Brahmapuranamu    Chapters   

అథ ఏకవింశో7థ్యాయః

పాతాళప్రమాణకథనమ్‌

లోమమర్షణ ఉవాచ-

విస్తార ఏష కధితః పృధివ్యా మునిస త్తమాః | సప్తతిస్తు సహస్రాణి తదుచ్ర్ఛయో7పి కథ్యతే || 1

దశపాహస్రమేకైకం పాతాళం మునిసత్తమాః | అతలం వితలం చైవ నితలం సుతలం తథా || 2

తలాతలం రసాతలం పాతాళం చాపి సప్తమమ్‌ | కృష్ణా శుక్లా7రుణా పీతా శర్కరా శైలకాంచనీ || 3

భూమయో యత్ర విపేంద్రా వరప్రాసాదశోభితాః | తేఘ దానవదైతేయజాతయః శతశః స్థితాః || 4

నాగానాంచ మహాంగానాం జ్ఞాతయశ్చ ద్విజోత్తమాః |

లోమహర్షుణుడిట్లనియె-

మునిశ్రేష్ఠులరా! భూమియొక్క వైశాల్యము డెబ్బదివేల¸°జనములు, దానియెత్తునంతే. ఒక్కొక్కపాతాళమువైశాల్యము పదివేల యోజనములు. అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, పాతాళము, యనునవి సప్తపాతాళములు. అచట కృష్ణా శుక్లా అరుణా పీతా శర్కరా శైలకాంచనీ అను భూములు ఉత్తమసౌధములతో నొప్పుచుండును. ఆ ప్రదేశములందు దైత్యదానవజాతులు వందలకొలది గలరు. బ్రాహ్మణొత్తములారా! అచట పెద్ద సర్పజాతులు కూడ గలవు.

స్వర్లోకా దపి రమ్యాణి పాతాళా నీతి నారదః || 5

ప్రాహ స్వర్గ సదోమధ్యే పాతాళేభ్యో గతో దివమ్‌ | ఆహ్లాదకారిణః శుభ్రా మణయో యత్ర సుప్రభాః || 6

నాగాభరణభూషాశ్చ పాతాశం కేన తత్సమమ్‌ | దైత్యదానవకన్యాభి రితశ్చేతశ్చ శోభ##తే || 7

పాతాళే కస్య న ప్రీతి ర్విము క్తస్యాపి జాయతే | దివార్కరశ్మయో యత్ర ప్రభా స్తన్వంతి నా77తపమ్‌|| 8

శశినశ్చ న శీతాయ నిశి ద్యోతాయ కేవలమ్‌ | భక్ష్యభోజ్యమహాపాన మదమత్తైశ్చ భోగిభిః || 9

యత్ర నజ్ఞాయతే కాలో గతో7పి దనుజాదిభిః | వనాని నద్యో రమ్యాణి సరాంసి కమలాకరాః || 10

పుంస్రోకిలాదిలాపాశ్చ మనోజ్ఞా న్యంబరాణిచ | భూషణా న్యతిరమ్యాణి గంధాడ్యం చానులేపనమ్‌ || 11

వీణావేణుమృదంగానాం నిస్వనాశ్చ సదా ద్విజాః | ఏతా న్యన్యాని రమ్యాణి భాగ్యబోగ్యాని దానవైః || 12

దైత్యోర గైశ్చ భుజ్యంతే పాతాళాంతరగోచరైః |

స్వర్గముకంటెను పాతాళములు రమ్యములని పాతాళములనుండి స్వర్గమునకేగి సభామధ్యమున నారదమహర్షి చెప్పిరి. వీరియందాహ్లాదజనము లైన పరిశుభ్రకాంతిభరితములైన రత్నములున్నవి. నాగాభరణభూషణములు పెక్కులున్నవి. ఇట్టి పాతాళము దేనితో సాటియగును. దైత్యదానవ కన్యారత్నము లిందందందు క్రీడింతురు. ఇట్టిపాతాళము ముక్తుడైన వానికి గూడ ప్రీతిజనకమై యుండును. పగటిసూర్యునికిరణము లిచ్చట కాంతి నొసంగునుగాని యెండ వేడిమిని కలిగింపవు. రాత్రి చంద్రకాంతులును చలినిగాక చక్కని వెలుగునుమాత్రమే యిచ్చును. భక్ష్యభోజ్యలేహ్యపానీయరూపమైన యాహారములచే మదించిన భోగులగు దానవాదులు కాలగమనము నిచట గమనింపసేగమనింపరు. వనములు నదులు సరోవరములు పుంస్కోకిలల కలకలారావములతో మనోహరములై యుండును. ఇచటిప్రజలుధరించు భూషణములు మిగుల రమ్యములు. అంగరాగములు గంధాదులు పరిమళ భరితములు. నిరంతరము వీణావేణుమృదంగ నాదము శ్రవణమనోహరముగ వినిపించును. ఇచటి భాగ్యభోగ్యములు పరమమనోహరములు. పాతాళవాసులగు దానవులు ద్తెత్యులు నాగులును ఆభోగములనుభవించుచుందురు.

పాతాళానా మధశ్చా77స్తే విష్ణో ర్యా తామసీ తనుః || శేషాఖ్యా యద్గుణా న్వక్తుం న శక్తా దైత్యదానవాః | 13

యో7నంతః పఠ్యతే సిద్ధై ర్దేవదేవర్షిపూజితః || 14

సహస్రశిరసావ్యక్తః స్వస్తికామలభూషణః| ఫణామణిసహస్రేణ యః స విద్యోతయ న్దిశః || 15

సర్వా న్కరోతి నిర్వీర్యా న్హితాయ జగతో7సురాన్‌ | మదాఘార్ణితునేత్రో7సౌ యః సదైవైకకుండలః || 16

కిరీటీ స్రగ్ధరో భాతి సాగ్నిః శ్వేత ఇవాచలః | నీలవాసా మదోత్సిక్తః శ్వేతహారోపశోభితః || 17

సాభ్రగంగా ప్రపాతో7సౌ కైలాసాద్రి రివోత్తమః | లాంగలాసక్తహస్తాగ్రో బిభ్రమ్మసల ముముత్తమమ్‌ || 18

ఉపాస్యతే స్వయం కాంత్యా యో వారుణ్యా చ మూర్తయా |

పాతాళమున కడుగున విష్ణువుయొక్క తమోమయశరీరము శేషుడను పేర అనంత కళ్యాణగుణ నిలయమై తేజరిల్లు చుండును. దేవ-దేవర్షి-సిద్దులచే నత డనంతుడని కీర్తింప బడును. స్యస్తికముద్రాంకితములైన వేయిశిరశ్సులచే సహస్రణామణికాంతిపుంజములచే దెసలను రంజింపజేయుచుండును. లోకహితమునకై ఆయన యచటి యనురులను తనతేజముచే నిర్వీర్యుల నొసరించుచుండును. ఎల్లప్పుడు నొకే కుండలము నాభరణముగ ధరించి, కిరీటధారియ్తె, పుష్పమాలాలంకృతుడై మదఘార్ణితనేత్రుడై అగ్నిసహితశ్వేతాచలమట్లు ప్రకాశించుచుండును. నీలవసనుడు మదోత్సీక్తుడు శ్వేతవరోపశోభితుడు ఆకాశగంగాప్రపాత సంయుత కైలాస వర్వత మన్నట్లు ఈ శేషుడు ఒకచేత నాగలియు మరొకచేతి రోకలియు ధరించి వారుణియను నాగాంగనతో గూడి యుపాసింవబడును.

కల్పాంతే యస్య వక్త్రేభ్యో విషానలశిఖోజ్జ్వలః || సంకర్షణాత్మకో రుదో నిష్ర్కమ్యాత్తి జగత్రమమ్‌ | 19

స బిభ్ర చ్ఛిఖరీభూత మశేషం క్షితిమండలమ్‌ || 20

అస్థే పాతాళమూలస్థః శేషో7శేషసురార్చితః | తస్యవీర్యంప్రభావశ్చ వైభవం రూపమేవ చ || 21

నహి వర్ణయితుం శక్యం జ్ఞాతుం వా త్రిదశైరపి | యసై#్యషా సకలా పృధ్వీ ఫణామణిశిఖారుణా || 22

ఆస్తే కుసుమమాలేవ కస్తద్వీర్యం వదిష్యతి |

కల్పాంతమందు నమస్రముఖములనుండి విషానలజ్వాలలు గ్రమ్ముకొస సంకర్షణ స్వరూపుడైన రుద్రుడు జగత్రయమును మ్రింగివేయును. గిరిమండలమట్లు అశేషక్షితిమండలమును ఫణాగ్రమున ధరించి అశేషు యాశేష సురసమర్చితుడై పాతాళమూలమం ధధిష్టించి యున్నాడు. దేవతలు కూడ యతని వీర్యప్రభావ రూపవై భవము వర్ణింపజాలరు. తెలసికొనజాలరు ఆయన ఫణామణి శిఖాలచే అరుణమయి కుసుమమాలిక వలె నిలాతలమఖిలము నిలిచియున్నది. అట్టి మహానుభావునిశక్తి నెవ్యడువర్ణింపగలడు.

యదా విజృంభ##తే7నంతో మదాఘార్ణితలోచనః || తదా చలతి భూ రేషా సాద్రితోయధి కాననా | 23

గంధర్వావ్సరసః సిద్ధాః కింనరోరగవారణాః || 24

నాంతం గుణానాం గుచ్ఛంతి తతో7నంతో7య మవ్యయః | యస్య నాగవధూహసై#్త ర్లాపితం హరిచందనమ్‌|| 25

ముహుః శ్వాసానిలాయస్తం యాతి దిక్పటవాసతామ్‌ | య మారాధ్య పురాణర్షి ర్గ ర్గో జోతీంషి తత్త్వతః || 26

జ్ఞాతవా న్సకలం చైవ నిమిత్తపఠితం ఫలమ్‌ | తేనేయం నాగవర్యేణ శిరసా విధృతా మహీ ||

బిభర్తి సకలాల్లొకా న్స దేవాసురసుసుషాన్‌ ||

ఇది శ్రీ మహావురాణ ఆది బ్రాహ్మే పాతాళ వర్ణనం-నామ ఏకవింశో7ధ్యాయః

మదముచే తిరుగడువడు కన్నులతో నయ్యనంతునెప్పుడు విజృంభించునో అపుడు భూమండలము నపర్వత సముద్రముగ కంపించును. గంధర్వావ్పరస్పిద్ధ కిన్నరోరగవారణులు కూడ ఆశేషాహిగుణములయంతుతెలియలేదు. కావుననే యాయన అనంతుడను పేరొందెను. నాగకన్యాతిలకములు తమ మృదుల కరకమలములచే నతనికి పూయు హరిచందనము శ్వాసానిలములచే వినరబడి దెసలకు సువాసన భరితపటవాసమై (పరిమళచూర్ణమై) వాసించును. ఆ ఫణిరాజు నారాధించి పురాణమహర్షి గర్గాచార్యుడు జ్యోతిశ్చక్రము యొక్క రహస్యములు నెణుంగనెను. సకలశకున ఫలితములను దెలుపగల్గెను. ఆ నాగేంద్రునిచే శిరసావహింపబడివ యీ వసుంధర దేవాసురమానుషవిశేషనహీతములయినసర్వలోకములను ధరింపగల్గుచున్నది.

ఇది శ్రీ బ్రహ్మపురాణమందు పాతాళ వర్ణనమునమను నిరువరియొకటవ అధ్యాయము

Brahmapuranamu    Chapters