Brahmapuranamu    Chapters   

చత్వారింశో7ధ్యాయః

దక్షకృత శివస్తుతిః

బ్రహ్మోవాచ

ఏవం దృష్ట్వా తదా దక్షః శంభో ర్వీర్యం ద్విజో త్తమాః|ప్రాంజలిః ప్రణతో భూత్వా సంస్తోతు ముపచక్రమే|| 1

నమస్తే దేవేదేవేశ! నమ స్తే 7న్థకసూదన! | దేవేంద్ర త్వం బలశ్రేష్ట దేవదానవపూజిత || 2

సహస్రాక్ష విరూపాక్ష త్రక్ష్య యక్షాధిపప్రియ | సర్వతః పాణిపాద స్త్వం సర్వతోక్షిశిరోముఖః || 3

సర్వతః శ్రుతిమాం ల్లోకే సర్వ మావృత్య తిష్టసి | శంకుకర్ణో మహాకర్ణః కుంభకర్ణో 7ర్ణవాలయః || 4

గజేంద్రకర్ణో గోకర్ణః శతకర్ణో నమోస్తుతే | శతోదరః శతావర్తః శతజిహ్వః సనాతనః || 5

గాయంతి త్వాం గాయత్రిణో ఆర్చయం త్యర్క మర్కిణః | దేవదానవ గోప్తాచ బ్రహ్మ చ త్వం శతక్రతుః ||

మూర్తిమాం స్త్వం మహామూర్తిః సముద్రః సరసాంనిధిః|త్వయి సర్వా దేవతా హి గావో గోష్ట ఇవా 77సతే||

త్యత్తః శరీరే పశ్యామి సోమ మగ్నిం జలేశ్వరమ్‌|ఆదిత్యమథ విష్ణుం చ బ్రహ్మాణం సబృహస్పతిమ్‌ || 8

క్రియాకరణకార్యే చ కర్తా కారణ మేవ చ | అస చ్చ సదస చ్చైవ తథైవ ప్రభవాప్య¸° || 9

నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ | పశూనాం పతయే చైవ నమో 7స్త్వంధక ఘాతినే || 10

త్రిజటాయ త్రిశీర్షాయ త్రిశూల వరధారిణ | త్ర్యంబకాయ త్రినేత్రాయ త్రిపురఘ్నాయ వై నమః || 11

నమ శ్చండాయ ముండాయ విశ్వచండధరాయచ | దండినే శంకుకర్ణాయ దండిదండాయ వై నమః || 12

నమో 7ర్థదండికేశాయ శుష్కాయ వికృతాయ చ | విలోహితాయ ధూమ్రాయ నీలగ్రీవాయ వై నమః || 13

నమో 7స్త్వ ప్రతి రూపాయ విరూపాయ శివాయచ | సూర్యాయ సూర్యపతయే సూర్యధ్వజ పతాకినే || 14

నమః ప్రమథనాశాయ వృషస్కంధాయ వై నమః | నమో హిరణ్యగర్భాయ హిరణ్యకవచాయచ || 15

హిరణ్యకృతచూడాయ హిరణ్యపతయే నమః | శత్రుఘాతాయ చండాయ పర్ణసంఘశయాయ చ || 16

నమః స్తుతాయ స్తుతయే స్తూయమానాయ వై నమః | సర్వాయ సర్వభక్షాయ సర్వభూతాంతరాత్మనే || 17

నమో హోమాయ మంత్రాయ శుక్లధ్వజపతాకినే | నమో 7నమ్యాయ నమ్యాయ నమః కిలకిలాయ చ || 18

నమ స్త్వాం శయమానాయ శయితా యోత్థితాయ చ | స్థితాయ ధావమానాయ కుబ్జాయ కుటిలాయ చ || 1 9

నమో నర్తనశీలాయ ముఖవాదిత్రకారిణ | బాధాపహాయ లుబ్ధాయ గీత వాదిత్రకారిణ || 20

నమో జేష్టాయ శ్రేష్టాయ బలప్రమథనాయచ | ఉగ్రాయ చ నమో నిత్యం నమ శ్చ దశబాహవే || 21

నమః కపాల హస్తాయ సిత భస్మ ప్రియాయ చ | విభీషణాయ భీమాయ భీష్మవ్రతధరాయ చ ||22

నానావికృత వక్త్రాయ ఖడ్గజిహ్వోగ్ర దంష్ట్రిణ | పక్షమాసలవార్థాయ తుంబీ వీణాప్రియాయ చ || 23

అఘోరఘోర రూపాయ ఘోరఘోర తరాయ చ | నమ శ్శివాయ శాంతాయ నమ శ్శాంతతమాయ చ || 24

నమో బుద్ధాయ శుద్ధాయ సంవిభాగ ప్రియాయ చ | పవనాయ పతంగాయ నమ స్సాంఖ్యపరాయచ || 25

నమః చండైక ఘంటాయ ఘంటాజల్సాయ ఘంటినే|సహస్ర శత ఘంటాయ ఘంటామాలా ప్రియాయ చ || 26

ప్రాణదండాయ నిత్యాయ నమ స్తే లోహితాయ చ|హూం హూం కారాయ రుద్రాయ భగాకారప్రియాయ చ || 27

నమో 7పారవతే నిత్మం గిరివృక్షప్రియాయచ | నమో యజ్ఞాధిపతయే భూతాయ ప్రస్తుతాయ చ|| 28

యజ్ఞవాహాయ దాంతాయ తప్యాయ చ భగాయ చ | నమ స్తటాయ తట్యాయ తటినీపతయే నమః || 29

అన్నదాయా న్నపతయే నమ స్త్వన్నభుజాయ చ | నమ స్సహస్రశీర్షాయ సహస్రచరణాయ చ || 30

సహస్రోద్ధత శూలాయ సహస్రనయనాయ చ | నమో బాలార్కవర్ణాయ బాలరూపధరాయ చ || 31

నమో బాల్కార రూపాయ కాలక్రీడనకాయ చ | నమ శ్శుద్ధాయ బుద్ధామ క్షోభణాయ క్షయాయ చ || 32

తరంగాంకిత కేశాయ ముక్తకేశాయ వై నమః | నమ ష్షట్కర్మనిష్ఠాయ త్రికర్మనియతాయ చ || 33

వర్ణాశ్రమాణాం విధి వత్పృథ గ్థర్మ ప్రవర్తినే | నమ శ్రేష్ఠాయ జ్యేష్ఠాయ నమః కలకలాయ చ|| 34

శ్వేతపింగల నేత్రాయకృష్ణ రకైక్షణాయ చ | ధర్మ కామార్థ మోక్షాయ క్రథాయ క్రథనాయ చ || 35

సాంఖ్యాయ సాంఖ్యముఖ్యాయ యోగాధిపతయో నమః | నమో రథ్యాధిరథ్యాయ చతుష్పథపథాయ చ || 36

కృష్ణాజినో త్తరీయాయ వ్యాల యజ్ఞోపవీతినే | ఈశాన రుద్రసంఘాత హరికేశ!నమోస్తుతే || 37

త్ర్యంబకా యాంబికానాథ వ్యక్తావ్యక్త నమో7స్తు తే | కాలకామదకామఘ్న దృష్టో ద్వృత్తనిఘాదన || 38

సర్వగర్హిత సర్వఘ్న సద్యోజాత నమోస్తుతే | ఉన్మాదన శతావర్త! గంగాతోయార్థ్రమూర్ధజ || 39

చంద్రార్థ సంయుగావర్త! మేఘావర్త! నమోస్తుతే | నమో 7న్నదానకర్త్రే చ అన్నదప్రభ##వే నమః || 40

అన్నభోక్త్రే చ గోప్త్రేచ త్వ మేవ ప్రళయానల! | జరాయుజాండజా శ్చైవ స్వేదజోద్భిజ్జ ఏవ చ || 41

త్వ మేవ దేవదేవేశ భూతగ్రామ శ్చతుర్విధః | చరాచరస్య స్రష్టా త్వం ప్రతిహర్తా త్వ మేవ చ || 42

త్వ మేవ బ్రహ్మా విశ్వేశ అప్సు బ్రహ్మ వదంతి తే | సర్వస్య పరమా యోనిః సుధాంశో! జ్యోతిషాం నిధిః || 43

ఋక్సామాని తథోంకార మాహు స్త్వాం బ్రహ్మవాదినః | హాయి హాయి హరే హాయి హువా

హాతేతి వా7సకృత్‌ || 44

గాయంతి త్వాం సుర శ్రేష్ఠాః సామగా బ్రహ్మవాదినః | యజుర్మయ ఋజ్మయ శ్చ సామాథర్వయుత స్తథా || 45

పఠ్యసే బ్రహ్మవిద్భి స్త్వం కల్పోపనిషదాం గణౖః | బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రా వర్ణాశ్రమా శ్చ యే || 46

త్వ మేవా 77శ్రమసంఘా శ్చ విద్యు త్త్సనిత మేవ చ | సంవత్సర స్త్వ మృతవో మాసా మాసార్థ మేవ చ || 47

కలా కాష్ఠా నిమేషా శ్చ నక్షత్రాణి యుగాని చ | వృషాణాం కకుదం త్వం హి గిరీణాం శిఖరాణి చ || 48

సింహో మృగాణాం పతయ స్తక్షకానంత భోగినామ్‌|క్షీరోదో హ్యుదధీనాం చ మంత్రాణాం ప్రణవ స్తథా|| 49

వజ్రం స్రహరణానాం చ వ్రతానాం సత్య మేవ చ | త్వ మేవే చ్ఛా చ ద్వేష శ్చ రాగో మోహః శమః క్షమా || 50

వ్యవసాయో ధృతి ర్లోభః కామక్రోధౌ జయాజ¸° | త్వం గదీ త్వం శరీ చాపి ఖట్వాంగీ ముద్గరీ తథా || 51

ఛేత్తా భేత్తా ప్రహర్తా చ నేతా మంతా సి నో మతః ః దశలక్షణ సంయుక్తో ధర్మో7ర్థః కామ ఏవ చ || 52

ఇందు స్సముద్ర స్సరితః పల్వలాని సరాంసి చ | తతావల్య స్తృణౌషధ్యః పశవో మృగపక్షిణః || 53

దవ్ర్యకర్మగుణారంభః కాలపుష్పఫలప్రదః | ఆది శ్చాంత శ్చ మధ్య శ్చ గాయ త్త్యోంకార ఏవ చ || 54

హరితో లోహితః కృష్ణో నీలః పీత స్తథా క్షణః | కద్రు శ్చ కపిలో బభ్రుః కపోతో మత్స్యక స్తథా || 55

నువర్ణరేతా విఖ్యాతః సువర్ణ శ్చాప్యయో కుతః | సువర్ణనామా చ తథా సువర్ణప్రియ ఏవ చ || 56

త్వ మింద్ర శ్చ యమ శ్చైవ వరుణో ధనదో 7నిలః | ఉత్ఫుల్ల శ్చిత్రభాను శ్చ స్వర్భాను ర్భాను రేవ చ ||57

హోత్రం హోతా చ హోమ్యం చ హుతం చైవ తధా ప్రభుః | త్రిసౌపర్ణ స్తథా బ్రహ్మ న్యజుషాం శతరుద్రియమ్‌ || 58

పవిత్రం చ పవిత్రాణాం మంగళానాం చ మంగళమ్‌ | ప్రాణా శ్చ త్వం రజ శ్చ త్వం తమ స్సత్త్వయుత స్తథా || 59

ప్రాణో7 పానః సమాన శ్చ ఉదానో వ్యాన ఏవ చ|ఉన్మేష శ్చ నిమేష శ్చ క్షుత్తృట్‌ జృంభా తథై చ || 60

లోహితాంగ శ్చ దంష్ట్రీచ మహావక్త్రో మహోదరః | శుచిరోమా హరిచ్ఛ్మశ్రురూర్థ్వకేశ శ్చలాచలః || 61

గీతావాదిత్ర నృత్యాంగో గీతవాదనక ప్రియః | మత్స్యో జాలో జలో 7జయ్యో జలవ్యాలః కుటీచరః || 62

వికాల శ్చ సుకాల శ్చ దుష్కాలః కాలనాశనః | మృత్యు శ్చైవాక్షయో 7న్త శ్చ క్షమా మాయాకరోత్కరః || 63

సంవర్తో వర్తక శ్చైవ సంవర్తక బలాహకౌ | ఘంటాకీ ఘంటాకీ ఘంటీ చూడూలో లవణోదధిః || 64

బ్రహ్మా కాలాగ్ని వక్త్ర శ్చ దండీ ముండ స్త్రిదండదధృక్‌|చతుర్యుగ శ్చతుర్వేద శ్చతుర్హోత్రశ్చతుష్పథః || 65

చాతురాశ్రమ్య నేతా చ చాతుర్వర్ణ్వకర శ్చ హ | క్షరాక్షరః ప్రియో ధూర్తో గణౖర్గణ్యో గణాధిపః || 66

రక్తమాల్యాంబరధరో గిరీశో గిరిజాప్రియః | శిల్పీశః శిల్పినః శ్రేష్ఠః సర్వ శిల్ప ప్రవర్తకః || 67

భగనేత్రాంతక శ్చండః పూష్ణోదంతవినాశనః | స్వాహా స్వధా వషట్కారో నమస్కారో నమో స్తుతే || 68

గూఢవ్రత శ్చ గూఢ శ్చ గూఢవ్రతనిషేవితః | తరణ స్తారణ శ్చైవ సర్వభూతేషు తారణః || 69

ధాతా విధాతా సంధాతా నిధాతా ధారణో ధరః|తపో బ్రహ్మ చ సత్యం చ బ్రహ్మచర్యం తథా 77ర్జవమ్‌ || 70

భూతాత్మా భూతకృ ద్భూతో భూతభవ్య ద్భవోద్భవః |

భూర్హువః స్వరిత శ్చైవ భూతో హ్యగ్ని ర్మహేశ్వరః || 71

బ్రహ్మావర్తః సురావర్తః కామావర్త నమో 7స్తు తే|కామబింబ వినిర్హంతా కర్ణికార స్రజప్రియః || 72

గోనేతా గోప్రదారశ్చ గోవృషేశ్వరవాహనః | త్రైలోక్య గోప్తా గోవిందో గోప్తా గోవర్గ ఏవ చ || 73

అఖండచంద్రాభిముఖః సుముఖో దుర్ముఖో 7ముఖః | చతుర్ముఖో బహుముఖో రణష్వభిముఖ స్సదా || 74

హిరణ్యగర్భ శ్శకుని ర్థనదో 7ర్థపతి ర్విరాట్‌ | అధర్మహా మహాదక్షో దండధారో రణప్రియః || 75

తిష్ఠన్థ్సిర శ్చ స్థాణు శ్చ నిష్కంప శ్చ సునిశ్చలః | దుర్వారణో దుర్విషహో దుస్సహో దురితక్రమః || 76

దుర్థరో దుర్వశో నిత్యో దుర్ధర్షో విజయో జయః | శశః శశాంక నయన శ్శీతోష్ణః క్షుత్తృషా జరా|| 77

అధయో వ్యాధయ శ్చైవ వ్యాధిహా వ్యాధిప శ్చ యః | సహ్యో యజ్ఞ మృగవ్యాధో వ్యాధినామాకరో7కరః78

శిఖండీ పుందరీక శ్చ పుండరీకావలోకనః | దండధృ క్క్చకృదండ శ్చ రౌదృభాగ వినాశనః || 79

విషపో7మృతప శ్చైవ సురాపః క్షీరసోమపః | మధుప శ్చా77పపశ్చైవ సర్వప శ్చ బలాబలః || 80

వృషాంగరాంభో వృషభ స్తథా వృషభలోచనః | వృషభ శ్చైవ విఖ్యాతో లోకానాం లోకసంస్కృతః || 81

చంద్రాదిత్యౌ చక్షుషీ తే హృదయం చ పితామహః |అగ్నిష్టోమ స్తథా దేహోధర్మకర్మ పృసాదితః || 82

న బృహ్మాన చ గోవిందః పురాణఋషయో న చ | మాహాత్మ్యం వేదితుం శక్తా యాథాతథ్యేన తే శివః || 83

శివా యా మూర్తయ స్సూక్ష్మా స్తా మహ్యం యాంతు దర్శనమ్‌ |

తాభి ర్మాం సర్వతో రక్ష పితా పుత్రమివౌ రసమ్‌ || 84

రక్ష మాం రక్షణీయో7హం తవా నఘ నమో స్తు తే | భక్తానుకంపీ భగవా ద్భక్త శ్చాహం సదా త్వయి || 85

యః సహస్రా ణ్యనేకాని పుంసా మావృత్య దుర్దృశామ్‌ |

తిష్ఠ త్యేకః సముద్రాంతే స మే గోప్తా7 స్తు నిత్యశః || 86

యం వినిద్రా జిత శ్వాసాః సత్త్వస్థాః సమదర్శినః |జ్యోతిః పశ్యంతి యుంజానా స్తసై#్మ యోగాత్మనే నమః || 87

సంభక్ష్య సర్వభూతాని యుగాంతే సముపస్థితే|య శ్శేతే జలమధ్యస్థ స్తం ప్రపద్యేం బుశాయినమ్‌ || 88

ప్రవిశ్య వనదం రాహోర్యః సోమం పిబతే నిశి|గ్రస త్యర్కం చ స్వర్భాను ర్భూత్వా సోమాగ్ని రేవచ || 89

అంగుష్ఠమాత్రాః పురుషా దేహస్థాః సర్వదేహినామ్‌ |

రక్షంతు తే చ మాం నిత్యం నిత్యం చా77ప్యాయయంతు మాం || 90

యేనా ప్యుత్పాదితా గర్భా ఆపో భాగగతా శ్చ యే |తేషాం స్వాహా స్వధా చైవ అప్ప్నువంతి స్వదంతి చ || 91

యేవ రోహంతి దేహాస్తాః ప్రాణినో రోదయంతి చ|హర్షయంతి న కృష్యంతి నమ స్తేభస్తు నిత్యశః || 92

యే సముద్రే నదీదుర్గే పర్వతేషు గుహాసు చ|వృక్షమూలేషు గోష్టేషు కాంతార గహనేషు చ || 93

చతుష్పథేషు రథ్యాసు చత్వరేషు సబాసు చ|హస్త్యశ్వరథశాలాసు జీర్ణోద్యానాలయేషు చ || 94

యేషు పంచమ భూతేషు దిశాసు విదిశాసు చ | ఇంద్రార్కయో ర్మధ్యగతా యే చ చంద్రార్క రశ్మిషు || 95

రసాతలగతా యే చ యే చ తస్మాత్పరం గతాః|నమ స్తేభ్యో నమ స్తేభ్యో నమస్తేభ్యో7పిసర్వశః || 96

సర్వ స్త్వం సర్వగో దేవః పర్వభూతపతి ర్భవః | సర్వభూతాంతరాత్మా చ తేన త్వం న నిమంత్రితః || 97

త్వ మేవ చే జ్యసే దేవ యజ్ఞై ర్వివిధదక్షిణౖః|త్వ మేవ కర్తా సర్వస్య తేన త్వం న విమంత్రతః || 98

అథవా మాయయా దేవ మోహితః సూక్ష్మయా త్వయాః |

తస్మా త్తు కారణా ద్వా7పి త్వం మయా న నిమంత్రితః || 99

ప్రసీద మమ దేవేశ త్వ మేవ శరణం మమ |

త్వం గతి స్త్వం ప్రతిష్ఠా చ వ చా7 న్యో అస్తితి మే మతిః || 100

బ్రహ్మోవాచ

స్తుత్వైవం స మహాదేవం విరరామ ప్రజాపతిః | భగవా నపి సంప్రీతః పున ర్దక్ష మభాషత || 101

శ్రీ భగవానువాచ

పరితుష్టో7స్మి తే దక్ష స్తవేనా నేన సువ్రత|బహునా తు కి ముక్తేన మత్సమీపం గమిష్యపి || 102

బ్రహ్మోవాచ

తథైవ మబ్రవీ ద్వాక్యం త్రైలోక్యాధిపతి ర్భవః |

కృత్వా77 శ్వాసకరం వాక్యం సర్వజ్ఞో వాక్యసంహితమ్‌ || 103

శివ ఉవాచ

దక్ష దుఃఖం న కర్తవ్యం యజ్ఞవిధ్వంసనం ప్రతి|అహం యజ్ఞహన స్తుభ్యం దృష్టమేత త్పురా7పఘ 104

భూయ శ్చ త్వం వర మిమం మత్తో గృహ్ణీష్వ సువ్రత |

ప్రసన్న స్సుముఖో భూత్వా మమైకాగ్ర మనా శ్శృణు || 105

అశ్వమేధ సహస్రస్య వాజపేయ శతస్య వై | ప్రజాపతే! మత్ర్పసాదా త్పలభాగీ భవిష్యసి || 106

వేదా న్షడంగా న్బుధ్యస్వ సాంఖ్యయోగాం శ్చ కృత్స్నశః|తప శ్చ విపులం తప్త్వా దుశ్చరం దేవదానవైః || 107

అబ్దై ర్ద్వాదశభి ర్యుక్తం గూఢ మప్రజ్ఞనిందితమ్‌ | వర్ణాశ్రమకృతై ర్దర్మై ర్వినీతం న క్వచిత్క్వచిత్‌ || 108

సమాగతం వ్యవస్థితం పశుపాశవిమోక్షణమ్‌ | సర్వేషా మాశ్రమాణాం చ మయా పాశుపతం వ్రతమ్‌ || 109

ఉత్పాదితం దక్ష శుభం సర్వపాప విమోచనమ్‌ | అస్య చీర్ణస్యయత్‌ సమ్యక్ఫలం భవతి పుష్కలమ్‌ ||

తచ్చా స్తు సుమహాబాగ మానస స్త్యజ్యతాం జ్వరః || 110

బ్రహ్మోవాచ

ఏవ ముక్త్వా తు దేవేశః సపత్నీకః సహానుగః ఆదర్శన మనుప్రాప్తో దక్ష స్యామిత తేజసః || 111

అవాస్య చ తథా భాగం యథోక్తం చోమయా భవః | జ్యరం చ సర్వధర్మజ్ఞో బహుదా వ్యభజ త్తదా || 112

శాంత్యర్ధం సర్వభూతానాం శృణుధ్వ మథ వై ద్విజాః | శిఖాభితాపో నాగానాం పర్వతానాం శిలాజతు || 113

అపాం తు నీలికాం విద్యా న్నిర్మోకో భుజగేషు చ | ఖోరకః సౌరభేయానా మూపరః | పృధీవీతలే || 114

శునా మపి చ ధర్మజ్ఞ! దృష్టి ప్రత్యవరోధనమ్‌ | రంద్రాగత మధా శ్వానాం శిఖోధ్బేద శ్చ బర్హిణామ్‌ || 115

నేత్రరాగః కోకిలానాం ద్వేషః ప్రోక్తో మహాత్మనామ్‌ | జనానా మపి భేద శ్చ సర్వేషా మితి నః శ్రుతమ్‌ || 116

శుకానా మపి సర్వేషాం హిక్కికా ప్రోచ్యతే జ్వరః || శార్దూలేష్వథ వై విప్రాః శ్రయో జ్వర ఇహోచ్యతే || 117

మానుషేషు చ సర్వజ్ఞా జ్వరో నామైష కీర్తితః | మరణ జన్మని తథా మథ్యే చాపి వివేశితః || 118

ఏతన్మాహేశ్వరం తేజో జ్వరో నామ సుదారుణః | నమస్య శ్చైవ మాన్య శ్చ సర్వప్రాణిభి రీశ్వరః || 119

ఇమాం జ్వరోత్పత్తి మదీనమానసః | పఠే త్సదా యః సుసమాహితో నరః

విముక్తరోగః స నరో ముదా యుతో లభేత కామాం శ్చ యథామనీషితాన్‌ || 120

దక్షప్రోక్తం స్తవం చాపి కీర్తయే ద్యః శృణోతి వా |

నాశుభం ప్రాప్నుయాత్కించి ద్దీర్ఘమాయు రవాప్నుయాత్‌ || 121

యథా సర్వేషు దేవేషు వరిష్టో భగవా న్భవః | తథా స్తవో వరిష్టో7యం స్తవానాం దక్షనిర్మితః || 122

యశ స్స్వర్గ సురైశ్వర్య విత్తాది జయకాంక్షిభిః | స్తోతవ్యోభక్తి మాస్థాయ విద్యాకామై శ్చ యత్నతః || 123

వ్యాధితో దుఃఖితో దీనో నరో గ్రస్తో భయాదిభిః | రాజకార్య నియుక్తో వా ముచ్యతే మహతో భయాత్‌ || 124

అనేనై వ చ దేహేన గణానాం చ మహేశ్వరా త్‌ | ఇహ లోకే సుఖం ప్రాప్య గణరా డుపజాయతే || 125

న యక్షా న పిశాచా వా నాగా నచవినాయకాః|కుర్యు ర్విఘ్నం గృహే తస్య యత్ర నం స్తూయతే భవః 126

శృణుయా ద్వా ఇదం నారీ భక్తా 7థ భవభావితా | పితృపక్షే భర్తృపక్షే పూజ్యా భవతి చైవ హి 127

శృణుయా ద్వా ఇదం సర్వం కీర్తయే ద్వా ప్యభీక్షుణశః|తస్య సర్వాణి కార్యాణి సిద్ధిం గచ్చన్త్యవిఘ్నతః || 128

మనసా చింతితం యచ్చ యచ్చ వాచా ప్యుదాహృతమ్‌ | సర్వం సంపద్యతే తస్య స్తవ స్యాస్యా నుకీ ర్తనాత్‌ || 129

దేవన్య సగుహస్యా థ దేవ్యా నందీశ్వరస్య చ| బలిం విబాగతః కృత్వా దమేన నియమేన చ || 130

తతః ప్రయుక్తో గృహ్ణీయా న్నామా న్యాశు యథాక్రమమ్‌ |

ఈ ప్సితాంల్ల భ##తే7ప్యర్థా న్కామా న్భోగాం శ్చ మానవః 131

మృత శ్చ స్వర్గ మాప్నోతి స్త్రీసహస్ర సమావృతః|సర్వకామసుయుక్తో వా యుక్తో వా సర్వ పాతకైః || 132

పఠ న్దక్షకృతం స్తోత్రం సర్వపాపైః ప్రముచ్యతే | మృత శ్చ గణసాయుజ్యం పూజ్యమాన స్సురాసురైః 133

వృషేణ వినియుక్తేన విమానేన విరాజితే | ఆభూతసంప్లవస్థాయీ రుద్ర స్యానుచరో భ##వేత్‌ || 134

ఇత్యాహ భగవా న్వ్యాసః పరాశరసుతః ప్రభుః నైత ద్వేదయ తేకశ్చిన్నైత చ్ర్చావ్యం చకస్యచిత్‌ || 135

శ్రుత్వేమం పరమం గుహ్యం యే7పి స్యుః పాపయోనయః |

వైశ్యాః స్త్రియశ్చ శూద్రా శ్చ రుద్రలోక మవాప్నుయుః 136

శావ్రయే ద్యశ్చ విప్రేభ్యః సదా పర్వసు పర్వసు | రుద్రలోక మవాప్నోతి ద్విజో వై నాత్ర సంశయః || 137

ఇతి బ్రహ్మపురాణ దక్షస్తుతిర్నామ చత్వారింశో7ధ్యాయః

దక్షకృత శివస్తవము

బ్రహ్మ యిట్లనియె. దక్షప్రజాపతి శంభు ప్రభావముగని ప్రాంజలియై ప్రణతుడై యిట్లు స్తుతంప నారంభించెను. ఈ దక్షకృత శివస్తుతి శివసహస్రనామావళిరూపము. పారాయణ ప్రథానము కావున 2-81 శ్లోకముదాక తాత్పర్యము వ్రాయబడలేదు - శివుని విరాడ్రూపమున వినుతించిన ఘట్టము.

ఫలశ్రుతి 81 నుండి 100 దాకా తాత్పర్యము వ్రాయబడుచున్నది. ఓ సదాశివా ! నీ కన్నులు చాంద్రాదిత్యులు. హృదయము బ్రహ్మ. ధర్మకర్మ సంపాదితమైన యగ్నిష్టోమము శరీరము. నీ యథార్థమైన మహిమ బ్రహ్మహరి ఋషులునుం గూడ యెఱుంగలేరు. నీ శివమూర్తులు (మంగళకరములయిన యాకారములు) సూక్ష్మములు. అవి నాకు దర్శనమిచ్చుగాక! తండ్రి కన్నకొడున ట్లానీ మూర్తులతో నన్ను రక్షింపుము. నీ సంరక్షణలో నుండదగిన నన్ను రక్షింపుము. నీవు భక్తానుగ్రాహకుడవు. నేను నీభక్తుడను. ఏ మూర్తి వేలకొలది పురుషుల నావరించి సముద్రమవ్వల నుండనో ఆమూర్తి నాకు రక్షకమగుగాక! నిద్రజయించి శ్వాసనరికట్టి సత్త్వ గుణస్థాయినంది సమదర్శనులై పరంజ్యోతిని (భ్రూమధ్యస్థానమున) సంయొజనసేసి చూతురో అట్టి యోగాత్మకుడపైన నీకు నమస్కారము. ప్రళయమందెల్ల భూతముల భక్షించి జలమధ్యమున శయనించు నాశివునకు నమస్కారము. రాహుముఖముజొచ్చి రాత్రి సోముని త్రావును. పగలు సూర్యుని గ్రసించును. అట్టి నీమూర్తికి నమస్కారము. సోముడు అగ్ని అంగుష్ఠ మాత్రులై సర్వదేవరుల దేహమందండు పురుషులు(శివమూర్తులు) నన్నెల్లపుడు రక్షింతురుగాక నన్నాప్యాయనము సేయుదురుగాక సంతృప్తుని గావింతురుగాక యని భావము. ఎవ్వరివలన పిండోత్పత్తి(గర్భోత్పత్తి) జరుగునో యెవరు జలగర్భముందుందురో స్వాహా స్వధాకారమున హవిర్భాగముల నందుకొందురో అరగింతురో యెవనివలన దేహధారులు పుట్టుదురో ఏ మూర్తులు జీవుల నేడిపింతురో (రుద్రరూవులన్నమాట) ఆనందపెట్టుదురో క్లేశము గల్గింనరో యట్టి నీ మూర్తులకు నమస్కారము. సముద్రమందు నదీదుర్గమందు పర్వతములందు గుహలందు వృక్షమూలమందు గోశాలలందునడవులలో గహనములలో చతుష్పథములందు (నాలుగుదార్లు కలిసినచోట) వీధులందు (రాచబాటలందు) చత్వరములందు (సంస్కృతభూమి) సభలలో ఏనుగు గుఱ్ఱములసాలలందు పాడువడిన యుద్యానవనములందు ఆలయములందు పంచభూతములలో దిక్కులలోవిదిక్కులలో ఇంద్రసూర్యుల నడుమ సూర్యచంద్ర కిరణములందు బాతాళమందు అంతకంటెను మీదను నే నీ మూర్తులు గలవో వానకి నమస్కారము. సత్వము నీవే సర్వత్ర వీవే సర్వభూతపతివి, సర్వభూతాంతరాత్మవు నీవు, అందుచే నీవు నిమంత్రితుడవుగావు. (పిలువబడువాడు) వివిధముల దక్షిణలుగల యజ్ఞములచే నీవేయజింపబడుదువు. అంతకును నీవేకర్తవు. అందుచే నీవునిమంత్రితుడవుగావు సూక్ష్మమైన మాయయునీవే. దానిచే నేనును మోహింపబడితిని. (పోరబడితినన్నమాట) అందుచేతగూడ నిన్ను నేను నియంత్రింపలేను. నిన్ను పేర్కోనలేదనిభావము. నాయెడల బ్రసన్నుడవగుము. నాకు నీవే దిక్కు. నీవే నాగతివి. నీవే నాప్రతిష్ఠయు(ఉనికిలేక ఆధారమన్నమాట). నీకంటె మఱియెక్కడు లేడని నా తలంపు. అని యిట్లు మహేశ్వరుని దక్షుడు స్తుతించి యూరుకొనెను. భగవంతుడు ప్రీతుడై దక్షునింగని మఱియు నిట్లనియె. నీ చేసినస్తవముచే సంతుష్టుడనైతిని. నీవుత్తమ వ్రతనిష్ఠుడవు. ఎక్కువమాట లెందులకు? నీవు నాసన్నిధికి వత్తువు అని త్రిలోకేశుడు భవుడు సర్వజ్ఞుడు దక్షుని కాశ్వాసకరముగ(ఓదార్పుగ) పలికి! దక్షా! యజ్ఞధ్వంసమునకు దుఃఖపడవలదు. చూచితివిగదా. యజ్ఞహననము సేసినది నేనే. ఇదిగో నీ యజ్ఞఫలము నుత్తమమైన దానిని నావలన మఱులలబడయును. ప్రసన్నసుముఖుడవు యేకాగ్రమనస్కుడవునై నామాట వినుము. వేయి ఆశ్వమేధములు నూరు వాజపేయములు సేసిన ఫలము నా ప్రసాదముచే నీవిప్పుడందగలవు. షడంగ వేదములను సమగ్రసాంఖ్య యోగములను (జ్ఞానయోగములను) నీవు తెలిసి కొనుము. పండ్రెండేండ్లు దేవదానవులు చేయలేని ప్రజ్ఞాహీనులు (అజ్ఞానులు) నిందించునట్టిదియు వర్ణాశ్రమ ధర్మములతో గూడినదియు లొంగనిదియు వ్యవసితమును (వ్యవస్థ చేయబనదియు) పశుపాశ విమోచనము సేయునది. (జీవుల యజ్ఞానపాశముల ద్రెంచునది) సర్వాశ్రమస్థులకు ననువైనదిగ నేను సర్వపశుపాప విమోచన మంత్రమును రూపొందించితిని. ఇది లెస్సగ నాచరించిన యెడల పుష్కలమైన ఫలము గల్గును. ఆది నీకు అనుష్టేయమగుగాక ! మహానుభావ! మానసిక జ్వరమును(తాపమును) విడువుము. ఇట్లు దేవేశుండు పలికి ఉమాదేవితో పరివారముతో యంత ర్థానమయ్యెను. మఱియు నా భవుడు సర్వధర్మజ్ఞుడు గావుస సర్వభూతశాంతి కొఱకు దక్షయజ్ఞ ధ్వంసమునకు దానావిర్భవింప జేసిన జ్వరము నీ క్రిందివిధముగా విభజించెను. ఈ వివరము నోవిప్రోత్తములారా వినుండు.

ఆజ్వరము గజములలో శిరోతాపముగను, పర్వతములలో శిలాజితముగను, నీటిలో నీలిక (అనుపేరుతోను) పాములలో కుబుసముగను అవులలో ఖోరకము భూమియందు ఊషరము(చవిటినేల) కుక్కలకు నేత్రావరోధము (గ్రుడ్డితనము) గుఱ్ఱములకు రంధ్రాగతము నెమళ్లకు పించెములూడిపోవుట కోకిలలకు నేత్రరాగముగను మహాత్ములకు ద్వేషము సర్వజనులకు భేదము(ఒంటెత్తు తనము. ఒకరి కొకరికి బడకపోవుట) చిలుకలకెక్కిళ్లు పులులకు శ్రమ(అలసట) మనుష్యులకు కేవలము జ్వరరూపమైన వ్యాధియే ఇది నరులకు పుట్టునపుడు గిట్టునపుడు ఆరెంటికి నడుమను గూడ, నుంచబడినది. ఇది మాహేశ్వర తేజస్సే. జ్వరము (శివజ్వరము) అనుపేర మిక్కిలి దారుణమై యున్నది. సర్వప్రాణులకును ఈశ్వరుడు నమస్కరింపవలసినవాడు మాన్యుడు(పూజనీయుడు) ఈ జ్వరోత్పత్తి నిండుమనసుతో జదివినవాడు రోగముక్తుడై సంతోషముతో గూడి సర్వాభీష్టములనందును.

ఫలశ్రుతి

దక్షుడు సేసిన యీ శివస్తవమును బారాయణముసేసిన వాడెన్నడును అశుభము నందడు. దీర్ఘాయువందును సర్వదేవులందు మహాదేవుడు భగవంతుడు శ్రేష్ఠుడయినట్లు దక్షకృతమైన యీ శివస్తుతికూడ సర్వస్తుతివరిష్ఠము. కీర్తి స్వర్గము దేవైశ్వర్యము ధనముజయము గోరువారును విద్యాకాములను ఈ స్తవమును భక్తితో పఠింపవలయును. వ్యాధి, దుఃఖము భయమునకు గురియైనవాడు రాజకార్య నియుక్తుడును నీస్తుతి పఠించిన భయవిముక్తుడగును. అతడీదేహముతోనే శివగణములనుభవించు మహేశ్వరసుఖమును( పరమేశ్వర విభూతిని) ఇహమందనుభవించి, గణాధిపతియగును. యక్షులు పిశాచులు నాగులు వినాయకులును ఆభక్తునికెట్టి విఘ్నములు గల్గింపరు. ఈస్తుతినిభక్తితో శివునిపై భావమునిల్పి విన్నచో పుట్టింటను అత్తింటను బూజ్యురాలగును. దీనిని విన్నను కీర్తించినను వానికి నిర్విఘ్నముగ సర్వకార్వసిద్దియగున. ఇది కీర్తించుటచే మనసుచేత సంకల్పించినది మాటచేనన్నది యెల్లపనులు నెరవేరును. కుమారస్వామికి గౌరికి నందీశ్వరునికి ఇంద్రియని గ్రహముతో నియమముతో వేర్వేరు బలిని (పూజను) నోనరించి యామీద నీశివనామములను గ్రమముగ బారాయణకు గ్రహింపవలెను. అందువలన మానవుడిష్టార్థములను భోగములను పురుషార్థములను బడయును. మరణించి అప్సరః స్త్రీసహస్రముతో స్వర్గమునకేగును. కోరికలతో పాతకములతో నున్నవాడైన నీదక్షకృత శివస్తుతి పఠించి సర్వపాపముక్తుడగును. దేహపాతానంతరము గణసాయజ్యమందును. సురాసురలపుడు వానింబూజింతురు. అతడు భూత ప్రళయముదాక వృషభవాహనమెక్కి, విమానమెక్కి రుద్రానుచరుడగును.

ఈ విధముగ పరాశరనూనుడు వ్యాసభగవానుడు పలికినాడు. ఇది యెవ్వడు నెఱుగడు. దీనినెవ్వనికి వినిపింపరాదు. ఇది గుహ్యమైన (మంత్రసమ్మితమైన) స్తవము. పాపజన్ములయినను వైశ్యులు స్త్రీలు శూద్రులు నీస్తుతి పఠించి విని రుద్రలోకమందుదురు. విప్రులకు ప్రతిపర్వమందు దీనిని వినిపింపవలెను. అందుచే ద్విజుడు రుద్రలోకమందును సందియుము లేదు.

ఇది బ్రహ్మపురాణమందు ''దక్షకృతశివస్తవము'' అను నలుబదియవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters