Brahmapuranamu    Chapters   

సప్తవింశో7థ్యాయః

భారత వర్ష వర్ణనమ్‌

బ్రహ్మోవాచ

శృణుధ్వం మునయ స్సర్వే యద్వో వక్ష్యామి సాంప్రతమ్‌|పురాణం వేదసంబద్ధం భుక్తి ముక్తిప్రదంశుభం

పృధివ్యాం భారతం వర్షం కర్మభూమి రుదాహృతా | కర్మణః ఫలభూమిశ్చ స్వర్గంచ నరకం తథా || 2

తస్మిన్‌ వర్షే నరః పాపం కృత్వా ధర్మంచ భోద్విజాః | ఆవశ్యం ఫలమాప్నోతి అశుభస్య శుభస్య చ || 3

బ్రాహ్మణాధ్యాః స్వకం కర్మకృత్వా సమ్యక్‌ సుసంయతాః ప్రాప్నువంతి పరాం సిద్ధిం తస్మిన్‌ వర్షే న సంశయః ||

ధర్మం చార్ధంచ కామంచ మోక్షంచ ద్విజసతమాః | ప్రాప్నోతి పురుషః సర్వం తస్మిన్‌ వర్షే సుసంయతః || 5

ఇంద్రా ద్యాశ్చ సురాః సర్వే తస్మిన్‌ వర్షే ద్విజోత్తమాః | కృత్వా సుశోభవం కర్మ దేవత్వం ప్రతిపేదిరే || 6

అన్యే7పి లేభిరే మోక్షం పురుషాః సంయతేంద్రియాః | తస్మిన్‌ వర్షే బుధాః శాంతా వీతరాగవిమత్సరాః || 7

యేచాపి స్వర్గే తిష్ఠంతి విమానేన గతజ్వరా ః | తే7పి కృత్వా శుభం కర్మ తస్మిన్‌ వర్షే దివంగతాః 8

నివాసం భారతే వర్షే ఆకాంక్షంతి సురాసురాః | స్వర్గాపవర్గఫలదే తత్పశ్యామః కదా

వయమ్‌ ||

బ్రహ్మయిట్లనియె. భుక్తి ముక్తి ప్రదమై వేదసమ్మితమైన పురాణ మెరిగించెద. వినుండు. భారతవర్షము కర్మభూమి యనంబడు. కర్మఫలభూములు స్వర్గము నరకమును. బ్రాహ్మాణాదులీ భారత వర్షమందే స్వకీయ కర్మముల నాచరించి సిద్ధి పొందిరి. ఇందు సందియము లేదు. ధర్మాది పురుషార్థప్రదమీభూమి. ఇంద్రాదు లిచట శుభకర్మ మాచరించి యింద్రాది పదవులందిరి. ఈ వర్షమందలి బుధులు శాంతులు వీతరాగులు విమత్సరులు నైన మరికొందరు మోక్షము నందిరి. విమానయానమున స్వర్గమున నిర్భయముగనుండు సురలుకూడ నీవర్షమునందు శుభకర్మముల నాచరించియే స్వర్గమున కేగినారు. సురాసురులు కూడ నీ భారతభూమియందు వసింప వేడుక పడుదురు. ఎన్నడా పుణ్యభారతము దర్శింతుమాయని యువ్విళులూరుచుందురు.

మునయః ఊచుః -

శ్లో|| యదేతద్‌ భవతా ప్రోక్తం కర్మ నాన్యత్ర పుణ్యదమ్‌|పాపాయ వా సురశ్రేష్ఠ వర్జయిత్వా చ భారతమ్‌ || 10

తతః స్వర్గశ్చ మోక్షశ్చ మధ్యమం తచ్చగమ్యతే | నఖ ల్వన్యత్ర మర్త్యానాం భూమౌ కర్మ విధీయతే || 11

తస్మాద్విస్తరతో బ్రహ్మ న్నస్మాకం భారతం వద| యది తే7స్తి దయాస్మాసు యథావస్థితిరేవచ || 12

తస్మాద్వర్ష మిదం నాథ యే వాస్మిన్‌ వర్ష వర్వతాః | భేదాశ్చ తస్య వర్షస్య బ్రూహి సర్వా నశేషతః || 13

నీచే చెప్పబడిన కర్మ భారతవర్షమున తప్ప ఇతర లోకమున ఫలప్రదము కాదు. కావున భారతభూమియే యుత్తమము స్వర్గాదులు మధ్యమములనుచు నానలిచ్చితిరి. అట్లయిన నా పవిత్ర భూమివృత్తాంతము సమగ్రముగ నానతిమ్మన పద్మజుండుట్లనియె.

బ్రహ్మోవాచ

శ్లో|| శృణుధ్వం భారతం వర్షం నవభేదేన భోద్విజాః | సముద్రాంతరితా జ్ఞేయాస్తే సమాశ్చ పరస్పరమ్‌ ః 14

ఇంద్రద్వీపః కశేరుశ్చ తామ్రవర్ణో గభస్తిమాన్‌ | నాగద్వీప స్తథా సౌమ్యో గంధర్వో వారుణ స్తథా || 15

అన్యస్తు నవమస్తేషాం ద్వీపః సాగర సంవృతః | యోజనానాం సహస్రం వై ద్వీపో7యం దక్షిణోత్తరః || 16

పూర్వే కిరాతా యస్యాసన్‌ పశ్చిమే యవనాస్తథా|బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రా శ్చాంతే స్థితా ద్విజాః || 17

ఇజ్యాయుద్ధవణిజ్యాద్యైః కర్మభిః కృతపావనాః | తేషాం సంవ్యవహారశ్చ ఏభిః కర్మభి రిష్యతే || 18

స్వర్గాపవర్గహేతుశ్ఛ పుణ్యం పాపంచ వై తథా | హహేంద్రో మలయః సహ్య| శుక్తిమా నృక్షపర్వతః || 19

వింధ్యశ్చ పారియాత్రశ్చ సపై#్తవాత్ర కులాచలాః | తేషాం సమస్రశ శ్చాన్యే భూధరా యే సమీపగాః || 20

విస్తారోచ్ఛ్రయిణో రమ్యా విపులాశ్చిత్రసావనః | కోలాహలస్స వైభ్రాజో మందరో దర్దురాచలః || 21

వాతంధయో వైద్యుతశ్చ మైనాకః సురసస్తథా | తుంగప్రస్థో నాగగిరి ర్గోధనః పాండరాచలః || 22

పుష్పగిరి ర్వైజయంతో రైవతో7ర్బుద ఏవచ | ఋష్యమూకః సగోమంథః కృతశైలః కృతాచలః || 23

శ్రీపార్వత శ్చకోరశ్చ శతశో7న్యే చ పర్వతాః | తై ర్విమిశ్రా జనపదా వ్లుెచ్ఛాద్యాశ్చైవ భాగశః ః 24

తైః పీయంతే సరిచ్ఛ్రేష్ఠాస్తా బుధ్యధ్వం ద్విజోత్తమాః | గంగా సరస్వతీ సింధు శ్చంద్రభాగా తథాపరా || 25

యమునా శతద్రు ర్విపాశా విత సై#్తరావతీ కుహూః | గోమతీ ధూతపాపా చ బాహుదా చ దృషద్వతీ || 26

విపాశా దేవికా చక్షు ర్నిష్ఠీవా గండకీ తథా| కౌశికీ చాపగా చైవ హిమవత్పాదనిఃసృతాః || 27

దేవస్మృతి ర్దేవవతీ వాతఘ్నీ సింధురేవ చ | వేణ్యాతు చందనా దైవ సదానీరా మహీ తథా|| 28

చర్మణ్వతీ వృషీ చైవ విదిశా వేదవత్యపి| సిప్రా హంసవతీ చైవ పారియాత్రానుగాః స్మృతాః || 29

శోణా మహానదీ చైవ నర్మదా సురథాక్రియా | మందాకినీ దశార్ణాచ చిత్రకూటా తథాపరా || 30

చిత్రోత్పలా వేత్రవతీ కరమోదా పిశాచికా | తథాన్యాతిలఘశ్రేణీ విపాప్మా శైవలా నదీ|| 31

సధేరుజా శక్తిమతీ శకునీ త్రిదివా క్రముః| ఋక్షపాద ప్రసుతా వై తథాన్యా వేగవాహినీ || 32

సిప్రా పయోష్ణీ నిర్వింధ్యా తాపీ చైవ సరిద్వరా | వేణా వైతరణీ ఛైవ సినీవాలీ కుముద్వతీ || 33

తోయా చైవ మహాగౌరీ దుర్గా వాంతః శిలా తథా | వింధ్యపాద ప్రసూతాస్తా సద్యః పుణ్యజలాః శుభాః | 34

గోదావరీ భీమరధీ కృష్ణవేణా తథాపగా | తుంగభ్రదా సుప్రయోగా తథాన్యా పాపనాశినీ || 35

సహ్యపాదవినిష్క్రాంతా ఇత్యేతాః సరితాం వరాః | కృతమాలా తామ్రపర్ణ పుష్యజా ప్రత్యాలావతీః 39

మలయాదిసముద్భూతాః వుణ్యాః శీతజలాస్త్విమాః | సితృసోమర్షి కుల్యాచ వంజులా త్రిదివా చయా || 37

లాంగలినీ వంశంరా మహేంద్రప్రభవాః సృతాః| సువికాలా కుమారీచ మమాగా మందగామినీ || 38

క్షయాపలాశినీ చైవ శుక్తిమత్ప్రభవాః స్మృతాః | సర్వాః పుణ్యాః సరస్వత్యః సర్వా గంగాః సముద్రగాః 39

విశ్వస్య మాతరః సర్వాః నర్వాః పాపహరాః స్మృతాః | అన్యాః సహస్రశః ప్రోక్తాః క్షుద్రనద్యో ద్విజోత్తమా ః |

భారతవర్షమునభాగములుతొమ్మిది. ఇంద్రద్వీపము - కశేరువు తామ్రపర్ణము -గభస్తిమంతము - నాగద్వీపము -సౌమ్యము -గాంధర్వము -వారుణము. అను తొమ్మిది భాగములు గలవు. ఈ భారతఖండము సముద్రపరివృతము. ఇచటినదులు ఉపనదులు ఈ పురాణమునందు పందొమ్మిదవ యధ్యాయమున బేర్కొనబడినవి.

శ్లో|| ప్రావృట్‌కాలవహాః సంతి సదాకాలవహాశ్చ యాః | మత్స్యా ముకుటకుల్యాశ్చ కుంతలాః కాశికోసలా ||

మధ్యదేశాజనపదాఃప్రాయశో7మీప్రకీర్తితాః| సహ్యస్య చోత్తరే యస్తు యత్రగోదావరీనదీ || 42

ఆంధ్రకాశ్చ కలింగాశ్చ, శమకాశ్చ వృకైస్సహ| పృథివ్యామపి కృత్స్నాయాం సప్రదేశో మనోరమః | 43

గోవర్ధనపురం రమ్యం భార్గవస్య మహాత్మనః | వాహికా వాటధానాశ్చ సుతీరాః కాలతోయదాః || 44

ఆపరాంతశ్చ శూద్రాశ్చ బాహ్లికాశ్చ సకేరళాః | గాంధారాయవనాశ్చైవ సింధుసౌవీరమద్రకాః|| 45

శతద్రుహాః కలింగాశ్చ పారదా హారభూషికాః | మాఠరాశ్చైవ కనకాః కై కేయా దంభమాలికాః | 46

క్షత్రియోపమదేశాశ్చ వైశ్య శూద్రకులాని చ | కాంభోజాశ్చైవ విప్రేంద్రాః బర్బరాశ్చ సలౌకికా ః || 47

ఆత్రేయాస్చ, భరద్వాజాః పుష్కలాశ్చ దశేరకాః | వీరాశ్చైవ తుషారాశ్చ పహ్లావా ధాయతా నరాః || 48

లంపకాః శునశౌకాశ్చ కులికా జాంగలై ః సహ | ఔషథ్య శ్చలచంద్రాశ్చ కిరాతానాంచ జాతయః || 49

తోమరా హంసమార్గశ్చ కాశ్మీరాః కరుణా స్తథా| శూలికాః కుహకాశ్చైవ మాగధాశ్చ తధైవ చ || 50

ఏతే దేశా ఊదీచ్యాస్తు ప్రాచ్యాన్‌ దేశా న్నిభోధత || 51

మహాత్ముడైన భార్గవుని పురము గోవర్థన మతిరమ్యము. ఇందుత్తర దేశములు వాహేక - వాటథాన - సుతీర - కాలతోయద ఆవరాన్త - శూద్ర వర్షాకాలమందు మాత్రమే ప్రవహించునని. ఎల్లప్పుడు ప్రవహించునవియుసగు నదులు గలవి మత్స్యములు మకుట కుల్యములు కుంతలములు కాశి కోశములు. ఆంధ్రకములు కలింగములు సమకములు వృకములు ననుదేశములు మధ్య ప్రదేశమందలిదేశములు. నహ్యపర్వతమున కుత్తరము గోదావరి పుట్టి ప్రవహించిన ప్రదేశము. మొత్తము భూమండలమున కెల్ల నిది మనోహరమైనది. వాహ్లీక వాటధాన సుతీర కాలతోయద అపరాంత శూద్ర బాహ్లిక కేరళ గాంధార యవన సింధు సౌవీర మద్రక శతద్రుహకశింగ పారద హారభూషిక మాఠర కనక కైకేయ దంభమాలిక అనునవి క్షత్రియ వైశ్య శూద్రజాతి నివాసములైనదేశములుకాంభోజ బర్బర లౌకిక వీర తుషార ప్రహ్లావ ఆధాయత నర ఆత్రేయ భరద్వాజ పుష్కలదశేరక లంపక శునశ్శోకకులిక జాంగల ఔషథి చలచంద్రములు కిరాతజాతులుగల దేశములు. తోమర హంస మార్గ కాశ్మీర కరుణ శూలిక కుహకమాగధములు అనునవి భారతోత్తరదిశనున్న దేశములు. ఇక తూర్పుదేశములం దెల్పెద తెలిసికొనుడు.

ఆంధా వామం కురాకాశ్చ బల్లకాశ్చ ముఖాంతకాః | తథాపరేంగా వంగాశ్చ మలదా మాలవర్తికా ః || 52

భద్రతుంగాః ప్రతిజయా భార్యాంగా శ్చాపమర్దకాః | ప్రాగ్జ్యోతిషాశ్చ మద్రాశ్చ విదేహా స్తామ్రలిప్తకాః || 53

మల్లా మగధకా నందాః ప్రాచ్యా జనపదాస్తథా | తథాపరే జనపదా దక్షిణాపథవర్తినః || 54

పూర్ణాశ్చ కేవలాశ్చైవ గోలాంగూలాస్తథైవచ | ఋషికా ముషికాశ్చైవ కుమారా రామరా ః శకాః || 55

మహారాష్ట్రా మాహిషకా కలింగాశ్చైవ సర్వశః ఆభీరాః సహవై శిక్యాః అటవ్యాః సరవాశ్చయే || 66

పులిందాశ్చైవ మౌలేయా వైదర్భా దండకై ః సమ | పౌలికా మౌలికాశ్చైవ ఆశ్మకా భోజవర్థనాః || 57

కౌలికాః కుంతలాశ్చైవ దంభకా నీలకాలకాః | దాక్షిణాత్యాస్త్వమీ దేశా అపరాంతా న్నిబోధత || 58

ఆంధ వామజ్కరాక బల్లక మఖాంతక అంగ-వంగ-మలద-మాలవ-ఋత్తిక-భద్రతుంగ- ప్రతిజయ - భార్యాంగ (దర్భాంగ) అపమర్దక ప్రాగ్జ్యోతిష - మద్ర - విదేహ - తామ్రలిప్తక మల్ల మగధకనందములు. దక్షిణావథ దేశములు. పూర్ణకేవల - గోలాంగూల -

ఋషిక-ముషిక- కుమార-రామఠ. శకమహారాష్ట్ర మూహిషక -కలింగ-ఆభీర-వైళిక్య-అటప్య-సరప-పులింద-మౌలేయు వైదర్భ దండక పౌలిద-మౌలిక- అళ్మక-భోజ వర్థన-కాలిక-కుంతల-దంభక నీలకాలకములు. ఇవి దాక్షిణాత్య దేశములు.

శ్లో || శూపరికా ః కాలిధనాః లోలా స్తాలకటైః సహ | ఇత్యేతే హ్యపరాంతాశ్చ శ్రుణుధ్వం వింధ్యవాసినః | 59

మలజాః కర్కశాశ్చైవ మేలకాశ్చోలకైః నహ| ఉత్తమార్ణా దశార్ణాశ్చ భోజాః కిష్కిందకై ః నహ | 60

తోషలా ః కోశలాశ్చైవ త్రైపురా వైదిశాస్తథా | తుంబురాస్తు చరాశ్చైవ యవనాః పవనై ః సహ || 61

అభయా రుండికేరాశ్చ చర్చరా హోత్రధర్తయః| ఏతే జనపదాః సర్వే తత్ర వింధ్యనివాసినః | 62

ఆతో దేశాన్‌ ప్రవాక్ష్యామి పర్వతాశ్రయిణశ్చ యే | నీహారాః తుషమార్గాశ్చ కురవస్తంగణాః ఖసాః|| 63

కర్ణప్రావరాణాశ్చైవ ఊర్ణా దర్ఘాః సకుస్తకాః| చిత్రమార్గాః మాలవాశ్చ కిరాతా స్తోమరైః సహ| 64

కృతత్రేతాది కాశ్చాత్ర చతుర్యుగ కృతో విధిః ఏవంతు భారతం వర్షం నవంస్థానసంస్థితమ్‌ || 65

దక్షిణ పరతో యస్య పూర్వే చైవ మహోదధిః| హిమవా నుత్తరేణాస్య కార్ముకస్య యథాగుణః 66

తదేతద్‌ భారతం వర్షం సర్వబీజం ద్విజోత్తమాః| బ్రహ్మత్వ మమరేశత్వం దేవత్వం మరుతాం తథా|| 67

మృగయక్షాప్సరోయోనిం తద్వత్‌ సర్వసరీసృపాం| స్థావరాణాంచ సర్వేషా మితో విప్రాః శుభాశుభైః|| 68

ప్రయాంతి కర్మభూ ర్విపా నాన్యా లోకేషు విద్యతే| దేవానామపి భో విప్రాః సదైవైష మనోరథః | 69

ఆపి మానుష్య మాప్స్యామో దేవత్వాత్‌ ప్రచ్యుతాః క్షితౌ| మనుష్యః కురుతే యత్తు త న్న శక్యం సురాసురైః| 70

త్రత్‌కర్మనిగశగసై#్త స్తత్‌ కర్మక్షపణోన్ముఖై ః | నభారతసమం వర్షం పృథివ్యా మస్తి భో ద్విజాః|| 71

య్రత విప్రాదయో వర్ణాః ప్రాపృవం త్యభి వాంఛితమ్‌| ధన్యాస్తే భారతే వర్షే జాయంతే యే నరోత్తమా|| 72

ధర్మార్థకామమోక్షాణాం ప్రాప్నువంతి మహాఫలమ్‌| ప్రాప్యతే యత్ర తవసః ఫలం పరమదుర్లభమ్‌ || 73

సర్వదాన ఫలంచైవ సర్వయజ్ఞం ఫలం తథా|| 74

తీర్థయాత్రా ఫలంచైవ గురుసేవాఫలం తథా || 75

దేవతారాధనఫలం స్వాధ్యాయస్య ఫలం ద్విజాః | య్రతదేవా సదా హృష్టా జన్మ వాంఛంతి శోభనమ్‌ || 76

నానావ్రతఫలంచైవ నానాశాస్త్రఫలం తథా| అహింసాది ఫలం సమ్యక్‌ ఫలం సర్వాభివాంఛితమ్‌|| 77

బ్రహ్మచర్య ఫం చైవ గార్హస్థ్యేన చ యత్ఫలమ్‌| యత్ఫలం వనవాసేన సన్యాసేన చ యత్ఫలమ్‌ || 78

ఇష్టాపూర్తఫలంచైవ తథాన్యచ్ఛుభకర్మణామ్‌| ప్రాప్యతే భారతే వర్షేన చాన్యత్ర ద్విజోత్తమాః|| 79

కః శక్నోతి గుణాన్‌ వక్తుం భారతస్యాఖిలాన్‌ ద్విజాః| ఏవం సమ్యజ్మయా ప్రోక్తం భారతం వర్ష ముత్తమమ్‌ ||

సర్వపాపహరమ్‌ పుణ్యం ధన్యం బుద్ధివివర్థనమ్‌| య ఇదం శృణుయా న్నిత్యం పఠేద్వా నియతేంద్రియః|| 81

సర్వపాపై ర్వినిర్ముక్తో విష్ణులోకం సగచ్ఛతిః

తా|| శూపరిక-కాలిధనలోక తాంకటములు-అపరాంతదేశములనంబరగును. మలజ-కర్కశ-మేలక-జోశక. ఉత్తమర్ణ దశార్ణ-భోజ-కిష్కింధ-తోషల-కోశల-త్రైపుర- వైదిశ-తుంబుర-చర-యవన-పవన-అభయ-రుండికేర-బర్బర-హోత్ర ఋతువులు. వింధ్యపర్వతప్రాంతములు. ఇక పర్వతాశ్రయములైన దేశములు. నీహార-తుషమార్గ కురు, తుంగణ స్వస కర్ణ ప్రావరణ ఊర్ణ దర్ఘ కుంతక చిత్రమార్గ-మాలవా కిరాత తోమరములు. ఇక్కడ చతుర్యుగధర్మము నడచును. ఈ భారత వర్షమునకు పూర్వదక్షిణములుగా ''మహోదధి'' యను పేరు సముద్రమున్నది. ఉత్తరమున హిమవంతము వింటినారి యట్టున్నది. ఈ భారత వర్షము సర్వబీజము. సర్వజీవులు కర్మాచరణము చేసి తత్తత్ఫలభాజనులగుట కిదియే స్థానము. దేవతలు కూడ యిందు మానవ జన్మమెత్తి సుకృత మొనరించి తత్ఫల మవ్వలి లోకముల ననుభవింప గోరుదురు. ఇది తపఃఫలమిచ్చుభూమి. తీర్థ క్షేత్ర యాత్రా దాన దేవతారాధన స్వాభ్యాయాది సకల సత్కర్మఫలప్రదపుణ్యభూమి యిది. బ్రహ్మచర్యాద్యాశ్రమములు శాస్త్రములు ప్రతములు ఇష్టాపూర్తములు మఱియేకల్యాణాచరణమేని యిచట సఫలము కాక తప్పదు. ఈ భారతవర్షప్రశంస సర్వపాపహారము పుణ్యము ధన్యము జ్ఞాన వర్థనము. ఇది చదివిన విన్నవారు సర్వపాప విముక్తులై విష్ణులోకమందును.

ఇది శ్రీ బ్రహ్మపురాణమున భారతవర్షవర్ణనమును ఇరువదియేడవయధ్యాయము.

Brahmapuranamu    Chapters