Brahmapuranamu    Chapters   

పంచత్రింశో7ధ్యాయః

పార్వతీతపోవర్ణనమ్‌

బ్రహ్మోవాచ

తత స్తా మబ్రువన్‌ దేవా స్తదా గత్వా తు సుందరీమ్‌|దేవి! శీఘ్రేణ కాలేన ధూర్జటి ర్నీలలోహితః || 1

స భర్తా తవ దేవేశో భవితా మా తపః కృథాః| తతః ప్రదక్షిణీ కృత్య దేవా విప్రా గిరేః సుతామ్‌ || 2

జగ్ము శ్చా7దర్శనం తస్యాః సా చాపి విరరామ హ|సా దేవీ సూక్త మిత్యేవ ముక్త్వా స్వస్యాశ్రమే శుభే || 3

ద్వాః జాత మశోకంచ సముపాశ్రిత్య చాస్థితా|అధా 7గా చ్చంద్రతిలక స్త్రిదశార్తిహరో హరః || 4

వికృతం రూప మాస్థాయ హ్రస్వబాహుక ఏవచ|విభగ్ననాసికో భూత్వా కుంబజం కేశాంతపింగలః || 5

ఉవాచ వికృతాస్యశ్చ ''దేవి త్వాం వరయా మ్యహమ్‌''|అథోమా యోగసంసిద్ధా జ్ఞాత్వా శంకర మాగతమ్‌ || 6

అంతర్భావవిశుద్ధాత్మా కృపానుష్ఠానలిప్సయా|తమువా చార్ఘ్యపాద్యాభ్యాం మధుపర్కేణ చైవ హ || 7

సంపూజ్య సుమనోభి స్తం బ్రాహ్మణం బ్రాహ్మణప్రియా || 8

బ్రహ్మ యిట్లనెను- అఖిల దేవతా మండలి యాజగజ్జనని కడకేగి, ఓదేవీ! తపము వలదు. శీఘ్రకాలములో నా నీలకంఠు డేతెంచి నీకు భర్త కాగలడు. అని నచ్చజెప్పి ప్రదక్షిణముచేసి వెళ్ళిపోయిరి. ఆమె తపస్సు విరమించెను. తన పర్ణశాల గుమ్మమున నున్న యశోకము క్రింద నామె వసించెను. అంతట నిందుతిలకుడు సురార్తిహరుడునగు హరుడు వికృతరూపియైపొట్టిచేతులు సొట్టముక్కు రాగిజడలు వికృతముఖముమఱిగుజ్జునైవచ్చి దేవి! నిన్ను నేనువరింతుననియె. ఉమయు యోగసిద్ధిచే నాతని శంకరునిగా గ్రహించి విశుద్ధాంతరంగయై ఆర్ఘ్యపాద్యాదులు మధుపర్కములు నొసంగి బ్రాహ్మణాకారముననున్న స్వామిని బ్రాహ్మణప్రియగావున యధావిధి నర్చించి యిట్లనియె.

భగవ న్నస్వతంత్రా7హం పితా మే త్వగ్రణీర్గృహే|స ప్రభు ర్మమ దానే వై కన్యాహం ద్విజపుంగవ || 9

గత్వా యాచస్వ పితరం మమ శైలేంద్ర మవ్యయమ్‌| స చేద్దదాతి మాం విప్ర తుభ్యం తదుచితం మమ || 10

తతః స భగవాన్‌ దేవ స్తధైవ వికృతః ప్రభుః|ఉవాచ శైలరాజానం సుతాం మే యచ్ఛ శైలరాట్‌ || 11

స తం వికృతరూపేణ జ్ఞాత్వా రుద్ర మథావ్యయమ్‌|భీతః శాపాచ్చ విమనా ఇదం వచన మబ్రవీత్‌ || 12

పార్వతి పలికెను. ''స్వామీ!నేను అస్వతంత్రను. మాతండ్రి శైలాధిపతి యింట నున్నారు. ఆయన కన్యాదానము చేయ సమర్థుడు. అతని నర్థింపుము. ఆయన నన్ను నీకిచ్చునేని యది నా కుచితము''. అంత నా విప్రుడు గిరిరాజు కడకేగి ''తనకు కన్యాదానము చేయుమని'' యర్థించెను. ఆతడీ వికృతరూపని శివునిగా గ్రహించి శాపభీతిచే నిట్లనియె.

''భగవ న్నావమన్యే7హం బ్రాహ్మణాన్‌ భువిదేవతాః|మనీషితం తు యత్‌ పూర్వం తచ్ఛృణుష్వ మహామతే || 13

స్వయంవరో మే దుహితు ర్భవితా విప్రపూజితః|వరయే ద్యః స్వయం తత్ర స భర్తా7స్యా భవిష్యతి'' || 14

తచ్ఛ్రుత్వా శైలవచనం భగవాన్‌ వృషభధ్వజః|దేవ్యా సమీప మాగమ్య ఇద మాహ మహామనాః || 15

దేవి పిత్రా త్వనుజ్ఞాతః స్వయంవర ఇతిశ్రుతిః|తత్ర త్వం వరయిత్రీ యం స తే భర్తా భ##వేదితి || 16

త దాపృచ్ఛృ గమిష్యామి దుర్లభాం త్వాం వరాననే|రూపవంతం సముత్సృజ్య వృణో ష్యసదృశం కథమ్‌ || 17

శైలరాజిట్లనియె- భూదేవులగు విప్రుల నవమానింపబోను, నాయభిప్రాయము మనవి చేసెద. మా అమ్మాయి స్వయంవరముననెవ్వని వరించునో యతడామెకు భర్తయగును.'' అన వృషభధ్వజుడు తిఱిగివచ్చి ''దేవీ! మీ తండ్రి స్వయంవరమున నీవెవ్వని వరింతువువానికిచ్చునని వినికిడి. నీవు నీకీడగు రూపవంతునివిడచి తగనివాని నేల వరింతువు.'' కాన నాకందవు. నీతో జెప్పి వెళ్లుచున్నా ననెను.

బ్రహ్మోవాచ

తేనోక్తా సా తదా తత్ర భావయంతీ తదీరితమ్‌|భావంచ రుద్రనిహితం ప్రసాదం మనసస్తథా || 18

సంప్రాప్తో వాచ దేవేశం మా తే7భూ ద్బుద్ధి రన్యథా|అహం త్వాం వరయిష్యామి నాద్భుతం తు కథంచన || 19

అథవా తే 7 స్తి సందేహో మయి విప్ర కథంచన|ఇహైవ త్వాం మహాభాగ వరయామి మనోగతమ్‌ ||'' 20

గృహీత్వా స్తబకం సా తు హస్తాభ్యాం తత్ర సంస్థితా|స్కంథే శంభోః సమాధాయ దేవీ ప్రాహ వృతో7సి మే || 21

తతః స భగవాన్‌ దేవ స్తథా దేవ్యా వృత స్తథా|ఉవాచ త మశోకం వైవాచా సంజీవయన్నివ || 22

బ్రహ్మయిట్లనియె! అంత నాయుమాదేవి యమ్మాటను భావన చేసి తనపై నాతడిడిన భారమును గ్రహించి దానితో బాటు చూపిన మనఃప్రసన్నతను నాలక్షించి ''దేవేశ! నీకు నుఱొక తలంపు వలదు. నేను నిన్ను వరించెద. ఆశ్చర్య మక్కరలేదు. సందేహమున్నదా? ఇదిగో యిక్కడే నాకోరిక విభుడవగు నిన్ను నేను వరించుచున్నాను. అని పుష్పగుచ్ఛమొక్కటి రెండుచేతలం గొని శంభుని మూపున నుంచి యాదేవి దేవదేవుంగని యిప్పుడ వరింప బడితివనియె. అంతనాశివుడామె కూర్చుండిన యశోకముంగని దానికి మాటచేప్రాణము పోయుచున్నాడా యన్న ట్లిట్లనియె.

యస్మా త్తవ సుపుణ్యన స్తబకేన వృతో 7స్మ్యహమ్‌|తస్మాత్త్వం జరయా త్యక్త స్త్వమరః సంభవిష్యసి || 23

కామరూపీ కామపుష్పః కామదో దయితో మమ|సర్వాభరణ పుష్పాఢ్యః సర్వపుష్ప ఫలోపగః || 24

సర్వాన్నభక్షక శ్చైవ అమృతాస్వాద ఏవచ|సర్వగంధశ్చ దేవానాం భవిష్యసి దృఢప్రియః || 25

నిర్భయః సర్వలోకేషు భవిష్యసి సునిర్వృతః|ఆశ్రమం చేద మత్యర్థం చిత్రకూటేరి విశ్రుతమ్‌ || 26

యో హి యాస్యతి పుణ్యార్థో సో7శ్వమేధ మవాప్స్యతి|యస్తు తత్ర మృత శ్చాపి బ్రహ్మలోకం స గచ్ఛతి || 27

యశ్చాత్ర నియమై ర్యుక్తః ప్రాణాన్‌ సమ్యక్‌ పరిత్యజేత్‌|స దేవ్యా స్తపసా యుక్తో మహాగణపతి ర్భవేత్‌ || 28

శివుడు పలికెను- ''ఓ అశోకమా! నీ పూలగుత్తిచే నేను వరింపబడినాడ గావున నీకు ముదిమి యుండదు. అమరమయ్యెదవు గాక! నీవు సర్వాభరణకుసుమఫలభరితమై కామరూపివై సర్వకామప్రదమై, కామపుష్పమవై సర్వాన్న భక్షకమై అమృతాస్వాదివై సర్వ పరిమళపూర్ణమై దేవతల కత్యంతప్రియము కాగలవు. నీ కెందును భయముగల్గదు. నీవు సంపూర్ణ తృప్తుడవయ్యెదపు. ఈయశోకాశ్రమము చిత్రకూటమను ఖ్యాతినందగలదు. ఇటకు యాత్ర చేసిన వా డశ్వమేధయాగఫలమందును. ఇచట ప్రాణోత్ర్కమణ మందినయతడు దేవియొక్కతపస్సుతోగూడి మహా గణపతి యగును.

బ్రహ్మోవాచ

ఏవ ముక్త్వా తదా దేవ అపృచ్ఛ్వ హిమవత్సుతామ్‌|ఆంతర్దధే జగత్‌ స్రష్టా సర్వభూతప ఈశ్వరః || 29

సాపి దేవీ గతే తస్మిన్‌ భగవ త్యమితాత్మని|తత ఏవోన్ముఖీ భూత్వా శిలాయాం సంబభూవహ || 30

ఉన్ముఖీ సా 7భవ త్తస్మిన్‌ మహేశే జగతాం ప్రభౌ|నిశేవ చంద్రరహితా న బభౌ విమనా స్తదా || 31

అథ శుశ్రావ శబ్దంచ బాల స్యార్తస్యశైలజా|సరస్యుదకసంపూర్ణే సమీపే చాశ్రమస్యచ || 32

స కృత్వా బాలరూపం తు దేవదేవః స్వయం శివః|క్రీడాహేతో స్సరోమధ్యే గ్రాహగ్రస్తో 7భవత్తదా || 33

యోగమాయాం సమాస్థాయ ప్రపంచోద్భవకారణమ్‌| తద్రూపం సరసో మధ్యే కృత్వైవం సమభాషత || 34

బ్రహ్మ యిట్లనియె- పై ప్రకారము అశోకమునకు వరమిచ్చి శివుడు గిరికన్యతో వెళ్ళివత్తునని చెప్పి యంతర్ధాన మందెను. ఆయన వంకనే మోమునిలిపి యాదేవి యచట నొక శిలయందు చంద్రుడు లేని రాత్రి యట్లు విరహ వ్యధాకుల మనస్కయయి యుండెను. అంతలో శైలకన్య యాశ్రమ సమీపమున నుదక పూర్ణమైన సరస్సు నందు నార్తుడైన యొక్క బాలుని మాట వినెను. శివుడు బాలరూప దాల్చి యాసరోవరమందు క్రీడించుచు మొసలి పట్టుకొన్నట్లు సృష్టిహేతువైనయోగమాయంబూని నటించి యిట్లనియె.

బాల ఉవాచ

త్రాతు మాం కశ్చి దిత్యాహ గ్రాహేణ హృతచేతసమ్‌|ధిక్కష్టం బాల ఏవాహ మప్రాప్తార్థమనోరథః || 35

ప్రయామి విధనం వక్త్రే గ్రాహస్యాస్య దురాత్మనః|శోచామి న స్వకం దేహం గ్రాహగ్రస్తః సుదుఃఖితః || 36

యథా శోచామి పితరం మాతరం చ తపస్వినీమ్‌|గ్రాహగృహీతం మాం శ్రుత్వా ప్రాప్తం నిధన ముత్సుకౌ || 37

ప్రియపుత్రా వేకపుత్రౌ ప్రాణాన్‌ నూనం త్యజిష్యతః|అహోబత సుకష్టం వై యో7హం బాలో7కృతాశ్రమః ||

అంతర్గ్రాహేణ గ్రస్త స్తు యాస్యామి నిధనం కిల || 38

ఎవడేని నన్ను మొసలిబారినుండి రక్షించుగాక! అయ్యో! మొసలినోట బడినాడను. నాకై నాదేహమునకై నే నేడ్వను. కాని నాకై యింటనెదురు చూచు నాతల్లిదండ్రుల గూర్చి చింతించుచున్నాను. వారికి నేనొక్కడనే తనయుడను. నాయందెంతేని ప్రేమ, మక్కువ గొన్నవారు. గావున యీవిషయము విని ప్రాణములం బాసెదరు. ఎంత కష్టము వచ్చినది. బాలుడను. అకృతాశ్రముడను. (ఉపనయన మేని కానివాడను) ఈ మొసలివాతబడి మృత్యువాత కెఱయయ్యెదను గదా! అని దుఃఖించెను.

శ్రుత్వా దేవీ తు తం నాదం విప్రస్యా 77ర్తస్య శోభనా|ఉత్థాయ ప్రస్థితా తత్ర యత్ర తిష్ఠ త్యసౌ ద్విజః || 39

సా పశ్య దిందువదనా బాలకం చారురూపిణమ్‌|గ్రాహస్య ముఖమాపన్నం వేపమాన మవస్థితమ్‌ || 40

సో7పి గ్రాహవరః శ్రీమాన్‌ దృష్ట్వా దేవీ ముపాగతామ్‌|తం గృహీత్వా ద్రుతం యాతో మధ్యం సరస ఏవ హి || 41

స కృష్యమాణ స్తేజస్వీ నాద మార్తం తదాకరోత్‌|అథా హ దేవీ దుంఖార్తా బాలం దృష్ట్వా గ్రహావృతమ్‌ || 42

బ్రహ్మ యనియె: బాలకుని మాటలు విని యా కల్యాణి అయ్యిందువదన బయలుదేరి సుందరుడగు నా బాలకుని మొసలి నోటబడి కొట్టుకొనుచున్నట్లు చూచెను. ఆ మొసలియును దేవిని చూచి యాబాలుని నోటగఱుచుకొని సరస్సులోనికిం బాఱను. బాలకు డాక్రందించుచుండెను. అది చూచి పార్వతి మొసలితో నిట్లనియె.

పార్వత్యువాచ

గ్రాహరాజ!మహాసత్వ! బాలకం హ్యేకపుత్రకమ్‌|విముం చేమం మహాదంష్ట్ర క్షిప్రం భీమపరాక్రమ || 43

ఓ గ్రాహరాజ!మహాపరాక్రమా! ఈ బాలకుని త్వరగ విడిచిపెట్టుము. ఈతడు తల్లిదండ్రులకు నేకైక పుత్రుడు అన మొసలి.

గ్రాహఉవాచ

యో దేవి! దివసే షష్ఠే ప్రథమం సముపైతి మామ్‌|స ఆహారో మమ పురా విహితో లోకకర్తృభిః || 44

సో7యం మమ మహాభాగే షష్ఠే7హని గిరీంద్రజే!|బ్రహ్మణా ప్రేరితో నూనం నైనం మోక్ష్యే కథంచన || 45

దేవి! ఆఱవరోజున ముందుగా నీ సరస్సు నకేతెంచు నతడు నీకాహారమగునని నాకు బ్రహ్మ యేర్పాటుచేసెను. నేడీతడు లభించెను. బ్రహ్మప్రేరణమిది. వీనినేమైన వదలననియె. అంత వారికిరువురకు నిట్లు సంవాదమయ్యెను.

దేవ్యువాచ

య న్మయా హిమవచ్ఛృంగే చరితం తప ఉత్తమమ్‌|తేన బాల మిమం ముంచ గ్రాహరాజ నమోస్తుతే || 46

ఓ మకర రాజమా! హిమగిరి శిఖర మందు నేను జేసిన ఉత్తమతపస్సు ఫలము నీవు తీసికొని ప్రతిఫలముగ నీ బాలుని విడిచి పెట్టుము. నీకు నమస్కారము.

గ్రాహ ఉవాచ

మా వ్యయ స్తపసో దేవి భృశం బాలే శుభాననే|య ద్ర్బవీమి కురు శ్రేష్ఠే తథా మోక్ష మవాప్స్యతి || 47

ఓ దేవీ! తపము వ్యయ పరచకుము. నే చెప్పినట్లు చేయుము. అట్లైన నితడు ముక్తుడగును.

దేవ్యువాచ

గ్రాహాధిప! వద స్వాశు యత్‌ సతా మవిగర్హితమ్‌|తత్కృతం నాత్ర సందేహో యతో మే బ్రాహ్మణాః ప్రియాః ||

హే గ్రాహాధిప! సత్పురుషులు నిందింపని యేపనియైన చెప్పుము. తప్పక చేసెదను. సందేహము లేదు. బ్రాహ్మణులు నాకు మిక్కిలియిష్టులు.

గ్రాహ ఉవాచ

యత్కృతం వై తపఃకించి ద్భవత్యా పుణ్య ముత్తమమ్‌||తత్సర్వం మే ప్రయచ్ఛా77శు తతో మోక్ష మవాప్స్యతి || 49

ఓ దేవి! నీవు చేసిన తపము స్వల్పమైనను నుత్తమమైనది. ఆ తపము సర్వమును నాకిమ్ము. అట్లైన నీబాలుడు ముక్తుడగును.

దేవ్యువాచ

జన్మప్రభృతి య త్పుణ్యం మహాగ్రాహ కృతం మయా|త త్తే సర్వం మయా దత్తం బాలం ముంచ మహాగ్రహ

ఓ మహాగ్రాహమా! మంచిది. ఆజన్మము నేచేసిన పుణ్యమేది గలదో యది సర్వము నీ కొసగు చున్నాను. బాలుని విడువుము.

బ్రహ్మోవాచ

ప్రజజ్వాల తతో గ్రాహ స్తపసా తేన భూషితః|ఆదిత్య ఇవ మధ్యాహ్నే దుర్నిరీక్ష స్తదా 7భవత్‌ ||

ఉవాచ చైవం తుష్టాత్మా దేవీం లోకస్య ధారిణీమ్‌ || 52

బ్రహ్మ యనియె. ఇట్లన్యోన్య భాషణములు జరిపిన వెంటనే మొసలి యాదేవి తపస్సు సర్వము స్వీకరించి మధ్యందినభానునివలె వెలుగొందెను. మరియు లోకోద్ధారిణియగు దేవిం గని సంతుష్టాంతరంగుడయి యిట్లుపల్కెను.

దేవి! కిం కృత్య మేత త్తే సునిశ్చిత్య మహావ్రతే|తపసో 7ప్యర్జనం దుఃఖం తస్య త్యాగో న శస్యతే || 53

గృహాణ తప ఏవ త్వం బాలం చేమం సుమధ్యమే|తుష్టో7స్మి తే విప్రభక్త్యా వరం తస్మా ద్దదామి తే ||

సా త్వేవ ముక్తా గ్రాహేణ ఉవా చేదం మహావ్రతా || 54

దేవీ! తపస్సు సంపాదించుట కష్టము దానిని త్యజించుట ప్రశస్తము గాదు. కావున తపస్సును, నీబాలుని కూడా నీవే స్వీకరింపుము. నీబ్రాహ్మణ భక్తికి మెచ్చితినని మకరము పలుక మహావ్రతధారిణియగు నామె యిట్లనియె.

దేవ్యువాచ

దేహేనాపి మయా గ్రాహ రక్ష్యో విప్రః ప్రయత్నతః|తపః పున ర్మయా ప్రాప్యం న ప్రాప్యో బ్రాహ్మణః పునః || 55

సునిశ్చిత్య మయా గ్రాహ కృతం బాలస్య మోక్షణమ్‌|న విప్రేభ్య స్తపః శ్రేష్ఠం శ్రేష్ఠా మే బ్రాహ్మణా మతాః || 56

దత్వా చాహం న గృహ్ణామి గ్రాహేంద్ర విహితం హి తే|నహి కశ్చిన్నరో గ్రాహ ప్రదత్తం పునరాహరేత్‌ || 57

దత్త మేత న్మయా తుభ్యం నా77దదాని హి తత్‌పునః|త్వ య్యేవ రమతా మేత ద్బాల శ్చాయం విముచ్యతామ్‌ || 58

దేహముతోనైనను విప్రుడు నాకు రక్షణీయుడు. తపస్సు మరల సాధించగలను గాని బ్రాహ్మణుడు సాధ్యుడు కాడు గదా! విప్రుల కంటె తపస్సు గొప్పది కాదు. నేనిచ్చినది మరల స్వీకరింపను. ఇది నీకివ్వబడినది. ఇచ్చిన దాని నెవ్వడును తిరిగి తీసుకొనడు. తపస్సు నీదె. బాలుని మాత్రము విడిచిపుచ్చు మనియె.

తథోక్త స్తాం ప్రశస్యా థ ముక్త్వా బాలం సమస్యచ|దేవీ మాదిత్యావభాస స్తత్రై వాంత ర ధీయత || 59

బాలో7పి సరసస్తీరే ముక్తో గ్రాహేణ వై తదా|స్వప్నలబ్ధ ఇవా ర్థౌఘ స్తత్రై వాంతర ధీయత || 60

తపసో7పచయం మత్వా దేవీ హిమగిరీంద్రజా|భూయ ఏవ తపః కర్తు మారేభే నియమస్థితా || 61

కర్తుకామాం తపో భూయో జ్ఞాత్వా తాం శంకరః స్వయమ్‌|ప్రోవాచ వచనం విప్రా మా కృథా స్తప ఇత్యుత || 62

మహ్య మేత త్తపో దేవి! త్వయా దత్తం మహావ్రతే|తత్తేనై వాక్షయం తుభ్యం భవిష్యతి సహస్రథా || 63

ఇతి లబ్ధ్వా వరం దేవీ తపసో7క్షయ ముత్తమమ్‌|స్వయం వర ముదీక్షంతీ తస్థౌ ప్రీతా ముదా యుతా || 64

ఇదం పఠే ద్యో హి నరః సదైవ బాలానుభావాచరణం హి శంభోః |

స దేహభేదం సమవాప్య పూతో భ##వేద్గణశ స్తు కుమారతుల్యః || 65

ఇతి బ్రహ్మపురాణ పార్వత్యుపాఖ్యానం నామ పంచత్రింశో7ధ్యాయః

అనవిని యమ్మకరము దేవికి నమస్కరించి యాదిత్యుడట్లు వెలుంగుచు నచ్చటనే యంతర్ధానమయ్యెను. ఆ బాలుడును సరస్తీరమున మొసలిచే విడువబడి కలలోగన్న వస్తువువలె నచ్చటనే యంతర్ధానమయ్యెను. దేవియు తన తపఃఫలము బాలుని నిమిత్తముగా వ్యయమగుట గని మరల తపస్సు నాచరింప బూనెను. శంకరుడది యెరిగి నీ వింక తపస్సు చేయవలదు. నీ చేసినదంతయు నా కర్పించితివి. అది నీ కక్షయము కాగలదనెను. అట్లు వరమును బొంది యా దేవి స్వయంవరముకొఱకు నిరీక్షించుచుండెను. పరమేశ్వరుని యీశిశులీలను జదివిన వాడు దేహపాతా నంతరము పవిత్రుడై కుమార తుల్యుడై గణాధీశుడగును.

ఇది పార్వత్యుపాఖ్యానము అను ముప్పదియైదవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters