Brahmapuranamu    Chapters   

అథ చతుష్పంచాశత్తమో7ధ్యాయః

మార్కండేయాఖ్యానమ్‌

బ్రహ్మోవాచ

స ప్రవిశ్యోదరే తస్యబాలస్య మునిసత్తమః | దదర్మ పృథివీం కృత్స్నాం నానాజనపదైర్వృతామ్‌ || 1

లవణక్షు సురాసర్పిర్దధిదుగ్ధజలోదధీన్‌ | దదర్శ తాన్సముద్రాంశ్చ జంబు ప్లక్షం చ శాల్మలమ్‌ || 2

కుశం క్రౌంచం చ శాకం చ పుష్కరం చ దదర్శ సః | భారతాదీని వర్షాణి తథా సర్వాంశ్చ పర్వతాన్‌ || 3

మేరుం చ సర్వరత్నాఢ్యమపశ్యత్కనకాచలమ్‌ | నానారత్నన్వితైః శృంగైర్భూషితం బహుకందరమ్‌ || 4

నానా మునిజనాకీర్ణం నానా వృక్షవనాకులమ్‌ | నానాసత్త్వసమాయుక్తం నానాశ్చర్యసమన్వితమ్‌ || 5

వ్యాఘ్రైఃసింహై ర్వరాహైశ్చ చామరైర్మహిషైర్గజైః |

మృగైః శాఖామృగైశ్చాన్యై ర్భూషితం సుమనోహరమ్‌ || 6

శక్రాద్యైర్వివిధైర్దేవైః సిద్ధచారణపన్నగైః | మునియక్షాప్సరోభిశ్చ వృతైశ్చాన్యైః సురాలయైః || 7

మార్కండేయాఖ్యానము

బ్రహ్మయిట్లనియె. ఆ మార్కండేయుడు వటపత్రశాయి యయిన నాబాలుని గర్భమందు బ్రవేశించి సమస్త భూమండల మందు జూచెను. సప్త సముద్రములను - సప్తద్వీపములను - సప్త కులాచలములను సర్వరత్న నిధియయిన మేరువును దర్శించెను. ఆమేరుపర్వతము సర్వ రత్న నిధి నానాముని సమాకీర్ణము. సర్వవృక్షములకు స్థానము వింతలకెల్ల స్థానము. సింహ వ్యాఘ్రాదులకు నిలయము. ఇంద్రాది దేవతలు సిద్ధ చారణ గంధర్వాప్సరో వర్గములకు విహారస్థానము.

బ్రహ్మోవాచ

ఏవం సుమేరుం శ్రీమంత మపశ్య న్మునిసత్తమః | పర్యటన్సతదావిప్రా స్తస్య బాలస్య చోదరే || 8

హిమవంతం హేమకూటం నిషధం గంధమాదనమ్‌ | శ్వేతం చ దుర్ధరం నీలం కైలాసంమందరంగిరిమ్‌ || 9

మహేంద్రం మలయం వింధ్యం పారియాత్రం తథా7ర్బుదమ్‌ |

సహ్యం చ శుక్తిమంతం చ మైనాకం వక్రపర్వతమ్‌ || 10

ఏతాశ్చాన్యాశ్చ బహవో యావంతః పృథివీధరాః | తతస్తాంస్తు మునిశ్రేష్ఠాః సో7పశ్యద్రత్నభూషితాన్‌ || 11

కురుక్షేత్రం చ పాంచాలాన్మత్స్యాన్మద్రాన్సకేకయాన్‌ | బాహ్లీకాన్శూరనేనాంశ్చ కాశ్మీరాంస్తంగణాన్ఖసాన్‌ || 12

పార్వతీయాన్కిరాతాంశ్చ కర్ణ ప్రావరణాన్మరూన్‌ | అంత్యజానంత్యజాతీంశ్చ సో7పశ్యత్తస్య చోదరే || 13

పృథివ్యాం యాని తీర్థాని గ్రామాశ్చ నగరాణి చ | కృషిగోరక్షవాణిజ్యం క్రయవిక్రయణం తథా || 14

శక్రాదీన్విబుధాన్ఛ్రేష్ఠాం స్తథా7న్యాంశ్చ దివౌకసః | గంథర్వాప్సరసో యక్షానృషీంశ్చైవ యే చాన్యే సురశత్రవః || 15

దైత్యదానవసంఘాంశ్చ నాగాశ్చ మునిసత్తమాః | సింహికాతనయాంశ్చైవ యే చాన్యే సురశత్రవః || 16

యత్కించి త్తేన లోకే7స్మిన్దృష్టపూర్వం చరాచరమ్‌ | ఆపశ్యత్స తదా సర్వం తస్య కుక్షౌ ద్విజోత్తమాః || 17

ఆథవా కిం బహూ క్తేన కీర్తితేన పునః పునః | బ్రహ్మాదిస్తంబపర్యంతం యత్కించిత్సచరాచరమ్‌ || 18

భూర్లోకం చ భువర్లోకం స్వర్లోకం చ ద్విజోత్తమాః | మహర్జనస్తపః సత్యమతలం వితలం తథా || 19

పాతాళం సుతలం చైవ వితలం చ రసాతలమ్‌ | మహాతలం చ బ్రహ్మాండమపశ్యత్తస్య చోదరే || 20

అవ్యాహతా గతిస్తస్య తదా7భూద్ద్విజసత్తమాః | ప్రసాదాత్తస్య దేవస్య స్మృతిలోపశ్చ నాభవత్‌ || 21

భ్రమమాణస్తదాకుకౌ కృత్స్నం జగదిదం ద్విజాః | నాంతం జగామ దేవస్య తస్య విష్ణోః కదాచన || 22

యదా7సౌ నా77గతశ్చాంతం తస్య దేవస్య భో ద్విజాః | తదా తం వరదం దేవం శరణం గతవాన్మునిః || 23

తతో7సౌ సహసా విప్రా వాయువేగేన నిశ్రుతః | మహాత్మనో ముఖాత్తస్య వివృతాత్పురుషస్యసః || 24

ఇతి శ్రీ మహాపురాణ ఆదిబ్రాహ్మే స్వయంభ్వృషిసంవాదే మార్కండేయస్య భగవత్కుక్షిపరివర్తనం నామ చతుష్పంచాశత్తమో7ధ్యాయః

శ్రీమంతమగు నామేరువును గాంచుచు నాబాలుని యుదరమందు జనిజని కురుక్షేత్రాది పుణ్యక్షేత్రములను బుణ్యనదులను, తీర్ధములను - కృషి గోరక్ష వాణీజ్యాది వృత్తులను జేయు మానవులను సర్వ జనావాసమయిన నగర గ్రామములను ఇది యది యననేల బ్రహ్మాది స్తంబ పర్యంతమయిన సర్వ బ్రహ్మాండమును, భూర్భుస్సర్‌ మహస్తప స్సత్యముల నూర్ధ్వ లోకములను అతల - వితల - పాతాళ - సుతల - రసాతన - మహాతల - తలాతల అధోలోకములను ఆ స్వామి యుదర మందీక్షించెను. అదేవు ననుగ్రహమున నందాతని గతికడ్డులకుండెను. అందట్లు తిరుగాడుచు నతడా విష్ణువుయొక్క శరీరమునకు తుదకానడయ్యెను. అంతట నవ్వరదుని నాముని శరణుజొచ్చెను. అవ్వల నా మహాపురుషుడు ముఖము తెఱువ నందుండి తటాలున వాయువేగమున వెలికి వచ్చెను.

ఇది శ్రీమహాపురాణమగు అదిబ్రహ్మ పురాణమున స్వయంభ్వృషి సంవాదమున మార్కండేయుని భగవత్కుక్షి పరివర్తనమను యేబది నాలుగవ యధ్యాయం సమాప్తము.

Brahmapuranamu    Chapters