Brahmapuranamu    Chapters   

అథ ఏకోనషష్టితమో ధ్యాయః

శ్వేతమాధవమాహాత్మ్యవర్ణనమ్‌

బ్రహ్మోవాచ

అనంతాఖ్యం వాసుదేవం దృష్ట్వా భ్యక్త్యా ప్రణమ్యచ | సర్వపాపవినిర్ముక్తో నరో యాతి పరం పదమ్‌ || 1

మయా చా೭೭రాధితశ్చాసౌ శ##క్రేణ తదనంతరమ్‌ | విభీషణన రామేణ కస్తం నా೭೭రాధయేత్పుమాన్‌ || 2

శ్వేతగంగాం నరః స్నాత్వాయః పశ్వేచ్ఛ్వేతమాధవమ్‌ | మత్స్యాఖ్యం మాధవం చైవ శ్వేతదీపం స గచ్ఛతి|| 3

బ్రహ్మయిట్లనియె.

అనంత వాసుదేవ మూర్తిని సేవించనవారు పాపముక్తులై పరమపదమందుదురు. ఈ స్వామిని నేనును నింద్రుడును సేవించినాము. అటుపై విభీషణుడు రాముడు సేవించిరి శ్వేత గంగ యందు స్నానముచేసి శ్వేతమాధవుని మత్య్సమూర్తియైన మాధవుని దర్శించిన యతడు శ్వేతద్వీపమునకేగును.

మునయ ఊచుః

శ్వేతమాధవమాహాత్మ్యం వక్తుమర్హస్యశేషతః | విస్తరేణ జగన్నాథ ప్రతిమాం తస్య వై హరేః || 4

తస్మిన్జేత్రవరే పుణ్య విఖ్యాతే జగతీతలే | శ్వేతాఖ్యం మాధవం దేవం కస్తం స్థాపితవాన్పురా || 5

అటుపై మునులు శ్వేత మాధవుని మహాత్మ్యమును చెప్పుడు. శ్వేమాథవుని విగ్రహమును ప్రతిష్టించిన వారెవరు?

బ్రహ్మోవాచ

అభూత్కృతయుగే విప్రాః శ్వేతో నామ నృపోబలీ | మతిమాన్థర్మవిచ్చూరః సత్యసంధో ధృఢవ్రతః || 6

యస్యరాజ్యేతు వర్షాణాం సహస్రం దశమానవాః | ఆయుష్మంతోభవంత్యత్ర బాల స్తస్మిన్న సీదతి || 7

వర్తమానే తదారాజ్యే కించిత్కాలే గతే ద్విజాః | కపాలగౌతమో నామ ఋషిః పరమధార్మికః || 8

సుతోస్యాజాతదంతశ్చ మృతః కాలవృశాద్ద్విజాః | తమాదాయ ఋషిర్ధీమాన్వృపస్యాంతికమానయత్‌ || 9

దృష్ట్వెవం నృపతిః సుప్తం కుమారం గతచేతసమ్‌ | ప్రతిజ్ఞామకరోద్విప్రా జీవనార్ధం శిశోస్తదా || 10

రాజోవాచ

యావద్భాలమహం త్వేనం యమస్య సదనేగతమ్‌ | నా೭೭నయే సప్తరాత్రేణ చితాం దీప్తాం సమారుహే || 11

బ్రహ్మోవాచ

ఏవముక్త్వా సితైః పద్మైః శ##తై ర్దశశతాదికై ః | సంపూజ్య చ మహాదేవం రాజా విద్యాం జజాపచ|| 12

అతిభక్తిం తు సంచింత్య నృపస్య జగదీశ్వర ః | సాన్నిధ్యమగమత్తుష్టో స్మిత్యువాచ సహోమయా || 13

శ్రుత్వైవం గిర మీశస్య విలోక్య సహసాహరమ్‌ః | భస్మదిగ్ధం విరూపాక్షం శరత్కుందేందువర్చనమ్‌ || 14

శార్దూలచర్మవసనం శశాంకాంకితమూర్ధజమ్‌ | మహీం నిపత్య సహసా ప్రణమ్య సతదాబ్రవీత్‌ || 15

శ్వేత ఉవాచ

కారుణ్యం యదిమాం దృష్ట్వా ప్రసన్నోసిప్రభోయది | కాలస్య వశమాపన్నో బాలకో ద్విజపుత్రకః || 16

జీవత్వేష పునర్బాల ఇత్యేవం వ్రతమాహితమ్‌ | ఆకస్మాచ్చ మృతం బాలం నియమ్య భగవన్స్వయమ్‌ ||

యథోక్తాయుష్యసంయుక్తం క్షేమం కురు మహేశ్వరః || 17

కృతయుగమందు బుద్ధిమంతుడు ధర్మజ్ఞుడు శూరుడు సత్యనంధుడు వ్రతనిష్ఠుడునైన శ్వేతుడను రాజు యొక్క రాజ్యమందు మానవులు పదివేలసంవత్సరముల యాయుర్దాయము గల్గియుండిరి. కొంతకాలమునకు కపాలగౌతముడను ఋషి పండ్లుకూడ రానిస్థితిలో మరణించిన తన కుమారు నెత్తుకొని రాజునొద్దకు గొని వచ్చెను. రాజు వానింజూచి యాశిశువును యమలోకమునుండి తిరిగి తీసికొని రానిచో నేడు రోజులలో చితి యెక్కెదనని ప్రతిజ్ఞచేసెను. అట్లుచేసి వేలకొలది. పద్మములతో మహాదేవుని పూజించి శివమంత్రములను జపించెను. అతని భక్తికిమెచ్చి మహేశ్వరుడుమాదేవితో సాక్షాత్కరించెను. అంతియకాదు. నీభక్తికి సంతుష్టుడనైతిననెనను. శరత్కాల మందలి చంద్రబింబమట్లు మొల్లమొగ్గలవలె తెల్లగనున్నవిభూతి దాల్చి శార్దూలచర్మమూని, చంద్రశేఖరుడునై దర్శనమిచ్చిన ఫాలాక్షుని దర్శించి నమస్కార మొనరించి శ్వేతుండిట్లనియె. స్వామీ! నాయందు ప్రసన్నుడ వైతినేని, కాలవశుడైన ఈ బ్రాహ్మణ శిశువు బ్రతుకు గాక ! ఆకాల మృతుడైన యీ బాలుని సంపూర్ణాయుష్మం తుని క్షేమవంతుని జేయుమనికోరెను.

బ్రహ్మోవాచ

శ్వేతసై#్యతద్వచః శ్రత్వా ముదం ప్రాప హరస్తదా | కాలమాజ్ఞాపయామాస సర్వభూత భయంకరమ్‌ || 18

నియమ్య కాలం దుర్ధర్షం యమస్యా೭೭జ్ఞాకరం ద్విజాః| 19

బాలం సంజీవయామాన మృత్యోర్ముఖగతం పునః || 20

కృత్వా క్షేమం జగత్సర్వం మునేః పుత్రం నృపోత్మమః || 21

మునయ ఊచుః

దేవ దేవ జగన్నాథ త్రైలోక్య ప్రభావావ్యయ | బ్రూహినః పరమం తథ్యం శ్వేతాఖ్యప్య చ సాంప్రతమ్‌ || 22

శ్వేతుని యా పలుకులు విని శివుడానందము వడి కాలమును నియమించి సర్వభూత భయంకరమైన యముని శాశించిమృత్యుముఖ గ్రస్తుడైన నా బాలుని జీవింప జేసెను. మహాదేవుడు. గౌరితో మునికుమారుని నర్వ జగత్తును క్షేమ సంపన్న మొనర్చి యంతర్థానమయ్యెను. అన విని మునులు ఆ శ్వేత నృపతి వృత్తాంతమును సవిస్తరముగా చెల్పుమనియుడగ జగత్ర్పభువిట్లు పలికెను.

బ్రహ్మోవాచ

శృణుధ్వం మనిశారూలాః సర్వసత్త్వహితావహమ్‌ | ప్రవక్ష్యామి యథాతథ్యం యత్పృచ్ఛథ మమానఘాః || 23

మాథవస్యచమాహాత్మ్యం సర్వపాప ప్రణాశనమ్‌ | యచ్ఛుత్వా భిమతాన్కా మాస్థ్రువం ప్రాప్నోతి మానవః || 24

శ్రుతవానృషిభిః పూర్వం మాధవాఖ్యస్య భోద్విజాః | శృణుధ్వం తాం కథాం దివ్యాం భయశోకార్తినాశినీమ్‌ || 25

స కృత్వా రాజ్యమేకాగ్ర్యం వర్షాణాం చ సహస్రకం | విచార్య లౌకికాన్ధర్మాన్వైదికాన్ని యమాం స్తథా || 26

కేశవారాధనే విప్రా నిశ్చితం వ్రతమాస్థితిః | స గత్వా పరమం క్షేత్రం సాగరం దక్షిణాశ్రయమ్‌ || 27

తటే తస్మిన్శుభే రమ్యేదేశే కృష్ణస్య చాంతికే | శ్వేతోథ కారయామాస ప్రాసాదం శుభలక్షమ్‌ || 28

ధన్వంతరశతం చైకం దేవదేవస్య దక్షిణ| తతః శ్వేతేన విప్రేంద్రాః శ్వేతశైలమయేన చ || 29

కృతః స భగవాన్మ్వేతో మాధవశ్చంద్ర సంనిభః | ప్రతిష్టాం విధివచ్చక్రే యథోద్దిష్టాం స్వయం తు సః || 30

దత్వా దానం ద్విజాతిభ్యో దీనానాథతపస్వినామ్‌ | అథానంతరతో రాజా మాధవస్య చ సంవిదా|| 31

మహీం నిపత్య సహసా ఓంకారం ద్వాదశాక్షరమ్‌ | జపన్స మౌనమాస్థాయి మాసమేకం సమాధినా || 32

నిరాహరో మహాభాగః సమ్యగ్విష్ణుపదే స్థితః | జపాంతే స తు దేవేశం సంస్తోతు ముపచక్రమే|| 33

ఈ కథ సర్వజీవ హితకరము. మాధవుని మహాత్మ్యము సర్వపాప ప్రణాశనము. సర్వకామఫలప్రదము. నేనుఋషుల వలన వింటిని. భయదుఃఖములను హరించు నీ దివ్యకథను వినుడు. శ్వేతుడు వేలేండ్లు చక్కగ పాలించి లౌకిక వైదిక ధర్మవిచారణ చేసి దక్షిణ సముద్ర తీరమందలి క్షేత్రముల కేగి కృష్ణాష్టమినాడు సలక్షణమైన విష్ణు వ్రాసాదమును నిర్మించెను. ఆది నూరు ధనస్సులపరిమాణము గలది. శ్వేతశైల మయమైన భగవన్మూర్తిని మాధవుని మూర్తినందు న్వయముగా ప్రతిష్ఠించెను. బ్రాహ్మణులకు తపస్వినులకు దీనులకు ననాధులకు నమ్మాధవుని సన్నిధిని దానముల నొనరించి స్వామి యెదుట వుడమిపై వ్రాలి ప్రణవపూర్వకమైన ద్వాదశక్షర మంత్రమును జపించుచు నొకమానము మౌనవ్రతుడై నిరాహారుడై యవ్విష్ణుపదమందు సమాధి నిస్ఠుడయ్యెను. జపాంతమందు దేవేశ్వరునిట్లు స్తుతించెను.

శ్వేతకృత విష్ణుస్తుతి

ఓం నమో వాసుదేవాయ నమః సంకర్షణాయ చ | స్రద్యుమ్నాయానిరుద్ధాయ నమో నారాయణాయ చ|| 34

నమోస్తు బహురూపాయ విశ్వరూపాయ వేధనే | నిర్గణాయా ప్రతర్క్యాయ శుచయే శుభకర్మణ|| 35

ఓం నమః పద్మనాభాయ పద్మగర్భోద్భవాయ చ | నమోస్తు పద్మవర్ణాయ పద్మసాస్తాయతే నమః || 36

ఓం నమః పుష్కరాక్షాయ సహస్రాక్షాయ మీఢుషే | నమః సహస్రసాదాయ సహస్రభుమన్యవే || 37

ఓం నమోస్తు వరాహాయ వరదాయ సుమేధనేః వరిష్ఠాయ వరేణ్యాయ శరణ్యాయాచ్యుతాయ చ|| 38

ఓం నమో బాలరూపాయ బాలపద్మప్రభాయ చ | బాలార్కసోమనే త్రాయ ముంజకేశాయ ధీమతే || 39

కేశవాయ నమో నిత్యం నమో నారాయణాయ చ | మాధవాయ పరిష్టాయ గోవిందాయ నమోనమః || 40

ఓం నమో విష్ణవే నిత్యం దేవాయ వసురేతపే | మధుసూదనాయ నమః శుద్ధాయాంశుధరాయ చ|| 41

నమోనంతాయ సూక్ష్మాయ నమః శ్రీవత్సధారిణ| త్రివిక్రమాయ చ నమో దివ్యపీతాంబదాయ చ|| 42

సృష్టికర్త్రే నమస్తుభ్యం గోప్త్రేధాత్రే నమో నమః | నమోస్తు గుణభూతాయ నిర్గుణాయ నమో నమః || 43

నమో వామనరూపాయ నమో వామనకర్మణ | నమో వామననే త్రాయ నమో వామనవాహినే || 44

నమో రమ్యాయ పూజ్యయ నమోస్త్వవ్య క్తరూపిణ | అప్రతర్క్యాయ శుద్ధాయ నమో భయహరాయచ || 45

సంసారార్ణవపోతాయ ప్రశాంతాయ స్వరూపిణ | శివాయ సౌమ్యరూపాయ రుద్రాయోత్తారణాయ చ || 46

భవభంగకృతే చైవ భవభోగప్రదాయ చ | భవసంఘాతరూపాయ భవసృష్టికృతే సమః || 47

ఓం నమో దివ్యరూపాయ సోమాగ్నిశ్వసితాయ చ | సోమసూర్యాంశుకేశాయ గోబ్రాహ్మణహితాయ చ || 48

ఓం నమ ఋక్స్వరూపాయ పదక్రమస్వరూపిణ | ఋక్త్సతాయ నమస్తుభ్యం నమ ఋక్సాధనాయ చ || 49

ఓం నమో యజుషాం ధాత్రే యజూరూపధరాయ చ | యజుర్యాజ్యాయ జుష్టాయ యజుషాం వతయే సమః || 50

ఓం నమః శ్రీపతే దేవ శ్రీధరాయ వరాయచ | శ్రియః కాంతాయ దాంతాయయోగిచింత్యాయ యోగినే || 51

ఓం నమః సామరూపాయ సామధ్వనివరాయ చ | ఓం నమః సామసౌమ్యాయ సామయోగవిదే నమః || 52

సామ్నే చ సామగీతాయ ఓం నమః సామధారిణ | సామయజ్ఞవిదే చైవ నమః సామకరాయ చ 53

నమస్త్వథర్వశిరసే నమోథర్వస్వరూపిణ | నమో స్త్వథర్వపాదాయ నమో థర్వకరాయ చ || 54

ఓం నమో వజ్రశీర్షాయ మధుకై టభఘాతినే | మహోదధిజలస్థాయ వేదాహరణకారిణ || 55

నమో దీప్తిస్వరూపాయ హృషీ కేశాయ వైనమః| నమో భగవతే తుభ్యం వాసుదేవాయతే నమః || 56

నారాయణ నమస్తుభ్యం నమో లోకహితాయ చ | ఓం నమో మోహనాశాయ శవభంగకరాయ చ || 57

గతిప్రదాయ చ నమో నమో బంధహరాయ చ | త్రైలోక్య తేజసాం కర్త్రే నమ స్తేజస్ప్వరూపిణ|| 58

యోగీశ్వరాయ శుద్ధాయ రామాయోత్తరణాయ చ | సుఖాయ సుఖనేత్రాయ నమ స్సుకృతధారిణ || 59

వాసుదేవాయ వంద్యాయ వామదేవాయ వైనమః | దేహినాం దేహ కర్త్రే చ భేదభంగకరాయ చ || 60

దేవైర్వందితదేహాయ నమస్తే దివ్య మౌళినే | నమో వాసనివాసాయ వాసవ్యవహరాయ చ || 61

ఓం నమో వసుకర్త్రే చ వసువాసప్రదాయ చ | నమో యజ్ఞస్వరూపాయ యజ్ఞేశాయ చ యోగినే || 62

యతియోగకరేశాయ నమో యజ్ఞాంగధారిణ | సంకర్షణాయ చ నమః ప్రలంబమథనాయ చ || 63

మేఘఘోష స్వనోత్తీర్ణవేగలాంగలధారిణ | నమో7స్తు జ్ఞానినాంజ్ఞాన నారాయణపరాయణ || 64

ఈ స్తోత్రము విష్ణునామ మధురము. సరళము. సులభార్ధము.

నమే7స్తి త్వామృతే బంధు ర్నరకోత్తారణ ప్రభో | అతస్త్వాం సర్వభావేన ప్రణతో నతవత్సల || 65

మలం యత్కాయజం వ్యాపి మానసం చైవ కేశవ | న తస్యాన్యొ7స్తి దేవేశ క్షాళక స్త్వామృతే7చ్యుత || 66

సంసర్గాణి సమస్తాని విహాయ త్వా ముపస్థితః | సంగో మే7స్తు త్వయా సార్ధ మాత్మలాభాయకేశవ || 67

కష్ట మాపత్సు దుష్పారం సంసారం వేద్మి కేశవ | తాపత్రయపరిక్లిష్ణస్తేన త్వాం శరణం గతః || 68

ఏషణాభి ర్జగత్సర్వం మోహితం మాయయాతవ | ఆకర్షితం చ లోభాద్యై రతస్త్వా మహమాశ్రితః || 69

నాస్తి కించిత్సుఖం విష్ణో సంసారస్థస్య దేహినః | యథా యథా హి యజ్ఞేశ త్వయి చేతః ప్రవర్తతే || 70

తథా ఫలవిహీనం తు సుఖమాత్యలతికం లభేత్‌ | నష్టో వివేకశూన్యో77స్మి దృశ్యతే జగదాతురమ్‌|| 71

గోవింద త్రాహి సంసారా న్మాముద్ధర్తుం త్వమర్హసి| మగ్నస్య మోహసలిలే నిరుత్తారే భవార్ణవేః 72

ఉద్ధర్తా పుండరీకాక్ష త్వామృతే7న్యో న విద్యతే

మఱియు నిట్లనియె. ప్రభో! నన్ను నరకమునుండి యుద్ధరింపగల బంధువు నీకంటెలేడు. కాయికమలము మానసికమలము నను వానికంతము లేదు. వానిని క్షాళనము సేయ నీకంటె నెవ్వరులేరు. నర్వ సంగముల నెడలి నిన్ను జేరితిని. నీతో నెన్నడును నాకు సంగము గలుగుగాక. అది యాత్మలాభము (స్వరూప దర్శనము) కొఱకు సమర్ధమగుగాక. ఈ సంసార మపార కష్టభరిత. నేను తాపత్రయ పరితప్తుడను. నిన్ను శరణు సొచ్చితిని. దారేషణ పుత్రేషణలచే మాయా మోహితుడనై లొభాదిగుణములచే ఆకర్షితుడనై నిన్ను శరణందితిని. సాంసారికసుఖమించుకైన లేదు. యజ్ఞేశ్వరా! మనసు నీవంక ప్రవర్తించి నిష్కామమైన ఆత్యంతికసుఖము (మోక్షము) బొందుదును గాక. వివేకశూన్యుడనై యున్నాను. జగత్తు వ్యక్తావ్యక్తము. ఓ గోవిందా! రక్షింపుము. సంసారమునుండి యుద్ధరింపుము. మోహరసమయము దుస్తరమునైన భవాబ్ధిలో మునిగిన న న్నుద్ధరింపగలవాడు ఓ పుండరీకాక్ష! నీ కంటె మఱి గనబడడు.

బ్రహ్మోవాచ -

ఇత్థం స్తుత స్తత స్తేన రాజా శ్వేతేన భోద్విజాః | తస్మి నేక్షత్రవరే దివ్యే విఖ్యాతే పురుషోత్తమే|| 73

భక్తిం తస్య తు సంచింత్య దేవదేవో జగద్గురుః | ఆజగామ నృపస్యాగ్రే సర్వైర్దేవైర్వృతో హరిః|| 74

నీలజీమూత సంకాశః పద్మపత్రాయతేక్షణః| దధత్సుదర్శనం ధీమాన్కరాగ్రే దీప్తమండలమ్‌|| 75

క్షీరోదజలసంకాశే విమలశ్చంద్ర సంనిభః| రరాజ వామహస్తే7స్య పాంచజన్యో మహాద్యుతిః|| 76

పక్షిరాజధ్వజః శ్రీమాన్గదాశారాఙ్గది ధృక్ప్రభుః| ఉవాచ సాధుల భో రాజన్య స్య తే మతిరుత్తమా|| 77

యదిష్టం వర భద్రంతే ప్రసన్నో7స్మి తవానఘ||

బ్రహ్మోవాచ-

శ్రుత్వైవం దేవదేవస్య వాక్యం తత్పరమామృతమ్‌| ప్రణమ్య శిరసోవాచ శ్వేతస్తద్గతమానసః || 78

శ్వేత ఉవాచ-

యద్యహం భగవాన్భక్తః ప్రయచ్ఛ వరముత్తమమ్‌| ఆబ్రహ్మ భవనాదూర్ధ్వం వైష్ణవం పద మవ్యయమ్‌|| 79

విమలం విరజం శుద్ధం సంసారాసంగవర్జితమ్‌| తత్పదం గంతుమిచ్ఛామి త్వత్ప్రసాదాజ్జగత్పతే|| 80

ఇట్లు శ్వేతునిచే వినుతుడై యా పురుషోత్తమక్షేత్రమందు జగద్గురువు హరి సర్వ దేవతలతో సాక్షాత్కరించెను. ఆ మూర్తి నీలమేఘుడు. పద్మనేత్రుడు. తేజోమండలాంతర్గతుడు. ఆయన వామహస్తమున పాలవెల్లి చందమామవొలె పాంచజన్యమనుశంఖము వెలుగొందుచుండెను. గదా శారజ్గ ఖడ్గధరుడై గరుడధ్వజుడు వచ్చి రాజా! నీబుద్ధి స్వచ్ఛమైనది. భక్తిభరితమైనది. ఓ పుణ్యశాలి! ప్రసన్నుడనైతిని. అభీష్టవరమును గోరుమన శిరసువంచి తద్గతమనస్కుడై స్వామిపరమామృతవాక్యములనువిని శ్వేతుడిట్లనియె. ప్రభో! నేనుభగవద్భక్తుడనేని బ్రహ్మ లోకము కంటెను మీదిది, విమలము, విరజము శుద్ధము సంసార సంగరహితము అవ్యయమునగు విష్ణుపదమును నీ యనుగ్రహమున నందగోరుచున్నాను అని విన్నవించెను.

శ్రీ భగవానువాచ-

యత్పదం విబుధాః సర్వే మునయః సిద్ధయోగినః| నాభిగచ్ఛంతి యద్రమ్యం పరం పద మనామయమ్‌|| 81

యాస్యసి పరమం స్థానం రాజ్యామృతముపాస్య చ| సర్వాన్లోకానతిక్రమ్య మమలోకం గమిష్యసి|| 82

కీర్తిస్తవాత్ర రాజేంద్ర త్న్రీన్‌లోకాంశ్చ గమిష్యతి| సాన్నిధ్యం మమ చైవాత్ర సర్వదైవ భవిష్యతి|| 83

శ్వేతగంగేతి గాస్యంతి సర్వే తే దేవదానవాః| కుశాగ్రేణాపి రాజేంద్ర శ్వేతగాంగేయమంబు చ|| 84

స్పృష్ట్వా స్వర్గం గమిష్యంతి మద్భక్తా యే సమాహితాః| యస్త్విమాం ప్రతిమాంగచ్ఛేన్మాధవాఖ్యాం శశిప్రభామ్‌|| 85

శంఖగోక్షీరసంకాశామశేషాఘవినాశినీమ్‌| తాం ప్రణమ్య సకృద్భక్త్యా పుండరీకవిభేక్షణామ్‌|| 86

విహాయ సర్వలోకాన్వై మమ లోకే మహీయతే| మన్వంతరాణి తత్రైవ దేవకన్యాభి రావృతః|| 87

గీయమానశ్చ మధురం సిద్ధగంధర్వసేవితః| భునక్తి విపులా న్భోగా న్యథేష్టం మామకై స్సహ|| 88

చ్యుత స్తస్మాదిహా77గత్య మనుష్యో బ్రాహ్మణో భ##వేత్‌| వేదవేదాంగవి చ్ఛ్రీ మాన్భోగవాం శ్చిరజీవితః|| 89

గజాశ్వరథయానాఢ్యో ధనధాన్యావృతః శుచిః| రూపవా న్బహుభాగ్యశ్చ పుత్రపౌత్రసమన్వితః|| 90

పురుషోత్తమమను ప్రాప్యవటమూలే7థసాగరే| త్వక్త్వాదేహం హరింస్మృత్వాతతశ్శాంతపదం వ్రజేత్‌|| 91

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే స్వయంభుఋషిసంవాదే శ్వేతమాధవమాహాత్మ్యవర్ణనంనామ ఏకోనషష్టి తమో7ధ్యాయః

భగవంతుడిట్లనియె. దేవ-ముని-సిద్ధ-యోగి గణముల కందని పరమ రమ్యమైన స్థానమునకు నీవు వెళ్ళగలవు. రాజ్యాసనము, రాజ్యామృతము, నుపాసించి సర్వలోకములు దాటి నాలోకమున కేగగలవు. నీకీర్తి త్రిలోక వ్యాప్త మగును. ఎల్లప్పుడు నా సాన్నిధ్యము కలుగును. ఇది శ్వేతగంగయని దేవదానవులు గానము చేయుదురు. ఈ శ్వేత గంగాజలమును గుశాగ్రము చేత స్పృశించినా భక్తులు సమాధి నిష్ఠులై స్వర్గమున కేగ గలరు. ఈ శ్వేతమాధవ విగ్రహము వెన్నెలకాంతి మించును. శంఖము గోక్షేరమువలె అచ్ఛమైనది. ఈ మూర్తి సదాఅఘ వినాశిని. తెల్ల తామర పూలవలె మెఱయు నేత్ర శోభగలది. ఈ ప్రతిమకు నమస్కరించి సర్వలోకములను దాటి నా లోకమందు ననేక మన్వంతరములు దేవ సుందరీ పరివృతుడై మధురముగ గానము చేయబడు కీర్తిగలవాడైసిద్ధ గంధర్వ సేవితుడై నా భక్తులతో నతడు విపుల భోగముల ననుభవించును. అటనుండి పుడమిపై బ్రాహ్మణుడై వేదవేదాంగవేత్తయై భోగియై, సమృద్ధుడై, శుచియై, యదృష్టవంతుడై, రూపవంతుడై పుత్రపౌత్రాదులతో సుఖించు పురుషోత్తమును మరలజేరి యా వటమూలమందు జేరి యీ సముద్ర మందుహరిస్మరణ చేయుచు దేహమును వదిలి శాంత పద మందును.

ఇది బ్రహ్మపురాణమున శ్వేతమాధవమాహాత్మ్యమను నేబదితొమ్మిదవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters