Brahmapuranamu    Chapters   

అథషట్చ త్వారింశదధిక ద్విశతతమో7ధ్యాయః

అస్య శ్రవణపఠనకర్తౄణాం ఫలప్రా ప్తికథనమ్‌

లోమహర్షణ ఉవాచ

ఏవం పురా మునీన్వ్యాసః పురాణం శ్లక్ష్న గిరా l దశాష్టదోష రహితై ర్వాక్యై ః నారతెరై ర్ద్విజాః ll 1

పూర్ణమస్తమలైః శుద్ధై ర్నానాశాస్త్ర సముచ్చయైః l జాతి శుద్ధ సమాయుక్తం సాధు శబ్దోపశోభితమ్‌ ll 2

పూర్వపక్షో క్తి సిద్ధాంత పరినిష్ఠా సమన్వితమ్‌ l శ్రావయిత్వా యథాన్యాయం విరరామ మహామతిః ll 3

తేపి శ్రుత్వా మునిశ్రేష్ఠాః పురాణం వేద సంమితమ్‌ | అద్యం బ్రహ్మాభిధానం చ సర్వవాంఛా ఫలప్రదమ || 4

హృష్టా బభూవుః సుప్రీతా విస్మితాశ్చ పునః పునః l ప్రశశంసుస్తదా వ్యాసం కృష్ణద్వై పాయనం మునిమ్‌ ll 5

బ్రహ్మపురాణ ప్రశంస -ఫలశ్రుతి

రోమహర్షణుడు మునులతో ఇట్లు పలికెనుః ఓ బ్రాహ్మణులారా! పూర్వము మహామతియగు వ్యాసమహాముని శాస్త్రమునందు చెప్పబడినవియు ఉచ్చారణమునకు సంబంధించినవియు అగు పదునెనిమిది దోషముమలు (ఇవి వ్యాకరణ భాష్యమునందు చెప్పబడియున్నవి.) లేనివియు మిగుల సారభూతములును దోషములు లేనివియు శుద్ధములును అనేక శాస్త్రసముదాయరూపములును అయిన వాక్యములతో నిండినదియు స్వభావముచేతనే శుద్ధమగు విషయసమాయోజనముతో కూడినదియు సాధువులగు -వ్యాకరణ విరుద్ధములను శిష్టులకు అసమ్మతములునుకాని -శబ్దములతో ఉపశోభితమును పూర్వపక్షవచనములతో సిద్ధాంత వ్యవస్థాపనముతో కూడినదిఅగు ఈ బ్రహ్మపురాణమును శాస్త్రన్యాయానుసారముగ నుండునట్లు మృదువగువాక్కుతో వినిపించి మగించెను. (పూర్వపకోవచనములతోను సిద్ధాంతవ్యవస్థాపనముతోను కూడి శాస్త్రన్యాయానుసారముగనున్నది. అనుటచేత మీమాంసాశాస్త్ర సిద్ధమగు అధికరణము అనగా విషయో విషయశ్చైవ పూర్వపక్షస్తథోత్తరమ్‌- ప్రయోజంసంగతిశ్చ ప్రాంచో7ధికరణంవిదుః అనిచెప్పబడినది. దీనివివరణము పెద్దలవలన తెతియదగినది- అనువాదకుడు.) అ ముని శ్రేష్ఠులును వేదములతో సమానమును నర్వవాంఛా ఫలప్రద మును ఆధ్యమును అగు బ్రహ్మపురాణమును విని హర్షమును ప్రీతిని ఆశ్చర్యము పొందినవారై కృష్ణద్వైపాయన వ్యాసమహామునిని మరలమరల ప్రశంసించిరి.

మునయ ఊచుః

ఆహో త్వయా మునిశ్రేష్ఠ పురాణం పశ్రతి సంమితమ్‌ l సర్వాభి ప్రేత ఫలదం సర్వపాప హరం పరమ్‌ ll 6

ప్రోక్తం శ్రుతం తథా7స్మా%్‌మాభి ర్విచిత్ర పదమక్షరమ్‌ l నతే7స్త్యవిదితం కించి త్త్రిషులోకేషువై ప్రభో ll 7

సర్వజ్ఞస్త్వం మహాభాగ దేవేష్విన బృహస్పతిః l సమస్యామో మహాప్రాజ్ఞం బ్రహ్మిష్ఠం త్వాం మహామునిమ్‌ ll 8

యన త్వయా తు వేదార్థా భారతే ప్రకటీ కృతాః l కః శక్నోతి గుణాన్వక్తుం తవ సర్వాన్మహామునే ll 9

ఆధీత్య చతురో వేదా న్సాంగాన్వ్యాకరణానిచ l కృతవాన్భారతం ంశాస్త్రం తన్మై జ్ఞానాత్మనే నమః ll 10

నమో7స్తుతే వ్యాస విపశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర l

యేన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః ll 11

ఆజ్ఞాన తిమిరాంధానాం భ్రామితానాం కుదృష్టిభిః l జ్ఞానాంజన శలాకేన త్వయా చోన్మీలాతా దృశః ll 12

ఏవమక్త్వా సమభ్యర్చ్య వ్యాసం తేచైవ పూజితాః l జగ్ముర్యథాగతం సర్వే కృతకృత్యాః స్వమాశ్రమమ్‌ ll 13

మునులు వ్యాసుని ప్రశంసించినవిధముః ఎంత ఆశ్చర్యమిది! ఓమునిశ్రేష్ఠా! మీరు వేదములతో సమానమును సర్వాభీష్టఫలప్రదమును సర్వపాపహరమును ఉత్తమమును విచిత్రపదములతో అక్షరములతో కూర్చబడినదియు అగు పురాణమును ప్రవచింపగా మేమువింటిమి. ఓప్రభూ ! త్రిలోములయందును మీకు తెలియనిది ఏదియులేదు. మీరు దేవతలలో బృహస్పతివంటివారు. ఓమహాభాగా ! తాము సర్వజ్ఞులు. మహాప్రాజ్ఞులును బ్రహ్మతత్త్వజ్ఞలలో శ్రేష్ఠులును మహామునియునగు మిమ్ము నమస్కరించుచున్నాము. తాము భారతమునందు వేదములందు ప్రతిపాదింపబడిన విషయములను ఆనేకములను ప్రతిపాదించితిరి. ఓమహాముని! తాము ప్రతిపాదించిన సర్వగుణములను ఎవరుచెప్పగలరు? షడంగములతోకూడ వేదములను నాల్గింటిని వ్యాకరణములను ఆధ్యయనము చేసి భారతమున రంచిచిన జ్ఞాన స్వరూపుడగు వ్యాసునకు నమస్కారము. భారతమను తైలముతోనింపబడిన జ్ఞానమయమగు ప్రదీపమును వెలిగించిన వాడవును విశాలబుద్ధికలవాడవును వికసించిన పద్మముల ఱకులవలె విశాలములగు కన్నులుకలవాడవును అగుఓవ్యాసా! నీకు నమస్కారము. ఆజ్ఞానమను తిమిరముచే గ్రుడ్డివారై కుదృష్టులచే భ్రాంతినొందింపబడిన వారినేత్రములను జ్ఞానమును కాటుకతోకూడిన శలాకతో మీరు విప్పారించితిరి. వారందరును ఇట్లుపలికి వాసునిపూజించి కృతార్థులై తాముతాము వచ్చినమార్గముల తమతమ ఆశ్రమములకు వెళ్లిరి.

తథా మయా మునిశ్రేష్ఠాః కథితం హి సనాతనమ్‌ l పురాణం సుమహాపుణ్యం సర్వపాప ప్రణాశనమ్‌ ll 14

యథా భవద్భిః పృష్టో7హంసంప్రశ్నం ద్విజసత్తమాః l వ్యాసప్రసాదాత్తత్సర్వం మరూ సంపరి కీర్తితమ్‌ ll 15

ఓమునిశ్రేష్ఠులారా!సనాతనమున శాశ్వతములగు ధర్మములను ప్రతిపాదించు నదియు- సర్వపాప ప్రణాశనమును మహాపుణ్యప్రదమునునగు ఈపురాణమును వీకు చెప్పితిని. మీరు అడిగిన ప్రశ్నముల ననుసరించి దానికి అంతటికిని సవాధానమును వ్యాసుని అనుగ్రహమువలన ప్రతిపాదించితిని.

ఇదం గృహస్థైః శ్రోతవ్యం యతిభిర్ర్బహ్మచారిభిః l ధన సౌఖ్యప్రదం నౄణాం పవిత్రం పాపనాశనమ్‌ ll 16

తథా బ్రహ్మపరై ర్విపై#్రర్బ్రాహ్మణాద్యైః సుసంయతైః శ్రోతవ్యం సుప్రయత్నేన సమ్యక్ర్శేయో భికాంక్షిభిః ll

ప్రాప్నోతి బ్రాహ్మణో విద్యాం క్షత్రియో విజయంకరతే l వైశ్యస్తు ధనమక్షయ్యం శూద్రః సుఖమవాప్నుయాత్‌ ll

యం యం కామమభిధ్యాయన్‌ శృణోతిపురుషః శుచిః l తంతం కామమవాప్నోతి నరో నాస్త్యత్ర సంశయః ll

పురాణం వైష్ణవం త్వేత త్సర్వ కిల్బిషనాశనమ్‌ | విశిష్టం సర్వాశాస్త్రేభ్యః పురుషార్థోపపాదకమ్‌ || 20

ఏతద్వో యన్మయా೭೭ఖ్యాతం పురాణం వేదసంమితమ్‌ | శ్రుతేస్మిన్సర్వదోషోత్థః పాపరాశిః ప్రణశ్యతి || 21

ప్రయాగే పుష్కరే చైవ కురుక్షేత్రే తథార్బుదే | ఉపోష్య యదవాప్నోతి తదస్య శ్రవణాన్నరః || 22

యదగ్నిహోత్రే సుహుతే వర్షేనా೭೭ప్నోతి వైఫలమ్‌ | మహాపుణ్యమయం విప్రా స్తదస్య శ్రవణాత్సకృత్‌ ||

యజ్జ్యేష్ఠ శుక్లద్వాదశ్యాం స్నాత్వా వై యమునాజలే | మధురాయాం హరిం దృష్ట్వా ప్రాప్నోతి పురుషః ఫలమ్‌ ||

తదాప్నోతి ఫలం సమ్యక్సమాధానేన కీర్తానత్‌ | పురాణస్య హితో విప్రాః కేశవార్పితమానసః || 25

యత్ఫలం శ్రియమాలోక్య పురుషోథ లభేన్నరః | తత్ఫలం సమవాప్నోతియః పఠేచ్ఛృణుయాదపి || 26

ఇదం యః శ్రద్ధయా నిత్యం పురాణం వేదసంమితమ్‌ | యః పఠేచ్ఛృణుయాన్మర్త్యః స యాతి భువనం హరేః ||

శ్రావయే ద్రాహ్మణో యస్తు సదా పర్వసు సంయతః | ఏకాదశ్యాం ద్వాదశ్యాం చ విష్ణులోకం స గచ్ఛతి. || 28

ఇదం యశస్యమాయుష్యం సుఖదం కీర్తివర్ధనమ్‌ | బలపుష్టిప్రదం నౄణాం ధన్యం దుఃస్వప్ననాశనమ్‌ || 29

త్రిసంధ్యం యః పఠేద్విద్వాన్‌ శ్రద్ధయా మసమాహితః | ఇదం వరిష్ఠ మాఖ్యానం స సర్వమీప్పితం లభేత్‌ || 30

రోగార్తో ముచ్యతే రోగా ద్బద్ధో ముచ్యేత బంధనాత్‌ | భయాద్విముచ్యతే భీత ఆపదాపన్న ఆపదః || 31

జాతిస్మరత్వం విద్యాం చ పుత్రాన్మేదాం పశూన్ధృతిమ్‌ | ధర్మం చార్థం చా కామం చ మోక్షం తు లభ##తే నరః || 32

యాన్యాన్కామానభిప్రేత్య పఠేత్ర్పయతమానసః | తాంస్తాన్నర్వానవాప్నోతి పురుషో నాత్ర సంశయః || 33

యశ్చేదం సతతం శృణోతి మనుజఃస్వర్గాపవర్గప్రదమ్‌ |

విష్ణుం లోకగురుం ప్రణమ్య వరదం భ##క్త్యేక చిత్తః శుచిః |

భుక్త్వా చాత్ర సుఖం విముక్త కలుషః స్వర్గే చ దివ్యం సుఖమ్‌ |

పశ్చాద్యాతి హరేః పదం సువిమలం ముక్తో గుణౖః ప్రాకృతైః || 34

తస్మాద్విప్రవరైః స్వధర్మనిరతై ర్ముక్త్యేకమార్గేప్సుభి |

స్తద్వత్షత్రియ పుంగవైస్తు నియతైః శ్రేయోర్థిభిః సర్వదా ||

వైశ్యైశ్చానుదినం విశుద్ధకులజైః శూద్రై స్తథా ధార్మికైః |

శ్రోతవ్యం త్విద ముత్తమం బహుఫలం ధర్మార్థమోక్షప్రదమ్‌ || 35

ధర్మే మతిర్భవతు వః పురుషో మానాం | సహ్యేక ఏవ పరలోకగతస్య బంధుః ||

అర్థాః స్త్రియశ్చ నిపుణౖరపి సేవ్యమానా | నైవ ప్రభావమువయాంతి నచ స్థిరత్వమ్‌ || 36

ధర్మేణ రాజ్యం లభ##తే మనుష్యః స్వర్గం చ ధర్మేణ నరః ప్రయాతి |

ఆయుశ్చ కీర్తిం చ తపశ్చ ధర్మం ధర్మేణ మోక్షం లభ##తే మనుష్యః || 37

ధర్మోత్ర మాతాపితరౌ నరస్య ధర్మః సఖా చాత్ర పరే చ లోకే |

త్రాతా చ ధర్మస్త్విహ మోక్షదశ్చ ధర్మాదృతే నాస్తి తు కించదేవ || 38

ఇదం రహస్యం శ్రేష్ఠం చ పురాణం వేదసంమితమ్‌ | న దేయం దుష్టమతే నాస్తికాయ విశేషతః || 39

ఇదం మయోక్తం ప్రవరం పురాణం పాపాపహం ధర్మవివర్ధనం చ |

శ్రుతం భవద్భిః పరమం రహస్య మాజ్ఞాపయధ్వం మునయో వ్రజామి ||

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రహ్మే లోమహర్షణముని సంవాదే పురాణప్రశంసనంనామ

షట్చత్వారింశదధిక ద్విశతతమోధ్యాయః

సమాప్తమిద మాదిబ్రాహ్మాభిధం మహాపురాణమ్‌.

ఓం తత్సద్ర్బహ్మార్పణమస్తు.

ఇది బ్రహ్మచారులును గ్పహస్థులును యతులునుకూడ శ్రవణము చేయదగినది. పవిత్రము. నరులకు ధనసౌఖ్య ప్రదము; పాపనాశనము, బ్రహ్మ తత్త్వము నెరుగగోరిన బ్రాహ్మణాది వర్ణములవారందరును శ్రేయోభికాంక్షు లగువారును ప్రయత్నముతో లెస్సగా దీనిని వినవలెను. అందువలన బ్రాహ్మణుడు విద్యను క్షత్రియుడు రణమున విజయమును వైశ్యుడక్షయధనమును శూద్రుడు సుఖమును పొందును. పురుషుడు శుచిమనస్కుడై ఏఏకోరికను అభిధ్యానించుచు ఈ పురాణమును వినునో ఆకోరికనెల్ల పొందును. అందుసందేహములేదు. ఈ పురాణము విష్ణునిపరమదైతముగా ప్రతిపాదించునది. సర్వపాపనాశనము. పురుషార్థములన్నింటిని సంపాదింపజేయునది. అన్ని శాస్త్రములకంటె విశిష్ట మయినది. నేనుమీకు వినింపించిన వేదసంమితమగు ఈపురాణము వినినవారికి సర్వదోషములవలన కలిగిన పాపరాశియు నశించును. ప్రయాగ పుష్కర కురుక్షేత్రార్బుదక్షేత్రములందు ఉపవసించుటవలన కలుగు పుణ్యము కలుగును. నరుడు సంవత్సరముపాటు అగ్నిహోత్రమును చక్కగ వేల్చుటవలన కలుగు సుమహాపుణ్యఫలము కలుగును. జ్యేష్ఠశుక్లైకాదశి నాడు మధురలో యమునాజలమున స్నానముచేసి శ్రీకృష్ణుని దర్శించుటచే కలుగు ఫలముకలుగును. కేశవునియందు మనస్సుఅర్పించి-నిలిపి-సరియగు మనస్సుమాధానముతో హరికీర్తనము చేయుటచే కలుగు ఫలము ఈ పురాణశ్రవణమునందు (ని) హితమై - నిలుపబడియున్నది. దీని శ్రవణమువలన యజ్ఞక్రియాదర్శనముచే కలుగు ఫలము కలుగును. వేదసదృశమగు ఈ పురాణమును పఠించినను విన్నను అతడు విష్ణులోకమునకు ఏగును. ఏకాదశి ద్వాదశివంటి పర్వదినము లందు శుచియై బ్రాహ్మణులచే ఈపురాణమును వినిపించిన - వినిపించుకొనిని - వారు విష్ణులోకమునకు పోవుదరు. ఇది యశమును ఆయువును సుఖమును కీర్తిని బలమును పుష్టిని కలిగించును. ధన్యునిగాచేయును. దుఃస్వప్నము లనశింప జేయును. చక్కని మనస్సమాధానముతో శ్రద్ధతో ఈశ్రేష్ఠమగు ఆఖ్యానమును వినినవారు సర్వములగు ఈప్సితములను పొందుదురు. రోగార్తుడు రోగమునుండి బద్ధుడు బంధనమునుండి భీతుడు భయమునుండి ఆపన్నుడు ఆపదలనుండి విముక్తుడగును. నరుడు పూర్వజన్మస్మృతిని విద్యను పుత్రులను మేధను పశువులను ధైర్యమును ధర్మార్థకామమోక్షము లను - ఇంతయేకాదు ప్రయతమగు - శుచియగు - మనస్సుతో ఏకోరికలను సంకల్పించివినునో ఆకోరికలనెల్ల పొందును. అందు సందేహమే లేదు.

స్వర్గ మోక్షప్రదుడును లోకములకు గురుడును (తల్లితండ్రి విద్యనుపదేశించినవాడు హితమునుపదేశించువాడు ఇట్టివారు గురువులనబడుదురు.) వరములనిచ్చువాడునగు విష్ణునినమస్కరించి భక్తియుక్తమగు ఏక చిత్తముతో శుచియై ఈ పురాణమును నిరతమును వినువారు సమస్తపాపములను నశింపజేసికొని ఇహలోకమున సమస్తసుఖ ములను అనుభవించి స్వర్గమున దివ్యసుఖమునుపొంది కడపట ఈ ప్రకృతి జన్యములగు గుణములనుండి విడుదలనుపొంది ముక్తులై మిగుల విమలమగు శ్రీహరిస్థానమును చేరుదురు. అందువలన స్వధర్మనిరతులును ముక్తిమార్గమునుమాత్రమే కోరువారును అగు బ్రాహ్మణశ్రేష్ఠులును నియమపరులును శాశ్వత శ్రేయస్సును కోరువారునగు క్షత్రియపుంగవులును విశుద్ధవంశమున జన్మించిన వైశ్యులును ధార్మికులగు శూద్రులును ఉత్తమమును బహుఫలప్రదమును ధర్మార్థమోక్షప్రదమునగు ఈ పురాణము అనుదిన మును వినవలయును.

పురుషోత్తములగు మీకందరకును ధర్మమునందు బుద్ధిస్థిరమగుగాక! పరలోకమునకు మీరుఏగినప్పుడు మీకు బంధువు అదియొక్కటియే. అర్థకామములను రెండు పురుషార్థములను మీరు ఎంత జాగరూకులై సేవించినను అవిమీపై సత్ఫలమును చూపజాలవు. వాని ఫలములు స్థిరములై యుండవు.

ధర్మముచే నరుడు రాజ్యమును స్వర్గమును ఆయువును కీర్తిని తపస్సును ధర్మమును దానిచే మోక్షమును పొందును. ఇహమునను పరలోకమునను ధర్మమే తల్లిదండ్రులును మిత్రుడును రక్షకుడును మోక్షప్రదమును. ధర్మము తప్ప మఱింకేదియులేదు.

ఈ పురాణము రహస్యమునుశ్రేష్ఠమును వేదములతో సమానమును. బుద్ధిదోషము కలవానికిని. విశేషించి నాస్తికునకును - ఇంద్రియగోచరముకాని దేదియు నమ్మదగినది కాదనువానికిని - దీనిని అందించరాదు.

శ్రేష్ఠమును పాపనాశకమును ధర్మమును వృద్ధిచేయునదియుఅగు ఈ పురాణమును నేనుప్రవచించితిని పర మర హస్యమగు దీనిని మీరువింటిరి. అయ్యా! పోయివచ్చెదను. ఆజ్ఞిఇండు.

ఇది శ్రీమహాపురాణమున ఆదిబ్రాహ్మమున రోమహర్షణ - మునిసంవాదమున పురాణప్రశంసనమను

రెండువందల నలువదిఆరవ అధ్యాయము.

శ్లోకసంఖ్య-ఆరంభమునుండి - 13783.

(224వ అధ్యాయము మొదటినుండి 246వ అధ్యాయము ముగింపువరకు తెలుగు సేత : శ్రీపాతూరి సీతారామాంజనేయులు.)

ఆదిబ్రాహ్మపురాణము ముగిసినది.

Brahmapuranamu    Chapters