Brahmapuranamu    Chapters   

ఏకోన పంచాశత్తమోధ్యాయః

కారుణ్యస్తవవర్ణనమ్‌

వాసుదేవ! నమస్తేస్తు నమస్తే మోక్షకారణ | త్రాహిమాం సర్వలోకేశ జన్మసంసారసాగరాత్‌||1

నిర్మలాంబర సంకాశ నమస్తేపురుషోత్తమ | సంకర్షణ నమస్తేస్తు త్రాహిమాం ధరణీధరా|| 2

నమస్తేహేమగర్భాభ నమస్తే మకరధ్వజ | రతికాంత నమస్తేస్తు త్రాహిమాం సంవరాన్తక||3

నమస్తేంజన సంకాశ నమస్తేభక్తవత్సల | అనిరుద్ధ నమస్తేస్తు త్రాహిమాంవరదోభవ||4

నమస్తే విబుధావాస నమస్తే విబుధప్రియ | నారాయణ నమస్తేస్తు త్రాహిమాం శరణాగతమ్‌||5

నమస్తే బలినాం శ్రేష్ఠ నమస్తే లాంగలాయుధ | చతుర్ముఖ జగద్ధామ త్రాహిమాంప్రపితామహ || 6

నమస్తే నీలమేఘాభ నమస్తే త్రిదశార్చిత | త్రాహి విష్ణో జగన్నాథ మగ్నం మాంభవసాగరే|| 7

ప్రళయానల సంకాశ నమస్తే దితిజాంతక | నరసింహ మహావీర్య త్రాహిమాం దీప్తలోచన|| 8

యథా రసతలాదుర్వీ త్వయా దంష్ట్రోద్ధృతా పురా | తథా మహావరాహస్త్వం త్రాహిమాం దుఃఖసాగరాత్‌|| 9

తవై తా మూర్తయః కృష్ణ వరదాః సంస్తుతా మాయా | తవేమే బలదేవాద్యాః పృథగ్రూపేణ సంస్థితాః|| 10

అంగాని తవ దేవేశ గరుడ్మాద్యా స్తథాప్రభో | దిక్పాలాః సాయుధాశ్చైవ కేశవాద్యా స్తథాచ్యుత ||11

ఇంద్రద్యుమ్నుడు పురుషోత్తమదేవుని స్తుతించుట

వాసుదేవా!మోక్షకారణ! జన్మ సంసార సాగరమునుండి రక్షింపుము. అచ్చమైన ఆకాశమువంటివాడవు నిర్లేపుడవు.(గణసంగములేనివాడవన్నమాట) ఈ స్తుతి పారాయణ నారాయణ నామావళి. 1 శ్లో నుండి 9 బలరామాది వివిధ మూర్తులన్నియు నీవే వేఱువేఱుగా ననిపించుచున్నవి. గరుడుడు శంఖచక్రాదులు దిక్పాలురు కేశవాది రూపములన్నియు నీయవయవములే.

యే చాన్యేతవ దేవేశ భేధాః ప్రోక్తా మనీషిభిః | తే7పి సర్వేజగన్నాథ ప్రసన్నాయత లోచన || 12

మయా7ర్చితాః స్తుతాః సర్వే తథాయూయం నమస్కృతాః |

ప్రయచ్ఛత వరం మహ్యం ధర్మకామార్థమోక్షదమ్‌ || 13

భేదాస్తే కీర్తితా యేతు హరే సంకర్షణాదయః | తవ పూజార్థసంభూతాస్తత స్త్వయి సమాశ్రితాః || 14

న భేదస్తవ దేవేశ విద్యతే పరమార్థతః | వివిధం తవ యద్రూపముక్తం తదుపచారతః || 15

అద్వైతం త్వాం కథం ద్వైతం వక్తుం శక్నోతిమానవః | ఏక స్త్వం హి హరేవ్యాపీ చిత్స్వభావోనిరంజనః || 16

పరమంతన యద్రూపం భావాభావ వివర్జితమ్‌ | నిర్లేపం నిర్గుణంశ్రేష్ఠం కూటస్థమచలంధ్రువమ్‌ || 17

సర్వోపాధి వినిర్ముక్తం సత్తామాత్ర వ్యవస్థితమ్‌ | తద్దేవాశ్చ నజానంతి కథం జానామ్యహంప్రభో || 18

ఆపరం తవ యద్రూపం పీతవస్త్రమ్‌ చతుర్బుజమ్‌ | శంఖ చక్ర గదాపాణి ముకుటాంగద ధారిణమ్‌ || 19

శ్రీవత్సోరస్కసంయుక్తం వనమాలా విభూషితమ్‌ | తదర్చయంతి విబుధా యే చాన్యే తవ సంశ్రయాః || 20

దేవదేవ సురశ్రేష్ఠ భక్తానా మభయప్రద | త్రాహిమాం పద్మపత్రాక్ష మగ్నం విషయసాగరే || 21

నాన్యం పశ్యామిలోకేశ యస్యాహం శరణంవ్రజే | త్వామృతే కమలాకాంత ప్రసీద మధుసూదన || 22

జరావ్యాధి శ##తైర్యుక్తో నానా దుఃఖైర్నిపీడితః | హర్షశోకాన్వితో మూఢః | కర్మపాశైః సుయంత్రితః || 23

పతితో7హం మహారౌద్రే ఘోరే సంసారసాగరే | విషయోదక దుష్పారే రాగద్వేష ఝషాకులే || 24

ఇంద్రియావర్త గంభీరే తృష్ణాశోకోర్మి సంకులే | నిరాశ్రయేనిరాలంబే నిస్సారే7త్యంతచంచలే || 25

మాయయా మోహిత స్తత్ర భ్రమామి సుమిరంప్రభో | నానాజాతి సహస్రేషు జాయమానః పునః పునః || 26

జగన్నాథ ! నీ ఆ స్వరూపములన్నిటి నర్చించితిని. నీ సంకర్షణ అనిరుద్ద ప్రద్యుమ్నాది మూర్తులను నేను కీర్తించితిని. నిన్నేకరూవుని భిన్నరూవుల బేర్కొందురు. ఔపచారికము. అద్వైతుడవైన (ఏకైక వస్తువైన) నిన్ను ద్వైతునిగా బేర్కొనుట యెట్లు పొసగును ?

హరీ ! నీవు చిత్స్వరూపమున (కేవలము జ్ఞానమై) వొక్కడిపై సర్వము వ్యాపించియున్నావు. నీ పరమ రూపము భావాభావ వర్జితము. ఉనికి మనుకులు లేనిది. కూటస్థము సర్వసాక్షి అచలము ధ్రువము. నామరూప లు గలదానికి ఉపాధియని పేరు. నీ రూపముపాధి విడిచినది. కేవలము సత్తా మాత్రము. దానిని దేవతలే యోఱుగరు. నేనట్టె ఱుంగుదును? పీతాంబరధారి చతుర్బుజము. శంఖచక్రగదాపాణీ కిరీటము భుజకీర్తులు. ధరించిన శ్రీవత్సవక్షము వనమాలాభూషితమునైన నీ మఱొక మూర్తిని (అర్చామూర్తిని) దేవతలు నీ భక్తులు నర్చింతురు. ప్రభూ రక్షింపుము నేను శరణొంద నీకంటె మఱియెక్కని గానను. కర్మపాశబద్దుడనై సంసార సాగరమునం బడి కొట్టుకొను మాయా మోహమున బడినవానిని నుద్ధరింపుము.

మయాజన్మా న్యనేకానిసహస్రా ణ్యయుతానిచ | వివిధాన్యను భూతాని సంసారేస్మిన్‌ జనార్దన || 27

వేదాః సాంగా మయా7ధీతాః శాస్త్రాణి వివిధానిచ | ఇతిహాస పురాణాని తథాశిల్పాన్యనేకశః || 28

అసంతోషాశ్చ సంతోషాః సంచయాపచయా వ్యయాః | మయా ప్రాప్తా జగన్నాథ! క్షయ వృద్ధ్యక్షయే తరాః || 29

భార్యారి మిత్ర బంధూనాం వియోగాః సంగమాస్తథా | పితరో వివిధా దృష్టా మాతరశ్చ తథామయా || 30

దుఃఖాని చానుభూతాని యాని సౌఖ్యాన్యనేకశః | ప్రాప్తాశ్చ బాంధవాః పుత్రా భ్రాతరో జ్ఞాతయస్తథా || 31

మయోషితం తథాస్త్రీణాం కోష్ఠే విణ్మూత్రపిచ్చలే | గర్భవాసే మహాదుఃఖమనుభూతం తథాప్రభో || 32

దుఃఖాని యాన్యనేకాని బాల్య ¸°వనగోచరే | వార్థకే చ హృషీకేశ తానిప్రాప్తాని వైమయా || 33

మరణ యాని దుఃఖాని యమమార్గే యమాలయే | మయా తాన్యనుభూతాని నరకే యాతనాస్తథా || 34

కృమికీటద్రుమాణాంచ హస్త్యశ్వమృగపక్షిణామ్‌ | మహిషోష్ట్రగవాం చైవ తథాన్యేషాం వనౌకసామ్‌ || 35

ద్విజాతీనాం చ సర్వేషాం శూద్రాణాంచైవ యోనిషు | ధనినాం క్షత్రియాణాంచ దరిద్రాణాం తపస్వినామ్‌ || 36

నృపాణాం నృపభృత్యానాం తథా7న్యేషాంచ దేహినామ్‌|గృహేషు తేషాముత్పన్నో దేవ చాహం పునః పునః || 37

నానాయోనులం బుట్టి నానాకష్టముల ననుభవించితిని. సాంగములైన వేదములను శాస్త్రములను జదివితిని. కళలను శిల్పములను నేర్చితిని. సుఖాలు దుఃఖాలెన్నో యనుభవించితిని. సంతోషాసంతోషములు సంచయాప్రచయములు (కూడబెట్టుట పోబెట్టుట) పుత్రమిత్రకళత్రాదులు తలిదండ్రు లన్నదమ్ముల కలయికలు ఎడబాటులెన్నో నాకైనవి. విణ్మూత్రముల రొంపిలో (ఆడుదాని గర్భములో) నే నిరికికొన్నాను. మహాదుఃఖము లందినాను. బాల్యకౌమర¸°వన వార్ధక్యాదిదశలం దంతులేని వంతలొందినాను. మరణ మంది యమమార్గమున నరకమందు పలుయాతనలు పడినాను. కృమికీటకాదులు పలుమృగ ములు పక్షులు పలు పశువుల బ్రాహ్మణాదిశూద్రాంత యోనులందు ధనికులు దరిద్రులు రాజులు రాజర్షులు రాజసేవకులు మఱి పెక్కుదేహులగేహములందు మఱలమఱల బుట్టి తిని గిట్టితిని.

గతోస్మి దాసతాం నాథ భృత్యానాం బహుశో నృణామ్‌| దరిద్రత్వం చేశ్వరత్వం స్వామిత్వం చ తథా గతః || 38

హతోమయా హతాశ్చాన్యే ఘాతితో ఘాతితాస్తథా| దత్తం మమాన్యై రన్యేభ్యో మయాదత్తమనేకశః || 39

పితృమాతృసుహృద్ర్భాతృ కళత్రాణాం కృతేన చ| ధనినాం శ్రోత్రియాణాంచ దరిద్రాణాం తపస్వినామ్‌ || 40

ఉక్తం దైన్యంచ వివిధం త్యక్త్వాలజ్జాం జనార్దన| దేవతిర్యజ్మనుష్యేషు స్థావరేషు చరేషు చ || 41

న విద్యతే తథా స్థానం యత్రాహం నగతః | ప్రభో | కదా మే నరకే వాసః కదా స్వర్గే జగత్పతే || 42

కదా మనుష్యలోకేఘ కదా తిర్యగ్గతేషు చ| జలయన్త్రే యథా చక్రే ఘటీ రజ్జునిబంధనా || 43

యాతి చోర్ద్వ మధశ్చైవ కదా మధ్యేచ తిష్ఠతి| తథా చాహం సురశ్రేష్ఠ కర్మరజ్జుసమావృతః || 44

అథశ్చోర్ద్వం తధా మధ్యే భ్రమన్‌గచ్ఛామి యోగతః| ఏవం సంసార చక్రే7స్మిన్భైరవే రోమహర్షణ || 45

భ్రమామి సుచిరం కాలం నాంతం పశ్యామి కర్హిచిత్‌ | నజానే కిం కరోమ్యద్య హరే వ్యాకులితేంద్రియః || 46

శోక తృష్ణాభి భూతోహం కాందిశీకో విచేతనః | ఇదానీం త్వామహం దేవ విహ్వలః శరణం గతః || 47

త్రాహిమాం దుఃఖతం కృష్ణ మగ్నం సంసారసాగరే| కృపాం కురు జగన్నాథ భక్తం మాం యది మన్యనే || 48

త్వదృతే నాస్తి మే బంధుర్యో7సౌ చింతాం కరిష్యతి|దేవ త్వాం నాథ మాసాద్య నభయం మే7స్తి కుత్రచిత్‌ || 49

జీవితే మరణ చైవ యోగేక్షేమే7థ వాప్రభో |

యేతు త్వాం విధివద్దేవ నార్చయంతి నరాధమాః ||సుగతిస్తు కథం తేషాం భ##వేత్సంసార బంధనాత్‌ | 50

పెక్కుమంది దాసులకు దాసుడనైతిని. దరిద్రుడనైతిని. రాజులకు రాజనైతిని. భిక్షకులకు భిక్షకుడైతిని. ఒరుల కేనిచ్చితిని. ఒరులకడ దీనుడనై నేను చెయి సాచితిని. ఒరులచే నేబడితిని. నాచే నొరులెందఱో పడిరి. తండ్రులు తాతలు మిత్రులు భ్రాతలు పుత్రులు కళత్రముల కొఱకు సిగ్గువిడిచి దైన్యము వెళ్ళబోసికొన్నాను. పశుపక్ష్యాదులలో చరాచర ప్రపంచమునందు దిగులు గడిచి నేను బోయి యీడిగిలబడిని చోటన్నది లేనేలేదు. నరకమెప్పుడో స్వర్గమెప్పుడో వసుధయైప్పుడో పశుపక్ష్యాదులందెప్పుడో నాయునికి యెప్పుడెక్కడో యెఱుగను. నీరు తోడు యంత్రచక్రమున త్రాటితో గట్టిన కుండ మకమారు క్రిందికి నొకసరి మీదికి నొకపరి నడిమికి వచ్చిన విధమున భైరవమైన యీ సంసార చక్రమున చిరకాలము పరిభ్రమించుచున్నాను. ఈ తిఱుగుడున కంతుగానకున్నాను. ఇంద్రియుములు వ్యాకులములై యిప్పుడు నేనేమి సేయవలెనో దెలియకున్నాను. శోకము తృష్ణకు (ఆశకు)జిక్కినేను మతివోయి కాందిశీకుడనై(భ్రాంతుడనై = భయముచే నట్టిట్టు పరుగులెత్తువాడనై) దేవా! ఇప్పుడు నేను విహ్వలుడనై (తపనచే అవయవములు పట్టుతప్పి) బెగ్గలించుచు విలవిల దన్నికొనుచు మ్రగ్గుచు విరవిర వోవుచు) నిన్ను శరణందుచున్నాను. కృష్ణా సంసారమందు మునిగిపోయిన నన్ను కాపాడుము. జగన్నాథ నన్ను భక్తుడని యనుకొందువేని నా యెడ దయసూపుము. నన్నుగురించి యాలోచించు బంధువు నీకంటె నాకు లేడు. నిన్ను నా నాథునిగ (దిక్కుగ) బొందితిని. మఱి నాకెక్కడను బ్రతుకున జావునయోమున క్షేమమున నేభయముండదు. అగద్దాతయైన కేశవునందు భక్తికలుగని వారికి నిన్ను యధావిధిగ సేవింపని వారికి నరాధములకు సంసార బంధమునుండి సుగతి(విముక్తి) యెట్లగును?

కిం తేషాం కులశీలేన విద్యయా జివనేన చ || 51

యేషాం నజాయతే భక్తిర్జగద్ధాతరి కేశ##వే| ప్రకృతిం త్వాసురీం ప్రాప్య యేత్వాం నిందంతి మోహితాః || 52

పతంతి నరకే ఘోరే జాయమానాః పునః పునః| నతేషాం నిష్కృతి స్తప్మాద్విద్యతే నరకార్ణవాత్‌ || 53

యే దూషయంతి దుర్వృత్తాస్త్వాం దేవ పురుషాదమాః| యత్రయత్ర భ##వేజ్జన్మ మమకర్మ నిబంధనాత్‌ || 54

తత్రతత్ర హరే భక్తి స్త్వయి చాస్తు దృఢా సదా| ఆరాధ్య త్వాం సురా దైత్యా నరాశ్చాన్యేపి సంయతాః || 55

అవాపుః పరమాం సిద్ధిం కస్త్వాం దేవ నపూజయేత్‌|న శక్నువంతి బ్రహ్మాద్వాః స్తోతుం త్వాం త్రిదశా హరే || 56

కథం మానుష బుద్ద్యా7హంస్తౌమి త్వాం ప్రకృతేః పరమ్‌| తథా చాజ్ఞాన భావేన సంస్తుతో7సి మయా ప్రభో || 57

తత్‌క్షమస్వాపరాధం మేయది తే7స్తి దయా మయి| కృతాపరాధే7పి హరే క్షమాం కుర్వంతి సాధవః || 58

తస్మాత్ర్పసీద దేవేశ భక్త స్సేహం సమాశ్రితః| స్తుతో7సి యన్మయా దేవ భక్తిభావేన చేతసా ||

సాంగం భవతు తత్సర్వం వాసుదేవ నమోస్తుతే || 59

కులముతో శీలముతో విద్యతో బ్రతుకుతోబ నేమి? ఎవరుమోహవశులై నిను నిందింతురో వా రాసురప్రకృతిలోనుండి మఱల మఱల పుట్టుచు ఘోరనరకమందు బడుచుందురు. నీ దూషణముసేయువాండ్ర కానరకము కంటె మఱి ప్రాయశ్చిత్తము లేదు. నా ప్రారబ్దమును బట్టి యెందెందు నాకు జన్మము గల్గునో యందందు నీయందు నాకు దృఢభక్తి యెల్లపుడు గల్గుగాక ! నిన్నారాధించి సురాసురులు నరులను మనసు నిమిడించుకొని పరమసిద్దినందిరి. నిన్నెవ్వడు పూజింపడు? బ్రహ్మదులేని వొగడలేని ప్రకృతికంటే పరుడైన నిన్ను మానుషబుద్దిని నేనెక్కడ బొగడగలను. అయినను దెలియని తనముచే నాచేత వినుతుడనైతివి. నాయెడదయగలదేని దీనికి నన్ను క్షమింపుము. సాధువులు మహానుభావులు నపరాధులయెడం గూడ క్షమ సేయుదురు. భక్తవాత్సల్యము ననుసరించి దేవేశ్వర ! నాయెడ బ్రసన్నుడవగుము. భక్తిభరితచిత్తమున నుతించితింగాన నా చేసిన పూజయెల్ల సాంగమగును గాక! వాసుదేవ ! నమస్కారము.

బ్రహ్మోవాచ

ఇత్థం స్తుత స్తదా తేన ప్రసన్నో గరుడధ్వజః| దదౌ తసై#్మ మునిశ్రేష్ఠాః సకలం మనసేప్సితమ్‌ || 60

యః సంపూజ్య జగన్నాథం ప్రత్యహం స్తౌతి మానవః| స్తోత్రేణానేన మతిమా న్స మోక్షం లభ##తే ధ్రువమ్‌ || 61

త్రిసంధ్యం యో జపేద్విద్వా నిదం స్తోత్రవరం శుచిః| ధర్మం చార్థం చ కామంచ మోక్షం చ లభ##తే నరః || 62

యః పఠేచ్చృణుయాద్వా7పి శ్రావయేద్వా సమాహితః| స లోకం శాశ్వతం విష్ణో ర్యాతి నిర్దూత కల్మషః || 63

ధన్యం పాపహరం చేదం భుక్తి ముక్తి ప్రదమ్‌ శివమ్‌| గుహ్యంసుదుర్లభంపుణ్యం నదేయంయస్యకస్యచిత్‌ || 64

న నాస్తికాయ మూర్ఖాయ న కృతఘ్నాయ మానినే| న దుష్టమతయే దద్యా న్నాభక్తాయ కదాచనః || 65

దాతవ్యం భక్తియుక్తాయ గుణశీలాన్వితాయచ| విష్ణుభక్తాయ శాంతాయ శ్రద్ధానుష్ఠానశాలినే || 66

ఇదం సమస్తాఘవినాశ##హేతుః కారుణ్యసంజ్ఞం సుఖమోక్షదంచ |

అశేష వాంఛా ఫలదం వరిష్ఠం స్తోత్రం మయోక్తం పురుషోత్తమస్య || 67

యే తం సుసూక్ష్మం విమలా మురారిం ధ్యాయంతి నిత్యం పురుషం పురాణమ్‌ |

తే ముక్తిభాజః ప్రవిశంతి విష్ణుం మంత్రైర్యథా77జ్యం హుత మధ్వరాగ్నౌ || 68

ఏకః సదేవో భవదుః ఖహంతా పరః పరేషాం న తతో7స్తి చాన్యత్‌ |

ఇట్లాతనిచే బొగడబడి గరుడధ్వజుండు ప్రసన్నుడై యాతడు మనసారనేది కోరె నది యెలయిచ్చెను. దినదిన మెవ్వడు పూజించి హరి నీ స్తోత్రముచే వినుతించు నతడు నిక్కముగమోక్షమందును. ఈస్తోత్రవరమునెవ్వడు తెలిసి (అర్థమెఱిగి)త్రిసంధ్యముశు చియైజపించునో ఆనరుడు ధర్మ అర్థ కామ మోక్షములనుబోందును. దీని జదివినవిన్న వినిపించినయాతడుపాపములెడనిశాశ్వతమైనవిష్ణులోకమందును. ధన్యముపాప హరముభుక్తి ముక్తిదముశివము(మంగళము) గుహ్యము (రహస్యము) సుదుర్లభము పుణ్యమునైన యీ స్తుతి నెవ్వనికిబట్టినదానికీయరాదు. నాస్తికుడు మూర్ఖుడు కృతఘ్నుడు మాని (నే నే ఘనుడు ననుకొనువాడు) దురాలోచనుడు (దుష్టజ్ఞానము గలవాడు) ఆభక్తుడు కెప్పుడును దీని నీయరాదు. భక్తుడు గుణవంతుడు శీలవంతుడు విష్ణుభక్తుడు శాంతుడు శ్రద్దతో ననుష్ఠానముసేయువాడునైన వారికిది సర్వాఘవిఘాతుకము సుఖమోక్షదము అశేషవాంచాఫలదము వరిష్ఠమునైన ''కారుణ్య''మను పేరుగలయీపురుషోత్తమ స్తోత్రమును నేను జెప్పితిని. విశుద్దు లెవ్వరాసునూక్ష్మవస్తువైన మురారిని పురాణ పురుషుని నిచ్చలు ధ్యానింతురో వారు ముక్తులై మంత్రములచే యజ్ఞాగ్నియందు హోమముసేయబడిన యాజ్యమువలె హరింబ్రవేశింతురు. అతడొక్కడే దైవము సంసార దుఃఖహరుడు పరుడు పరాత్పరుడు, అంతకంటె మఱి యెండులేడు.

ద్రష్టా స పాతా సతు నాశకర్తా విష్ణుః సమస్తాఖిల సారభూతః || 69

కిం విద్యయా కిం స్వగుణౖశ్చతేషాం యజ్ఞైశ్చ దానైశ్చ తపోభిరుగ్రైః

యేషాం న భక్తిర్భవతీహ కృష్ణే జగద్గురౌ మోక్ష సుఖప్రదే చ || 70

లోకే స ధన్యః సశుచిః స విద్వాన్మఖైస్తపోభిః సగుణౖర్వరిషః

జ్ఞాతా స దాతా స తు సత్యవక్తా యస్యాస్తి భక్తిః పురుషోత్తమాఖ్యే || 71

ఇతి శ్రీ బ్రహ్మపురాణ కారుణ్యస్తవంనామ ఏకోనపంచాశత్తమో7ధ్యాయః

ఆకృష్ణుడుద్రష్ట (సర్వసాక్షి) పాత (రక్షకుడు) నాశకర్తయు సమస్తసారభూతుడు జగద్గురువు మోక్షసుఖప్రదాతయు నగును. కృష్ణునందెవరికి ఇహమందు భక్తికలుగదోవారికి విద్యచేనేమి? గుణముల నేమి యజ్ఞములను దానముల నుగ్రతపముల నేమి ప్రయోజనము? ఎవనికి బురుషోత్తము నందు భక్తి యుండు నాతడు లోకమందు ధన్యుడు. అతడు శుచి అతడు విద్వాంసుడు. నుఖములతో తపస్సులతో గుణములతో నతడు శ్రేష్ఠుడు. జ్ఞాని దాత యతడే సత్యవక్త.

ఇది శ్రీ బ్రహ్మపురాణము నందు కారుణ్యస్తవమను నలుబది తొమ్మిదవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters