Brahmapuranamu    Chapters   

పంచమో7ధ్యాయః

మన్వంతర కీర్తనము

ఋషయ ఊచుః -

మన్వంతరాణి సర్వాణి విస్తరేణ మహామతే | తేషాం పూర్వవిసృష్టించ లోమహర్షణ కీర్తయ || 1

యావంతో మనవశ్చైవ యావంతం కాలమేవ చ | మన్వంతరాణి భోః సూత! శ్రోతుమిచ్ఛామతత్త్వతః || 2

ఋషులు పలికిరి -

ఓ బుద్ధిశాలీ లోమహర్షణ ! మన్వంతరముల నన్నింటిని వానియొక్క విశేష సృష్టిని వర్ణింపుము. మనుపు లెందరో వారి కాలమేదియో వారి సమయమందు జరిగిన విశేషములేవియో స్పష్టమున నెఱుగ గోరెదము.

లోమహర్షణ ఉవాచ -

న శక్యో విస్తరో విప్రా వక్తుం వర్షశ##తైరపి | మన్వంతరాణాం సల్వేషాం చ్ఛృణుత ద్విజా ః|| 3

స్వాయంభువో మనుః పూర్వం మనుః స్వారోచిషస్తథా | ఉత్తమ స్తామసశ్చైవ రైవత శ్చాక్షుషప్తథా || 4

వైవస్వతశ్చ భో విప్రాః సాంప్రతం మనురుచ్యతే | సావర్ణిశ్చ మనుస్తద్వ ద్రైభ్యో రౌచ్య స్తథైవచ || 5

తథైవ మేరు సావర్ణి శ్చత్వారో మనవః స్మృతాః | అతీతా వర్తమానాశ్చ తథైవానాగతా ద్విజాః || 6

కీర్తితా మనవ స్తుభ్యం మయైవై తే యథా శ్రుతా ః | ఋషీం స్తేషాం ప్రవక్ష్యామి పుత్రా న్దేవగణాం స్తథా || 7

ఋషుడుగ నూతుcడు మన్వంతరములను గూర్చిన చరిత్ర సంక్షేపముగ చెప్పెద. వేయేండ్లయిననిది తెలుప నలవికానిది స్వాయంభువుడు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షువుడు, పైవస్వతుడు. సావర్ణి (తర్వాత) రైభ్యుడు, రౌచ్యుడు, మేరుసావర్ణి, ఇపుడు వైవస్వతమన్వంతరము జరుగుచున్నది. అయా మన్వంతరములందలి సప్తర్షులను పుత్రపౌత్ర పరంపరను దేవగణములను తెలుపుచున్నాము. (3-7)

మరీచి రత్రిర్భగవా నంగిరాః పులహః క్రతుః | పులస్త్యశ్చ వశిష్ఠశ్చ సపై#్తతే బ్రహ్మణసుతాః || 8

ఉత్తరస్యాం దిశి తథా ద్విజాః సప్తర్షయ స్తథా | ఆగ్నీధ్ర శ్చాగ్నిబాహుశ్చ మేధ్యో మేధాతిథిర్వసుః || 9

జ్యోతిష్మాన్‌ద్యుతిమాన్‌ హవ్యః సబలః పుత్రసంజ్ఞకః | మనోః స్వాయంభువస్తేతే దశపుత్రామహౌజసః ||10

ఏతద్వై ప్రథమం విప్రా మన్వంతర ముదాహృతమ్‌ | ఔర్వో వశిష్ఠ పుత్రశ్చ స్తంబః కశ్యప ఏవచ || 11

ప్రాణో బృహస్పతిశ్చైవదత్తో7 త్రిశ్చ్యవన స్తథా|ఏతే మహర్షయో విప్రా వాయు ప్రోక్తా మహావ్రతాః || 12

దేవాశ్చ తుషితానామ స్మృతాః స్వారోచిషేంతరే | హవిర్ఘ్నః సుకృతిర్జ్యోతి రాపోమూర్తిరపి స్మృతః ||13

ప్రతీతశ్చ నభస్యశ్చ నభ ఊర్జస్తథైవచ| స్వారోచిషస్య పుత్రాస్తే మనో ర్విప్రాః మహాత్మనః || 14

కీర్తితాః పృథివీపాలా మహావీర్యపరాక్రమాః | ద్వితీయ మేతత్కథితం విప్రా మన్వంతరం మయా || 15

ఇదం తృతీయం వక్ష్యామి తద్బుధ్యధ్వం ద్విజోత్తమాః| వశిష్ఠపుత్రాః సప్తా77సన్వాశిష్ఠా ఇతి విశ్రుతాః || 16

హిరణ్యగర్భస్య సుతా ఊర్జాజాతాః సుతేజసః ఋషయో7త్రమయా ప్రోక్తాః కీర్త్యమానాన్ని బోధత || 17

ఔత్తమేయా న్మునిశ్రేష్ఠాః దశపుత్రాన్మనోరిమాన్‌ | ఇష ఊర్ణ స్తనూర్జస్తు మధు ర్మాధవ ఏవ చ || 18

శుచిః శక్రః సహశ్చైవ నభస్యో నభ ఏవ చ | భావన స్తత్ర దేవాశ్చ మన్వంతర ముదాహృతమ్‌ || 19

మన్వంతరం చతుర్థం వః కథయిష్యామి సాంప్రతమ్‌ | కావ్యః పృథు స్తథైవాగ్నిర్జహ్ను ర్థాతా ద్విజోత్తమా ః || 20

కపీ వా నకపీవాంశ్చ తత్ర సప్తర్షయో ద్విజాః| పురాణ కీర్తితా విప్రాః పుత్రా పౌత్రాశ్చ భో ద్విజాః || 21

తథా దేవగణాశ్చైవ తామసస్యాంతరే మనోః | ద్యుతి స్తపస్యః సుతపా స్తపోభూతః సనాతనః || 22

తపోరతి రకల్మాష స్తన్వీ ధన్వీ పరంతప ః | తామసస్య మనోరేతే దశపుత్రాః ప్రకీర్తితాః || 23

వాయుప్రోక్తా ముని శ్రేష్ఠా శ్చతుర్థం చైతదంతరమ్‌ | దేవబాహుర్యదుధ్రశ్చ ముని ర్వేదశిరాస్తథా || 24

హిరణ్యర్తోమా పర్జన్య ఊర్ధ్వబాహుశ్చ సోమజఃసత్య నేత్ర స్తథా77త్రేయ ఏతే సప్తర్షయో7పరే ||25

దేవా శ్చాభూతరజసస్తథా ప్రకృతయః స్మృతాః | వారిప్లవశ్చరైభ్యశ్చ మనోరంతర ముచ్యతే || 26

ఆథపుత్రా నిమాం స్తస్య బుధ్యధ్వం గదతో మమ|ధృతిమా నవ్యయో యుక్త స్తత్త్వదర్శీనిరుత్సుకః || 27

అరణ్యశ్చ ప్రకాశశ్చ నిర్మోహః సత్యవాక్కృతీ | రైవతస్య మనోః పుత్రా పంచమం చైతదంతరమ్‌ || 28

షష్ఠంతు సంప్రవక్ష్యామి తద్బుధ్యధ్వం ద్విజోత్తమా ః | భృగు ర్నభో వివస్వాంశ్చ సుధామా విరజాస్తథా || 29

అతినామా సహిష్ణుశ్చ సపై#్తతే చ మహర్షయః | చాక్షుషస్యాంతరే విప్రా మనోర్దేవాస్విమే స్మృతా ః || 30

అబాలప్రథితాస్తే వై పృథ క్తేన దివౌకసః | లేఖాశ్చ నామతో విప్రా ః పంచదేవగణాః స్మృతా ః || 31

ఋషే రంగిరసః పుత్రా మహాత్మానో మహౌజసః | నాడ్వలేయా మునిశ్రేష్ఠా దశపుత్రాస్తు విశ్రుతాః || 32

రురుప్రభృతయో విప్రా శ్చాక్షుషస్యాంతరే మనోః | షష్ఠంమన్వంతరం ప్రోక్తం సప్తమంతు నిబోధత || 33

ఆత్రిర్వశిష్ఠో భగవా స్కశ్యపశ్చ మహానృషిః | గౌతమో7థ భరద్వాజో విశ్వామిత్ర స్తథైవచ || 34

తథైవ పుత్రో భగవా నృచీకస్య మహాత్మనః | సప్తమో జమదగ్నిశ్చ ఋషయః సాంప్రతం దివి || 35

సాధ్యా రుద్రాశ్చ విశ్వేచ వసవో మరుత స్తథా | ఆదిత్యా శ్యాశ్వినౌ చాపి దేవౌ వైవస్వతౌ స్మృతౌ || 36

మనో ర్వైవస్వసైతే వర్తంతే సాంప్రతేంతరే | ఇక్ష్వాకుప్రముఖాశ్చైవ దశపుత్రా మహాత్మనః || 37

ఏతేషాం కీర్తితానాంతు మహర్షీణాం మహౌజసామ్‌ | తేషాం పుత్రాశ్చ పౌత్రాశ్చ దిక్షు సర్వాసు భో ద్విజాః|| 38

మన్వంతరేషు సర్వేషు ప్రాగా సన్సప్త సప్తకాః| లోకే ధర్మ వ్యవస్థార్థం లోక సంరక్షణాయ చ|| 39

మన్వంతరే వ్యతిక్రాంతే చత్వారః సప్తకా గణాః | కృత్వా కర్మ దివం యాంతి బ్రహ్మలోక మనామయమ్‌ || 40

తతో7న్యే తపసాయుక్తా ః స్థానం తత్పూరయంత్యుత | ఆతీతా వర్తమానాశ్చ క్రమేణౖ తేను భో ద్విజాః || 41

స్వాయంభువ మనుమకాలమున సప్తర్షులు మరీచి, అత్రి, అంగిరస్సు, పులహుడు, క్రతువు, పులస్త్యుడు, వశిష్ఠుడు, వీరు బ్రహ్మకుమారులు. ఉత్తర దిక్కునందుందురు. ఆగ్నీధ్రుడు, అగ్నిబాహుడు,మేధ్యుడు, మేధాతిథి, వసువు, జ్యోతిష్మంతుడు, ద్యుతిమంతుడు, హవ్యుడు, సబలుడు, పుత్రుడు అనుపదిమంది స్వాయంభువు కుమారులు. ఈ యది ప్రథమ మన్వంతరము. (8-11)

స్వరోచిమనువుకాలమున ఋషులు- ఉర్వుడు, స్తంబుడు, కశ్యపుడు, ప్రాణుడు, బృహస్పతి,దత్తుడు, అత్రి, చ్యవనుడు. మహావ్రతులైన యేడ్వురు దేవతలు - తుషితులు, హవిఘ్నుడు, సుకృతి, జ్యాతి, ఆపుడు, మూర్తిc ప్రతీతుడు, నభస్యడు, నభస్సు ఊర్జస్సుయనువారు స్వారోచి కుమారులు. ఇది రెండవ మన్వంతర విషయము. (12-15)

ఉత్తముని కాలమున వశిష్ఠ కుమారులు (వాశిష్టులు) యేడ్వురు ఋషులు. హిరణ్యగర్ఛుని కుమారులు ఊర్జులు. ఉత్తముని కుమారులు పదిమంది. ఇషుడు, ఊర్జస్సు తనూర్జుడు. మధువు, మాధవుడు, శుచి,శుక్రుడు, నహుడు, నభస్యుడు. నభుడు, దేవతలిందు భానువులు ఇది తృతీయ మన్వంతర విషయము (16-19)

వశిష్ట కుమారులు, (వాశిష్టులు) యేడ్వురు ఋషులు. హిరణ్యగర్భుని కుమారులు ఊర్జులు. ఉత్తమునిన కుమారులు పదిమంది. ఇషుడు, ఊర్జస్సు. తనూర్జుడు, మధువు మాధవుడు, శుచి, శుక్రుడు, సహుడు, నభస్యుడు, నభుడు, దేవతలిందు భానువులు. ఇది చతుర్థ మన్వంతర విషయము. (20-21)

తామన మన్వంతరమున కావ్యుడు, పృథువు, అగ్ని, జహ్నువు, ధాత, కపీవంతుడు, అకపీవంతుడు యనువారు సప్తర్షులు. ఇందు దేవగణములు. ద్యుతి, తపస్యుడు-సుతవుడు, తపోభూతుడు, సనాతనుడు, తపోరతి, అకల్మాషుడు, తన్వీ, పరంతవుడు అనువారు పదిమంది వాయువుచే చెప్పబడినవారు. (22-26) దేవబాహువు యదుధ్రుడు, (ముని) వేదశిరస్సు హిరణ్యరోముడు, పర్జన్యుడు, ఊర్ధ్వబాహువు, (సోమజుడు) సత్యనేత్రుడు (ఆత్రేయుడు)నను వారు రైవతమనువు కాలమున సప్తర్షులు. (27-28) ఇందు దేవగణములు అభూత రజస్సు ప్రకృతి, వారిప్లవుడు, రైభ్యుడు, ధృతిమంతుడు, అవ్యయుడు, యుక్తుడు, తత్త్వదర్శి, నిరుత్సుకుడు, అరణ్యుడు, ప్రకాశుడు నిర్మోహుడు, సత్యవాక్కు, కృతి ఐదవ రైవతమన్వంతరమునుందు రైవతుని కుమారులు.

ఆఱవ మనువు చాక్షుషుడు, ఈయన కాలమున సప్తర్షులు. భృగువు, నభస్సు, వివస్వంతుడు, సుధాముడు, విరజుడు, సహిష్ణువు అనువారు (అప్రసూతులు) ఆ బాలప్రఖ్యాతులు. లేఖులను వారు దేవగణము లైదుగురు. అంగిర కుమారులు అతినాముడు, నాడ్వులేయులు పదిమంది. చాక్షుష మనువు పుత్రులు రురుప్రభృతులు. (29-33)

సప్తమము వైవస్వంత మన్వంతరము. అత్రి, వశిష్ఠుడు, కశ్యపుడు, గౌతముడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, (ఋచీకుని కుమారుడు) జమదగ్ని అనువారిపుడు సప్తర్షులు. సాధ్యులు, రుద్రులు, వశ్వేదేవులు, వసువులు, మరుత్తులు, ఆదిత్యులు, అశ్వినులు, వైవస్వత మనువు కాలమున దేవతలు. ఇక్ష్వాకు మొదలగువారు పదిమంది కుమారులు. వారివారి సంతానము లనంతములయి సర్వ మన్వంతరములందు సప్త సప్తకులు 7 x 7 = 49 మంది ధర్మవ్యవస్థ కొఱకు లోరక్షణ కొరకు (సప్తగణములు) వర్తించి కర్మానుష్ఠానమొనరించి శాశ్వత బ్రహ్మలోకము నలంకరింతురు. ఆమీద వారివారి స్థానములను తపస్సంపన్నులు మరియొక రధిష్ఠింతురు. ఇట్లు అతీతులు వర్తమానులనైన వారివారిని పేర్కొంటిమి. (34-41)

అనాగతాశ్చ సపై#్తతే స్మృతా దివి మహర్షయః| మనోరంతర మాసాద్య సావర్ణస్యేహ భో ద్విజాః|| 42

రామో వ్యాసస్థథా77త్రేయో దీప్తిమంతో బహుశ్రుతాః | భారద్వాజ స్తథా ద్రౌణి రశ్వత్థామా మహద్యుతిః || 43

గౌతమశ్చా జరశ్చైవ శరద్వాన్నామ గౌతమః | కౌశికో గాలవ శ్చైవ ఔర్వః కాశ్యప ఏవ చ || 44

ఏతే సప్త మహాత్మానో భవిష్యా మునిసత్తమాః | వైరీ చైవా ధ్వరీవాంశ్చ శమనో ధృతిమా న్వసుః || 45

అరిష్ట శ్చాప్యధృష్టశ్చ వాజీ సుమతీ రేవ చ | సావర్ణస్య మనోః పుత్రా భవిష్యా మునిసత్తమాః || 46

ఏతేషాం కల్య ముత్థాయ కీర్తనా త్సుఖ మేధతే| యశశ్చా77ప్నోతి సుమహ దాయుష్మాంశ్చ భ##వేన్నరః || 47

ఏతాన్యుక్తాని భో విప్రాః సప్తసప్తచ తత్త్వతః | మన్వంతరాణి సంక్షేపా చ్ఛణు తానాగతాన్యపి || 48

సావర్ణా మనవో విప్రాః పంచ తాంశ్చ నిబోధత, ఏకో వైవస్వత స్తేషాం చత్వారస్తు ప్రపాజతేః || 49

పరమేష్ఠిసుతా విప్రాః మేరుసావర్ణ్యతాం గతాః | దక్షసై#్యతే హి దౌహిత్రాః ప్రియాయా స్తనయా నృపాః || 50

మహతా తపసా యుక్తా మేరుపృష్ఠే మహౌజసః | రుచేః ప్రజాపతేః పుత్రోరౌచ్యో నామ మనుః స్మృత్యః || 51

భూత్యాం చోత్పాదితో దేవ్యాం భౌత్యో నామ రుచేః సుతః | అనాగతాశ్చ సపై#్తతే కల్పే7స్మి న్మనవః స్మృతాః || 52

తైరియం పృథివీ సర్వా సప్త ద్వీపా సపత్తనా | పూర్ణం యుగసహ్రసంతు పరిపాల్య ద్విజోత్తమాః || 53

ప్రజాపతేశ్చ తపసా సంహరంతే చ నిత్యశః | యుగాని సప్తతిస్తాని సాగ్రాణి కథితాని చ || 54

కృత త్రేతాదియుక్తాని మనోరంతర ముచ్చతే | చదుర్ధశైతే మనవః కథితాః కీర్తివర్ధనాః || 55

వేదేషు సపురాణషు సర్వేషు ప్రభవిష్ణవః | ప్రజానాం పతయో విప్రా ధన్య మేషాం ప్రకీర్తనం || 56

మన్వంతరేషు సంహారాః సంహారాంతేషు సంభవాః | న శక్యతే7ంత స్తేషాం వైవక్తుం వర్షశ##తైరపి || 57

విసర్గస్య ప్రజానాంవై సంహారస్య చ భో ద్విజాః | మన్వంతరేషు సంహారాః శ్రూయంతే ద్విజసత్తమాః || 58

సశేషాస్తత్ర తిష్ఠంతి దేవాః సప్తర్షిభిః సహ| తపసా బ్రహ్మచర్యేణ శ్రుతేనచ సమన్వితాః || 59

పూర్ణే యుగసహస్రే తు కల్పో నిశ్శేష ఉచ్చతే | తత్ర భూతాని సర్వాణి దగ్ధా న్యాదిత్యరశ్మిభిః || 60

బ్రహ్మాణ మగ్రతఃకృత్వా సహా77 దిత్యగణౖ ర్ద్విజాః | ప్రవిశంతి సుర శ్రేష్ఠం హరింనారాయణం ప్రభుమ్‌|| 61

స్రష్టారం సర్వభూతానం కల్పాంతేషు పునః | అవ్యక్తః శాశ్వతో దేవ స్తస్య సర్వ మిదం జగత్‌ || 62

ఆత్ర వః కీర్తయిష్యామి మనోర్వైవస్వతస్యవై | విసర్గం ముని శార్దూలాః సాంప్రతస్య మహాద్యుతేః || 63

ఆత్రి వంశ ప్రసంగేన కథ్యమానం పురాతనమ్‌ | యత్రోత్పన్నో మహాత్మాస హరి ర్వృష్ణికులే ప్రభుః || 64

ఇతి శ్రీ మహాపురాణ బ్రాహ్మే మన్వంతర కీర్తనం నామ పంచమో7ధ్యాయః

ఇక రాగల మన్వంతరములలో సావర్ణిమనువుకాలమున రాముడు, వ్యాసుడు, (ఆత్రేయుడు) అశ్వత్థామ (భారద్వాజుడు, ద్రౌణి) అజరుడు శరద్వంతుడు (గౌతముడు) గాలవుడు (కౌశికుడు) ఔర్వుడు (కాశ్యపుడు) వీరేడ్వురు ఋషు లయ్యెదరు. వైరి అధ్వరీవంతుడు. శమనుడు, ధృతిమంతుడు. వసువు అరిష్టుడు, అధృష్టుడు, వాజి, సుమతియను వారు. సావర్ణి మనువు కుమారులు. వీరిని వేకువవేళ మేల్కొని కీర్తించిన సుఖసమృద్ధియగును కీర్తికల్గును. ఆయుర్భాగ్యాము పట్టును. సావర్ణులయిన, మనువులలో నొకడు వైవస్వతుడు నల్గురు ప్రజాపతి సంతతివారు. పరమేష్ఠికుమారులు మేరుసావర్ణ్యులయిరి. మేరుగిరిపై తపోనిరతి నుండువారు ప్రజాపతిపుత్రుడు రౌచ్యుడు. ( మనువు) రుచికి భూతిదేవియందుc గల్గినవాడు. వీరి శ్వేతవరాహకల్పమునందు రాగల మనువులేడుగురు. ఈ పదునాల్గురు మనువులవలన సప్తద్వీపయైన యీ పృథివియెల్ల పట్టణములతో గూడ వేయియుగములు పరిపాలింపబడగలదు. డెబ్బదియొక్క మహాయుగములు ప్రజాపతియొక్క పూర్ణాయుర్దాయము. వీరు మనువులు పదునల్వురు కీర్తివర్ధనులు. వేదములందు పురాణములందు వినిపింతురు. ప్రజాపతులు వీరు. వీరి సంకీర్తనము ధన్యతాసంపాదకము. మన్వంతరములందు సంహారము, సంహారంతమున (లయయందు) సృష్టి - ఈ లెక్క వర్ణింపనలవిగాదు. ప్రళయావసానమున సప్తర్షులతోడ తపోబలముచే బ్రహ్మచర్య సంపత్తిచే శ్రుతముచే (జ్ఞానముచే) కొందరు మహర్షులు శేషించియుందురు. వారినే శిష్టులందురు. యుగ సహస్రసంపూర్తియందు కల్పసమాప్తియై జగత్తు నిశ్శేషమగును. అపుడెల్ల భూతములాదిత్యకిరణముల దగ్ధములగును. వీరు బ్రహ్మను ముందిడుకొని ఆదిత్యగణములతో సురశ్రేష్ఠుడైన నారాయణప్రభువునందు జొచ్చును. కల్పాంతమునందు పునస్సృష్టిసేయు మహానుభావుడాయన. అవ్యక్తము. శాశ్వతము. నైనతత్త్వము. ఆయనయే యీ జగత్తంతము. ఇక వైవస్వతమనువుయొక్క విసర్గ వృత్తాంతము వినిపించెద. పురాణలక్షనములందొకటైన వంశలక్షణముగ ప్రసంగవశమున శ్రీహరి యవతరించిన వృష్టివంశమునటుపై వర్ణించెద వినుండు. (42-64)

ఇది శ్రీ బ్రహ్మమహాపురాణమునందు మన్వంతరకీర్తనమను అయిదవయ యధ్యాము.

Brahmapuranamu    Chapters