్యాః పర్యంతే చాండాలో గీతికోవిదః l సద్వృత్త్యోత్పాదితధనో భృత్యానాం భరణ రతః ll 9

విష్ణు భక్తః స చాండాలో మాసి మాసి దృఢవృతః l ఏకాదశ్యాం సమాగమ్య సోపవాసో7థ గాయతి ll 10

గీతికా విష్ణునామాంకాః ప్రాదుర్భావ సమాశ్రితాః l గాంధారషడ్జ నై షాద స్వరపంచమధైవతైః ll 11

రాత్రిజాగరణ విష్ణుం గాథాభి రుపగాయతి l ప్రభాతే చ ప్రణమ్యేశం ద్వాదశ్యాం గృహ మేత్యచ ll 12

జామాతృభాగినేయాంశ్చ భోజయిత్వా సకన్యకాః ll తతఃసపరివార స్తు పశ్చాద్భుంక్తే ద్విజోత్తమాః ll 13

ఏవం తస్యా77సత స్తత్ర కుర్వతో విష్ణుప్రీణనమ్‌ l గీతికాభి ర్విచి త్రాభి ర్వయః ప్రతిగతం బహు ll 14

ఏకదా చైత్రమాసే తు కృష్ణైకాదశి గోచరే l విష్ణు శుశ్రూషణార్థాయ య¸° వన మనుత్తమమ్‌ ll 15

వనజాతాని పుష్పాణి గ్రహీతుం భక్తితత్పరః l క్షిప్రాతటే మహారణ్య విభీతకతరో రధః ll 16

దృష్టః స రాక్షసే నాథ గృహీతు శ్చాపి భక్షితుమ్‌ l చాండాల స్తమథో వాచ నాద్య భక్ష్య స్త్వయా హ్యహమ్‌ ll

ప్రాత ర్భోక్ష్యసి కళ్యాణ సత్య మేష్యా మ్యహం పునః l అద్య కార్యం మమ మహ త్తస్మా న్ముంచస్వ రాక్షస ll

శ్వః సత్యేన సమేష్యమి తతః ఖాదసి మామితి l విష్ణుశుశ్రూషణార్థాయ రాత్రి జాగరణం మయా ll 18

కార్యం న వ్రత విఘ్నం మేకర్తు మర్హపి రాక్షస ll

వ్యాస ఉవాచ

తం రాక్షసః ప్రత్యువాచ దశరాత్ర మభోజనమ్‌ l మమాభూదద్య చ భవా న్మయా లబ్దో మతంగజ ll 20

నమోక్ష్యే భక్షయిష్యామి క్షుధయా పీడితో భృశమ్‌ l నిశాచరవచః శ్రుత్వా మాతంగ స్తమువాచ హ ll 21

స్వాంత్వయన్‌ శ్లక్‌ష్ణయా వాచా న సత్యవచనై ర్దృఢైః ll

ఓ మునిశ్రేష్ఠులారా! ప్రజాగరము చేసి విష్ణుమహిమ గానముచేయుటవలని ఫలమును క్రమముతో చెప్పెదను వినుడు.

భూలోకమున ప్రసిద్ధిపొందిన అవంతీనగరమున శంఖచక్రాదదాధరుడగు విష్ణువు కలడు. ఆనగరము చివరలో గానమున నేర్పరియగు చాండాలుడు కలడు. అతడు సద్వృత్తితోధనమార్జించి తన సేవకులను పోషించుచుండును. అతడు విష్ణుభక్తుడై ప్రతి మాసమునను దృఢవ్రతుడై ఏకాదశినాడు ఉపవసించి రాత్రి ప్రజాగరము చేసి విష్ణుని అవతారములను గూర్చి అతని నామముచే అంకితములగు గీతికలను సప్తస్వర ప్రస్తారయుక్తములగు గానము చేయును. ప్రాతఃసమయమున ద్వాదశీతిథిలో విష్ణుని నమస్కరించి స్వగృహమునకు వచ్చితన కూతుళ్లు అల్లుండ్రు మేనల్లుండ్రుపరివారము- వీరిని భుజింపజేసి తరువాత తాను భుజించును. ఇట్లు విష్ణుప్రీతిని కలిగించుచు జీవించు అతనికి చాల వయస్సు గడచెను. ఇట్లుండ ఒకప్పుడు చైత్రకృష్ణైకాదశినాడు విష్ణుసేవకై అతడు భక్తితత్పయడై పూలు తెచ్చుటకై ఉత్తమవనమనకు పోయి క్షిప్రానది యొడ్డున కలివృక్షముక్రిందనున్న ఒక రాక్షసునకు కనబడెను. ఆరాక్షసుడు ఈ చాండాలుని తినగోరెను. నీవు నన్ను ఈనాడు తినవలదు. నేను రేపు మరల నిజముగా వత్తును. నేనీవాడు పూజచేసికొనవలయును. కాన రాక్షసా ! నన్ను విడువుము. రాత్రి జాగరణము చేసి నేను విష్ణుని సేవింతును. నాకు వ్రత విఘ్నము చేయవలదు. అని చాండాలుడు రాక్షసుని వేడెను.

ఓచాండాలుడా ! పదినాళ్ళు నాకు ఆహారము లేక ఈనాడు నీవు నాకు దొరకితివి. నాకు చాల అకలిగా ఉన్నది. నేను నిన్ను విడువను. భక్షింతును. అని పలికిన రాక్షసుని బ్రతిమాలుచు చాండాలుడు దృఢములగు సత్యవచనములు ఇట్లు పలికెను.

మాతంగ ఉవాచ

సత్యమూలం జగత్సర్వం బ్రహ్మ రాక్షస తచ్ఛృణు l సత్యేనాహం శపిష్యామి పున రాగమనాయ చ ll 22

ఆదిత్యశ్చంద్రమా మహ్ని ర్వాయు ర్భూ ర్ద్యౌర్జలం మనః | అహోరాత్రం యమః సంధ్యే ద్వే విదు ర్నర ll 23

పరదారేషు యత్పాపం యత్పరద్రవ్యహారిషు l యచ్చ బ్రహ్మ హనః పాపం సురాపే గురుతల్పగే ll 24

వంధ్యాపతేశ్చ యత్సాపం యత్పాపం వృషలీపతేః l యచ్చ దేవలకే పాపం మత్స్యమాంసాశినశ్చయత్‌ ll 25

క్రోడమాంసాశినో యచ్చ కూర్మమాంసాశినశ్చ యత్‌ l వృథామాంసాశినో యచ్చ పృష్ఠమాంసాశినశ్చయత్‌ ll

కృతఘ్నే మిత్రఘాతకే యత్సాపం దిధిఘాపతౌ l సూతకస్య చ యత్సాపం యత్సాపం క్రూర కర్మణః ll 27

కృపణస్య చ యత్సాపం యచ్చ వంధ్యాతిథే రపి l అమావాస్యా7ష్టమీ షష్ఠీ కృష్ణ శుక్ల చతుర్దశీ ll 28

తాసు యద్గమనా త్సాపం య ద్విప్రో వ్రజతి స్త్రియమ్‌ l రజస్వలాం తథా పశ్చా చ్ర్ఛాద్ధం కృత్వాస్త్రియం ప్రజేత్‌ ll

సర్వస్వస్నాత భోజ్యానాం య త్సాపం మలభోజనే l మిత్రభార్యాం గచ్ఛతాం చయత్పాపం పిశునస్యచ ll 30

దంభమాయానురక్తే చ యత్పావం మధుఘాతినః l బ్రాహ్మణస్య ప్రతిశ్రుత్య యత్పాపం తదయచ్ఛతః ll 31

యచ్చ కన్యానృతే పాపం యచ్చ గోశ్వనరానృతే l స్త్రీబాలహంతు ర్య త్సాపం యచ్చ మిథ్యాభిభాషిణః ll 32

దేవవేద ద్విజనృప పుత్రమిత్ర సతీ స్త్రియః l యచ్చ నిందయతాం పాపం గురుమిథ్యాపచారతః ll 33

అగ్నిత్యాగిషు య త్పాన మగ్నిదాయిషు యద్వనే l గృహేష్ట్యాపాతకే యచ్చయ ద్గోఘ్నే య ద్ద్విజాధమే ll 34

యత్పాపం పరివిత్తేచ యత్పాపం పరివేదినః l తయో ర్దాతృగ్రహీత్రోశ్చ యత్పాపం భ్రూణఘాతినః ll 35

కించాత్ర బహుభిః ప్రోక్తైః శపథై స్తవ రాక్షస l శ్రూయతాం శపధం భీమం దుర్వాచ్య మపి కథ్యతే ll 36

స్వకన్యా జీవినః పావం గూఢసత్యేన సాక్షిణః l అయాజ్యయాజకే షంఢే యత్పాపం శ్రవణ7ధమే ll 37

ప్రవ్రజ్ర్యావసితే యచ్చ బ్రహ్మచారిణి కాముకే l ఏతైస్తు పాపైర్లిప్యే7హం యది నైష్యామి తే7ంతికమ్‌ ll

బ్రహ్మరాక్షసా ! వినుము. జగత్తునకు అంతటికి సత్యమే మూలము. నేను మరల వత్తునని సత్యముతో శపథము చేయుచున్నాను. నరుడు చేయు పనులకు సూర్యచంద్రులు అగ్నివాయువులు భూమ్యాకాశములు జలము మనస్సు అహోరాత్రములు యముడు ప్రాతఃసాయం సంధ్యలు సాక్షులు. నేను మరల నీదగ్గరకు రానిచో వరదార ధనములందు ఆసక్తి బ్రహ్మహత్య సురాపానము గురుదార గమనము గొడ్రాలికి శూద్రస్త్రీకి పతియగుట పూజారితనము చేప-పంది-తాబేలు- వీని మాంసము తినుట నిష్కారణముగా మాంసము తినుట వెన్నుమాంసము తినుట కృతఘ్నత మిత్ర ద్రోహము మారుమనువాడిన స్త్రీని పెండ్లాడుట సూతకము కలుపుకొనుట క్రూరకర్మలు చేయుట పిసినిగొట్టుతనము అతిథుల నాదరింపకుండుట అమావాస్య అష్టమి షష్ఠీ కృష్ణ శుక్లవక్ష చతుర్దశులు-ఈ తిథులయందును శ్రాద్ధముచేసిన తరువాతను స్త్రీతో సంగమించుట బహిష్ఠుఐన స్త్రీని కలియుట మిత్రునిభార్యను పొందుట చాడీలు చెప్పుట కపటము మోసముచేయుట తేనె దొంగలించుట బ్రాహ్మణునికి దానమిత్తునని ఒప్పుకొనినది ఈయకుండుట కన్యను గోవును కంచరగాడిదను ఇత్తునని ఈయకుండుట స్త్రీ బాలవధ అసత్యమాడుట వ్యర్థముగా మాటలాడుట దేవతలను వేదములను ద్విజులను రాజులను పుత్రులను మిత్రులను పతివ్రతలను గురువులను నిందించుట అగ్నిహోతము విడుచుట నిప్పుపెట్టుట గృహేష్టిచేయుట ద్విజాధముడై గోవధచేయుట భ్రూణవధ తమ్మునకు పెండ్లి ఐన తరువాత తాను పెండ్లాడుట అన్నకంటె ముందు తాను పెండ్లాడుట- వలన కలుగు పాపమలు నేను మరల నీకడకు రానిచో నాకు తగులును. ఇంకను భయంకర శపథము వినుము. నేను తిరిగిరానిచో తన కన్యపై జీవించుట సత్యమును మఱుగుపఱచి సాక్ష్యము పలుకుటయాగము చేయింపరాని వానిచే యాగము చేయించుట నపుంసకుడగుట శ్రవణము చేయరానివాని వానినుండి శాస్త్ర శ్రవణముచేయుట శ్రవణము చేయదగనివానికి శాస్త్రముల శ్రవణముచేయుట సన్యాసికాని బ్రహ్మచారికాని కాముకుడై ప్రవర్తించుట- వీనివలన కలుగు పాపముల పొందుదును. అని చాండాలుడు రాక్షసునకు శపథము చేసెను.

వ్యాస ఉవాచ

మాతంగ వచనం శ్రుత్వా విస్మితో బ్రహ్మ రాక్షసః l ప్రాహ గచ్ఛస్వ సత్యేన సమయం చైవ పాలయ ll 39

ఇత్యుక్తః కుణపాశేన శ్వపాకః కుసుమాని తు l సమాదాయాగమచ్చైవ విష్ణోః స నిలయం గతః ll 40

తాని ప్రాదా ద్ర్బాహ్మణాయ సో7పి ప్రక్షాళ్య చాంభసా l విష్ణు మభ్యర్చ్య నిలయం జగామ స తపోధనాః ll 41

సో7పి మాతంగదాయాదః సోపవాసస్తుతాం నిశామ్‌ l గాయన్హి బాహ్యభూమిష్ఠః ప్రజాగరము పాకరోత్‌ ll 42

ప్రభాతాయాం తు శర్వర్యాం స్నాత్వా దేవం నమస్య చ l సత్యం స సమరుం కర్తుం ప్రతస్థే యత్ర రాక్షసః ll

తం వ్రజంతం పథి నరః ప్రాహ భద్ర క్వ గచ్ఛసి l స తథా7కథయ త్సర్వం సో7స్యేనం పునరబ్రవీత్‌ ll 44

ధర్మార్థకామ మోక్షాణాం శరీరం సాధనం యతః l మహతా తు ప్రయత్నేన శరీరం పాలయే ద్బుధః ll 45

జీవన్‌ ధర్ధార్థ సుఖంనర స్తథా77ప్నోతి మోక్షగతిమగ్ర్యామ్‌ l జీవన్కీర్తి ముపైతి చ భవతియదిమృస్యకాకథాలోకే ll

మాతంగ స్తద్వచః శ్రుత్వా ప్రత్యువా చాథ హేతుమత్‌ ll 47

మాతంగ ఉవాచ

భద్ర సత్యం పురస్కృత్య గచ్ఛామి శపథాః కృతాః ll 48

వ్యాసఉవాచ

తం భూయః ప్రత్యువా చాథ కి మేవం ముఢధీర్భవాన్‌ l కిం నశ్రుతం త్వయా సాధో మనునా యదుదీరితమ్‌ ll

గోస్త్రీద్విజానాం పరిరక్షణార్థం వివాహకాలే సురతప్రసంగే l ప్రాణాత్యయే సర్వధనాపహారే పం చానృతా న్యాహు రపాతకాని ll 50

ధర్మవాక్యం న చ స్త్రీషు న వివాహే తథా రిపౌ l వంచనే చార్థహానౌ చ స్వనాశే7నృతకే తథా ll 51

ఏవం తద్వాక్య మాకర్ణ్య మాతంగః వ్రత్యువాచ హ ll

మాతంగ ఉవాచ

మైవం వదస్వ భద్రం తే సత్యం లోకేషు పూజ్యతే l సత్యే నావాప్యతే సౌఖ్యం యత్కించి జ్జగతీగతమ్‌ ll 52

సత్యేనార్కః ప్రతపతి సత్యేనా77పో రసాత్మికాః l జ్వల త్యగ్నిశచ సత్యేన వాతి సత్యేన మారుతః ll 53

ధర్మార్థ కామ సంప్రాప్తి ర్మోక్షప్రాప్తిశచ దుర్లభా l సత్యేన జాయతే పుంసాం తస్మా త్సత్యం నసంత్యజేత్‌ ll

సత్యం బ్రహ్మ పరంలోకే సత్యం యజ్ఞేషు చోత్తమమ్‌ l సత్యం స్వర్గ సమాయాతం తస్మా త్సత్యం నసంత్యజేత్‌ ll

బ్రహ్మరాక్షసుడు చాండాలుని మాటవిని ఆశ్చర్యపడి ఈ సత్యశపథముతో వెళ్ళి అన్నమాట కాపాడుము అనెను. ఆచాండాలుడును పుష్పములు తీసికొని దేవాలయమునకు పోయి బ్రాహ్మణునకిచ్చెను. అతడవి నీటితో కడిగి విష్ణుని అర్చించితన ఇంటికి పోయెను. చాండాలుడు ఆనాడు ఉపవసించి గుడివెలుపలనుండి విష్ణుగీతుల పాడుచు రాత్రి ప్రజాగరము చేసెను. తెల్లవారగనే అతడు స్నానమాడి విష్ణుని నమస్కరించి తన సత్యమును కాపాడుకొనుటకై రాక్షసుని దగ్గరకు బయలుదేరెను. త్రోవలో తనకెదురైన ఒక నరునకును చాండాలునకును ఇట్లు సంభాషణము జరిగెను.

నరుడు''నాయనా! ఎక్కడకు పోవుచున్నావు?''

చాండాలుడు తనకు రాక్షసుని విషయమున జరిగినదంతయును చెప్పెను.

నరుడు: ''ధర్మార్థ కామమోక్షములకు శరీరమే సాధనము. కావున వివేకవంతుడు మహాప్రయత్నముతోనైనను శరీరము రక్షించుకొనవలెను. జీవించినచో కీర్తియు లభించును. మరణించినవాని మాట ఎవడు తలచును?''

చాండాలుడు యుక్తియుక్తముగా ఇట్లనెను. ''అయ్యా నేను చాల శపథములు చేసితిని, సత్యము కాపాడుటకై నేను పోవుచున్నాను.''

నరుడు'' నీవు ఇట్లు మూడబుద్ధివై ఉన్నావేమి? ఓ సత్పురుషుడా! గోవులను స్త్రీలను ద్విజులను రక్షించుటకును వివాహము విషయమునను సురత సందర్భమునను ప్రాణములును సర్వధనమును పోవుచున్నప్పుడును అసత్యమాడుట పాతకముగాదు. స్త్రీల విషయమున వివాహసందర్భమునను శత్రువు విషయమునను మోసము ధనహాని ఆత్మనాశము జరుగునప్పుడును ఇతరులు అసత్యము చేయునప్పుడును ధర్మవాక్యములను పాటించరాదు. అని మనువు చెప్పినది నీవు వినలేదా?''

చాండాలుడు ''అయ్యా! అట్లు పలుకకుము. సత్యము లోకమలందు పూజింపబడును. లోకమందలి సర్వ సౌఖ్యములును సత్యముచే లభించును. సత్యముచేతనే సూర్యుడు వెలుగును. నీరు ప్రవహించును. అగ్ని జ్వలించును గాలి వీచును. చతుర్విధ పురుషార్థములు సత్యముచేతనే లభించును. సత్యము పరబ్రహ్మము . ఉత్తమయజ్ఞము . స్వర్గము నుండి వచ్చినది సత్యము. సత్యమును విడువరాదు.''

వ్యాస ఉవాచ

ఇత్యుక్త్వా సో7థ మాతంగ స్తం ప్రక్షిప్య నరోత్తమమ్‌ ll జగామ తత్రయత్రా77స్తేప్రాణిహా బ్రహ్మరాక్షసః ll

తమాగతం సమీక్ష్యాసౌ చాండాలం బ్రహ్మరాక్షసః l విస్మయోత్పుల్లనయనః శిరఃకంపం తమబ్రవీత్‌ ll 57

బ్రహ్మరాక్షస ఉవాచ

సాధు సాధు మహాభాగ సత్యవా క్యానుపాలక l న మాతంగ మహం మన్యే భవంతం సత్యలక్షణమ్‌ ll 58

కర్మణా77నేన మన్యే త్వాం బ్రాహ్మణం శుచి మవ్యయమ్‌

యత్కించిత్త్వాం భద్రముఖం ప్రవక్ష్యే ధర్మ సంశ్రయమ్‌ ll 59

కింతత్ర భవతా రాత్రౌకృతం విష్ణుగృహే వద

వ్యాస ఉవాచ

తమభ్యువాచ మాతంగః శృణు విష్ణు గృహే మయా l యత్కృతం రజనీఖాగే యథాతథ్యం వదామి తే ll 60

విష్ణో ర్దేవకుల స్యాధః స్థితేనా77నమృమూర్తినా l ప్రజాగరః కృతో రాత్రౌ గాయతా విష్ణుగీతికామ్‌ ll 61

తం బ్రహ్మరాక్షసః ప్రాహ కియంతం కాల ముచ్యతామ్‌ l ప్రజాగరో విష్ణుగృహే కృతోభ క్తిముతా వద ll 62

తమభ్యువాచ ప్రవాస న్వింశ త్యబ్దాని రాక్షస l ఏకాదశ్యాం మాసి మాసి కాత స్తత్ర వ్రజాగరః ll 63

మాతంగ వచనం శ్రుత్వా ప్రోవాచ బ్రహ్మరాక్షసః ll

బ్రహ్మరాక్షస ఉవాచ

యదద్య త్వాం ప్రవక్ష్యామి తద్భవా న్వక్తు మర్హతి l ఏకరాత్రి కృతం సాధో మమ దేహ ప్రజాగరమ్‌ ll 64

ఏవంత్వాం మోక్షయిష్యామి మోక్షయిష్యామి నాన్యధా l త్రిః సత్యేన మహాభాగ ఇత్యుక్త్వా విరరామ హ ll 65

వ్యాస ఉవాచ

మాతంగ స్తమువా చాథ మయా77త్మాతే నిశాచరl నివేదితః కిముక్తేన ఖాదస్వ స్వేచ్ఛయా7పి మామ్‌ ll 66

తమాహ రాక్షసో భూయో యామద్వయ ప్రజాగరమ్‌ l సగీతంమే ప్రయచ్ఛస్వ కృపాం కర్తుం త్వ మర్హసి ll 67

మాతంగో రాక్షసం ప్రాహ కిమసంబద్ధ ముచ్యతే l ఖాదస్వ స్వేచ్ఛయా మాం త్వం స ప్రదాస్యే ప్రజాగరమ్‌ ll 68

మాతంగ వచనం శ్రుత్వా ప్రాహ తం బ్రహ్మరాక్షసః ll

బ్రహ్మరాక్షస ఉవాచ

కోహి దుష్ట మతిర్మందో భవంతం ద్రష్టు ముత్సహేత్‌ ll 69

ధర్షయితుం పీడయితుం రక్షితం ధర్మకర్మణా ll

దీనస్య పాపగ్రస్తస్య విషయై ర్మోహితస్య చ l నరకార్తస్య మూఢస్య సాధవః స్యు ర్దయాన్వితాః ll 70

తన్మమత్వం మహాభాగ కృపాం కృత్వా ప్రజాగరమ్‌ | యామ సై#్యకస్య మే దేహి గచ్ఛ వా నిలయం స్వకమ్‌ ll 71

వ్యాస ఉవాచ

తం పునః ప్రాహ చాండాలో న యాస్యామి నిజం గృహమ్‌ l నచాపి తవ దాస్యామి కథంచిద్యామజాగరమ్‌ ll 72

తం ప్రహస్యాథ చాండాలం ప్రోవాచ బ్రహ్మరాక్షసః ll

బృహ్మరాక్షస ఉవాచ

రాత్ర్యవసానే యా గీతా గీతికా కౌతుకాశ్రయా | తస్యా ఫలం ప్రయచ్ఛస్వ త్రాహి పాపా త్పముద్ధర || 73

వ్యాస ఉవాచ

ఏవ ముచ్చారితే తేన మాతంగ స్తమువాచ హ || 74

మాతంగ ఉవాచ

కిం పూర్వం భవతా కర్మ వికృతం కృతమంజసా | యేన త్వం దోష జాతేన నంభూతో బృహ్మరాక్షసః || 75

వ్యాస ఉవాచ

తస్య తద్వాక్య మాకర్ణ్య మాతంగం బ్రహ్మరాక్షసః | ప్రోవాచ దుఃఖసంతప్తః సంస్మృత్య స్వకృతం కృతమ్‌ ||

ఇట్లుపలికి ఆ చాండాలుడు ఆ నరుని వదలివేసి ప్రాణిఘాతుకుడగు ఆ బ్రహ్మరాక్షసుడున్నచోటికి పోయెను. వాడు ఆశ్చర్యముతో కన్ను విప్పారించి తల ఆడించుచు ఇట్లు పలికెను. ''సత్యవాక్యమును అనుపాలించిన ఓ మహాభాగా! మేలుమేలు! సత్యమే లక్షణముగాగల నీవు చాండాలుడు కావని నా అభిప్రాయము. నీవు చేసిన ఈ పనిని బట్టి నీవు శుచియై అవ్యయుడగు ఏ వికారమును లేని - బ్రాహ్మణుడవే. శుభస్వరూపుడవగు నీతో ధర్మమును గూర్చి కొంచెము మాటలాడెదను. నీవు రాత్రి విష్ణ్వాలయమున ఏమి చేసితివో చెప్పుము''. చాండాలుడిట్లు పలికెను. ''వినుము. రాత్రికాలమున విష్ణ్వాలయమున నేనేమి చేసితినో ఉన్నది ఉన్నట్లు చెప్పెదను. ఆలయమునకు దిగువ వినయముతో వంగియుడి నిలిచి రాత్రి అంతయు ప్రజాగరము చేసి విష్ణుగీతికలు గానము చేసితిని. రాక్షసుడు నీవు భక్తితో ఎంతకాలము ఆలయమున ప్రజాగరము చేసితివి?'' అనెను. ప్రతిమాసమునందును ఏకాదశీతిథులందు ఇరువది సంవత్సరములు ప్రజాగరము చేసితిని. అని చాండాలుడు నవ్వుచు పలికెను. అది విని బ్రహ్మరాక్షసుడు నీవు ఒకరాత్రి ప్రజాగరము చేసి పొందిన ఫలము నాకిమ్ము. అట్లెననేకాని నేను నిన్ను విడువను. అని పలికెను. ఓ రాక్షసుడా! నా దేహము నీకర్పించితిని. మాటలతో పనియేమి? స్వేచ్ఛగా నన్ను తినుమని చాండాలుడు పలికెను. అయ్యా దయతో నీవు రెండుజాములు ప్రజాగరము చేసితిని. అని చాండాలుడు నవ్వుచు పలికెను. ఓ రాక్షసుడా! నా దేహము నీకర్పించితిని. మాటలతో పనియేమి? స్వేచ్చగా నన్ను తినుమని చాండాలుడు పలికెను. ఓ రాక్షసుడా! నా దేహము నీకర్పించితిని. మాటలతో పనియేమి? స్వేచ్ఛగా నన్ను తినుమని చాండాలుడు పలికెను. అయ్యా! దయతో నీవు రెండుజాములు ప్రజాగరము చేసి సంగీతము పాడి సంపాదించిన ఫలమునైన ఇమ్మని రాక్షసుడు బ్రతిమాలెను. అసంబద్ధముగా ఏల మాటాడెదవు? నేను ప్రజాగరఫలము నీయును. స్వేచ్ఛగా నన్ను నీవు తినుమని చాండాలుడనెను. ఆ మాటవిని బ్రహ్మరాక్షసుడిట్లనెను., ఏమందుడగు దుష్టబుద్ది ధర్మకర్మలచే రక్షితుడవగు నిన్ను చూచుటకుగాని బెదరించుటకు గాని పీడించుటకుగాని శక్తి కలవాడు అగును? అదికాక దీనుడు పాపగ్రస్తుడు విషయనుసుఖములచే మోహము పొందినవాడు నరకయాతనలచే పీడింపబడువాడు మూఢుడు అగువాని విషయములో సత్పరుషులు దయచూపుదురు. ఇట్టి నామీద నీవు దయచూపి ఒక జాము ప్రజాగరము చేసి సంపాదించిన ఫలమునైన ఇమ్ము. లేదా నీ ఇంటికి మరలిపొమ్ము. నీకు యామప్రజాగరఫలమును కూడ ఈయను. ఇంటికిని మరలిపోను. అని చాండాలుడనెను. రాత్రిచివరలో వినోదార్థము పాడిన పాట ఫలమునైన ఇచ్చి నన్ను పాపమునుండి సముద్దరింపుము. అని బ్రహ్మరాక్షసుడు బ్రతిమాలెను. అది విని నీవు పూర్వము ఏ వికృతకర్మము చేసి ఈ దోషరాశిచే ఇట్లు బ్రహ్మరాక్షనుడవైతివని చాండాలుడడుగగా వినివాడు దుఃఖముచే సంతప్తుడగుచు తానుచేసిన దుష్కృతమును జ్ఞాపకము చేసికొనుచు ఇట్లు పలికెను.

బ్రహ్మరాక్షస ఉవాచ

శ్రూయతాం యో7హ మానం వై పూర్వం యచ్చ మయా కృతమ్‌ | యస్మిన్కృతే పాపయోనిం గతవానస్మి రాక్షసీమ్‌ ||

సోమశర్మా ఇతి ఖ్యాతః పూర్వమాస మహం ద్విజః | పుత్రో7ధ్యయనశీలన్య దేవశర్మస్య యజ్వనః || 78

కన్యచి ద్యజమానిస్య సూత్రమంత్ర బహిష్క్రతః | నృపస్య కర్మనక్తేన యూపకర్మను నిష్టితః || 79

అగ్నీధ్రం చాకరోద్యజ్ఞే లోభమోహ ప్రపీడితః | తస్మి న్పరినమాప్తే తు మౌర్ఖ్యాద్దంభ మనుష్ఠితః || 80

యష్టు మారబ్ధవా నస్మి ద్వాద శాహం మహాకృతుమ్‌ | ప్రవర్తమానే తస్మింస్తు కుక్షిశూలో7భవన్మమ || 81

సంపూర్ణే దశరాత్రే తు న సమాప్తే తథా కృతౌ | విరూపాక్షస్య దీయంత్యా మాహుత్యాం రాక్షసే క్షణ || 82

మృతో7హం తేన దోషేణ నంభూతో బ్రహ్మరాక్షసః | మూర్ఖేణ మంత్ర హీనేన సూత్రస్వరవివర్జితమ్‌ || 83

అజాసతా య జ్ఞవిద్యాం య దిష్టం యాజితం చ యత్‌ | తేన కర్మవిపాకేన సంభూతో బ్రహ్మరాక్షసః || 84

తన్మాం పాపమహాంభోదౌ నిమగ్నం త్వం సముద్ధర | ప్రజాగరే గీతికైకాం పశ్చిమాం దాతు మర్హసి || 85

వ్యాస ఉవాచ

త మువా చాథ చాండాలో యది ప్రాణిపదా ద్భవాన్‌ | నివృత్తిం కురుతే దద్యాం తతః పశ్చిమ గీతికామ్‌ || 86

బాఢ మిత్యవద త్సో7పి మాతంగో7పి దదౌ తదా | గీతికాఫల మామంత్ర్య ముహూర్తార్ధ ప్రజాగరమ్‌ || 87

తస్మి న్గీతిఫలే దత్తే మాతంగం బ్రహ్మరాక్షసః | ప్రణమ్య ప్రయ¸° హృష్ట స్తీర్థవర్యం పృథూదకమ్‌ || 88

తత్రానశన సంకల్పం కృత్వా ప్రాణా న్జహౌ ద్విజాః | రాక్షసత్వా ద్వినిర్ముక్తో గీతికాఫల బృంహితః || 89

పృథూదక ప్రభావాచ్చ బ్రహ్మలోకం చ దుర్లభమ్‌ | దశ వర్ష సహస్రాణి నిరాతంకో7వసత్తతః || 90

తస్యాంతే బ్రాహ్మణో జాతో బభూవ స్మృతిమా న్వశీ | తస్యాహం చరితం భూయః | కథయిష్యామి భోద్విజాః ||

నేను పూర్వము ఎవడవో ఏమి పాపము చేసినందున రాక్షసుడనై పాపయోనియందు జన్మించితినో చెప్పెదను వినుము. సోమయాజియు వేదధ్యయనము చేసినవాడునగు దేవశర్మ యను బ్రాహ్మణుని కుమారుడగు సోమశర్మ అనువాడనుగా ఉంటిని. యజ్ఞోపవీతధారణమునకు వేదమంత్ర గ్రహణమునకు అధికారము లేకయు యజ్ఞకర్మచేయవలెననను అసక్తికల ఒక యజమానుని యజ్ఞకర్మను జరిపించుటయందు శ్రధ్దవహించి లోభముచే మోహముచే బాధింపబడిన వాడనగుచు అగ్నీధ్రుడుగా - అగ్నీధ్రము అనుస్థానమున నుండు ఋత్విక్‌గా ఉంటిని. ఆ యజమానుని ఆ యజ్ఞము ముగియగానే మూర్ఖుడనై దంభమును అవలంబించి ద్వాదశాహ - పండ్రెండు నుత్యాహస్సులతో చేయదగిన - మహాక్రతువును చేయింపనారంభించితిని. అది జరుగుచుండగా నాకు కడుపునొప్పి కలిగెను. అప్పటికి పదినాళ్లు మాత్రము గడచెను. యజ్ఞము ముగియలేదు. రాక్షస సమయమునందు విరూపాక్షునకు ఆహుతి ఈయబడుచున్న సమయమున నేను మరణించి ఆ దోషముచే బ్రహ్మరాక్షసుడనైతిని. మూర్ఖుడనై మంత్రము సూత్రము స్వరము సరిగా తెలియక యజ్ఞవిద్య తెలియక యజ్ఞము చేయుటచే - చేయించుటచే - ఆ దోషమున బ్రహ్మరాక్షసుడనైతిని. కనుక ఇట్లు పాపమహాసముద్రమున మునిగియున్న నన్ను నీ వ్రజాగరముతో కడపటి ఒక పాటయొక్క ఫలమునైన దానము చేసి ఉద్ధరింపుము. అని బ్రహ్మరాక్షసుడు వేడెను. నీవు ఇక నుండి ప్రాణివధను మానుకొందువేని నాకడపటిపాట ఫలమిత్తునని చాండాలుడనగా బ్రహ్మరాక్షసు డంగీకరించెను. తన ప్రజాగరములో కడపటి సగము జాములో పాడినపాట ఫలమును చాండాలుడు వానికి దానము చేసెను. వెంటనే వాడును చాండాలుని నమస్కరించి తీర్థశ్రేష్టమగు పృథూదకతీర్థమునకు పోయి అక్కడ నంకల్పపూర్వకముగా ఆహారము విడిచి ప్రాణములు విడుచుటతో ఆ చాండాలుడిచ్చిన గీతికాఫలబలముచే రాక్షసత్వమునుండి విముక్తుడయ్యెను. పృథూదక తీర్థప్రభావమున పదివేల యేండ్లు దుర్లభమగు బ్రహ్మలోకమున నిరంతరముగా నుండి పిమ్మట పూర్వజన్మప్మృతియు ఇంద్రియు నిగ్రహమును గల బ్రాహ్మణుడై జన్మించెను. ద్విజులారా! అతని కథను మీకు మరల చెప్పెదను.

మాతంగస్య కథాశేషం శృణుధ్వం గదతో మమ | రాక్షసే తు గతే ధీమా న్గృహమేత్య యతాత్మవాన్‌ || 92

త ద్విప్రచరితం స్మృత్వా నిర్విణ్ణః శుచిర ప్యసౌ | పుత్రేషు భార్యం నిక్షిప్య దదౌ భూమ్యాః ప్రదక్షిణామ్‌ || 93

కోకాముఖాత్సమారభ్య యావద్వైన్కంద దర్శనమ్‌ | దృష్ట్వా స్కందం య¸° ధారాం చక్రే చాపిప్రదక్షిణమ్‌ || 94

స్నానం పాపహరం చక్రేసతు చాండాల వంశజః | విముక్తపాపః సస్మార పూర్వజాతీ రనేకశః || 96

స పూర్వజన్మ న్యభవ ద్భిక్షుః సంయత వాఙ్మనాః | యతకాయశ్చ మతిమా న్వేదవేదాంగ పారగః || 97

ఏకదా గోషు నగరా ద్ద్రియమాణాసు తస్కరైః | భిక్షా7వధూతా రజసా ముక్తాతేనాథ భిక్షుణా || 98

నతే నాధర్మదోషేణ చాండాలీం యోని మాగతః | పాప ప్రమోచనే స్నాతః నమృతో నర్మదా తటే || 99

మూర్ఖో7భూ ద్ర్బాహ్మణవరో వారాణస్యాం చ భో ద్విజాః | తత్రాస్య వసతోబ్దైస్తు త్రింశద్భిః సిద్ధపూరుషః || 100

విరూపరూపీ బభ్రామ యోగమాయాబలాన్వితః | తం దృష్ట్వా సోపహాసార్థ మభివాద్యాభ్యువాచ హ || 101

కుశలం సిద్దపురుషం కుత స్త్వాగమ్యతే త్వయా ||

వ్యాస ఉవాద

ఏవం సంభాషిత స్తేన జ్ఞాతో7హమితి చింత్య తు | ప్రత్యువా చాథ వంద్య స్తం స్వర్గలోకాదుపాగతః || 102

తం సిద్ధం ప్రాహ మూర్ఖో7సౌ కిం త్వం వేత్సి త్రివిష్టపే | నారాయణోరుప్రభవా ముర్వశీ మప్సరో వరామ్‌ || 103

సిద్ద స్త మాహ తాం వేద్మి శక్ర చామర ధారిణీమ్‌ | స్వర్గస్యా77భరణం ముఖ్య ముర్వశీం సాధుసంభవామ్‌ || 104

విప్రః సిద్ధ మువా చాథ బుజుమార్గవివర్జితః | తన్మిత్ర మత్కృతే వార్తా ముర్వశ్యా భవతా77దరాత్‌ || 105

కథనీయా యచ్చ సాతే బ్రూయా దాఖ్యాస్యతే భవాన్‌ | బాఢ మి త్య బ్రవీ త్సిద్దః సో7పి విప్రో ముదాన్వితః ||

బభూవ సిద్దో7పి య¸° మేరు పృష్టం సురాలయమ్‌ | సమేత్య చోర్వశీం ప్రాహ య దుక్తో7సౌ ద్విజేన తు ||

సాప్రాహ తం సిద్ధంవరం నాహం కాశిపతిం ద్విజమ్‌ | జానామి సత్య ముక్తం తే న చేతసి మమ స్థితమ్‌ || 108

ఇత్యుక్తః ప్రయ¸° సో7పి కాలేన బహునా పునః || 109

చాండాలుని కథాశేషమును చెప్పెదను వినుడు. బుధ్దిశాలియు శుచియు అగు ఆ చాండాలుడు అనంతరము తన ఇంటికి పోయి ఆ బ్రాహ్మణుని కథను తలచుకొనుచు వైరాగ్యము చెంది భార్యను కుమారులకు అప్పగించి కోకాముఖక్షేత్రమున బయలుదేఱి కుమారస్వామి దర్శనమగువరకు భూప్రదక్షిణము చేసెను. కుమారస్వామిని స్కందుని - దర్శించి ధారాచక్రమును ప్రదక్షిణము చేసి వింధ్య పర్వతమును చేరి పాపప్రమోచన తీర్థమున స్నానముచేసి పాపవిముక్తుడై తన పూర్వజన్మములనేకములు జ్ఞాపకము చేసికొనెను. ఈ జన్మపరంపరా విషయము ఇట్లున్నదిః ఈ చాండాలుడు ఒక పూర్వజన్మములో బుద్దిశాలియు వేదవేదాంగములు కడవరకు నేర్చినవాడును త్రికరణములయందు నిగ్రహము కలవాడును అగు భిక్షువుగా నుండెను. ఒకప్పుడు దొంగలు హరించుకొని పోవుచున్న గోవులచే రేగిన ధూళిచే అ భిక్షువు యొక్క భిక్ష కప్పబడగా దానినతడు వదలివేసెను. ఆ ధర్మదోషముచే అతడు చాండాలుడై పుట్టెను. అతడు నర్మదాతీరమునందలి పాపప్రమోచన తీర్థమున స్నానమూడిన పుణ్యమున మరణానంతరము వారణాసియందు మూర్ఖుడగు బ్రాహ్మణశ్రేష్టుడుగా పుట్టెను. అతడు ముప్పది ఏండ్లవాడై యుండగా అచటికి యోగమాయాబలము కలవాడును విరూపుడను అగు సిద్దుడు సంచరించుచు వచ్చి ఇతనికి కనబడెను. అతనిని చూచి ఈ మూర్ఖబ్రాహ్మణుడు ఉపహాసమునకై అతనిని నమస్కరించి ఓ సిద్దపురుషా ! కుశలమా? ఎక్కడినుండి వచ్చుచున్నావు? అని ప్రశ్నించెను. ఆ సిద్దుడు తన్ను ఈతడు తెలిసికొనెనని తలచి స్వర్గమునుండి వచ్చుచున్నాననెను. స్వర్గమునందు నారాయణముని తొడనుండి జన్మించిన యప్సరరసయగు ఊర్వశి నెఱుగుదువా? అని మూర్ఖబ్రాహ్మణుడడిగెను. అమె నారాయణముని నుండి జన్మించినది. స్వర్గమునకు అభరణము వంటిది. ఇంద్రునికి చామరగ్రాహణి. ఇట్టి ఊర్వశిని నేనెఱుగకపోవుటేమి? అని సిద్దుడనెను. ఆమూర్ఖబ్రాహ్మణుడును సరళమార్గము విడిచి వక్రమార్గమున ఇట్లనెను. ఓ మిత్రమా! నా మీద ఆదరము చూపి నా వృత్తాంతము ఊర్వశికి తెలిపి అమె చెప్పిన సమాధానమును నాకు వచ్చి చెప్పుమనెను. సిద్దుడు సరే అనెను. విప్రుడు సంతసించెను. సిద్దుడు మేరుపర్వతసానువు నందలి స్వర్గమునకు పోయి ఈ బ్రాహ్మణుడు చెప్పినమాట ఊర్వశికి చెప్పెను. కాశీపతియగు బ్రాహ్మణుడెవరో నేనెఱుగను కనుక నీవు చెప్పినమాట నిజమని నేననుకొనుటలేదు. అని ఊర్వశి సిద్దునితో పలికెను.

వారాణసీం య¸° సిద్దో దృష్టో మూర్ఖేణ వైపునః || 110

దృష్టః పృష్టః కిల భూయః కిమా హోరభవా తవ | సిద్దో7బ్రవీన్న జానామి మా మువా చోర్వశీ స్వయమ్‌ || 111

సిద్దవాక్యం తతః శ్రుత్వా స్మితభిన్నౌష్ఠసంపుటః | పునః ప్రాహ కథం వేత్సీ త్యేవం వాచ్యా త్వ యోర్వశీ || 112

బాఢ మేవం కరిష్యా మీత్యుక్త్వా సిద్దో దివం గతః | దదర్శ శక్రభవనా నిష్ర్కామంతీ మథోర్వశీమ్‌ || 113

ప్రోవాచ తాం సిద్దవరః | సా చ తం సిద్ద మబ్రవీత్‌ | నియమం కంచిదపి హి కరోతుద్విజసత్తమః || 114

యేనాహం కర్మణా సిద్ద తం జానామి న చాన్యథా | త దుర్వశీ వచో7భ్యేత్య తసై#్మ మూర్ఖద్విజాయ తు || 115

కథయామాస సిద్దస్తు సో7పీమం నియమం జగౌ | త వాగ్రే సిద్దపురుష నియమో7యం కృతో మయా || 116

న భోక్షే7 ద్యప్రభృతి వై శకటం సత్య మీరితమ్‌ | ఇత్యుక్తః ప్రయ¸° సిద్ధః స్వర్గే దృష్టోర్వశీ మథ || 17

ప్రాహా7సౌ శకటం భోక్ష్యే నాద్యప్రభృతి కర్హిచిత్‌ | తం సిద్ద ముర్వశీ ప్రాహ జ్ఞాతో7సౌ సాంప్రతం మయా || 118

నియమగ్రహణా దేవ మూర్ఖో మా ముపహాసకః ||

ఇత్యుక్త్వా ప్రయ¸° శీఘ్రం వాసం నారాయణాత్మజా || 119

సిద్దో7పి విచచా రాసౌ కామచారీ మహీతలమ్‌ | ఊర్వ శ్యపి వరారోహో గత్వా వారాణసీం పురీమ్‌ || 120

మత్స్యోదరీజలే స్నానం చక్రే దివ్య వపుర్ధరా | అథాసావపి మూర్ఖస్తు నదీం మత్సోదరీం మునే || 121

జగా మాథ దద ర్శాసౌ స్నాయమానా మ థోర్వశీమ్‌ | తాం దృష్ట్వా వవృధే7థాస్య మన్మథః క్షోభకృద్దృడమ్‌ || 122

చకార మూర్ఖశ్చేష్టాశ్చ తం వివే దోర్వశీ స్వయమ్‌ | తం మూర్ఖం సిద్ద గదితం జ్ఞాత్వ సస్మిత మాహతమ్‌ || 123

ఊర్వశ్యువాచ

కిమిచ్ఛసి మహాభాగ: మత్తః శీఘ్ర మి హోచ్యతామ్‌ | కరిష్యామి వచ స్తుభ్యం త్వంబిశ్రబ్ధం కరిష్యసి || 124

మూర్ఖ బ్రాహ్మణ ఉవాచ

ఆత్మప్రదానేన మమ ప్రాణా న్రక్ష శుచిస్మితే || 125

వ్యాస ఉవాచ

తం ప్రా హాథోర్వశీ విప్రం నియమస్థా7స్మి సాంప్రతమ్‌ | త్వం తిష్టస్వ క్షణ మథ ప్రతీక్షస్వా77గతం మమ ||

స్థితో స్మీ త్య బ్రవీ ద్విప్రః సా7పి స్వర్గం జగామ హ ||

మాస మాత్రేణ సా77యాతా దదర్శ తం కృశం ద్విజమ్‌ || 127

స్థితం మాసం నదీతీరే నిరాహారం సురాంగనా | తం దృష్ట్వా నిశ్చయయుతం భూత్వా వృద్దవపుస్తతః | 128

సా చకార నదీతీరే శకటం శర్కరావృతమ్‌ | ఘృతేన మధునా చైవ నదీం మత్స్యోదరీం గతా || 129

స్నాత్వా థ భూమౌ వసంతీ శకటం చ యథార్థతః | తం బ్రాహ్మణం నమాహూయ వాక్యమాహ సులోచనా || 130

ఊర్వశ్యువాచ

మయా తీవ్రంవత్రం విప్ర చీర్ణం సౌభాగ్యకారణాత్‌ | వ్రతాంతే నిష్కృతిం దద్యాం ప్రతి గృహ్ణీష్వ భో ద్విజః || 131

ఊర్వశీ చెప్పిన ఈ మాటలు విని సిద్దుడు వెడలిపోయి చాలకాలము తరువాత మరల వారాణసికి పోయెను. అతనిని చూచి మూర్ఖబ్రాహ్మణుడు ఊర్వశి ఏమి చెప్పెనని అడుగగా అమె తాను నిన్ను ఎఱుగననెనని సిద్దుడు పలికెను. ఆది విని మూర్ఖవిప్రుడు చిరునవ్వు నవ్వి ఈ మాఱు పోయినప్పుడు నీవాతనిని ఏ గురుతుతో గుర్తింపగలవని ఊర్వశిని అడుగుమనగా సిద్దుడును సరేయని స్వర్గమునకు పోయినప్పడు ఇంద్రభవనము నుండి బయటికి వచ్చుచ్చున్న ఊర్వశిని చూసి మూర్ఖబ్రాహ్మణుడు చెప్పినమాటఅమెకు చెప్పెను. అమె ఆబ్రహ్మణుడు ఏవైన నియమమును పూనినచో దానిని బట్టి అతనిని గుర్తింపగలననెను. ఆ మాట సిద్దుడు మరల మూర్ఖబ్రాహ్మణునితో చెప్పగా అతడును నేను ఇక మీదట శకటము భక్షింపను. ఇది నా నియమమని ఊర్వశితో చెప్పుమనెను. సిద్దుడు సరేయని తాను మరల స్వర్గముమునకు పోయినప్పుడీ విషయ మూర్వశితో చెప్పెను. ఇప్పుడు నేనతని నీనియమమును బట్టి గుర్తింపగలను. ఆ మూర్ఖుడు నన్ను ఉపహాసము చేయుటచే ఇట్లు చెప్పెను. అని పలుకుచు ఊర్వశి వెడలిపోయెను. సిద్దుడను తన ఇచ్చానుసారముతో లోకసంచారము చేయుచుండెను. మహాసుందరియగు ఊర్వశియు వారాణసికి పోయి దివ్యశరీరము ధరించి మత్స్యోదరీతీర్థమున స్నానము చేయుచుండెను. ఈ సమయమున యాదృచ్చికముగ అచటకు వచ్చిన ఆమూర్ఖబ్రాహ్మణుడు అట్టి ఊర్వశిని చూచి కామముచే కలతనొందెను. అందుచే అతడు చేసిన చేష్టలను బట్టి మునువు సిద్దుడు చెప్పిన మూర్ఖవిప్రుడు ఈతడేయని ఊర్వశి గుర్తించి చిఱునవ్వు నవ్వుచు అతనితో ఓ మహాభాగా! నావలన నీకు ఏమి కావలెనో చెప్పుము. నీమాటప్రకారము చేయుదును. నీవు నన్ను విశ్వసింపుము. అనెను. నిన్ను నాకు అర్పణము చేసికొని ఓ సుందరీ ! నా ప్రాణములను కాపాడుమని అతడనెను. నేను ఇప్పుడు వ్రత నియమమునందున్నాను. క్షణకాలము నారాకకై వేచియుండుమని ఊర్వశి పలుకగా అతడు సరేయనెను. అమెయు స్వర్గమునకేగి ఒక మాసము తరువాత మరల వారాణసికి గారా ఈ విప్రుడు కృశించి కనబడెను. అతడంతవరకును నిరాహారుడై నదీతీరమందే నిశ్చయముతో నుండెనని అమె తెలిసికొని వృద్దురాలి రూపముధరించి వచ్చి నదీ తీరమున శర్కరతో తేనెతో నేతితో నిండిన శకటమును కావించి మత్స్యోదరీ తీర్థమునకు పోయి స్నానమాడి ఒడ్డునకు వచ్చిశకటముకడ నిలిచి ఈ మూర్ఖబ్రాహ్మణుని పిలిచి ఇట్లు పలికెను. ఓ విప్రా! నేను తీవ్రమగు వ్రతమును సౌభాగ్యము నిమిత్తమాచరించితిని. వ్రతాంతమున ఉద్యాపనమునకై ఇది దానము చేయొచున్నాను. ప్రతిగ్రహించుము. అనెను.

వ్యాస ఉవాచ

స ప్రాహ కిమిదం లోకే దీయతే శర్కరావృతమ్‌ | క్షుతామకంఠః పృచ్ఛామి సాధు భ##ద్రే సమీరయ | 132

సా ప్రాహ శకటో విప్ర శర్కరా పిష్టసంయుతః | ఇమం త్వం సముపాదాయ ప్రాణం తర్పయ మా చిరమ్‌ | 133

స త చ్చృత్వా7థ సంస్మృత్య క్షుదయా పీడితో7పి సన్‌ | ప్రాహ భ##ద్రే న గృహ్ణీమి వియమో హి కృతోమయా || 134

పురతః సిద్ద వర్యస్య న భోక్ష్యే శకటం త్వితి | పరిజ్ఞానార్థ ముర్వశ్యా దద స్వాన్యస్య కస్యచిత్‌ || 135

సా7బ్రవీన్నియ మో భద్ర కృతః కాష్ఠమయే త్వయా | నాసౌ కాష్టమయో భుంక్ష్వ క్షుధయా చాతి పీడితః || 136

తాం బ్రాహ్మణః ప్రత్యువాచ న మయా త ద్విశేషణమ్‌ | కృతం భ##ద్రేథ నియమః సామాన్యే నైవ మేకృతః || 137

తం భూయః ప్రాహ సా తన్వీ న చే ద్భోక్ష్యసి బ్రాహ్మణ |

గృహం గృహీత్వా గచ్ఛస్వ కుటుంబం తవ భోక్ష్యతి || 138

స తా మువాచ సుదతి న తావ ద్యామి మందిరమ్‌ | ఇహా77యాతా వరారోహా త్రైలోక్యే ప్యధికా గుణౖ ః || 139

సా మయా మదనార్తేన ప్రార్థితా 77శ్వాసిత స్తయా | స్థీయతాం క్షణ మిత్యేవం స్థాస్యా మీతి మ యోదితమ్‌ || 139

మాసమాత్రం గతాయాస్తు తస్యా భ##ద్రేస్థితస్య చ | మమ సత్యానురక్తస్య సంగమాయ ధ్రతవృతే || 141

తస్య సా వచనం శ్రుత్వా కృత్వా స్వం రూప ముత్తమమ్‌ | విహస్య భావగంభీర ముర్వశీ ప్రాహ తం ద్విజమ్‌ || 142

ఊర్వ శ్యువాచ

సాధు సత్యం త్వయా విప్ర వ్రతం నిష్టితచేతసా ! నిష్పాదితం హఠా దేవ మమ దర్శనమిచ్చతా || 143

అహ మేవోర్వశీ విప్ర త్వాం జిజ్ఞాసార్థమాగతా | పరీక్షితో నిశ్చితవా న్భవా న్సత్యతపా ఋషిః || 144

గచ్ఛత్వం శూకరోద్దేశం రూపతీ ర్థేతి విశ్రుతమ్‌ | సిద్ధిం యాస్యసి విప్రేంద తత స్త్వం మా మవాప్స్యసి || 145

వ్యాస ఉవాచ

ఇత్యుక్త్వా దివ ముత్పత్య సా జగా మోర్వశీ ద్విజాః | స చ సత్యతపా విప్రో రూపతీర్థం జగామ హ || 146

తత్ర శాంతి పరోభూత్వా నియమవ్రత ధృక్శుచిః | దేహోత్సర్గే జగామాసౌ గాంధర్వం లోకముత్తమమ్‌ || 147

తత్ర మన్వంతరశతం భోగా న్భుక్త్వా యథార్థతః | బభూవ సుకులే రాజా ప్రజారంజన తత్పరః || 148

స యజ్వా వివిధై ర్యజ్ఞైః సమాప్త వరదక్షిణౖః పుత్రేషు రాజ్యం నిక్షిప్య య¸° శౌకరవం పునః || 149

రూపతీర్థే మృతో భూయః శక్రలోక ముపాగతః | తత్ర మన్వంతరశతం భోగా న్బుక్త్వా తత శ్చ్యుతః || 150

ప్రతిష్ఠానే పురవరే బుధపుత్రః పురూరవాః | బభూవ తత్ర చోర్వశ్యాః సంగమాయ తపోధనాః || 151

ఏవం పురం సత్యతపా ద్విజాతి స్తీర్థే ప్రసిద్దే స హి రూపసంజ్ఞే |

ఆరాధ్య జన్మ న్యథ చార్చ్య విష్ణుమవాప్య భోగా నథ ముక్తి మేతి || 152

ఇతి శ్రీ మహాపురాణ ఆదిబ్రహ్మే వ్యాసర్షి సంవాదే ప్రజాగరే గీతికాయాః ప్రశంసానిరూపణంనామ అష్టావింశత్యధిక ద్విశతతమో7ధ్యాయః

అతడు ఇట్లనెనుః ఇది ఏమి? లోకములో శర్కరతో నిండిన శకటము దానముచేయుదురా? ఓ పూజ్యురాలా ! ఆకలిచే ఎండిన కంఠముతో ఉండి అడుగుచున్నాను. చక్కగా చెప్పుము. ఆమె ఇట్లనెను. ఓ విప్రా! ఈ శకటము శర్కరతోను పిండితోను నిండియున్నది. దీనిని నీవు తీసికొని నీ ప్రాణముల తృప్తినొందించుకొనుము. ఆలస్యము చేయుకుము. ఈ మాటవిని అతడు ఆకలితో భాదపడుచుండియు జ్ఞాపకముచేసికొని ఇట్లనెను. ఓ పూజ్యురాలా! నేనిది తీసికొనను. నేను సిద్దవర్యునికడ శకటమును భక్షింపననినియమును ఊర్వశికి గుర్తుగా చేసితిని. కనుక దీనిని మఱిఎవ్వరికై నదానము చేయుము. అమె ఇట్లు పలికెను. ఓ విప్రా! పూజ్యుడా ! నీవు కొయ్యతోచేసిన శకటమును తిననని నియమము పూనితిని. ఇది కొయ్యతో చేసినది కాదు. శర్కరతో చేసిన శకటము. దీనిని భక్షింపుము. నీవును ఆకలిచే చాల బాధనొందియున్నావు. బ్రాహ్మణుడిట్లనెను: నేను శకటము అని సామాన్యముగా పలికితిని. కాని దేనితో చేసినది అని విశేషణముతో చెప్పలేదు. ఊర్వశి ఇట్లనెన: ఓ విప్రుడా ! సరే. నీవు తినకున్నను నీ కుటుంబము వారు తిందురు. నీవీ చక్కెరబండిని కొనిపొమ్ము. బ్రాహ్మణుడిట్లుపలికెను. ఓ సుదతీ ! నేనిపుడింటికి పోవను. మూడులోకములయందును గుణములచే అందరికంటే అధికురాలును సుందరియు ఆగు అమె ఇక్కడకువచ్చినది. నేను కామార్తుడనై వేడగా క్షణములో వత్తును. ఉండుమని నన్నోదార్చి అమె వెళ్లినది. ఓ వ్రతస్థురాలా! అమెయొక్క సత్యవచనమునందు అను రక్తుడనై అమె సంగమముకోరి అమె వెళ్లి ఇప్పటికి మాసము గడిచినను ఇక్కడనేయున్నాను. ఆ మూర్ఖవిప్రుని మాటలువిని ఊర్వశి తన స్వరూపముధరించి నవ్వుచు భావ గంభీరముగా ఇట్లు పలికెనుః ఓ విప్రుడా ! నీవు నా దర్శనము గోరి హఠముతో నిష్ఠతో కూడిన మనస్సుతో వ్రతమును నిర్వహించినమాట సత్యము. నీవిషయము తెలిసికొనగోరి వచ్చితిని. ఓ విప్రా! నేనే ఊర్వశిని. నిన్ను పరీక్షించి నీవు సత్యతపస్కుడు అను ఋషివని నిశ్చయించితిని. రూపతీర్థమని ప్రసిద్ధిపొందిన శూకరవక్షేత్రమునకు పొమ్ము. అచ్చట నీకు సిద్దికలుగును. అప్పుడు నేను నీకు లభింతును. ఇట్లు పలికి ఆ ఊర్వశి స్వర్గమునకు ఎగిరిపోయెను. అసత్యతపోయి షియు రూపతీర్థమునకుపోయి అచట శాంతిపరుడై నియమవ్రతములను పూని శుచియై జీవించి దేహత్యాగానంతరము ఉత్తమమగు గంధర్వలోకమునకు పోయెను. అచ్చట నూరులకొలది మన్వంతరములు వాస్తవములగు భోగములను అనుభవించి పిమ్మట భూలోకమున ప్రజారంజకుడగు రాజై జన్మించెను. సమగ్రమగు దక్షిణలతో వివిధములగు యజ్ఞములు ఆచరించి కుమారులకు రాజ్యమునప్పగించి మరల శూకరవ క్షేత్రమునకుఏగెను. ఈ రూపతీర్థమున మృతిపొంది ఇంద్రలోకమునకు పోయి అచట నూరలకొలది మన్వంతరము భోగములనుభవించి అచట నుండి దిగి భూమిపై ప్రతిష్టాననగరమున బుధుని కుమారుడగు పురూరవుడుగా జన్మించి ఊర్వశితో సంగమము పొందెను. ఈ విధముగ సత్యతపస్కుడన బ్రహ్మణుడుశూకరవక్షేత్రమను రూపతీర్థమున శ్రీ మహావిష్ణువును ఆరాధించి భోగములను అనుభవించి ముక్తిని కూడ పొందెను. (ఈప్రతిష్టానగరము ఈనాడు అలహాబాదు.)

ఇది శ్రీ మహాపురాణమగు ఆది బ్రహ్మమున వ్యాసఋషి సంవాదమున ప్రజాగరముచే విష్ణుగానప్రశంసా నిరూపణమను రెండు వందల ఇరువది ఎనిమిదవ ఆధ్యాయము.

7

7

Brahmapuranamu    Chapters