Brahmapuranamu    Chapters   

అథ త్రిపంచాశత్తమో7ధ్యాయః

మార్కండేయప్రళయదర్శనమ్‌

బ్రహ్మోవాచ

తతో గజకులప్రఖ్యా స్తడిన్మాలా విభూషితాః సముత్తస్థు ర్మహామేఘా నభ స్యద్భుతదర్శనాః || 1

కేచి న్నీలోత్పలశ్యామాః కేచి త్కు ముదసన్నిభాః | కేచి త్కింజల్కసంకాశాః కేచిత్పీతాః పయోధరాః || 2

కేచి ద్ధరితసంకాశాః కాకాండసదృశాస్తథా | కేచి త్కమలపత్రాభాః కేచి ద్ధింగుల సన్నిభాః || 3

కేచి త్పురవరాకారాః కేచి ద్గిరివరోపమాః | కేచి దంజనసంకాశాః కేచి స్మరకతప్రభాః || 4

విద్యున్మాలాపినద్ధాంగా స్సముత్తస్థు ర్మహాఘనాః | ఘోరరూపా మహాభాగా ఘోరస్వననినాదితాః || 5

తతో జలధరా న్సర్వే సమావృణ్వ స్నభస్థలమ్‌ | తై రియం పృథివీ సర్వా సపర్వతవనాకరా || 6

ఆపూరితా దిశః సర్వాః సలిలౌఘపరిప్లుతాః | తత స్తే జలదా ఘోరా వారిణా మునిసత్తమాః || 7

సర్వతః ప్లావయామాసు శ్చోదితాః పరమేష్ఠినా | వర్షమాణా మహోతోయం పూరయంతో వసుంధరామ్‌ || 8

సుఘోరమశివం రౌద్రం నాశయంతి స్మ పావకమ్‌ | తతో ద్వాదశవర్షాణి పయోదా స్సముపప్లనే || 9

ధారాభిఃపూరయంతో వైచోద్యమానామహాత్మనా | తత స్సముద్రాస్స్వాంవేలా మతిక్రామింతి భోద్విజాః || 10

పర్వతాశ్చ వ్యశీర్యంత మహీ చాప్సు విమజ్జతి | సర్వత స్సుమహాబ్రాంతా స్తే పయోదా న భస్తలమ్‌ || 11

సంవేష్టయిత్వా నశ్యంతి వాయువేగసమాహతాః | తతస్తం మారుతం ఘోరం సవిష్ణు ర్ముని సత్తమాః || 12

ఆదిపద్మాలయో దేవః పీత్వా న్వపితి భోద్విజాః | తస్మి న్నేకార్ణవే ఘోరే నష్టే స్థావర జంగమే || 13

మార్కండేయ ప్రళయదర్శనము

అంతట నేన్గులట్లు మెఱుపుదీవల మెఱయు మేఘములు వింతగా నింగి నలముకొనియె. అవి కొన్ని నల్లకలువలవలె నల్లనివి కొన్ని తెల్లకలువలవలె తెల్లనివి కొన్ని పద్మ కింజల్కములట్లు ఎర్రనివి. కొన్ని పసుపుపచ్చనివి కొన్ని యాకుపచ్చనివి కొన్ని కాకిగ్రుడవంటివి. కొన్ని తామరరేకులట్టివి కొన్ని యింగువఛాయగలవి అయియుండెను. కొన్ని పెద్దనగరములుగను కొన్ని పర్వతములట్లు కొన్ని కాటుకకొండలట్లు, మరకతవరములునై మెఱుపు దీవల నలుముకొని మహా మేఘములు క్రమ్ముకొనెను. అవి కుండపోతగా వర్షించు వర్షధారలచే నీ మేధిని నలుదెసల బెందడి యయ్యెను. ఆ వర్షపాతముచే నింతకు మున్నేర్పడి యగ్ని యుత్పాతమువశమించెను. పరమేశ్వర ప్రేరణచే మేఘము లవిరామముగా పంద్రెండేండ్లు వర్షింప సముద్రములు పొంగి చెలియలకట్టులుదాటి జగమ్మును ముంచెత్తెను. వర్వతములు పిండిగుండయయ్యె. ఆభూమి నీటిలో మునిగిపోయినది. అట్లువ్వెత్తుగ గ్రమ్మిన కారుమబ్బులెల్ల నల్లంతలో వీచిన పెనుగాలులకు పింజపింజలై విడిపోగియెను. ఆ తొలితామరగద్దియపైనున్న విష్ణువు ప్రళయకాల మారుతమును త్రోసివైచి యా ప్రళయపయోధిపై హాయిగ నిద్రవోయెను. అపుడు సర్వజీవకోటి వినష్టమయ్యెను.

నష్టే దేవాసురవరే యక్షరాక్షస వర్జితే | తతో ముని స్స విశ్రాంతి ధ్యాత్వా చ పురుషోత్తమమ్‌ || 14

దదర్శ చక్షు రున్మీల్య జలపూర్ణాం వసుంధరాం | నాపశ్యత్తం వటం నోర్వీం నదిశాది నభాస్కరమ్‌ || 15

న చంద్రార్కాగ్ని పవనం న దేవాసుర పన్పగల | తస్మిన్నేకార్జవే ఘోరే తమోభూతే నిరాశ్రయే || 16

నిమజ్జన్ప తదావిప్రాః సంతర్తు ముపచక్రమే | బభ్రామాసౌ మునిశ్చార్య ఇతశ్చేతశ్చ సంప్లనన్‌ || 17

నిమమజ్జతదా విప్రా స్త్రాతారం నాధి గచ్ఛతి | ఏవం తం విహ్వలం దృష్ట్వా కృపయాపురుషోత్తమమః 18

ప్రోవాచ మునిశార్దూలా స్తదా ధ్యానేనతోషితః ||

అంత మార్కండేయ మహర్షి విశ్రమించి పురుషోత్తముని ధ్యానించి కనుచెఱచి యివ్వసుంధరయెల్ల నీటమునిగినట్లు గమనించెను. అంతమున్నుగల యా పెనుమర్రిలేదు. భూమిలేదు. దిక్కులు లేవు. భాస్కరుడు లేడు. చంద్రుడు లేడు. అగ్నిలేడు గాలిలేదు. సురాసురులు లేరు. ఏకార్ణవమై కేవలము కారుచీకటి క్రమ్మిన యత్తరి నిరాశ్రయమైన యానీట మునిగి యీద యత్నించెను. అట్టిటు నీతకొట్టుచు నాయాసపడజొచ్చెను. తుదకందు మునిగెను. కాని రక్షకుని కానలేడయ్యె. ఆయన ధ్యానమునకు తనివిచెంది పురుషోత్తముడపుడదరి చెదరిపోవుచున్న మునినిగని యిట్లనియె.

శ్రీభగవానువాచ

వత్ప శ్రాన్తో7సి బాలస్త్వం భక్తస్త్వం మమ సువ్రత | ఆ గచ్ఛా గచ్ఛ శీఘ్రం త్వం మార్కండేయ మమాంతికమ్‌ || 19

మా త్వ యైవచ భేతవ్యం సంప్రాప్తో7సి మమాగ్రతః | మార్కండేయ మునే ధీర బాలస్త్వం శ్రమపీడితః || 20

బ్రహ్మోవాచ

తస్యతద్వచనం శ్రుత్వా మునిః పరమకోపితః | ఉవాచచ తదా విప్రా విస్మితశ్చాభవ న్ముహుః || 21

వత్స! ఆలసిపోయితివి. పిల్లవాడవు. నాకు భక్తుడవు. వ్రతనిష్ఠుడవు. ఇటు రారమ్ము : మార్కండేయ! నాదరికి రమ్ము. భయపడకు. నాముందున్నావు.

అన్న నమ్ముని మిగుల కుపితుడై మరిమరి వెఱగు పడుచున్నిట్లనియె.

మార్కండేయ ఉవాచ

కో7యం! నామ్నా కీర్తయతి తపః పరిభవన్నివ | బహువర్ష సహస్రాఖ్యం ధర్షయన్నివ మే వపుః || 22

న హ్యేష సముదాచారో దేవేష్వపి సమాహితః | మాం బ్రహ్మా సచ దేవేశో దీర్ఘాయురితి భాషతే || 23

కస్తపో ఘోరశిరసో మమాద్య త్యక్త జీవితః | మార్కండేయేతి చోక్త్వా మన్మృత్యుం గంతుమిహేచ్ఛతి || 24

బ్రహ్మోవాచ

ఏవముక్త్వా తదా విప్రాశ్చింతావిష్టొ7భవమునిః | కిం స్వప్నో7యం మయా దృష్టః కిం వా మోహో7యమాగతః || 25

ఇత్థం చింతయత స్తస్య ఉత్పన్నా దుఃఖహా మతిః | వ్రజామి శరణం దేవం భక్త్వా77హం పురుషోత్తమమ్‌ || 26

ఎవడు వీడు ? నా తపస్సును కించపరచి మాటలాడుచున్నాడు. పెక్కువేలేండ్లు యీదుగల నా శరీరము బెదిరించుచున్నాడు. దేవతలలో కూడ నీలాగ నన్ను తేలికజేసి మాటలాడు నాచారములేదు. దేవేశుడు బ్రహ్మకూడ నన్ను దీర్ఘాయుష్మంతుడవని యనెనే ఎవడురా! జీవితము కడముట్టినవాడు. తపముచే గట్టివడిన తలకాయ గల నాకు నన్ను ఇట్లు మార్కండేయ! అని పేరెత్తి పిలిచి నావలన చావునొందగోరుచున్నాడు. అని పలికి చింతంగొని ''ఇది కలయా! మోహమా! ఈ వింతయేమనుకొన్న యతనికినంతలో నిశ్చలచిత్తంబున ధ్యానించుటయు నాతనికి సకల దుఃఖ విధ్వంసనియగు మనశ్శక్తి యార్భూతంబయ్యెను.

స గత్వా శరణం దేవం మునిస్తద్గత మానసః | దదర్మ తం వటం భూయో విశాలం సలిలోపరి || 27

శాఖాయాం తస్య సౌవర్ణం విస్తీర్ణాయాం మహాద్భుతమ్‌ | రుచిరం దివ్యపర్యంకరచితం విశ్వకర్మణా || 28

వజ్ర వైడూర్యరచితం మఱివిద్రుమ శోభితమ్‌ | పద్మరాగాదిభి ర్జుష్టం రత్నై రన్యైరలంకృతమ్‌ || 29

నానాస్తరణ సంవీతం నానారత్నోపశోభితమ్‌ | నానాశ్చర్య సమాయుక్తం ప్రభామండలమండితమ్‌ || 30

తస్యోపరి స్థితం దేవం కృష్ణం బాలవపుర్ధరమ్‌ | సూర్యకోటి ప్రతీకాశం దీప్యమానం సువర్చసమ్‌ || 31

చతుర్భుజం సుందరాంగం పద్మపత్రాయతేక్షణమ్‌ | శ్రీవత్స వక్షసం దేవం శంఖ చక్ర గదాధరమ్‌ || 32

వనమాలా వృతోరస్కం దివ్యకుండలథారిణమ్‌ | హారభారార్పితగ్రీవం దివ్యరత్న విభూషితమ్‌ || 33

దృష్ట్వా తదా మునిర్దేవం విస్మయోత్ఫుల్లలోచనః | రోమాంచిత తనుర్దేవం ప్రణిపత్యేద మబ్రవీత్‌ || 34

అపుడతడు పురుషోత్తముని భక్తితో శరణొందెదనని మనసు నిలిపి శరణంది యా వెంటనే యా నీటిమీద విశాలమైన వటవృక్షమును జూచెను. ఆచెట్టు పెనుగొమ్మపై పరుచుకొనియున్న విశ్వకర్మ నిర్మితమయిన చక్కని వింతయిన పర్యంకమును గాంచెను. అది వజ్రవైడూర్య నిర్మితము. మణివిద్రుమ శోభితము. పద్మరాగాది మఱి గణాలంకృతము. నానావిధాన్తరణము. నానారత్న శోభితము. వింతలన్నిటికినెలవు. విచిత్ర ప్రభామండల మండితము. అందు కోటి సూర్య పభాజిష్ణుని, తోజోమూర్తిని, చతుర్భుజుని, సుందరాంగుని, పద్మపత్రనేత్రుని, శ్రీవత్సవక్షుని, శంఖచక్రగదాధరుని, వనమాలాంకృతోరస్కుని, దివ్యకుండలమండితుని, హారభారావనమ్రగ్రీవుని బాలకృష్ణుని దర్శించెను.

మార్కండేయ ఉవాచ

అహో చై కార్ణవే ఘోరే వినష్టే స చరాచరే | కథమేకో హ్యయం బాలస్తష్ఠత్యత్ర సునిర్భయః || 35

బ్రహ్మోవాచ

భూతం భవ్యం భవిష్యం చ జానన్నపి మహామునిః | న బుబోధ తదా దేవం మాయయా తస్య మోహితః || 36

యదాన బుబుధే చైనం తదా ఖేదాదువాచ హ |

మార్కండేయ ఉవాచ

వృథామే తపసో వీర్యం వృథా జ్ఞానం వృథా క్రియా | వృథా మే జీవితం దీర్ఘం వృథా మానుష్యమేవ చ ||

యో7హం సుప్తం న జానామి పర్యంకే దివ్యబాలకమ్‌ || 37

మార్కండేయ డచ్చెరువడి విచ్చిన కన్నులు పులకించిన మేనుంగొని వ్రాలి ఆహా! ఈ ఏకార్ణవమందు చరాచర మడిగిన తఱి నీబాలుడెవ్వడొ భయము లేక మసలుచున్నాడు అనుకొనెను. భూతభవ్య భవిష్యము నెఱింగియు నమ్మహాముని మాయామోహితుడై యాదేవు నెఱుంగడయ్యెను. మఱియు నా తపశ్శక్తి వ్యర్థము - నాజ్ఞానము వృధా-సుదీర్ఘమయిననా బ్రభుకు వ్యర్ధము. నామానుషముత్తది. ఈ పర్యకమున నిదురించు బాలుదెవ్వడో నెఱగనైతి.

బ్రహ్మోవాచ

ఏవం సంచింతయన్విప్రః ప్లవమానో విచేతనః | త్రాణార్థం విహ్వలశ్చాసౌ నిర్వేదం గతవాం స్తదా || 38

తతో బాలార్క సంకాశం స్వమహిమ్నా వ్యవ స్థితమ్‌ | సర్వతేజోమయం విప్రా న శశాకాభివీక్షితుమ్‌ || 39

దృష్ట్వా తం ముని మాయాంతం స బాలః ప్రహసన్నివ | ప్రోవాచ మునిశార్దూ లాస్తదా మేఫ°ఘనిస్వనః || 40

శ్రీ భగవానువాచ

వత్స జానామి శ్రాంతం త్వాం త్రాణార్థం మాముపస్థితమ్‌ | శరీరం విశ##మే క్షిప్రం విశ్రామన్తే మయోచితః || 41

బ్రహ్మోవాచ

శ్రుత్వా స వచనం తస్య కించిన్నోవాచ మోహితః | వివేశ వదనం తస్య వివృతం చావశో మునిః || 42

ఇతి శ్రీమహాపురాణ బ్రాహ్మే స్వయం భ్వృషిసంవాదే మార్కండేయ ప్రళయదర్శనం నామ త్రి పంచాశత్తమో7ధ్యాయః

ఇట్లనుకొనుచు నీదుచు మైమఱచి మార్కండేయుడు మిగుల వగచెంది రక్షణకొఱకు తడుములాడెను. కాని బాల సూర్యుడట్లు తన మహిమచే వెఱయుచునున్న తేజోమయునాబాలుని చూడనేరడయ్యె. ఆ పిల్లవాడట్లు వచ్చుచున్న మునింగిని మేఘ గంభీరముగ నిట్లు పలికెను. వత్సా! చాల అలసితివని యెఱుంగుదును. నన్ను శరణందిన నిన్ను గాపాడుటకే వచ్చితిని . నాశరీరమందిపుడ ప్రవేశింపుము. నీకు విశ్రాంతి కల్గును. అనవిని వకాని యేభయము నెఱుగక యేమియు మాటలాడక యా బాలుడు మోమునందు వివశుడై ప్రవేశించెను.

ఇది బ్రహ్మపురాణ మార్కండేయ ప్రళయదర్శనమను యే బదిమూడవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters