Brahmapuranamu    Chapters   

ద్విపంచాశత్తమో7ధ్యాయః

మార్కండేయవటదర్శనమ్‌

బ్రహ్మోవాచః

ఆసీత్కల్పే మునిశ్రేష్ఠా స్సంప్రవృత్తే మహాక్షయే | నష్టార్కచంద్రే పవనే నష్టే స్థావరజంగమే || 1

ఉదితే ప్రళయాదిత్యేప్రచండే ఘనగర్జితే | విద్యుదుత్పాత సంఘాతైః సంభ##గ్నే తరుపర్వతే || 2

లోకేచ సంహృతే సర్వే మహదుల్కానిబర్హణ | శుష్కేషుసర్వతో యేషుసరస్సుచసరిత్సుచ || 3

తతః సంవర్తకో వహ్ని ర్వాయునా సహభోద్విజాః | లోకంతు ప్రావిశత్సర్వ మాదిత్యై రుపశోభితమ్‌ || 4

పశ్చాత్స పృథివీం భిత్వా ప్రవిశ్యచరసాతలమ్‌ | దేవదానవయక్షాణాం భయం జనయతే మహత్‌ || 5

నిర్దహన్నాగలోకంచ యచ్చ కించిత్‌ క్షితా విహా | అధస్తా న్ముని శార్దూలా స్సర్వం నాశయతే క్షణాత్‌ || 6

తతోయోజనవింశానాం సహస్రాణి శతాని చ | నిర్దహత్యాశుగో వాయుః వచ సంవర్తకో7నలః || 7

సదేవాసుర గంధర్వసయక్షోరగరాక్షసమ్‌ | తతో దహతి సందీప్తః సర్వమేవ జగత్ర్పభుః || 8

ప్రదీప్తో7సౌ మహారౌద్రః కల్పాగ్నిరితి సంశ్రుతః | మహాజ్వాలో మహార్చిష్మాన్‌ సంప్రదీ ప్తమహాస్వనః || 9

సూర్యకోటిప్రతీకాశో జ్వలన్నివ సతేజసా | త్రైలోక్యం చాదహ త్తూర్ణం ససురాసురమానుషమ్‌ || 10

బ్రహ్మయనియె. ఓ మునివరలార! కల్పాంతమందు బ్రళయమైన తఱి సూర్యచంద్రులు వాయువు చరాచర ప్రపంచము నశించి ప్రచండప్రలయాదిత్యుడుదయింప మేఘములురును విద్యుదుత్పామున బిడుగులు వడి చెట్లు గుట్టలు భగ్నమై యెల్లలోకము నుల్కలుపడి నశింప నెల్లనదులు సరస్సు లింకిపోవ సంవర్తకాగ్ని వాయువుతో గూడ యాదిత్యశోభితమైన లోకమున బ్రవేశించును. అవ్వల భూమిం బ్రద్దలుగొట్టి పాతాలముం బ్రవేశించి దేవదానవ యక్షాదులకు భయము కూర్చెను. అది నాగలోకముం దహించి యీ మేదిని నేకొంచెమేని లేకుండ గాల్చి యీ క్రిందనంతయు క్షణములో నశింపజేయును. అవ్వల నూరువేల యోజనములమేర వాయువు విజృంభించిన ప్రళయాగ్ని దేవనురగంధర్వ నాగరాక్షసముగసర్వముం దహించును. భయంకరజ్వాలలతో మహాధ్వనితో ప్రజ్వలించునీ రౌద్రాగ్ని కల్పాగ్ని యని శ్రుతుల వినబడును. ఇది కోటిసూర్య ప్రభతో విజృభించును. ముల్లోకములం దహించును.

మార్కండేయకృత వట దర్శనము

ఏవంవిధే మహాఘోరే మహాప్రళయదారుణ| ఋషిః పరమధర్మాత్మా ధ్యానయోగపరో7భవత్‌ || 11

ఏకస్సంతిష్టతేవిప్రాః మార్కండేయస్సువిశ్రుతః | మోహపాశై ర్నిబద్దో7సౌ క్షుత్తృష్ణాకుతితేంద్రియః || 12

సదృష్ట్వా తం మహావహ్నిం శుష్కకంఠోష్ఠతాలుకః | తృష్ణార్తః| ప్రస్ఖలన్విప్రాః తదా7సౌ భయవిహ్వలః || 13

బభ్రామ పృథివీం సర్వా కాందిశీకో విచేతనః | త్రాతారం నాధిగచ్ఛన్వై ఇతశ్చేతశ్చ ధావతి || 14

నలేభే చతదా శర్మ యత్ర విశ్రామ్యతా ద్విజాః | కరోమి కిం నజానామి యస్యాహం శరణం వ్రజే || 15

కథం పశ్యామి తందేవం పురుషేశం సనాతనమ్‌ | ఇతి సంచింతయ న్దేవ మేకాగ్రేణ సనాతనమ్‌ ః || 16

ప్రాప్తవాం సత్త్పదం దివ్యం మహాప్రళయకారణమ్‌ | పురుషేశమితిఖ్యాతం వటరాజం సనాతానమ్‌ || 17

త్వరాయుక్తో ముని శ్చాసౌ న్యగ్రోధస్యాంతికం య¸° | ఆసాద్యతం మునిశ్రేష్ఠాస్తస్యమూలేసమావిశత్‌ || 18

నకాలాగ్నిభయం తత్ర న చాంగార ప్రవర్షణమ్‌ | నసంవర్తాగమ స్తత్ర నచవజ్రాశనిస్తథా || 19

ఇతి శ్రీమహాపురాణ ఆది బ్రహ్మే స్వయంభూఋషిసంవాదే మార్కండేయేనవటదర్శనం నామ ద్విపంచాశత్తమో7ధ్యాయః

ఇట్టి మహాదారుణప్రలయమందు మార్కండేయుడనుపరమధర్మాత్ముడు ఋషి ధ్యానయోగనిష్ఠనుండెను. ఆయన యొక్కడే యిప్పుడుండునని శ్రుతి దెల్పును. ఆయన మోహపాశములంగట్టువడి ఆకలిదప్పుల కింద్రియములు చెదర నమ్మహాగ్నింగని కంఠము పెదవులు నాలుకయునెండ భయమొంది తడపడుచు నెల్ల భూమిం గాందిశీకుడై దిఱుగాడుచు విశ్రమించుట కించుకచోటుగానక ఏమి చేయుదు నెవ్వని శరణందవలయునో తెలియకున్నాను. అన నాతమని బురుషోత్తము నెట్లు కనుగొందునని యేకాగ్రమనస్కుడై ధ్యానించి యాదివ్యమైన పరమపదమును మహాప్రళయ కారణమైన దాని పురుషోత్తమనామకమైన సుప్రసిద్ధవటరాజమును జేరెను. తొందరతో నమ్మని యామఱ్ఱిదరికేగి దాని మొదలున గూర్చుండెను. అక్కడ కాలాగ్నిభయములేదు. అక్కడ నిప్పులు గురియవు. సంవర్తాగ్ని యిక్కడకు జొరదు. అచ్చట పిడుగులు పడవు. అట్టి యభయస్థానమందాసనాతనఋషి విశ్రమించెను.

ఇది శ్రీబ్రహ్మమహాపురాణమున స్వయంభూఋషిసంవాదమున మార్కేండేయకృతవటదర్శనమను నేబదిరెండవ యధ్యాయము

Brahmapuranamu    Chapters