Brahmapuranamu    Chapters   

అ ష్టా చ త్వా రి ం శో 7 ధ్యా యః

ప్రతిమా నిర్మాణ విధానపర్యాలోచనమ్‌

మునయః ఊచుః

బ్రూహినో దేవదేవేశ యత్పృచ్ఛామః పురాతనమ్‌ | యథా తాః ప్రతిమాః పూర్వమిద్రద్యుమ్నేన నిర్మితాః|| 1

కేన చైవ వప్రకారేణ తుష్టస్తసై#్మ స మాధవః | తత్సర్వం వద చాస్మాకం పరం కౌతూహలం హినః|| 2

మునులిట్లనిరి.

దేవదేవా! ఆవ్రతమ లింద్రద్యుమ్నునిచే నెట్లు నిర్మింపబడినవి, ఏప్రకారమున మాధవుడు సంతుష్టుడయ్యె నదియెల్ల నానతిమ్మువినవలెను. మామనసులువ్విళ్ళూరుచున్నవి.

బ్రహ్మోవాచ

శృణుధ్వం మునిశార్దూలాః పురాణంవేద సమ్మితమ్‌ | కథయామి పురావృత్తం ప్రతిమానాం చ సంభవమ్‌|| 3

ప్రవృత్తే చ మహాయజ్ఞే ప్రాసాదేచై వ నిర్మితే | చింతాతస్య బభూవాథ ప్రతిమార్థమహర్నిశమ్‌ || 4

న వేద్మికేన దేవేశం సర్వేశం లోకపావనమ్‌ | సర్గస్థత్యంతకర్తారం పశ్యామి పురుషోత్తమమ్‌|| 5

చింతావిష్టస్త్వభూద్రాజా శేతే రాత్రౌ దివాసిన | న భుజ్కై వివిధాన్‌భోగా న్నచ స్నానం ప్రసాధనం|| 6

నైవ వాద్యేన గన్ధేవ గాయనై ర్వర్ణకై రపి | న గజైర్మదయుక్తైశ్చ నచానేకైర్హయాన్వితైః|| 7

నేంద్రనీలై ర్మహానీలైః పద్మరాగమయైర్నచ | సువర్ణరజతాద్యైశ్చ వజ్రస్ఫటిక సంయుతైః|| 8

బహూరాగార్థకామైర్వా నవన్యైరంతిరిక్షగైః | బభూవతస్యనృపతే ర్మనసస్తుష్టి వర్థనమ్‌|| 9

శైలమృద్దారుజాతేషు ప్రశస్తంకింమహీతలే | విష్ణుప్రతిమాయోగ్యం చ సర్వలక్షణ లక్షితమ్‌|| 10

ఏతై రేవ త్రయాణాం తు దయితం స్యాత్సురార్చితమ్‌ | స్థాపితే ప్రీతిమభ్యేతి ఇతి చింతావరోభవత్‌|| 11

పంచరాత్రవిధానేన సంపూజ్య పురుషోత్తమమ్‌ | చింతావిష్టో మహీపాలః సంస్తోతుముపచక్రమే || 12

ఇతి శ్రీ బ్రహ్మపురాణ ప్రతిమానిర్మాణ విధానపర్యాలోచనం నామ అష్టచత్వారింశోధ్యాయః

బ్రహ్మ యిట్లనియె.

మునివరులారా! వినుండు. వేదతుల్యమైన పురాణమిది. యజ్ఞారంభముకాగా దేవ్రపాసాద నిర్మాణము జరుగగా నాఱనికి విగ్రహనిర్మాణమును గూర్చిన యాలోచన రేయింబవళ్ళతని మనసునం దిరవుకొనెను. సృష్టిస్థతిలయకర్తయైన యాసర్వేశ్వరుని నేనెఱుంగను. ఆస్వామిని నేనెట్లు గనుగొందునను నూహతో రాత్రియుం బవలును పండుకొనడు. ఆ యావేదనలో నాతని కష్టైశ్వర్య సమృద్ధి మనస్తుష్టి నీయజాలదయ్యె రాళ్ళుమన్ను కట్టెలం దేది విష్ణు ప్రతిమకు యోగ్యమగును?- ఎట్టి మూర్తిని ప్రతిష్టించిన విష్ణువు ప్రీతుడగునను నాలోచనలో నతడు మునింగెను. అంతట నాతడు పాంచరాత్ర విధానమున పురుషోత్తమ దేవుని బూజించి యదే యాలోచనగొని స్వామిని స్తుతింప నారంభించెను.

ఇది ప్రతిమానిర్మాణ విధానపర్యాలోచనమను నలుబదియెనిమిదవ అధ్యాయము

Brahmapuranamu    Chapters