Brahmapuranamu    Chapters   

త్రింశో7ధ్యాయః

ఆదిత్య మహాత్మ్యమ్‌

మునయః ఊచుః

అహో దేవస్య మాహాత్మ్యం శ్రుతమేవం జగత్పతే | భాస్కరస్య సుర శ్రేష్ఠ వదత స్తే సుదుర్లభమ్‌|| 1

భూయః ప్రబ్రూహి దేవస్య యత్పృచ్ఛామో జగత్పతే| శ్రోతుమిచ్ఛామహే బ్రహ్మన్‌ పరంకౌతూలంహినః|| 22

గృహస్థో బ్రహ్మచారీచ వాన ప్రస్థో7ధ భిక్షుకః| య ఇచ్చే న్మోక్ష మాస్థాతుం దేవతాం కాం యజేత సః|| 3

కుతో హ్యసాక్షయః స్వర్గః కుతో నిశ్శ్రేయసం పరమ్‌| స్వర్గతశ్చైవ కిం కుర్యా ద్యేన నచ్యవతే పునః|| 4

దేవానాం చాత్ర కో దేవః పితౄణాంచైవ కఃపితా | యస్మాత్పరతరం నాస్తి తన్మే బ్రూహి సురేశ్వర! 5

కుతః సృష్టమిదం విశ్వం పర్వం స్థావర జంగమమ్‌ | ప్రళ##యేచ క మఖ్యేతి తద్భవాన్‌ వక్తు మర్హసి 6

సూర్య భగవానుని మహిమ నీవు చెప్పగా విన్నాము. ఇంకను విన కుతూహలమగుచున్నది. బ్రహ్మచర్యా శ్రమస్థులు ముక్తినందుట కేదేవత నుపాసింపవలయును. స్వర్గమునుండి దిగజారకుండుట కేమిచేయవలయును? దేవతలకు బితృదేవతలకు పరమ దేవత ఎవరు? ఈ సృష్టి ఎవనివలన నగును? ఎవ్వనియందు లీన మగును. తెలుప వలయును.

బ్రహ్మోవాచ

ఉద్యన్నేవైష కురుతే జగ ద్వితిమిరం కరైః| నాతః పరతరో దేవః కశ్చిదన్యో ద్విజోత్తమాః|| 7

ఆనాదినిధనో హ్యేష పురుషః శాశ్వతో7వ్యయః | తాపయత్యేష త్రీన్‌ లోకాన్‌ భవ న్రశ్మిఖి రుల్బణః|| 8

సర్వదేవమయో హ్యేష తపతాం తపనో వరః | సర్వస్య జగతో నాథః సర్వ సాక్షీ జగత్పతిః|| 9

సంక్షిపత్యేష భూతాని తథా విసృజతే పునః | ఏష భాతి తపత్యేష వర్షత్యేష గభస్తిభిః|| 10

ఏష ధాతా విధాతా చ భూతాది ర్భూతభావనః | నహ్యేష క్షయ మాయాతి నిత్య మక్షయమండలః || 11

పితౄణాం చ పితా హ్యేష దేవతానాం హి దేవతా | ధ్రువ స్థానం స్మృతం హ్యేత ద్యస్మాన్న చ్యవతేపునః|| 12

సర్గకాలే జగత్‌ కృత్య్న మాదిత్యాత్‌ సంప్రసూయతే | ప్రళ##యే చ త మభ్యేతి భాస్కరం దీ ప్తతేజసమ్‌|| 13

యోగినశ్చాప్య సంఖ్యాతా స్త్యక్త్వా గృహకలేబరమ్‌ | వాయుర్భూత్వా విశంత్యస్మిం స్తేజోరాశౌ దివాకరే|| 14

అస్య రశ్మిసహస్రాణి శాఖా ఇవ విహంగమాః| వసం త్యాశ్రిత్య మునయః సంసిద్ధా దేవతైః సహ|| 15

గృహస్థా జనకాద్యాశ్చ రాజనోయోగ ధర్మిణః | వాలఖిల్యాదయశ్చైవ ఋషయో బ్రహ్మవాదినః|| 16

వానప్రస్థాశ్చ యే చాన్యే వ్యాసాద్యా భిక్షవ స్తదా | యోగ మాస్థాయ సర్వేతే ప్రవిష్టాః సూర్యమండలమ్‌ || 17

శుకో వ్యాససుతః శ్రీమాన్యోగధర్మ మావాప్య సః| ఆదిత్యకిరాణాన్‌ గత్వా హ్యపునర్భావ మాస్థితః 18

ఓ ద్విజోత్తములారా! ఈ యాదిత్యు డుదయించుచునే తన కరంబులచే జీకటిని హరింపజేయును. ఇంత కంటే మరిదై వమెవ్వరు? ఈ పురుషుడు మొదలుతుదలేనివాడు శాశ్వాతుడు. అవ్యయుడు. ముల్లోకముల దసకిరణముల వెలిగించుచుండును. సర్వ దేవమయుడు సర్వజగన్నాధుడు సర్వసాక్షి జగత్పతి సర్వభూతముల సృజించును. పెంచును. సంక్షేపించును. ఈయనయే వేడిమినిచ్చును. వర్షించును. ధాత. విధాత. భూతాది. భూతభావనుడు ఈయనను క్షయములేదు. అన్ని వేళల నక్షయమండలుడు పితరులకు పిత. దేవతలకు దేవత. ఈయనది ధ్రువస్థానము. ఇందుండి మరలడు. ఆదిత్యుని నుండి జగత్తు పుట్టును. అందులయించును. యోగులు కళేబరము వీడి వాయురూపమంది తేజోరాశియైన దివాకరుని యందు ప్రవేశింతురు. ఈయనవేలకొలది కిరణముల నాశ్రయించి పక్షలుతరుశాఖల నాశ్రయించి యున్నట్లు- సిద్ధులు, దేవతలు నీయనయందు వసింతురు. యోగులు గృహస్థులైన జనకాది రాజర్షులు వాలఖల్యాదులు, బ్రహ్మవాదులైన మహర్షులు వ్యాసాదులు వానప్రస్థులు భిక్షువులు యోగ ముంబూని సూర్యమండలమున బ్రవేశింతురు. వ్యాసకుమారుడు శ్రీ శుకుడు యోగధర్మమూని యాదిత్య కిరణముల జొచ్చి పునరావృత్తి లేని వద మందియున్నాడు.

శబ్దమాత్ర శ్రుతిముఖా బ్రహ్మనిష్ణుశివాదయః| ప్రత్యక్షో7యం పరోదేవః సూర్యస్తిమిరనాశనః 19

తస్మాదన్యత్ర భక్తిర్హి న కార్యా శుభ మిచ్ఛతా| యస్మాద్‌ దృష్టే రగమ్యాస్తే దేవా విష్ణు పురోగమాః|| 20

అతో భవద్భిః సతత మభ్యర్య్చో భగవాన్‌ రవిః | సహి మాతా పితాచైవ కృత్స్నస్య జగతో గురుః || 21

అనాద్యో లోకనాథో7సౌ రశ్మిమాలీ జగత్పతిః | మిత్రత్వే చ స్థితో యస్మాత్తపస్తేపే ద్విజోత్తమాః || 22

అనాదివిధనో బ్రహ్మా నిత్య శ్చాక్షయ ఏవచ | సృష్ట్వా ససాగరాన్‌ ద్వీపాన్‌ భువనాని చతుర్దశ|| 23

లోకానాం స హితార్థాయ స్థితశ్చంద్ర సరిత్తటే| సృష్ట్వా ప్రజాపతీన్‌ సర్వా సృష్ట్వా చ వివిధాః ప్రజాః|| 24

తతః శతసహస్రాంశు రవ్యక్తశ్చ పునః స్వయం| కృత్వా ద్వాదశధాత్మాన మాదిత్యముపద్యతే|| 25

ఇంద్రో ధాత చ పర్జన్య స్త్వష్టా పూషర్యమా భగః | వివస్వాన్‌ విష్ణు రంశశ్చ వరుణో మిత్ర ఏవచ|| 26

ఆభిర్ద్వాదశభి స్తేన నూర్యేణ పరమాత్మనా | కృత్స్నం జగదిదం వ్యాప్తం మూర్తిభిశ్చ ద్విజోత్తమాః|| 27

బ్రహ్మ విష్ణు శివాది దేవతలు శబ్దమాత్రశ్రుతిగమ్యులు. ఈయన యే ప్రత్యక్షపరదేవత. తమో హరుడు. విష్ణుముఖ దేవతావర్గము కంటికి గానరారు. ఈయన ప్రతక్షనారాయణుడు. ఈయనయే తల్లి తండ్రి గురువు అనాది రశ్మిమాలి జగత్పతి మిత్రుడు నిత్యుడు ఆక్షయుడు ఈయన సాగరద్వీపములను పదునాల్గు భువనములను సృజించి చంద్రనదీతీరమున నున్నడు. సహస్రాంశువై యవ్వక్తుడయ్యు ద్వాదశమూర్తలచే వ్యక్తుడేప్రత్యక్షనారాయణుడై యాదిత్య స్థానమున వెలుంగుచున్నాడు.

తస్య యా ప్రథమామూర్తి రాదిత్యస్యేంద్ర సంజ్ఞితా| స్థితా సా దేవరాజత్వే దేవానం రిపునాశినీ|| 28

ధ్వితీయా తస్య యామూర్తి ర్నామ్నా ధాతేతి కీర్తితా| స్థితా ప్రజాపతిత్వేన వివిధాః సృజతే ప్రజాః|| 29

తృతీ యార్కస్య యా మూర్తిః పర్జన్య ఇతి విళ్రుతా| మేఘేష్వేవ స్థితా సాతు వర్షతే చ గభ స్తిభిః|| 30

చతుర్ధీ తస్య యా మూర్తి ర్నామ్నా త్వష్టేతి విశ్రుతా | స్థితా వనస్సతౌ సాతు ఓషధీషు చ సర్వతః|| 31

పంచమీ తస్య యా మూర్తి ర్నామ్నా పూషేతి విశ్రుతా| అన్నే వ్యవస్థితా సాతు ప్రజాః వుష్ణాతి నిత్యశః|| 32

మూర్తి ష్షష్ఠీ రవే ర్యాతు అర్యమా ఇతి విశ్రుతా | వాయో స్పంసరణా సాతు దేవేష్వేవ సమాశ్రితా|| 33

భానోర్యా స ప్తమీ మూర్తి ర్నామ్నా భ##గేతి విశ్రుతా | భూతి ష్వవస్ధితా సాతు శరీరేషు చ దేహినామ్‌ || 34

మూర్తిర్యా త్వష్టమీ తస్య వివస్వానితి విశ్రుతా| ఆగ్నౌ ప్రతిష్టితా సాతు పచత్యన్నం శరీరిణామ్‌|| 35

నవమీ చిత్రభానో ర్యా మూ ర్తి ర్విష్ణుశ్చ నామతః | ప్రాదుర్భవతి సా నిత్యం దేవానా మరిసూదనీ|| 36

దశమీ తస్య యా మూర్తి రంశుమానితి విశ్రుతా| వా¸° ప్రతిష్టితా సాతు ప్రహ్లాదయతి వై ప్రజాః || 37

మూర్తి స్త్వేకాదశీ భానో ర్నామ్నా వరుణ సంజ్ఞితా| జలే ష్వవస్థితా సాతు ప్రజాం పుష్ణాతి నిత్యశః || 38

మూర్తిర్యా ద్వాదశీ భానో ర్నామ్నా మిత్రేతి సంజ్ఞితా | లోకానాం సా హితార్థాయ స్థితా చంద్ర సరిత్తటే|| 39

వాయుభక్ష స్తపస్తేపే స్థిత్వా మైత్రేణ చక్షుషా | అనుగృహ్ణ న్సదా భక్తాన్‌ వరైర్నానావిధై స్తునః|| 40

ఏవం సా జగతాం మూర్తి ర్హితాయ విహితా పురా|తత్ర మిత్రః స్థితో యస్మా త్తస్మా న్మిత్రంపరం స్మృతమ్‌|| 41

ఆభి ర్ద్వాదశభి స్తేన సవిత్రా పరమాత్మనా | కృత్స్నం జగదిదం వ్యాప్తం మూర్తిభిశ్చ ద్విజోత్తమా|| 42

తస్మా ద్ధ్యేయో నమస్యశ్చ ద్వాదశస్థాను మూర్తిషు| భుక్తిమద్భి ర్నరైర్నిత్యం తద్గతే నాంతరాత్మనా|| 43

ఇత్యేవం ద్వాదశాదిత్యా స్నమస్కృత్వా తు మానవః | నిత్యం శ్రుత్వా పఠిత్వాచ సూర్యలోకే మహీయతే|| 44

ఇంద్రుడు. ధాత, పర్లన్యుడు, త్వష్ట, పూష, ఆర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, ఆంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు. అను నీ పండ్రెండు మూర్తులచే నీ పరమాత్మ సర్వజగమ్ములు వ్యాపించియున్నాడు. దేవశత్రునాశిని యైన మూర్తి ఇంద్రరూపమున దేవ రాజ్యనుందున్నది మొదటిది, రెండవది ప్రజాపతి రూపమున సృష్టి గావించునది. మూడవది మేఘములందు వర్షించునది. నాల్గవదివనస్పతులందు నోషథులందున్నది. ఐదవమూర్తి పూష అన్నగతమై ప్రజల పోషించును. అఱవమూర్తి ఆర్యమా రూపమై దేవతలందున్నది. సప్తమమూర్తి భగనామమున దేహులదేహములందు, సంపదలందు నున్నది. ఎనిమిదవది వివస్వాన్‌ అగ్నిగా నుండి జీవుల యాహారమున పచనము చేయుచున్నది. తొమ్మిదదది ''విష్ణువు'' అను మూర్తి. దేవశత్రు సంహార మునకు ప్రపర్తించును. పదవమూర్తి వాయువునందుండిజీవులకు సుఖ స్పర్శనొసంగి యానందపెట్టును. పదునొకండవ మూర్తి వరుణనామకము, జలములందుండి ప్రజాపుష్టి కూర్చును. పదిరెండవమూర్తి మిత్ర సంజ్ఞకము. లోకహితమునకై చంద్ర నదీ తీరమందున్నది. ప్రభాకరుడీమూర్తితోవాయుభక్షణ సేయుచుమైత్రీవ్రయుక్తమైనచూపుతోవరములిచ్చిభక్తానుగ్రహముచేయుచుచంద్ర నదీతటమందు తపముచేయుచుండును. కావున నతడు మిత్రుడను బిరుదు నామ మందెనని స్మృతులు తెలపుచున్నవి. ఇట్లు ద్వాదశ మూర్తియగుపరమాత్మ స్థావర జంగమములకెల్ల ఆత్మరూపుడైన సూర్యభగవానుడై ధ్యానమునకు లక్ష్యమై నమస్యుడు. ఈ ద్వాదశాదిత్యులను గూర్చి నిత్యము నమస్కరించుచు పఠించుచు వినువారు సూర్యలోకముందు వెలుగొందుదురు.

మునయ ఊచుః

శ్లో|| యది తావ దయం సూర్యశ్యాదిదేవః సనాతనః|

తతః కస్మాత్తపస్తేపే వరేప్సుః ప్రాకృతో యథా|| 45

మునులిట్లు పలికిరి

సూర్యుడు సనాతనుడగు నాదిదేవుడైనచో ప్రాకృత జనునివలె వరములగోలి తపమెందులకు చేసెను

బ్రహ్మోవాచ

శ్లౌ|| ఏత ద్వః సంప్రవక్ష్యామి పరం గుహ్యం విభావసోః పృష్టం మిత్రేణ యత్‌ పూర్వం నారదాయ మహాత్మనే ప్రాజ్మయోక్తాస్తు యుష్మభ్యం రవేర్ద్వాదశ మూర్తయః | మిత్రశ్చ వరుణశ్చోభౌ తాసాం తపసి సంస్థితౌ|| 47

అధ్యక్షో వరుణ స్తాసాం తస్థౌ పశ్చిమ సాగరే| మిత్రో మిత్ర వనే చాస్మిన్‌ వాయుభక్షో7భవ త్తదా|| 48

అథ మేరుగిరేః శృంగాత్‌ ప్రచ్యుతో గంధమాదనాత్‌| నారదస్తు మహా యోగీ సర్వావ్లోకాంశ్చరన్‌ వశీ|| 49

అజగామాఢ తత్రైవ యత్ర మిత్రో7చరత్తపః | తం దృష్ట్వాతు తపస్యంతం తస్య కౌతూహలం హ్యభూత్‌||

యో7క్షయ శ్చావ్యయశ్చైవ వ్యక్తా వ్యక్తః సనాతనః | ధృతమేకాత్మకం యేన త్రైలోక్యం సుమాహాత్మనా|| 51

యః పితా సర్వదేవానాం పరాణామపి యః పరః | అయజద్దేవతాః కాస్తు పితౄన్‌ వా కానసౌ యజేత్‌|| 52

ఇతి సంచిత్య మనసా తం దేవం నారదో7బ్రవీత్‌|

బ్రహ్మయిట్లనియె. ఇది ముక్కిలి రహస్యవిషయము. నారదుడు సూర్యనడగిన విషయముది. ఇంతకు మున్ను సూర్యభగవానునుని పండ్రెండు మూర్తల గురించి చెప్పితిని. అందు మిత్రుడు. వరుణుడు అనువారు తపస్సు నందుండిరి. అందు జలాహారియై వరుణడు పశ్చిమ సముద్రమునందును మిత్రుడు వాయుభక్షకుడై యీవనమందునున్నారు. ఈ మిత్రుడు మేరుశిఖరము నుండి గంధ మాదనమునుండి జారెను. మహాయోగియైన నారదుడు మిత్రుని దగ్గరకు వచ్చెను. తపస్సు చేయుచున్న యాయనను జూచి చాల వేడుక వడెను. ఆవ్యయము వ్యక్తావ్యక్తము త్రిలోకధారకము సర్వదేవతాపరాయణము సర్వజనకమునైన మిత్ర మూర్తి మఱి యే దేవతలను పితృదేవతలనుద్దేశించి మనస్సుచేత ధ్యానించుచు యజించుచున్నాడు.'' అని ఆలోచించి యాయనతో నిట్లనియె.

నారద ఉవాచ

వేదేషు సపురాణషు సాంగోపాంగేషు గీయసే|| త్వమజః శాశ్వతో ధాతా త్వం నిధాన మనుత్తమమ్‌ 53

భూతం భవ్యం భవచ్చైవ త్వయి సర్వమ్‌ ప్రతిష్ఠితమ్‌||

చత్వార శ్చాశ్రమా దేవ గృహస్థాద్యాస్తధై వహి | యజంతి త్వామహరహస్త్వాం మూర్తిత్వం సమాశ్రితమ్‌||

పితా మాతాచ సర్వస్యదైవతం త్వంహి శాశ్వతమ్‌ | యజసే పితరం కంత్వందేవం వాపి న విద్మహే || 56

సాంగోపాంగములైన వేదములందు నీవు గానము సేయబడుదువు. భూతభవద్భవ్యమయిన యీ దృశ్యమెల్ల కేవల ద్రష్టమైన నీయందు నిలుపు నందును. గృహస్థాద్యాశ్రమస్థులు నల్గురు నిన్నే పూజింతురు. నీవు సర్వజగజ్జనకుడవు జననివియున, దైవమును, నీవు నీకు పితయైన మఱియే దేవతను యజింతువో మేమెఱుంగము.

మిత్రఉవాచ

అవాచ్యమేత ద్వ క్తవ్యం పరం గుహ్యం సనాతనమ్‌| త్వయి భక్తిమతి బ్రహ్మన్‌ ప్రవక్ష్యామి యథాతథమ్‌ || 57

యత్తత్‌ సూక్ష్మ మవిజ్ఞేయ మవ్యక్త మచలం ధ్రువమ్‌| ఇంద్రియై రింద్రియార్థైశ్చ సర్వభూతై ర్వివర్జితమ్‌ || 58

స హ్యంతరాత్మా భూతానాం క్షేత్రజ్ఞశ్చైవ కథ్యతే| త్రిగుణా ద్వ్యతిరిక్తో7సౌ పురుషశ్చైవ కల్పితః|| 59

హిరణ్యగర్భో భగవాన్‌ సైవ బుద్ధిరితి స్మృతః | మహానీతి చ యోగేషు ప్రథాన మితి కథ్యతే|| 60

సాంఖ్యేచ కథ్యతే యోగే నామభి ర్భహుధాత్మకః | స చ త్రిరూపో విశ్వాత్మా శర్వో7క్షర ఇతి స్మృతః|| 61

ధృతమేకాత్మకం తేన త్రైలోక్య మిద మాత్మనా| ఆశరీరః శరీరేషు సర్వేషు వినస త్యసౌ || 62

వసన్నపి శరీరేషు నస లిప్యేత కర్మభిః | మమాంతరాత్మా తవచ యే చాన్యే దేహసంస్థితాః || 63

సర్వేషాం సాక్షిభూతో సౌ నగ్రాహ్యం కేనచిత్‌ క్వచిత్‌ |సగుణో నిర్గుణ విశ్వో జ్ఞానగమ్యో హ్యసౌ స్మృతః||

సర్వతః పాణిపాదాంతః సర్వతో7క్షిశిరోముఖః | సర్వతః శ్రుతిమాన్‌ లోకే సర్వమావృత్య తిష్ఠతి|| 65

విశ్వమూర్థా విశ్వభుజో విశ్వపాదాక్షినాశికః | ఏకశ్చరతి వైక్షేత్రే సై#్వరచారీ యథాసుఖమ్‌|| 66

క్షేత్రాణీహ శరీరాణీ తేషాంచైవ యథాసుఖమ్‌ | తానివేత్తి స యోగాత్మా తతః క్షేత్రజ్ఞ ఉచ్యతే || 67

అవ్యక్తేచ పురే శేతే పురుష స్తేన చోచ్చతే | విశ్వం బహువిధం జ్ఞేయం సచ సర్వత్ర ఉచ్యతే|| 68

తస్మాత్‌ స బహురూపత్వా ద్విశ్వరూప ఇతి స్మృతః|తసై#్యకస్య మహత్వం హి స చైకః పురుషః స్మృతః ||

మహాపురుషశబ్దం స బిభ ర్త్యేకః సనాతనః | సతు విధిక్రియాయత్తః సృజత్యాత్మాన మాత్మనా|| 70

శతాధా సహస్రధా చైవ తథా శత సహస్రధా | కోటిశశ్చ కరోత్యేష ప్రత్యగాత్మనమాత్మనా|| 71

ఆకాశాత్‌ పతితం తోయం యాతి స్వాద్వంతరం యథా| భూమే రసవిశేషేణ తథా గుణరసాత్తు సః || 72

ఏక ఏవ యథా వాయు ర్థేహేష్వేవ హి పంచధా| ఏకత్వం చ పృథక్త్వంచ తథా తస్య న సంశయః|| 73

స్థానాంతరవిశేషాచ్చ యథాగ్నిర్లభ##తే పరామ్‌| సంజ్ఞాం తథా మునే సో7యం బ్రహ్మదిషు తథాప్నుయాత్‌ || 74

యథా దీపసహస్రాణీ దీప ఏకః ప్రసూయతే| తథా రూపనహస్రాణి స ఏకః సంప్రసూయత్‌|| 75

యదా స బుధ్యత్యాత్మానం తదా భవతి కేవలః| ఏకత్వప్రలయే చాస్య బహుత్వంచ ప్రవర్తతే|| 76

నిత్యం హి నాస్తి జగతి భూతం స్థావర జంగమమ్‌| అక్షయ శ్చాప్రమేయశ్చ సర్వగశ్చ స ఉచ్యతే|| 77

తస్మా దవ్యక్త ముత్పన్నం త్రిగుణం ద్విజసత్తమాః|ఆవ్యక్తావ్యక్త భావస్తా యా సా ప్రకృతి రుచ్యతే|| 78

తాం యోనిం బ్రహ్మణో విద్ధి యో7సౌ సదసదాత్మకః| లోకే చ పూజ్యతే యో7సౌ దై వేపిత్ర్యే చ కర్మణి|| 79

నాస్తి తస్మాత్‌ పరో హ్యన్యః పితా దేవో పి వా ద్విజాః|ఆత్మనా సతు విజ్ఞేయ స్తతస్తం పూజయా మ్యహమ్‌|| 80

స్వర్గేష్వపి హి యే కేచి త్తం నమస్యంతి దేహినః | తేన గచ్ఛంతి దేవర్షే తేనోద్దిష్ట ఫలాం గతిమ్‌|| 81

తం దేవాః స్వాశ్రమసాశ్చ నానామూర్తిం సమాశ్రితాః|భక్త్యా సంపూజయం త్యాద్యం గతి శ్చైషాం దదాతి సః|| 82

సహి సర్వగతశ్చైవ నిర్గుణశ్చైవ కథ్యతే | ఏవం మత్వా యథాజ్ఞానం పూజయామి దివాకరమ్‌|| 83

యేచ తద్భావితా లోక ఏకతత్వం సమాశ్రితాః| ఏత దప్యధికం తేషాం యదేకం ప్రవిశం త్యుత|| 84

ఇతి గుహ్యసముద్దేశ స్తవ నారద కీర్తితః| అస్మద్భక్త్యాపి దేవర్షే త్వయాపి పరమం స్మృతమ్‌|| 85

సురైర్వా మునిభిర్వాపి పురాణౖర్వరదం స్మృతమ్‌| సర్వేచ పరమాత్మానం పూజయంతి దివాకరమ్‌|| 86

మిత్రుడిట్లనియొ. నీ వడిగినప్రశ్నము పరమగుహ్యము. తెలుపరానిది. నీవు భక్తుడవని తెలుపుచున్నాను. సూక్ష్మము అవ్యక్తము అచలము ధ్రువము నసబడు నాదివస్తువేదిగలదో యది భూతేంద్రీయ వివర్జితము. సర్వభూతాంతరాత్మ క్షేత్రజ్ఞుడనంబడును. త్రిగుణాతీతము. పురుష శబ్ద వాచ్యము. హిరణ్యగర్భ నామకమదియే బుద్ధియని చెప్పబడును. మహత్తు ప్రధానమనియు యోగ సాంఖ్యములందు పెక్కుపేరుల పిలువబడును. ఆ వస్తువు త్రిరూపము. ఈశ్వరుడనియు, అక్షరమనియు పేర్కొనబడినది. అది ఏక రూపమై యీ త్రిలోకముధరించును. శరీరులం దశరీరుడై యుండును. కర్మలేప మతనికి లేదు, అంతరాత్మ యన నదియ. సర్వసాక్షి. ఈ తత్త్వము సగుణము. నిర్గుణము. విశ్వరూపము. జ్ఞానగమ్యము. సర్వతః పాణిపాదము. సర్వతోక్షిశిరోముఖము. సర్వత శ్రుతిమంతము. సర్వమావరించి యున్నది. విశ్వమూర్ధము విశ్వభుజము విశ్వపాదాక్షినాసికము. క్షేత్రమందు (దేవామందు) స్వేచ్ఛాసంచారియై యొక్కడుగా నుండును, తానున్న ఉపాధుల నెఱుంగువాడు గావున క్షేత్రజ్ఞుడసంబడును. అవ్యక్తమయిన పురమందు శయించును. కావున పురుషడనంబడును. విశ్వము బహువిధము. అది యాయనయే కావున విశ్వరూపుడన నగును. ఆయన యొక్కనికే మహత్త్వ ముండుటచే మహాపురుష వాచ్యుడతడు. ఆకాశమునుండి వడిన నీరు భూమియొక్క రుచిని బట్టి రుచి భేధముందినట్లు గుణభేదమును బట్టి యతడు పలు విధ రూపములం గానవచ్చును. ఒక్కటే వాయువు దేహమందయిదు తీరులుగ నున్నట్లాయన యొక్కడే నానారూపుడగును. అగ్ని స్థానభేధముంబట్టి పలురీతులం గనవచ్చి పలునామము లందినట్లు ఆయనయు నుపాధి నిమిత్తముగా నానాత్వ మందును. ఒక్క దీపమునుండి పలు దీపములు ముట్టింపబడి వెల్లినట్లొక్కడయ్యు నాతడనేక రూపములం గన్పించి వెలుగును. తన్ను తానెరిగినతరి నతడుకేవలుండగును. ఏకత్వ ప్రళయమునందు బహుత్వము నొందును. నిత్యుడతడొక్కడే. అతని వలన త్రిగుణ రూప మవ్యక్తము పొడమినది. వ్యక్తావ్యక్త భావస్థయగు దానినే ప్రకృతి యందురు. అది బ్రహ్మకు కారణము. బ్రహ్మ సదసదాత్మకుడు. దేవపితృ కర్మములందితడే పూజింప బడువాడు. అతడు, తండ్రి, దేవుడు, ఆత్మచే దెలియ దగినవాడు. అతనినే నేను బూజించు చున్నాను. నానా రూపముల నానాదేవతల నర్చించు నందరి పూజలు నాతనొక్కనే చెందును. అయన సర్వగతి. ఆయనయే సూర్యుడును. కావున దివాకరుని నామరూపమునే నేనారాధింతును. ఏకత్వవిశ్వాసము గలవా రేకైక మైన యా పరతత్వమునే యందుదురు. ఇది గుహ్యాతి గుహ్యమైన యంశము.

బ్రహ్మోవాచ

ఏవ మేతత్‌ పురాఖ్యాతం నారదాయ తు భ్యానునా| మయాపి చ సమాఖ్యాతా కథా భానోర్ద్విజోత్తమాః|| 87

ఇదమాఖ్యాన మాఖ్యేయం మయాఖ్యాతం ద్విజోత్తమాః| నహ్యనాదిత్యభక్తాయ ఇదందేయం కదాచన|| 88

యశ్చైతచ్ఛ్రావయేన్నిత్యం యశ్చైవ శృణుయా న్నరః| స సహస్రార్చిషం దేవం ప్రవిశే న్నాత్రసంశయః|| 89

ముచ్యేతార్త స్తథారోగా చ్ఛ్రుత్వేమా మాదితః కథాం| జిజ్ఞాసు ర్లభ##తే జ్ఞానం గతి మిష్టాం తథైవ చ|| 90

క్షణన లభ##తే7ధ్యాన మిదం యః పఠతే మునే| యోయం కామయతే కామం సతం ప్రాప్నో త్యసంశయమ్‌|| 91

తస్మా ద్భవద్భిః సతతం స్మర్తవ్యో భగవాన్‌ రవిః| సచ ధాతా విధాతాచ సర్వస్య జగతః ప్రభుః|| 92

ఇతి బ్రాహ్మేమహాపురాణ ఆదిత్యమాహాత్మ్యనామ త్రింశో7ధ్యాయః

ఇట్లు మున్ను నారదునికి సూర్యుడు తెలిపెను. మీకిది తేట తెల్లంబొనరించితి. ఆదిత్య భక్తిలేని వానికిది తెలుపరాదు. ఇదిచదివిన్న నరులు సహస్రకిరణుసాలోక్యమందెందరు, సర్వదుఃఖ హరమిది.అభీష్ట సిధ్ధిదము. సూర్యభగవానుని మీరెల్లప్పుడు స్మరింపుడు. ఆయనయే ధాత విధాత సర్వజగత్ప్రభువు.

ఇది బ్రహ్మపురాణమందు ఆదిత్య మాహాత్మ్యము అను ముప్పదియవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters