Brahmapuranamu    Chapters   

ఏ కో న చ త్వా రి ం శో 7 ధ్యా యః

దక్షయజ్ఞ విధ్వంసనమ్‌

ఋషయఃఊచుః--

ప్రాచేతసస్య దక్షస్య కథం వైవస్వతే ం7తరే | వినాశ మగమ ద్ర్బహ్మన్‌! హయమేధః ప్రజాపతేః || 1

దేవ్యా మన్యుకృతం బుద్ధ్వా కృద్ధః సర్వాత్మకః ప్రభుః | కథం వినాశితో యజ్ఞో దక్షస్యా 7మితతేజసః ||

మహాదేవేన రోషా ద్వై త న్న ః ప్రబ్రూహి విస్తరాత్‌ || 2

ఋషులు పలికిరి -

వైవస్వత మన్వంతరమున ప్రాచేతసుడగు దక్ష ప్రజాపతియొక్క అశ్వమేధయాగమెట్లు నాశమొందెను. దేవియొక్క క్రోధవ్యాపానమెఱింగి సర్వాత్మకుడగు నీశ్వరుడెట్లు కోపించెను? అమిత తేజోవంతుడగు దక్షుని యాగము మహాదేవునిచే రోషముతో నశింపచేయబడిన వృత్తాంతమును సవిస్తరముగ మా కెఱింగింపుము -

బ్రహ్మోవాచ

వర్ణ యిష్యామి వో విప్రాః! మహాదేవేన వై యధా | క్రోధా ద్విధ్వంసితో యజ్ఞో దేవ్యాః ప్రియచికీర్షయా || 3

పురా మేర్వో ర్ద్విజశ్రేష్ఠాః శ్శృంగం త్రైలోక్య పూజితమ్‌|జ్యోతిస్థలం నామ చిత్రం సర్వరత్న విభూషితమ్‌|| 4

అప్రమేయ మనాధృష్యం సర్వలోకనమస్కృతమ్‌|తత్ర దేవో గిరితటే సర్వధాతు విచిత్రితే || 5

పర్వంక ఇవ విస్తీర్ణ ఉపవిష్టో బభూవ హ|శైలరాజసుతా చాస్య నిత్యం పార్శ్వస్థితా7భవత్‌ || 6

అదిత్యా శ్చ మహాత్మానో వసవ శ్చ మహౌజసః| తథైవ చ మహాత్మానా వశ్వినౌ భిషజాం వరౌ || 7

తథా వై శ్రవణో రాజా గుహ్యకైః పరివారితః|యక్షాణా మీశ్వరః శ్రీమా న్కైలాసనిలయః ప్రభుః || 8

ఉపాసతే మహాత్మాన ముశనా చ మహామునిః|సనత్కుమార ప్రముఖా స్తథైవ పరమర్షయః || 9

అంగిరఃప్రముఖా శ్చైవ తథా దేవర్షయో 7పి చ | విశ్వావసు శ్చ గంథర్వ స్తథా నారద పర్వతౌ || 10

అప్సరోగణ సంఘా శ్చ సమాజగ్ము రనేకశః | వవౌ సుఖశివో వాయు ర్నానా గంధవహః శుచిః || 11

సర్వర్తుకుసుమోపేతః పుష్పవంతో 7భవ న్ద్రుమాః | తథా వాద్యాధరాః సాధ్యాః సిద్ధా శ్చైవ తపోధనాః || 12

మహాదేవం పశుపతిం పర్యుపాసత తత్ర వై |భూతాని చ తథా 7న్యాని నానారూపధరాణ్యథ || 13

రాక్షసా శ్చ మహారౌద్రాః పిశాచా శ్చ మహాబలాః | బహురూపధరా దృష్టా నానాప్రహరణాయుధా || 14

దేవ స్యానుచరా స్తత్ర తస్థు ర్వైశ్వానరోపమాః | నందీశ్వర శ్చ భగవా న్దేవ స్యానుమతే స్థితః || 15

ప్రగృహ్య జ్వలితం శూలం దీప్యమానం స్వతేజసా | గంగా చ సరితాం శ్రేష్ఠా సర్వతీర్థ జలోద్భవా || 16

పర్యుపాసత తం దేవం రూపిణీ ద్విజసత్తమాః | ఏవం స భగవాం స్తత్ర పూజ్యమానః సురర్షిభిః || 17

ఋషులకు బ్రహ్మ యిట్లనియె! మేరు శృంగమొకటి ''జ్యోతి స్థ్సలము'' అను పేరనున్నది. అది సర్వరత్న భూషితము. లోకమనోహరము. అందుపై శైలకన్యతో నిందుధరుండు వసించును. ఆదిత్యులు, వసువులు అశ్వినులు, కుబేరుడు సనత్కుమారాదులు అప్సరసలు అందరు నీశ్వరుని సేవింతురు. గంగానది మూర్తిని ధరించి శివునుపచరించు చుండెను.

దేవై శ్చ సుమహాభాగై ర్మహాదేవో వ్యతిష్ఠత | కస్యచి త్త్వథ కాలస్య దక్షో నామ ప్రజాపతిః || 18

పూర్వోక్తేన విదానేన యక్ష్యమాణో 7భ్యుపద్యత | తత స్తస్య మఖే దేవాః సర్వే శక్రపురోగమాః || 19

స్వర్గ స్థానా దథా7గమ్య దక్ష మాపేదిరే తథా | తే విమానై ర్మహాత్మానో జ్వలద్భి ర్జ్వలనప్రభాః || 20

దేవ స్యానుమతే 7గచ్ఛన్‌ గంగాద్వార మితి శ్రుతిః | గంధర్వాప్సరసా కీర్ణం నానాద్రుమలతా వృతమ్‌ || 21

ఋషిసిద్దైః పరివృతం దక్షం ధర్మభృతా వరమ్‌ | పృథివ్యా మంతరిక్షే చ యే చ స్వర్లోకవాసినః || 22

సర్వే ప్రాంజలయో భూత్వా ఉపతస్థుః ప్రజాపతిమ్‌ | ఆదిత్యా వసవో రుద్రా స్సాధ్యా స్సర్వే మరుద్గణాః || 23

విష్ణునా సహితా స్సర్వే ఆగతా యజ్ఞభాగినః | ఊష్మపా ధూమపా శ్చైవ ఆజ్యపా స్సోమపా స్తథా || 24

అశ్వినౌ మరుత శ్చైవ నానాదేవగణౖ స్సహ ఏతే చాన్యే చ బహవో భూతగ్రామా స్తథైవ చ || 25

జరాయుజాండజా శ్చైవ తథైవ స్వేదజోద్భిదః | ఆగతా స్సత్రిణ స్సర్వే దేవాః స్త్రీభిః సహర్షిభిః || 26

విరాజంతే విమానస్థా దీప్యమానా ఇవా గ్రతః|తాన్‌ దృష్ట్వా మన్యునా 77విష్టో దధీచి ర్వాక్య మబ్రవీత్‌ || 27

దక్ష ప్రజాపతి యీ చెప్పిన విధముగ యజ్ఞారంభము చేసెను. ఇంద్రాదిదేవతలు వచ్చిరి. అగ్నిసమమైన తేజస్సులతో విమానముల మీద గంగా(హరి) ద్వారమునకు వారరుదెంచిరి. గంధర్వులు అప్సరసలు ఆడిరిపాడిరి. అందరును చేతులొగ్గి యాయనను సేవించిరి. మఱియు శ్రీమహావిష్ణువుతో వసు, రుద్ర, ఆదిత్య, సాధ్య మరుద్గణములు ఊష్మపులు, ఆజ్యవులు, సోమపాయలు అశ్వినీ దేవతలు యజ్ఞభాగార్థులై వచ్చిరి. జరాయుజ, అండజ, స్వేదజ,ఉద్భిజ్జములను నాలుగు రకముల జీవసంఘాతము కూడ వచ్చిరి. దేవతలు,ఋషులు సపత్నీకులై యేతెంచిరి. వారిని చూచి దధీచి కుపితుడై ఇట్లనియె.

దధీచిరువాచ

అపూజ్య పూజనే చైవ పూజ్యానాం చా ప్యపూజనే | నరః పాప మవాప్నోతి మహా ద్వై నాత్ర సంశయః || 28

బ్రహ్మోవాచ

ఏవ ముక్త్వా తు విప్రర్షిః పున ర్ధక్ష మభాషత ||29

దధీచిరువాచ

పూజ్యం చ పశుభర్తారం కస్మా న్నార్చయసే ప్రభుమ్‌ || 30

దక్ష ఉవాచ

సంతి మే బహవో రుద్రాః శూలహస్తాః కపర్దినః | ఏకాదశ స్థానగతా నాన్యం విద్మో మహేశ్వరమ్‌ || 31

దధీచిరువాచ

సర్వేషా మేకమాత్రో 7యం మమేశో న నిమంత్రితః|యథా7హం శంకరా దూర్ధ్వం నాన్యం పశ్యామి దైవతమ్‌ ||

తథా దక్షస్య విపులో యజ్ఞో 7యం న భవిష్యతి|| 32

దక్ష ఉవాచ

విష్ణో శ్చ భాగాః వివిధాః ప్రదత్తా స్తథా చ రుద్రేభ్య ఉత ప్రదత్తాః | అన్యే7పి దేవా నిజభాగయుక్తా దదామి భాగం న తు శంకరాయ || 33

బ్రహ్మోవాచ

గతా స్తు దేవతా జ్ఞాత్వా శైలరాజపసుతా తదా | ఉవాచ వచనం శర్వం దేవం పశుపతిం పతిమ్‌ || 34

పూజార్హులు కానివారిని పూజించినను అర్హులను పూజింపకున్నను మానవుడు మహాపాపియగును. అని దక్షుని చూచి పశుపతిని పూజార్హుని పరమేశ్వరుని నీవేల పూజింపవని యడిగెను. దానికి దక్షుడు - శూలహస్తులు జటాజూట ధారులునైన ఏకాదశరుద్రులు నాకు గలరు. మఱియొక మహేశ్వరుని మేమెరుగము అనెను. అదివిని దధీచిసర్వేశ్వరుల కేకైకమూర్తి యయిన మా మహేశ్వరుని నీవు పిలువలేదు శంకరుని కంటె మించిన దైవతమును నేనుగానను. ఈ యజ్ఞము సంపన్నముగాదు. అన దక్షుడు విష్ణువునకు హవిర్భాగము లిచ్చితిమి. రుద్రులకు నిచ్చితిమి. మఱియును గల దేవతలందరకు వారివారి భాగములనిచ్చుచున్నాను. శంకరునికి మాత్రమీయననెను.

బ్రహ్మ ఇట్లనియె. గిరిరాజకుమారి, తండ్రి యజ్ఞయునకు వేల్పులెల్లరేగిరని తెలిసి పశుపతియగు పతితో నిట్లనియె.

ఉమోవాచ

భగవ న్కుత్రయాంత్యేతేదేవాఃశక్రపురోగమాః| బ్రూహితత్త్వేనతత్త్వజ్ఞ సంశయో మే మహా నయమ్‌ || 35

మహేశ్వర ఉవాచ

దక్షో నామ మహాభాగే! ప్రజానాం పతి రుత్తమః | హయమేధేన యజతే తత్ర యాంతి దివౌకసః ||36

దేవ్యువాచ

యజ్ఞ మేతం మహాభాగ! కిమర్థం నానుగచ్ఛసి | కేన వా ప్రతిషేధేన గమనం తే న విద్యతే || 37

మహేశ్వర ఉవాచ

సురై రేవ మహాభాగే సర్వ మేత దనుష్టితమ్‌ | యజ్ఞేషు మమ సర్వేషు న భాగ ఉపకల్పితః || 38

పూర్వాగతేన గంతవ్యం మార్గేణ వరవర్ణిని | న మే సురాః ప్రయచ్ఛంతి భాగం యజ్ఞస్య ధర్మతః || 39

ఉమావాచ

భగవ న్సర్వదేవేషు ప్రభావాభ్యధికో గుణౖః | అజేయ శ్చాప్యధృష్యశ్చ తేజసా యశసా శ్రయా || 40

అనేన తు మహాభాగ ప్రతిషేధేన భాగతః | అతీవ దుఃఖ మాపన్నా వేపథు శ్చ మహ నయమ్‌ || 41

కింనామ దానం నియమం తపో వా కుర్యామహం యేన పతిర్మమాద్య | లభేత భాగం భగవా నచింత్యో యజ్ఞస్య చే ంద్రాధ్యమరైర్వి భక్తమ్‌ || 42

బ్రహ్మోవాచ

ఏవం బ్రువాణాం భగవా న్విచింత్య పత్నీం ప్రహృష్టః క్షుభితా మువాచ |

స్వామి! ఇంద్రాది దేవతలు ఎచటికేగుచున్నారు. ఆరహస్యమును సర్వరహస్యజ్ఞుడవగు నీవు నాకానతిమ్ము అన ఈశ్వరుడు, మహానుభావుడగు దక్షుడను పేరుగల ప్రజాపతి యశ్వమేధము చేయుచున్నాడు. దేవి! ఈ యజ్ఞమునకు మీరేల వెళ్ళరు. వెళ్ళక పోవుట కభ్యంతరమేమి? ఈశ్వరుడు:-ఇదంతయు దేవతలు చేసిన కుట్ర. యజ్ఞములందన్నిటను నాకు భాగము కల్పింపబడుటలేదు. మునుపటినుండి యేర్పడిన దారినే పోవలెను. దేవతలు యజ్ఞభాగమును నాకు ధర్మము ననుసరించి యీయవలసినది ఇచ్చటలేదు అన పార్వతి యిట్లనియె. ఏలినవారు ప్రభావము చేతను గుణముల చేతను దేవతలందరిలో తేజస్సుచేత కీర్తిచేత యణిమాసంపద చేత గెలువరాని వారు లొంగని వారు. మీకీ హవిర్భాగము ఈయనందున నేనెంతో దుఃఖమునందు చున్నాను. నాకు వణకు పుట్టుచున్నది. సాక్షాద్భగవంతుడు ధ్యానమునకందని మహానుభావులు అయిన నా భర్త యజ్ఞభాగమునందుటకు నేనేమి దానము, నియమము తపస్సు చేయుదును అని పలికి క్షోభ పడుచున్న పత్నిని జూచి భగవంతుడు ఆనందభరితుడై యిట్లనియె.

మహేశ్వర ఉవాచ

న వేత్సి మాం దేవి కృశోదరాంగి కింనామ యుక్తం వచనం త వేదమ్‌ ||43

అహం విజానామి విశాలనేత్రే! ధ్యానేన సర్వే చ విదంతి సన్తః | తవా ద్య మోహేన సహేంద్రదేవా లోకత్రయం సర్వమధోవినష్టమ్‌ || 44

మా మధ్వరేశం నితరాం స్తువంతి రథంతరం సామ గాయంతి మహ్యమ్‌ | మాం బ్రాహ్మణా బ్రహ్మమంత్రై ర్యజంతి మమా ధ్వర్యవః కల్పయంతే చ భాగమ్‌ || 45

దేవ్యువాచ

వికత్థసే ప్రాకృతవ త్సర్వస్త్రీజనసంసది | స్తౌషి గర్వాయసే చాపి స్వ మాత్మానం న సంశయః || 46

భగవానువాచ

నా 77త్మానం స్తౌమి దేవేశి! యథా త్వ మనుగచ్ఛసి | సంస్రక్షామి వరారోహే భాగార్థే వరవర్ణిని || 47

బ్రహ్మోవాచ

ఇత్యుక్త్వా భగవాన్పత్నీముమాంప్రాణౖరపిప్రియామ్‌ | సో 7సృజ ద్భగవా న్వక్త్రా త్సుత్రం క్రోధాగ్ని సంభవమ్‌ || 48

త మువాచ మఖం గచ్ఛ దక్షస్య త్వం మహేశ్వర|నాశయా 77శు క్రతుం తస్య దక్షస్య మదనుజ్ఞయా || 49

ఈశ్వరుండిట్లనియె. ఓ కృశోదరి! లతాంగి! నన్నీవెఱుంగవు. నీవిపుడన్నమాటలేమంత యుచితములు? విశాలాక్షి! మహానుభావులందఱు నేమనకొందురో నేనెఱుంగుదును. నీకుగలిగిన పొరబాటువలన ఇంద్రునితోగూడ నెల్ల దేవతలు ముల్లోకములు సర్వము నష్టపడినది. నన్ను యజ్ఞేశ్వరుండందురు. రథంత సామముచే వేదవిదులు నన్ను స్తుతింతురు. బ్రాహ్మణులు నన్ను వేదమంత్రములచే యజింతురు. అధ్వర్యులు నాకు యజ్ఞములందుభాగము గల్పింతురు. అనవిని దేవి యిట్లనియె. సామాన్యునివలె నాడు వారిలో నిన్ను నీవు పొగడుకొనుచున్నావు. నీలో నీవు గర్వపడుచున్నావు. సందేహములేదన నీశ్వరుండు సురేశ్వరి! నీవనుకొన్నట్లు నన్ను నేను బొగడుకొనుటలేదు. ఇక నా యజ్ఞభాగమును నేనడుగబోవుచున్నాను. అని ప్రాణములకంటె బ్రియురాలైన యుమాదేవింగూర్చి భగవంతుడు పలికి ముఖమునుండి క్రోధాగ్నినుండి యొక కుమారుని సృష్ఠించెను. వానింగని దక్షుని యజ్ఞమున కేగును. నాయాజ్ఞచే నతడు సేయుచున్న క్రతువును నాశనము సేయుమనియె.

బ్రహ్మ పలికెను--- అవ్వల నిట్లు రుద్రుడు ప్రయోగించిన సింహవేషధారి చేతను దేవి క్రోధవశ##మైనదని యెఱింగి నాదక్షయజ్ఞమవలీలగ ధ్వంసము చేయబడెను. ఆగ్రహముచే మహోగ్రయై మహేశ్వరి భద్రకాళియై. తాను కర్మసాక్షి గావున యా కోపమూర్తి వెంటనేగెను. రుద్రక్రోధ స్వరూపుడైన యాతడు వీరభద్రుడను పేరందెను. ఆయన శ్మశాన నివాసిగూడ. దాక్షాయణి కోపనివారణము సేసినవాడు. ఆయన తన రోమకూపములనుండి తనకుదాన గణశ్వరులను సృజించెను. వారు రుద్రునివెంట నుండువారు రుద్రుని బలపరాక్రమ స్వరూపులు రౌద్రాకారులు. రుద్రుని సేవకలు వందలు వేలకొలది యప్పుడు యటవచ్చి వ్రాలిరి. ఆ రుద్రగణములు సేసిన ఘోరమైన కిలకిలారావముల లాకాశ##మెల్ల నలముకొన్నట్లయ్యెను. ఆ ధ్వనికి దేవతలందరు హడలిపోయిరి.పర్వతములు బ్రద్దలయ్యెను. భూకంపమయ్యెను, ఝంఝూమారుతములు విసరెను. సముద్రము క్షోభించెను. అగ్నులు వెలుగవయ్యె. సూర్యుడు వెలవెల పోయెను.నక్షత్రములు తారాగ్రహములు కాంతిహీనములయ్యెను. ఋషులు దేవదానవులు ప్రభాశూన్యులయిరి. లోకమిట్లంధకారబంధురమయినతఱి గణశ్వరులువిజృంబించి యజ్ఞశాలనంటించిరి.బ్రద్దలు కొట్టిరి. యూపస్తంభములను పెల్లగించి పారవేసిరి. మనో వాయు వేగముల బర్వులెత్తిరి. యజ్ఞపాత్రములను యజ్ఞాయతనములను పిండి పిండి చేసిరి.తారలు(నక్షత్రములు) తునుకతునుకలై నింగినుండి రాలుచున్నట్లు కనబడెను. రుద్రగణము దివ్యాన్నపానభక్ష్యరాసులను పర్వతములట్లున్న వానిని దినివేయ మొదలిడిరి. క్షీరనదులు, కరడుగట్టిననెయ్యి పాయసము తేనెలు ఇసుక మేటలిట్లు పడియున్న ఖండ శర్కరలు కాలువలై పారు బెల్లపు పాకములు హెచ్చురుచిగుల్కు మాంసములు వివిధములైన భక్ష్యములు (తినదగినవి) లేహ్య (నాకదగినవి) చోష్య (జుఱ్ఱదగినవి) పానీయములు (త్రావదగినవి) పెక్కునోళ్ళ దినుచున్నారు. ఒలుకబోయుచున్నారు, విరజిమ్ముచున్నారు, రుద్రుని కోపస్వరూపులు మహాకోవులు. కాలాగ్నులట్లున్నారు. నడగొండలట్లు నలుదెసలగ్రమ్మి భక్షించిరి. బెదరించెను. పలురూపులనాడిరి. గంతులిడిరి. దేవతాంగనలంబట్టుకొని విసరజొచ్చిరి. ఇట్లు గణములం గూడి ప్రతాపశాలి వీరభధ్రుడు రుద్రకోపముచే బ్రయోగింపబడి సర్వదేవతల రక్షణలోనున్న యమ్మహాయజ్ఞమును, భద్రకాళిసన్నిధినుండ దహించివేసెను. కొందరు గణాధివులు సర్వభూతభయంకరముగ నార్చులు వెట్టిరి. యజ్ఞపురుషుని తలబ్రద్దలుగొట్టి పెల్లున గర్జించిరి. అంతట నింద్రాదిదేవతలు దక్షప్రజాపతియుం జేతులుజోడించి తామెవ్వరో తెలుపుమనిరి.

బ్రహ్మోవాచ

తతోరుద్రప్రయుక్తేన సింహవేషేణ లీలయా | దేవ్యా మన్యుకృతం జ్ఞాత్వా హతో దక్షస్య స క్రతుః || 50

మన్యునా చ మహాభీమా భద్రకాళీ మహేశ్వరీ | అత్మనః కర్మ సాక్షిత్వే తేన సార్థం స హానుగా || 51

స ఏష భగవా న్క్రోథః ప్రేతావాస కృతాలయః | వీరభ##ద్రేతి విఖ్యాతో దేవ్యా మన్యుప్రమార్జకః || 52

సో 7సృజ ద్రోమ కూపేభ్య ఆత్మ నైవ గణశ్వరాన్‌|రుద్రానుగాన్‌ గణా న్రౌద్రా న్రుద్ర వీర్య పరాక్రమాన్‌|| 53

రుద్ర స్యానుచరా స్సర్వే సర్వే రుద్రపరాక్రమాః|తే నిపేతు స్తత స్తూర్ణం శతశో 7థ సహస్రశః || 54

తతః కిలకిలాశబ్ద అకాశం పూరయ న్నివ|సమభూ త్సుమహా న్విప్రాః సర్వరుద్రగణౖః కృతః || 55

తేన శ##బ్దేన మహతా త్రస్తాః సర్వే దివౌక సః | పర్వతా శ్చ వ్యశీర్యంత చకంపే చ వసుంధరా || 56

మరుత శ్చ వవుః క్రూరా శ్చుక్షుభే వరుణాలయః | అగ్నయో వై న దీప్యంతే న చా దీప్యత భాస్కరః 57

గ్రహానైవ ప్రకాశంతే నక్షత్రాణి న తారకాః ఋషయో న ప్రభాసంతే న దేవా న చ దానవాః || 58

ఏవం హి తిమిరీభూతే నిర్థహంతి గణశ్వరాః | ప్రభంజం త్యపరే యూపాన్‌ ఘోరా నుత్పాటయంతి చ|| 59

ప్రణదంతి తథా చాన్యే వికుర్వంతి తథాపరే | త్వరితం వై ప్రధావంతి వాయువేగా మనోజవాః || 60

చూర్ణ్యంతే యజ్ఞపాత్రాణి యజ్ఞస్యా 77యతనాని చ | శీర్యమాణా న్య దృశ్యంత తారా ఇవ నభస్థలాత్‌|| 61

దివ్యాన్న పాన భక్ష్యాణాం రాశయః పర్వతోపమాః | క్షీరనద్య స్తథా చాన్యా ఘృతపాయసకర్దమాః || 62

మధుమండోదకా దివ్యాః ఖండశర్కర వాలుకాః | షడ్రసా న్నివహం త్యన్యా గుడకుల్యా మనోరమాః || 63

ఉచ్ఛావచాని మాంసాని భక్ష్యాని వివిధాని చ | యానికాని చ దివ్యాని లేహ్యచోష్యాణి యాని చ || 64

భుంజతి వివిధై ర్వక్త్రై త్విలుంపంతి క్షిపంతి చ | రుద్రకోపా మహాకోపాః కాలాగ్ని సదృశోపమాః || 65

భక్షయంతో 7థ శైలాభా భీషయంత శ్చ సర్వతః | క్రీడంతి వివిధాకారా క్షిపు స్సురయోషిత || 66

ఏవం గణా శ్చ తై ర్యుక్తో వీరభద్రః ప్రతాపవాన్‌ | రుద్రకోపయుక్త శ్చ సర్వదేవై స్సురక్షితమ్‌ || 67

తం యజ్ఞ మదవా చ్ఛీఘ్రం భద్రకాళ్యాః సమీపతః | చక్రు రన్యే తథా నాదా న్సర్వభూత భయంకరాన్‌ || 68

ఛిత్వా శిరో 7న్యే యజ్ఞస్య వ్యనదంత భయంకరమ్‌ | తత శ్శక్రాదయా దేవా దక్ష శ్చైవ ప్రజాపతిః ||

ఊచుః ప్రాంజలయో భూత్వా కథ్యతాం కో భవా నితి || 69

వీరభద్ర ఉవాచ

నాహం దేవో న దైత్యో వా న చ భోక్తు మిహా77గతః | నైవ ద్రష్టుం చ దేవేంద్రాః న చ కౌతూహలాన్వితః || 70

దక్షయజ్ఞ వినాశార్థం సంప్రాప్తో7 హం సురో త్తమాః | వీరభ##ద్రేతివిఖ్యాతో రుద్రకోపా ద్వినిసృతః || 71

భద్రకాళీ చ విఖ్యాతా దేవ్యాః క్రోధా ద్వినిర్గతా | ప్రేషితా దేవదేవేన యాజ్ఞాంతిక ముపాగతా || 72

శరణం గచ్ఛ రాజేంద్ర! దేవదేవ ముమాపతిమ్‌ | వరం క్రోథో7పి దేవస్య న వరః పరిచారకైః || 73

అప్పుడు వీరభద్రుండిట్లనియె. నేనుదేవుడనుగాను దైత్యుడనుగాను ఇక్కడ విందుగడుచుటకు వచ్చినవాడనుగాను. మీవేడుకచూడ వేడుకపడువాడనుగాను. దక్షయజ్ఞ నాశనము సేయ వచ్చినాడను. రుద్రకోపమువలన బయలుదేరినానాడను. వీరభద్రుడను పేరందినవాడనను. దేవిక్రోధమునుండి వెలువడి భధ్రకాళియని పేరందినదీమె. దేవదేవుడు పంప నీయజ్ఞము దరికి వచ్చినది. రాజేంద్రా! నీవు దేవదేవు నుమాపతిని శరణందుము. దేపప్రభువు కోపించుట మంచిదిగాని నైకరులతో గోపము మంచిదిగాదు.

నిఖాతోత్పాటితై ర్యూపై రపవిద్ధై స్తత స్తతః | ఉత్పతద్భిః పతద్భి శ్చ గృధ్రై రామిషగృధ్నుభిః || 74

పక్షవాత వినిర్థూతై శ్శివారుత వినాదితైః | స తస్య యజ్ఞో సృపతే ర్భాధ్యమమాన స్తదా గణౖః || 75

ఆస్థాయ మృగరూపం వై ఖ మేవా7భ్యపత త్తదా|తం తు యజ్ఞం తథారూపం గచ్ఛంత ముపలభ్య సః || 76

ధను రాదాయ బాణం చ తదర్థ మగమ త్ర్పభుః | తత

స్తస్య గణశస్య క్రోథా దమిత తేజసః || 77

లలాటాత్ర్పసృతో ఘోరః స్వేదబిందు ద్బభూవ హ | తస్మి న్పతితమాత్రే చ స్వేదబిందౌ తదా భువి || 78

ప్రాధుర్భూతో మహా నగ్ని ర్జ్వలత్కాలానలోపమః | తత్రో దపద్యత తదా పురుషో ద్విజస త్తమాః || 79

హ్రస్వో 7తిమాత్రో రక్తాక్షో హరిచ్ఛ్మశ్రు ర్విభీషణః|ఊర్థ్వకేశో 7తిరోమాంగః శోణకర్ణ స్తథైవ చ || 80

కరాళకృష్ణవర్ణ శ్చ రక్తవాసా స్తథైవ చ | తం యజ్ఞం స మహాసత్వో 7దహ త్కక్ష మివా నలః || 81

దేవా శ్చ ప్రద్రుతా స్సర్వే గతా భీతా దిశో దశ | తేన తస్మిన్విచరతా విక్రమేణ తదా తు వై 82

పృథివీ వ్యచల త్సర్వా సప్త ద్వీపా సమంతతః | మహాభూతే ప్రవృత్తే తు దేవలోక భయంకరే || 83

తదా చాహం మహాదేవ మబ్రవం ప్రతి పూజయాన్‌|భవతే7పి సురా స్సర్వే భాగం దాస్యంతి వై ప్రభో|| 84

క్రియతాం ప్రతిసంహారః సర్వదేవేశ్వర! త్వయా | ఇమా శ్చ దేవతాః సర్వా ఋషయ శ్చ సహస్రశః || 85

తన క్రోధా న్మహాదేవ న శాంతి ముపలేభిరే | య శ్చైష పురుషో జాతః స్వే దజ స్తే సురర్షభ || 86

జ్వరో నా మైష ధర్మజ్ఞ! లోకేషు ప్రచరిష్యతి | ఏకీభూతస్య న హ్యస్య ధారణ తేజసః ప్రభో || 87

సమర్ధా సకలా పృధ్వీ బహుధా సృజ్యతామయమ్‌ | ఇత్యుక్తః స మయా దేవో భాగే చాపి ప్రకల్పితే || 88

భగవా న్మాం తథే త్యాహ దేవదేవః పినాకధృక్‌ | పరాం చ ప్రీతి మగమ త్స స్వయం చ పినాక దృక్‌ || 89

దక్షో 7పి మనసా దేవం భవం శరణ మున్వగాత్‌ | ప్రాణాపానౌ సమారుధ్య చక్షుస్థ్సానే ప్రయత్న తః || 90

విధార్య సర్వతో దృష్టిం బహుదృష్టి రమిత్రజిత్‌ | స్మితం కృత్వా 7బ్రవీ ద్వాక్యం బ్రూహి ''కిం కరవాణి తే'' || 91

శ్రావితే చ మహాఖ్యానే దేవానాం పితృభిస్సహ | త మువాచా ంజలిం కృత్వా దక్షో దేవం ప్రజాపతిః ||

భీత శ్శంకితచిత్త స్తు సబాష్ప వదనేక్షణః || 92

కలుగులనుండి పెల్లగింపబడి విఱువబడిన యూపములతో మాంసలుబ్ధములైవ్రాలుచుమిక్కిలివిసురగ ఱక్కలు విసరుచు నెగురుచు వ్రాలుచున్నగ్రద్దలతో నక్క కూతలతో ప్రతిధ్వనించుచున్న రుద్రగణములచే ధ్వంసము సేయబడిన దక్షయజ్ఞమపుడు లేడిరూపుగొని యాకాశమున కెగిరిపోయెను. ఆ రూపమున బోవుచున్న యయ్యజ్ఞపురుషుం జూసి వీరభద్రస్వామి విల్లునమ్ములుంగొని వానింజంప నేగెను. అమిత ప్రతాపశాలియైన యాగణశుని క్రోథమువలన నాతని నుదుటినుండి ఘోరమైన యొక చెమటచుక్క రాలిపడెను. నేలపై బడగానె యా ప్వేదబిందువునుండి ప్రజ్వలించు కాలాగ్నివోలె నొక పురుషుడావిర్భవించెను. ఆదోచిన పురుషమూర్తి మరుగుజ్జు ఎఱువుగన్నులవాడు. బవిరిగడ్డమువాడు. భయంకరుడు. నిక్కిన తలవెంట్రుకలు. ఒడలెల్లబొచ్చు. ఎఱుపారుచెవులు. జడుపుగొల్పు కాఱునలుపురంగు ఎఱ్ఱబట్టలు గలవాడై యమ్మహాబలుడా యజ్ఞము నగ్ని కక్షమును(ఎండుగడ్డిని)వలె గాల్చివైచెను.

దేవతలడలెత్తి పదిదెసలకు బారిపోయిరి. అందు విక్రమమున సంచారము సేయుచున్న యా వీరభద్రునిచే భూమి సప్తద్వీపములతో గంపించెను. దేవలోకభయంకరమైన యొక పెనుభూతమిట్లు విజృంబించినంతట నేను(బ్రహ్మ) మహాదేవుని బూజించుచు నిట్లంటిని.

దేవతలెల్లరు నీకుగూడ యజ్ఞభాగము నీయగలరు. ప్రభూ! సర్వదేవాధినాథుడవు. నీవీ భయంకరరూపము నుపసంహరింపుము. ఈ దేవతలందఱు వేలకొలదిఋషులు నీ క్రోధముచే శాంతివడయలేకున్నారు. ఓ సురేశ్వరా! నీ చెమటనుండి పుట్టిన యీ పురుషుడు

జ్వరమనుపేర లోకములం జరింపగలడు. ఏకరూపమైయున్న నితని తేజస్సును ఈ యెల్లపృధివియు భరింపజాలదు. కావున దీనిని పెక్కురూపుల గావింపుము. అని నేనన్నంతట, యాయనకుగూడ యజ్ఞ భాగము గల్పించినంతట నాభగవంతుడు పినాకపాణి తనకుదాను పరమప్రీతి నందెను. దక్షుడును మనసార నాభవుని దేవుని శరణందెను. నేత్రస్థానమున ప్రాణాపానములను ప్రయత్నముతో నిలిపి బహుదృష్టియగు పరమేశ్వరుడు బహిర్గతమైన చూపును మరలించి నిలిపి యల్లన నవ్వి నీకేమి చేయుదును తెలుపుమనియె. ఈకథను దేవతలు పితృదేవతలు నాలించినంతట ప్రజాపతి దక్షుడు చేతులు మొగిచి బెదరిపోయి మదిలో శంకించుచు కన్నుల నీరు గార్చుచు నిట్లనియె.

దక్ష ఉవాచ

యది ప్రసన్నో భగవా న్యది వా 7హం తవ ప్రియః | యది చాహ మనుగ్రాహ్యో యది దేయో వరో మమ|| 93

య ద్భక్ష్యం భక్షితం పీతం త్రాసితం యచ్చ నాశితమ్‌ | చూర్ణికృతాపవిధ్ధం చ యజ్ఞ సంభార మీదృశమ్‌ || 94

దీర్ఘకాలేన మహతా ప్రయత్నేన చ సంచితమ్‌ | న చ మిథ్యా భ##వే న్మహ్యం త్వత్ర్పసాదా న్మహేశ్వర! || 95

భగవంతుడు నాయెడల బ్రసన్నుడగుసేని నేను నీకు బ్రియుండనేని నేననుగ్రహింప నర్హుడనేని నాకొక్క వరమీయదగును. ఈ యజ్ఞము కొరకు బహుకాలము బహుప్రయత్నముచే సమకూర్చుకొన్న భక్ష్యమెల్ల భక్షింపబడినది. త్రావదగినిదెల్ల త్రావబడినది. బెదిరింపబడినది. నాశనము సేయబడినది. పొడిపొడిగావింపబడినది. ముక్కముక్కలు సేయబడినది. అయినను నీయనుగ్రహమువలన నో మహేశ్వర! ఈయజ్ఞ మబద్దము గాగూడదు. సఫలము గావలయునని ప్రార్ధించెను.

బ్రహ్మోవాచ

తథా 7స్త్వి త్యాహ భగవా న్భగనేత్రహరో హరః | ధర్మాధ్యక్షం మహాదేవం త్ర్యంబకం చ ప్రజాపతిః || 96

జానుభ్యా మవనీం గత్వా దక్షో లబ్ధ్వా భవాధ్వరమ్‌ | నామ్నాం చాష్ట సహస్రేణ స్తుతవా న్వృషభధ్వజమ్‌ || 97

ఇతి శ్రీ బ్రహ్మోపురాణ - దక్షయజ్ఞ విధ్వంసనం నామ - ఏకోన చత్వారింశో7ధ్యాయః

తథాస్తు (అట్లేయగుగాక)యని భగుని కన్నులురాల్చిన యాహరుడు పలికెను. ధర్మమునకధ్యక్షుడు త్రినేత్రుడునగు మహాదేవుని దక్షుడు నేలపై మోకాళ్ళ నానించి నమస్కరించి శివయజ్ఞముంబడసి యెనిమిదివేల శివనామముల నా వృషభధ్వజుని స్తుతించెను.

ఇది శ్రీ బ్రహ్మపురాణములో 'దక్షయజ్ఞ విధ్వంసనము' అను ముప్పది తొమ్మిదవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters