Brahmapuranamu    Chapters   

షట్‌ త్రింశో7ధ్యాయః

ఉమామహేశ్వరకల్యాణ వైభవమ్‌

బ్రహ్మోవాచ

విస్తృతే హిమవత్పృష్ఠే విమానశతసంకులే|అభవత్‌ సతు కాలేన శైలపుత్ర్యాః స్వయంవరః || 1

అథ పర్వతరాజో7సౌ హిమవాన్‌ ధ్యానకోవిదః|దుహితు ర్దేవదేవేన జ్ఞాత్వా తదభిమంత్రితమ్‌ || 2

జానన్నపి మహాశైలః సమయారక్షణప్సయా|స్వయంవరం తతో దేవ్యాః సర్వలోకే ష్వఘోషయత్‌ || 3

దేవదానవసిద్ధానాం సర్వలోకనివాసినామ్‌ | వృణుయాత్‌ పరమేశానం సమక్షం యది మే సుతా || 4

తదేవ సుకృతం శ్లాఘ్యం మమా భ్యుదయసమ్మతమ్‌|ఇతి సంచింత్య శైలేంద్రః కృత్వా హృది మహేశ్వరమ్‌ || 5

ఆబ్రహ్మకేషు దేవేషు దేవ్యాః శైలేంద్రసత్తమః కృత్వా రత్నాకులం దేశం స్వయంవర మచీకరత్‌ || 6

బ్రహ్మ యిట్లనియె. విశాలమైన హిమవత్పర్వతము మీద విమానముల సమ్మర్ధ మధికమయ్యెను. పార్వతి స్వయంవర సన్నాహమునందు గిరిరాజు తన కుమార్తె యభిప్రాయము హరునిపై నుండుట నెఱింగియును, వంశాచారము పాలించుటకు స్వయంవరవార్తనెల్ల లోకములందును జాటింపించెను. దేవదానవసిద్ధ గంధర్వాదులందఱి సమక్షమున నాకూమారి బ్రహ్మవరకుగల దేవతలందు పరమేశ్వరుని వరించునేని యదినా పుణ్యము సంస్తవనీయము. నా అభ్యుదయములకది అనుకూలము. అని మదినెంచి తన నగరము రత్నతోరణాలంకృతము లొనర్చి స్వయముగా చేసెను.

పార్వతీస్వయంవర వైభవము

అథైవ మాఘోషితమాత్ర ఏవ స్వయంవరే తత్ర నగేంద్రపుత్య్రాః |

దేవాదయః సర్వజగన్నివాసా స్సమాయయు స్తత్ర గృహీతవేశాః || 7

ప్రపుల్లపద్మాసనసన్నివిష్టః సిద్దైర్వృతో యోగిభి రప్రమేయైః |

విజ్ఞాపిత స్తేన మహీధ్రరాజ్ఞా గత స్తదాహం త్రిదివై రుపేతః || 8

క్షాణంసహస్రం సురరాట్‌ స బిభ్రద్‌ దివ్యాంగహారస్రగుదారరూపః |

ఐరావతం సర్వగజేంద్రముఖ్యం స్రవన్మదాసారకృత ప్రవాహమ్‌ || 9

ఆరుహ్య సర్వామరరాట్‌ స వజ్రం బిభ్రత్‌ సమాగా త్పురతః సురాణామ్‌ |

తేజః ప్రభావాధికతుల్యరూపీ ప్రోద్భాసయన్‌ సర్వదిశః వివస్వాన్‌ || 10

హైమం విమానం స వలత్పతాక మారూఢ ఆగా త్త్వరితం దినేశః |

మణిప్రదీప్తోజ్జ్వలకుండలశ్చ వహ్న్యర్కతేజఃప్రతిమే విమానే || 11

సమభ్యగాత్‌ కశ్యపసూను రేక ఆదిత్యమధ్యా ద్భగనామధారీ |

పీనాంగయష్టిః సుకృతాంగహారః తేజోబలాజ్ఞాసదృశ ప్రభావః || 12

దండం సమాగృహ్య కృతాంత ఆగా దారుహ్య భీమం మహిషం జవేన |

మహామహీధ్రోచ్ఛ్రయపీనగాత్రః స్వర్ణాదిరత్నాంచిత చారువేశః || 13

సమీరణః సర్వ జగద్బిభర్తా విమాన మారుహ్య సమభ్యగాద్ధి|

సంతాపయన్‌ సర్వసురాసురేశాం స్తేజో7ధిక స్తేజసి సన్నివిష్టః || 14

వహ్నిః సమభ్యేత్య సురేంద్రమధ్యే జ్వలన్‌ ప్రతస్థే వరవేశధారీ ||

నానామణిప్రజ్వలితాంగయష్టిః జగద్వరం దివ్యవిమాన మగ్ర్యమ్‌ || 15

ఆరుహ్య సర్వద్రవిణాధిపేశః స రాజరాజ స్త్వరితో 7భ్యగాచ్చ |

ఆప్యాయయన్‌ సర్వసురాసురేశాన్‌ కాంత్యాచ వేశేన చ చారురూపః || 16

జ్వలన్‌ మహారత్న విచిత్రరూపం విమాన మారుహ్య శశీ సమాయాత్‌ |

శ్యామాంగయష్టిః సువిచిత్రవేశః సర్వాంగ ఆబద్ధసుగంధిమాల్యః || 17

తారక్ష్యం సమారుహ్య మహీధ్రకల్పం గదాధరో7సౌ త్వరితః సమేతః |

అథాశ్వినౌ చాపి భిషగ్వరౌ ద్వా వేకంవిమానం త్వరయా 7ధిరుహ్య || 18

మనోహరౌ ప్రజ్వలచారువేశౌ ఆ జగ్మతు ర్దేవవరౌ సువీరౌ|

సహస్రనాగః స్ఫురదగ్ని వర్ణం బిభ్రత్తదానీం జ్వలనార్క తేజాః || 19

సార్థం స నాగై రపరై ర్మహాత్మా విమాన మారుహ్య సమభ్యగాచ్చ |

హిమవంతుడుచాటించిన స్వయంవర వార్తవిని యఖిలభువనవాసులయిన యువకులరుడెంచిరి. నేనును నక్కడ గిరిరాజు ప్రార్థనచే నెల్ల యోగులు సిద్ధులు సేవింప దేవతలతో నేగి పద్మాసనమందుపవిష్టుడనై యుంటిని. దివ్యాంబరాంగరాగ హారాది భూషణములం దాల్చి సురరాజు వేయి కన్నులతో నయ్యుత్సవముం దిలకింప మదధారలం గురియు మహిత గజరాజ మైరావతమునెక్కి వచ్చెను. తేజః ప్రభావమువలన నెల్లదిశల వెలిగించుచు చలత్పతాకమగు (జెండా నెగురుచున్న) బంగారువిమానమెక్కి భాస్కరుం డరుదెంచెను. తేజమ్మున బలమ్మున శాసనమున నసదృశుడై మణిమయోజ్వలకుండలములు ధరించి యాదిత్యమండలంబునుండి భగుడును నమరమూర్తి సూర్యుడట్లగ్నియట్లు వెలుగు విమానమున నేతెంచెను. యముడును దండంబు గొని భయంకరమహిషవాహనమెక్కి జవంబున పెద్దపర్వత మట్లొడ్డునుంబొడవుంగల్గి మంగళమూర్తియై మణిమయ స్వర్ణభూషణ మంజుల వేషియై యచ్చటకు విచ్చేసెను. సర్వజగత్ప్రాణుడైన సమీరణుడు విమాన మెక్కి సురాసురులకు వెఱగుగూర్చు తేజంబున నరుదెంచెను. వహ్నియు దివ్య విమానమెక్కి వరవేషధారియై వచ్చి సురేంద్రుల నడుమ వెలుంగుండెను. సర్వధనాధ్యక్షుడగు కుబేరుడు కాంతిచే వేషముచే నెల్ల సురాసురుల నాప్యాయన మొందజేయుచు పుష్పకవిమానమెక్కి యరుగుదెంచెను. నవరత్న విచిత్ర విమానమెక్కి చామనచాయ మేనివాడు సువిచిత్రవేషుడు పరిమళ పుష్పమాలను ధరించి సుధాంశుడరుదెంచెను. పర్వతములవలెనున్న విష్ణువు గదం దాల్చి గరుడు నెక్కి యేగుదెంచెను. పరమసుందరులు దేవలోకభిషగ్వరులు అశ్వినీదేవత లిరువురు నొక్కటేవిమానమెక్కి ముచ్చటగొల్పు వేషములతో నటకు వచ్చిరి. అగ్నివర్ణమైన విమానమెక్కి జ్వలనార్కప్రభతో నాగపరివారముతో సహస్రఫణామణిమండలుడగు నాగేంద్రు డప్పు డేతెంచెను.

దితేః సుతానాంచ మహాసురాణాం వహ్న్యర్క శక్రానిలతుల్యభాసామ్‌ || 20

వరానురూపం ప్రవిధాయ వేశం బృందం సమాగాత్‌ పురతః సురాణామ్‌ |

గంధర్వరాజః సచ చారురూపీ దివ్యాంగదో దివ్యవిమాన చారీ || 21

గంధర్వ సంఘైః సహితో7ప్సరోభిః శక్రాజ్ఞయా తత్రసమాజగామ |

అన్యేచ దేవా స్త్రిదివా స్తదానీం పృథక్‌ పృథక్‌ చారుగృహీతవేశాః || 22

ఆజగ్మురారుహ్య విమానపృష్ఠం గంధర్వయక్షోరగకిన్న రాశ్చ |

శచీపతిస్తత్ర సురేంద్రమధ్యే రరాజ రాజాధికలక్ష్యమూర్తిః || 23

ఆజ్ఞాబలైశ్వర్యకృతప్రమోదః స్వయం వరం తం సమలం చకార |

హేతుస్త్రిలోకస్య జగత్ప్రసూతే ర్మాతా చ తేషాం ససురాసురాణామ్‌ || 24

పత్నీచ శంభోః పురుషస్య సాక్షాత్‌ గీతా పురాణ ప్రకృతిః పరా యా|

దక్షస్య కోపా ద్ధిమవద్గృహం సా కార్యార్థ మాయా త్త్రిదివౌకసాం హి || 25

విమానపృష్ఠేమణిహేమజుష్టే స్థితా పలచ్చామరవీజితాంగీ |

సర్వర్తుపుష్పాం సుసుగంధమాలాం ప్రగృహ్య దేవీ ప్రసభం ప్రతస్థే || 26

పెండ్లికుమారుల ట్లలంకరించుకొని బృందారక బృందమేతెంచెను. గంధర్వరాజు తన సంఘముతో నప్సరసలతో నింద్రాజ్ఞంగొని యమ్ముచ్చటం గనుగొన వచ్చెను. మఱి కిన్నరకింపురుషనాగగణంబులు వచ్చిరి. అందరిలో నమరేంద్రుడు శచీపతి చూడముచ్చటైనసొంపున వెలింగెను. సురాసురజనని శంభుపత్ని యని పురాణములందు గీర్తింపబడినది పరాప్రకృతిమున్ను దక్షకోపమునకు గురియై హిమవంతునింటికికార్యావసరముగొని వచ్చినది. దివ్యవిమాన మందు దేవకాంతలు వింజామరలు వీవ సర్వఋతువులందలి పువ్వులతో సంతరింపబడిన మాలంగొని సత్వరముగ నామె స్వయంవరమునకు బయలుదేరెను.

బ్రహ్మోవాచ

మాలాం ప్రగృహ్య దేవ్యాం తు స్థితాయాం దేవసంసది|శక్రాద్యై రాగతై ర్దేవై స్స్వయంవర ముపాగతే || 27

దేవ్యా జిజ్ఞాసయా శంభు ర్భూత్వా పంచశిఖ శ్శిశుః|ఉత్సంగతలసంసుప్తో బభూవ సహసా విభుః || 28

తతో దదర్శ తం దేవీ శిశుం పంచశిఖం స్థితమ్‌|జ్ఞాత్వా తం సమవధ్యానా జ్జగృహే ప్రీతిసంయుతా ||వ 29

అథ సా శుద్ధసంకల్పా కాంక్షితం ప్రాప్య సత్పతిమ్‌|నివృత్తా చ తదా తస్థౌ కృత్వా సా హృది తం విభుమ్‌ || 30

తతో దృష్ట్వా శిశుం దేవా దేవ్యా ఉత్సంగవర్తినమ్‌|కో7య మత్రేతి సంమంత్ర్య చుక్రుశు ర్భృశమోహితాః || 31

వజ్ర మాహారయ త్తస్య బాహు ముతిక్షప్య వృత్రహా|బాహు రభ్యుత్థిత స్తస్య తథైవ సమతిష్ఠత || 32

స్తంభితః శిశురూపేణ దేవదేవేన శంభునా|వజ్రం క్షేప్తుం న శశాక వృత్రహా చలితుం నచ || 33

భగోనామ తతో దేవ ఆదిత్యః కాశ్యపో బలీ|ఉతిక్షప్య ఆయుధం దీప్తం ఛేత్తు మిచ్ఛన్‌ విమోహితః || 34

తస్యా7పి భగవాన్‌ బాహుం తథైవాస్తంభయ త్తదా|బలం తేజశ్చ యోగశ్చ తథై వాస్తంభయ ద్విభుః || 35

శిరః ప్రకంపయన్‌ విష్ణుః శంకరం సమవైక్షత|అథ తేషు స్థితే ష్వేవం మన్యు మత్సు సురేషు చ || 36

అహం పర మసంవిగ్నో ధ్యాన మాస్థాయ సాదరమ్‌|బుద్ధవాన్‌ దేవదేవేశ ముమోత్సంగే సమాస్థితమ్‌ || 37

జ్ఞాత్వా7 హం పరమేశానం శీఘ్ర ముత్థాయ సాదరమ్‌|వవందే చరణం శంభోః స్తుతవాం స్తమహం ద్విజాః || 38

పురాణౖ స్సామసంగీతైః పుణ్యాఖ్యైః గుహ్యనామభిః |

అట్లరుదెంచు గిరిరాజ కన్యంగని యామెను బరీక్షింపనెంచి శంభుడు పంచశిఖల ముచ్చట గొల్పు శిశువై యాదేవి యొడిలో నల్లన నిదురించెను. ఆదేవి చూచి ప్రీతినంది యారహస్యంబు గ్రహించి దానభిలషించినపతిగా నెఱింగి యాపాపనిం దన హృదయమందునిలిపి స్వయంవరమండపమునుండి వెనుదిరిగి వెళ్ళిపోయెను. ఎవడీ శిశువు? ఇచటి కెట్లు వచ్చినాడు! అని మిక్కిలి మోహపడి సురలు కేకలిడిరి. ఇంద్రుడు వజ్రంబూని నిలువబడి యాశిశువుచే నపుడ స్తంభితుండయ్యె. భగుడెత్తిన చేయి యెత్తినట్లయుండె. విష్ణువు శిరః కంపనమును జేయుచు శంకరుని వంక జూచెను. అపుడు నేను(బ్రహ్మా) కలతబడి ధ్యానమున నిలిచియాక్షణమ యాదేవి యొడిలోని బాలుడు బాలేందుధరుడని గ్రహించితిని. తెలిసినంతలేచి నిలువబడి యాదేవదేవు చరణములకు మ్రొక్కి పురాణములచే సామ సంగీతములచే గుహ్యములయిన పుణ్యనామావళిచే పెక్కురీతులం బొగిడితిని.

బ్రహ్మకృత శివస్తుతి

అజ స్త్వ మజరో దేవో విభుః స్రష్టా పరాపరః || 39

ప్రథానం పురోషో యస్త్వం బ్రహ్మ ధ్యేయం తదక్షరమ్‌|అమృతం పరమాత్మా చ ఈశ్వరః కారణం మహత్‌|| 40

బ్రహ్మసృక్‌ ప్రకృతేః స్రష్టా నర్వకృ త్ప్రకృతేః పరః|ఇయంచ ప్రకృతి ర్దేవీ సదా తే సృష్టికారణమ్‌ || 41

పత్నీరూపం సమాస్థాయ జగత్కారణ మాగతా|నమ స్తుభ్యం మహాదేవ మహాదేవ్యా యుతాయచ || 42

ప్రసాదా త్తవ దేవేశ నియోగా చ్చ మయా ప్రజాః|దేవాద్యా స్తు ఇమాః సృష్టా మూఢా స్త్వద్యోగమాయయా || 43

కురు ప్రసాద మేతేషాం యథాపూర్వం భవం త్విమే|తత ఏవ మహం విప్రా విజ్ఞాప్య పరమేశ్వరమ్‌ || 44

స్తంభితాన్‌ సర్వదేవాం స్తా నిదం చాహం తదోక్తవాన్‌|మూఢాశ్చ దేవతాః సర్వా నైనం బుధ్యత శంకరమ్‌ || 45

గచ్ఛధ్వం శరణం శీఘ్ర మేన మేన మహేశ్వరమ్‌|సార్థం మయైవ దేవేశం పరమాత్మాన మవ్యయమ్‌ || 46

తత స్తే స్తంభితాః సర్వే తథైవ త్రిదివౌకసః|ప్రణము ర్మనసా శర్వం భావశుద్ధేన చేతసా || 47

అథ తేషాం ప్రసన్నో 7భూ ద్దేవదేవో మహేశ్వరః|యథాపూర్వం చకారా 7శు దేవతానాం తనూ స్తదా || 48

తత ఏవం ప్రవృత్తే తు సర్వదేవనివారణ|వపు శ్చకార దేవేశ స్త్ర్యక్షం పరమ మద్భుతమ్‌ || 49

తేజసా తస్య తే ధ్వస్తా శ్చక్షుః సర్వే న్యమీలయన్‌|తేభ్యః స పరమం చక్షుః స్వవపుర్‌ దృష్టిశక్తిమత్‌ || 50

ప్రాదాత్‌ పరమదేవేశ మపశ్యం స్తే తదా విభుమ్‌|తే దృష్ట్వా పరమేశానం తృతీయేక్షణధారిణమ్‌ || 51

శక్రాద్యా మేనిరే దేవాః సర్వ ఏవ సురేశ్వరాః|తస్య దేవీ తదా హృష్టా సమక్షం త్రిదివౌకసామ్‌ || 52

పాదయోః స్థాపయామాస తాం మాలా మమితద్యుతిః|సాధుసాధ్వితి తే హోచుః సర్వే దేవాః పున ర్విభుమ్‌ || 53

సహదేవ్యా నమ శ్చక్రుః శిరోభి ర్భూతలాశ్రితైః|అథా 7స్మి న్నంతరే విప్రా స్త మహం దేవతైస్సహ || 54

హిమవంతం మహాశైల ముక్తవాం శ్చ మహాద్యుతిమ్‌|శ్లాఘ్యః పూజ్య శ్చ వంద్య శ్చ సర్వేషాం త్వం మహా నసి || 55

శ##ర్వేణ సహ సంబంధో యస్య తే 7భ్యుదయో మహాన్‌|క్రియతాం చారు రుద్వాహః కిమర్థం స్థీయతే పరమ్‌ ||

తతః ప్రణమ్య హిమవాం స్తదా మాం ప్రత్యభాషత || 56

ఇట్లు పరమేశ్వరుని నుతించి స్తంభించిన దేవతలం గని మీరీ పాపని శంకరుడని యెఱుంగలేరైరి. పొండు! శరణమందుడు. నేను మీతో శరణాగతుండ నయ్యెద నన నాత్రిదశులు భావశుద్ధితో నా శర్వుని కానతులైరి. శీఘ్రప్రసన్నుడు కాన స్వామి. వారియెడ జాలివడి యందరిని మున్నట్లు స్వస్థులం జేసెను ఇది యైయిన వెనుక నీశ్వరుడు త్రిలోచనములతో కూడిన అద్భుతమైన శరీరము దాల్చెను. ఆ తేజమునకు వారు కనులు మిరుమిట్లుగొన జూడలేక కనులు మూసికొనిరి. ఆయన వారికి తన మూర్తి జూడ ననువైనచూపుననుగ్రహించెను వారుం దాన నాయీశ్వరుం జూచి యాయన నిటలాక్షుండని యెఱింగిరి. వారందరు కనుగొనుచుండ నప్పుడ యద్దేవి యాదేవదెవు పాదమ్ముల స్వయంవరమాల నలంకరించెను. ''బాగు బాగు'' అని యెల్లవేల్పులు నుతించిరి. ఆ దేవితో గూడ తలలు వాల్చి నమస్కరించిరి. అపుడు నేను హిమవంతునితో నిట్లంటిని. ''పూజనీయుడవైవు వందనము సేయ దగుదువు. ఈశ్వరుని తోడి సంబంధమిది నీ భాగ్యమ్ము కానిమ్ము. కల్యాణ మహోత్సవమున కెందులకు విలంబము'' అన హిమవంతుడు మ్రొక్కి నాకిట్లనియె.

త్వ మేవ కారణం దేవ యస్య సర్వేదయే మమ|ప్రసాదః సహసోత్పన్నో హేతు శ్చాపి త్వ మేవ హి ||

ఉద్వాహస్తు యదా యాదృక్‌ తద్విధత్స్వ పితామహ || 57

దేవా! నా అభ్యుదయమునకెల్ల నీవె కారణము. అనుకొనని యనుగ్రహమిది. నా కొదవినది పితామహ! వివాహమెట్లు ఎపుడు సేయనగునో యదెల్ల నీవ నడుప వలయును. అన విని బ్రహ్మ యిట్లనియె.

కల్యాణ సన్నాహః

బ్రహ్మోవాచ

తత ఏవం వచః శ్రుత్వా గిరిరాజస్య భోద్విజాః|ఉద్వాహః క్రియతాం దేవ ఇత్యహం చోక్తవాన్‌ విభుమ్‌ || 58

మా మాహ శంకరో దేవో యధేష్ట మితి లోకపః|తతక్షణా చ్చ తతో విప్రా ఆస్మాభి ర్నిర్మితం పురమ్‌ || 59

ఉద్వాహార్థం మహేశస్య నానారత్నోపశోభితమ్‌|రత్నాని మణయ శ్చిత్రా హేమమౌక్తిక మేవచ || 60

మూర్తిమంత ఉపాగమ్య అలంచక్రుః పురుషోత్తమమ్‌|చిత్రా మారకతీ భూమిః సువర్ణస్తంభశోభితా || 61

భాస్వత్‌స్ఫటికభిత్తిశ్చ ముక్తాహారప్రలంబితా|తస్మిన్‌ ద్వారి పురే రమ్య ఉద్వాహార్థం వినిర్మితా || 62

శుశుభే దేవదేవస్య మహేశస్య మహాత్మనః|సోమాదిత్యౌ సమం తత్ర తాపయంతౌ మహామణీ || 63

సౌరభేయం మనోరమ్యం గంధ మాదాయ మారుతః|ప్రవవౌ సుఖసంస్పర్శో భవభక్తిం ప్రదర్శయన్‌ || 64

సముద్రా స్తత్ర చత్వారః శక్రాద్యా శ్చ సురోత్తమాః|దేవనద్యో మహానద్యః సిద్ధా మునయ ఏవచ || 65

గంధర్వాప్సరసః సర్వే నాగా యక్షాః సరాక్షసాః|ఔదకాః ఖేచరా శా7న్యే కింన్నరా దేవచారణాః || 66

తుంబురు ర్నారదో హాహా హూహూ శ్చైవ తు సామగాః|రమ్యాణ్యాదాయవాద్యానితత్రా77జగ్ము స్తదాపురమ్‌ || 67

ఋషయస్తు కథా స్తత్ర వేదగీతా స్తపోధనాః|పుణ్యాన్‌ వైవాహికా న్మంత్రాన్‌ జేపు స్సంహృష్ట మానసాః || 68

జగతో మాతర స్సర్వా దేవకన్యాశ్చ కృత్స్నశః|గాయంతి హర్షితా స్సర్వా ఉద్వాహే పరమేష్ఠినః || 69

శివకల్యాణ షడృతు సమాగమః - తత్రవర్షర్తుః

ఋతవష్షట్‌ సమం తత్ర నానాగంధసుఖావహాః|ఉద్వాహ శ్శంకర స్యేతి మూర్తిమంత ఉపస్థితాః || 70

నీలజీమూత సంకాశై ర్మంత్రధ్వని ప్రహర్షిభిః|కేకాయమానైః శిఖిభి ర్నృత్యమానై శ్చ సర్వశః || 71

విలోల పింగల స్పష్ట విద్యుల్లేఖా విహాసితా|కుముదాపీడ శుక్లాభి ర్వలాకాభి శ్చ శోభితా ||

ప్రత్యగ్ర సంజాత శిలీంద్రకందలీలతాద్రుమాద్యుద్గత పల్లవా శుభా |

శుభాంబుధారా ప్రణయప్రబోధితై ర్మహాలసై ర్భేకగణౖ శ్చ నాదితా || 73

ప్రియేషు మానోద్ధతమానసానాం మనస్వినీనా మపి కామినీనామ్‌ |

మయూరకేకాభిరుతైః క్షణన మనోహరై ర్మానవిభంగ హేతుభిః || 74

తథా వివర్ణోజ్జ్వలచారుమూర్తినా శశాంకలేఖాకుటిలేన సర్వతః |

పయోదసంఘాత సమీపవర్తినా మహేంద్రచాపేన భృశం విరాజితా || 75

విచిత్ర పుష్పాంబుభ##వై స్సుగంధిభి ర్ఘనాంబు సంపర్కతయా సుశీతలైః |

వికంపయంతీ పవనై ర్మనోహరై స్సురాంగనానా మలకావలీ శ్శు భాః || 76

గర్జత్పయోదస్ధగితేందుబింబా నవాంబుసిక్తోదకచారుదూర్వా|

నిరీక్షితా సాదర ముత్సుకాభి ర్నిశ్వాస ధూమ్రంపథికాంగనాభిః || 77

హంసనూపురశబ్దాఢ్యా సమున్నతపయోధరా|చలద్విద్యు ల్లతాహారా స్పష్టపద్మవిలోచనా || 78

ఆసిత జలదధీరధ్వాన విత్రస్తహంసా విమల సలిలధారో త్పాతనమ్రోత్పలాగ్రా|

సురభి కుసుమ రేణు క్లప్త సర్వాంగ శోభా గిరిదుహితృవివాహే ప్రావృ డావిర్బభూవ || 79

హిమవంతుని మాటవిని శివునితో ''వివాహమగు గాక'' అని నేననగా నాలోకేశుడగు శంకరుడ ట్లేయగుగాక! అనగా మేమందరము నందమైన కల్యాణపురము నిర్మించితిమి. నవరత్నములు మూర్తిని ధరించి కల్యాణ వేదికను స్వయముగ నలంకరించినవి. అందలికుడ్యములు స్ఫాటికములు భూమి మరకతమాణిక్యమయము. స్తంభములు స్వర్ణమయములు. ద్వారములందు ముక్తాహారములు తమంత వ్రేలినవి. అమ్మణుల జిగ జిగ మెఱయించుచు నమ్ముందు సోమసూర్యులు స్వప్రభల వెలయించిరి. శివభక్తిని ప్రకటించుచు వాయువు మనోహరపరిమళముల వెదజల్లుచు నందందు వాహ్యాళి వెడలెను. చతుస్సముద్రములు శక్రాది సురలు దేవ నదులు మహానదులు సిద్ధులు మునులు గంధర్వాప్సరో యక్ష రాక్షస నాగ కిన్నర చారణలు జల చరులు ఖేచరులు తుంబు నారదులు హా హా హూ హూ ప్రముఖ దేవగాయదులు రమ్య మంగళ వాద్యములుగొని యమ్మండపమునకు వచ్చిరి. ఋషులు వేద గీతములు మేళవించిరి. జగన్మాతలు దేవకన్యలు పాటలు పాడిరి. అప్సరసలాటలాడిరి. ఆఱుఋతువులు నానా సువాసనల సుఖావహములై మూర్తిమంతులై హిమవంతుని యింటికేతెంచి యీశ్వరు నుపచరించినవి. వర్షర్తునమాగమము మంత్ర ధ్వని గర్జములతో నీలజీమూతప్రభలతో కేకారవ మనోహర మయూర నృత్యములతో విలోలపింగళరుచివిలాసి విద్యుల్లతాదకచకద్యుతులతో కుముదకుసుమాపీడ శుక్లములగు బలాక మాలికలతో నపుడ పొడమిన శిలీంధ్ర కందళీ లతా ద్రుమ హృద్యతర పల్లవ మంజరులతో చల్లని వానధారల కలరి మేల్కొని సేయు కప్ప యరుపులతో, మానవతు ప్రియు యెడ పొలియలు వాసి తమంత ప్రియుల కౌగిలికిం దార్చు ముచ్చటలతో నునుమబ్బుల చాటున నల్లనల్లన తొంగి చూచు శశిరేఖ సొగసుతో మేఘము చాయ చాయగులుకు నింద్రచాపము చూపు సొంపుతో చిత్ర విచిత్ర సుమ పరిమళములచే భావితంబయి మధురవాసనల చింత చల్లని జలసంపర్కమునంది వీచు మనోహర మందమందానిలములచే నల్లనల్లనం గదలు సురాంగనల లలితాలక టనములతో గర్జించు మేఘములు గ్రమ్మిన యిందు బిం మ్ము డంబరముతో తొలకరివానచిను లు ముత్యాల మురు గొని పచ్చలు దాపిన్ల మెఱయు గరికదుబ్బులు నబ్బురము గొల్పు పచ్చని కాంతులతో హంసనూపురంబులతో సమున్నతపయోధరశాలినియై వర్షఋతు సుందరి సందరపు కల్యాణ మండపము నలంకరించెను. నీలమేఘ గర్జనలకు హంసలు బెదరినవి. స్వచ్ఛములైన సలిలధారలకు కలువలు వినమ్రములైనవి. పరిమళకుసుమ కింజల్క పరాగ పరిభూషితాంగియై వర్షఋతువు పార్వతీ వివాహమునకు తనను ముస్తాబు చేసికొనెను.

శరద్దృతుః

మేఘకంచుక నిర్ముక్త పద్మకోశోద్భవస్తనీ | హంస నూపుర నిర్హ్రాదా సర్వశస్యదిగంతరా || 80

విస్తీర్ణ వులినశ్రేణీ కూజత్సారసమేఖలా | ప్రపుల్లేందీవర శ్యామ విలోచన మనోహరా || 81

పక్వబింబాధరపుటా కుందదంత ప్రహాసినీ | నవశ్యామలతాశ్యామ రోమరాజిపురస్కృతా || 82

చంద్రాంశుహారవర్గేణ కఠోరస్థలగామినా | ప్రహ్లాదయంతీ చేతాంసి సర్వేషాం త్రిదివౌకసామ్‌ || 83

సమదాలికులోద్గీత మధురస్వరభాషిణీ | చలత్కుముదసంఘాత చారుకుండలశోభినీ || 84

రక్తాశోక ప్రశాఖోత్థ పల్లవాంగుళి ధారిణీ | తత్పుష్ప సంచయమయై ర్వాసోభి స్సమలంకృతా || 85

రక్తోత్పలాగ్రచరణా జాతి పుష్పనభావళీ | కదలీస్తంభవామోరుః శశాంకవదనా తథా || 86

సర్వలక్షణసంపన్నా సర్వాలంకారభూషితా | ప్రేవ్ణూ స్పృశతి కాంతేవ సానురాగా మనోరమా || 87

నిర్ముక్తాసితమేఘకంచుకపటా పూల్ణేందు బింబాననా | నీలాంభోజ విలోచనా రవికర ప్రోద్భిన్న పద్మస్తనీ

నానాపుష్పరజస్సుగంధిపవనప్రహ్లాదినీ చేతసాం | తత్రా సీత్‌కలహంసనూపురరవా దేవ్యావివాహేశరత్‌ || 88

హేమంత శిశిరౌ

అత్యర్థ శీతలాంభోభిః ప్లావయంతౌ దిశ స్సదా|ఋతూ హేమంతశిశిరౌ ఆజగ్మతు రతిద్యుతీ || 89

తాభ్యా మృతుభ్యాం సంప్రాప్తో హిమవాన్‌ స నగోత్తమః|ప్రాలేయచూర్ణవర్షిభ్యాం క్షిప్రంరౌప్యహరో బభౌ || 90

శరద్దృతువు

ఆ పైని శరద్దృతులక్ష్మి మేఘకంచుకము దొలగించుకొని పద్మకోశకుచశోభ##యై హంస నూపుర మనోహరయై దిశలు తెలివిగొన విస్తీర్ణములైన సైకతములు పిరుదులుగా మధురకూజితహంసమేఖలయై వికసించిన నల్లకలువలనెడి నయనములసొంపుతో పండిన దొండపండనెడి యధరశోభతో మొల్ల మొగ్గలనెడి దంతకాంతితో వినూత్న శ్యామలతికా వినీలరోమరాజితో చంద్రాంశుగౌరహారవితానముతో సర్వబృందారకబృందహృదయారవిందములనుల్లాస పరచుచు శరద్దృతు లక్ష్మి మనోహర మత్తభ్రమరకుల కలగీత స్వరభాషిణియై చలత్కుముద చారుకుండల మండితయై రక్తాశోక శాఖానిర్గత లలిత సుకుమార పల్లవాంగుళియై పలువన్నెలపూలచీర దాల్చి రక్తోత్పలాగ్రచరణయై జాతీ పుష్పసఖనవ్యనఖ రుచియై రంభాస్తంభరమణీయోరురుచియై చంద్రవదనయై సర్వాలంకారభూషితయై సర్వలక్షణ లక్షితయై నిర్ముక్తనీలమేఘ కంచు కాంచిత వ సనయై పూర్ణేందుబింబప్రతిబింబవదనయై సానురాగయగు నాయిక వోలె నీలాంభోజ లలిత నయనయై రవికరవిక చకమల సుస్తనియై నానాకుసుమ రజః పరిమళ పవన ప్రహ్లాదినియై కల హంస నూపుర రవభవ్యయై గిరిసుత కల్యాణమునకు శరద్దృతులక్ష్మి తన్ను సింగారించుకొని వచ్చెను.

హేమంత శిశిరములు

అవ్వల మిక్కిలి చలువల వెదజల్లు జలముల మించుచు మేమంత శశిర ఋతుదేవతలు ఆ వివాహమునకు వచ్చిరి. హిమవంతుడు ఆ ఋతు విలాసినులు ప్రాలేయ చూర్ణముల వర్షించుచుండ రజతహర్తపగిది రాణించెను.

తేన ప్రాలేయవర్షేణ ఘనే నైవ హిమాలయః | అగాధేన తదా రేజే క్షీరోద ఇవ సాగరః || 91

ఋతుపర్యాయసంప్రాప్తో బభూవ స మహాగిరిః | సాధూపచారాత్‌ సహసా కృతార్థ ఇవ దుర్జనః || 92

ప్రాలేయ పటలచ్ఛన్నైః శృంగై స్తు శుశుభే నగః | ఛత్రైరివ మహాభాగైః పాండరైః పృథివీపతిః || 93

వసంతర్తు సమాగమః

మనోభవోద్రేకకరాః సురాణాం సురాంగనానాం చ ముహుః సమీరాః |

స్వచ్ఛాంబు పూర్ణా శ్చ తథా నలిన్యః పద్మోత్పలానాం కుసుమై రుపేతాః || 94

వివాహే గురుకన్యాయా వసంత స్సమగా దృతుః || 95

ఈషత్సముద్భిన్న పయోధరాగ్రా నార్యో యథా రమ్యతరా బభూవుః |

నాత్యుష్ణశీతాని పయస్సరాంసి కింజల్కచూర్ణైః కపిలీకృతాని

చక్రాహ్వ యుగ్మై రుపనాదితాని యయుః ప్రహృష్టాః సురదంతి ముఖ్యాః || 96

ప్రియంగూం శ్చూతతరవ శ్చూతాం శ్చాపి ప్రియంగవః | తర్జయంత ఇవా న్యోన్యం మంజరీభి శ్చకాశిరే || 97

హిమశృంగేషు శుక్లేషు తిలకాః కుసుమోత్కరైః | శుశుభుః కార్య ముద్దిశ్య వృద్ధా ఇవ సమాగతాః || 98

పుల్లాశోక లతా స్తత్ర రేజిరే సాలసంశ్రితాః | కామిన్య ఇవ కాంతానాం కంఠాలంబితబాహవః || 99

తస్మి నృతౌ శుభ్రకదంబనీపా స్తాలా స్తమాలా స్సరలాః కపిత్థాః || 100

అశోక సర్జార్జున కోవిదారాః పున్నాగనాగేశ్వర కర్ణికారాః |

లవంగతాలాంగురు సప్తపర్ణా న్యగ్రోధ శోభాంజన నారికేలాః || 101

వృక్షా స్తథా 7న్యే ఫలపుష్పవంతో దృశ్యా బభూవు స్సుమనోహరాంగాః |

జలాశయా శ్చైవ సువర్ణతోయా శ్చక్రాంగకారండవహంసజుష్టాః || 102

కోయష్టి దాత్యూహ బలాకయుక్తా దృశ్యా స్తు పద్మోత్పల మీనపూర్ణాః |

ఖగా శ్చ నానావిధ భూషితాంగా దృశ్యాస్తు వృక్షేషు సుచిత్రపక్షాః || 103

క్రీడాసు యుక్తా నథ తర్జయంతః కుర్వంతి శబ్దం మదనేరితాంగాః |

తస్మిన్‌ గిరా వద్రిసుతా వివాహే వవు శ్చ వాతాః సుఖశీతలాంగాః || 104

పుష్పాణి శుభ్రాణ్యపి పాతయంతః శ##నై ర్నగేభ్యో మలయాద్రి జాతాః | 105

తథైవ సర్వే ఋతవశ్చ పుణ్యా శ్చకాశిరే 7న్యోన్య విమిశ్రితాంగాః |

యేషాం సులింగాని చ కీర్తితాని తే తత్ర ఆసన్‌ సుమనోజ్ఞరూపాః || 106

అమ్మంచు సోనలచే ఘనీభావమునంది హిమవంతుడు చూపరులకు క్షీరసాగరమట్లు మవోహరుడాయెను. ఒకానొక దుర్జనుడు సాధుపరిచర్యఁజేసి కృతార్థుడైనట్లు ఆధరాధరసార్వభౌముడు హేమంతశిశిరపర్యాయశోభ##చే నింపుకొల్పెను. మంచు గవిసిన మహిత శృంగములచే శ్వేత ఛత్ర ఛాయలోనున్న చక్రవర్తియట్లు వెలుగొందెను.

వసంత సమాగమము

వసంతుడును గిరికన్య కల్యాణమునకు వచ్చెను. సురలకుసురాంగనలకు మదనోద్రేకకరములైన మందమంద మలయానిలములును స్వచ్ఛాఁబు పూరముల నించుచు సరస్సులును సరసిజోత్పలసంభారముల బూని విమల రసపూర్ణములై ముత్తైదువులపగిది ముస్తాబుచేసికొని పార్వతిపెండ్లిపేరంటమునకు వచ్చెను. ఇంచించుక స్ఫుటమగుచున్న పయోధరాగ్రములచే (మేఘములచే) దర్శనీయలగు కుమారికలట్లు మిక్కిలి శోభించెను. నాత్యుష్ణ శీతములైనవై, కుసుమ కింజల్క చూర్ణ కపిశీకృతములై చక్రవాకములజంటలకలకలాఠావములచే ప్రతిధ్వను లీనుచు సరస్సులు ముచ్చుట గొల్పెను.

ఐరావతాది దిగ్గజములు లలితగమనముతో ఆనందోత్కటములయి యద్రికన్యఉద్వాహమునకు నడచెను. ప్రియంగు వృక్షము లామ్రవృక్షములను అన్యోన్యము బెదరించు కొనుచున్నవా యన్నట్లు కుసుమమంజరులతో హృదయరంజకములయ్యెను. తెల్లని హిమశృంగములందు కుసుమితములైన తిలకవృక్షములు శుభకార్యమని యెంచి వచ్చిన వృధ్ధ జనమో యనునట్లు భాసించెను. పుల్లాశోకలతికలుసాలతరువుల గౌగిలించుకొని కాముకుల కంఠమను గౌగలించుకొను కామినీ జనమట్లు చూడ ముచ్చట గొలిపెను. ఆ వసంతవేళ కదంబనీప తాళతమాల సరళ కపిత్థ అశోక, సజ్జ అర్జున కోవిదార పున్నాగ నాగేశ్వర కర్ణికార లపంగ కాలాగురు సప్తపర్ణ న్యగ్రోధ శోభాంజన నారికేళ ప్రముఖ సకల వృక్ష కదంబము పూలతో పండ్లతో మనోహరకుసుమాంగరాగములతో హృదయంగమము లయ్యెను. చిత్ర విచిత్ర వర్ణములయిన రెక్కలచే టిట్టిభక కలవింక బలాకాది జల విహంగములతో పద్మోత్పల మీనములతో గూడిన సరస్సులనుండి సుశీతలసుగంధవాయువులు కొమ్మల రెమ్మలం గదలించి రాల్చిన పూవులతో నగకుమారివివాహ మండపప్రాంతభూములు పరస్పర సమ్మేళనమందిన ఋతువుల చిహ్నములతో శోభావహములై రాజిల్లెను.

సమదాలికులలో ద్గీత శిలాకుసుమ సంచయైః | పరస్పరం హి మాలత్యో భావయంత్యో విరేజిరే || 107

నీలాని నీలాంబురుహైః పయాంసి గౌరాణి గౌరైశ్చ దండైః |

రక్తైశ్చ రక్తాని భృశం కృతాని మత్తద్ద్విరేఫా వలిజుష్ట పత్రైః || 108

హేమాని విస్థీర్ణ జలేషు కేషుచి న్నిరంతరం వారుతరాణి కేషుచిత్‌ |

వైదూర్యనాలాని సరస్సు కేషు చిత్స్ర జజ్ఞిరే పద్మవనాని సర్వతః || 109

వాప్య స్తత్రా భవన్‌ రమ్యాః కమలోత్పల పుష్పితాః | నానావిహంగ సంజుష్టా హైమసోపాన పంక్తయః || 110

శృంగాణి తస్య తు గిరేః కర్ణికారైః సుపుష్పితాః| సముచ్ఛ్రితా న్యవిరలై ర్హైమానీవ బభు ర్థ్విజాః || 111

ఈషద్విభిన్నకుసుమైః పాటలై శ్చాపి పాటలాః | సంబభూవు ర్దిశః సర్వాః వవనాకంపిమూర్తిభిః || 112

కృష్ణార్జునా దశగుణా నీలాశోక మహీరుహాః | గిరౌ వవృధిరే ఫుల్లాః స్పర్థయంతః పరస్పరమ్‌ || 113

చారురావ విజుష్టాని కింశుకానాం వనానిచ | పర్వతస్య నితంబేషు సర్వేషు చ విరేజిరే || 114

తమాలగుల్మై స్తస్యా సీచ్ఛోభా హిమవతస్తదా | నీలజీమూతసంఘాతైర్నిలీ నైరివ సంధిషు || 115

అట సమద షట్పద కులగీతములు మంగళగీతములయ్యెను. తుమ్మెదలు ముసరిన కలువలచె నల్లనివై, - తెల్లని మృణాల లతలచే తెల్లనివై రక్తారవిందములచే రక్తములై సరోవరనీరములు నయనమనోహరములయ్యెను. కొన్నికొలనులు బంగారుతామరపూవులనలముకొని మిక్కిలి సొంపునింపుచుండెను. కొన్నియెడల వైడూర్య మణినాళమయములై కమలవనములవిలసిల్లెను. హేమసోపా పంక్తులతో నానావిహంగ కలకూజితములతో కమలోత్పల వనములతోగూడిన దిగుడు బావులు భావమధురములయి రాణించెను. కుసుమితకర్ణికారములతో నీహారాద్రి సమున్నత శృంగములు హేమమయములట్లు రంజిల్లెను. ఇంచుకించుకగ విప్పారి అల్లనల్ల వీచుగాలులకు కదులుచు నెత్తావుల నించు పాటలకుసుమములచే దెసలు పాటలములయ్యెను. (ఎఱుపెక్కెను) నిండబూసిన కృష్ణతరువులు, అర్జునములు నీలాశోకములు నల్లనల్లన విరియు విరులతోడి యందమున స్పర్థగొని యెండొరుల మించి శోభిల్లినవి. గిరినితంబము లందెల్లెడ వీచుగాలులకూగుచు హోరుమని మ్రోతనించు కింశుకమువనములు అంతరాంతరముల నీలమేఘసంఘాతములు క్రమ్ముకొన్నవా యనిపించు తమాలతరుకుంజములచే నచ్చమైన హిమగిరి చూడముచ్చట యయ్యెను.

నికామపుషై#్ప స్సువిశాలశాఖై స్సముచ్ఛ్రతై శ్చందనచంపకైశ్చ | ప్రమత్తపుంస్కోకిలసంప్రలాపై ర్హిమాచలో 7తీవ తదా రరాజ || 116

శ్రుత్వా శబ్దం మృదుమదకలం సర్వతః కోకిలానాం | చంచత్పక్షా స్సుమధురతరం నీలకంఠా ­నేదుః|

తేషాం శబ్దై రుపచితబల ః పుష్పచాపేషు హస్తః | సజ్జీభూత స్త్రిదశవనితా వేద్ధు మంగే ష్వనంగః || 117

పటు స్సూర్యాతప శ్చాపి ప్రాయశో 7ల్పో జలాశయః | దే­d­వాహసమయే గ్రీష్మ ఆగా ద్ధిమాచలమ్‌ || 118

కొమ్మల రెమ్మలనిండ పూసి ఠాలిన పూవులతో చందనములతో చంపకములతో ప్రమత్త పుంస్కోకిలాలాపములతో గిరిరాజు ­ుక్కిలి రంజిల్లెను. కోకిలలకలకూజితము లాలించి నీలకంఠములు పురి­ప్పి కేకలిడుచు నాట్యము లారంభించిన­. వాని సడి­ని పుప్పబాణుండు పుష్టిగొని గీర్వాణాంగనల గురిచేసి ­రిబాణములు ­సరదొడగెను. ఎండ తీవ్రమై జలాశయములెండి తనువులకు సుఖమునిండ నత్తఱి గ్రిష్మర్తువు గిరికన్య పెండిలికి వచ్చి గిరిరాజు నుపచరించెను.

గ్రీష్మర్తు సమాగమ :

స చాపి తరుభి స్తత్ర బహుభిః కుసుమోత్కరై ః | శోభయామాస శృంగాణి ప్రాలేయాద్రే స్సమంతతః || 119

తథాపి చ గిరౌ తత్ర వాయవః సుమనోహరాః | వవుః పాటల ­స్తీర్ణ కదంబా7ర్జున గంధినః || 120

వాప్యః ప్రపుల్ల పద్మౌఘకేసరారుణమూర్తయః | అభవం స్తటసంజుష్ట కలహంస కదంబకాః || || 121

తధా మరవకా శ్చాపి కుసుమాపూర్ణ మూర్తయః సర్వేషు నగశృంగేషు భ్రమరావళిసే­తాః || 122

వకుళా శ్చ నితంబేషు ­శాలేషు మహీభృతః | ఉత్ససర్జ మనోజ్ఞాని కుసుమాని సమంతతః || 123

ఇతి కుసుమ ­చిత్ర సర్వ వృక్షాః ­­ధ ­హంగమనాదరమ్యదేశాః |

హిమగిరి తనయా ­వాహభూత్యై | షడుపయుయూఋతవో మునిప్ర­dఠాః || 124

తత ఏవం ప్రవృత్తే తు సర్వభూత సమాగమే | నానావాద్య సమాకీర్ణే అహంం తత్ర ద్విజాతయః ||125

శైలపుత్రీ మలంకృత్య యోగ్యాభరణసంపదా | పురం ప్రవేశితవాం స్తాం స్వయ మాదాయ భో ద్విజాః || 126

తత స్తు పున రేవేశ మహం చైవోక్తవాన్‌ ­భుమ్‌ | హ­ ర్జుహో­ు వహ్నౌ తే ఉపాధ్యాయపదే స్థితః || 127

దదాసి మహ్యం యద్యాజ్ఞాం కర్తవ్యో7యం క్రియా­ధిః|మా మాహ శంకర శ్చైవం దేవదేవో జగత్పతిః || 128

మఱియుతరువులనుండి ­రులరాల్చి ప్రాలేయ గిరిశృంగముల సింగారించెను. పాటల కుసుమ ­స్తీర్ణ కదంబార్జున సుమనోహర వాయువులు చల్లగ ­dచెను. దిగుడుబావులు ­కచకమల కేసరపుంజ రంజితములై యెఱుపెక్కదరుల కలహంస కదంబము లచ్చపు జిగి నెంతేని ముచ్చట గొలిపెను. పూలగోరింటలు పువ్వుల తెలినిగ్గుల నెఱనీటుగులుకు భ్రమరములకు వలపు గూర్చుచుండెను. హిమశైల­శాలనితంబములం బొగడలు నలువంకల తావులు జిమ్ము పూవులరాసులం గ్రుమ్మరించిన­. ఓముని ప్రవరులారా! ­ంటిరే ఇట్లారుఋతువులు గౌరీ­వాహ కౌతుకమునకు కుతూహలముగొని కుసుమ ­చిత్ర శృంగారతరులతా బృందముతో నందముగా నేతెంచిన­.

మంగళ వాద్యములుమ్రోయ నిట్లుసాగిన కల్యాణ వైభవమున బ్రాహ్మణ సముదాయములతో శైలపుత్రిని సకలాభరణభూషితంగా­ంచి వెంటగొని నేను స్వయముగా పురప్రవేశముం జేయించితిని. అవ్వల నీశ్వరునితో నేను బ్రహ్మస్థాస మందుండి నీ­వాహ ని­ుత్తముగ నగ్నియందాజ్యాది హ­స్సులను హోమము నిర్వహించెద నాజ్ఞయిమ్మని యడిగితిని.

శివఉవాచ

య దుద్దిష్టం సురేశాన! త త్కురుష్వ యథేప్సితమ్‌ | కర్తా స్మి వచనం సర్వం బ్రహ్మం స్తవ జగద్విభో || 129

శివుడిట్లనెను.

ఏ­ుచేయ నుద్దేశింపబడినదదెల్ల నో సురేశ్వర ! నీయిష్టాను సారము గా­ంపుము, నీ వన్నయట్లంతయు నేనొనరింతును.

బ్రహ్మోవాచ

తత శ్చాహం ప్రహృష్టాత్మా కుశా నాదాయ సత్వరమ్‌|హస్తం దేవ్యా శ్చ యోగబంధేన యుక్తవాన్‌ || 130

జ్వలన శ్చ స్వయం తత్ర కృతాంజలిపుటః స్థితః|శ్రుతి గీతై ర్మహామంత్రైః మూర్తిమద్భి రుపస్థితైః ||131

యథోక్త ­ధినా హుత్వా సర్పిస్తద మృతం హ­ః|తత స్తం జ్వలనం సర్వం కారయిత్వా ప్రదక్షిణమ్‌ || 132

ముక్త్వా హస్తసమాయోగం సహితః సర్వదేవతై ః|పుత్రై శ్చ మానసై స్సిధ్ధై ః ప్రహృష్టేనాంతరాత్మనా ||133

వృత్త ఉద్వాహకాలే తు ప్రణమ్య చ వృషధ్వజమ్‌|యోగేనైవ తయో ర్విప్రాస్తదుమాపరమేశయోః || 134

ఉద్వాహ స్స పరో వృత్తో యం దేవా న ­దుః క్వచిత్‌|ఇతి వ స్సర్వ మాఖ్యాతం స్వయంవర ­ుదం శుభమ్‌ ఉద్వాహశ్చైవ దేవస్య శృణుధ్వం పరమాద్భుతం || 135

ఇతి శ్రీబ్రహ్మపురాణే ఉమామహేశ్వర కల్యాణవర్ణనం నామ షట్త్రింశో7ధ్యాయః

అమ్మాట కానందబడి నేను కుశలంగొని యాద్దేవుని యొక్కయు దే­యొక్కయు హస్తములను యోగబంధమున జతసేసితిని. శ్రుతిగీతములయిన మహామంత్రములు మూర్తిమంతములయి సన్నిధిసేయ నగ్నియు హ­ర్భాగముల స్వయముగానందుకొన కృతాంజలి వుటుండయ్యె. యథా­ధిగ నమృతరూపమైన హ­స్సును హోమముచేసి సనాతనులయ్యు నూతనులయిన యా దంపతులు చేయి చేయియుంగొని నగ్నికి ప్రదక్షిణము నొనరించి యవ్వల వారి చేయి ­డిపింప సర్వదేవతలు నామానసపుత్రులు సిద్ధులు ప్రహృష్టాంతరంగులై నన్ననుగ­ుంప నందఱము వృషధ్వజున కాపెండ్లివేళ ప్రణామములు గా­ంచితి­ు. ఇట్లా సనాతన­ుధునమునకు యోగముచేతనే యీ ­వాహమహోత్సవము జరిగినది. ఈ యందము మున్నెన్నడు దేవతలేని గాంచి యెఱుంగరు. ఈ మహేశ్వర స్వయంవర కల్యాణ వృత్తాంతము ­dుకెల్ల ­నిపించితిని.

ఇది సకల జగత్కల్యాణ కరము.

ఇది బ్రహ్మపురాణమందు ఉమామహేశ్వరకల్యాణ వర్ణనమను ముప్పది యాఱవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters