Nadichedevudu   Chapters  

 

69. మాయ - బ్రహ్మ

ఆంగ్లమూలం : జగద్గురు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి.

అనువాదకర్త - డాక్టర్‌ రాణీరామకృష్ణ

''బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవోబ్రహ్మైవ నా పరః'' అని శ్రీ మచ్ఛంకర భగవత్పాదులు గిరిరూపములగు వేదములయొక్క ఉపనిషచ్ఛిఖరముల నుండి మానవాళి నుద్దేశించి ఉద్ఘోషించిరి. సామాన్యజనానీకములో, కొంతవరకు విద్యావంతులలో కూడా, ఒక అపప్రధ గలదు. అది యేమనగా ''జగత్తు మిథ్య,'' ''జగత్తు అసత్తు'' అనునవి అనర్థాంతరములని. ఇది సత్యము కాదు. అటులనే ''ఏకమేవాద్వితీయం బ్రహ్మ'' అనువాక్యంలోని ''ఏక'' పదమునకు ప్రత్యేకమైన అర్థము గలదు. ''అసత్తు'' అను పదము శూన్యాపరపర్యాయము. కాగా ''మిథ్య'' అను పదము ఆరోప్యము తత్త్వము కాదనియు, అధిష్ఠానము మాత్రమే వస్తుతత్త్వమనియు తెలుపును. ఈశాస్త్రీయమైన పదములను వివేకపూర్వకముగా తెలుసుకొనుటకు గణితశాస్త్రము సహకరించును. అయితే, ఈనాడొక చిత్రమగు పరిస్థితి గోచరించును. ప్రాచీనపండితులకు గణితము బహుదూరము. ఆధునిక విద్యావంతులకు వేదాన్తమన్న తలకెక్కదు. శ్రీ కామకోటి పరమాచార్యులు రచించిన ''మాయ-బ్రహ్మ'' అను వ్యాసము వీరిద్దరికి కూడ కనువిప్పు.

హిందూదేశములోని గణితశాస్త్ర మహాపండితులలో ఒకడైన భాస్కరాచార్యుడు ''బీజగణితము''అను తన గ్రంథంలో ఇట్లా వ్రాశాడు.

వధాదౌ వియత్ఖస్య ఖం ఖేన ఘాతే

ఖహారో భ##వేత్ఖేన భక్తస్య రాశిః|

అస్మిన్వికారః ఖహారే న రాశా

వపి ప్రవిష్టేష్వపి నిః సృతేషు||

బహుష్వపి స్యాల్లయ సృష్టికాలే-

sనన్తేs చ్యుతే భూతగణషు యద్వత్‌||

ఈ శ్లోకమునకు అర్థమేమన-

''ఏ సంఖ్యనైనను శూన్యముతో గుణించిన శూన్యము అగును. శూన్యమును ఏ సంఖ్యతో భాగించినను శూన్యము వచ్చును. కాని ఏ సంఖ్యనైనను శూన్యముతో భాగించినచో వచ్చునది 'ఖహారము' (లేక అనంతము) అనబడును. ఈ ఖహారమునుండి ఏదేని పరిమితసంఖ్యను తీసివేసినను, కలిపినను, దాని విలువ మారదు. ఈ ఖహారము అనంతము, అద్వితీయము అగు పరబ్రహ్మము వంటిది. బ్రహ్మము కూడ భూతసృష్టివలన గాని, లయమువలన గాని మార్పు చెందదు.''

ఈ పై శ్లోకములో భాస్కరాచార్యుడు గణితశాస్త్రానుసారము అద్వైతమును నిరూపించెను. ఏ సంఖ్యనైనను శూన్యముతో భాగించగా వచ్చునది ఖహారమనియు, దీనికి ఏ పరిమితసంఖ్యను కలిపినను దాని విలువ పెరగదనియు, తీసివేసినచో దాని విలువ తగ్గదనియు భాస్కరుడు చెప్పెను. అనంతమునకు అనంతము కలిపినను అనంతమే వచ్చును.

అ: 1+2+3+4+....అనంతము వరకు కూడిన, విలువ అనంతమగును.

ఆ: 1+1+1+1+1+.... అనంతము వరకు కూడిన, విలువ అనంత మగును.

+ ఆ: 1+2+3+4+5+.....అనంతము వరకు కూడిన, విలువ అనంత మగును.

ఈ విధంగా ప్రలయములో పరిమితమైన లేక అపరిమితమైన వస్తువులు వచ్చిచేరినను, పరబ్రహ్మము ఎట్టి మార్పులేకయే ఉండును. కనుక బ్రహ్మమునందు ప్రవేశించు త్వంపదవాచ్యమగు ప్రపంచము బ్రహ్మమే యగును. ఏలయన - ప్రపంచము వలన బ్రహ్మము యొక్క మూలస్వరూపము నందు తరుగుదలగాని, పెరుగుదల గాని లేదు. దేనివలన మూలవస్తువు యొక్క విలువ లేక పరిమాణములో పెరుగుదల లేక తరుగుదల ఉండదో, అది శూన్యముగాని, మాయ (అతిస్వల్పమైన విలువ) గాని అయి ఉండవలెను. భాస్కరుడు చెప్పిన శూన్యం బౌద్ధులచే అంగీకరింపబడిన శూన్యం కాదు. భాస్కరుని శూన్యమే అద్వైతుల మాయ.

బౌద్దుల శూన్యము శశవిషాణము లేక వంధ్యాపుత్రుని వంటిది. అట్టి శూన్యమునకు గణితములో ప్రవేశములేదని గణితశాస్త్రజ్ఞుల అభిప్రాయము.

భాస్కరుని శూన్యమనగా 1/n (n"w). ఇచ్చట 1/n కు ముందు Lt (అవధిని సూచించే గుర్తు) అను గుర్తు ఉండదు. ఏలయన - Lt (n")1/n అనగా శూన్యము (4- 4 = 0 వంటిది) అగును. కాని 1/n (n") అభావరూపము కాదు. అది భావరూపము. దాని విలువ మాత్రము అతిస్వల్పము. ఇట్టిదియే మాయ కూడా. కనుక భాస్కరుని 'ఖహారము' 1/n (n"0). కాని, 1x n (n"w) కాని అగును. కనుక బ్రహ్మము ఒక అవధి మాత్రమే.

కేనోపనిషత్తు పరబ్రహ్మమును గూర్చి ఇట్లు చెప్పును.

''నాహం మన్యే సువేదేతి నో నవేదేతి వేద చ|

యోన స్తద్వేద తద్వేద నో నవేదేతి వేద చ||''

''నాకు తెలియునని నేను భావించుట లేదు. నాకు తెలియదని కూడా నాకు తెలియదు. మనలో ఎవనికి తెలియునో, అతనికి తెలియును. ఎవనికి తెలియదో, అతనికి తెలియదు.''

''యస్యా మతం తస్య మతం, మతం యస్య నవేదసః

అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాత మవిజానతామ్‌||''

''పరబ్రహ్మ తెలియుటకు శక్యముకానిది అని అర్థము చేసుకున్నవాడు దానిని తెలుసుకున్నవాడే యగును. నేను బ్రహ్మను తెలుసుకొంటిని అని భావించువానికి అది తెలియదు. బ్రహ్మ, జ్ఞానవిషయం కాదని బ్రహ్మజ్ఞానుల అభిప్రాయము. బ్రహ్మ, జ్ఞానవిషయమే అని అజ్ఞానులు తలంతురు.''

గణితశాస్త్రమునకు చెందిన ఒక దృష్టాంతము ద్వారా పైన చెప్పిన శ్రుతి వాక్యముల భావము సులభముగా తెలియనగును. ఒక వ్యక్తి అనంతము నాకు తెలియునని చెప్పు ననుకొనుడు. అతనికి అది తెలియలే దన్నమాట. అనంతము తెలియుటకు సాధ్యముగానిది అని అతడు చెప్పినచో, అతనికి అది తెలిసినట్లే. ఓంకారము పరబ్రహ్మకు ఒక చక్కని శబ్దప్రతీక. అటులనే అనంతము గణితశాస్త్రమునకు చెందిన పరబ్రహ్మ ప్రతీక.

భాస్కరుడు ఇట్లు చెప్పెను.

ఏదేని సంఖ్య x శూన్యము = శూన్యము

ఏదేని సంఖ్య ÷ శూన్యము = ఖహారము (అనంతము)

ఈ రెండువాక్యములు వేర్వేరుగా కనబడినను, ఒకే అద్వైతసిద్ధాంతసత్యమును ప్రతిపాదించుచున్నవి. ఈ రెండు గణితసూత్రములను అద్వైతపరముగా ఇట్లు వ్యాఖ్యానించవచ్చును.

a / D a = w లేక a = w x D a

అనగా అనంతము (పరబ్రహ్మ) x శూన్యము (ఖ లేక మాయ) = పరిచ్ఛిన్న ప్రపంచము.

'a' అను పరిచ్ఛిన్నసంఖ్య వినూత్నమైనది ఏమియు కాదు. అది 'ఖహారము' యొక్క అనంతమైన విలువలో అంతర్భాగము మాత్రమే. అటులనే బ్రహ్మము నుండి మాయాసంబంధము వలన ఆవిర్భవించిన పరిచ్ఛిన్నప్రపంచము యధార్థముగా సత్యరూపమగు పరబ్రహ్మము కంటె భిన్నముకాదు. కనుకనే భాస్కరుడు తన ఖహారమును అనంతరము అచ్యుతమునగు పరబ్రహ్మముతో పోల్చెను. ఏలయన - పరబ్రహ్మ భూతసృష్టి వలనగాని, అనంతభూతగుణములు తనయందు లీనమగుట వలనగాని, మార్పుచెందదు.

బ్రహ్మము (సత్‌), 'ఏకము', అని శ్రుతులయందు పదేపదే చెప్పబడును. ఈ 'ఏకము' సంఖ్యలలో 2లో సగము, 4లో నాల్గవ వంతు అయిన '1' కాదు. ఏ అనంతమునందు పరిచ్ఛిన్నసంఖ్య లన్నియు లయమగునో ఆ అనంతము ఈ ఏకపదమున కర్థము. భాస్కరుడు 'లీలావతి'లోని అంతిమశ్లోకమునందు పరబ్రహ్మనిట్లు వర్ణించెను.

'అష్టౌవ్యాకరణాని షట్‌ చ భిషజాం వ్యాచష్ట తాస్సంహితాః

షట్‌ తర్కాన్‌ గణితాని పంచ చతుర్వేదాన థీ తే స్మయంః|

రత్నానాం త్రితయం ద్వయం చ బుబుధే మీమాంస యోరంతరం

సద్బ్రహ్మైక మగాధ బోధ మహిమా సోs స్యాః కవి ర్భాస్కరః||'

బీజగణితం లోని 11వ శ్లోకంలో పరబ్రహ్మనే 'అనంత' 'అచ్యుత' అనే పేర్లతో పేర్కొనెను. అందుచేత బ్రహ్మకు చెప్పిన ఈ 'ఏకత్వం' '1' అనే సంఖ్యలోని ఏకత్వం కాదు. ఇది గణితశాస్త్రంలోని అనంతము లేక అద్వైతము.

గమనిక 2/0(ఖ) = అనంతము (ఖహారము)

అనంతము x 0 = 2 లేక ఏదేని సంఖ్య.

బ్రహ్మ x మాయ = పరిచ్ఛిన్న ప్రపంచము.

* * *



Nadichedevudu   Chapters