Brahmapuranamu    Chapters   

అథసప్తషష్ఠితమోధ్యాయః

ద్వాదశయాత్రామాహాత్మ్యమ్‌

మునయ ఊచుః

ఏకైకస్యాస్తు యాత్రాయాః ఫలంబ్రూహి పృథక్పృథక్‌ | యత్ప్రాప్నోతి నరః కృత్వా నారీవా తత్ర సంయతా ||

బ్రహ్మోవాచ

ప్రతియాత్రాఫలం విప్రాః శృణుధ్వం గదతో మమ | యత్ప్రాప్నోతి నరః కృత్వా తస్మిన్షేత్రే సుసంయతః || 2

గుడివాయాం తథోత్థానే ఫాల్గున్యాం విషువే తథా | యాత్రాం కృత్వా విధానేన దృష్ట్వా కృష్ణం ప్రణమ్యచ || 3

సంకర్షణం సుభద్రాం చ లభేత్సర్వత్ర వైఫలమ్‌ | నరో గచ్ఛేద్విష్ణులోకే యావదింద్రాశ్చతుర్దశ || 4

యావద్యాత్రాం జ్యేష్ఠమాసే కరోతి విధివన్నరః | తావత్కల్పం విష్ణులోకే సుఖం భుంక్తే న సంశయః || 5

తస్మినేత్రవరే పుణ్య రమ్యే శ్రీపురుషోత్తమే | భుక్తిముక్తి ప్రదే నౄణాం సర్వసత్త్వసుఖావహే || 6

జ్యేష్ఠే యాత్రాం (త్రా) నరః కృత్వా నారీవా సంయతేంద్రియః | యథోక్తేన విధానేన దశ ద్వేచ సమాహితః || 7

ప్రతిష్ఠాం కురుతేయస్తు శాఠ్యదంభవివర్జితః | స భుక్త్వా వివిధాన్భోగా న్మోక్షం చాంతే లభేద్ధ్రువమ్‌ || 8

మునులు అడుగ బ్రహ్మయిట్లనియె. ఉత్థాన యేకాదశియందుఫాల్గుణ పూర్ణిమనాడు విషువ పుణ్యకాలమందు గుడివా యాత్ర దర్శనము చేసిన వాడు పదునల్గురింద్రుల పరిపాలన కాలము వరకు విష్ణులోకము నందుండును. పురుషోత్తమ క్షేత్రమునకు జ్యేష్ఠమందు యాత్రచేసినవాడు కల్పాంతము వరకు విష్ణులోకమందు సుఖించును. విధానమున లోభత్వము డాంబికములేకుండ భగవత్ప్రతిష్ఠ చేసిపూజించిన యతడు వైకుంఠభోగముల ననుభవించిమోక్షమునందును.

మునయ ఊచుః

శ్రోతుమిచ్ఛామహే దేవ ప్రతిష్ఠాం వదతస్తవ | విధానం చార్చనం దానం ఫలం తత్ర జగత్పతేః || 9

బ్రహ్మోవాచ

శృణుధ్వం మునిశార్దూలాః ప్రతిష్ఠాం విధిచోదితామ్‌ | యాం కృత్వాతు నరో భక్త్వా నారీవా లభ##తే ఫలమ్‌ || 10

యాత్రా ద్వాదశ సంపూర్ణా యదా స్యాత్తు (స్యుస్తు) ద్విజోత్తమాః | తదా కుర్వీతవిధివ త్ప్రతిష్ఠాం పాపనాశినీమ్‌|| 11

భగవత్ప్రతిష్ఠా విధానము, అర్చనము, దానము మొదలైన వాని ఫలము మునులడుగ బ్రహ్మయిట్లనియె.

జ్యేష్ఠే మాసి సితే పక్షే త్వేకాదశ్యాం సమాహితః | గత్వాజలాశయం పుణ్య మాచమ్య ప్రయతః శుచిః || 12

ఆవాహ్య సర్వతీర్థాని ధ్యాత్వా నారాయణం తథా | తతః స్నానం ప్రకుర్వీత విధివత్సుసమాహితః || 13

యస్యయో విధిరుద్దిష్ట ఋషిభిః స్నానకర్మణి | తేనైవతు విధానేన స్నానం తస్య విధీయతే || 14

న్పితౄస్వాత్వా సమ్యగ్విధానేవ తతో దేవానృషీర్పిత్రూన్‌ | సంతర్పయేత్తథా7న్యాంశ్చ నామగోత్రవిధానవత్‌|| 15

ఉత్తీర్య వాససీ ధౌతే నిర్మలే పరిధాయవై | ఉపస్పృశ్య విధానేన భాస్కరాభిముఖస్తతః|| 16

గాయత్రీం పావనీం దేవీం మనసా వేదమాతరమ్‌ | సర్వపాపహరాం పుణ్యాం జపేదష్టొత్తరం శతమ్‌ || 17

పుణ్యాంశ్చ సౌరమంత్రాంశ్చ శ్రద్ధయా సుసమాహితః| త్రిః ప్రదక్షిణ మావృత్య భాస్కరం ప్రణమేత్తతః || 18

వేదోక్తం త్రిషు వర్ణేషు స్నానం జాప్యముదాహృతమ్‌| స్త్రీశూద్రయోః స్నానజాప్యం వేదోక్త విధివర్జితమ్‌|| 19

జ్యేష్టశుక్ల యేకాదశినాడు ఇంద్రద్యుమ్న సరసునందు యథావిధిగ స్నానమాచరించి దేవర్షి పితృతర్పణము లొనరించి మడివస్త్రములను ధరించి సూర్యాభిముఖుడై వేదమాత గాయత్రిని యష్టోత్తర శతము (108) జపించి సౌరమంత్ర పారాయణము జేసి ముమ్మార్లు ప్రదక్షిణము జేసి త్రివర్ణముల వారు వేదోక్త విధానమున సూర్య నమస్కారములను చేయవలెను. స్త్రీ శూద్రులు స్నానాదులందు జపములందు వేదోక్తముగాక పురాణొక్త విధానము ననుసరింపవలెను.

తతో గచ్ఛేద్గృహం మౌనీ పూజయేత్పురుషోత్తమమ్‌ | ప్రక్షాళ్యం హస్తౌ పాదౌచ ఉపస్పృశ్య యథావిధి || 20

ఘృతేన స్నాపయేద్దేవం క్షీరేణ తదనంతరమ్‌ | మధుగంధోధకేనై వ తీర్థచందన వారిణా || 21

తతో వస్త్రయుగం శ్రేష్ఠం భక్త్యా తంపరిదాపయేత్‌ | చందనాగరు కర్పూరైః కుంకుమేన విలేపయేత్‌ || 22

పూజయేత్పరయా భక్త్యా పద్మైశ్చ పురుషోత్తమమ్‌ | అన్యైశ్చ వైష్ణవైః పుషై#్ప రర్చయేన్మల్లికాదిభిః || 23

సంపూజ్యైవ జగన్నాథం భుక్తిముక్తి ప్రదంహరిమ్‌| ధూపం - గురుసంయుక్తం దహేద్దేవస్య - గ్రతః || 24

గుగ్గులం చ మునిశ్రేష్ఠా దహేద్గంధ సమన్వితమ్‌ | దీపం ప్రజ్వాలయేద్భక్త్యా యథాశక్తా క్తి ఘృతేన వై || 25

అన్యాంశ్చ దీపకాన్దద్యా ద్ద్వాదశైవ సమాహితః | ఘృతేన చ మునిశ్రేష్ఠా స్తిలతైలేన వా పునః || 26

నైవేద్యే పాయసాపూప శష్కుళీవటకం తథా | మోదకం ఫాణితం వా7ల్పం ఫలాని చ నివేదయేత్‌ || 27

ఏవం పంచోపచారేణ సంపూజ్య పురుషోత్తమమ్‌ | నమః పురుషోత్తమాయేతి జపేదష్టోత్తరం శతమ్‌ || 28

తతః ప్రసాదయేద్దేవం భక్త్యాతం పురుషోత్తమమ్‌ | నమస్తే సర్వలోకేశ భక్తానా మభయప్రద || 29

సంసారసాగరేమగ్నం త్రాహిమాం పురుషోత్తమ | యాస్తే కృతామయా యాత్రా ద్వాదశైవ జగత్పతే || 30

ప్రసాదాత్తవ గోవింద సంపూర్ణాస్తా భవంతుమే | ఏవం ప్రసాద్య తం దేవం దండవత్ప్రణిపత్యచ || 31

తతో7ర్చయేద్గురుం భక్త్యా పుష్పవస్త్రానులేపనైః | నానయోరంతరం యస్మా ద్ద్విద్యతే మునిసత్తమాః || 32

దేవస్యోపరి కుర్వీత శ్రద్ధయా సుసమాహితః | నానాపుషై#్పర్మునిశ్రేష్ఠా విచిత్రం పుష్పమండపమ్‌ || 33

కృత్వా7వధారణం పశ్చా జ్జాగారం కారయేన్నిశి | కథాంచ వాసుదేవస్య గీతికాం చాపి కారయేత్‌ || 34

ధ్యాయన్పఠన్త్సువన్దేవం ప్రణయేద్రజనీం బుధః | తతః ప్రభాతే విమలే ద్వాదశ్యాం ద్వాదశై వతు || 35

నిమంత్రయేద్వ్రతస్నాతా న్బ్రాహ్మణాన్వేదపారగాన్‌ | ఇతిహాసపురాణజ్ఞా న్మ్రోత్రియాన్సంయతేంద్రియాన్‌ || 36

స్నాత్వా సమ్యగ్విధానేన ధౌతవాసా జితేంద్రియః | స్నాపయేత్పూర్వవత్తత్ర పూజయేర్పురుషోత్తమమ్‌ || 37

గంధైః పుషై#్పరుపాహారై ర్వైవేద్యైర్దీపకైస్తథా | ఉపచారైర్బహువిధైః ప్రణిపాతైః ప్రదక్షిణౖః|| 38

యాపై#్యః స్తుతినమస్కారై ర్గీతవాద్యైర్మనోహరైః | సంపూజ్యైవం జగన్నాథం బ్రహ్మణాన్పూజయేత్తతః || 39

ద్వాదశైవ తు గాస్తేభ్యో దత్త్వా కనకమేవ చ | ఛత్రోపానద్యుగం చైవ శ్రద్థా భక్తిసమన్వితః || 40

భక్త్యాతు సధనం తేభ్యో దద్యాద్వస్త్రాదికం ద్విజాః | సద్భావేనతు గోవింద స్తోష్యతే పూజితో యతః || 41

ఆచార్యాయ తతో దద్యా ద్గోవస్త్రం కనకం తథా | ఛత్రోపానద్యుగం చాన్య త్కాంస్యపాత్రం చభక్తితః || 42

తతస్తాన్భోజయేద్విప్రా న్భోజ్యం పాయసపూర్వకమ్‌ | పక్వాన్నం భక్ష్యభోజ్యం చ గుడసర్పిః సమన్వితమ్‌ || 43

తతస్తానన్నతృప్తాంశ్చ బ్రాహ్మణాన్స్వస్థ మానసాన్‌| ద్వాదశైవోద కుంభాంశ్చ దద్యాత్తేభ్యః సమోదకాన్‌ || 44

దక్షిణాంచ యథాశక్త్యా (క్తి) దద్యాత్తేభ్యో విమత్సరః | కుంభం చ దక్షిణాం చైవ ఆచార్యాయ నివేదయేత్‌ || 45

ఏవం సంపూజ్య తాన్విప్రా న్గురుం జ్ఞానప్రదాయకమ్‌ | పూజయేత్పరయా భక్త్యా విష్ణుతుల్యం ద్విజోత్తమాః || 46

సువర్ణపస్త్ర గోధాన్యై ర్ద్రవ్యైశ్చా న్యైర్వరై ర్భుధః | సంపూజ్య తం నమస్కృత్య ఇమం మంత్రముదీరయేత్‌|| 47

సర్వవ్యాపీ జగన్నాథః శంఖచక్ర గదాధరః | అనాదినిధనో దేవః ప్రీయతాం పురుషోత్తమః || 48

ఇత్యుచ్చార్య తతో విప్రాంస్త్రిః కృత్వా చ ప్రదక్షిణామ్‌ | ప్రణమ్య శిరసా భక్త్యా అచార్యం తు నిసర్జయేత్‌ || 49

తతస్తా న్బ్రాహ్మణాన్భక్త్యా చా77సీమాంత మనువ్రజేత్‌| అనువ్రజ్య తు తాస్సర్వా న్నమస్కృత్య నివర్తయేత్‌|| 50

బాంధవైః స్వజనై ర్యుక్త స్తతో భుంజీత వాగ్యతః | అన్యైశ్చోపానకైర్దీనై ర్భిక్షుకైశ్చాన్నకాంక్షిభిః || 51

ఏవం కృత్వా నరః సమ్య ఙ్నారీ వా లభ##తే ఫలమ్‌ | ఆశ్వమేధ సహస్రాణాం రాజసూయశతస్య చ || 52

అతీతం శతమాదాయ పురుషాణాం నరోత్తమాః | భవిష్యం చ శతం విప్రాః స్వర్గత్వా దివ్యరూపధృక్‌|| 53

సర్వలక్షణ సంపన్నః సర్వాలంకార భూషితః | సర్వకామ సమృద్ధాత్మా దేవవద్ద్విగతజ్వరః || 54

రూప ¸°వన సంపన్నో గుణౖః సర్వైరలంకృతః | స్తూయమానో7ప్సరోభిశ్చ గంధర్వైః సమలంకృతః|| 55

విమానేనార్కవర్ణేన కామగేన స్థిరేణ చ | పతాకాధ్వజ యుక్తేన సర్వరత్నైరలంకృతః ||56

ఉద్యోతయన్దిశః సర్వా ఆకాశే విగతక్లమః | యువా మహాబలో ధీమా న్విష్ణులోకం స గచ్ఛతి || 57

తత్ర కల్పశతం యావ ద్భుంక్తే భోగాన్యథేప్సితాన్‌ | సిద్ధాప్సరోభి ర్గంధర్వైః సురవిద్యాధరోరగైః || 58

స్తూయమానో మునివరై స్తిష్ఠతే విగతజ్వరః | యథా దేవో జగన్నాథః శంఖచక్ర గదాధరః || 59

తథా7సౌ ముదితో విప్రాః కృత్వా రూపం చతుర్భుజమ్‌| భుక్త్వా తత్ర వరాన్భోగా న్క్రీడాం కృత్వా సురైః సహ|| 60

తదంతే బ్రహ్మసదన మాయాతి సర్వకామదమ్‌ | సిద్ధవిద్యాధరైశ్చాపి శోఖితం సురకిన్నరైః || 61

కాలం నవతి కల్పంతు తత్ర భుక్త్వా సుఖం నరః | తస్మాదాయాతి విప్రేంద్రాః సర్వకామ ఫలప్రదమ్‌|| 62

రుద్రలోకం సురగణౖః సేవితం సుఖమోక్షదమ్‌ | అనేక శతసాహసై#్ర ర్విమానైః సమలంకృతమ్‌ || 63

సిద్ధవిద్యాధరై ర్యక్షై ర్భూషితం దైత్యదానవైః| అశీతికల్పకాలంతు తత్ర భుక్త్వా సుఖం నరః || 64

తదంతే యాతి గోలోకం సర్వభోగ సమన్వితమ్‌ | సురసిద్ధాప్సరోభిశ్చ శోభితం సుమనోహరమ్‌ || 65

తత్ర సప్తతి కల్పాంస్తు భుక్త్వా భోగమనుత్తమమ్‌ | దుర్లభం త్రిషు లోకేషు స్వస్థచిల్తో యథా7మరః || 66

తస్మాదాగచ్ఛతే లోకం ప్రాజాపత్య మనుత్తమమ్‌ | గంధర్వాప్సరసైః సిద్ధై ర్ముని విద్యాధరై ర్వృతః|| 67

షష్టికల్పాన్సుఖం తత్ర భుక్త్వా నానావిధం ముదా | తదంతే శక్రభవనం నానాశ్చర్య సమన్వితమ్‌ || 68

గంధర్వైః కింనరైః సిద్ధైః సుర విద్యాధరోరగైః | గుహ్యకాప్సరసైః సాధ్యై ర్వృతైశ్చాన్యైః సురోత్తమైః || 69

ఆగత్య తత్ర పంచాశ త్కల్పాన్భుక్త్వా సుఖం నరః | సురలోకం తతో గత్వా విమానైః సమలంకృతః || 70

చత్వారింశత్తు కల్పాంస్తు భుక్త్వా భోగాన్సుదుర్లభాన్‌ | అగచ్ఛతే తతో లోకం నక్షత్రాఖ్యం సుదుర్లభమ్‌ || 71

తతో భోగాస్వరాన్భుంక్తే త్రింశత్కల్పాన్యథేప్పితాన్‌ | తస్మాదాగచ్ఛతే లోకం శశాంకస్య ద్విజోత్తమాః || 72

యత్రాసౌ తిష్ఠతే సోమః సర్వదేవైరలంకృతః | తత్ర వింశతికల్పాంస్తు భుక్త్వా భోగం సుదుర్లభమ్‌|| 73

ఆదిత్యస్య తతో లోక మాయాతి సురపూజితమ్‌ | నానాశ్చర్య మయం పుణ్యం గంధర్వాప్సరః సేవితమ్‌ || 74

తత్ర భుక్త్వా శుభాన్భోగా న్దశకల్పాన్ద్విజోత్తమాః | తస్మాదాయాతి భువనం గంధర్వాణాం సుదుర్లభమ్‌ || 75

తత్ర భోగాన్సమస్తాంశ్చ కల్పమేకం యథా సుఖమ్‌ | భుక్త్వా చా77యాతి మేదిన్యాం రాజాభవతి ధార్మికః|| 76

చక్రవర్తీ మహావీర్యో గుణౖః సర్వైరలంకృతః | కృత్వా రాజ్యం స్వధర్మేణ యజ్ఞైరిష్ట్వా సుదక్షిణౖః || 77

తదంతే యోగినాం లోకం గత్వా మోక్షప్రదం శివమ్‌ | తత్ర భుక్త్వా వరాన్భోగా న్యావదాభూత సంప్లవమ్‌|| 78

తస్మాదాగచ్ఛతే చాత్ర జాయతే యోగినాం కులే | ప్రవరే సైష్ణవే విప్రా దుర్లభే సాధుసంమతే || 79

చతుర్వేదీ విప్రవరో యజ్ఞైరిష్ట్వా77ప్త దక్షిణౖః | వైష్ణవం యోగమాస్థాయ తతో మోక్షవాప్నుయాత్‌ || 80

ఏవం యాత్రాఫలం విప్రా మయా సమ్యగుదాహృతమ్‌ | భుక్తిముక్తిప్రదం నౄణాం కిమన్యచ్ఛ్రోతు మిచ్ఛథ|| 81

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే స్వయంభ్వృషిసంవాదే ద్వాదశయాత్రాఫల మాహాత్మ్య నిరూపణం నామ సప్తషష్టితమో7ధ్యాయః

అటుమీద గృహమునకేగి మౌనమూని పురుషోత్తముని ధ్యానావాహనాది విధానమున పూజింపవలెను. అదేవుని ఆవునేతితో పాలతో నభిషేకింపవలెను. పంచామృత స్నానము కూడ చేయింపవలెను. చందనోదకముతో స్నానమాడింపవలెను. ఆ మీద వస్త్రయుగ్మ సమర్పణ చేయవలెను. చందనాగరు కర్పూర కుంకుమములు పూయవలెను. విష్ణు ప్రియములైన తామర మల్లియలతో జగన్నాథుని పూజింపవలెను. ధూపమీయవలెను. అవునేతితోగాని నువ్వుల నూనెతోగాని పండ్రెండు దీపములను పెట్టవలెను. పాయసము చక్కెలములు లడ్డూ వటకము బెల్లపుపాకమునివేదింపవలెను. మధుర ఫలములను గూడ నివేదింపవలెను, పంచోపచారములచే నిట్లు పూజించి ''నమఃపురుషోత్తమాయ'' అను మంత్రము 108 మార్లు జపింపవలెను. అటుపై నాదేవుని నమస్తే సర్వలోకేశ (29శ్లో)అని ప్రారంభించి స్తుతించి యీ పండ్రెండు యాత్రలు నీయనుగ్రహమున సంపూర్ణ ఫలవంతములగుగాక యని యాదేవుని యనుగ్రహింప జేసుకొని దండవత్ప్రణామము గావింపవలెను. పుష్ప వస్త్ర గంధాదులచే సటుపై గురువుని పూజింపవలెను. గురువునకును దేవునకును భేదములేదు. ఆ మీదట పుష్పమండప నిర్మాణము జేసి వేదాది విద్యలను స్వామికి నవధరింపజేసి యా రాత్రి జాగరణచేయవలెను. అందు వాసుదేవకథాప్రసంగము. సంకీర్తనము చేయవలెను. చేయింపవలెను. ధ్యానించుచు పఠించుచు శ్రీహరిని స్తుతించుచు నమస్కరించుచు నారేయి గడుపవలెను. ద్వాదశియందు ప్రభాతమున పండ్రెండుగురు వ్రతస్నాతులు వేదపారగులు ఇతిహాసపురాణజ్ఞులు జితేంద్రియులు నయిన బ్రాహ్మణులను ఆహ్వానింపవలెను. తాను యథావిధి స్నానముజేసి పురుషోత్తముని పూజింపవలెను. బ్రాహ్మణులను బూజించి గొ, స్వర్ణ, ఛత్ర, పాదుకాదులను వస్త్రాభరణములను నొసంగి బూజింపవలెను. ఆచార్యునకు కూడ పైన చెప్పిన ద్రవ్యములనొసంగి యందరికిని మృష్టాన్న భోజనము పెట్టవలెను. ఆ బ్రాహ్మణులకు మోదకములతోగూడ పండ్రెండు ఉదకుంభ దానములను సదక్షిణముగ చేయవలెను. జ్ఞాన ప్రదుడైన గురువును బ్రాహ్మణులను విష్ణుతుల్యులుగా భక్తితో భావించి యిట్లు బూజింప వలెను. అటుపై వారికి నమస్కరించుచు నీక్రింది 48శ్లోకరూపమయిన మంత్రమును పఠింపవలెను. ఆ శ్లోక భావమిది. ''అంతటను నిండియున్నవాడు. ఆదిమధ్యాంతములు లేనివాడు శంఖచక్ర గదాధరుడు జగన్నాధుడు నగు పురుషోత్తమదేవుడు సంప్రీతుడగుగాక. అని యిట్లుపలికి విప్రులకు నమస్కరించి యాచార్యునితోబాటు వారికి శిరసు వంచి నమస్కరించి వారిని తనయింటి సరిహద్దుల వరకు సాగనంపి నమస్కరించి వచ్చి బంధుజనముతో వాజ్నియమము వహించి భగవత్ప్రసాదము నారగింపవలెను. ఉపాసకులకు దీనులకు భిక్షుకులకు అన్నాతురులకు గూడ భోజనము బెట్టవలెను. ఇట్లుచేసిన పురుషుడేని స్త్రీ యేని యశ్వమేధ రాజసూయ శతసహస్ర పుణ్యము బొందును. నూరు తరములు వెనుకవారిని ముందువారిని తరింపజేసి దివ్యరూపధారియై సూర్యునట్లు వెలుగు కామగమగు విమానమున గంధ ర్వాప్సరోబృందము స్తుతింప దన పుణ్య విశేషముచే దశదిశలను వెలిగించుచు నాతడు హరిపురమేగును. నూరు కల్పములు వైకుంఠ భోగముల ననుభవించి సర్వస్తుతి పాత్రమయి జగన్నాధ స్వామి సారూప్యమంది సర్వభోగముల ననుభవించి బ్రహ్మలోక మేగును. అచట తొంబది కల్పములు సుఖించి రుద్రలోకమున కేనును. అచట నెనుబది కల్పములు సుఖమనుభవించి గోలోకమునకేగును. డెబ్బది కల్పములచట నుండును. అటనుండు ప్రజాపతి లోకమేగి యఱువది కల్పములు నానా భోగములననుభవించును. అటనుండి యింద్ర భవనమున కేతెంచి యేబది కల్పములు సుఖించి నలుబది కల్పములు సురలోకమున సుఖమనుభవించి నక్షత్రలోకమునకేగి ముప్పది కల్పములుండి చంద్రలోకమున నిరువది కల్పములుండి యాదిత్యలోకమునకేగి పది కల్పములు సుఖించి గంధర్వ భువనమున నొక కల్పము భోగించి భూమికేతెంచి ధర్మపరుడైన చక్రవర్తి యగును. ఇచట రాజ్యమును ధర్మముగ పాలించి సంపూర్ణ దక్షిణములగు యజ్ఞములాచరించి యోగిగమ్యమగు మోక్షప్రదమయిన శివలోక మందును. అందు భూతప్రళయముదాక సర్వభోగముల ననుభవించి మరల నిటకువచ్చి యోగుల కులమందు విష్ణుభక్తుడైన విప్రులవంశమందు ఙనెంచి చతుర్వేదా ధ్యాయిమై సుదక్షిణములై యజ్ఞములను జేసి విష్ణుభక్తి యోగమునూని మోక్షమందును.

భుక్తిముక్తులనొసంగు గుడివాయాత్రాఫలము మీకు చక్కగ వినిపించితిని. ఓ విప్రులార! మరి యేమి వినవలతురు?

ఇది బ్రహ్మపురాణమునందు ద్వాదశయాత్రాఫల మాహాత్మ్యమను నఱువది యేడవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters