Brahmapuranamu    Chapters   

షట్‌ చత్వారింశో7ధ్యాయః

పురుషోత్తమ క్షేత్రవర్ణనమ్‌

మునయ ఊచుః

శ్రోతుమిచ్ఛామహే దేవ కథాశేషం మహీపతేః | తస్మినేక్షత్రవరే గత్వా కించకార నరాధిపః || 1

ఆ మీదికథను, అ క్షేత్రరాజమునకేగి ఇంద్రద్యుమ్న ప్రభుడేమి చేసెను? తెలుపుమని మునులడిగిరి.

బ్రహ్మోవాచ

శృణుధ్వం మునిశార్దూలాః ప్రవక్ష్యామి సమాసతః | క్షేత్ర సందర్శనం చైవ కృత్యం తస్య చ భూపతేః || 2

గత్వా తత్ర మహీపాలః క్షేత్రే త్రైలోక్యవిశ్రుతే | దదర్శ రమణీయాని స్థానాని సరితస్తథా || 3

నదీతత్ర మహాపుణ్యా వింధ్యపాద వివిర్గతా | స్విత్రోపలేతి విఖ్యాతా సర్వపాపహరా శివా || 4

గంగాతుల్యా మహాస్రోతా దక్షిణార్ణవ గామినీ | మహానదీతి నామ్నా సా పుణ్యతోయా సరిద్వరా || 5

దక్షిణస్యో దధే ర్గర్భం గతా77వర్తాతి శోభితా| ఉభయోస్తటయోర్యస్యా గ్రామాశ్చ నగరాణిచ| 6

దృశ్యంతే మునిశార్దూలాః సుసస్యాః సుమనోహరాః| హృష్ట పుష్ట జనాకీర్ణా వస్త్రాలంకార భూషితాః|| 7

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రా స్తత్ర పృథక్పృథక్‌ | స్వదర్మ నిరతాః శాంతా దృశ్యంతే శుభలక్షణాః|| 8

తాంబూల పూర్ణవదనా మాలాదామ విబూషితాః | వేదపూర్ణముఖా విప్రాః సషడంగ పదక్రమాః|| 9

అగ్ని హోత్రరతాః కేచిత్కేచిదౌపాసనక్రకియాః | సర్వశాస్త్రార్ధ కుశలా యజ్వానో భూరిదక్షిణాః|| 10

చత్వరే రాజమార్గేషు వనే షూప వనేషుచ| సభామండల హర్మ్యేషు దేవతాయతనేషు చ|| 11

ఇతిహాస పురాణాని వేదాః సాంగాః సులక్షణాః| కావ్యశాస్త్ర కథాస్తత్ర శ్రూయంతే చ మహాజనైః|| 12

స్త్రియ స్తద్దేశవాసిన్యో రూప¸°వన గర్వితాః | సంపూర్ణ లక్షణోపేతా విస్తీర్ణశ్రోణిమండలాః|| 13

సరోరుహ ముఖాః శ్యామాః శరచ్చంద్రనిభాననాః | పీనోన్నత స్తనాః సర్వాః సమృద్ధా చారుదర్శనాః|| 14

సౌవర్ణ వలయాక్రాంతా దివ్యైర్వసై#్త్ర రలంకృతాః | కదళీగర్భ సంకాశాః పద్మకింజల్క సప్రభాః|| 15

బింబాధరపుటాః కాంతాః కర్ణాంతాయత లోచనాః | సుముఖా శ్చారుకేశాశ్చ హావభావావ నామితాః || 16

కాశ్చిత్పద్మ పలాశాక్ష్యః కాశ్చిదిందీ వరేక్షణాః | విద్యు ద్విస్పష్ట దశనాస్త స్వంగ్యశ్చ తథా7పరాః||17

కుటిలాలక సంయుక్తాః సీమంతేన నిరాజతాః | గ్రీవాభరణ సంయుక్తా మాల్యదామ ­భూషితాః|| 18

కుండలై రత్నసంయుక్తైః కర్ణపూరై ర్మనోహరైః | దేవయోషిత్రృతీకాశా దృశ్యంతే శుభలక్షణాః || 19

దివ్యగీత వరైర్ధన్యైః క్రీడమానా వరాంగనాః | ­dణావేణు మృదంగైశ్చ పణవైశ్చైవ గోముఖైః|| 20

శంఖదుందుభి నిర్ఘోషై ర్నానానావాద్యై ర్మనో హరైః |

క్రీడయంత్య స్పదాహ్వృష్టా ­లాసిన్యః పరస్పరమ్‌|| 21

ఏవమాది తథా7నేక గీతవాద్య ­శారదాః | దివారాత్రౌ సమాయుక్తాః కామోన్మత్తా వరాంగనాః|| 22

భిక్షు వైఖానసైః సిద్ధైః స్నాతకై ర్ర్బహ్మచారిభిః| మంత్రసిద్ధైః తపః సిద్ధైర్యజ్ఞ సిద్ధై ర్ని షే­తమ్‌|| 23

ఇత్యేవం దదృశే రాజా క్షేత్రం పరమ శోభనమ్‌ | అత్రైవా77రాధయిష్యా­ు భగవంతం సనాతసమ్‌|| 24

జగద్గురుం పరం దేవం పరం పారం పరం పదమ్‌ | సర్వేశ్వరేశ్వరం ­ష్ణుమనంత మపరాజితమ్‌|| 25

ఇదం తన్మానసం తీర్థం జ్ఞాతం మే పురుషోత్తమమ్‌ | కల్పవృక్షో మహాకాయో న్యగ్రోధో యత్ర తిష్ఠతి|| 26

ప్రతిమా చేంద్రనీలాఖ్యా స్వయం దేవేన గోపితా | న చాత్ర దృశ్యతే చాన్యా ప్రతిమా వైష్ణ­d శుభా || 27

తథా యత్నం కరిష్యా­ు యథా దేవో జగత్పతిః | ప్రత్యక్షం మమ చాభ్యేతి ­ష్ణుః సత్యపరాక్రమః || 28

యజ్ఞై ర్దానై స్తపోభిశ్చ హోమై ర్ధ్యానై స్థతా7ర్చనైః | ఉపవాసైవ్చ ­ధివ చ్చరేయం వ్రతముత్తమమ్‌|| 29

అనన్య మనసా చైవ తన్మనా నాన్యమానసః | ­ష్ణ్వాయతన ­న్యాసే ప్రారంభం చ కరోమ్యహమ్‌|| 30

ఇతి శ్రీబ్రహ్మపురాణే క్షేత్రవర్ణనం నామ షట్‌ చత్వారింశో7ధ్యాయః

బ్రహ్మ యిట్లనియె

మునులార ­నుండు. ఇంద్రద్యుమ్న మహారాజటకేగి చక్కని ప్రదేశములను, ­ంధ్య పాదమునుండి వెడలెడు పుణ్యనదులను దర్శించెను, సర్వపాపహారిణి గంగ కీడైనది దక్షిణ సముద్రమున సంగ­ుంచునదియగు ''స్విత్రోవల'' అను నది యట గలదు. దాని కిరువైపుల తీరములందు సస్యశ్యామలములు మనోహరములు నగు గ్రామములు నగరములు కనిపించును. అందలి ప్రజలు చక్కని వలువలు నగలునుం దాల్చి పుష్టియుం దుష్టియు గొనియుందురు. చతుర్వర్ణములవారు స్వన్యదర్మనిరతులై శుభలక్షణులై కనిపింతురు. నిరంతరతాంబూల చర్వణము నిరంతరపుష్పమాలాధారణము వారి ప్రత్యేకశుభచిహ్నము. ­ప్రులు వేద పూర్ణముఖులు - షడంగ­దులు. పదక్రమల జటాఘన పాఠులు. నిత్యాగ్నిహోత్రులుఉపాసకులు సర్వశాస్త్రార్థ సమర్థులు బూరిదక్షిణలొసంగినదీక్షితులు సోమయాజులుచయనులు.

రాజ­dథులందు నలుదారులు కలిసిన చోట మండపములందు వనములందు ద్యానవనములందు సభలందు మేడలందు దేవాలయములందు నెట­న్ననను ఇతిహాస పురాణ ప్రవచనము సాంగ వేదాధ్యయనము కావ్యశాస్త్రగోష్ఠులు ­నిపించును.

ఆ దేశమందలి సుందరులు చక్కని రూపము ¸°వనముంగొని ఉత్తమ స్త్రీ సాముద్రిక లక్షణ లక్షితలై శరత్కాల చంద్రబింబాననలై దివ్యవస్త్రముల దాల్చి బంగారు కంకణములం ధరించి కదగర్భమున కిడగు బంగరు చాయయు ఎఱ్ఱదామర పూలపుప్పొడికెనయగు నరుణారుణ వర్ణమును గల మేనులతో నాకర్ణాంత నేత్రములతో చక్కని నెమ్మోములతో నల్పెక్కిన వేనలితో దొండపండునకీడగు పెదవులతో హావభావ ­లాసములతో, కొందఱు తామరరేకుల కెనయగు నయనశోభ గలవారు కొందరు నల్లగలువరేకుల కీడగుకాటుక కండ్ల యందము గలవారునై యుంగరాల్దిరిగిన ముంగురులతో మెఱపట్లు మెఱయు పలువరుస గల్గి పీనోన్నతస్తనభారమున సువర్ణ మణిమయకంఠ హారములు సుమమాలలుందూగ మణిమయ కుండల కాంతులు చెక్కుటద్దముల ­ుఱు­ుట్లు గొన సాక్షాద్దేవనుందరులోయన దర్శన­ుత్తురు. ­dణావేణు మృదంగ వాద్యములు జతసేసి భక్తిభరితములైన చక్కని పాటల నాటలం బరమాత్మను పరవశింపజేయుదురు.

రాత్రియనక పవలనక నచట శంఖదుందుభి నిర్ఘోషము ­నిపించును. కామోన్మత్తమైన అ­్వలాసినుల నృత్య ­లాసము గానమాధుర్యమును ననీదృశము. భిక్షువులు వైఖానసులు స్నాతకులు బ్రహ్మచారులు సిద్ధులు ­dరువారననేల మంత్రసిద్ధులు రససిద్ధులు ఘటికాపాదుకా సిద్ధులు నచట స్వా­ు పరివారమై సే­ంతురు.

ఇట్టి దివ్యక్షేత్రమును దర్శించి యారాజు నిజముగ నిదియే మానసక్షేత్రము. ఇది పురుషోత్తమము. తెలిసినది నాకిది తెలిసినదని యప్పొంగి మఱ్ఱి నీడకేగి ఇంద్రనీలమణిమయమగు నీ నీలమేఘ శరీరుని మూర్తింగని ఆ కల్యాణ మూర్తి నాకు గోచరింప యత్నమొనర్తుగాక యని జన్నములొనర్చుదును. తపములాచరింతును. హోమములసేయుదును. ధ్యానింతును. ఉపవసించి యర్చనలు నొనరింతుగాక యని అనన్య మనస్కుడై ­ష్ణ్వాలయ నిర్మాణము గా­ంతునుగాకయని నిశ్చయించెను.

ఇది బ్రహ్మపురాణమున క్షేత్రవర్ణమను నలుబదియారవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters