Brahmapuranamu    Chapters   

అథ ఏకోనచత్వారింశదధికద్విశతతమోధ్యాయః

యోగవిధినిరూపణమ్‌

మునయ ఊచుః

సాంఖ్యం యోగస్య నో విప్ర విశేషం వక్తు మర్హసి | తప ధర్మజ్ఞ సర్వం హి విదితం మునిసత్తమ || 1

యోగవిధి

Jª«sVV¬sxqs»R½òª«sW! »yª«sVV @¬sõ„sxtsQ¸R…Vª«sVVÌÁƒ«sV FsàÓágjiƒ«sªyLRiV. ryLiÅÁùµR…LRi+ƒ«sª«sVVƒ«sLiµR…V NRPLiÛÉÁ ¹¸…WgRiµR…LRi+ƒ«sª«sVV ƒ«sLiµR…V NRPÌÁ „sbPxtísQ»R½ G„sV¹¸…W ª«sWNRPV ¾»½ÌÁVxms úFyLójiLi¿RÁV¿RÁVƒyõª«sVV. @¬s ª«sVVƒ«sVÌÁV ªyùxqsV¬s úFyLójiLiÀÁLji.

వ్యాస ఉవాచ

సాంఖ్యాః సాంఖ్యం ప్రశంసంతి యోగాన్యోగ విదుత్తమాః | వదంతి కారణౖః శ్రేష్ఠైః స్వపక్షోద్భావనాయ వై ||

అనీశ్వరః కథం ముచ్యేదిత్యేవం మునిసత్తమాః | వదంతి కారణౖః శ్రేష్ఠం యోగం సమ్యజ్మనీషిణః || 3

వదంతి కారణం వేదం సాంఖ్యం సమ్యగ్ద్విజాతయః | విజ్ఞాయేహ గతీః సర్వా విరక్తో విషయేషు యః || 4

ఊర్ధ్వం స దేహా త్సువ్యక్తం విముచ్యేదితి నాన్యధా | ఏత దాహుర్మహాప్రాజ్ఞాః సాంఖ్యం వై మోక్షదర్శనమ్‌ || 5

స్వపక్షే కారణం గ్రాహ్యం సమర్థం వచనం హితమ్‌ | శిష్టానాం హి మతం గ్రాహ్యం భవద్భిః శిష్టసంమతైః || 6

ప్రత్యక్ష హేతవో యోగాః సాంఖ్యాః శాస్త్రవినిశ్చయాః | ఉభే చై తే మతే తత్త్వే సమవేతే ద్విజోత్తమాః || 7

ఉభే చై తే మతే జ్ఞాతే మునీంద్రాః శిష్టసంమతే | అనుష్ఠితే యథాశాస్త్రం సయేతాం పరమాం గతిమ్‌ || 8

తుల్యం శౌచం తయోర్యుక్తం దయా భూతేషు చానఘాః | వ్రతానాం ధారణం తుల్యం దర్శనం త్వసమం తయోః || 9

సాంఖ్యులును యోగులును ఉత్తమములగు యుక్తులతో తమతమ పక్షములను సమర్థించుకొనుచు ప్రశంసించు కొనుచు ఉందురు. కాని విద్వాంసులగువారు సాంఖ్య సంప్రదాయము నందు ఈశ్వరుని అంగీకరింపరు కావున ఈశ్వరుని అంగీకరింపని వారికి మోక్షము సిద్ధించుటేమి? అనుతలంపుతో సాంఖ్యమును గ్రహింపక యోగ దర్శనమును ప్రశంసింతురు. ఇహమునందలి సర్వగతులను వానియందలి దోషములను ఎఱిగి విషయములందు విరక్తుడైనవాడు దేహత్యాగమనకు తరువాత తప్పక ముక్తినందును. అని సాంఖ్యుల సిద్ధాంతము. సమర్థములగు యుక్కులను హితములగు వచనములను గుర్తించి స్వపక్షమునకు తగినవానిని గ్రహించుట న్యాయము. ప్రత్యక్షమును - తత్త్వసాక్షాత్కారమును-ప్రమాణముగా గ్రహించువారు యోగదర్శనపరులు. శాస్త్రప్రమాణ బలముచే విషయ నిర్ణయముచేయువారు సాంఖ్యులు. ఓ ద్విజోత్తములారా! ఈరెండు తత్త్వములును అవినాభావ సంబంధము కలవి. రెండును శిష్టులకు సంమతమైనవి. శాస్త్రప్రమాణానుసారము అనుష్ఠించినచో రెండు దర్శనములును మోక్షమును ఇచ్చునవే. శౌచము భూతదయ అయావ్రతానుష్ఠానములు రెండు దర్శనములందును సమానమే. ఐనను దర్శన సిద్ధాంతములు మాత్రము రెంటికిని భిన్నములు.

మునయ ఊచుః

యది తుల్యం వ్రతం శౌచం దయా చాత్ర మహామునే | తుల్యం తద్దర్శనం కస్మాత్తన్నో బ్రూహి ద్విజోత్తమ || 10

ఐనచో ఓద్విజోత్తమా! ఈ దర్శనములకు రెంటికి భేదమేమో తెలియగోరెదమని మునులు వ్యాసునడిగిరి.

వ్యాస ఉవాస

రాగం మోహం తథా న్నేహం కామం క్రోధం చ కేవలమ్‌ | యోగాస్థిరోదితాన్దోషాన్పంచైతాన్ర్పాప్నువంతి తాన్‌ || 11

యథా వానిమిషాః స్థూలః జాలం ఛిత్త్వా పునర్జలమ్‌ | ప్రాప్నువంతి తథా యోగా త్తత్పదం నీతకల్మషాః || 12

తథైవ వాగురాం ఛిత్వా బలవంతో యథా మృగాః | ప్రాప్ను యుర్విమలం మార్గం విముక్తాః సర్వబంధనైః || 13

లోభజాని తథా విప్రా బంధనాని బలాన్వితః | చిత్త్వా యోగాత్పరం మార్గం గచ్ఛంతి విమలం శుభమ్‌ || 14

అచలాస్త్వావిలా విప్రా వాగురాసు తథాపరే | వినశ్యంతి న సందేహ స్తద్వద్యోగ బలాదృతే || 15

బలహీనాశ్చ విప్రేంద్రా యథా జాలం గతా ద్విజాః | బంధం చ గచ్ఛంత్యనఘా యోగాస్తే తు సుదుర్లభాః || 16

యథా చ శకునాః సూక్ష్మం ప్రాప్య జాలమరిందమాః | తత్రాశక్తా విపద్యంతే ముచ్యంతే తు బలాన్వితాః || 17

కర్మజైర్బంధనైర్బద్ధాస్తద్వద్యోగపరాద్విజాః | అబలా న విముచ్యంతే ముచ్యంతే చ బలాన్వితాః || 18

అల్పకశ్చ యథా విప్రా వహ్నిః శామ్యతి దుర్బలః | ఆక్రాంత ఇంధనైః స్థూలై స్తద్వద్యోగబలః స్మృతః || 19

స ఏవ చ తదా విప్రా వహ్నిర్జాతబలః పునః | సమీరణగతః కృత్స్నాం దహేత్షిప్రం మహీమిమామ్‌ || 20

తత్త్వజ్ఞానబలో యోగీ దీప్తతేజా మహాబలః | అంతకాల ఇవా೭೭దిత్యః కృత్స్నం సంశోషయేజ్జగత్‌ || 21

దుర్బలశ్చ యథా విప్రాః స్రోతసా హ్రియతే నరః | బలహీన స్తథా యోగీ విషయైర్హ్రియతే చ సః || 22

తదేవ తు యథా స్రోతో విష్కంభయతి వారణః | తద్వద్యోగబలం లబ్ధ్వా న భ##వేద్విసయైర్హృతః || 23

విశంతి వా వశాద్వాథ యోగాద్యోగబలాన్వితాః | ప్రజాపతీన్మనూన్పర్వాన్మహాభూతాని చేశ్వరాః || 24

న యయో నాంతకః క్రుద్ధో న మృత్యుర్భీమ విక్రమః | విశంతి తద్దిజాః సర్వే యోగస్యామిత తేజసః || 25

ఆత్మనాం చ సహస్రాణి బహూని ద్విజ స్తతమాః | యోగం కుర్యాద్బలం ప్రాప్య తైశ్చసర్వైర్మహీం చరేత్‌ || 26

ప్రాప్నుయా ద్విషయాస్కశ్చిత్పునశ్చోగ్రం తపశ్చరేత్‌ | సంక్షిప్యేచ్చ పునర్విప్రాః సూర్యస్తేజోగుణానివ || 27

బలస్థస్య హి యోగస్య బలార్థం మునిసత్తమాః | విమోక్షప్రభవం విష్ణుముపపన్న మసంశయమ్‌ || 28

బలాని యోగప్రోక్తాని మయైతాని ద్విజో త్తమాః | నిదర్శనార్థం సూక్ష్మాణి వక్ష్యామి చ పునర్ద్విజాః || 29

ఆత్మనశ్చ సమాధానే ధారణం ప్రతి వా ద్విజాః | నిదర్శనాని సూక్ష్మాణి శృణుధ్వం మునిసత్తమాః || 30

అప్రమత్తో యథా ధన్వీ లక్ష్యం హంతి సమాహితః | యుక్తః సమ్యక్తథా యోగీ ప్రాప్నోత్యసంశయమ్‌ || 31

చేపలు వలను చించివెసి మరల నీటిలో ప్రవేశించినట్లు మృగములు ఉరులను త్రెంచుకొని మరలతమమార్గమున తాము పోవునట్లు యోగబలమును సాధించినవారును లోభబంధనములను త్రెంచుకొని విమలమును శుభమునగు ముక్తి మార్గము చేరెదరు. యోగబలమును సాధించజాలనివారు వలలో చిక్కినచేపలవలె ఉరులలోచిక్కిన మృగములవలె ఆ బంధనములలో చిక్కి నశింతురు. మొదటి బంధనములలో చిక్కని యోగులు చాలఅరుదు. అగ్ని అల్పముగానుండగా దానిపై లావైన కట్టెలు అంటించునపుడు అదిచల్లారును. అదేఅగ్నికి గాలిబాగుగాతోడై నపుడు ప్రజ్వలించి భూమండలము నంతటిని కూడ దహించగలుగును. యోగశక్తి కూడ ఈ అగ్నివంటిదే. తత్త్వజ్ఞానబలము కల యోగి మహాబలమును దీప్తమగు తేజస్సును కలవాడై ప్రళయకాలసూర్యునివలె జగత్తునంతటిని కాల్చగలుగును. దుర్బలుడగు మానవుడు ప్రవాహములో కొట్టుకొనిపోయినట్లు యోగబలమును తగినంతగ సాధించనియోగియు విషయప్రవాహములో కొట్టుకొని పోవును. ఏనుగు ప్రవాహమును ఎదుర్కొనగలిగినట్లు యోగబలమును సాధించిన యోగియు విషయప్రవాహముతో కొట్టుకొనిపోడు. యోగ బలాన్వితులగు యోగులు ఈశ్వరులు-సమర్థులు-అయిప్రజాపతులు మనువులు మహాభూతములు మొదలగు తత్త్వములను అన్నిటినిప్రవేశింపగలరు. కాని క్రుద్ధుడైన అంతకుడగు యముడుకాని భయంకరవిక్రమముకల మృత్యువుకాని వీరెవ్వరును యోగబలము సాధించిన యోగియందు ప్రవేశింపజాలరు. యోగసాధన చేయవలెను. బలము సంపాదించి ఆ బలములతో మహీమండలమంతట సంచరింపవచ్చును. యోగియగు వాడొకడు విషయసుఖము లను యోగబలముచే సాధింపవచ్చును. అవికొంత కాలమనుభవించి మరల ఉగ్రమగు తపస్సును చేయవచ్చును. సూర్యుడు తన కిరణములనువలె తనశక్తులను ముడుచుకొనవచ్చును. ఓసత్తములారా! బలముగా సాధింపబడిన యోగశక్తిగల యొగియొక్క బంధనమునకు ముక్తిప్రదాతయగు విష్ణువుకూడలోబడును. యోగబల ప్రభావమును మీకుతెలుపుటకు మీకు ఇవికొన్ని నిదర్శనములు తెలిపితిని. ఇంకను సూక్ష్మతరములైన మరికొన్ని అంశములు మీకు తెలిపెదను. మనస్సమాధానమునకును ధారణకును సంబంధించిన నిదర్శనములును మరికొన్ని తెలిపెదను. అవిఎరిగి అనుష్ఠించిన యోగిఅప్రమత్తుడైన విలుకాడు శ్రద్ధతో లక్ష్యమును కొట్టగలిగినట్లు తానును లెస్సగా మోక్షమును పొందగలుగును. ఇది నిశ్చయము.

స్సేహపాత్రే యథాపూర్ణే మన ఆధాయ నిశ్చలమ్‌ | పురుషో యుక్త ఆరోహేత్సోపానం యు క్తమానసః || 32

ముక్తస్తథాయమాత్మానం యోగం తద్వత్సునిశ్చలమ్‌ | కరోత్యమలమాత్మానం భాస్కరోపమదర్శనే || 33

యథా చ నావం విప్రేంద్రాః కర్ణధారః సమాహితః | మహార్ణవగతాం శీఘ్రం నయేద్విప్రాంస్తు ప త్తనమ్‌ || 34

తద్వదాత్మ సమాధానం యుక్తో యోగేన యోగవిత్‌ | దుర్గమం స్థానమాప్నోతి హిత్వా దేహమిమం ద్విజాః || 35

సారథిశ్చ యథా యుక్తః సదశ్వాన్సుసమాహితః | దేశమిష్టం నయత్యాశు ధన్వినం పురుషర్షభమ్‌ || 36

తథైవ చ ద్విజా యోగీ ధారణాసు సమాహితః | ప్రాప్నోత్యాశు పరం స్థానం లక్ష్యముక్త ఇవా೭೭శుగః || 37

అవేశ్యా೭೭త్మని చా೭೭త్మానం యో 7 వతిష్ఠతి సోచలః | ప్రాశం హత్వేన మీనానాం పదమాప్నోతి సోజరమ్‌ || 38

నాభ్యాం శీర్షేచ కుక్షౌ చ హృది వక్షసి పార్శ్వయోః | దర్శనే శ్రవణ వాపి ఘ్రాణ చామితవిక్రమః || 39

స్థానేష్వేతేషు యో యోగీ మహావ్రత సమాహితః | ఆత్మనా సూక్ష్మమాత్మానం యుంక్తే సమ్యగ్ద్విజోత్తమాః || 40

సుశీఘ్రమచలప్రఖ్యం కర్మ దగ్ధ్వా శుభాశుభమ్‌ | ఉత్తమం యోగమాస్థాయ యదీచ్ఛతి విముచ్యతే || 41

మునయ ఊచుః

ఆహారాన్కీదృశాన్కృత్వా కాని జిత్వా చ సత్తమ | యోగీ బలమవాప్నోతి తద్భవాన్వక్తుమర్హసి || 42

కణానాం భక్షణ యుక్తఃపిణ్యాకస్య చ భోద్విజాః | స్నేహానాం వర్జనే యుక్తో యోగీబలమవాప్నుయాత్‌ || 43

భుంజానో యావకం రూక్షం దీర్ఘకాలం ద్విజోత్తమాః | ఏకాహారీ విశుద్దాత్మా యోగీ బలమవాప్నుయాత్‌ || 44

వక్షాన్మాసానృతూంశ్చిత్రా న్సంచరంశ్చ గుహా స్తథా | అపః పీత్వా పయోమిశ్రా మోగీ బలమవాప్నుయాత్‌ || 45

అఖండమపి వా మాంసం సతతం మునిసత్తమాః | ఉపోష్య సమ్యక్శుద్ధాత్మా యోగీ బలమవాప్నుయాత్‌ || 46

కామం జిత్వా తథా క్రోధం శీతోష్ణం వర్షమేవ చ | భయం శోకం తథా స్వానం పౌరుషాన్విషయాం స్తథా || 47

అరతిం దుర్జయాం చైవ ఘోరాం దృష్ట్వా చ భోద్విజాః |

స్పర్శం నిద్రాం తథా తంద్రాం దుర్జయాం మునిసత్తమాః || 48

దీపయంతి మహాత్మానం సూక్ష్మమాత్మానమాత్మనా | వీతరాగా మహాప్రాజ్ఞా ధ్యానాధ్యయన సంపదా || 49

దుర్గస్త్వేష మతః పంథా బ్రాహ్మణానాం విపశ్చితామ్‌ | యః కశ్చిద్ర్వజతి క్షిప్రం క్షేమేణ మునిపుంగవాః || 50

యథా కశ్చిద్వనం ఘోరం బహుసర్పసరీసృపమ్‌ | శ్వభ్రవత్తోయహీనం చ దుర్గమం బహుకంటకమ్‌ || 51

అభక్తమటవీప్రాయం దావదగ్ధమహీరుహమ్‌ | పంథానం తస్కరాకీర్ణం క్షేమేణాభిపతే త్తథా || 52

యోగమార్గం సమాసాద్య యః కశ్చిద్ర్వజతే ద్విజః | క్షేమేణోపరమేన్మార్గా ద్బహుదోషోపి సంమతః || 53

అస్థేయం క్షురధారాసు నిశితామ ద్విజోత్తమాః | ధారణా సాతు యోగస్య దుర్గేయమకృతాత్మభిః || 54

విషమా ధారణా విప్రా యాంతి పై న శుభాం గతిమ్‌ | నేతృహీనా యథా నావః పురుషాణాం తు వై ద్విజాః ||

యస్తు తిష్ఠతి యోగాధౌ ధారణాసు యథావిధి | మరనం జన్మదుఃఖిత్వం సుఖిత్వం స విశిష్యతే || 56

నానాశా స్త్రేషు నియతం నానాముని నిషేవితమ్‌ | పరం యోగస్య పంథానం నిశ్చితం తం ద్విజాతిషు || 57

పరం హి తద్ర్బహ్మమయం మునీంద్రా బ్రహ్మాణమీశం వరదం చ విష్ణుమ్‌ |

భవం చ ధర్మం చ మహానుభావం యద్ర్బహ్మ పుత్రా స్సుమహానుభావాన్‌ || 58

తమశ్చ కష్టం సుమహద్రజశ్చ సత్త్వం చ శుద్ధం ప్రకృతిం పరాంచ |

సిద్దిం చ దేవీం వరుణస్య పత్నీం తేజశ్చ కృత్స్నం సుమహచ్చ ధైర్యమ్‌ || 59

తారాధిపం భే విమలం సుతారం విశ్వాంశ్చ దేవాసురగాన్పితౄంశ్చ |

శైలాంశ్చ కృత్సానుదధీంశ్చ వాచలా న్నదీశ్చ సర్వాః సనగాంశ్చ నాగాన్‌ || 60

సాధ్యాంస్తథా యక్షగణాన్దిశశ్చ గందర్వ సిద్ధాన్పురుషాంస్త్రి యశ్చ |

పరస్పరం ప్రాప్య మహాన్మహాత్మా విశేతయోగీ సచిరాద్విముక్తః || 61

కథా చ యా విప్రవరాః ప్రసక్తా దై వే మహావీర్యమతౌ శుభేయమ్‌ |

యోగాన్స సర్వా ననుభూయ మర్త్యా నారాయణం తంద్రుత మాప్నువంతి ||

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే వ్యాసర్షి సంవాదే యోగనిధి నిరూపణంనామ ఏకోనచత్వారింశ దధికద్విశతతమోధ్యాయః

సూర్యునివలె ప్రకాశించుచు కనబడెడి పూర్ణమైననూనె పాత్రయంతు నిశ్చలమగు మనస్సును నిలిపి తన్నుతాను అమలునిగాచేసికొనునో అట్లే ముముక్షువు అగువాడు మనస్సును నిశ్చలమొనర్చుకొని యోగసోపానమును ఆరోహించ వలెను. మహాసముద్రములోనున్న బ్రాహ్మణశ్రేష్ఠులు నావపైనెక్కి శ్రద్ధావంతుడగు నావికుని సాయము న ఒడ్డునకు చేరి నట్లే యోగసాధకుడును యోగనహామున మనస్సును సమాహితముచేసి తత్త్వమునందు నిలిపి దేహత్యాగానంతరము మోక్షమును పొందగలును. గుఱితప్పని బాణమువలెను మంచి గుఱ్ఱమును పూన్చిన రథమునెక్కి సమర్థుడగు సారథిని సహాయముగా తీసికొన్న రథికునివలెను సాధకుడు తన గమ్యమగు సిద్దిని పొందగలడు. తన మనస్సును ఆత్మతత్త్వ మునందు దృఢముగానిలిపి నిశ్చలుడైయున్న యోగి నిశ్చలముగానున్న జాలరివలవేసి చేపలను చిక్కించుకొన్నట్లు తత్త్వమును స్వాధీనము చేసికొనును మహాశక్తిశాలియు మహానియమములయందు శ్రద్ధవహించినవాడును అగుచునాభి శిరస్సు-కుక్షి-హృదయము-పక్షస్సు - రెండు పార్శ్వములు నేత్రములు శ్రవణములు ఘ్రాణము - ఈ స్థానములయందు చిత్తమును దృఢముగా నిలిపి సాధనచేసినచో పర్వతములు నేత్రములు శ్రవణములు ఘ్రాణము - ఈ స్థానములయందు చిత్తమును దృఢముగా నిలిపి సాధనచేసినచో పర్వతములంత రాసులుగానున్న శుభాశుభా కర్మరాసులను దగ్ధముచేసి ఉత్తమయోగసిద్ధిని సాధించి తనసంకత్పానుసారము ముక్తుడగును.

యోగసాధకుడు ఏ ఆహారములను తినుటవలనను వేటిని జయించుటవలనను యోగబలమును సాధించునో మాకు తెలుపుడు అని మునులు వ్యాసునడిగిరి.

వ్యాసుడిట్లు చెప్పెను: రవ్వతోను తెలిక పిండితోను చేసిన వంటకమును తినుచుండవలెను. నూనెనువదలవలెను. నూనె లేనియవపిండి వంకములను అదికూడ ఒక పూట మాత్రమేతినినచో యోగ బలముకలుగును. పక్షములమాసములఋతువుల కొలదిగా చిత్రప్రదేశములందును గుహలయందును సంచరించవలెను. నీటితోకలిపిన పాలుత్రాగవలెను. ఒక మాసమైనను నరతోపవాసముచేసి మనశ్శుద్ది సాధించవలెను. కామక్రోధశీతోష్ణవర్ష భయశోక నిద్రలను విషయసుఖములనువేటియందును అభిరుచిలేక పోవుట సోమరితనము వీటిని జయించవలెను. వైరాగ్యము పొందినమహాప్రాజ్ఞుడుధ్యానాధ్యయన సంపత్తి సాయమున ఆత్మను ఉన్నతముగా చేసికొని సూక్ష్మముగా నొనర్చుకొని ప్రకాశవంతముగా చేసికొనును. ఎంతవిద్వాంసులకును బ్రహ్మతత్త్వ సిద్దినికోరిన ముముక్షువులకును ఈమార్గము దుర్గమమైనది. ఏయొక్కరైన ఈమార్గమున నడువగలిగినవారు క్షేమమును తప్పక పొందుదురు. ఘోరమును సర్పములతో సరీసృపములతో గుంతలతో నిండినదియు నీరులేనిదియు నడువసాధ్యము కానిదియు ఎన్నోముండ్లతో నిండినదియు ఎవరును ఉండనిదియు అడవులతో నిండినదియు నిండినదియు దావాగ్నితో కాలుచున్న చెట్లుకలదియు దొంగలతో నిండినదియు అగు మార్గమున నడచుచుండియు ఒకానొకడు క్షేమముగానే తన గమ్యమును చేరగలుగును. ఈ యోగసాధన మార్గమునను అరుదుగా ఎవరోయొక్కరు సిద్ధిపొందగలుగుదురు. వాడియైన క్షురధారల - మంగలికత్తుల పదునుల - మీదనైన క్షేమముగా నడువవచ్చును కాని మనోనిగ్రహము లేని వారికి మాత్రము ఈ యోగమార్గము మిగుల దుర్గమమైనది. అట్టివారికి ధారణ సాధ్యముకాదు. వారు సిద్ధినిపొందజాలరు. కర్ణధారుడులేని నావపైనెక్కినవారు సరిగా ఒడ్డునకు చేరజాలరుకదా! సాధకుడు యథావిధిగ యోగమార్గానుసారము ధారణయందు నిలిచియుండి జన్మమరణ దుఃఖములను లౌకిక సుఖములను అతిక్రమించి మోక్షసుఖమును పొందును. నానాశాస్త్రములచేతను విధింపబడినదియు అనేక మునులు అనుష్ఞించినదియు నిశ్చతమునునగు యోగమార్గము ద్విజాతులకు ప్రశస్తమైనది. దీనిని అనుష్ఠించిన సాధకుడు పరబ్రహ్మ తత్త్వరూపుడగు బ్రహ్మను ఈశ్వరుని విష్ణుని మహానుభావతత్త్వమగు ధర్మమును మహానుభావులును బ్రహ్మపుత్రులునునగు సనత్కుమారాదులను నీచమగు మనస్సును అంతకంటె గొప్పదియగు రజస్సును శుద్ధమగు సత్త్వమును పరాప్రకృతిని వరుణునిపత్నియగు సిద్ధిదేవి సమగ్రమగుతేజస్సును మహాధైర్యమును ఆకాశమున అనేక తారలతోకూడి ప్రకాశించు చంద్రుని విశ్వేదేవులను నాగులను పితరులను సమస్త శైలములను సర్వ సముద్రములను సమస్త నదులను వృక్షములను సాధ్యులను యక్షులను దిక్కులను గంధర్వులను సిద్ధులను సమస్త పురుషులను స్త్రీలను పరస్పరము ప్రవేశించి మహా మహాత్ముడై శీఘ్రముగానే విముక్తుడగును. ఓవిప్రవరులారా! మహావీర్యుడును మహామతియనగు భగవంతుని విషయమున ప్రసక్తమగు కథలన్నిటిలో ఇది శుభ##మైనది. ఈ యోగ ముననుష్ఠించిన యోగులు ఈ చెప్పిన యోగసిద్ధుల నన్నిటిని పొంది అనుభవించి శీఘ్రముగా నారాయణుని చేరుదురు.

ఇది శ్రీమహాపురాణమున ఆదిబ్రాహ్మమున వ్యాసఋషి సంవాదమున యోగవిధినిరూపణమను రెండువందల ముప్పదితొమ్మిదవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters