Brahmapuranamu    Chapters   

చతుశ్చత్వారింశో7ధ్యాయః

పురుషోత్తమక్షేత్రదర్శనమ్‌

బ్రహ్మోవాచ

తస్యాం స్సనృపతిః పూర్వం కుర్వన్‌రాజ్య మనుత్తమమ్‌

పాలయామస మతిమాస్ర్పజాఃః పుత్రా నివౌరసాన్‌ || 1

సత్యవాదీ మహాప్రాజ్ఞ శ్శూర స్సర్వగుణాకరః | మతిమాన్‌ ధర్మసంపన్న స్సర్వశాస్త్రభృతాం వరః || 2

సత్యవాన్‌ శీలవాన్‌దాంత శ్ర్శీమా న్పరపుంజయః

ఆదిత్య ఇవతేజోభీ రూపై రాశ్వినయోరివ || 3

వర్ధమానసురైశ్వర్య శ్శ క్రతుల్య పరాక్రమః | శారదేందురివా77భాతి లక్షణౖ స్సమలంకృత || 4

అహర్తా సర్వయజ్ఞానాం హయమేధాదికృత్తథా| దానైర్యజ్ఞై స్తపోభిశ్చ తత్తుల్యో నాస్తిభూపతిః || 5

సువర్ణమణి ముక్తానాం గజాశ్వానాం చభూపతిః | ప్రదదౌ విప్రముఖ్యేభ్యో యాగే యాగే మహాధనమ్‌ || 6

హస్త్యశ్వరథముఖ్యానాం కంబలాజిన వాససామ్‌ | రత్నానాం ధనధాన్యానా మస్తస్తస్య నవిద్యతే || 7

ఏవం సర్వధనైర్యుక్తో గుణౖః సర్వైరలంకృతః | సర్వకామసమృద్దాత్మా కుర్వన్‌ రాజ్య మకంటకమ్‌ || 8

తస్యేయం మతిరుత్పన్నా సర్వయోగేశ్వరం హరిమ్‌ | కథమారాథయిష్యామి భుక్తిముక్తిప్రదమ్‌ ప్రభుమ్‌ || 9

విచార్య సర్వశాస్త్రాణి తంత్రా ణ్యాగమవిస్తరమ్‌ | ఇతిహాస పురాణాని వేదాంగానిచ సర్వశః || 10

ధర్మశాస్త్రాణి సర్వాణి నియమానృషిభాసితాన్‌ | వేదాంగాని చశాస్త్రాణి విద్యాస్థౌనాని యానిచ || 11

గురుం సంసేవ్య యత్నేన బ్రాహ్మణాన్వేద పారగాన్‌ | అధాయ పరమాం కాష్ఠాం కృతకృత్యో7భవత్తదా || 12

సంప్రాప్య పరమం తత్త్వం వాసుదేవాఖ్య మవ్యయమ్‌ | భ్రాంతిజ్ఞానా దతీతస్తు ముముక్షుః సంయతేంద్రియః || 13

కథమారాధయిష్యామి దేవదేవం సనాతనమ్‌ | పీతవస్త్రం చతుర్బాహుం శంఖ చక్ర గదాధరమ్‌ || 14

వనమాలావృతోరస్కం పద్మపత్రాయలేక్షణమ్‌ | శ్రీవత్సోర స్సమాయుక్తం ముకుటాంగద శోభితమ్‌ || 15

స్వపురాత్సతు నిష్ర్కాంత ఉజ్జయిన్యాః ప్రజాపతిః | బలేన మహతా యుక్తః సభృత్యః సపురోహితః || 16

అనుజగ్ముస్తు తం సర్వే రథినః శస్త్రపాణయః | రథైర్విమాన సంకాశైః పతాకాధ్వజసేవితైః || 17

సాదినశ్చ తథా సర్వే ప్రాసతోమర పాణయః అశ్వైః పవనసంకాశైః అనుజగ్ముస్తు తంనృపమ్‌ || 18

హిమవత్సంభ##వై ర్మత్తైర్వారణౖః పర్వతోపమైః | ఈషాదంతైః సదా మత్తైః ప్రచండైః షష్టిహాయనైః || 19

హేమకక్షైః సపతాకైర్ఝంటారవ విభూషితైః | అనుజగ్ముశ్చ తం సర్వే గజయుద్ద విశారదాః || 20

అసంఖ్యేయాశ్చ పాదాతా ధనుప్ప్రాసాసి పాణయః | దివ్య మాల్యాంబరధరా దివ్యగంధాను లేపనాః || 21

అనుజగ్నుశ్చ తం సర్వే యువానో మృష్టకుండలాః | సర్వాస్త్రకుశలాః శూరాః సదా సంగ్రామ లాలసాః || 22

అంతఃపుర నివాసివ్యః స్త్రియః సర్వాః స్వలంకృతాః | బింబోష్ఠ్చ్య శ్చారు దశనాః సర్వాభరణ భూషితాః || 23

దివ్యవస్త్రధరాః సర్వాదివ్య మాల్య విభూషితాః | దివ్యగంధాను లిప్తాంగాః శరచ్చంద్ర నిభావనాః || 24

సుమధ్యమాశ్చారు వేషాశ్చారు కర్ణాలకాంచితాః | తాంబూల రంజిత ముఖా రక్షిభిశ్చ సురక్షితాః || 25

యానై రుచ్చావచై శ్శుభ్రైర్మణికాంచన భూషితైః | ఉసగీయమానాస్తా స్సర్వాః గాయనైః స్తుతిపాఠకైః || 26

వేష్టితా శ్శస్త్రహసై#్తశ్చ పద్మపత్రాయతేక్షణాః | బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా అనుజగ్ముశ్చతంనృపమ్‌ || 27

వణిగ్గ్రామగణా స్సర్వే నానాపురనివాసినః | ధనై రత్నై స్సువర్ణైశ్చ సదారాః సపరిచ్చదాః || 28

అస్త్ర విక్రయకాశ్చైవ తాంబూల పణ్యజీవినః | తృణ విక్రయకాశ్చైవ కాష్ఠవిక్రయకారకాః || 29

రంగోపజీవినః సర్వే మాంస విక్రయిణస్తథా | తైలవిక్రయకాశ్చైవ వస్త్రవిక్రయకాస్తథా || 30

ఫలవిక్రయిణశ్చైవ పత్రవిక్రయిణస్తథా | తథా జవసహారాశ్చ రజకాశ్చ సహశ్రసః || 31

గోపాలా నాపితాశ్చైవ తథా7న్యేవస్త్ర సూచకాః | మేషపాలా శ్చాజపాలా మృగపాలాశ్చ హాంపకాః || 32

ధాన్య విక్రయిణశ్చైవ సక్తు విక్రయిణశ్చయే | గుడవిక్రయికాశ్చైవ తథాలవణ జీవినః || 33

గాయనా నర్తకాశ్చైవ తథామంగళపాఠకాః | శైలూషాః కథకాశ్చైవ పురాణార్థ విశారదాః || 34

కవయః కావ్యకర్తారో నానాకవ్య విశారదాః | విషఘ్నా గారుడాశ్చైవ నానారత్న పరీక్షకాః || 35

వ్యోకారా స్తామ్రకారాశ్చ కాంస్యకారాశ్చ రూఠకాః | కౌషకారా శ్చిత్రకారాః కుందకారాశ్చ పావకాః || 36

దండకారాశ్చాసికారాః సురాధూతోవ జీవనః | మల్లా దూతాశ్చ కాయస్థాయే చా7న్యే కర్మకారిణః || 37

తంతువాయా రూపకారా వార్తికాసై#్తల పాఠకాః | లావజీవాసై#్తత్తిరికా మృగపక్ష్యుపజీవనః || 38

గజవైద్యాశ్చ వైద్యాశ్చ నరవైదాశ్చయే నరాః | వృక్షవైద్యాశ్చ గోవైద్యా యేచాన్యే ఛేదదాహకాః || 39

ఏతే నాగరకాః సర్వే యే చాన్యే నాను కీర్తితాః | అనుజగ్ముస్తు రాజానం సమస్త పురవాసినః || 40

యథా వ్రజంతం పితరం గ్రామాంతర సముత్సుకమ్‌ | అనుయాంతి యధా పుత్రాస్తథా తం తే7పి నాగరాః || 41

ఏవం స నృపతిః శ్రీమా స్వృతః సర్వై ర్మహాజనైః హస్త్యశ్వ రథపాదాతై ర్జగామ చ శ##నైః శ##నైః || 42

ఏవం గత్వా స నృపతిః దక్షిణస్యోదధేస్తటమ్‌ | సర్వైసై#్తర్దీర్ఘకాలేన బలైరనుగతః ప్రభుః 43

సాగరవర్ణనమ్‌

దదర్శసాగరం రమ్యం నృత్యంత మివచ స్థితమ్‌ | అనేకశతసాహసై#్రరూర్మిభిశ్చ సమాకులమ్‌ || 44

నానారత్నాలయం పూర్ణం నానాప్రాణి సమాకులమ్‌ | వీచీతరంగ బహుళం మహాశ్చర్య సమన్వితమ్‌ || 45

తీర్థరాజం మహాశబ్ద మపారం సుభయంకరమ్‌ | మేఘబృంద ప్రతీకాశ మగాధం మకరాలయమ్‌ || 46

మత్స్యైః కూర్మైశ్చ శంఖైశ్చ శుక్తికా నక్రశంకుభిః |

శింశుమారైః కర్కటైశ్చ వృతం సర్పై ర్మహావిషైః || 47

లవణోదం హరేః స్థానం శయనస్య నదీపతిమ్‌ | సర్వపాపహరం పుణ్యం సర్వవాంఛాఫలప్రదమ్‌ || 48

అనేకావర్త గంభీరం దానవానాం సమాశ్రయమ్‌ | అమృతస్యారణిం దివ్యం దేవయోని మపాం పతిమ్‌ || 49

విశిష్టం సర్వభూతానాం ప్రాణినాం జీవధారణమ్‌ | సుపవిత్రం పవిత్రాణాం మంగళానాంచ మంగళమ్‌ || 50

తీర్థానాముత్తమం తీర్థ మవ్యయం యాదసాం పతిమ్‌|చంద్రవృద్దిక్షయే యద్వత్‌ తస్యమానంప్రతిష్ఠితమ్‌ || 51

అభేద్యం సర్వభూతానాం దేవానా మమృతాలయమ్‌ | ఉత్పత్తి స్థిత సంహార హేతుభూతం సనాతనమ్‌ || 52

ఉపజీవ్యం చ సర్వేషాం పుణ్యం నదనదీపతిమ్‌ || దృష్ట్వా తం నృపతిశ్రేష్ఠో విస్మయం పరమంగతః || 53

నివాస మకరోత్తత్ర వేలా మాసాద్య సాగరీమ్‌ | పుణ్య మనోహరే దేవే సర్వభూమి గుణౖర్యుతే || 54

వృతం శాలైః కదంబైశ్చ పున్నాగైః సరళద్రుమైః | పనసైర్నారికేళైశ్చ వకుళైర్నాగకేసరైః || 55

తాలైః పిప్పలః ఖర్జూరై ర్నారంగై ర్బీజపూరకైః | శాలై రామ్రాతకై ర్లోధ్రైర్వకుళై ర్బహువారకైః 56

కపిత్థైః కర్ణికారైశ్చ పాటలాశోక చంపకైః | దాడిమైశ్చ తమాలైశ్చ పారిజాతైస్తధా7ర్జునైః || 57

ప్రాచీనామలకై ర్బిల్వైః ప్రియంగు వటఖాదిరైః | ఇంగుదీ సప్తవర్ణైశ్చ అశ్వత్థాగస్త్యజంబుకైః || 58

మధుకైః కర్ణికారైశ్చ బహువారైః సతిందుకైః పలాశబదరైర్నీపైః సిద్ధనింబ శుభాంజనైః || 59

వారకైః కోవిదారైశ్చ భల్లాతామలకై స్తథా | ఇతి హింతాలకాంకొలైః కరంజైః సవిభీతకైః || 60

ససర్జ మధుకాశ్మర్యైః శాల్మలీ దేవదారుభిః | శాఖోటకైర్నింబవటైః కుంబీ కోష్ఠహరీతకైః || 61

గుగ్గులైశ్చందనై ర్వృక్షైస్తథైవాగరు పాటలైః | జంబీర కరుణౖర్వృక్షై స్తింత్రిణీ రక్తచందనైః || 62

ఏవం నానావిధైర్వృక్షై స్థథా7న్యై ర్బహుపాదపైః | కల్పద్రుమైర్నిత్యఫలైః సర్వర్తు కుసుమోత్కరైః || 63

నానాపక్షీరుతై ర్దివ్యైర్మత్తకోకిలనాదితైః | మయూర వరసంఘష్టైః శుకసారికసంకులైః || 64

హారితైః భృంగరాజైశ్చ చాతకైర్బహు పుత్రకైః | జీవంజీవకకాకోలైః కలవింకైః కపోతకైః || 65

ఖగైర్నానావిథైశ్చాన్యైః శ్రోత్రరమ్యైర్మనోహరైః | పుష్పితాగ్రేషు వృక్షేషు కూజద్భి శ్చార్వధిష్ఠితైః || 66

కేతకీవన ఖండైశ్చ సదా పుష్పధరై స్సిత్తైః మల్లికా కుందకుసుమై ర్యూథికా తగరైస్తథా || 67

కుటజైర్బాణ పుషై#్పశ్చ అతిముక్తైః సకుబ్జకైః | మాలతీకరవీరైశ్చ తథా కదలకాంచనైః || 68

అన్యై ర్నానావిధైః వుషై#్పస్సుగంధై శ్చారుదర్శనైః | వనోద్యానోపవనజై ర్నానావర్ణైః సుగంధిభిః || 69

విద్యాధర గణాకీర్ణైః సిద్ధచారణ సేవితైః | గంధర్వోరగ రక్షోభి ర్భూతాప్సరసకిన్నరైః || 70

ముని యక్ష గణాకీర్ణైః నానాసత్త్వ నిషేవితైః మృగైః శాఖామృగైః సింహైర్వరాహ మహిషాకులైః 71

తథా7న్యైః కృష్ణసారాద్యై ర్మృగైః సర్వత్రశోభితైః |

శార్దూలైర్దీప్త మాతంగైః స్తథా7న్యై ర్వనచరాభిః || 72

ఏవం నానావిధై ర్యృక్షై రుద్యానై ర్నందనో పమైః లతాగుల్మ వితానైశ్చ వివిధైశ్చ జలాశ##యైః || 73

హంస కారండవాకీర్ణైః పద్మినీఖండ మండితైః | కాదంబైశ్చప్లవైర్హంసై శ్చక్రవాకోపశోభితైః || 74

కమలైః శతపత్రైశ్చ కల్హారైః కుముదోత్పలైః | ఖగైర్జలచరై శ్చాన్యైః పుషై#్పర్జల సముద్భవైః || 75

పర్వతైర్దీప్తశిఖరై శ్చారు కందర మండితైః నానావృక్ష సమాకీర్ణై ర్నానాధాతు విభూషితైః || 76

సర్వాశ్చర్యమమైః శృంగైః సర్వభూతాలయై శ్శుభైః | సర్వౌషధ సమాయుకైః విపులైశ్చిత్ర సానుభి || 77

ఏవం సర్వై స్సముదితైః శోభితం సుమనోహరైః | దదర్శ సమహీపాలః స్థానం త్రైలోక్య పూజితమ్‌ || 78

దశయోజన విస్తీర్ణం పంచయోజన మాయతమ్‌ | నానాశ్చర్య సమాయుక్తం క్షేత్రం పరమ దుర్లభమ్‌ || 79

ఇతి బ్రహ్మపురాణ పురుషోత్తమక్షేత్రదర్శనం నామ చతుశ్చత్వారింశో7ధ్యాయః

బ్రహ్మయిట్లనియె.

అరాజవంతీనగరమందు (ఉజ్జయిని యందు) ప్రజలును స్వనంతానమట్లు పాలించెను. సత్యవచనుడు శూరుడు సర్వసుగుణ సంపన్నుడు ధార్మికుడు జ్ఞాని బుద్దిశాలి సర్వశాస్త్రజ్ఞుడు. వరరాజుల గెల్చినవాడునై యతడు ప్రతాపమున రవిని రూపముచే నశ్వినీ కుమారులను పరాక్రమమున నింద్రుని వ్రజారంజమున జంద్రుని బోలియుండెను. అశ్వమేధాది యజ్ఞములను దానములను తపస్సులను నాచరించి అష్టైశ్వర్య సంపన్నుడై యుండెను. విప్రులకు బ్రతి యజ్ఞమందును సువర్ణ మణిముక్తాదులను నేన్గును గుఱ్ఱములను నొసంగెను. కంబళులు అజినములు వస్త్రములను ధన ధాన్యములను సర్వ సమృద్ధముగ నొసంగెను. భక్తిని ముక్తిని యిచ్చు సర్వయోగేశ్వరుని హరిని సేవింప నిచ్చ జనించి సర్వ నిగమాగములను నితిహాస పురాణములను వేదవేదాంగములను పరిశోధించి ఋషులు దెలిపిన నియమములను బాటించి, వేదపారగులయిన విప్రుల సేవించి గురుసేవలొనర్చి పరమావిధి ధర్మమునందుకని కృతార్థుడయ్యె.

వాసుదేవతత్త్వమునంది భ్రాంతిజ్ఞానము వాసి మోక్షేచ్చగొని యింద్రియము లెల్లనిగ్రహించి భగవంతు నెట్లారాధింతునని అమ్మూర్తిని ధ్యానించుచు నుజ్జయిని నుండి నమంత్రి పురోహితభృత్య పరివారముగ చతురంగ సైన్యముతో నంతఃపురాంగనలతో వందిమాగధులు మంగళగానములు సేయ బ్రహ్మణాది చాతుర్వర్ణములవారు వివిధ కులములవారు వివిధ వ్యాపారులు కవులు గాయకులు పౌరులు గ్రామంతరమేగు తండ్రిని తనయులట్లు తనను వెంబడింప దక్షిణ సముద్ర తీరమునకు బ్రస్థాన మొనరించెను. అక్కడ నానారత్న పూర్ణము తిమి తిమింగలాది నానా జంతు నమాకలము, పరమ గంభీరమును, పవిత్రము మంగళము తీర్థములకెల్ల నుత్తమ తీర్థము. సర్వ పుణ్య నదనదీనాయకమునైన యా సాగరముల దర్శించి యాశ్చర్యమంది తత్తీరమందు విడిసెను. అవ్వార్థి తీరము సర్వవృక్షమనోహరము. సర్వర్తు కుసుమఫలభరితము చిలుకలు గోరువంకలు నెమళ్ళ చకోర చక్రవాకములు కలకలా రావములు శ్రుతిమనోహరముగ నందు వినిపించుచుండెను. మల్లికా కుందమందారాది మేమ వివిధ తరులకు సుమవాసన లిట నింపుగొల్పుచుండెను. విద్యాధర గంధర్వ కిన్నరాప్సరోగణమలందు నాడుచు పాడుచు నిత్యము విహరించుచుండును. నంద నోపమములగు నుద్యానములు హంసకారండకాది జలపక్షుల విహార స్థానములు పద్మాకరము లందాశ్చర్యకరములయి యుండెను. ముల్లోకములకు బూజనీయమగు పదియోజనములు పొడవు నైదు యోజనములు వెడల్పు గల నా దివ్యక్షేత్రము నాఱడు దర్శించి యానంద వివశుడయ్యెను.

ఇది పురుషోత్తమ క్షేత్రదర్శనమను నలబదినాల్గవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters