Brahmapuranamu    Chapters   

అథ చత్వారింశదధికశతతమోధ్యాయః

సాంఖ్యవిధి నిరూపణమ్‌

మునయ ఉచుః

నమ్యక్ర్కియేయం విప్రేంద్రః వర్ణితా శిష్టసంమతా | యోగమార్గో యథాన్యాయం శిష్యాయేహ హితైషిణా || 1

సాంఖ్యే త్విదానీం ధర్మస్య విధిం ప్రబ్రూహి తత్త్వతః | త్రిషు లోకేషుయద్‌జ్ఞానం సర్వం తద్విదితం హి తే || 2

సాంఖ్యవిధి

మునులు వ్యాసునితో ఇట్లనిరి: ఓ విప్రేంద్రా! శిష్టసంమతమగు యోగమార్గ ప్రక్రియను తాము యుక్తియుక్తమగు శిష్యులగుమాకు హితముగా ప్రతిపాదించితిరి. లోకత్రయమునందును ప్రసిద్ధిపొందియున్న సాంఖ్య జ్ఞానమునకు సంబంధించిన శాస్త్రతత్త్వమును దానియందు సిద్ధిని పొందగోరిన వారు పాటించవలసిన ధర్మమును ఉన్నది ఉన్నట్లుగా మాకు ప్రవచింపగోరుచున్నాము.

వ్యాస ఉవాచ :

శృణుధ్వం మునయః సర్వ మఖ్యానం విదితాత్మానమ్‌ | విహితం యతిభిర్వృద్ధైః కపలిలాదిభిరీశ్వరైః || 3

యస్మిస్సు విభ్రమాః కేచి ద్దృశ్యంతే మునిసత్తమాః | గుణాశ్చ యస్మిన్బహవో దోషహానిశ్చ కేవలా || 4

జ్ఞానేన పరిసంఖ్యాయ సదోషాన్విషయాన్ద్విజాః | మానుషాన్దుర్జయాస్కృత్స్నా న్పైశాచాన్విషయాం స్తథా || 5

విషయానౌరగాన్జాత్వా గంధర్వ విషయాం స్తథా | పితౄణాం విషయాన్జాత్వా తర్యక్త్వం చరతాం ద్విజాః || 6

సువర్ణ విషయాన్జాత్వా మరుతాం విషయాం స్తథా | మహర్షి విషయాంశ్చైవ రాజర్షి విషయాం స్తథా || 7

ఆసురాన్విషయాన్జాత్వా వైశ్వదేవాం స్తథైవ చ | దేవర్షి విషయాన్జాత్వా యోగానామపి వైపరాన్‌ || 8

విషయాంశ్చ ప్రమాణస్య బ్రహ్మణో విషయాం స్తథా | ఆయుషశ్చ పరం కాలం లోకైర్విజ్ఞాయ తత్త్వతః || 9

సుఖస్య చ పరం కాలం విజ్ఞాయ మునిస త్తమాః | ప్రాప్తకాలే చ యద్దుఃఖం పతతాం విషయైషిణామ్‌ || 10

తిర్వక్త్వే పతతాం విప్రా స్తథైవ నరకేషు యత్‌ | స్వర్గస్య చ గుణాన్జ్నాత్వా దోషాన్సర్వాంశ్చ భో ద్విజాః || 11

వేదవాదే చ యే దోషా గుణా యే చాపి వైదికాః | జ్ఞానయోగే చ యే దోషా జ్ఞానయోగే చ యే గుణాః || 12

సాంఖ్య జ్ఞానే చ యే దోషాం స్తథైవ చ గుణా ద్విజాః | సత్త్వం దశగుణం జ్ఞాత్వా రజో నవగుణం తథా || 13

తమశ్చాష్ట గుణం జ్ఞాత్వా బుద్ధిం సప్తగుణం తథా | షడ్గుణం చ నభో జ్ఞాత్వా తమశ్చ త్రిగుణం మహత్‌ || 14

ద్విగుణం చ రజో జ్ఞాత్వా సత్త్వం చైకగుణం పునః | మార్గం విజ్ఞాయ తత్వైన ప్రలయ ప్రేక్షణన తు || 15

జ్ఞాన విజ్ఞాన సంపన్నాః కారణౖర్భావితాత్మభిః | ప్రాప్నుపంతి శుభం మోక్షం సూక్ష్మాఇవ నభః పరమ్‌ || 16

రూపేణ దృష్టిం సంయుక్తాం ఘ్రాణం గంధగుణన చ | శబ్దగ్రహ్యం తథా శ్రోత్రం జిహ్వాం రసగుణన చ || 17

త్వచం స్పర్శం తథా శక్యం వాయుం చైవ తదాశ్రితమ్‌ |

మోహం తమసి సంయుక్తం లోభం మోహేషుసంశ్రితమ్‌ || 18

విష్ణుం క్రాంతే బలే శక్రం కోష్ఠే సక్తం తథాసలమ్‌ | అప్సు దేవీం సమాయుక్తా మాపస్తేజసి సంశ్రితాః | 19

తేజో వా¸° తు సంయుక్తం వాయుం నభసి చా೭೭శ్రితమ్‌ | నభో మహతి సంయుక్తం తమో మహసి సంస్థితమ్‌ || 20

రజః సత్త్వం తథా సక్తం సత్త్వం సక్తం తథా೭೭త్మని | సక్తమాత్మాసమీశే చ దేవే నారాయణ తథా || 21

దేవం మోక్షే చ సంయుక్తం తతో మోక్షం చ న క్వచిత్‌ | జ్ఞాత్వా సత్త్వగుణం దేహం పృతం షోడశభిర్గుణౖః || 22

స్వభావం భావనాం చైవ జ్ఞాత్వా దేహసమాశ్రితామ్‌ | మధ్యస్థమివ చా೭೭త్మానం పాపం యస్మిన్నవిద్యతే || 23

ద్వితీయం కర్మ వైజ్ఞాత్వా విప్రేంద్రా విషయైషిణామ్‌ | ఇంద్రియాణీంద్రియార్థాంశ్చ సర్వానాత్మని సంశ్రితాన్‌ || 24

దుర్లభత్వం చ మోక్షస్య విజ్ఞాయ శ్రుతి పూర్వకమ్‌ | ప్రాణాపానౌ సమానం చ వ్యానోదానౌ చ తత్త్వతః || 25

ఆద్యం చై వానిలం జ్ఞాత్వా ప్రభవం చానిలం పునః | సప్తధా తాంస్తథా శేషా న్స ప్తధా విధివత్పునః || 26

ప్రజాపతీనృషీంశ్చైవ నర్గాంశ్చ సుబహూన్వరాన్‌ | సప్తర్షీంశ్చ బహూన్జాత్వా రాజర్షీంశ్చ పరంతపాన్‌ || 27

సురర్షీన్మరుతశ్చాన్యా న్ర్బహ్మర్షీన్సూర్యసంనిభాన్‌ | ఐశ్వర్యాచ్చ్యా వితాన్దృష్ట్వా కాలేన మహతా ద్విజాః || 28

మహతాం భూత సంఘానాం శ్రుత్వా నాశం చ భో ద్విజాః | గతిం వాచాం శుభా జ్ఞాత్వా అర్చార్హాః పాపకర్మణామ్‌ || 29

వైతరణ్యాం చ యద్దుఃఖం పతితానాం యమక్షయే | యోనీషు చ విచిత్రాసు సంచారానశుభాం స్తథా || 30

జఠరే చాశుభే వాసం శోణితోదక భాజనే | శ్లేష్మమూత్ర పురీషే చ తీవ్రగంధ సమన్వితే || 31

శుక్రశోణితం సంఘాతే మజ్జాస్నాయ పరిగ్రహే | శిరాశత సమాకీర్ణే నవద్వారే పురేథ వై || 32

విజ్ఞాయ హితమాత్మానం యోగాంశ్చ వివిధాన్ద్విజాః | తామసానాం చ జంతూనాం రమణీయానృతాత్మనామ్‌ || 33

సాత్త్వికానాం చ జంతూనాం కుత్సితం ముని సత్తమాః | గర్హితం మహతామర్థే సాంఖ్యానాం విదితాత్మనామ్‌ || 34

ఉపప్లవాం స్తథా ఘోరా న్శశిన స్తేజస స్తథా | తారాణాం పతనం దృష్ట్వా నక్షత్రాణాం చ పర్యయమ్‌ || 35

ద్వంద్వానాం విప్రయోగం చ విజ్ఞాయ కృపణం ద్విజాః | అన్యోన్యభక్షణం దృష్ట్వా భూతానామపి చాశుభమ్‌ || 36

బాల్యే మోహం చ విజ్ఞాయ పక్షదేహస్య చాశుభమ్‌ | రాగం మోహం చ సంప్రాప్తం క్వచిత్స త్త్వం సమాశ్రితమ్‌ || 37

సహస్రేషు నరః కశ్చి న్మోక్ష బుద్ధిం సమాశ్రితః | దుర్లభత్వం చ మోక్షస్య విజ్ఞానం శ్రుతి పూర్వకమ్‌ || 38

బహుమాన మలబ్దేషు లబ్ధే మధ్యస్థతాం పునః | విషయాణాం చ దౌరాత్మ్యం విజ్ఞాయ చ పునర్ద్విజాః || 39

గతాసూనాం చ సత్త్వానాం దేహాన్భిత్త్వా తథా శుభాన్‌ | వాసం కులేషు జంతూనాం మరణాయ ధృతాత్మనామ్‌ || 40

సాత్త్వికానాం చ జంతూనాం దుఃఖం విజ్ఞాయ భో ద్విజాః | బ్రహ్మఘ్నానాం గతిం జ్ఞాత్వా పతితానాం సుదారుణమ్‌ || 41

సురాపానే చ సక్తానాం బ్రాహ్మణానాం దురాత్మనామ్‌ | గురుదార ప్రసక్తానాం గతింవ విజ్ఞాయ చాశుభమ్‌ || 42

జననీషు చ వర్తంతే యేన సమ్యగ్ద్విజో త్తమాః | సదేవకేషు లేకేషు యేన వర్తంతి మానవాః || 43

తేన జ్ఞానేన విజ్ఞాయ గతిం చాశుభకర్మణామ్‌ | తిర్యగ్యోని గతానాం చ విజ్ఞాయ చ గతీః పృథ్‌క్‌ || 44

వేదవాదాం స్తథా చిత్రా నృతూనాం పర్యయాం స్తథా | క్షయం సంవత్సరాణాం చ మాసానాం చ క్షయం తథా || 45

పక్షక్షయం తథా దృష్ట్వా దివసానాం చ సంక్షయమ్‌ | క్షయం పృద్ధిం చ చంద్రస్య దృష్ట్వా ప్రత్యక్షత స్తథా || 46

పృద్ధిం దృష్ట్వా సముద్రాణాం క్షయం తేషాం తథా పునః | క్షయం ధనానాం దృష్ట్వా చ పునర్వృద్ధిం తథైవచ || 47

సంయోగానాం తథా దృష్ట్వా యుగానాం చ విశేషతః | దేవవై క్లబ్యతాం చైవ సమ్యగ్విజ్ఞాయ త త్త్వతః || 48

ఆత్మదోషాంశ్చ విజ్ఞాయ సర్వానాత్మని సంస్థితాన్‌ | స్వదేహాదుత్థితాన్గంధాం స్తథా విజ్ఞాయ చాశుభాన్‌ || 49

ఓమునులురా! వినుడు. అత్మతత్త్వమునెఱిగిన వారును సమర్థులునునగు కపిలాదివృద్ధయతులు తెలిపిన విషయమును తెలిపెదను. వారిలో కొందరు ఉత్తమమగు బుద్ధివైశారద్యముకలమునిసత్తములును కలరు. వారు చెప్పిన వానిలో సుగుణములెన్నియో కలవు. దోషమొక్కటియులేదు. అదియేమనిన వివేక ముచే దుర్జయములగు విషయములను వానియందలి దోషములను ఎరుగవలెను. ఆ విషయములు మనుష్యలు పిశాచులు ఉరగులు గంధర్వులు పితరులు తిర్యక్ర్పాణులు గరుడులు మరుత్తులు మహర్షులు రాజర్షులు అసురులు విశ్వేదేవుడు దేవర్షులు యోగులు బ్రహ్మ-వీరనుభవించు విషయములు వేరువేరువిధములుగా నుండును. వానియందలి దోషములును వివిధములు. కాలపరిమాణము ఆయువు సుఖముననుభవించవలసిన కాలము విషయాభిలాషవలనను తిర్వగ్జన్మలయందును నరక మునందునుగల దుఃఖములును దోషములును స్వర్గసుఖమునందలి గుణములును దోషములును వేదవాదము జ్ఞానము సాంఖ్యయోగము దశగుణములు కలనత్త్వము నవగుణములుకల రజస్సు అష్టగుణములుగల తపస్సు సప్తగుణములుకల బుద్ధి షడ్గుణయుక్తమగు సభస్సు (ఆకాశము) త్రిగుణమగు తమస్సు ఏక గుణమగు సత్త్వము మోక్షమునకు కానిపోవు మార్గము. ప్రళయతత్త్వ స్వరూపములు ఎరిగి ఈ చెప్పినవానియందలి గుణదోషములను గుర్తెరిగి ఆత్మ తత్త్వాభ్యాసముచేసిన వారు చెప్పిన యుక్తులతో జ్ఞానమును విజ్ఞానమును - జ్ఞాన మనగా విషయమును ఎరుగుట - విజ్ఞానమనగా తెలిసినదానిని అనుభవములోనికి తెచ్చుకొనుట - సంపాదించి నిఃశ్రేయసమను సర్వ శుభతమమగు మోక్షమును పొందుదురు.

చక్షుస్పు రూపముతో అగ్నితో ఘ్రాణము గంధముతో పృథివితో శ్రోత్రము శబ్దముతో ఆకాశముతో జిహ్వరసముతో జలముతో త్వగింద్రియము స్పర్శముతో వాయువుతో నిత్య సంబంధము కలవి. తమస్సునందు మోహము మొహమునందు లోభము నిలిచియున్నవి. నడకయందు విష్ణువు బలమునందు ఇంద్రుడు ఉదరమునందు అగ్ని జలము నందు భూదేవి తేజస్సునందు జలము వాయువునందు తేజస్సు ఆకాశమునందు వాయువు మహత్తత్త్వమునందు ఆకాశము మహస్సునందు సత్త్వరజస్త మన్సులు నిలిచి యుండును. సత్త్వము ఆత్మయందు ఆత్మ నారాయణునందు ఆశ్రయించి యుండును. నారాయణుడు మోక్షమునందు నిలిచి యుండును. మోక్షమున కాశ్రయమేదియులేదు. స్థూలదేహము పదునారు గుణములతో ఏర్పడినది. స్వభావము భావన అనునవి దేహమునాశ్రయించి యుండును. ఆత్మమాత్రము ఏపాపములు అంటక తటస్థమయి యుండును. విషయ సుభాభిలాష కలవాడు చేయు కర్మలను ఇంద్రియములను ఆత్మయందలి ఇంద్రియార్థములను మోక్షము దుర్లభమను విషయమును శాస్త్ర ప్రమాణమున తెలిసికొనవలెను. ప్రాణాపాన వ్యానోదాన సమానవాయువులను ప్రాణతత్త్వోత్తని ఏడు విధములుగానున్న శీర్షణ్యములగు ప్రాణములను ప్రజాపతులను ఋషులను నృష్టులను సప్తర్షులను రాజర్షులను దేవర్షులను మరుత్తులను సూర్యసమానులగు బ్రహ్మర్షులను ఉత్తమలోక సుఖానుభవము తరువాత అచటినుండి జారి అధోలోక గతి పొందువారిని మహాభూత సంఘ నాశమును శుభమగు వాక్కుల గతులను దశలను పూజార్చనోపాసనాదులను పాపకర్మలు పొందెడి వైతరణియమలోకము లందలి దుఃఖమును వివిధ జన్మల యందు జీవుని అశుభసంచారమును శోణితము ఉదకము శ్లేష్మ మూత్రపురీషములు తీవ్రదుర్గంధము - వీటితోనిండిన మాతృగర్భమున నివాసము శుక్రము శోణితము మజ్జస్నాయువు వందలకొలది సిరలు - వీటితో ఏర్పడిన ద్వారములు గలపురమగు దేహమున జీవుని నివాసమును తనకు హితమైనదానిని తామసరాజససాత్త్వాక ప్రాణులు సాధించగల యోగముల వైవిధ్యమును-తమఃప్రధాన యోగసాధకుల కుత్సితగతి విశేషములను ఆత్మతత్త్వము నెరిగిన సాంఖ్యులు ఉత్తమ విషయములు సాధించుటలో పొందు ఉపద్రవములను గ్రహముల తారల చంద్రునియొక్క నక్షత్రముల యొక్క పతనములను నక్షత్రముల తారుమారును జంటలు దీనముగా ఎడబాయుటను ఆయా ప్రాణులు పరస్పరము భక్షించుకొను అశుభకృత్యకమును బాల్యము నందలి అజ్ఞానమును స్థూలదేహపు అశుభస్థితిని సత్త్వగుణమును ఆశ్రయించి కూడ ఉండెడి రాగమోహములను వేలమందిలో ఏ ఒక్కడో మాత్రమే ముముక్షువు అగుటను వేదప్రమాణ విజ్ఞానముతో సాధించు మోక్షము దుర్లభము అగుటను లభించనికోరికలపై ఆదరమును అదితీరగానే ఉపేక్షా భావమును విషయసుఖము లలోని దోషములను ప్రాణము పోయినవారి అశుభ స్థితులను ప్రాణత్యాగము తానేచేయ నిశ్చయించుకొనిన మహానుభావులు తమ శుభ##మైన దేహములను కూడ భేదించుకొని పోవుటను శుభ##మైన వంశములయందు తమ సంకల్పముతో జన్మింపగలుగుటను సాత్త్వికులైన ప్రాణులు కూడ దుఃఖ మనుభవించుటను బ్రహ్మఘ్నలు వతితులు పొందెడి దారుణ గతిని బ్రాహ్మణులై ఉండియు దురాత్ములై సురాపానముగురుదారగమనము మొదలగు మహాపానములచేసి పొందుదుర్గతిని మాతృద్రోహిపొందుదుర్గతిని ఉత్తములు పొందెడి దెవలోకగతిని అశుభకర్మల గతులను తిర్యక్‌ ప్రాణులు పొందెడి మూఢ గతులను వేదవాదముల వైవిధ్యమును ఋతువుల తారుమారును సంవత్సర మాసవక్షదివసముల క్షయమునుచంద్రునివృద్ధి క్షయములను సముద్రవృద్ధిని ధనక్షయమును మరల అది పెరుగుటను యుగముల సంయోగములను దేహము శిథిలమగుటను దేహము మూలమున ఆత్మయందు కలుగు దోషములను మలినదేహమునుండి వెలువడు అశుభగంధములను ఎరిగి వివేచించి ముముక్షుకై యత్నించి దానిని పొందవలెను.

మునయ ఊచుః

కానుత్పాతభవాన్దోషా న్పశ్యతి బ్రహ్మవిత్తమ | ఏతం నః సంశయం కృత్స్నం వక్తు మర్హస్యశేషతః || 50

జీవుడు దేహమును గ్రహించుట వలన కలుగు దోషముల విషయములో మాకుగల సంశయములను బ్రహ్మ వేత్తలలో శ్రేష్ఠుడవగు ఓవ్యాస మహామునీ! తీర్చ వేడెదము.

వ్యాస ఉవాచ :

పంచ దోషా న్ద్విజా దేహే ప్రవదంతి మనీషిణః | మార్గజ్ఞాః కాపిలాః సాంఖ్యాః శృణుధ్వం మునిసత్తమాః || 51

కామక్రోధౌ భయం నిద్రా పంచమః శ్వాస ఉచ్యతే | ఏతే దోషాః శరీరేషు దృశ్యంతే సర్వదేహినామ్‌ || 52

ఛిందంతి క్షమయా క్రోధం కామం సంకల్పవర్జనాత్‌ | సత్త్వంసంసేవనా న్నిద్రా మప్రమాదాద్భయం తథా || 53

ఛిందంతి పంచమం శ్వాస మల్పాహారతయా ద్విజాః | గుణాన్గుణశ##తైర్జాత్వా దోషాన్దోషశ##తై రపి || 54

హేతూ న్హేతుశ##తై శ్చిత్రై శ్చిత్రాన్విజ్ఞాయ తత్త్వతః | అపాం ఫేనోపమం లోకం విష్ణోర్మాయాశ##తైః కృతమ్‌ || 55

చిత్రభిత్తి ప్రతీకాశం నలసార మనర్థకమ్‌ | తమః సంభ్రమితం దృష్ట్వా వర్ష బుద్బుద సంనిభమ్‌ || 56

నాశప్రాయం సుఖాదానాం నాశోత్తరమహాభయం | రజస్తమసి సంమగ్నం పంకే ద్విపమివావశమ్‌ || 57

సాంఖ్యా విప్రా మహాప్రాజ్ఞా స్త్యక్త్వా స్నేహం ప్రజాకృతమ్‌ | జ్ఞాన జ్ఞేయేన సాంఖ్యేన వ్యాపినా మహతా ద్విజాః || 58

రాజసానశుభాన్గంధాం స్తామసాంశ్చ తథావిధాన్‌ | పుణ్యాంశ్చ సాత్త్వికాన్గంధా స్స్పర్శజా న్దేహసంశ్రితాన్‌ || 59

ఛిత్త్వా೭೭త్మజ్ఞానశ స్త్రేణ తపోదండేన సత్తమాః | తతో దుఃఖాదికం ఘోరం చింతాశోకమహాహ్రదమ్‌ || 60

వ్యాధిమృత్యుమహాఘోరం మహాభయ మహోరగమ్‌ | తమః కూర్మం రజో మీనం ప్రజ్ఞయా సంతరంత్యుత || 61

స్నేహపంకం జరాదుర్గం స్పర్శద్వీపం ద్విజో త్తమాః | కర్మాగాధం సత్యతీరం స్థితం వ్రతమనీషిణః || 62

హర్షసంఘ మహావేగం నానారససమాకులమ్‌ | నానాప్రీతి మహారత్నం దుఃఖజ్వర సమీరితమ్‌ || 63

శోకతృష్ణామహావర్తం తీక్షవ్యాదిమహారుజమ్‌ | అస్థిసంఘాతసంఘట్టం శ్లేష్మయోగం ద్విజోత్తమాః || 64

దానము క్తాకరం ఘోరం శోణితోద్గారవిద్రుమమ్‌ | హసితోత్కృష్టనిర్గోషం నానాజ్ఞాన సుదుష్కరమ్‌ || 65

రోదనాశ్రుమలక్షారం సంగమోగపరాయణమ్‌ | ప్రలబ్ధ్వా జన్మలోకే యం పుత్రబాంధవసత్తనమ్‌ || 66

అహింసా సత్యమర్యాదం ప్రాణయోగమయోర్మిలమ్‌ | బృందాను గామినం క్షీరం సర్వభూతపయోదధిమ్‌ || 67

మోక్షదుర్లభ విషయం బాడబాసుఖసాగరమ్‌ | తరంతి యతయః సిద్ధా జ్ఞానయోగేన చానఘాః || 68

తీర్త్వా చ దుస్తరం జన్మ విశంతి మిమలం నభః | తతస్తాన్సుకృతీన్జాత్వా సూర్యో వహతి రశ్మిభిః || 69

పద్మతంతువ దావిశ్య ప్రవహన్విషయాన్ద్విజాః | తత్ర తాన్ర్పవహో వాయుః ప్రతిగృహ్ణాతి చానఘాః || 70

వీతరాగాన్యతీ న్సిద్ధా వ్వీర్య యుక్తాం స్తపోధనాన్‌ | సూక్ష్మః శీతః సుగంధశ్చ సుఖస్పర్శశ్చ భో ద్విజాః || 71

సప్తానాం మరుతాం శ్రేష్ఠో లోకా న్గచ్ఛతి యః శుభాన్‌ | స తాన్వహతి విప్రేంద్రా సభవః పరమాం గతిమ్‌ || 72

సభో వహతి లోకేశా స్రజసః పరమాం గతిమ్‌ | రజో వహతి విప్రేంద్రాః సత్త్వస్య పరమాం గతిమ్‌ || 73

సత్త్వం వహతి శుద్ధాత్మా పరం నారాయణం ప్రభుమ్‌ | ప్రభుర్వహతి శుద్ధాత్మా పరమాత్మాన మాత్మనా || 74

పరమాత్మాన మాసాద్య తద్భూతా యతయోమలాః | అమృతత్వాయ కల్పంతే న నివ ర్తంతి చ ద్విజాః || 75

పరమా సా గతిర్విప్రా నిర్ద్వంద్వానాం మహాత్మనామ్‌ | సత్యార్జపరతానాం వై సర్వభూతదయాపతామ్‌ || 76

వ్యాసులు బ్రాహ్మణులతో ఇట్లు పలికెను : ఓ ముని సత్తములారా! కపిలుడు ప్రవచించిన సాంఖ్యమార్గము నెరిగిన విద్వాంసులు దైహిక దోషములు కామక్రోధభయ నిద్రాశ్వాసములు ఐదనియు అని అన్నిప్రాణులకు కలవనియు చెప్పుదురు. క్షమచే క్రోధమును సంకల్పములు విడుచుటచే కామమును సత్త్వగుణము నాశ్రయించి నిద్రను ఎచ్చరికచే భయమును అల్పాహారముచే శ్వాస - అయాసమును జయింపవలెను. అనేక గుణములనుండి ఉత్తమ గుణమును అనేక దోషములనుండి ప్రధాన దోషములను అనేక యుక్తులనుండి మోక్షసాధకమగు యుక్తులను అనేక వైచిత్ర్యములనుండి ప్రధానమైన వైచిత్ర్యములనుగుర్తించి విష్ణుని అనేక మాయలతో ఏర్పడిన ఈ లోకము నీటిమీద నురుగుతో సమానమని తెలిసికొని అజ్ఞానముచే నీటి బుడగవలె తిరుగుచు సుఖమువలె కనబడుచు నాశముతోనిండి నాశము తరువాత మహాభయము కలిగించుచు బురదలో దిగిన ఏనుగువలె రజస్తమో గుణములందు దిగబడి ఉన్నదని గుర్తించి వైరాగ్యము పొందవలెను. మహాప్రాజ్ఞులగు సాంఖ్యతత్త్వము ఎరిగినవారు దారపుత్రాదులపై ప్రీతి లేక పూజ్యమై సర్వవ్యాపియైన సాంఖ్యజ్ఞానముచే రాజస తామస అశుభ సంస్కారములను సత్త్వగుణ ప్రధానమైన పుణ్య సంస్కారములను విషయాభిలాషలను తపస్సు అనెడి కఱ్ఱతోను ఆత్మజ్ఞానమును ఖడ్గముతోను ఛేదించి దుఃఖ చింతా శోకములనెడి పెద్దగోతిని దాటగలుగుదురు. ఆగోతిలో వ్యాధులు మృత్యువువలన మహాఘెరభయమనెడిసర్పములు అజ్ఞానమనెడితాబేళ్ళు రజోగుణ మనెడి చేపలు కలవు. దానిని దాటుటకు ప్రజ్ఞయే నావ. అదియొక సముద్రము. ప్రపంచ విషయములపై ప్రీతి అనెడి బురద ముసలితనము అనెడి దుర్గములు విషయ సుఖములనెడి ద్వీపములు కథలు అనెడి అగాధములు సత్త్వము అనెడి తీరము హర్షములు అనెడి మహావేగములు అనేక అభిరుచులు అనెడి కల్లోలములు నానావిషయములపై ప్రీతి అనెడి మహారత్నములు దుఃఖసంతాపములు అనెడి వాయువు శోకము అనెడి పెద్దసుడులు. తీక్షవ్యాధిమహాబాధలు ఎముకల రాశులు అనెడి ఎదురుదెబ్బలు దానము అనెడి ముత్యముల రాసులు రక్తము అనెడి పగడములు నవ్వులు అనెడి అలల ధ్వనులు నానావిధములైన అజ్ఞానములు దుఃభాశ్రువులు అనెడి ఉప్పు ఈ సముద్రమునందు కలవు. దీనిని సిద్ధులై పూజ్యులైన యతులు జ్ఞానయోగమును నావతో తరింతురు. వారు దేహత్యాగము తరువాత నిర్మలమగు ఆకాశములో ప్రవేశించగానే అది ఎరిగి సూర్యుడు తనకిరణములతో విరినిపైకికొనిపోవును. తపోధనులునుయోగ వీర్యవంతులునువైరా గ్యవంతులును సిద్ధులును అగు ఆ యతులను సప్తవాయువులలో శ్రేష్ఠుడును చల్లనై సుఖస్పర్శ గలిగి సుగంధముతో కూడి సూక్ష్మమైన ప్రవహము అను వాయువు ఆకాశములో అత్యున్నత స్థానమునకు కొనిపోవును. ఆ అకాశోన్నత స్థానము వారిని రజోగుణముయొక్క సత్త్వ గుణముయొక్క ఉన్నత స్థితికిని సత్త్వోన్నతస్థితి శుద్ధత్ముడగు పరమ ప్రభువగు నారాయణునిలోనికిని కొనిపోగా ఆనారాయణుడు ఈ యతులను తనలోచేర్చుకొని తన రూపమునకు తీసికొని పోవును. ఇట్లు అమలులగు ఈ యతులు నారాయణుడు అను పరమాత్మ తత్త్వమునుచేరి ఆ తత్త్వముగానే ఆ అమృతులగుదురు. వారు మరలజన్మపరంపరలోకిని రానక్కరలేదు. సుఖ దుఃఖాది ద్వంద్వములకు అతీతులై సత్యము అర్జవము సర్వభూత దయ కలిగి వర్తించిన అమహాత్యములకు అసాయుజ్యస్థితి పరమోత్తమ గతి.

మునయ ఉచుః

స్థానముత్తమమాసాద్య భగవంతం స్థిరవ్రాతాః | ఆజన్మమరణం వా తే రమంతే తత్ర వా సవా || 77

యదత్ర తథ్యం తత్త్వం నో యథావ ద్వక్తుమర్హసి | త్వదృతే మానవం నాన్యం ప్రష్టు మర్హామ సత్తమ || 78

మోక్షదోషో మహానేష ప్రాప్య సిద్ధిం గతానృషీన్‌ | యది తత్రైవ విజ్ఞానే వర్తంతే యతయః పరే || 79

ప్రవృత్తిలక్షణం ధర్మం పశ్యామ పరమం ద్విజ | మగ్నస్య హి పరే జ్ఞానే కిం తు దుఃఖాంతరం భ##వేత్‌ || 80

ఇది విని మునులు వ్యాసునితో ఇట్లు పలికిరి. ఉత్తమమగు ఆ భగవత్తత్త్వ రూపమైన ఉత్తమస్థానమునుచేరిన ఆ స్థిరవ్రతులు జన్మ మరణరూపమైన సంసారప్రవృత్తిని నారాయణుడు మరల ఆరంభించువరకు ఆ మోక్షస్థితిలో అనందించుచుందురా లేదా? ఈ విషయములలో వాస్తవమేమో చెప్ప వేడెదము. ఓ ఋషిసత్తమా! ఈ సంశయము నిన్నుతప్ప ఎవరిని అడుగజాలము. ఏలయన ఈ స్థితి పొందిన ఋషులు అచ్ఛటనే అనుభూతియందు ఉండిపోయినచో మరల ఈ లోకమున ప్రవృత్తి లక్షణమైన ధర్మమును దేనిని చూచుచున్నామో దానిని సాధించువారెవరు? లేక వారుమరల జీవులై లోకప్రవృత్తిలోనికి వచ్చినచో మరల దుఃఖములోనికి వచ్చుటయేగదా? ఈ విధముగా మీరు వివరించిన మోక్ష స్వరూపములో దోషమొకటి కనబడుచున్నది. ఈ సంశయమును తీర్చ ప్రార్థించుచున్నాము.

వ్యాస ఉవాచ

యథా న్యాయం మునిశ్రేష్ఠాః ప్రశ్నః ప్రృష్టశ్చ సంకటః | బుధానామపి సంయోహః ప్రశ్నేస్మిన్ముని సత్తమాః || 81

అత్రాపి తత్త్వం పరమం శృణుధ్వం వచనం మమ | వృద్ధిశ్చ పరమా యత్ర కపిలానాం మహాత్మనామ్‌ || 82

ఇంద్రియాణ్యపి బుధ్యంతేస్వదేహం దేహినాం ద్విజాః | కరణాన్యాత్మన స్తాని సూక్ష్మం పశ్యంతి తై స్తు సః || 83

ఆత్మనా విప్రహీణాని కాష్ఠ కుడ్యనమాని తు | వినశ్యంతి న సందేహో వేలా ఇవ మహార్ణవే || 84

ఇంద్రియైః సహ సుప్తస్య దేహినో ద్విజసత్తమాః | సూక్ష్మశ్చరతి సర్వత్ర సభసీవ సమీరణః || 85

స పశ్యతి యథాన్యాయం స్మృత్వా స్పృశతి చానఘాః | బుధ్యమానో యథాపూర్వ మభిలేనేహ భో ద్విజాః || 86

ఇంద్రియాణి చ సర్వాణి స్వే న్వే స్థానే యథావిధ ఇ| అనీశత్వాత్ర్పలీయంతే సర్పా విషహతా ఇవ || 87

ఇంద్రియాణాం తు సర్వేషాం స్వస్థానేష్వేవ సర్వశః | ఆక్రమ్య గతయః సూక్ష్మాశ్చరత్యాత్మా న సంశయః || 88

సత్త్వస్య చ గుణాన్కృత్స్నా న్రజసశ్చ గుణాన్పునః | గుణాంశ్చ తమసః సర్వా న్గుణా న్బుద్ధేశ్చ సత్తమాః || 89

గుణాంశ్చ మనసశ్చాపి సభసశ్చ గుణాంస్తథా | గుణాన్వాయోశ్చ సర్వజ్ఞాః స్నేహజాంశ్చ గుణాన్పునః || 90

అపాం గుణాస్తథా విప్రాః పార్థివాంశ్చ గుణావపి | సర్వానేప గణౖర్వ్యాప్య క్షేత్రజ్ఞేషు ద్యిజోత్తమాః || 91

ఆత్మా చరతి క్షేత్రజ్ఞం కర్మణా చ శుభా శుభే | శిష్యాఇవ మహాత్మాన మింద్రియాణి చ తం ద్విజాః || 92

ప్రకృతిం చాప్యతిక్రమ్య శుద్ధం సూక్ష్మం పరాత్పరమ్‌ | నారాయణం మహాత్మానం నిర్వికారం పరాత్పరమ్‌ || 93

విముక్తం సర్వపాపేభ్యః ప్రవిష్టం చ హ్యనామయమ్‌ | పరమాత్మాన మగుణం నిర్వృతం తం చ సత్తమాః || 94

శ్రేష్ఠం తత్ర మనో విప్రా ఇంద్రియాణి చ భో ద్విజాః | అగచ్ఛంతి యథాకాలం గురోః సందేశకారిణః || 95

శక్యం వాల్పేన కాలేన శాంతిం ప్రాప్తుం గుణాంస్తథా ఏవముక్తేన విప్రేంద్రాః సాంఖ్యయోగేన మోక్షిణీమ్‌ || 96

సాంఖ్యా విప్రా మహాప్రాజ్ఞా గచ్ఛంతి పరమాం గతిమ్‌ | జ్ఞానేనానేన విప్రేంద్రా స్తుల్యం జ్ఞానం న విద్యతే || 97

అత్ర వః సంశయో మా భూ జ్జ్నానం సాంఖ్యం పరం మతమ్‌ | అక్షరం ధ్రువమేవోక్తం పూర్వం బ్రహ్మ సనాతనమ్‌ || 98

అనాదిమధ్యనిధనం నిర్ద్వంద్వం కర్తృ శాశ్వతమ్‌ | కూటస్థం చైవ నిత్యం చ యద్వదంతి శమాత్మకాః || 99

యతః సర్వాః ప్రవర్తంతే సర్గప్రళయ విక్రియాః | ఏవం శంసంతి శాప్త్రేషు ప్రవక్తారో మహర్షయః || 100

సర్వే విప్రాశ్చ వేదాశ్చ తథా సామవిదో జనాః | బ్రహ్మణ్యం పరమం దేవ మనంతం పరమాచ్యుతమ్‌ || 101

ప్రార్థయంతశ్చ తం విప్రా వదంతి గుణబుద్ధయః | మసమ్య గుక్తాస్తథా యోగాః సాంఖ్యాశ్చామితదర్శనాః || 102

అమూర్తిస్తస్య విప్రేంద్రాః సాంఖ్యం మూర్తిరితి శ్రుతిః | అభిజ్ఞానాని తస్యా೭೭హు ర్మహాంతి మునిసత్తమాః || 103

ద్వివిధాని హి భూతాని పృథివ్యాం ద్విజసత్తమాః | అగమ్యగమ్యసంజ్ఞాని గమ్యం తత్ర విశిష్యతే || 104

జ్ఞానం మహద్వై మహతశ్చ విప్రా వేదేషు సాంఖ్యేషు తథైవ యోగే |

యచ్చాపి దృష్టం విధివత్పురాణ సాంఖ్యాగతం తన్నిఖిలం మునీంద్రాః || 105

యచ్చేతిహానేసు మహత్సు దృష్టం యథార్థశాస్త్రేషు విశిష్టదృష్టమ్‌ |

జ్ఞానం చ లోకే యదిహాస్తి కించి త్సాంఖ్యాగతం తచ్చ మహామునీంద్రాః || 106

సమ స్తదృష్టం పరమం బలం చ జ్ఞానం చ మోక్షశ్చ యథావదుక్తమ్‌ |

తపాంసి సూక్ష్మాణి చ యాని చైవ సాంఖ్యే యథావ ద్విహితాని విప్రాః || 107

విపర్యయం తస్య హితం పదైవ గచ్ఛంతి సాంఖ్యాః సతతం సుఖేన |

తాంశ్చాపి సంధార్య తతః కృత్యార్థాః పతంతి విప్రాయతనేషు భూయః || 108

హిత్వా చ దేహం ప్రవిశంతి మోక్షం దివౌకనశ్చాపి చ యోగసాంఖ్యాః |

అతోధికం తేభిరతా మహర్హే సాంఖ్యే ద్విజా భో ఇహ శిష్టజుష్టే || 109

తేషాం తు తిర్యగ్గమనం హి దృష్టం నాధో గతిః పాపకృతాం నివాసః |

స వా ప్రధానా అపి తే ద్విజాతయో యే జ్ఞాన మేతన్మునయో న సక్తాః || 110

సాంఖ్యం విశాలం పరమం పురాణం మహార్ణవం విమలముదారకాంతమ్‌ |

కృత్స్నం హి సాంఖ్యా మునయా మహాత్మనారాయణ ధారయతాప్రమేయమ్‌ || 111

ఏతన్మయోక్తం పరమం హి తత్త్వం నారాయణాద్విశ్వమిదం పురాణమ్‌ |

స సర్గకాలే చ కరోతి సర్గం సంహారకాలే చ హరేత భూయః || 112

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే వ్యాసఋషి సంవాదే సాంఖ్యవిధినరూపణం నామ చత్వారింశదధిక ద్విశతతమోధ్యాయః

ఓ మునిశ్రేష్ఠులారా! ఈ ప్రశ్నముయుక్తి యుక్తమేగానిమిగుల క్లిష్టమైనది. ఈ విషయములో మహాత్ములగు కపిలా చార్యుల జ్ఞానమే శ్రేష్ఠమైనది. ఇంద్రియములు దేహమందుండి దానిని ఎరుగును. అవి ఆత్మకు ఉపకరణములు కాని ఆత్మలేనిచో కఱ్ఱలవలె గోడలవలె జడములై నశించును. ఇంద్రియములతో కూడ జీవుడు నిద్రించి ఆకాశములో వాయువు వలె సూక్ష్మరూపమున సంచరించుచు ఎన్నియో చూచుచు మరల మేల్కాంచిన తరువాత నిద్రకు పూర్వము తన అనుభవములో ఉండిన భవములో ఉండిన వాటిని మరల జ్ఞాపకము చేసికొని ఆయాపనులలో మొదటివలె ప్రవృత్తులగును. ఆత్మ నిద్రావస్థలలోనున్నప్పుడు మాత్రము ఆ ఇంద్రియములు తామేమియు చేయలేక లయమునొంది పడి ఉండును. కాని ఆత్మ ఆ ఇంద్రియముల సూక్ష్మతత్త్వమును తీసికొని సత్త్వ రజస్తమో గుణముల మనోబుద్థుల పంచభూతముల లక్షణములనువెంట బెట్టుకొని స్వప్నలోకమున సంచరించును. అట్లే ఓ బ్రహ్మణులారా? ఇచ్చటను పరమాత్ముడగు నారాయణుడు లోక వ్యవహారమునందలి ఆత్మవంటివాడు ఆయనలో సాయుజ్యము పొందిన ఈముక్తయతులు ఈ ఆత్మకు ఉపకరణములైన ఇంద్రియముల సత్త్వరజన్తమో గుణముల - మనో బుద్దుల - వంటి వారు. ఆ పరమాత్మునిలో లయమునొందిన ఈ మహాయతులు మరల నారాయణుని సృష్టికాలమున నిద్రమేల్కాంచిన జీవుని ఆధీనములో ఈతని ఇంద్రియాదులు మొదటివలె పనిచేసినట్లే వీరును సృష్టి ధర్మములో ప్రవృత్తిపొంది లోకవ్యవహారములో ప్రవర్తిల్ల జేయుదురు. ఇదియే వాస్తవమైన సాంఖ్యతత్త్వము. దీనిలో సమానమైన జ్ఞానతత్త్వము మరియొకటిలేదు. ఈ చెప్పిన నారాయణ పరమాత్మతత్త్వము అక్షరము ధ్రువము సర్వపూర్వము సనాతన బ్రహ్మతత్త్వము ఆనాది మధ్యనిధనము ద్వంద్వ రహితము సర్వకర్త శాశ్వతము కూటస్థము (ఎట్టిస్థితులలో ఏ మార్పులను పొందని అఖండతత్త్వము ) ఆ తత్త్వమునుండియే సృష్టిస్థితిలయములు విప్రులు వేదములు ప్రవర్తిల్లును అని శాస్త్రప్రవక్తలగు మహర్షులు సర్వ విప్రులు ప్రణవ తత్త్వము ఎరిగిన మహానీయులు చెప్పుచున్నారు. సాంఖ్య - యోగ- పరులిద్దరును ఆయనతోడి సాయుజ్యమే కోరి సాధన చేయుదురు. ఏమైనను ఈ ప్రపంచమునందలి భూతములు అగమ్యములు గమ్యములు అని రెండు విధములు. ఈ రెంటిలో గమ్యభూతములు మేలైనవి. (అగమ్యము అనగా తాముపొందు సుఖదుఃఖాది అనుభవములను స్పష్టవాక్కుతో చెప్పజాలనివి) వేదపురాణయోగములు ఇతిహాసశాస్త్రము లోకవ్యవహారము వీటియందు కనబడు జ్ఞానమంతయు సాంఖ్యతత్త్వమునుండి వచ్చినదే. పరమాత్ముని ఉత్తమోత్తమ బలము జ్ఞానము మోక్షము తపస్సులు వేదశాస్త్ర విహితములైన ఇతర సూక్ష్మవిషయములు ధర్మము అన్నియు సాంఖ్యము నుండి వచ్చినవే. కనుక ఈ పైచెప్పిన ముక్తజీవాత్మలు ఈ ఉత్తమ తత్త్వములను తమలో నిలుపుకొని సాయుజ్య మోక్షముతో కృతార్థులైయుండి మరలసృష్టి కాలమునపవిత్రులై నవారి గృహములయందు జన్మింతురు. మరల ఈ దేహమును విడిచిన తరువాత మొదటివలె మోక్షమును పొందుదురు. ఇట్టివారికి ఉత్తరోత్తరముగ ఉన్నతగతులేకాని తిర్యక్‌జన్మలు నరక నివాసము కలుగవు. ఈ చెప్పిన సాంఖ్యతత్త్వము విశాలము శ్రేష్టము విమలము ఉదారమైనది. అనాది మహాసముద్రము వంటిది. కనుక మీరును ఓ మునులారా! సాంఖ్యతత్త్వ పరాయణులై అప్రమేయుడును మహాత్ముడును అగు నారాయణనియందు చిత్తము నిలుపుడు. నేనుచెప్పిన ఈపరమతత్త్వ సారాంశ##మేమనగా అనాదియగు ఈ ప్రపంచము నారాయణునినుండియే ప్రభవించినది. అతడే దీనిని సృష్టికాలములో సృజించును. ప్రళయకాలము వచ్చినప్పుడు సంహరించును.

ఇదిశ్రీమహాపురాణమున ఆదిబ్రహ్మమున వ్యాసఋషిసంవాదమున సాంఖ్యవిధినిరూపణమను రెండువందల నలువదవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters