Jagadguru divyacharithra   Chapters   Last Page

 

17. కామకోటిపీఠం

కొన్ని చరిత్రాంశాలు

శ్రీ యన్‌. వెంకట్రామన్‌గారు అనేక శాసనాలను పరిశీలించి అందలి ఐతిహాసి కాంశాలను 'శంకర అండ్‌ హిజ్‌సక్సెసర్స్‌ ఇన్‌ కంచి' అనే గ్రంథంలో సహేతుకంగా వివరించారు.

శ్రీ టి. ఏ. గోపీనాథరావుగారు 'కాపర్‌ ప్లేట్‌ ఇన్‌ - స్ర్కిప్షన్స్‌ బిలాంగింగ్‌ టు ది శ్రీ శంకరాచార్య ఆఫ్‌ ది కామకోటిపీఠ' అనే గ్రంథంలో చాల విశేషాలను వివరించారు.

శ్రీ యన్‌. రమేశన్‌, ఎం ఏ.,ఐ.ఏ.యస్‌. గారు (ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆర్థికశాఖా కార్యదర్శి) 'శ్రీ కంచి కామకోటి పీఠం త్రూ ఏజెస్‌' అనే ఆంగ్లగ్రంథంలో ఆయా శాసనముల ప్రతికృతుల్ని కూడ ముద్రించి అందలి సంస్కృత శ్లోకాలను కూడ చక్కగా నాగరలిపిలో ముద్రింపింప జేశారు. 1962 లో వీరు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ 'పురాతత్త్వ పరిశోధనా శాఖ' డైరెక్టరుగా ఉన్నపుడీ గ్రంథాన్ని ప్రచురించారు.

సుప్రసిద్ధ కర్ణాటక సంగీత (త్యాగరాజు -మత్తుస్వామి దీక్షితులతో) త్రిమూర్తులలో ఒకరైన శ్రీ శ్యామశాస్త్రివారి చరిత్ర (1763 - 1827) ననుసరించి కొన్ని అంశాలు తెలుస్తున్నవి. వీరి కుటుంబాన్ని ఆదిశంకరులు శ్రీ కంచి కామాక్షీదేవి ఆలయార్చకులనుగా నియమించారు. అప్పటినుండి వంశపరంపరగా వీరే అక్కడ అర్చకులుగా ఉంటున్నారు. కొన్ని యుద్ధకారణాలవల్ల కామాక్షీదేవి ఆలయంలోని బంగారు కామాక్షీదేవి విగ్రహాన్ని తీసికొని ఈ కుటుంబం వారు శ్రీ శ్యామశాస్త్రిగారికి 18వ యేట తంజావూరునకు చేరారు. వీరు పూర్ణ దీక్షాపరులై శ్రీ కామాక్షీదేవిని తమ సంగీత కృతులతో తనివితీర స్తుతించారు. వీరిని వీరి సమకాలికులు కొందరు 'కామాక్షీ' అనే పిలచేవారు.

దక్షిణ భారతంలో వివిధ భాషలో లభిస్తున్న శిలా, తామ్ర శాసనాలను ఒక పద్ధతిగా సేకరించి వాటికి నామారూపాలను కల్పించిన వారిలో ఐరోపీయ పండితులు లెఫ్టినెంట్‌కర్నల్‌ కాలిక్‌ మెకంజీదొర వారు మొదటివారు వీరు ఈస్టిండియా కంపెనీ మదరాసుకు సంబంధించిన ఇంజనీరు దళములో ఒకరుగా 1782 లో మనదేశానికి వచ్చారు. 1818 వరకు భారతదేశంలో ఉన్నారు. మద్రాసు సర్వేయర్‌ జనరల్‌గా కన్యాకుమారినుండి కృష్ణానదివరకు అనేక ప్రదేశాలలో పర్యటించారు. వీరి అనువాదకులు శ్రీ బాబూరావుగారు మెకంజీగారి చారిత్రక సామగ్రి సంగ్రహాన్ని ఐదుసంపుటలుగా 1828 లో విల్సన్‌ దొరగారు ప్రకటించారు. అందు రెండవ సంపుటం 263 వ పుటనుండి శ్రీ కంచి శంకరాచార్య మఠానికి సంబంధించిన విశేషము లున్నవి.

'ప్రెసెప్టర్స్‌ ఆఫ్‌ అద్వైత' అనే ఆంగ్లగ్రంథంలో 'శ్రీకామకోటి పీఠం' అనే శీర్షికగల సుదీర్ఘ పరిశీలనా వ్యాసాన్ని శ్రీ యన్‌.రమేశన్‌ గారు వ్రాశారు. అందులో కామకోటి పీఠమునకు సంబంధించిన అనేకములగు చారిత్రకాంశాలను సప్రమాణంగా పరిశీలించి సోదాహరణంగాను సచిత్రంగాను ప్రచురించారు. ఈ వ్యాసం పై గ్రంథంలో 429 వ పుటనుండి 467 వ పుటవరకు ప్రచురింపబడి ఉన్నది. అందులోనే 448 వ పుట నుండి వివిధ శాసనాదుల ప్రతికృతులు ముద్రింపబడి ఉన్నవి.

(1) 448 వ పుటలో శ్రీవిజయగండ గోపాలదేవునిదాన శాసనం ఉన్నది. (2) 449-50 పుటల్లో శ్రీ వీరనరసింహదేవుని దాన శాసనం ఉన్నది. (3) 451-52 పుటల్లో శ్రీ విజయరంగ చొక్కనాథుని దాన శాసనం ఉన్నది. (4) 453-54 పుటల్లో తానీషా దాన శాసనం ఉన్నది. (5) 455-56 పుటల్లో ఆర్కాటు నవాబు ఫర్మానా ఉన్నది. (6) 457-58 పుటల్లో కుంభేశ్వరస్వామి ఆలయంలోని శిలా శాసనం ప్రతికృతి ముద్రింపబడి ఉన్నది. (7) 459 వ పుటలో అవని శృంగేరీ మఠంవారి శ్రీముఖం ప్రచురింపబడి ఉన్నది. (8) 460 వ పుటలో తిరువాన్కూరు మహారాజువద్దనుండి వచ్చిన జాబు ప్రచురింపబడినది. (9) 461-63 పుటల్లో శిరభోజమహారాజు వద్దనుండి వచ్చిన 'ఆహ్వానపత్రిక' ప్రచురింపబడినది. (10) 464 వ పుటలో మదరాసు జి.టి లో 119 తంబుచెట్టి వీధిలో కామకోటి శంకరాచార్య స్వామివారికి సమర్పించిన భవనంలోని శాసనం ప్రచురింపబడినది. (11) మదరాసులోని శ్రీ పండిపెద్ది కృష్ణస్వామయ్యగారికి శ్రీ శృంగేరీ మఠం ఆచార్యుల వారు పంపిన శ్రీముఖం 465 వ పుటలో ప్రచురింపబడి ఉన్నది. (12) 466-67 పుటల్లో శృంగేరీ మఠంవారి వద్దనుండి కంచిలోని శ్రీ విశుద్ధానంద భారతీస్వామివారికి వచ్చిన లేఖ ప్రచురింపబడినది.

పైన పేర్కొన్న 'శ్రీ కామకోటిపీఠం' అనే వ్యాసంలో కీ.శ. 17-7-1111న ఆంధ్రచోళ మహారాజైన శ్రీ విజయగండగోపాలదేవన్‌ 'అంబి' అనే గ్రామాన్ని కామకోటిపీఠానికి కానుకగా ఇచ్చిన చరిత్ర మొదలు 14-10-1942న శృంగేరీ నుండి కంచికి వచ్చిన లేఖవరకును కామకోటిపీఠానికి సంబంధించిన అనేకములగు చారిత్రక పత్రములిందు ఉదాహరింపబడి ఉన్నవి. తంజావూరులోని సరస్వతీ మహల్‌ లైబ్రరీ మున్నగు ప్రదేశాలలో వారి నంబర్లు వగైరాలు స్పష్టంగా పేర్కొనబడి ఉన్నవి.

వీనిలో కుతూహలం జనకములైన మూడు పత్రముల సరియగు నకళ్లు ఇచట ఉదహరించబడుచున్నవి.

శృంగేరీనుంచి కంచికొక లేక

1 శృంగేరీమఠం-దాని ఆస్తిపాస్తులకు ఇన్‌-చార్జి ఆఫీసరుగారైన శ్రీ కె.వి. శ్రీనివాసాచార్‌గారు 14-10-1942న శృంగేరీనుండి కంచి లోని ఒక స్వాములవారికి వ్రాసిన లేఖలో ఇలా ఉన్నది.

'కంచిలో శృంగేరీమఠానికి సంబంధించిన భవనం 'మఠం'గా భావింపబడుటలేదు. అందులో పూజకోసం పాదుకలు, చిత్రాలు మున్నగువానని ఏర్పరచి, దానిని మఠంగా రూపొందించి, దానికివిశేష ప్రతిపత్తిని గలిగించటం ఈ మఠానికి వాంఛనీయంగాలేదు. కాంచీ క్షేత్రం కామకోటిపీఠానికి ప్రధానస్థానం కావటమే అందుకు ముఖ్యకారణం. ఆ ఉన్నత (గ్రేట్‌) మఠంతో మేము ఏ విధమైన వ్యతిరేకశక్తి నైనా సృష్టించటంగాని వాంఛనీయంకాదు.''

లేఖ పూర్తిపాఠం ఇది :

D.O. No............ Office of the Sringeri Mutt

& its Properties

K.V. SRINIVASACHAR,

Officer-in-charge. Sringeri, D/14th Oct.'42

Most Reverred Swamiji,

I am very much grateful to you for your kind letter. Mr.Nagaraj Iyer came here and we gave him all comforts and conveniences for the darshan of Sri Sarpdambal etc. I must thank you for your proposal of arranging for founding a Library at Conjeevaram. The building there, cannot be considered as a Mutt. We only own a building there which we have to keep in good rapairs and the manager there takes care of the building. It may not be quite advisible to keep photos or idols or padukas there and arrange for worship and give it the color of the Mutt. As regards Library, the maintenance of it will involve some cost. Excepting to keep the building in order and We, as it were a eare -taker of it, it has not been the intention of the Mutt to give it any better status, especially because, it is the seat of Kamakoti Pita and it is not advisible to get ourselves into any controversy with that great Mutt' or to create any rival spirit in that locality.

With prefound respects.

Yours obediently,

(Sd.).............................

Officer-in-charge,

Sringeri Mutt & its Properties

To

REVERRED VISHUDANANGA THEERTHA SWAMIJI

Residing opposite Sri Sringeri Mutt Building,

CONJEEVARAM.



ఆమని శృంగేరీ శ్రీముఖం

(2) 'ఆదిశంకరుల మఠ సంప్రదాయ చరిత్ర' అనే ఆంగ్ల గ్రంథంలో ఆ పెండెక్స్‌ 'B' లో 'ఆమని-శృంగేరీ ఆచార్యుల దక్షిణ ప్రాంత పర్యటనలు' అనే శీర్షికతో పుట 155 నుండి అనేక విశేషము లుదాహరింపబడి ఉన్నవి. సుమారు క్రీ||శ|| 1792 ప్రాంతంలో ఆమని శృంగేరీ ఆచార్యులవారు కోయంబత్తూరు, సేలం జిల్లాలలో పర్యటన ఆరంభించారు. అఖండ కావేరీతీరమైన 'కులిటలై' ప్రాంతానికి వీరు విచ్చేసినపుడు కామకోటిపీఠ వ్యతిరేకతకై తమ పర్యటన ఉద్దేశింపబడలేదని స్పష్టంచేస్తూ క్రీ.శ. 1797లో ఆమని శృంగేరీ మఠాధిపతులైన శ్రీ అభినవోద్ధండ విద్యారణ్య భారతులవారు - ఆనాటి కంచికామకోటి పీఠాధిపతులైన శ్రీమహాదేవేంద్ర సరస్వతీస్వామివారికి పంపుకొన్న శ్రీముఖం ఇచట ప్రచురింపబడినది.

1870లో శృంగేరీ శ్రీముఖం

(5) 'ఆదిశంకరుల మఠ సంప్రదాయచరిత్ర'అనే ఆంగ్ల గ్రంథంలోనే 156వ పుటలో మరికొన్ని అంశాలున్నవి. శృంగీరిస్వామి వారు (కుడలిశృంగేరీకాదు) 1834 లో మహామఖం' సమయంలో మొదటి పర్యటనను ఆరంభించారట. సుమారుగా క్రిందటి శతాబ్దం పూర్వార్థంలో శృంగేరీస్వామివారైన శ్రీ నృసింహభారతీస్వామివారు దక్షిణప్రాంతపు జిల్లాలలో రెండవమారు పర్యటించారట. ఈసమయంలో వీరు తమ 'అగ్రపూజ'కై కొన్ని ప్రయత్నాలనుకూడ చేశారట. అది కామకోటి పీఠగౌరవానికి వ్యతిరేకమని ప్రజలలో భావన కలిగింది.

ఈ సమయంలోనే వీరు తాము మదరాసునగరానికి విచ్చేయనున్నట్లు మదరాసుపౌరులకు శ్రీముఖాన్ని పంపారు. అపుడు ఆ విషయం మదరాసులోని 'మహాజనసభ' వారి ప్రత్యేకసమావేశంలో చర్చింపబడినది. ఆ నగరంలో సర్వప్రాతినిధ్యంగల సభవారినిర్ణయానుసారం ఆ సభాధ్యక్షులు కామకోటిపీఠ గౌరవప్రతిపత్తులకు భంగంకాని పద్ధతిలో మాత్రమే శృంగేరీస్వామివారచటకు విచ్చేయ వచ్చుననివారికి తెలియజేశారు. అందుకు సమాధానంగా 1870లో శ్రీ శృంగేరీ ఆచార్యులవారు శ్రీ పండిపెద్ది కృష్ణస్వామయ్యగారికి మదరాసుకు పంపిన శ్రీముఖంలో మదరాసులోని 'మహాజనసభ' వారి నిర్ణయానికి అంగీకరించారు. ఆ శ్రీముఖం నకలుకూడ ఇచట ప్రచురింపబడి ఉన్నది ;

 

Jagadguru divyacharithra   Chapters   Last Page