Brahmapuranamu    Chapters   

అథఅష్టాత్రింశదధికద్విశతతమోధ్యాయః

గుణసర్జనకథనమ్‌

వ్యాస ఉవాచ

సృజతే తు గుణాన్సత్త్వం క్షేత్రజ్ఞ స్త్వధితిష్ఠతి | గుణాన్విక్రయతః సర్వాసుదాసీనవ దీశ్వరః || 1

స్వభావయుక్తం తత్సర్వం యదిమాన్సృజతే గుణాన్‌ | ఊర్ణనాభిర్యథా సూత్రం సృజతే తద్గుణాం స్తథా || 2

ప్రవృత్తా న నివర్తంతే ప్రవృత్తి ర్నోపలభ్యతే | ఏవమేకే వ్యవస్యంతి నివృత్తమితి చాపరే || 3

ఉభయం సంప్రధార్యైతదధ్యవస్యేద్యథామతి | అనేనైవ విధానేన భ##వేద్వై సంశయో మహాన్‌ || 4

అనాదినిధనో హ్యాత్మాతం బుద్ధ్వా విహరేన్నరః | అక్రుధ్యన్నప్రహృష్యంశ్చ నిత్యం విగవతమత్సరః || 5

ఇత్యేవం హృదయే సర్వో బుద్ధి చింతామయం దృఢమ్‌ | అనిత్యం సుఖమాసీన మశోచ్యం ఛిన్నసంశయః || 6

తారయేత్ర్పచ్యుతాం పృథ్వీం యథా పూర్ణాం నదీం నరాః | అవగాహ్య చ విద్వాంసో విప్రా లోలమిమం తథా || 7

న తు తప్యతి వౌ విద్వాస్థ్సలే చరతి త త్త్వవిత్‌ | ఏవం వించింత్య చా೭೭త్యానం కేవలం జ్ఞానమాత్మనః || 8

తం తు బుద్ధ్వా నరః సర్గం భూతానామాగతిం గతిమ్‌ | సమచేష్టశ్చ వై సమ్యగ్లభ##తే శతముత్తమమ్‌ || 9

ఏతద్ద్విజన్మ సామగ్ర్యం బ్రాహ్మణస్య విశేషతః | ఆత్మజ్ఞాన సమస్నేహ పర్యాప్తం తతర్పాయణమ్‌ || 10

తత్త్వం బుద్ధ్వా భ##వేద్బుద్ధః కిమన్య ద్బుద్ధలక్షణమ్‌ | విజ్ఞాయైతద్విముచ్యంతే కృతకృత్యా మనీషిణః || 11

న భవతి విదుషాం మహద్భయం య దవిదుషాం మనుహద్భయం పరత్ర |

న హి గతిరధికాస్తి కస్యచిద్భవతి హి యా విదుషః సనాతనీ || 12

లోక మాతరమసూయతే నరస్తత్ర దేవమనీరీక్ష్య శోచతే |

తత్ర చేత్కుశలో న శోచతే యే విదు స్తదుభయం కృతాకృతమ్‌ || 13

యత్కరోత్యనభిసంధి పూర్వకం తచ్చ నిందయతి యత్పురా కృతమ్‌ |

యత్ర్పియం తదుభయం న వాప్రియం తస్య తజ్జనయతీహ కుర్వతః || 14

సాంఖ్యవివేచనము

xqs»R½òQ*ª«sVV c xqs»yò c @ƒ«sVƒ«sµj… gRiVßáú»R½¸R…Vª«sVVƒ«sV ZOP[QQú»R½ÇìÁÙ²R…gRiV A»R½ø»R½»R½òQ*ª«sVV C gRiVßáú»R½¸R…Vª«sVVƒ«sNRPV xqs»R½òQ*ª«sVVƒ«sNRPV @µ³j…uîy»R½\¹¸…V úxmsxmsLi¿RÁLRiWxmsª«sVVƒ«sxmsLjißت«sVª«sVVƒ¯LiµR…V gRiVß᪫sVVÌÁƒ«sV Dµy{qsƒ«s˳ت«sª«sVV»][ ¿RÁW¿RÁV¿RÁVCaRP*LRiV\®²… ¸R…VVLi²R…Vƒ«sV. xqs»R½òQ*ª«sVV gRiVß᪫sVVÌÁƒ«sV xqsXÑÁLi¿RÁVÈÁ ryÛÍÁxmsoLRiVgRiV»R½ƒ«sƒ«sVLi²T…»R½ƒ«sNRPLiÛÉÁ ®ªs[LRiVNS¬s xmsµyLóRiª«sVV»][ µyLRiª«sVVƒ«sV¼d½zqsgRiW²R…V @ÌýÁVÈÁª«sLiÉÓÁµj…. gRiVß᪫sVVÌÁV FsxmsöV²R…Vƒ«sV úxmsª«sX¼½òQ\®ªs}ms DLi²T… ª«sVVLiµR…Vƒ«sNRPV F¡ª«so¿RÁVLiµR…Vƒ«sV. A úxmsª«sX¼½ò g][¿RÁLRiª«sVVNSµR…V. @¬sN]LiµR…LRiVƒ«sV ¬sª«sX¼½ò¸R…VV ªyÉÓÁNTP NRPÌÁµR…¬s N]LiµR…LRiVƒ«sV @LiµR…VLRiV. C „sxtsQ¸R…Vª«sVVÍÜ[ g]xmsö xqsLiaRP¸R…Vª«sVVƒ«sNRPV @ª«sNSaRPª«sVVƒ«sõµj…. NS¬s „s¿yLRißá ¿Á[zqs Gµ][¹¸…VVNRP xmsORPQª«sVVƒ«sV ¬sLñRiLiVVLi¿RÁVN]ƒ«s ª«sÌÁ¸R…VVƒ«sV. ®ªsVV»R½òª«sVV„dsVµR… A»R½ø»R½»R½òQ*ª«sVV ÇÁƒ«sƒ«sª«sVLRiß᪫sVVÌÁV ÛÍÁ[¬sµj…. µy¬s ®ƒsLjigji Aƒ«sLiµj…Li¿RÁ ª«sÛÍÁƒ«sV. úN][µ³R…ª«sVV x¤¦¦¦L<Riª«sVV ª«sV»R½=LRiª«sVV „s²R…Vª«sª«sÛÍÁƒ«sV. »R½»R½òQ*ª«sVV ®ƒsàÓágjiƒ«sªy®²…[ ‡ÁVµôðR…V²R…ƒ«s‡Á²R…µR…gji ¸R…VVƒyõ²R…V. C A»R½ø»R½»R½òQ*ª«sVV ®ƒsàÓágjiƒ«sª«sVƒ«sVxtsQùÌÁV NRPX»R½NRPX»R½VùQ\ÛÍÁ ª«sVVNTPòƒ«sLiµR…VµR…VLRiV. BÉíÓÁªyLjiNTP xmsLRiÍÜ[NRP „sxtsQ¸R…V\®ªsV ˳ÏÁ¸R…Vª«sVVLi²R…µR…V. ÛÍÁ[¬sªyLjiNTP ˳ÏÁ¸R…Vª«sVV NRPÌÁµR…V. »R½»R½òQ*®ªs[»R½òNRPV NRPÌÁVgRiV aSaRP*»R½ gRi¼½¸R…VgRiV xmsLRiª«sVª«sVVNTPòNRPLiÛÉÁ „sVLiÀÁƒ«s D»R½òª«sV zqós¼½ ª«sVàÓáGµj…¸R…VV ÛÍÁ[µR…V. ƒ«sLRiV²R…V NRPX»R½ª«sVVƒ«sV c NSLRiùLRiWxmsª«sVgRiV úxmsxmsLi¿RÁ»R½»R½òQ*ª«sVVƒ«sVc@NRPX»R½ª«sVVƒ«sVcÇÁƒ«sƒ«sª«sVLRiß᪫sVVÌÁVÛÍÁ[¬s xmsLRi»R½»R½òQ*ª«sVVƒ«sVc FsLRiVgRiƒ«sLi»R½ª«sLRiNRPVƒ«sV Û˳Á[µR…‡ÁVµôðj… NRPÌÁªy²R…gRiVÈÁ¿Á[ Bµj… úzms¸R…Vª«sVV Bµj… @úzms¸R…Vª«sVV @¬s»R½ÌÁ¿RÁV INRPxmsöV²R…V »R½ÖýÁ¬sNRPW²R… ®µ…[*ztsQLi¿RÁVƒ«sV. a][NRPª«sVVƒ«sV @ƒ«sV˳ÏÁ„sLi¿RÁVƒ«sV. »R½»R½òQ*ª«sVV ®ƒsLjigjiƒ«sªy¬sNTP a][NRPª«sVVÛÍÁ[µR…V. NRPLRiøÌÁƒ«sV xmnsÌÁª«sVV\|ms @Õ³ÁxqsLiµ³j…»][ ¿Á[¸R…VVƒ«sLi»R½ª«sLRiNRPV Bµj… úzms¸R…Vª«sVV Bµj… @úzms¸R…Vª«sVV @ƒ«sV ˳ت«sª«sVVLi²R…Vƒ«sV. »R½»R½òQ*ª«sVVƒ«sV FsLjigji xmnsÌÁª«sVV\|ms @Õ³ÁxqsLiµ³j… ÛÍÁ[NRP NRPLRiøÌÁƒy¿RÁLjiLi¿RÁVªy²R…V »yƒ«sV xmspLRi*ª«sVVƒ«sLiµR…V NRPLRiøÌÁV¿Á[zqs xqsLiFyµ]ÀÁƒ«s xqsLiÀÁ»R½ NRPLRiøª«sVVƒ«sVNRPW²R… ƒ«sbPLixms¿Á[zqs N]ƒ«sVƒ«sV. @ƒ«sgS ª«sVVNTPòF~LiµR…Vƒ«sV.

మునయ ఊచుః

యస్మాద్ధర్మాత్పరో ధర్మో విద్యతే నేహ కశ్చన | యో విశిష్టవ్చ భూతేభ్యస్తద్భవాన్ర్పబ్రవీతు నః || 15

అన్ని భూతతత్త్వములకంటె ఉత్తమమగు తత్త్వమును అన్ని ధర్మములకంటె మేలగుధర్మమును మాకు తెలుపుమని మునులు వ్యాసునడిగిరి.

వ్యాస ఉవాచ

ధర్మం చ సంప్రపక్ష్యామి పురాణమృషిభిః స్తుతమ్‌ | విశిష్టం సర్వధర్మేభ్యః శృణుధ్వం మునిసత్తమాః || 16

ఇంద్రియాణి ప్రమాథీని బుద్ధ్యా సంయమ్య తత్త్వతః | సర్వతః ప్రసృతానీహ పితా బాలానివా೭೭త్మజాన్‌ || 17

మనసశ్చేంద్రియాణాం చాపై#్యకాగ్ర్యం పరమం తపః | విజ్ఞేయః సర్వధర్మేభ్యః స ధర్మః పర ఉచ్యతే || 18

తాని సర్వాణి సంధాయ మనఃషష్ఠాని మేధయా | ఆత్మతృప్తం స ఏవా೭೭సీద్భహుచింత్యమచింతయన్‌ || 19

గోచరేభ్యో వివృత్తాని యదా స్థాస్యంతి వేశ్మని | తదా చైవా೭೭త్మ నా೭೭త్మానం పరం ద్రక్ష్యథ శాశ్వతమ్‌ || 20

సర్వాత్మానం మహాత్మానం విధూమమివ పాపకమ్‌ | ప్రపశ్యంతి మహాత్మానం బ్రాహ్మణా యే మనీషిణః || 21

యథా పుష్పఫలోపేతో బహుశాభో మహాద్రుమః | ఆత్మనో నాభిజానీతే క్వ మే పుష్పం క్వ మే ఫలమ్‌ || 22

ఏవమాత్మా న జానీతే క్వ గమిష్యే కుతోన్వహమ్‌ | అన్యో హ్యస్యాంతరాత్మాస్తి యః సర్వమనుపశ్యతి || 23

జ్ఞానదీపేన దీప్తేన పశ్యత్యాత్మానమాత్మనా | ద్పష్ట్వా೭೭త్మానం తథా యూయం విరాగా భవత ద్విజాః || 24

విముక్తాః సర్వపాపేభ్యో ముక్తత్వచ ఇవోరగాః | పరాం బుద్ధిమవాప్యేహా ప్యచింతా విగతజ్వరాః || 25

సర్వతః స్రోతసం ఘోరాం నదీం లోకప్రవాహిణీమ్‌ | పంచేంద్రియ గ్రహవతీం మనఃసంకల్పరోధసమ్‌ || 26

లోభమోహతృణచ్ఛన్నాం కామక్రోధ సరీసృపామ్‌ | సత్యతీర్థానృతక్షోభాం క్రోధపంకాం సరిద్వరామ్‌ || 27

అవ్యక్తప్రభావాం శీఘ్రాం క్రామక్రోధ సమాకులామ్‌ | ప్రతరధ్వం నదీం బుద్ధ్యా దు స్తరా మకృతాత్మభిః || 28

సంసారసాగరగమాం యోనిపాతాళదు స్తరామ్‌ | ఆత్మజన్మోద్భవాం తాం తు జీహ్వావర్త దురాసదామ్‌ || 29

యాం తరంతి కృత ప్రజ్ఞా ధృతిమంతో మనీషిణః | తాం తీర్ణః సర్వతో ముక్తో విధూతా೭೭త్మాత్మ వాన్‌శుచిః || 30

ఉత్తమాం బుద్ధిమాస్థాయ బ్రహ్మభూయాయ కల్పతే | ఉత్తీర్ణః సర్వసంక్లేశా న్ర్పసన్నాత్మా వికల్మషః || 31

భూయిష్ఠానీవ భూతాని సర్వస్థానా న్నిరీక్ష్య చ | అక్రుధ్యన్న ప్రసీదంశ్చ ననృశంసమతి స్తథా || 32

తతో ద్రక్ష్యథ సర్వేషాం భూతానాం ప్రభవాప్యయాత్‌ | ఏతద్ధి సర్వధర్మేభ్యో విశిష్టం మేనిరే బుధాః || 33

ధర్మం ధర్మభృతాం శ్రేష్ఠా మునయః సర్వదర్శినః | ఆత్మానో వ్యాపినో విప్రా ఇతి పుత్రాసుశాననమ్‌ || 34

ప్రయతాయ ప్రవక్తవ్యం హితాయానుగతాయ చ | ఆత్మజ్ఞానమిదం గుహ్యం సర్వగుహ్యతమం మహత్‌ || 35

ఆబ్రవం యదహం విప్రా ఆత్మసాక్షిక మంజసా | నైవ స్త్రీ న పుమా నేవం న చై వేదం సపుంసకమ్‌ || 36

ఆదుఃఖమసుఖం బ్రహ్మ భూతభవ్యభవాత్మకమ్‌ | నైతజ్జాత్వా పుమాన్త్ర్సీ వా పునర్భవమవాప్పుయాత్‌ || 37

యథా మతాని సర్వాణి తథైతాని యథా తథా | కథితాని మయా విప్రా భవంతి న భవంతి చ || 38

తత్ర్పీతియుక్తేన గుణాన్వితేన పుత్రేణ సత్పుత్రదయాన్వితేన |

దృష్ట్వా హితం ప్రీతిమనా యథార్థం బ్రూయా త్సుతస్యేహ యదుక్త మేతత్‌ || 39

అతిప్రాచీనమును ఋషులును మెచ్చినదియు సన్నిధర్మములకంటె శ్రేష్ఠమునునగు ధర్మము తెలిపెదము వినుడు. ఇంద్రియములు జీవుని కలవరపరచునవి. కనుక బుద్ధితో వాటిని బాలురనుతండ్రివలె అదుపులో నుంచుకొని ఇంద్రియములకును మనస్సునకును ఏకాగ్రత అనెడి ఉత్తమ తపస్సుచే ఆ ఉత్తమ ధర్మమును ఎరుగవలెను. గోచరించు వేటిని అనుభవింపగోరక ఇంద్రియములు నివృత్తి నొందినపుడు శాశ్వతుడగు పరమాత్మ తత్త్వము సాక్షాత్కారమును పొందును. ఎన్నో కొమ్మలు పండ్లు పూలు ఆకులు కలవృక్షమునకు తన ఏపండెక్కడనో ఏపూవెక్కడనో ఏకొమ్మ ఏయాకు ఎక్కడనో తెలియనట్లే అనేక వస్తు భేదములతో నిండిన ఈ సంసారములోని జీవుడును తానెవడు? ఎక్కడనుండి తాను వచ్చెను? ఎక్కడకు పోవలెను? అని తెలియకుండును. కాని జ్ఞాన దీపమును ప్రకాశింపజేసికొనినచో అతడు తన అంతరాత్మతో తనలో తన్నుతాను చూడగలుగును. కనుక ఓవిప్రులారా! అందులకై మీరును మొదట వైరాగ్యమును పూనుడు. దానిచే మీరు కుబుసము విడిచిన పామువలె పాపములను వదలించుకొనగలరు. జ్ఞానము సంపాదించి చింతా సంతాపములు విడువగలరు. లోకగతి అనాది ప్రవాహము. నది వంటిది. ఘోరమైనది. ఇది అన్ని వైపులకు వ్యాపించును. ఇంద్రియములు మొసళ్లు. మనఃసంకల్పములు దీనిగట్లు. లోభ మోహములు దీనినికప్పిన గడ్డి. కామక్రోధములు దానిలోతిరుగు పాములు. సత్యము స్నానమాడదగిన రేవు. అనృతము కల్లోలములు. క్రోధము బురద. అవ్యక్త తత్త్వమునుండి ఇది పుట్టినది. మహా వేగముకలది. సంసారసాగరములో అది కలియును. జన్మ పరంపర అను పాతాళ ములోనికిది పోవును. కామముచే ఇది పుట్టును. జిహ్వాచాపలము సుడులు. దీనిని జ్ఞానవంతులు మాత్రమే దాటగలరు. సమస్తభూతము సృష్టి ప్రళయములు తెలిసికొనగలరు. ఇదియే సర్వశ్రేష్ఠమగు ధర్మము. దీనిని హితుడై అనుగతుడై శుచిమనస్కుడైన శిష్యునకుచు కుమారునకును మాత్రమే బోధించవలయును.

మునయ ఊచుః

మోక్షః పితామహేనోక్త ఉపాయాన్నానుపాయతః | తముపాయం యథాన్యాయం శ్రోతు మిచ్ఛామహే మునే || 40

స్వయంభూ బ్రహ్మము మోక్షమునకై నిర్ణయించిన ఉపాయమును యథాశాస్త్ర న్యాయానుసారముగ మాకు తెలుపవేడుచున్నామని మునులు వ్యాసుని అడిగిరి.

వ్యాస ఉవాచ

అస్మాసు తన్మహాప్రాజ్ఞా యుక్తం నిపుణదర్శనమ్‌ | యదుపాయేన సర్వార్థాన్మృగయధ్వం సదానఘాః || 41

ఘటోపకరణ బుద్ధిర్ఘటోత్పత్తౌ స సా మతా | ఏవం ధర్మాద్యుపాయార్థే నాస్యధర్మేషు కారణమ్‌ || 42

పూర్వే సముద్రే యః పంథా స స గచ్ఛతి పశ్చిమమ్‌ | ఏకః పంథా హి మోక్షస్య తచ్ఛృణుధ్వం మమానఘాః || 43

క్షమయా క్రోధముచ్ఛింద్యాత్కామం సంకల్పవర్జనాత్‌ | సత్త్వసంసేవనాద్ధీరో నిద్రా ముచ్ఛేత్తుమర్హతి || 44

అప్రమాదాద్భయం రక్షేద్రక్షేత్షేత్రం చ సంవిదమ్‌ | ఇచ్ఛాం ద్వేషం చ కామం చ ధైర్యేణ వినివర్తయేత్‌ || 45

నిద్రాం చా ప్రతిభాం చైవ జ్ఞానాభ్యాసేన తత్త్వవిత్‌ | ఉపద్రవాం స్తథా యోగీ హితజీర్ణమితాశనాత్‌ || 46

లోభం మోహం చ సంతోషాద్విషయాం స్తత్త్వదర్శనాత్‌ | అనుక్రోశాదధర్మం చ జయేద్ధర్మముపేక్షయా || 47

ఆయత్యా చ జయేదాశాం సామర్థ్యం సంగవర్జనాత్‌ | అనిత్యత్వేన చన్నేహం క్షుధాం యేగేన పండితః || 48

కారుణ్యనా೭೭త్మానం77త్మానం తృష్ణాం చ పరితోషతః | ఉత్థానేన జయేత్తంద్రాం వితర్కం నిశ్చయాజ్జయేత్‌ || 49

మౌనేన బహూభాషాం చ శౌర్యేణ చ భయం జయేత్‌ | యచ్ఛేద్వాజ్మనసీ బుద్ధ్యా తాం యచ్ఛేజ్జౌన చక్షుషా || 50

జ్ఞానమాత్మా మహాన్యచ్ఛే త్తం యచ్ఛేచ్ఛాంతిరాత్మనః | తదేతదుపశాంతేన బోద్ధవ్యం శుచికర్మణా || 51

యోగదోషాస్సముచ్ఛిద్య పంచ యాన్కవయో విదుః | కామం క్రోధం చ లోభం చ భయం స్వప్నం చ పంచమమ్‌ || 52

పరిత్యజ్య నిషేవేత యథావద్యోగసాధనాత్‌ | ధ్యానమధ్యయనం దానం సత్యం హ్రీరార్జవం క్షమా || 53

శౌచమాచరతః శుద్ధిరింద్రియాణాం చ సంయమః | ఏతైర్వివర్ధతే తేజః పాప్మాన ముపహంతి చ || 54

సిధ్యంతి చాస్య సంకల్పా విజ్ఞానం చ ప్రవర్తతే | ధూతపాపః స తేజస్వీ లఘ్వాహారో జితేంద్రియః || 55

కామక్రోధౌ వశే కృత్వా నిర్వశేద్ర్బహ్మణః పదమ్‌ | అమూఢత్వ ముసంగిత్వం కామక్రోధ వివర్జనమ్‌ || 56

అదైన్యమనుదీర్ణత్వమనుద్వేగో హ్యవస్థితిః | ఏష మార్గో హి మోక్షస్య ప్రసన్నో విమలః శుచిః ||

తథా వాక్కాయమనసాం నియమాః కామతోవ్యయాః || 57

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే సాంఖ్యయోగనిరూపణం గుణసర్జసకథనం నామ అష్టాత్రింశదధిక ద్విశతతమోధ్యాయః.

వ్యాసుడు మునులకిట్లచెప్పెను. ఓమహా ప్రాజ్ఞులారా! మనవంటివారికి వివేక జ్ఞానము సరియగు ఉపాయము. దాని సహాయమున సర్వవిషయములను అన్వేషించి కనుగొనవచ్చును. కాని మనకు ఒక కడవతో పనిపడినపుడు దాని నొక్కదానాని సరియైనదానిని సంపాదించుకొన వలయునేకాని లోకములో అన్నికడవలను గూర్చి తెలిసికొనవలసిన పని కాని అన్ని కడవలను సంపాదించవలసిన పనికానిలేదు. అట్లేమోక్షమును కోరినవారు మోక్షధర్మమును మాత్రమేకాని ఇతరధర్మములను తెలిసికొన నక్కరలేదు. తూర్పు సముద్రమునకు చేర్చుమార్గము పశ్చిమ సముద్రమునకు చేర్చదు. అట్లే మోక్షము సిద్ధింపజేయు ధర్మము ఒక్కటియే. ఇతరమార్గములు దానిని సిద్ధింప జేయజాలవు. అట్టి ధర్మమును తెలిపెదను. యోగసాధనకు మూలముగా క్షమచే క్రోధమును సంకల్పములను విడుచుటచే కోరికలను సత్త్వవృద్ధిచే నిద్రను ఎచ్చరికచే భయమును మనస్సు నిబ్బరముచే ఇచ్ఛను ద్వేషమును కామ ప్రవృత్తిని జ్ఞాన వివేకము నభ్యసించుటచే బుద్దిమాంద్యమును ఏ విషయములును చిత్తమున స్ఫురించక పోవుటను హితములు సులభముగా జీర్ణమగు మితాహారముచే దైహికములు మానసికములు అగు ఉపద్రవములను తృప్తిచే లోభమోహములను తత్త్వాజ్ఞానముచే విషయభోగములను దయాభావముచే అధర్మమును ఫలానభిసంధిచే యజ్ఞదానాది ధర్మర్మములను అయతిచే ఆశను సంగము విడుచుటచే కార్యసామర్థ్యమును దృశ్య ప్రపంచవస్తువులు అనిత్యములను భావముచే వాటిపై ప్రీతిని యోగముచే ఆకలిని జయించవలెను. నిత్యప్రయత్నముతో సోమరితనమును సంశయములను నిశ్చయముతోను జయించవలెను. మౌనముచే వాగుడుతనమును శౌర్యముచే భయమును విడువవలెను. వాక్కునుమనస్సును బుద్ధితో బుద్ధిని జ్ఞాననేత్రములతో అదుపులో నుంచి జ్ఞానముచే ఆత్మతత్త్వమెరిగి ఆత్మ శాంతిని సాధించవలెను. ఫలాభిసంధి లేక పవిత్రకర్మలాచరించి శుద్ధమైన చిత్తముతో జ్ఞానము సాధించవలెను. కామక్రోధ లోభ భయస్వప్నములను యోగదోషముల నైదింటిని విడిచి యోగ సాధనముచేయుచు ధ్యానము అధ్యయనము దానము సత్యము బిడియము ఋజువర్తనము క్షమ శౌచము ఆచారశుద్ది ఇంద్రియ జయము కలిగియున్నచో తేజస్సు వృద్ధియగును. పాపము నశించును. సంకల్పముల నెరవేరును. విజ్ఞానము ప్రవర్తిల్లును. చివరకు బ్రహ్మస్థానమున ప్రవేశించును. అమూఢత్వము సంగరాహిత్యము కామక్రోధముల విడుచుట దైన్యముకాని పొగరుకాని లేకుండుట భయములేక నిబ్బరముతో నుండుట - ఇది ప్రసన్నమును విమలమును శుచియు నైన మోక్షమార్తము. మనోవాక్కాయ నిగ్రహము తప్పక యుండవలసిన నియమము.

ఇది శ్రీమహాపురాణమున ఆదిబ్రాహ్మమున వ్యాసఋషిసంవాదమున సాంఖ్యయోగనిరూపణమను రెండువందల ముప్పదిఎనిమిదవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters