Brahmapuranamu    Chapters   

ఏకత్రింశో7థ్యాయః

మార్తండసై#్యక వింశతి నామకీర్తనమ్‌

ఆదిత్య మాహాత్మ్య వర్ణనము

బ్రహ్మోవాచ

ఆదిత్యమూల మఖిలం త్రైలోక్యం మునిసత్తమాః| భవత్యస్మా జ్జగత్‌సర్వం సదేవాసుర మానుషమ్‌|| 1

రుద్రోపేంద్ర మహేంద్రాణాం విప్రేంద్ర త్రిదివౌకసామ్‌| మహాద్యుతిమతాంచైవ తేజో7యం సార్వలౌకికమ్‌|| 2

సర్వాత్మా సర్వలోకేశో దేవదేవః ప్రజాపతిః| సూర్య ఏవ త్రిలోకస్యమూలం పరమదైవతమ్‌|| 3

అగ్నౌ ప్రాస్తాహుతిః సమ్యగాదిత్య ముపతిష్ఠతే| ఆదిత్యా జ్జాయతే వృష్టి ర్వృష్టే రన్నం తతః ప్రజాః|| 4

సూర్యాత్‌ ప్రసూయతే సర్వం తత్ర చైవ ప్రలీయతే| భావాభావౌహి లోకానా మాదిత్యా న్నిః సృతౌ పురా|| 5

ఏతత్తు ధ్యానినాం ధ్యానం మోక్షశ్చాప్యేష మోక్షిణామ్‌| తత్రగచ్ఛంతి నిర్వాణం జాయంతే7స్మాత్పునః పునః|| 6

క్షణా ముహూర్తా దివసా నిశా పక్షాశ్చ నిత్యశః| మాసాః సంవత్సరాశ్చైవ ఋతవశ్చ యుగాని చ|| 7

అథాదిత్యా దృతేహ్యేషాం కాలసంఖ్యా న విద్యతే| కాలాదృతే న నియమో నాగ్నౌ విహరణక్రియా|| 8

ఋతూనా మవిభాగశ్చ తతః పుష్పఫలం కుతః| కుతోవై సస్యనిష్పత్తి స్తృణౌషధిగణః కుతః|| 9

అభావో వ్యవహారాణాం జంతూనాం దివి చేహ చ| జగత్ప్రభావా ద్విశ##తే భాస్కరా ద్వారితస్కరాత్‌|| 10

నావృష్ట్యా తపతే సూర్యో నావృష్ట్యా పరిశుష్యతి| నావృష్ట్యా పరిధిం ధత్తే వారిణా దీప్యతే రవిః|| 11

వసంతే కపిలః సూర్యో గ్రీష్మే కాంచన సన్నిభః| శ్వేతోవర్షాసు వర్ణేన పాండుః శరది భాస్కరః|| 12

హేమంతే తామ్రవర్ణాభః శిశిరే లోహితో రవిః| ఇతి వర్ణాఃసమాఖ్యాతాః సూర్యస్య ఋతుసంభవాః|| 13

ఋతుస్వభావర్ణైశ్చ సూర్యః క్షేమ సుభిక్షకృత్‌

బ్రహ్మయనియె. ఓ మునులార! సదేవాసుర మానుషమైన సర్వజగత్తు ఆదిత్య మూలము. ఈ తేజస్సు ఇంద్రోపేంద్రాది సర్వదేవతామయము. పరమదైవత మిదియే. అగ్నియందు యధావిధి వేల్వబడిన యాహుతి యాదిత్యు నందును. ఆదిత్యునివలన వృష్టి, వర్షమువలన నన్నము దానివలన బ్రజలు గల్గుదురు. ధ్యాననిష్ఠులకు ధ్యానము మోక్షులకు మోక్షము-ఈతత్వమే. క్షణ- ముహూర్త-దివస-నిశా-పక్ష-మాస-సంవత్సర- ఋతు-యుగాది కాలగణన మాదిత్యుని వలననే. కాలము లేక నియమములేదు. అగ్ని విహరణ క్రియలేదు. ఋతు విభాగములేదు. అపుడు పుష్ప ఫలము లెక్కడ? సస్య నిష్పత్తి యెక్కడిది. తృణౌషధిగణమెక్కడ ! ఇక్కడ దివంబునను జీవ వ్యవవహారము లేనేలేదు. వారి తస్కరుడైన భాస్కరుని వలననే జగద్వ్యవహారము సాగును. వృష్టిలేక సూర్యుడు తపింపడు నీటిని శోషింపజేయడు. గుడికట్టడు. ఉదకముననే వెలుంగును. వసంతమున కపిలవర్ణుడు. గ్రీష్మముస బంగారురంగువాడు. వర్షఋతువున తెల్లనివాడు. శరత్కాలమున పాండువర్ణమువాడు. హేమంతమున రాగిరంగుగలవాడు. శిశిరమున లోహితుడు (ఎఱ్ఱనివాడు). ఋతుస్వభావ సిద్ధము లయిన రంగులంబట్టి కూడ సూర్యుడు క్షేమము సుభిక్షము సేయువాడు.

అథాదిత్యస్య నామాని సామాన్యాని ద్విజోత్తమాః|| 14

ద్వాదశైవ పృథక్త్వేన తాని వక్ష్యామ్యశేషతః| ఆదిత్యః సవితా సూర్యో మిహిరో7ర్కః ప్రభాకరః|| 15

మార్తండో భాస్కరో భాను శ్చిత్రభాను ర్దివాకరః| రవి ర్ద్వాదశభి స్తేషాం జ్ఞేయః సామాన్యనామభిః|| 16

విష్ణు ర్ధాతా భగః పూషా మిత్రేంద్రౌ వరుణో7ర్యమా|వివస్వా సంశుమాంస్త్వాష్టా పర్జన్యో ద్వాదశఃస్మృతః|| 17

ఇత్యేతే ద్వాదశాదిత్యాః పృథక్త్వేన వ్యవస్థితాః| ఉత్తిష్ఠంతి సదాహ్యేతే మాసైర్ధ్వా దశభిః క్రమాత్‌|| 18

విష్ణు స్తపతి చైత్రే తు వైశాఖే చార్యమా తథా| వివస్వాన్‌ జ్యేష్ఠమాసే తు ఆషాఢే చాంశుమాన్‌ స్మృతః|| 19

పర్జన్యః శ్రావణ మాసి వరుణః ప్రౌష్ఠసంజ్ఞకే| ఇంద్ర ఆశ్వయుజే మాసి ధాతా తపతి కార్తికే|| 20

మార్గశీర్షే తథా మిత్రః పౌషే పూషా దివాకరః| మాఘే భగస్తు విజ్ఞేయ స్త్వష్టా తపతి ఫాల్గునే|| 21

శ##తై ర్ద్వాదశభి ర్విష్ణూ రశ్మిభి ర్దీప్యతే సదా| దీప్యతే గోసహస్రేణ శ##తైశ్చ త్రిభి రర్యమా||

రర్యమా || 22

ద్వి స్సప్తకై ర్వివస్వాంస్తు అంశుమాన్‌పంచభిస్త్రిభిః|వివస్వానిన పర్జ్యన్యో వరుణ శ్చార్యమా తథా|| 23

మిత్రవ ద్భగవాం స్త్వష్టా సహస్రేణ శ##తేన చ| ఇంద్రస్తు ద్విగుణౖః షడ్భి ర్ధాతైకాదశభిః శ##తైః|| 24

సహస్రేణ తు మిత్రో వై పూషా తు నవభిః శ##తైః ఉత్తరోపక్రమే7ర్కస్య వర్ధంతే రశ్మయప్తథా|| 25

దక్షిణోపక్రమే భూయో హ్రసంతే సూర్యరశ్మయః| ఏవం రశ్మిసహస్రంతు సూర్యలోకా దనుగ్రహమ్‌|| 26

ఏవం నామ్నాం చతుర్వింశ దేక ఏషాం ప్రకీర్తితః| విస్తరేణ సహస్రంతు పునరన్యత్‌ ప్రకీర్తితమ్‌|| 27

సూర్యునకు అదిత్య- సవితృ- సూర్య - మిహిర-అర్క - ప్రభాకర-మార్తాండ- భాస్కర-భాను-చిత్రభాను-దివాకర-రవి-ఇత్యాదిగ పండ్రెండు సామాన్య నామములు. విష్ణు ధాత-భగ-పూష-మిత్ర-ఇంద్ర-వరుణ-అర్యమ-వివస్వత్‌ అంశుమత్‌-త్వష్ట-పర్జన్య-యను నీ పంద్రెండు నామములు విశేషనామములు. విష్ణువు చైత్రమందు పంట్రెండువందల కిరణములతో వెలుగును. అర్యముడు వైశాఖమందు పదమూడు వందల రశ్ములలో దీపించును. వివస్వంతుడు జ్యేష్ఠమందు పదునాల్గు వందల కరముల తోడను - అంశుమంతుడు ఆషాఢమున పదునేను వందల యంశువులతోను వర్జన్యుడు శ్రావణ మందు పదునాల్గు వందలును వరుణుడు భాద్రపదమందు నన్నియే కిరణములచేతను, ఇంద్రుడాశ్వయుజమున పన్నెండవందల కిరణములలోను ధాత కార్తీక మందు వదునొకండువందలకిరణములచేతను మార్గశిరమున మిత్రుడు పైవిధముగాను, పౌషముస పూష తొమ్మిదివందల కిరణములతోను మాఘమున భగుడును ఫాల్గుణమున త్వష్ట పదునొకండు వందల కిరణములతోను వెలుంగుదురు, ఉత్తరాయణమునుండి సూర్యకిరణములు పెంపొందును. దక్షిణాయనమునుండి తగ్గును. ఇట్లు వేలకొలది కిరణములు గ్రహముల ననుసరించి సోర్యునినుండి వెలుపడి వెలుంగును. సూర్య సామాన్యనామములు. వివేష నామము లును గలిసి యిరువది నాల్గు ప్రసిద్ధములు. ఇవి గాక సూర్య సహస్ర నామములు వేఱుగా నున్నవి.

మునయః ఊచుః

యే తన్నామసహస్రేణ స్తువం త్యర్కం ప్రజాపతే| తేషాం భవతి కిం పుణ్యం గతిశ్చ పరమేశ్వర|| 28

అంతట మునులు- ఓ పరమేశ్వరా! ప్రజాపతీ! సహస్రనామములతో సూర్యుని స్తుతించిన మానవునకు నే పుణ్యం ప్రాప్తించును? ఏ గతి సిద్ధించును? తెలుపుమని యడిగిరి.

బ్రహ్మోవాచ

శృణుధ్వం మునిశార్దూలాః! సారభూతం సనాతనమ్‌| అలం నామసహస్రేణ పఠన్నేవం స్తవం శుభమ్‌|| 29

యాని నామాని గుహ్యాని పవిత్రాణి శుభానిచ| తాని వః కీర్తయిష్యామి శృణుధ్వం భాస్కరస్య వై|| 30

బ్రహ్మయిట్లనియె. మునులార! సూర్య సహస్రనామ పారాయణమువలన నే ఫలము గల్గునో పవిత్రము శుభావహము-గుహ్యములునైన యా సూర్యనామములను మీకు దెల్పెదను వినుండు.

వికర్తనో వివస్వాంశ్చ మార్తండో భాస్కరో రవిః| లోకప్రకాశకః శ్రీమాన్‌ లోకచక్షుర్మహేశ్వరః 31

లోకసాక్షీ త్రిలోకేశః కర్తా హర్తా తమిస్రహా| తపన స్తాపన శ్చైవ శుచిః సప్తాశ్వవాహనః||

|| 32

గభస్తిహస్తో బ్రహ్మాచ సర్వదేవ నమస్కృతః| ఏకవింశతి రిత్యేష స్తవ ఇష్టః సదా రవేః || 33

సూర్యుని యిరువది యొక్క నామములు మూలమున స్పష్టము. ఈ పవిత్ర నామ స్తుతి సూర్యునకు సదా ప్రీతిని గూర్చును.

శరీరారోగ్యదశ్చైవ ధనవృద్ధియశస్కరః| సైవరాజ ఇతి ఖ్యాత స్త్రిషు లోకేషు విశ్రుతః|| 34

య ఏతేన ద్విజశ్రేద్విసంధ్యే7స్తష్ఠాః మనోదయే| స్తౌతి సూర్యం శుచిర్భూత్వా సర్వ పాపైః ప్రముచ్యతే|| 35

మానసం వాచికం వాపి దేహజం కర్మజం తథా| ఏక జప్యేన తత్సర్వం నశ్య త్యర్కస్య సన్నిధౌ|| 36

ఏకజప్యశ్చ హోమశ్చ సంధ్యోపాసన మేవ చ| ధూపమంత్రో7ర్ఘ్య మంత్రశ్చ బలిమంత్రస్తధైవ చ|| 37

అన్నప్రదానే దానే చ ప్రణిపాతే ప్రదక్షిణ| పూజితో7యం మహామంత్రః సర్వపాపహరః శుభః|| 38

తస్మా ద్యూయం ప్రయత్నేన స్తవేనానేన వై ద్విజాః| స్తువీధ్వం వరదం దేవం సర్వకామఫలప్రదమ్‌|| 39

ఇతి శ్రీ బ్రాహ్మే మహాపురాణ మార్తండ న్యైక వింశతినామకీర్తనం ఆదిత్య మాహాత్మ్య వర్ణనంనామ.

ఏకత్రింశో7ధ్యాయః||

ఇది శరీరారోగ్యము, ధనవృద్ధి యశస్సును గూర్చును. రెండు సంధ్యలందు నీ స్తుతి పఠించిన పాపములెల్ల పోవును. ఒకసారి జపించిన త్రికరణకృతమైన దురితము నశించును. ఒక మారీనామములచే హోమము సంద్యోపాసనము చేసిన ఆర్ఘ్యమందు బలియందు అన్నదానమందు స్నానమున నమస్కారమందు ప్రదక్షిణమందు నీ మహామంత్రము పఠించిన సర్వపాపక్షయమగును. శుభమగును. కావున మీరీమంత్రము పఠించి వరదుడైన సూర్యదేవుని నుతింపుడు.

ఇతి ముప్పది యొకటవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters