Brahmapuranamu    Chapters   

పంచాశత్తమో7ధ్యాయః

ప్రతిమావిర్భావ నిరూపణమ్‌

బ్రహ్మోవాచళ

స్తుత్త్వైవం ముని శార్దూలాః ప్రణమ్యచ సనాతనమ్‌ | వాసుదేవం జగన్నాధం సర్వకామఫలప్రదమ్‌ || 1

చింతావిష్టోమహీపాలః కుశానా స్తీర్యభూతలే | వస్త్రంచ తన్మనా భూత్వా సుష్వాప ధరణీతలే || 2

కథం ప్రత్యక్ష మభ్యేతి దేవదేవో జనార్దనః | మమచా77ర్తిహరో దేవః కదా7సావితి చింతయన్‌ || 3

బ్రహ్మ యిట్లనియె. ఓమునివరులార! అమ్మహీపతి యిట్లు జగన్నాధుని మ్రొక్కి వినుతించి యాలోచనలో మునిగి దర్బలు పరచుకొని యామీద బట్టపరచుకొని యాదేవునిపై మనసునిల్పి నాబాధను హరించు దేవదేవు దెవుడు ప్రత్యక్షమగుననియనుకొనుచు నేలపై నిదురించెను.

సుప్తస్య తస్య నృపతే ర్వాసుదేవో జగద్గురుః | అత్మానం దర్శయామాస శంఖచక్రగదాభృతమ్‌ || 4

స దదర్శ తు సప్రేమ దేవదేవం జగద్గురుమ్‌ | శంఖ చక్ర ధరం దేవం గదాపాణిన మవ్యయం 5

శార్జ బాణధరం దేవం జ్వలత్తేజోతి మండలమ్‌ | యుగాంతా77దిత్యవర్ణాభ మింద్రనీల నిభంహరిం || 6

సుపర్ణాంసే తమాసీనం షోడశార్ధ భుజం శుభమ్‌ | న చాసై#్మ ప్రాబ్రవీద్ధీరాః సాధురాజన్మహామతే || 7

క్రతునానేన దివ్యేన తథా భక్త్యాచ శ్రద్దయా తుష్టోస్మి తే మహీపాల వృథా కిమనుశోచపి || 8

యదత్ర ప్రతిమారాజన్‌ జగత్పూజ్యా సనాతనీ | యథా సాప్రాప్యతే భూప తదుపాయం బ్రవీమితే || 9

గతాయా మధ్య శర్వర్యాం నిర్మలే భాస్కరోదితే | సాగరస్య జలస్యాంతే నానాద్రుమ విభూషితే || 10

జలం తథైవ వేలాయాం దృశ్యతే తత్రవై మహత్‌ | లవణస్యోదధే రాజ స్తరంగైః సమభిప్లుతమ్‌ || 11

కూలాంతే హి మహావృక్షః స్థితః స్థలజలేషు చ | వేలాభిర్హన్య మానశ్చ న చాసౌ కంపతే ద్రుమః || 12

పరశుమాదాయ హస్తేన ఊర్మేరంతస్తతో ప్రజ | ఏకాకీ విహరన్‌ రాజన్‌ సత్వం పశ్యసిపాదపమ్‌ || 13

ఈదృక్‌ చిహ్నం సమాలోక్య ఛేదయ త్వమశంకితః | ఛేద్యమానం తుతంవృక్షంతప్రాతరద్భుత దర్శనమ్‌ || 14

దృష్ట్వా తేనైవ సంచిత్య తతో భూపాల దర్శనాత్‌ | కురుమాం ప్రతిమాం దివ్యం జహి చింతాంవిమోహినీమ్‌ || 15

జగద్గురువు ఆ నిదురించినఱనికి స్వరూపదర్శన మనుగ్రహించెను. శంఖ చక్ర గదా శార్జములను దాల్చిచుట్టును నొకవెలుగు గుడిగట్ట యుగాంతాదిత్యప్రభతో గరుడుని మూపుపైనెక్కి యెనిమిది బాహువులతో దర్శనమిచ్చిన యా దేవదేవుని ఱడు దర్శించెను.

అట్లు పొడసూపిన యా స్వామి రాజుతో నిట్లనియె. ఈ క్రతువుచేత నీభక్తి శ్రధ్దలచేత నంతుష్టుడనైతిని. ఊరకయేల పరితపింతువు. ఈ ప్రతిమ జగత్పూజ్యము. ననాతనము. (ఈనాటిదిగాదు) ఇది నీవు వడయుటకుపాయము దెత్పెదను. ఈ రాత్రిగడచి సూర్యోదయముకాగానే సముద్రజలముల కల్లంత చివర పలుచెట్లగుబురులతో చెలియలికట్టనానుకొని సముద్రజలముకెరటములతో గానవచ్చును. అంత కవ్వలి గట్టన నొకచెట్టు నీళ్ళను నేలను గూడ దాకుచు నుండును. తరంగఘాతమున నేని యది కంపింపదు. గొడ్డలిగొని నీవానీటిలో నేకాకివై యెట్టి జడువుగొనక యట్టిటు దిఱిగిచూచి ఇట్టి చిహ్నలుగల యాతరువుంగని శంకింపక నఱకుము. ఆ అద్భుతవృక్షమును గని యాలోంచిదాన నా దివ్యమూర్తిని గావింపుము. నిన్ను తబ్బిబ్బుపరచునే మఱియే యాలోచననైన సేయుకుము.

బ్రహ్మోవాచ

ఏవముక్త్వా మహాభాగో జగామా దర్శనం హరిః | స చాపి స్వప్నమాలోక్య పరం విస్మయమాగతః || 16

తాం నిశాం స సముద్వీక్ష్య స్థితస్తద్గత మానసః | వ్యాహరన్వైష్ణవాన్‌ మంత్రాన్సూక్తంచైవ తదాత్మకమ్‌ || 17

ప్రగతాయాం రజన్యాం తు ఉత్థితో నాన్యమానసః | స స్నాత్వా సాగరే సమ్య గ్యథా వద్విధినా తతః || 18

దత్వా దానం చ విప్రేభ్యో గ్రామాంశ్చ నగరాణిచ | కృత్వా పౌర్వాహ్నికం కర్మ జగామ స నృపోత్తమః || 19

న చాశ్వో న పదాతిశ్చ న గజో న చ సారధిః | ఏకాకీ స మహావేలాం ప్రవివేశ మహీపతి ః || 20

తం దదర్శ మహావృక్షం తేజస్వంతం మహాద్రుమమ్‌ | మహాతిగ మహారోహం పుణ్యం విపులమేవచ || 21

మహోత్సేధం మహాకాయం ప్రసుస్తంచ జలాంతికే | సాంద్రమాంజిష్ఠ వర్ణాభం నామజాతివివర్జితమ్‌ || 22

నరనాథ స్తదా విప్రా ద్రుమం దృష్ట్వా ముదా7న్వితః పరశునా శాతయామాస నిశితేన దృఢేన చ || 23

ద్వేధీకర్తు మనాస్తత్ర బభూవేంద్రసఖః సచ | నిరీక్షమాణ కాష్టే తు బభూవాద్భుత దర్శనమ్‌ || 24

విశ్వకర్మాచ విష్ణుశ్చ విప్రరూపధరావుభౌ | అజగ్మతు ర్మహాభాగౌ తదాతుల్యా గ్రజన్మానౌ || 25

జ్వలమానౌ స్వతేజోభి ర్దివ్యస్రగనులేపనౌ | అధ తౌతం సమాగమ్య నృపమింద్రసఖం తదా || 26

తావూచతు ర్మహారాజ కిమత్ర త్వం కరిష్యసి | కిమర్ధంచ మహాబాహో శాతితశ్చ వనస్పతిః || 27

అసహాయో మహా దుర్గే నిర్జనే వనే | మహాసింధుతటే చై వ కథం వై శాతితో ద్రుమః || 28

ఇట్లా హరి మహానుభావుడానతిచ్చి యంతర్ధాన మందెను. రాజుతనకలను గమనించి యెంతో యాశ్చర్యపడెను. అఱయెల్ల యందేమనసునిడి విష్ణుదేవతాకములైన మంత్రములను విష్ణుసూక్తమును బారాయణము సేయుచువేకువను లేచి యొండు తలంపుగొనక చక్కగ సాగర స్నానముసేసి గుఱ్ఱములేదు వెంటకాలిబంటులేడు ఏన్గులేదు సారథియు లేడు ఒంటరిగ నాకడలి చెలియకట్టం దిగి తేజోమయమైన పెనుమొదలుగట్టిన సువిస్తృతమైన యా పుణ్యవృక్షమును గాంచెను. మిక్కిలియెత్తుగ మిక్కిలి బోదెగల్గి జలముదరి నిద్రలోనున్న దట్టని మంజిష్టివర్ణము (ఎఱుపు) గలిగిన యాతరు వేజాతిదో యేపేరిదో తెలియ రాదయ్యెను. నరనాథుడదిగని యానందపడి పదునైన గొడ్డలిచే దానిని రెండు తునకలు గావింపనెంచి కొట్టెను. అదిచూడ నాశ్చర్యము గొల్పుచుండెను. అంతట విశ్వకర్మయు (దేవశిల్పి) విష్ణువును విప్రరూపముదాల్చి వచ్చిరి. ఇద్దరు నొకేరూపున దేజరిల్లుచుండిరి. దివ్యమాలలు ధరించిరి. దివ్యగంధము వూసికొనిరి. ఇంద్రునకు మిత్రుడైన యారాజును గలిసికొని మహారాజా ! నీవిచట నేమొకో చేయుచున్నావు? ఈ మహావృక్షము నెందులకు నఱికితివి? ఈ నిర్జనమైనకాఱడవిలో నీవు తోడులేక మహోదధి యొడ్డున నొంటరిగ నీవెట్లి చెట్టును నఱకితివి?

బ్రహ్మోవాచ !

తయోః శ్రుత్వా వచో విప్రాః సతు రాజా ముదా7న్వితః| బభాషే వచనం తాభ్యాం మృదులం మధురం తథా || 29

దృష్ట్వా తౌ బ్రాహ్మణా తత్ర చంద్ర సూర్యావివా77గతౌ| నమస్కృత్య జగన్నాథా వవాజ్ఞ్ముఖ మవస్థితః || 30

అయ్యిరువురమాటవిని యారాజు ముదమంది చంద్రసూర్యులట కరుదెంచిన యా బ్రహ్మాణుల నానంద భరితుండై గని నమస్కరించి యాజగన్నాథుల సన్నిధి దలవాంచి నిలువబడి యిట్లనియె.

రాజోవాచ

దేవదేవ మనాద్యంత మనంతం జగతాం పతిమ్‌| ఆరాధయితుం ప్రతిమాం కరోమీతి మతిర్మమ || 31

అహం స దేవదేవేన పరమేణ మహాత్మనా| స్వప్నాంతే చ సముద్దిష్టో భవద్భ్యాం శ్రావితం మయా || 32

అది యంతము లేని యనంతమూర్తిని జగత్పతిని యారాధించుట కొక ప్రతిమను గావించుకొనవలెనని తలంపు గల్గినది కలలో నాదేవునిచేత నేను భావింపబడితిని. అసంగతి మీకు తెల్పితిని.

బ్రహ్మోవాచ!

రాజ్ఞస్తు వచనం శ్రుత్వా దేవేంద్రప్రతిమస్య చ | ప్రహస్య తసై#్మ విశ్వేశ స్తుష్టో వచన మబ్రవీత్‌ || 33

అనవిని విశ్వేశ్వరుండు హరి నవ్వి సంతుష్టిగొని యిట్లు పలికెను.

విష్ణురువాచ

సాధు సాధు మహీపాల యదేతన్మత ముత్తమమ్‌| సంసార సాగరే ఘోరే కదళీదళసన్నిభే || 34

నిస్సారే దుఃఖబహుళే కామక్రోధ సమాకులే| ఇంద్రియావర్తకలిలే దుస్తరే రోమహర్షణ || 35

నానావ్యాధిశతావర్తే జలబుద్బుదసన్నిభే| యతస్తే మతి రుత్పన్నా విష్ణోరారాధనాయవై || 36

ధన్యస్త్వం నృపశార్దూల గుణౖః సర్వైరలంకృతః | సప్రజా పృథివీ ధన్యా సశైల వనకాననా || 37

సపురగ్రామనగరా చతుర్వర్నైరలంకృతా | యత్రత్వం నృపశార్దూల ప్రజాః పాలయితా ప్రభుః || 38

ఏహ్యేహి సుమహాభాగ ద్రుమే7స్మిన్సుఖశీతలే | అవాభ్యాం సహ తిష్ఠ త్వం కథాభి ర్దర్హసంశ్రితః || 39

అయం మమ సహాయస్తు ఆగతః శిల్పినాం వరః విశ్వకర్మసమః సాక్షాన్నిపుణః సర్వకర్మసు || 40

మయోద్దిష్టాం తు ప్రతిమాం కరోత్యేష తటం త్యజ ||

బ్రహ్మోవాచ

శ్రుత్వైవం వచనం తస్యతదా రాజా ద్విజన్మనః | సాగరస్య తటం త్యక్త్వా గత్వా తస్య సమీపతః || 41

తస్థౌ స నృపతి శ్రేష్ఠో వృక్షచ్ఛాయే సుశీతలే | తతస్తసై#్మ న విశ్వాత్మా దదా వాజ్ఞాం ద్విజాకృతిః || 42

శిల్పిముఖ్యాయ విప్రేంద్రా కురుష్వప్రతిమా ఇతి |

బాగుబాగునృప | నీతలంపు మేలైనది. అంతులేని యీ ఘోర సంసారము అరటియాకు వగిదినిస్సారము. బహుదుఃఖ నిలయము. కామక్రోథాకులము. ఇంద్రియములిందు సుడులు, నానా వ్యాధులు. నీటిబుడగవంటిది. విష్ణునారాధింప నీకు దలపు గలుగుటచే నీవు ధన్యుడవు. నద్గుణ భూషణుడవు. నీ ప్రజలు పురగ్రామ శైలకాననములతో నాల్గువర్ణములతో నీ పాలించు వృథివియు ధన్యులు. రారమ్మ చల్లని యీ చెట్టుదరి నీవు మాతో గూడ మాటలాడుకొంద మిట వచ్చి నిలువుము. ఈతడు నాతోడ వచ్చినాడు మహాశిల్పి. విశ్వకర్మతో సాటియైనవాడు. ఎల్లపనుల నెంతో నేర్పరి. నేనుద్దేశించిన ప్రతిమ నీతడు చేయును. ఒడ్డు దిగుము. అన నాద్విజుని మాటవిని సముద్రము నొడ్డునుండి జని యా చెట్టునీడను నిలిచెను. అవ్విశ్వరూపుడు విష్ణువా శిల్పివరునకు బ్రతిమ చెక్కుమని యానతిచ్చెను.

కృష్ణరూనం పరం శాంతం పద్మపత్రాయతేక్షణమ్‌ || 43

శ్రీవత్సకౌస్తుభధరం శంఖ చక్రగదాధరమ్‌ | గౌరాంగం క్షీరవర్ణాభం ద్వితీయం స్వస్తికాంకితమ్‌ || 44

లాంగలాస్త్రధరం దేవ మనంతాఖ్యమ్‌ మహాబలమ్‌ | దేవదానవగంధర్వ యక్షవిద్యాధరోరగైః 45

న విజ్ఞాతో హి తస్యాంత స్తేనానంత ఇతి స్మృతః | భగినీం వాసుదేవస్య రుక్మవర్ణాం సుశోభనామ్‌ || 46

తృతీయాం వై సుభద్రాంచ సర్వలక్షణలక్షితామ్‌ || 47

తామరఱకులట్టి కన్నులు ఉరమున శ్రీవత్సకౌస్తుభములు హస్తములందు శంఖచక్రగదాశార్జములు గలిగినదొకటి

అచ్చము పాలవలె తెల్లనై స్వస్తికముద్ర నాగలిచేతనుపూనిన అనంతమూర్తి యింకోకటి వాసుదేవుని చెలియలు బంగారుచాయగల పరమశోభనము సర్వలక్షణలక్షితమునగు సుభద్రామూర్తి మూడవది. ఇట్లు మూడు ప్రతిమలు గావింపుమనెను.

బ్రహ్మోవాచ

శ్రుత్వైతద్వచనం తస్య విశ్వకర్మాసుకర్మకృత్‌ | తత్‌క్షణాత్కారయామాస ప్రతిమాః సుభలక్షణాః || 48

ప్రథమం శుక్లవర్ణాభం శారదేందుసమప్రభమ్‌ | ఆరక్తాక్షం మహాకాయం స్ఫటావికటమస్తకమ్‌ || 49

నీలాంబరధరంచోగ్రం బలం బలమదోద్ధతం | కుండలైకధరం దివ్యం గదాముసలధారిణమ్‌ || 50

ద్వితీయం పుండరీకాక్షం నీలజీమూతసన్నిభమ్‌ | అతసీపుష్పసంకాశం పద్మపత్రాయతేక్షణమ్‌ || 51

పీతవాన స మత్యుగ్రం శుభం శ్రీవత్సలక్షణమ్‌ | చక్రపూర్ణకరం దివ్యం సర్వపాపహరం హరిమ్‌ || 52

తృతీయాం స్వర్ణవర్ణాభాం పద్మపత్రాయతేక్షణామ్‌ | విచిత్రవస్త్రసంచ్ఛన్నాం హారకేయూరభూషితామ్‌ || 53

విచిత్రాభరణోపేతాం రత్నహారావలంబితామ్‌ | పీనోన్నతకుచాం రమ్యాం విశ్వకర్మా వినిర్మమే || 54

సతు రాజా7ద్భుతం దృష్ట్వా క్షణనై కేన నిర్మితాః| దివ్యవస్త్రయుగచ్చన్నా నానారత్నై రలంకృతాః || 55

సర్వలక్షణసంపన్నాః ప్రతిమాః సుమనోహరాః | విస్మయం పరమం గత్వా ఇదం వచన మబ్రవీత్‌ || 56

విశ్వకర్మ యామాట విని యాక్షణమున నాశుభలక్షణములతో ముమ్మూర్తులను గావించెను. ఒకటి శరత్కాల చంద్రబింబమట్లచ్చము తెల్లది. ఎఱ్ఱనికనులు పెద్ద శరీరము పాముపడగంబోలు మస్తకము నల్లని వలువయు గల బలరామమూర్తి. ఒక్కటే కుండలము, దివ్యగదాముసలాయుధము బూనినది. తెల్లదామరల బోలు కన్నులు. నల్లని మేఘము అతసీకుసుమము నట్లు నిగనిగలాడు నీలతనువు, పీతాంబరము నురము శ్రీవత్సలక్షణము చేతం జక్రాయుధము గల్గిన సర్వపాపహరమైన శ్రీహరిమూర్తి రెండవది. మూడవది. స్వర్ణఛ్చాయశరీరము రత్నహార కేయూరాదివిచిత్ర భూషణములు కమలనయనములు విచిత్ర వస్త్రములతో నొప్పి పీనోన్నస్తనియైన సుభద్రమూర్తి. అరాజాయద్భుత శిల్పముంగని క్షణములో నిర్మించిన యా దివ్యమూర్తుల నీక్షించి మిక్కిలి వింతవడి యిట్లనియె.

ఇంద్రద్యుమ్న ఉవాచ

కిం దేవౌ సమనుప్రాప్తౌ ద్విజరూపధరావుభౌ | ఉభౌ చా7ద్భుత కర్మాణౌ దేవవృత్తా వమానుషౌ || 57

దేవౌ వా మానుషౌవా7పి యక్షవిద్యాధరౌ యువామ్‌ | కింను బ్రహ్మహృషీ కేశౌ కిం వసూ కిముతాశ్వినౌ || 58

నవేద్మి సత్యసద్బావౌ మాయారూపేణ సంస్తితౌ | యువాం గతో7స్మి శరణ మాత్మా మే తుప్రకాశ్యతామ్‌ || 59

ఇతిశ్రీ బ్రహ్మపురాణ ప్రతిమోత్పత్తి కథనంనామ పంచాశత్తమో7ధ్యాయః

ఇంద్రద్యుమ్నుడు పలికెను-

ద్విజమూర్తులందాల్చి యేతెంచిన మీరిద్దరు దేవతలు అద్భుత కర్ములు దేవవర్తనులు అమానుషకర్ములునగు మీరు వేల్పులా యక్షులా విద్యాధరులా బ్రహ్మయు విష్ణువునా? వసువులా ! కాక అశ్వినీకుమారులా! ఎఱుగ నైతిని మాయారూపమున నున్నారు మిమ్ము శరణ పోందుచున్నాము. మీ స్వరూపమును నాకు వెలువరింపుడు. అని ఇంద్రిచ్యుమ్నుడనియె.

ఇది బ్రహ్మపురాణమున ప్రతిమోత్పత్తికథనమను నేబదవ అధ్యాయము

Brahmapuranamu    Chapters