Brahmapuranamu    Chapters   

సప్త చత్వారింశో7ధ్యాయ

ప్రాసాదకరణమ్‌

బ్రహ్మోవాచ.

ఏవం స పృథివీపాల శ్చింతయిత్వా ద్విజోత్తమాః| ప్రాసాదార్థం హరేస్తత్ర ప్రారంభమకరోత్తదా|| 1

ఆనాయ్య గణకాన్సర్వా నాచార్యాన్‌ శాస్త్రపారగాన్‌| భూమిం సంశోధ్యయత్నేన రాజా తు పరయాముదా|| 2

బ్రాహ్మణౖర్ఞాన సంపన్నై ర్వేద శాస్త్రార్థ పారగైః |అమాత్యైః మంత్రిభిశ్చైవ వాస్తువిద్యా విశారదైః|| 3

తైః సార్థం స సమాలోచ్య సుముహూర్తే శుభేదినే| సు చంద్ర తారసంయోగే గ్రహాను కూల్య సంయుతే|| 4

జయమంగళ శ##బ్దైశ్చ నానావాద్యెర్మనోహరైః వేదాధ్యయన నిర్ఘో షైర్గీతైః సుమధురస్వరైః|| 5

పుష్పలాజాక్షతైర్గంధైః పూర్ణకుంభైః సదీపకైః| దదావర్ఘ్యం తతోరాజా శ్రద్ధయా సుసమాహితః|| 6

దత్త్వైవ మర్ఘ్యం విధివ దానాయ్య స మహీపతిః| కళింగాధిపతం శూర ముత్కళాధిపతిం తధా||

కోశలాధిపతించై తానువాచ తదానృపః|| 7

ఇట్లా రాజు విష్ణుప్రాసాద నిర్మాణమును గురించి యాలోచించి ప్రారంభము చేసెను. జోతిష్కులను బిలిపించి భూ శోధనము చేయించెను. అంతియే గాక జ్ఞానులు, వేదశాస్త్ర పారంగతులు, అమాత్యులు, మంత్రులు, మొదలగు వారితో సమాలోచించి సుముహూర్తమున చంద్రతారాబలసంపత్తి గ్రహానుకూల్యము గల శుభసమయమున వాస్తువిద్వాంసులతో నీ యారంభము జరిపించెను. మంగళవాద్యములు, వేదాధ్యయనము మనోహరముగా జరిగెను. పూవులు, నక్షతలు, పేలాలతో దీవములతో పూర్ణకుంభములతో నామహీపతి భక్తితో భగవంతునకర్ఘ్యమిచ్చెను. కళింగోత్కళ, కోశలాధీశ్వరులను ఆహ్వానించెను.

రాజోవాచ

గచ్ఛధ్వం సహితాః సర్వే శిల్యార్థే సుసమాహితాః| గృహీత్వా ళిల్పముఖ్యాశ్చ శిలాకర్మ విశారదాన్‌|| 8

వింధ్యాచలం సువస్తీర్ణం బహుకందర శోభితమ్‌| నిరూప్య సర్వసానూని చ్ఛేదయిత్వా శిలాః శుభాః|| 9

సంవాహ్యంతాంచ శకటై ర్నౌకాభి ర్మావిలంబయ||

బ్రహ్మ ఉవాచ!

ఏవం గంతుం సమాదిశ్య తాన్నృపా న్స మహీపతిః| పునరేవ అబ్రవీద్వాక్యం సామాత్యా న్సపురోహితాన్‌|| 10

మఱియు నానరేంద్రులను స్వామి విగ్రహము కొఱకనువయిన శిలకై వెళ్ళుడని యానతిచ్చెను. శిల్పులను వెంటగొని వింధ్యాద్రికి జని బండ్లపై పడవలపై నేగి పాషాణములను గొనిరండని పంపెను. ఇట్లాజ్ఞయిచ్చి యమాత్యులతో పురోమితులకిట్లానతిచ్చెను.

రాజ ఉవాచ !

గచ్ఛంతు దూతాః సర్వత్ర మమాజ్ఞాం ప్రవదంతువై| యత్ర తిష్ఠంతి రాజానః పృథివ్యాంతాన్‌ సుశీఘ్రగాః|| 11

హస్త్యశ్వ రథపాదాతై ః సామాత్యైః సపురోహితైః| గచ్ఛత సహితాః సర్వ ఇంద్రద్యుమ్న స్య శాసనాత్‌|| 12

నా యానతిగొని దూతలు ఈపుడమికల రాజులందరికి శుభవార్త తెలిపిరండనెను. దూతలు రాజువచనమును రాజులకు దెయిపనేగిరి.

ఏవం దూతాః సమాజ్ఞాతాః రాజ్ఞాతేన మహాత్మనా| గత్వా తదా నృపానూచుర్వచనం తస్య భూపతేః 13

శ్రుత్వాతు తే తధా సర్వే దూతానాం వచనం నృపాః| ఆజగ్ము స్త్వరితాః సర్వే స్వసైన్యైః పరివారితాః|| 14

యే నృపాః సర్వదిగ్భాగే యేచ దక్షిణతః స్థితాః| పశ్చిమాయాం స్థితా యేచ ఉత్తరా పథ సంస్థితాః|| 15

ప్రత్యంత వాసినో యే7పి యేచ సన్నిధివాసినః| పార్వతీయాశ్చ యే కేచిత్తధా ద్వీప నివాసినః|| 16

రధైర్నాగైః పదాతైశ్చ వాజిభిర్ధన విస్తరైః| సంప్రాప్తా బహుశో విప్రాః శ్రుత్వేంద్ర ద్యుమ్నశాసనమ్‌|| 17

తానాగతా న్నృపా న్దృష్ట్వా సామాత్యాన్సపురోహితాన్‌| ప్రోవాచ రాజా హృష్టాత్మా కార్యముద్దిశ్య సాదరమ్‌|| 18

దూతలేగి రాజులకు వార్త నెఱింగింప వారు ససైన్య పరివారముగా నరుదెంచిరి. నలుదెసల రాజ్యములవారు పర్వత ద్వీపాది పర్వత ప్రాంతములవారు నయ్యుత్సవమునకు వచ్చిరి.

రాజఉవాచ|

శృణుథ్వం నృపశార్దూలా యధా కించి ద్ట్రవీమ్యహమ్‌| అస్మిన్షేత్రవరే పుణ్య భుక్తిముక్తి ప్రదే శివే|| 19

హయమేథం మహాయజ్ఞం ప్రాసాదం చైవ వైష్ణవమ్‌| కధం శక్నోమ్యహం కర్తుమితి చింతాకులం మనః|| 20

భవద్భిః సుపహాయైష్తు సర్వమేతత్కరోమ్యహమ్‌|యది యూయం సహాయా మే భవథ్వం నృపసత్తమాః|| 21

అట్లరుదెంచిన రాజులనుగని యీ పుణ్యక్షేత్రము భుక్తిముక్తిప్రదము. ఇందశ్వమేధమునుజేసి విష్ణుప్రాసాద నిర్మాణమును గూడ జేయ కుతూహలపడుచున్నాను. కావున మీరందరూ నాకిందు సహకరింపవలెను.

బ్రహ్మ ఉవాచ|

ఇత్యేవం వదమానన్య రాజరాజస్య ధీమతః| సర్వే ప్రముదితా హృష్టా భూపాస్తే తస్య శాసనాత్‌|| 22

పవృషుర్ధన రత్నైశ్చ సువర్ణ మఱి మౌక్తికైః| కంబలాజిన రత్నైశ్చ రాంకవా స్తరణౖ శ్శుభైః| 23

వజ్రవైడూర్య మాణిక్యైఃపద్మరాగేంద్ర నీలకైః| గజైరశ్వైర్ధనైశ్చాన్యై రథైశ్చైవ కరేణుభిః|| 24

అసంఖ్యేయై ర్భహువిధై ర్ద్రవ్యై రుచ్చావచైస్తధా| శాలివ్రీహి యవైశ్చైవ మాషముద్గ తిలైస్తధా|| 25

సిద్దార్ధ చణకైశ్చైవ గోధూమై ర్శసురాదిభిః| శ్యామాకై ర్మధుకైశ్చైవ నీవారైః సకులత్థకైః|| 26

అన్యైశ్చ వివిధైర్ధాన్యైః గ్రామ్యారణ్యౖః సహస్రశః| బహుధాన్య సహస్రాణాం తండులానాంచ రాశిభిః|| 27

గవ్యస్య హవిషః కుంభైః శతశో7థ సహస్రశః| తధా7న్యైర్వివిధై ర్ద్రవ్యై ర్భక్ష్యభోజ్యాను లేపనైః|| 28

రాజానః పూరయామాసు ర్యత్కించిర్ద్రవ్య సంభ##వైః| తాన్‌ దృష్ట్వా యజ్ఞ సంభారాన్‌ సర్వ సంపత్సమన్వితాన్‌|| 29

యజ్ఞకర్మవిధో విప్రాన్వేద వేదాంగ పారగాన్‌| శాస్త్రేషు నిపుణా న్దక్షా న్కుశలా న్సర్వ కర్మసు|| 30

ఋషీం శ్చైవ మహర్షీం శ్చ దేవర్షీంశ్చైవ తాపసాన్‌| బ్రహ్మచారి గృహస్థౌంశ్చ వానప్రస్థా న్యతీంస్తథా|| 31

స్నాతకాన్‌ బ్రాహ్మణాం శ్చాన్యా నగ్ని హోత్రే సదాస్థితాన్‌| ఆచార్యోపాధ్యాయ వరాన్స్వాధ్యాయ తపసాన్వితాన్‌|| 32

సదస్యాన్‌ శాస్త్ర కుశలాం స్తథా న్యాన్పావకా న్బహూన్‌| దృష్ట్వా తాన్నృపతిః శ్రీమానువాచ స్వపురోహితమ్‌|| 33

బుద్ధిశాలియగు రాజిట్లు పలుకుటకు నృపతులెల్లరు నానందించిరి. అతని శాసనముననుసరించి ధనకనక, రత్న, ముక్తామణి రాసులను అనర్ఘ వజ్రవైడుర్యాదులను, శాలువలను నూతనాంబరములను, నేనుగులపై గుర్రములపై నసంఖ్యాకముగ తరలించుకొని వచ్చరి. నానావిధ ఆహార పదార్థములను నవధాన్యములను, మాష ముద్గ తండుల తిలాదులను, గొనితెచ్చి గాదులను నింపిరి, ఆయజ్ఞ సంభారములను జూచి నృపతి పరమానందభరితుడై మహర్షులను, దేవర్షులను, బ్రహ్మచారి ప్రముఖ చతురాశ్రమస్థులను ఆచార్యోపాధ్యాయ ఋత్విజవర్గమును సర్వశాస్త్రకుశలురయిన సదస్యులను నాశ్రీమంతుడు దర్శింప నానందభరితుడై పురోహితునితో నిట్లనియె.

రాజోవాచ

తతః ప్రయాంతు విద్వాంసో బ్రాహ్మణా వేదపారగాః|

వాజిమేధార్థ సిద్ధ్యర్ధం దేశం పశ్యంతు యజ్ఞియమ్‌|| 34

అశ్వమేధాశ్వమునకు వేదపారగులైన బ్రాహ్మణు లాయా దేశములకేగి పరీక్షింతురుగాక యనెను.

బ్రహ్మోవాచ

ఇత్యుక్త స్సతథా చక్రే వచనం తస్య భూపతేః |హృష్టః స మంత్రిభిః సార్ధం తదా రాజపురోహితః|| 35

తతో య¸° పురోధాశ్చ ప్రాజ్ఞః స్థపతిభిః సహ | బ్రాహ్మణా నగ్రతః కృత్వా కుశలాన్యజ్ఞ కర్మణి|| 36

తం దేశం ధృవరోగ్రామం సప్రతోలి విటంకినమ్‌| కారయామాస విప్రో7సౌ యజ్ఞవాటం యథావిధి|| 37

ప్రాసాదశతసంబాధం మణిప్రవర వేదికమ్‌ | ఇంద్ర సద్మనిభం రమ్యం హేమరత్న విభూషితమ్‌|| 38

స్తంభా న్కనక చిత్రాంశ్చ తోరణాని బృహంతి చ | యజ్ఞాయతన దేశేషు దత్వా శుద్ధం చ కాంచనమ్‌|| 39

అంతః పురాణి రాజ్ఞాం చ నానాదేశనివాసినామ్‌ | కారయామాన ధర్మాత్మా తత్ర తత్ర యథా విధి|| 40

బ్రాహ్మణానాం చ వైశ్యానాం నానాదేశ సమీయుషామ్‌ | కారయామాస విధివచ్ఛాలా స్తత్రాప్యనేకశః|| 41

ప్రీత్యర్థం తస్య నృపతే రాయయుర్మృపసత్తమాః |

రత్నా న్యనేకా న్యాదాయ స్త్రియశ్చా77యయు రుత్సవే|| 42

తేషాం నిర్విశతాం స్వేఘ శిబిరేషు మహాత్మనామ్‌| నదతః సాగరస్యేవ దివి స్సృగ భవ ద్ధ్వనిః|| 43

రాజపురోహితుడానంద భరితుడై రాజులతో బ్రాహ్మణపురస్సరముగా నొక గ్రామప్రాంతమున యజ్ఞవాటమును శాస్త్రీయముగా నిర్మింపజేసెను. అది అనేక రాజప్రాసాదములతో మణిమయములయిన వేదికలతో, బంగరు స్తంభములతో తోరణములతో సుమనోహరముగా శోభిల్లుచుండెను. నానా దేశరాజులకు నంతఃపురములను ఏర్పరచెను. ఆదేవుని సంతోషవరుప నమూల్యమయిన వస్తువులను స్వర్ణరత్నాదులను గాన్కలంగొని వారివారిశిబిరములందు విడిసిరి. అసందడి సముద్రధ్వనినిమించి ఆకాశమంటెను.

నానాదేశాగతులైన బ్రాహ్మణవైశ్యులకును విడుదులను యథావిధిగ నేర్పాటుచేయించెను.

తేషా మభ్యాగతానాం చ స రాజా మునిసత్తమాః | వ్యాదిదేశా77యతనాని శయ్యాశ్చాప్యుపచారతః|| 44

భోజనాని విచిత్రాణి శాలీక్షుయవగోరసైః | ఉపేత్య నృపతిశ్రేష్ఠో వ్యాదిదేశ స్వయం తదా|7 45

తథా తస్మిన్యహాయజ్ఞే బహవో బ్రహ్మవాదినః |యే చ ద్విజాతి ప్రవరా స్తత్రా77సన్ద్విజ సత్తమాః|| 46

సమాజగ్ము స్సశిష్యాస్తా న్ర్పతిజగ్రాహ పార్థివః | సర్వాంశ్చ తాననుయ¸° యావదావసథానితి|| 47

స్వయమేవ మహా తేజా దంభం త్యక్త్వా నృపోత్తమః |

తతః కృత్వా స్వశిల్పం చ శిల్పినో7న్యే చ యే తదా|| 48

కృత్స్నం యజ్ఞవిధిం రాజ్ఞే తదా తసై#్మ న్యవేదయన్‌ | తతః శ్రుత్వా నృపశ్రేష్ఠః కృతం సర్వమతంద్రితః||

హృష్టరోమాభవద్రాజా సహమంత్రిభిరచ్యుతః|| 49

మఱియు నందాగతులైనవారికి శయ్యాసనాదులు మృష్టాన్న సంతర్పణముల నాడేర్పరచెను. ఆయజ్ఞమునకు మహానుభావులు బ్రహ్మవేత్తలు శిష్యులతో నేతెంచిరి. రాజువారికి నెట్టి డాంబికములేక హృదయపూర్వకముగా స్వయముగాస్వగతమెసంగెను. ఆ మీదట శిల్పులు నందు తమ శిల్పనైపుణ్యముం బ్రదర్శించిరి. రాజుమంత్రులతో నేమాత్ర మేమరుపాటులేకుండ నాయజ్ఞసన్నాహముం దిలకించి పులకితాంగుడయ్యె.

బ్రహ్మోవాచ

తస్మి న్యజ్ఞే ప్రవృత్తే తు వాగ్మినో హేతువాదినః | హేతువాదా న్బహూంశ్చక్రుః పరస్పర జగీషవః|| 50

దేవేంద్రస్యేవ విహితం రాజసింహేన భోద్విజాః| దదృశుస్తోరణాన్యత్ర శాతకుంభమయానిచ || 51

శయ్యాసన వికారాంశ్చ సుబహూన్రత్న సందాయాన్‌ | ఘటపాత్రీ కటాహాని కలశాన్వర్ధమానకాన్‌|| 52

నహికశ్చి దసౌవర్ణ మపవ్యద్వసుధాధిపః | యూపాంశ్చ శాస్త్ర పఠితాన్‌ దారవాస్హే మభూషితాన్‌|| 53

ఉపక్షిప్తాన్యథా కాలం విధివద్భూరి వర్చసః| స్థలజా జలజా యే చ పశవః కేచన ద్విజాః|| 54

సర్వానేవ సమానీతా నపశ్యం స్తత్ర తే నృపాః | గాశ్చైవ మహిషీశ్చైవ తధా వృద్ధ స్త్రియోపిచ|| 55

ఔదకానిచ సత్త్వాని శ్వాపదాని వయాంసి చ | జరాయుజాండజాతాని స్వేద జాన్యుద్భిదానిచ|| 56

పార్వతాన్యుపధాన్యాని భూతాని దదృశుశ్చ తే | ఏవం ప్రముదితం సర్వం పశుతో ధనధాన్యతః|| 57

యజ్ఞవాటం నృపా దృష్ట్వా విస్మయం పరమం గతాః|

బ్రాహ్మణానాం విశాం చైవ బహు మిష్టా న్నమృద్భామత్‌|| 58

పూర్ణే శతసహస్రేతు విప్రాణాం తత్రభుంజతామ్‌ | దుందుభిర్మేషునిర్ఘోష న్ముహూర్ముహు రధాకరోత్‌|| 59

విననాదాసకృచ్చాపి దివసే దివసే గతే | ఏవం స వవృధే యజ్ఞ స్తస్య రాజ్ఞస్తు ధీమతః|| 60

అన్నస్య సుబహూన్విప్రాః ఉత్పర్గా న్నిర్గతోపమాన్‌ | దధికుల్యాశ్చ దదృశుః పయసశ్చ హ్రదాంస్తథా|| 61

జంబూద్వీపోహి సకలో నానాజన పదైర్యుతః | ద్విజాశ్చ తత్రదృశ్యంతే రాజ్ఞస్తస్య మహామఖే|| 62

తత్ర యాని సహస్రాణి పురుషాణాం తతస్తతః| గృహీత్వా భాజనం జగ్ముర్బహూని ద్విజసత్తమాః|| 63

శ్రావిణశ్చాపి తే సర్వే సుమృష్ట మణికుండలాః| పర్యవేషయన్ద్విజాతీం శతసోథ సహశ్రః|| 64

వివిధాన్యను పానాని పురుషా యేనుయాయినః |

తే వై నృపోపభోజ్యాని బ్రాహ్మణభ్యో దదుః సహ|| 65

సమాగతాన్వేదవిదో రాజ్ఞశ్చ పృథివీశ్వరాన్‌ | పూజాం చక్రే తదా తేషాం విధివద్భూరి దక్షిణః|| 66

దిగ్దేశాదాగతా న్రాజ్ఞో మహా సంగ్రామ శాలినః | నటనర్తకకాదీంశ్చ గీతస్తుతివిశారదాన్‌|| 67

పత్న్యో మనోరమా స్తస్య పీనోన్నత పయోధరాః | ఇందీవర పలాశాక్ష్యః శరశ్చంద్ర విభాననాః|| 68

కులశీల గుణోపేతాః సహసై#్రకం శతాధికమ్‌ | ఏవం తద్భూత పరమ పత్నీ గణసమన్వితమ్‌|| 69

రత్న మాలాకులం దివ్యం పతాకాధ్వజ సేవితమ్‌ | రత్నహార యుతం రమ్యం చంద్రకాంతి సమప్రభమ్‌|| 70

కరిణః పర్వతాకారా న్మద సిక్తాన్మహాబలాన్‌ | శతశః కోటి సంఘాతై ర్దంతి భిర్దంత భూషణౖః|| 71

వాతవేగ జవైరశ్వైః సింధూజాతైః సుశోభ##నైః శ్వేతాశ్వైః శ్యామ కర్ణైశ్చ కోట్యనేకై ర్జవాన్వితైః|| 72

సన్నద్ధ బద్ధక క్షైశ్చ నానాప్రహరణోద్యతైః | అసంఖ్యేయైఃపదాతైశ్చ దేవపుత్రోపమైస్తథా|| 73

ఇత్యేవం దదృశో రాజా యజ్ఞసంభార విస్తరమ్‌ | ముదం లేభే తదా రాజా సంహృష్టో వాక్యమబ్రవీత్‌|| 74

ఆయజ్ఞ మారంభమునంత సదస్యులొండొరులను గెలువ నిత్యద్బుత శాస్త్రార్థములు గావించిరి. దేవేంద్ర వైభవమును మించిన ఆ యజ్ఞవాట నిరామణశోభను దిలకించి, మంగళార్థములయిన పూర్ణ కలశల వీక్షించి శ్రౌతము చెప్పినట్లు నిలువబడిన దారుమయయూప స్తంభములంగని, జటస్థలములందు బుట్టిన యజ్ఞపశువుల నావులు గేదెల నాలోకించి యజ్ఞమున కేతెంచిన ప్రజలానందభరితులైరి. జరాయుజాదులు నాల్గురకముల జీవులు పర్వతములందు పండెడి ధాన్యములు మొదలయిన యజ్ఞసంభారము లనేకములం జూచి రాజు లాశ్చర్యానంద వివశులైరి. బ్రాహ్మణాదులకు మృష్టాన్న సంతర్పణములు జరిగెను. ఇట్లు విప్రసహస్ర సంకులమైన యయ్యజ్ఞవాటమునందు మంగళార్థములైన దుందుభి ద్వనులు వినసొంపైనవి. పాలు పెరుగు లందేరులై ప్రవహించెను. జంబూద్వీపమంతయు నట కేతెంచినట్లు కనిపించెను. విప్రులు సువర్ణ మణికుండలాదులను వేలకొలది బహుమానములం దందుకొని యేగిరి. అందు బ్రాహ్మణులు రాజ భోజ్యములయిన విందులారగించిరి. ఋత్విజులకు భూరిదక్షిణ లొసంగెను. మరియు నాఱడు రాజులకు గూడ మిక్కిలి సత్కరించెను. ఆరాజు నంతఃపురము యజమాన నత్నీగణము కులశీలసంపన్నము పరమశోభన స్వర్ణ రత్నాభరణములందాల్చి ముక్తారత్నహారములు మెఱయ నాయజ్ఞమున కద్బుతశోభను సంపాదించెను. మహాగజములు సింధు జాతములైన అశ్వములు పలురంగులు గలవి నానావిధాయుధధారులయిన భటులు నా యజ్ఞమునకు రక్ష యిచ్చు చుండ జూచి యా యజమాని మానవేశ్వరుడుప్పొంచుగు నిట్లనియె.

రాజోవాచ

ఆనయుధ్వం హయశ్రేష్ఠం సర్వలక్షణ లక్షితమ్‌ | చారయధ్వం పృథివ్యాం వై రాజ పుత్రాః సుసంయతాః|| 75

విద్వద్భి ర్ధర్మ విద్ఛిశ్చ ఆత్ర హోమో విధేయతామ్‌|

కృష్ణచ్ఛాగం చ మహిషం కృష్ణసార మృగం ద్విజాన్‌|| 76

అనడ్వాహం చ గాశ్చైవ సర్వాంశ్చ పశుపాలకాన్‌ | ఇష్టయశ్చ ప్రవర్తంతాం ప్రాసాదం వైష్టవం తతః|| 77

సర్వమేతచ్చ విప్రేభ్యో దీయతాం మనసేప్సితమ్‌ | స్త్రియశ్చ రత్నకోట్యశ్చ గ్రామాశ్చ నగరాణి చ|| 78

సమ్యక్‌ సమృద్ధ భూమ్యశ్చ విషయాశ్చైవ మర్థినాం | అన్యాని ద్రవ్యజాతాని మనోజ్ఞాని బహునిచ|| 79

సర్వేషాం యాచమానానాం నాస్తి హ్యేతన్న భాషయేత్‌| తావత్రృ వర్తతాం యజ్ఞో యావద్దేవః పురా త్విహ|

ప్రత్యక్షం మమ చాభ్యేతి యజ్ఞ స్యాస్య సమీపతః|| 80

బ్రహ్మోవాచ

ఏవ ముక్త్వా తదా విప్రాః రాజసింహో మహాభుజః|

దదౌ సువర్ణ సంఘాతం కోటినాం చైవ భూషణమ్‌|| 81

కరేణు శత సాహస్రం వాజినో నియతాని చ | అర్భుదం చైవ వృషభం స్వర్ణ శృంగీశ్చ ధేనుకాః|| 82

సురూపాః సురభీశ్చైవ కాంస్య దోహాః పయస్వినీః|

ప్రాయచ్ఛత్స తు విప్రేభ్యో వేదవిద్భ్యో ముదాయుతః|| 83

వాసాంసి చ మహార్హాణి రాంకభవాస్తరణానిచ | సుశుక్లానిచ శుభ్రాణి ప్రవాళ మణి ముత్తమమ్‌|| 84

సర్వశుభలక్షణలక్షితమైన అశ్వమేధాశ్వమును గొనిరండు, సుసన్నద్ధులయి రాజకుమారు లాగుఱ్ఱము వెంట రక్షణ యిచ్చును ననుగమింతురుగాక ధర్మశాస్త్రవిదులయిన విప్రులు ఋత్విజు లిక్కడ హోమాదులను నిర్వర్తింపుడు నల్లమేక, నల్లలేడి, జాతిగల యెద్దు దున్నపోతు గోవులు గోపాలురును నిందు గొనిరండు. ఇష్టి విశేషములను జరిపింపుడు. ఆమీద విష్ణుదేవాలయ నిర్మాణము నిర్వర్తింపబడును. విప్రులేది కోరిన నదియెల్ల నిండు, మఱి యిందు వచ్చు యాచకు లెల్లరకు లేదనకుండ సర్వద్రవ్యములు నీయబడుగాక. నాకు భగవంతుడు విష్ణువు సాక్షాద్దర్శనమిచ్చు దాక యీ యజ్ఞము జరుగవలసినదే యని యారాజు బంగారురాసులను గజతురగ గోవృషభాదులను కోట్లు నర్బుదములుగా దానములు గావించెను. గోవుల కొమ్ములకు బంగారు తొడుగులు పాలుపితుకుటకు కంచుబిందెలు జతసేసి అనేక గోవులను వేదవిదుల కొసంగెను.

ఆదదాత్స మహాయజ్ఞే రత్నాని వివిధానిచ | వజ్ర వైడూర్య మాణిక్య ముక్తికాద్యాని యానిచ|| 85

అలంకారవతీః శుభ్రాః కన్యా రాజీవ లోచనాః | శతాని పంచ విప్రేభ్యో రాజా హృష్టః ప్రదత్తవాన్‌||

స్త్రియః పీన పయోభారాః కంచుకైః స్వస్తనావృతాః|| 86

మధ్య హీనాశ్చ సుశ్రోణ్యః పద్మపత్రా యతేక్షణాః | హావ భావాన్విత గ్రీవా బహ్వ్యో వలయ భూషితాః|| 87

పాద నూపుర సంయుక్తాః పట్టదుకూల వాససః | ఏకైకశోదదాత్త స్మిన్కామ్యాశ్చ కామినీ ర్బహూః|| 88

ఆర్ధిభ్యో బ్రాహ్మణాదిభ్యో హయమేధే ద్విజో త్తమాః|

భక్ష్యం భోజ్యంచ సంపూర్ణం నానాసంభారసంయుతమ్‌|| 89

ఖండ ఖాద్యాన్యనేకాని స్విన్న పాకాంశ్చ పిష్టకాన్‌|| 90

అన్నాన్యన్యాని మేధ్యాంశ్చ ఘృత పూరాంశ్చ ఖాండవాన్‌|| 91

మధురాం స్తర్జితాన్పూపానన్నం మృష్టం సుపాకికమ్‌|

ప్రీత్యర్థం సర్వసత్త్వానాం దీయతేన్నం పుసః పునః|| 92

దత్తస్య దీయమానస్య దనస్యాంతో న విద్యతే | ఏవం దృష్ట్వా మహా యజ్ఞం దేవ దైత్యాః సచారణాః|| 93

గంధర్వా ప్సరసః సిద్దా ఋషయశ్చ ప్రజేశ్వరాః|

విస్మయం పరమం యాతా దృష్ట్వా క్రతువరం శుభమ్‌|| 94

పురోధా మంత్రిణో రాజా హృష్టా స్తత్రైవ సర్వశః | న తత్ర మలినః కశ్చిన్న దీనో న క్షుధాన్వితః|| 95

న వోపసర్గో గ్లాని ర్నా೭೭ధయో వ్యాధయస్తథా | నాకాలమరణం తత్ర నదంశో నగ్రహా విషమ్‌|| 96

హృష్ట పృష్టజనాః సర్వే తస్మి న్రాజ్ఞో మహోత్సవే | యేచ తత్ర తపః సిద్ధా మునయ శ్చిర జీవివః ||97

నజాతం తాదృశ్యం యజ్ఞం ధనధాన్య సమన్వితమ్‌ | ఏవం సరాజా విధివద్వాజి మేధం ద్విజోత్తమాః||

క్రతుం సమాపయామాస ప్రాసాదం వైష్ణవం తథా|| 98

ఇతి శ్రీబ్రహ్మపురాణ ప్రాసాదకరణం నామ సప్త చత్వారింశోధ్యాయః

@ƒ«sLçRi xqsVª«sLñRi ª«sVßÓ᪫sV¸R…WLi‡ÁLS˳ÏÁLRiß᪫sVVÌÁƒ«sV ¾»½ÌýÁ¬s aRP¸R…Wùƒ«sƒyxqsòLRiß᪫sVVÌÁƒ«sV, xmsgRi²R…ª«sVVÌÁƒ«sV ª«súÇÁ\®ªs²³R…WLRiùg][®ªs[Vµ³j…NSµj… LRi»R½õª«sVVÌÁƒ«sV ƒ«sª«sVWÌÁùª«sVV ÌÁƒ«s®ªs[V¸R…Vª«sVVÌÁ ¬s¿Á胫sV. ryÌÁLiNRPX»R½ NRPƒyùµyƒ«sª«sVVÌÁV }qs|qsƒ«sV. xqsLS*LigRi xqsVLiµR…LRiVÌÁLiVVƒ«s ¸R…VLigRiƒyª«sVßáVÌÁƒ«sV „sÍØxqsª«s»R½VÌÁƒ«sV ÀdÁLRiÌÁ»][ LRi„sNRPÌÁ»][ ¥¦¦¦LRiZNP[¸R…VWLRi ƒ«sWxmsoLRi NRPLiNRPßصR…VÌÁ»][ gSƒ«säÖÁ¿Á胫sV. ˳ÏÁORPQQù ˳Ü[ÇÁù ¿][xtsQù ÛÍÁ[¥¦¦¦ù»R½øª«sVVÌÁLiVVƒ«s ¿RÁ»R½VLji*µ³R… ª«sVXuíyƒ«sõ xqsLi»R½LRiöß᪫sVV xmnsVX»R½ Fy¸R…Vryxmspxms xqsª«sVXµôðR…ª«sVVgRi gS„sLi¿Áƒ«sV. xqsLRi*ÒÁƒ«s xqsLi»R½XzmsògRi ƒ«sƒ«sõµyƒ«sª«sVV }qs|qsƒ«sV. A µyƒ«sª«sVVÌÁ NRPLi»R½V µR…Lji gSƒ«sLSµy¹¸…Vù. C @µR…V÷é»R½ ¸R…VÇìÁ \®ªs˳ÏÁª«sª«sVVƒ«sV gSLiÀÁ ®µ…[ª«s»R½ÌÁV \®µ…»R½VùÌÁV ¿yLRißáVÌÁV gRiLiµ³R…LRiV*ÌÁxms=LRixqsÌÁV zqsµôðR…VÌÁV ‡ÁVVxtsvÌÁV LSÇÁÙÌÁV ®ƒsLi¾»½[¬s ¸R…WaRPèLRiùª«sVLiµj…Lji. ‡ÁVV¼½*gRi*LæRiª«sVV xmsoL][z¤¦¦¦»R½ ª«sVLiú¼½ ryª«sVLi»R½VÌÁV ƒ¯Liµj…ƒ«s ¸R…Wƒ«sLiµR…ª«sVVƒ«sNRPV x¤¦¦¦µôR…VÌÁV ÛÍÁ[ª«so. @LiµR…V ƒ¯²R…ÌÁV ª«sÌÁVª«sÌÁV ª«sWzqsƒ«sªy²R…V µk…ƒ«sV²R…V ƒyNRPÖÁ g]ƒ«sõªy²R…V, B‡Á÷LiµR…VÌÁNRPV ÍÜ[\®ƒsƒ«sªy²R…V. µj…gRiVÌÁVxms²T…ƒ«sªy²R…V. ªyù´j…úgRixqsVò²R…V ª«sVƒ¯[ªyùµ³j… úgRixqsVò²R…V\®ƒsƒ«s ÒÁ„s ¹¸…VVNRPä²R…Vƒ«sV ÛÍÁ[²R…V.

ఆ రాజ్యమున నకాలమరణము గ్రహావేశము భూతప్రేత పిశాచావేశము విషస్పర్శము నన్నది లేనేలేదు. హృష్ట పుష్ట జనసంకులమాఱని దేశము. మునులు తమతమతసేయు తపస్సులందు బరమసిద్ధిని బడసిరి. చిరంజీవులైరి. ఎన్నడు నీవరకిట్లు దనధాన్య సమృద్ధముగ యజ్ఞము జరిగినది లేదు. ఇట్లా రాజేంద్రు డింద్రద్యుమ్నుడు యదావిధిగ నయ్యశ్వమేధమును విష్ణు ప్రాసాదమును నిర్వర్తించి జగన్మంగళము సేకూర్చెను.

ఇది బ్రహ్మపురాణమునందు ప్రాసాదకరణము నలుబది యేడవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters