Brahmapuranamu    Chapters   

అ ష్ట త్రి ం శో 7 ధ్యా యః

మదన దహనమ్‌

బ్రహ్మోవాచ

ప్రవిష్టే భవనం దేవే సూపవిష్టే వరాసనే|స వక్రో మన్మథః క్రూరో దేవం వేద్ధుమనా భవత్‌ || 1

త మనాచారసంయుక్తం దురాత్మానం కులాధమమ్‌|లోకా న్సర్వా న్పీడయంతం సర్వాంగావరణాత్మకమ్‌ || 2

ఋషీణాం విఘ్నకర్తారం నియమానాం వ్రతై స్సహ|చక్రాహ్వయస్య రూపేణ రత్యా సహ సమాగతమ్‌ || 3

అథా 77తతాయినం విప్రాః! వేద్ధుకామం సురేశ్వరః|నయనేన తృతీయేన సావజ్ఞం సమవైక్షత || 4

తతో 7స్య నేత్రజో వహ్ని ః జ్వాలామాలా సహస్రవాన్‌|సహసా రతిభర్తార మదహ త్సపరిచ్ఛమ్‌ || 5

స దహ్యమానః కరుణ మార్తో 7క్రోశత వి స్వరమ్‌ | ప్రసాదయం శ్చ తం దేవం పపాత ధరణీతలే || 6

అథ సో 7గ్నిపరీతాంగో మన్మథో లోక తాపనః | పపాత సహసా మూర్ఛాం క్షణన సమపద్యత || 7

పత్నీ తు కరుణం తస్య విలలాప సుదుఃఖితా | దేవీం దేవం చ దుఃఖార్తా అయాచ త్కరుణావతీ || 8

తస్యా శ్చ కరుణాం జ్ఞాత్వా దేవౌ తౌ కరుణాత్మకౌ | ఊచతు స్తాం సమాలోక్య సమాశ్వాస్య చ దుఃఖితామ్‌ || 9

మహాదేవుడు నిజభవనమందాసనమున గూర్చుండ దుష్టుడగు మన్మథుడాయనను వేధింప నేతించెను. అది యెరింగి యయ్యాతతాయిని శిక్షింప నిటలాక్షుండు తృతీయ నేత్రమున వీక్షింప - నమ్ముక్కంటి మంటకెఱయై యనంగుడు మూర్చవడెను. ఆయన సతి రతి మిక్కిలి శోకించెను. అంత జాలిగొని యాయుమా శంకరులు రతీదేవింగని యిట్లనిరి.

ఉమామహేశ్వరావూచతుః

దగ్ధ ఏవ ధ్రువం భ##ద్రే! నా స్యో త్పత్తి రిహే ష్యతే|అశరీరో 7పి తే భ##ద్రే కార్యం సర్వం కరిష్యతి || 10

యదా తు విష్ణు ర్భగవా న్వసుదేవసుతః శుభే|తదా తస్య సుతో య శ్చ పతి స్తే సంభవిష్యతి || 11

కల్మాణీ ! శరీరము లేకయు నీభర్త పూర్వమట్లు సర్వకార్య సమర్ధుండగును. విష్ణువు కృష్ణావతారమెత్తినపుడాతనికి కుమారుడై నీ పతి జనింప గలడు అని వరమిచ్చిరి.

బ్రహ్మోవాచ

తతః సా తు వరం లబ్ధ్వా కామపత్నీ శుభాననా|జగా మేష్టం తదా దేశం ప్రీతియుక్తా గతక్లమా || 12

దగ్ధ్వా కామం తతో విప్రాః స తు దేవో వృషధ్వజః|రేమే తత్రో మయా సార్ధం ప్రహృష్ట స్తు హిమాచలే || 13

కందరేషు చ రమ్యేషు పద్మినీషు గుహాసు చ| ని ర్ఝరేషు చ రమ్యేషు కర్ణికారవనేషు చ || 14

నదీ తీరేషు కాంతేషు కిన్నరా చరితేషు చ|శృంగేషు శైలరాజస్య తటాకేషు సరస్సు చ || 15

వనరాజిషు రమ్యాసు నానాపక్షిరుతేషు చ|తీర్ధేషు పుణ్యతోయేషు మునీనా మాశ్రమేషు చ || 16

ఏతేషు పుణ్యషు మనోహరేషు దేశేషు విద్యాధర భూషితేషు| గంధర్వ యక్షామరసేవితేషు రేమే స దేవ్యా సహిత స్త్రినేత్రః || 17

దేవై స్సహే%్‌ద్రై ర్ముని యక్షసిధ్ధై ర్గంధర్వ విద్యాధర దైత్యముఖ్యైః| అన్యై శ్చ సర్వై ర్వివిధై ర్వృతో 7సౌ తస్మి న్నగే హర్ష మవాప శంభుః || 18

నృత్యంతి తత్రా7 ప్సరస స్సురేశా గాయంతి గంధర్వగణాః ప్రహృష్టాః | దివ్యాని వాద్యా న్యథ వాదయంతి కేచిద్ద్రుతం దేవవరం స్తువంతి ||19

ఏవం స దేవః స్వగణౖ రుపేతో మహాబలై శ్శక్రయమాగ్నితుల్యైః | దేవ్యాః ప్రియార్థం భగనేత్రహంతా గిరిం న తత్యాజ తదా మహాత్మా || 20

ఋషయ ఊచుః

దేవ్యా సమం తు భగవాం స్తిష్టం స్తత్ర స కామహా|అకరోత్కిం మహాదేవ ఏతదిచ్ఛామ వేదితుమ్‌ || 21

బ్రహ్మోవాచ

భగవా న్హిమవచ్ఛృంగే స హి దేవ్యాః ప్రియేచ్ఛయా|గణశై ర్వివిధాకారై ః హాసం సంజనయ న్ముహుః || 22

దేవీం బాలేందుతిలకో రమయం శ్చ రరామ చ| మహానుభావై ః సర్వజ్ఞైః కామరూపధరై శ్శుభై ః|| 23

అథ దేవ్యాససాదై కా మాతరం పరమేశ్వరీ|ఆసీనాం కాంచనే శుభ్ర ఆసనే పరమాద్భుతే || 24

అథ దృష్ట్వా సతీం దేవీ మాగతాం సురరూపిణీమ్‌|ఆపనేన మహార్హేణా సంపాదయ దనిందితామ్‌ ||

ఆసీనాం తా మథో వాచ మేనా హిమవతః ప్రియా || 25

అచట నప్సరసలాడిరి గంధర్వులు పాడిరి. కొందరు దివ్యవాద్యములను వాయించిరి. కొందరు స్తుతించిరి. ఇంద్రయమాగ్నితుల్యులగు ప్రమథగణములతో నిట్లు శివుడు కూడి విహరించుచు దేవికి బ్రియమ్ముగూర్ప నాగిరిని విడువడయ్యెను. ఆ మీద దేవేశుండేమి కావించెనని ఋషులడుగ బ్రహ్మ యిట్లనియె: భగవంతు డాహిమగిరి శిఖరంబున దేవికి వినోదము గూర్ప ప్రమధగణములు పలురూపులు దాల్చి యాడునట్లొనర్చి దేవికి బరిహాసము గల్పించెను. అటుపై గిరికన్య యొంటరిగ బంగారు పీఠముపై గూర్చున్న జననిసన్నిధి కేగెను. మేనా దేవియు దేవరూపిణియగు శర్వాణి కాసనమిడి యాదరించి యామె కూరుచున్న తర్వాత నిట్లు పలుకరించెను.

మేనోవాచ

చిరస్యా77గమనం తే 7ద్య వద పుత్రి ! శుభేక్షణ | దరిద్రాక్రీడనై స్త్వం హిభర్త్రా క్రీడసి సంగతా || 26

యే దరిద్రా భవంతి స్మ తథైవ చ నిరాశ్రయాః | ఉమే త ఏవం క్రీడంతి యథా తవ పతి శ్శుభే || 27

మేన యట్లనియె. కుమారీ ! చిరకాలమునకు నీవు వచ్చితివి. ఆటవస్తువుల లేమికిగురియై భర్తతో నాడుకొను చున్నావు. ఎవ్వరులేనివారు దిక్కులేనివారో వారీ విధముగ నీ మగనివలె వినోదింతురు.

బ్రహ్మోవాచ

సై వ ముక్తా 7థ మాత్రా తు నాతిహృష్టమనా భవత్‌ మహత్యా క్షమయా యుక్తా న కించి త్తా మువాచ హవిసృష్టా చ తదా మాత్రా గత్వా దేవ మువాచ హ|| 28

అని తల్లి పలుక విని పార్వతి యంతరంగ మందంతట సంతోషపడలేక పోయెను. మిక్కిలి యోర్మితో గూడి యామె కించుకయు బదులీయదయ్యెను. మరియు దల్లిచే విడువబడి యేగి మహాదేవుని కిట్లనియె.

పార్వత్యువాచ

భగవ న్దేవ దేవేశ ! నే హ వత్స్యామి భూధరే | అన్యం కురు మమా 77వాసం భువనేషు మహాద్యుతే || 29

దేవ ఉవాచ

సదా త్వ ముచ్యమానా వై మయా వాసార్ధ మీశ్వరి! అన్యం న రోచితపతీ వాసం వై దేవి! కర్హిచిత్‌ || 30

ఇదానీం స్వయ మేవ త్వం వాస మన్యత్రశోభ##నే | కస్మా న్మృగయసే దేవి త న్మే వద శుచిస్మితే || 31

స్వామి ! దేవదేవేశ్వర ! ఈపర్వతమందు వసింపను. ఓతేజోనిధీ ! ఈ భువనములం టెందేని నాకు వేఱొక నివాస మేర్పరుపుము. అన విని దేవి ! నివాసార్ధమై నే నెల్లపుడు చెప్పుచున్నను వేఱొక నివాసమునకెన్నడు నిష్టపడవైతివి. ఇప్పుడు నీయంతట నీవే ఓ కల్యాణి ! వేఱొక నివాసము నెందులకు వెదకెదవో ? నాకది నెలువుమన దేవి యిట్లనియె.

గృహం గతా స్మి దేవేశ ! పితు రద్య మహాత్మనః | దృష్ట్వా చ తత్ర మే మాతా విజనే లోకభావనే || 32

ఆసనాదిభి రభ్యర్చ్య సా మా మేవ మభాషత | ''ఉమే! తవ సదా భర్తా దరిద్రః క్రీడనై శ్శుభే || 33

క్రీడతే న హి దేవానాం క్రీడా భవతి తాదృశీ''

య త్కిల త్వం మహాదేవగణౖ శ్చ వివిధై స్తథా | రమసే తదనిష్టం హి మమ మాతు ర్వృధ్వజ! || 34

మహానుభావుడు మా తండ్రి యింటికిప్పుడే నేను వెళితిని. మాయమ్మ యచ్చట నన్నుగని యేకాంతమున నాకాసనాదులిడి యాదరించి యిట్లనియె. ఉమా! నీ మగడు దరిద్రుడు. నిరంతరము నాటవస్తువులతో (బొమ్మలతో) నాడుకొనును. దేవతలకటువంటి యాట కూడదనెను. మహాదేవ! నీవు ప్రమథగణములతో పలురకములగు భూత ప్రేత పిశాచములతో వినోదింతువు. వృషభవాహన!అది మాయమ్మ కిష్టముగాదనియె.

బ్రహ్మోవాచ

తతో దేవః ప్రహస్యా 77హ దేవీం హాసయితుం ప్రభుః ||35

దేవ ఉవాచ

ఏవ మేవ న సందేహః కస్మా న్మన్యు రభూ త్తవ | కృత్తివాసా హ్య వాసా శ్చ శ్మశాననిలయ శ్చ హ || 36

అనికేతో హ్యరణ్యషు పర్వతానావ గుహాసు చ | విచరామి గణౖ ర్నగ్నై ర్వృతో 7ంభోజవిలోచనే || 37

మా క్రుధో దేవి మాత్రే త్వం తథ్యం మాతా 7వద త్తవ | న హి మాతృసమో బంధు ర్జంతూనా మస్తి భూతలే || 38

దేవ్యువాచ

న మే 7 స్తి బంధుభిః కించి త్కృత్యం సురవరేశ్వర | తథా కురు! మహాదేవ! యథా 7హం సుఖ మాప్నుయామ్‌ ||39

బ్రహ్మ యిట్లనియె. ఈశ్వరుడది విని యాదేవిని పరిహసింప జేయుటకిట్లనియె. ఇంతీ! మీయమ్మ యన్నది సత్యము. నీకేల కోపము? నేనిదిగో కృత్తివాసుడను. నిర్వాసుడను. శ్మశాన వాసిని. నిలువనీడ లేనివాడను. అడవులలో కొండలలో గుహలలో దిగంబరులగుంపులతో దిరుగుదును. మీయమ్మయెడ గినియకుము. తల్లికి సాటియగు చుట్టము మఱిలేదు. అని హరుడన నాయిల్లాలునాకు బంధువులతో బనిలేదు. నేను సుఖపడుమార్గ మేదైన చేయమనియె.

బ్రహ్మోవాచ

శ్రుత్వా స దేవ్యా వచనం సురేశ స్తస్యాః ప్రియార్థే స్వగిరం విహాయ | జగామ మేరుం సురసిద్ధసేవితం భార్యాసహాయః స్వగణౖ శ్చ యుక్తః || 40

ఇతి బ్రహ్మపురాణ ఉమా మహేశ్వరయో ర్హిమవత్పరి త్యాగ నిరూపణం నామాష్ట త్రింశో7ధ్యాయః

బ్రహ్మ యిట్లనియె. పరమేశ్వరుడు ప్రియురాలి ప్రీతికొఱకామెతో కైలాసమునుండి ప్రమథ గణపరివారముతో సురసిద్ద సేవిమగు మేరువున కేగెను.

ఇది బ్రహ్మరాపుణమున నుమామహేశ్వరుల హిమవత్పరిత్యాగ నిరూపణమును ముప్పది యెనిమిదవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters