Brahmapuranamu    Chapters   

తృతీయోధ్యాయః

దేవాసురాణా ముత్పత్తి కథనమ్‌

మునయ ఊచుః-

దేవానాం దానవానాం చ గంధ ర్వోరగ రక్షసామ్‌ | ఉత్పత్తిం విస్తరేణౖవ లోమహర్షణ కీర్తయ|| 1

మునులు లోమహర్షణ! దేవదానవ గంధర్వోరగ రాక్షసులయొక్క ఉత్పత్తిని విపులముగ తెలుపుమనిరి.

లోమహర్షణ ఉవాచ-

ప్రజాఃసృజేతి వ్యాదిష్టః పూర్వం దక్షః స్వయంభువా | యథా ససర్జ భూతాని తథా శ్రుణుత భో ద్విజాః || 2

మానసాస్యేవ భూతాని పూర్వమేవా సృజత్ప్రభుః | ఋషీ నేవా న్సగంధర్వా నసురా న్యక్ష రాక్షసాన్‌ || 3

యదాస్య మానసీ విప్రా స వ్యవర్ధత వైప్రజా | తదా సంచిత్య ధర్మాత్మా ప్రజాహేతోః ప్రజాపతిః || 4

స మైథునేన ధర్మేణ సిసృక్షు ర్వివిధాః ప్రజాః | అసిక్నీ మావహత్‌ పత్నీం వీరణస్య ప్రజాపతేః || 5

సుతాం సుతపసాయుక్తాం మహతీం లోకధారిణీమ్‌ | అథ పుత్ర సహస్రాణి వైరాణ్యాం పంచ వీర్యవాన్‌ || 6

ఆసిక్న్యాం జనయామాన దక్ష ఏవ ప్రజాపతిః | తాంస్తు దృష్ట్యా మహాభాగా న్సంవివర్ధయిషూ న్ప్రజాః || 7

దేవర్షిః ప్రియసంవాదో నారదః ప్రాబ్రవీ దిదమ్‌ | నాశాయ వచనం తేషాం శాపాయై వా೭೭త్మనస్తథా || 8

యం కశ్యపః సుతవరం పరమేష్ఠీ వ్యజీజనత్‌ | దక్షస్య వై దుహితరి దక్షశాపభయా న్మునిః || 9

పూర్వం స హి సముత్పన్నో నారదః పరమేష్ఠినః | అసిక్న్యా మథ వైరణ్యాం భూయో దేవర్షిసత్తమః || 10

తం భూయో జనయామాస పితేవ మునుపుంగవమ్‌ | తేన దక్షస్య వైపుత్రా హర్యశ్వా ఇతి విశ్రుతాః || 11

నిర్మథ్య నాశితాః సర్వే విధినా చ న సంశయః | తస్యో ద్యత స్తదా దక్షో నాశా యామిత విక్రమః || 12

బ్రహ్మర్షీ న్పురతః కృత్వా యాచితః పరమేష్ఠినా | తతో భిసంధి శ్చక్రే వైదక్షస్య పరమేష్ఠినా || 13

కన్యాయాం నారదో మహ్యం తవ పుత్రో భ##వేదితి | తతో దక్షః సుతాం ప్రాదాత్ప్రియాం వైపరమేష్ఠినే || 14

స తస్యాం నారదో జజ్ఞే భూయః శాపభయా దృషిః || 15

ఆన లోమహర్షణుడిట్లనియె . . .

స్వయంభువునాజ్ఞచే దక్షుడు సృష్టిచేయనారంభించెను. తొలుత మనస్సుచే భూతముల సృజించె. వారు దేవదానవ గంధర్వయక్షరాక్షసాదులు. కాని యాసంతతి యంతగ పెరుగదయ్యెను. అప్పుడు మైథున ధర్మముచే దానిం బెంపదలచి అసిక్నియను దానిని వీరణుడను ప్రజాపతికూతురుం గ్రహించెను. తపస్విని లోకముల ధరింపగలదియునైన ఆమె యందు దక్షుడైదువేల మందిని గాంచెను. సృష్ఠినిపెంపొందించదలచిన యాదక్ష పుత్రులంగని దేవర్షి (నారదుడు) మీరేల యీ సృష్ఠి కార్యము మొనరింతురువలదనియె. అందుచే వారికి వినాశము, అతనికి దక్షశాపము సంభవించెను. మున్ను బ్రహ్మకుదయించినవాడు నారదుడు వీరణుని కూతురగు అసిక్నియం దుదయించి యుండెను. తండ్రివలె దక్షుడు అతనిం గొడుకుగా గనెను. అందువలన దక్షునికుమారులు హర్యశ్వులను పేరొందిరి. వారు నారదుని మాటవిని యెటకో పోయిరి. అపుడు పరమేష్ఠి (బ్రహ్మ) బ్రహ్మర్షుల పురస్కరించుకొని పోయి దక్షుని క్రోధముపసంహరించుకొనవలసినదని వేడుకొనెను. ఆవల వారిర్వురకు సంధియయ్యెను. ఆ సంధి యేమనగా '' నా కన్య యందు నారదుడు నీకు పుత్రుడయి యుదయింపవలెను'' అని. అందులకు దక్షుడు పరమేష్ఠికి ప్రియ యను కన్యనిచ్చెను. ఆమె యందు దక్షశాపభయముచే నారదుడు జనించెను. (1-14) ఆన మునులిట్లనిరి.

మునయఊచుః-

కథం ప్రణాశితాః పుత్రా నారదేన మహర్షిణా | ప్రజాపతేః సూతవర్య! శ్రోతుమిచ్ఛామ తత్త్వతః || 15

ప్రజాపతి కుమారులెట్లు నారదునిచే నాశనమందిరి? ఆ వృత్తాంతమున్నదున్నట్టు మేము వినగోరుచున్నాము.

లోమహర్షణ ఉవాచ-

దక్షస్య పుత్రా హర్వశ్వా వివర్ధయిషవః ప్రజాః | సమాగతా మహావీర్యా నారద స్తానువాచ హ || 16

లోమహర్షు డిట్లనియె- దక్ష సుతులయిన హర్యశ్వులు ప్రజావృద్ధి చేయగోరి రాగా నారదుడు వారింగని యిట్లనియె-

నారద ఉవాచ -

బాలిశా బత యూయంవై నాస్యా జానీత వై భువః | ప్రమాణం స్రష్టుకామా వై ప్రజాః ప్రాచేతసాత్మజాః 17

అంత రూర్ధ్వ మధ శ్చైవ కథం సృజథ వై ప్రజాః | తే తు తద్వచనం శ్రుత్వా ప్రయాతాః సర్వతో దిశః || 18

అద్యాపి న నివర్తంతే సముద్రేభ్య ఇవా೭೭ పగాః | హర్యశ్వే ష్వథ నష్టేషు దక్షః ప్రాచేతసః పునః || 19

వైరణ్యా మథ పుత్రాణాం సహస్ర మసృజ త్ప్రభుః | వివర్ధయిషవస్తేతు శబలాశ్వా స్తథా ప్రజాః || 20

పూర్వోక్తం వచనం తే తు నారదేన ప్రచోదితాః | అన్యోన్యమూచుస్తే సర్వే సమ్యగాహ మహానృషిః || 21

భ్రాతౄణాం పదవీం జ్ఞాతుం గన్తవ్యం నాత్ర సంశయః | జ్ఞాతా ప్రమాణం పృథ్వ్యాశ్చ సుఖంస్రక్ష్యామహే ప్రజాః || 22

తేపి తేనైవ మార్గేణ ప్రయాతాః సర్వతో దిశమ్‌ | అద్యాపి న నివర్తంతే సముద్రేభ్య ఇవా೭೭పగాః || 23

తదా ప్రభృతి వై భ్రాతా భ్రాతురన్వేషణ ద్విజాః | ప్రయాతో నశ్యతి క్షిప్రం తన్న కార్యం విపశ్చితా || 24

నారదుడిట్లనియె- మీరు మూఢులు. ఈ భూమి ప్రమాణమెంతో యెఱుగరు. అట్లెఱుగకయే సంతానముంగననెంచినారు. క్రిందును మీదును అంతరము నెఱుంగని వారెట్లు బిడ్డలగాంతురు? అన విని వారు నలుదిశలకుబోయిరి. సముద్రముం జొచ్చిన నదులు వెనుదిఱుగని యట్లిప్పటికిని వారు తిరిగిరారైరి. ప్రాచేతసుడయిన దక్షుడు హర్యశ్వులట్లుపోగా వైరిణియందు మరి పుత్రసహస్రముం గనెను. వారు మున్ను నారదుడాడిన పలుకులు స్మరించి దేవర్షి (మనయన్న) బాగుగ చెప్పినాడు. మనమును మనయన్నలజాడనంటి పోవుదము భూమి ప్రమాణమెఱిగి యామీద సృష్టి చేయుదము, యని కూడబలుకుకొని యందరు నన్నిదెసలకుం బోయిరి. వారును ఇంతవరకు వెనుతిరిగి రారైరి. అదిమొదలు సోదరుడు సోదరునిజాడ వెదుకబోయెనేని యక్కడ నశించునుకాని తిరిగిరాడు. ఇది యెఱింగినవాడీ పనిc జేయరాదు. (17-24)

తాంశ్చైవ నష్టాన్విజ్ఞాయ పుత్రాన్దక్షః ప్రజాపతిః | షష్టిం తతోసృజ త్కన్యావైరణ్యామితి నః శ్రుతమ్‌| 25

తాస్తదా ప్రతిజగ్రాహ భార్యార్థం కశ్యపః ప్రభుః | సోమో ధర్మశ్చ థో విప్రా స్తథావాన్యే మహర్షయః || 26

దదౌ స దశ ధర్మాయ కశ్యపాయ త్రయోదశ | సప్తవింశతి సోమాయ చతస్రో రిష్టనేమినే || 27

ద్వే చైవ బహుపుత్రాయ ద్వేచై వాంగిరసే తథా | ద్వే కృశాశ్వాయ విదుషే తాసాం నామాని మే శ్రుణు || 28

దక్షు డాపుత్రనష్టమెరిగి వైరిణియందు యరువదిమందిగన్యలను మరల బుట్టించెను. అతడు పదిమందిని ధర్మునికి, కశ్యపునకు పదముగ్గురను, ఇరువదియేడుగురను సోమునికి, నల్గురను అరిష్టనేమికి, ఇర్వురను బహుపుత్రునకు, ఇద్దర నంగిరసునికి, ఇద్దరను విద్వాంసుడైన కృశాశ్వునికి నిచ్చెను. వారి పేరులు వినుడు.

అరుంధతీత వసు ర్యామీ లంబా భాను ర్మరుత్వతీ | సంకల్పా చ ముహుర్తా చ సాధ్యా విశ్వా చ భో ద్విజాః || 29

ధర్మపత్న్యో దశ త్వేతా స్తా స్వపత్యాని బోధత | విశ్వేదేవాస్తు విశ్వాయాః సాధ్యా సాధ్యా న్వ్యజాయత || 30

మరుత్వత్యాం మరుత్వంతో వసోస్తు వసవః సుతాః | భానోస్తు భానవః పుత్రాఃముహూర్తాయా ముహూర్తజాః || 31

లంబాయాశ్చైవ ఘోషోథ నాగవీథీ చ యామిజా | పృథివీ విషయం సర్వ మరుంధత్యాం వ్యజాయత || 32

సంకల్పాయాస్తు విశ్వాత్మా జజ్ఞే సంకల్ప ఏవ హి | నాగవీథ్యాం చ యామిన్యాం వృషలశ్చ వ్యజాయత || 33

పరా యాః సోమపత్నీశ్చ దక్షః ప్రాచేతసో దదౌ | సర్వా నక్షత్రనామ్న్యస్తా జ్యౌతిషే పరికీర్తితాః || 34

యే త్వన్వే ఖ్యాతిమంతో వై దేవా జ్యోతిష్పురోగమాః | వసవోష్టౌ సమాఖ్యాతా స్తేషాం వక్ష్యామి విస్తరమ్‌ || 35

అపో ధ్రువశ్చ సోమశ్చ ధవశ్చైవానిలొ నలః | ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ ప్రసవో నామభిః స్మృతాః || 36

ఆవస్య పుత్రో వైత్తణ్డ్యః శ్రమః శ్రాంతో మునిస్తథా | ధ్రువస్య పుత్రో భగవాన్కాలో లోకప్రకాలనః || 37

సోమస్య భగవా న్వర్చా వర్చస్వీ యేన జాయతే | ధవస్య పుత్రో ద్రవిణో హుతహవ్యవహస్తథా|| 38

మనోహరాయాః శిశిరః ప్రాణోథ రమణ స్తథా || 39

అనిలస్య శివా భార్యా తస్యాః పుత్రో మనోజవః | అవిజ్ఞాత గతిశ్చైవ ద్వౌ పుత్రా వనిలస్య చ || 40

అగ్నిపుత్రః కుమారస్తు శరస్తంబే శ్రియావృతః | తస్య శాఖో విశాఖశ్చ నైగమేయశ్చ పృష్ఠజః || 41

అపత్యం కృత్తికానాం తు కార్తికేయ ఇతి స్మృతః| ప్రత్యూషస్యవిదుః పుత్ర మృషిం నామ్నాథ దేవలమ్‌ || 42

ద్వౌ పుత్రౌ దేవలస్యాపి క్షమావస్తౌ మనీషిణౌ | బృహస్పతేస్తు భగినీ పరస్త్రీ బ్రహ్మవాదినీ|| 43

యోగసిద్ధా జగత్కృత్స్న మసక్తా విచచార హ | ప్రభాసస్య తు సా భార్యా వసూనా మష్టమస్యతు || 44

విశ్వకర్మా మహాభాగో యస్యాం జజ్ఞే ప్రజాపతిః కర్తా శిల్పసహస్రాణాం త్రిదశానాం చ వార్థకిః || 45

భూషణానాం చ సర్వేషాం కర్తా శిల్పవతాం వరః | యః సర్వేషాం విమానాని దైవతానాం చకార హ || 46

మానుషా శ్చోవజీవంతి యస్యశిల్పం మహాత్మనః | సురభీ కశ్యపా ద్రుద్రా నేకాదశ వినిర్మమే || 47

మహాదేవప్రసాదేన తపసా భావితా సతీ | అజైకపా దహిర్బుధ్న్య స్త్వష్టా రుద్రశ్చ వీర్యవాన్‌ || 48

హరశ్చ బహురూపశ్చ త్ర్యంబక శ్చాపరాజితః | వృషాకపాశ్చ శంభుశ్చ కవర్దీ రైవతస్తథా || 49

మృగవ్యాధశ్చ శర్వశ్చ కపాలీ చ ద్విజోత్తమాః | ఏకాదశైతే విఖ్యాతా రుద్రాస్త్రిభువనేశ్వరాః || 50

శతం త్వేవం సమాఖ్యాతం రుద్రాణా మమి తౌజసామ్‌ | పురాణ మునిశార్దూలా యైర్వ్యాప్తం సచరాచరం || 51

దారాన్‌ శృణుధ్వం విప్రేంద్రాః కశ్యపస్య ప్రజాపతేః | అదితి ర్దితి ర్దనుశైవ అరిష్టా సురసా ఖసా || 52

సురభి ర్వినతా చైవ తామ్రా క్రోధవశా ఇరా | కద్రూ ర్మునిశ్చ భో విప్రా స్తాస్వపత్యాని బోధత || 53

పూర్వమన్వంతరే శ్రేష్ఠా ద్వాదశా`ò`òన న్సురేత్తమాః | తుషితానామ తేన్యోన్య మూచు ర్వైవస్వతేంతరే || 54

అరుంధతి - వసువు - యామి - లంబా - భానువు - మరుత్వతి - సంకల్ప - ముహూర్త - సాధ్య - విశ్వ వీరుబదిమంది. వీరి సంతానమును వినుడు. విశ్వకుమారులు, విశ్వదేపులు, సాధ్యకొడులు సాధ్యులు, మరుత్వతి కొడుకులు మరుత్వంతులు, వసు కుమారులు వసువులు, భాను బిడ్డలు భానువులు, ముహూర్తకొడుకులు మహూర్తులు, లంబ కొడుకు ఘోషుడు, యామి కూతురు నాగవీధి పృథివికి సంబంధించిన సంతతియెల్ల అరుంధతియందు జనించెను. సంకల్పకు విశ్వాత్ముడయిన సంకల్పుడు పుట్టెను. యామిజయయిన నాగవీధియందు వృషలుడుc బుట్టెను. ప్రచేతస కుమారుడయిన దక్షుడు సోమునికిచ్చిన కన్యలందరు నక్షత్ర నామములజ్యోతి శాస్త్రమునందు ప్రసిద్ధులయి యున్నారు. జ్యోతిర్మండలమునందు పురోగమించువారు దేవతలు. ఖ్యాతివంతులు మఱి యెనమండ్రు అనలుడు, వసువులు, ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధవుడు, అనిలుడు, అగ్ని ప్రత్యూషుడు, ప్రభాసుడు, అనువారు. ఆపునికొడుకులు గణింప వైతండ్యుడు, శ్రముడు, శాంతుడు, మునియు. ధ్రువకుమారుడు కాల భగవానుడు, (లోక ప్రకాలనుడు) లోకమందు కాలగణమున బడునన్నమాట. సోముని కొడుకు వర్చస్సుడు, (ఆయనయే వర్చస్వి) ధవునికి మనోహర అనుదానియందుదయించిన వారు ద్రవిణుడు, హుతహవ్యవహుడు, శిశిరుడు, ప్రాణుడు, రమణుడు అనువారు. అనిలుని భార్య శివ. ఆమె బిడ్డలు మనోజవుడు అవిజ్ఞాతగతి యను వారిద్దరు. అనలుని కొడుకు కుమారుడు రెల్లుదుబ్బునందు శోభిల్లువాడు, అతని తమ్ములు శాఖ-విశాఖ-నైగమేయులనువారు. కృత్తికలు గన్న సంతానమగుట కార్తికేయుడనబడుచుండువాడు కుమారుడు. ప్రత్యూషునికొడుకు దేవలుడని ఋషి. దేవలునకి ఇద్దరు కొడుకులు క్షమాశీలురు, పండితులు, బృహస్పతి చెల్లెలు పరస్త్రీ బ్రహ్మవాదిని. యోగసిద్ధినంది యెల్ల జగమ్ము సంచరించెను. ఆమె ప్రభాసుని భార్య. అతడు వసువులలో నెనిమిదవవాడు. విశ్వకర్మయను ప్రజాపతి యామెయందుదయించెను. వేలశిల్పములకాయన కర్త, త్రిదశలకు (దేవతలకు) అతడు వార్ధకి (వడ్రంగి). సర్వభూషణ శిల్పకల్పనము చేయువాడు. దేవతా విమాననిర్మాత యాతడు. కశ్యపునివలన సురభి ఏకాదశరుద్రులంగాంచె. ఆమె మహాదేవుని ప్రసాదమువడసి తపస్సుచే ప్రభావితయయి, ఈ సంగతి గనెను.

ఏకాదశరుద్రులు- అజైకపాత్తు, అహిర్బుధ్న్యుడు, త్వష్ట, రుద్రుడు, హరుడు, బహురూపుడు, త్ర్యంబకుడు, అపరాజితుడు, వృషాకపి, శంభువు, కపర్ది, రైవతుడు, మృగవ్యాధుడు, శర్వుడు, కపాలి. రుద్రశతము బురాణములందు వర్ణింపబడి యున్నది. చరాచరభూతసంఘము వారిచే నిండియున్నది. కశ్యపప్రజాపతి భార్యలు- అదితి, దితి, దనువు, అరిష్ట, సురస, ఖన, సురభి, వినత, తామ్ర క్రోధనశ, ఇల, కద్రువు, ముని యనువారు, పూర్వమన్వంతరమువారు. (29-54)

ఉపస్థితేతియశస శ్చాక్షుష స్యాంతరే మనోః | హితార్థం సర్వలోకానాం సమాగమ్య పరస్పరమ్‌ ||

ఆగచ్ఛత ద్రుతం దేవా అదితిం సంప్రవిశ్యవై | మన్వంతరే ప్రసూయామస్తన్నః శ్రేయో భవిష్యతి|| 55

చాక్షుషమన్వంతరమునందు సర్వలోక హితము గోరి దేవతలొకకరికొకరు కలిసికొని వేగముగ రండు అదితియందు ప్రవేశించి జనింతము. అందువలన మనకు శ్రేయస్సు కలుగc గలదు అనుకొనిరి. (55)

లోమహర్షణ ఉవాచ-

ఏవముక్త్వా తు తే సర్వే చాక్షుపస్యాంతరే మనోః | మారీచా త్కశ్య పాజ్జాతా స్త్వదిత్వా దక్షకన్యయా|| 56

తత్ర విష్ణుశ్చ శక్రశ్చ జిజ్ఞాతే పునరేవ హి | అర్యమా చైవ ధాతా చ త్వష్టా పూషా తథైవ చ || 57

వివస్వాన్‌ సవితాచైవ మిత్రో వరుణ ఏవ చ | అంశో భగ శ్చాతితేజా ఆదిత్యా ద్వాదశ స్మృతాః || 58

సూతుడిట్లనియె. . .ఇట్లనుకొని యా దేవతలు చాక్షుషమన్వంతరమందు కశ్యపునకు దక్షకుమార్తెయగు నదితియందు జన్మించిరి. విష్ణువు ఇంద్రుడుతిరిగి పుట్టిరి. అర్యముడు, ధాత, త్వష్ట, పూష, వివస్వంతుడు, సవిత, మిత్రుడు వరుణుడు అంశుడు, మహాతేజస్వి యగు భగుడు నను ద్వాదశాదిత్యులుదయించిరి. (57-58)

సప్తవింశతి యాః ప్రోక్తాః సోమపత్న్యో మహావ్రతాః | తాసా మపత్యా న్యభవ న్దీప్తా న్యమిత తేజసః || 59

అరిష్జనేమిపత్నీ నా మపత్యా నీహ షోడశ | బహుపుత్రస్య విదుష శ్చతస్రో విద్యుతః స్మృతాః || 60

చాక్షుషస్యాంతరే పూర్వే ఋచో బ్రహ్మర్షనత్కృతాః | కృశాశ్వస్య చ దేవర్షే ర్దేవ ప్రహరణాః స్మృతాః || 61

ఏతే యుగసహస్రాంతే జాయంతే పునరేవ హి | సర్వేదేవగణా శ్చాత్ర త్రయస్త్రింశత్తు కామజాః || 62

తేషామపి చ భో విప్రా నిరోధోత్పత్తి రుచ్యతే | యథా సూర్యస్య గగన ఉదయాస్త మయా విహ || 63

సోముని భార్య లిరువదియేడుగురు మంచి కాంతివంతులైన కుమారుల గనిరి, అరిష్టనేమి భార్యల యొక్క సంతతి పదునార్వురు జ్ఞానియయిన బహుపుత్రునియొక్క సంతతి నలుగురు విద్యుత్తులు (మెఱపులు) చాక్షుష మన్వంతరమందు ఋక్ఛాఖీయులు కృశాశ్వుడను దేవర్షియొక్క కుమారులు. బ్రహ్మర్షిచేత సత్కరించపబడినవారు మహాపురుషులు దేవ ప్రహరణులను వారు జనించిరి. వీరందరూ సహస్రయుగాంతమున మరల యవతరింతురు. వీరు స్వేచ్ఛా జన్ములు ముప్పదిమూడు దేవగణములు- అని వీరినే పిలుతురు. ఆకాశమున సూర్యునకుదయాన్తమయములు గల్గినట్లు వీరికిని యుత్పత్యవసానములుగలవు. ప్రతియుగమందిట్లు దేవతలు గల్గుచుందురు. (59-63)

ఏవం దేవనికాయస్తే సంభవంతి యుగేయుగే | దిత్యా పుత్రద్వయం జజ్ఞే కశ్యపా దితి నః శ్రుతమ్‌|| 64

హిరణ్యకశిపుశ్చైవ హిరణ్యాక్షశ్చ వీర్యవాన్‌ | సింహికా చాభవ త్కన్యా విప్రచిత్తేః పరిగ్రహః || 64

సైంహికేయా ఇతి ఖ్యాతా యస్యాః పుత్రా మహాబలాః హిరణ్యకశిపోః పుత్రా శ్చత్వారః ప్రథితౌజసః || 65

హ్లాదశ్చ అనుహ్లాదశ్చ ప్రహ్లాదశ్చైవ వీర్యవాన్‌ | సంహ్లాదశ్చ చతుర్ధో భూద్ద్రాదపుత్రో హ్లదస్తథా || 66

హ్లాదశ్చ పుత్రౌ ద్వౌ వీరౌ శివః కాల స్తథైవచ | విరోచనశ్చ ప్రాహ్లాది ర్బలి ర్జజ్ఞే విరోచనాత్‌ || 67

బలేః పుత్రశతం త్వాసీ ద్బాణజ్యేష్ఠం తపోధనాః ధృతరాష్ట్రశ్చ సూర్యశ్చ చంద్రమా శ్చంద్రతాపనః || 68

కుంభనాభో గర్ధభాక్షః కుక్షిరిత్యేవ మాదయః | బాణ స్తేషా మతిబలో జ్యేష్ఠాః పశుపతేః ప్రియః || 69

పురాకల్పేతు బాణన ప్రాసాద్యోమాపతిం ప్రభుమ్‌ | పార్శ్వతో విహరిష్యామి ఇత్యేవం యాచితో వరః || 70

హిరణ్యాక్షసుతాశ్చైవ విద్వాంసశ్చ మహాబలాః | భర్భరః శకునిశ్చైవ భూతసంతాపనస్తథా || 71

మహానాభశ్చ విక్రాంతః కాలనాభస్తథైవ చ | అభవన్‌ దను పుత్రాశ్చ శతం తీవ్ర పరాక్రమాః || 72

తపస్వినో మహావీర్యాః ప్రాధాన్యేన బ్రవీమి తాన్‌ | ద్విమూర్ధా శంకుకర్ణశ్చ తథా హయశిరా విభుః || 73

అయోముఖః శంబరశ్చ కపిలో వామన స్తథా | మారీచి ర్మఘవాం శ్చైవ ఇల్వలః స్వసృమ స్తథా || 74

విక్షోభణశ్చ కేతుశ్చ కేతువీర్యశతహ్రదౌ | ఇంద్రజిత్సర్వ జి చ్చైవ వజ్రనాభ స్తథైవ చ || 75

ఏకచక్రో మహాబాహు స్తారకశ్చ మహాబలః | వైశ్వానరః పులోమా చ విద్రావణమహాశిరాః || 76

స్వర్భాను ర్వృష పర్వా చ విప్రచిత్తి శ్చ వీర్యవాన్‌ | సర్వ ఏతే దనోః పుత్రాః కశ్వపా దభిజజ్ఞిరే || 77

విప్రచిత్తి ప్రధానాస్తే దానవాః సుమహాబలాః | ఏతేషాం పుత్ర పౌత్రం తు న తచ్ఛక్యం ద్విజోత్తమాః 78

ప్రసంఖ్యాతుం బహుత్వాచ్చ పుత్రపౌత్రమనంతకమ్‌ | స్వర్భానోస్తు ప్రభా కన్యా పులోమ్నస్తు శచీ సుతా || 79

ఉపదీప్తి ర్హయశిరాః శర్మిష్ఠా వార్షపర్వణీ | పులోమా కాలికాచైవ వైశ్వానరసుతే ఉభే || 80

బహ్వపత్యే మహాపత్యే మరీచే స్తు పరిగ్రహః | తయోః పుత్రసహప్రాణి షష్టి ర్దానవ నందనాః || 81

చతుర్దశశతా నన్యా న్హిరణ్యపురవాసినః | మరీచి ర్జనయామాస మహతా తపసాన్వితః || 82

పౌలోమాః కాలకేయాశ్చ దానవాస్తే మహాబలాః | అవధ్యా దేవతానాం హి హిరణ్యపుర వాసినః 83

పితామహప్రసాదేన యే హతాః సవ్యసాచినా | తతో పరే మహావీర్యా దానవాస్త్వ తిదారుణాః|| 84

సింహికాయ మథోత్పన్నా విప్రచిత్తేః సుతాస్థథా! దైత్యదానవసంయోగా జ్జాతా స్తీవ్రపరాక్రమః || 85

సైంహికేయా ఇతి ఖ్యాతా స్త్రయోదశ మహాబలాః | వంశః శల్యశ్చ బలినౌ నలశ్చైవ తథా బలః || 86

వాతాపి ర్నముచిశ్చైవ ఇల్వలః స్వసృమ స్తథా | అంజికో నరకశ్చైవ కాలనాభ స్తథైవ చ || 87

సరమాన స్తథా చైవ స్వరకల్పశ్చ వీర్యవాన్‌ | ఏతే వై దానవాః శ్రేష్ఠా దనోరన్వంశవివర్ధనాః || 88

తేషాం పుత్రాశ్చ పౌత్రాశ్చ శతశోథ సహస్రశః | సంహ్రాదస్య తు దైత్యస్య నివాతకవచాః కులే || 90

సముత్పన్నాః సుమహతా మపసా భావితాత్మనః | తిస్రః కోట్యః సుతా స్తేషాం మణివత్యాం నివాసినః || 91

అవధ్యాస్తేపి దేవానా మర్జునేన నిపాతితాః | షట్సుతాః సుమహాభాగా స్తామ్రాయాః పరికీర్తితాః || 92

క్రౌంచీ శ్యేనీ చ భాసీ చ సుగ్రీవీ శుచిగృధ్రికా | క్రౌంచీతు జనయామాస ఉలూక ప్రత్యలూకకాన్‌ || 93

శ్యేనీ శ్యేనాంస్తథా భాసీ భాసాన్గృధ్రాంశ్చ గృధ్ర్యపి | శుచిరౌద కాన్పక్షిగణా న్సుగ్రీవీ తు ద్విజోత్తమాః || 94

అశ్వా నుష్ట్రా న్గర్దభాంశ్చ తామ్రావంశః ప్రకీర్తితః | వినతాయాస్తు ద్వౌ పుత్రౌ విఖ్యాతౌగరుడారుణౌ || 95

గరుడః పతతాం శ్రేష్ఠో దారుణః స్వేన కర్మణా | సురసాయాః సహస్రంతు సర్పణా మమితౌజసామ్‌ || 96

అనేకశిరసాం విప్రాః ఖచరాణాం మహాత్మనామ్‌ | కాద్రవేయాస్తు బలినః సహస్ర మమితౌజసః || 97

సువర్ణవశగా నాగా జజ్ఞిరే నైకమస్తకాః | యేషాం ప్రధానాః సతతం శేషవాసుకి తక్షకాః || 98

ఐరావతో మహాపద్మః కంబలాశ్వతరా వుభౌ | ఏలాపత్రశ్చ శంఖశ్చ కర్కోటక ధనంజ¸° || 99

మహానీల మహాకర్ణౌ ధృతరాష్ట్ర బలాహకౌ | కుహరః పుష్పదంష్ట్రశ్చ దుర్ముఖః సుముఖస్తథా || 100

శంఖశ్చ శంఖపాలశ్చ కపిలో వామనస్తథా | నహుషః శంఖరోమా చ మణిరిత్యేవ మాదయః || 101

తేషాం పుత్రాశ్చ పౌత్రాశ్చ శతశోథ సహస్రశః | చతుర్దశసహస్రాణి క్రూరాణా మని లాశినామ్‌ || 102

గణం క్రోధవశం విప్రాస్తస్య సర్వే చ దంష్ట్రిణః | స్థలజాః పక్షిణోబ్జాశ్చ ధరాయాః ప్రసవాః స్మృతాః || 103

కశ్యపుని వలన దితికి హిరణ్యకశిపు హిరణ్యాక్షులు జనించిరి అని వినియుంటిమి. విప్రచిత్తి భార్య సింహిక. ఆమె పుత్రులు మహాబలవంతులు, సైంహికేయులు. హిరణ్యకశిపుని పుత్రులు బలశాలురు. వారు నల్గురు హ్లాదుడు, అనుహ్లాదుడు, ప్రహ్లాదుడు, సంహ్లాదుడు. హ్లాదుని కుమారుడు హ్లదుడు. హ్లదుని కుమారులిద్దరు. శివుడు, కాలుడు, యనువారు. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు అతని కొడుకు బలి. బలి కుమారులు బాణుడు మొదలుగా నూర్గురు. వారందరూ తపోధనులు. ధృతరాష్ట్రుని మొదలు విప్రచిత్తి వరకు కశ్యపప్రజాపతికి పెక్కుమంది కలిగిరి. ఈ దానవులకు విప్రచిత్తి ప్రధానుడు. వీరి పుత్రపౌత్రగణము గణించి చెప్పుట సాధ్యముcగాదు. వీరిలో స్వర్భావని కూతురు ప్రభ. (63-103)

గాస్తు వై జనయామాన సురభి ర్మహిషీ స్తథా | ఇరా వృక్షలతా వల్లీ స్తృణ జాతీశ్చ సర్వశః || 104

ఖసా తు యక్షరక్షాంసి మునిరప్సరసస్తథా | అరిష్టాతు మహాసిద్ధా గంధర్వా నమితౌజసః || 105

ఏతే కశ్యపదాయదాః కీర్తితాః స్థాణు జంగమాః | యేషాం పుత్రాశ్చ పౌత్రాశ్చ శకశోథ సహస్రశః || 106

ఏష మన్వంతరే విప్రాః సర్గః స్వారోచిషే స్మృతః | వైవస్వతే తిమహత వారుణ వితతే క్రతౌ || 107

జుహ్వానస్య బ్రహ్మణో వై ప్రజాసర్గ ఇహోచ్యతే | పూర్వంయత్ర సముత్పన్నాన్‌ బ్రహ్మర్షీన్‌ సప్తమానసాన్‌ || 108

పుత్రత్వే కల్పయామాస స్వయమేవ పితామహః | తతో విరోధే దేవానాం దానవానాం చ భో ద్విజాః || 109

దితిర్వినష్టపుత్రా వైతోషయామాన కశ్యపమ్‌ | కశ్యపస్తు ప్రసన్నాత్మా సమ్యగారాధిత స్స్వయం || 110

వరేణ చ్ఛందయామాస సా వవ్రే వరం తదా | పుత్ర మింద్రవధార్థాయ సమర్ధ మమితౌజసమ్‌ || 111

సురభి ఆవులను గేదెలను ప్రసవించెను. ఇర చెట్లను, తీగలను తృణజాతులను గనెను. ఖన యక్షులను రాక్షసులను గనెను ముని యను నామె అప్సరసలను గాంచెను. అరిష్ట సిద్ధగంధర్వులను ప్రసవించెను స్థావర జంగమాత్మకమైన యీసంతతి కశ్యపునకు సంబంధించినది. వారిమనుమలు, మునిమనుమలు, వేలకొలది పుట్టిరి. ఇది స్వారోచిష మన్వంతరమున జరిగిన సృష్టి, వైవస్వత మన్వంతరమునందు వరుణ దేవతాకమైన క్రతువు జరుగగా బ్రహ్మ హోతగానుండి చేసిన హోమమువలన కల్గిన సృష్టి నిప్పుడు చెప్పుచున్నాడు.

లోగడ కల్పమునందు పుట్టిన సప్తమహర్షులను ఈ కల్పమందు తిరిగి బ్రహ్మ సప్తర్షులుగా గల్పించెను. ఆ మీద దేవదానవులకు యుద్ధము జరిగెను. అందు దితి సంతానము రాక్షసులు నశించిరి. దితికశ్యపునకు మొఱపెట్టుకొనెను. కశ్యపుడు ఆమె మొఱవిని ఇంద్రుని చంపగలిగిన కుమారుని వరముగా ననుగ్రహించెను. (104-111).

సచ తసై#్యవరం ప్రాదాత్‌ ప్రార్థితః సుసుహాతపాః | దత్వాచ వర మత్యుగ్రో మారీచః సమభాషిత || 112

ఇంద్రంపుత్రో నిహంతా తే గర్భం వైశరదాం శతమ్‌ | యది ధారయసే శౌచతత్పరా వ్రతమాస్థితా || 113

తథే త్యభిహితో భర్తా తయా దేవ్యా మహాతపాః | ధారయామాస గర్భంతు శుచిః సా మునిసత్తమాః || 114

తతోభ్యుపాగమ ద్దిత్యాం గర్భ మాధాయ కశ్యపః | రోధయన్‌ వైగణం శ్రేష్ఠం దేవానామమితౌజసమ్‌ || 115

తేజః సంహృత్య దుర్ధర్ష మవధ్య మమరైరపి | జగామ పర్వతాయైవ తపసే సంశితవ్రతా || 116

నీగర్భమందు జనించువాడు ఇంద్రుని చంపగలడు. కాని నీవు ఆగర్భమును శుచిగా వ్రతము చేయుచు ధరింపవలెనన నామె యట్లేయని గర్భవతి యయ్యెను. అవ్వలకశ్యపుడామె యందు గర్భాధానమొనరించివెళ్ళిపోయెను. ఆమె దేవతలనందరిని నిరోధింపగల్గు తేజస్సును గర్భమున దాల్చి వ్రతముబూని యొకానొకపర్వతమునకు తపస్సుకొఱకేగెను. (111-116).

తస్యాశ్చైవాంతరప్రేప్సురభవత్‌ పాకశాసనః | జాతే వర్షశ##తే చాస్యా దదర్శాంతర మచ్యుతః || 117

అకృత్వా పాదయోః శౌచం దితిః శయన మావిశత్‌ | నిద్రాం చాహారయామాస తస్యాం కుక్షిం ప్రవిశ్య సః || 118

వజ్రపాణిస్తతో గర్భం సప్తధా తం న్యకృంతయత్‌ | స పాట్యమానో గర్భోథ వజ్రేణ ప్రరురోద హ || 119

మారోదీ దితి తం శక్రః పునః పున రథాబ్రవీత్‌|సోభవత్‌ సప్తధా గర్భ స్త మింద్రోరుషితః పునః || 120

ఏకైకం సప్తధా చక్రే వజ్రేణౖ వారికర్షణః| మరుతో నామ తే దేవా బభూవు ర్ద్విజసత్తమాః || 121

యథోక్తం వైమఘవతా తదైవ మరుతోభవన్‌| దేవా శ్చైకోన సంచాశ త్సహాయా వజ్రపాణినః || 122

ఆమె వ్రతలోపమెప్పుడు జరుగునాయని చూచుచున్న ఇంద్రుడు నూరేండ్లతరువాత పాదములు గడుగుకొనక పరుండుట జూచి యామెగర్భమున ప్రవేశించి, వజ్రాయుధముతో దానినిఏడుతునకలు గావించెను.

వజ్రహతుడైన ఆ శిశువు రోదనము చేసెను. ''మారోదీః'' ఏడువకుమని మరిమరి చెప్పెను. ఆగర్భము ఏడుతునకలయ్యెను. ఇంద్రుడు రోషముగొని దానిని మరి యేడుతునకలు చేసెను. ఆతునకలే మరుత్తులను పేరనేర్పడిరి. ఆ నలుబది తొంబండు గురును నింద్రునకు సహాయులైన దేవతలుగూడయైరి. (116-122)

తేషా మేవం ప్రవృత్తానాం భూతానాం ద్విజసత్తమాః | రోచయన్‌ వైగణ శ్రేష్ఠాన్‌ దేవానా మమితౌజసామ్‌ || 123

వికాయేషు నికాయేషు హరిః ప్రాదాత్‌ ప్రజాపతీన్‌ | క్రమశ స్తాని రాజ్యాని పృథుపూర్వాణి భో ద్విజాః || 124

స హరిః పురుషో వీరః కృష్ణో జిష్ణుః ప్రజాపతిః | పర్జన్యస్త పనో నంత స్తన్య సర్వమిదం జగత్‌ || 125

భూత సర్గమిమం సమ్యగ్‌ జానతో ద్విజసత్తమాః | నావృత్తి భయ మస్తీహ పరలోకభయం కుతః || 126

ఇతి శ్రీ బ్రహ్మపురాణ దేవాసురాణా ముత్పత్తి కథనం నామ తృతీయోథ్యాయః

తరువాత దేవతా గణములను ప్రజాపతులను గానొనరించి పృథువు మొదలుగాగలవారికి రాజ్యములను గూడ విభాగించి ఇచ్చెను. హరియే సాక్షాద్విష్టువు, ప్రజాపతియు, పర్జన్యుడును, పవనుడు, జిష్ణువునై ఈజగత్తును సృష్టించెను. ఈభూత సృష్టినిచక్కగ నెరిగినవారికి పునర్జన్మముకలుగదు. పరలోకభయమెక్కడనుండి కలుగును. (122-126)

ఇది బ్రహ్మ పురాణమున దేవాసురోత్పత్తి కథన మను తృతీయాధ్యాయము.

___*___*___

Brahmapuranamu    Chapters