Brahmapuranamu    Chapters   

అథపంచత్రింశదదికద్విశతతమోధ్యాయః

యోగాభ్యాస నిరూపణమ్‌

మునయ ఊచుః

ఇదానీం బ్రూహి యోగం చ దుఃఖసంయోగ భేషజమ్‌ |

యం విదిత్వా೭೭వ్యయం తత్ర యుంజామః పురుషోత్తమమ్‌ || 1

శ్రుత్వా స వచనం తేషాం కృష్ణ ద్వైపాయనస్తదా | అబ్రవీత్పరమప్రీతో యోగీ యోగవిదాం వరః || 2

వ్యాస ఉవాచ

యోగం వక్ష్యామి భో విప్రాః శృణుధ్వం భవనాశనమ్‌ | యమభ్యస్యాప్నుయాద్యోగీ మోక్షం పరమదుర్లభమ్‌ || 3

శ్రుత్వా೭೭దౌ యోగశాస్త్రాణి గురుమారాధ్య భక్తితః | ఇతి హాసం పురాణం చ వేదాంశ్చైవ విచక్షణః || 4

ఆహారం యోగదోషాంశ్చ దేశకాలం చ బుద్దిమాన్‌ | జ్ఞాత్వా సమభ్యసేద్యోగం నిర్ద్వంద్వో నిష్పరిగ్రహః || 5

భుంజన్సక్తుం యవాగూం చ తక్రమూలఫలం పయః | యావకం కణపిణ్యాక మాహారం యోగసాధనమ్‌ || 6

న మనోవికలే ధ్మాతే న శ్రాంతే క్షుధితే తథా | న ద్వంద్వే న చ శీతే చ న చోష్ణే నానిలాత్మకే || 7

సశ##భ్దే న జలాభ్యాశే జీర్ణగోష్టే చతుష్పథే | సరీసృపే శ్మశానే చ న నద్యంతేగ్ని సంనిధౌ || 8

న చైత్యే న చ వల్మీకే సభ##యే కూపసంనిధౌ | న శుష్క పర్ణనిచయే యోగం యుంజీత కర్హిచిత్‌ || 9

దేశానేతాన నాదృత్య మూఢత్వాద్యో యునక్తి వై | ప్రవక్ష్యే తస్య యే దోషా జాయంతే విఘ్నకారకాః || 10

బాధిర్యం జడతా లోపః స్మృతేర్మూకత్వమంధతా | జ్వరశ్చ జాయతే సద్య స్తద్వదజ్ఞాన సంభవః || 11

తస్మాత్సర్వాత్మనా కార్యా రక్షా యోగవిదా సదా | ధర్మార్థకామమోక్షాణాం శరీరం సాధనం యతః || 12

యోగాధ్యాయము

సంసార దుఃఖనివారణౌషధమగు యోగమును తాము తెలిపినచో దానియందు పురుషోత్తముడగు అవ్యయుడగు విష్ణుని అనునంధానము చేయుదుము. అని మహర్షులు కోరగా యోగవేత్తలలో శ్రేష్ఠుడగు వ్యాసుడు మిగుల సంతోషముతో యోగ ప్రకారమును ఇట్లు చెప్పనారంభించెను.

ఓ విప్రులారా! సంసారనాశకమగు యోగమును తెలిపెదను. దానినభ్యసించి యోగియైనవాడు పరమదుర్లభమగు మోక్షమును పొందగలుగును. మొదట యోగశాస్త్రములను శ్రవణముచేసి భక్తితో గురువును ఆరాధించి యోగవిషయములనెఱిగి ఇతిహాస పురాణ వేదములతో చెప్పిన విషయములను ఆహారగుణ దోషములను దేశకాలస్థితిగుణ దోషములను తెలిసికొని పిమ్మట సుఖదుఃఖాది ద్వంద్వములకు అతీతుడై ఎవరినుండి ఏదియు ప్రతిగ్రహించుటపై అశనుమాని యోగమున్యభసింప వలెను. పేలపిండి గంజి మజ్జిగ దుంపలు వేళ్లు పండ్లు రవ్వతో వండిన అన్నము యవపిండితో చేసిన వంట యోగసాధనకు పనికివచ్చు ఆహారము. మనస్సు ఆవేశముచెందియున్నప్పుడు మనస్సు వికలమైయున్నప్పుడు శ్రమగా అకలిగా ఉన్నప్పుడు చలి ఉష్ణము గాలి భాదించుచున్నప్పుడు ధ్వనులు వినబడుచుండగా నీటి సమీపమున శిథిలమైన గోస్థానములో నాలుగు బాటలు కలిసిన ప్రదేశములో పాములు తిరుగుచోట శ్మశానములో నదులచివరలలో అగ్నిసమీపమున చైత్యముల గ్రామములలో జనులు సమావేశమగుటకును దేవతా భావనతో పూజించుటకును నాటిన చెట్ల దగ్గరను - పుట్టలదగ్గరను భయమునకు అవకాశముగలచోట్లను బావులదగ్గరను ఎండిన ఆకుల కుప్పల దగ్గరను యోగసాధన ఎప్పుడును చేయరాదు. ఒకవేళ ఇట్టిచోట్ల యోగసాధనను మూఢుడై చేసిన యెడల చెవుడు బుద్దిమాంద్యము జ్ఞాపకశక్తిలోపము మూగితనము గ్రుడ్డితనము జ్వరము కలుగును. అజ్ఞానము సంభవించును. నాలుగుపురుషార్థములకును దేహమే సాధనము కావున పైవిషయములను పాటించి దేహమును రక్షించుకొనుచు యోగసాధనచేయవలెను.

ఆశ్రమే విజనే గుహ్యే నిఃశ##భ్దే నిర్భయే నగే | శూన్యాగారే శుచౌ రమ్యే చై కాంతే దేవతాలయే || 13

రజన్యాః పశ్చిమే యామే పూర్వే చ సుసమాహితః | పూర్వాహ్ణే మధ్యమే చాహ్ని యుక్తాహారో జితేంద్రియః || 14

ఆసీనః ప్రాజ్ముఖో రమ్య ఆసనే సుఖనిశ్చలే | నాతినీచే న చోచ్ర్చితే నిస్పృహః సత్యవాక్శుచిః || 15

యుక్తనిద్రో జితక్రోధః సర్వభూతహితే రతః | సర్వద్వంద్వ సహో ధీరః సమకాయాంఘ్రీమస్తకః || 16

నాభౌ నిధాయ హస్తౌ ద్వౌ శాంతః పద్మాసనే స్థితః| సంస్థాప్య దృష్టిం నాసాగ్రే పాణానాయమ్య వాగ్యతః || 17

సమాహృత్యేంద్రియగ్రామం మనసా హృదయే మునిః | ప్రణవం దీర్ఘముద్యమ్య సంవృతాస్యః సునిశ్చలః || 18

రజసా తమసో వృత్తిం సత్త్వేన రజసస్తథా | సంచాద్య నిర్మలే శాంతే స్థితః సంవృతలోచనః || 19

హృత్పద్మకోటరే లీనం సర్వవ్యాపి నిరంజనమ్‌ | యుంజీత సతతం యోగీ ముక్తిదం పురుషోత్తమమ్‌ || 20

కరణంద్రియ భూతాని క్షేత్రజ్ఞే ప్రథమం న్యసేత్‌ | క్షేత్రజ్ఞశ్చపరే యోజ్య స్తతో యుంజతి యోగవిత్‌ || 21

మనో యస్యాంతమభ్యేతి పరమాత్మని చంచలమ్‌ | సంత్యజ్య విషయాం స్తస్య యోగసిద్దిః ప్రకాశితా || 22

యదా నిర్విషయం చిత్తం పరే బ్రహ్మణి లీయతే | సమాధౌ యోగయుక్తస్య తదాభ్యేతి పరం పదమ్‌ || 23

అసంసక్తం యదా చిత్తం యోగినః సర్వకర్మ సు | భవత్యానంద మాసాద్య తదా నిర్వాణ మృచ్ఛతి || 24

శుద్దం ధామత్రయాతీతం తుర్యాఖ్యం పురుషోత్తమమ్‌ | ప్రాప్య యోగబాలద్యోగీ ముచ్యతే నాత్ర సంశయః || 25

నిస్పృహః సర్వకామేభ్యః సర్వత్ర ప్రియదర్శనః | సర్వత్రానిత్యబుద్దిస్తు యోగీ ముచ్యేత నాన్యధా || 26

ఇంద్రియాణి న సేవేత వైరాగ్యేణ చ యోగవిత్‌ | సదా చాభ్యాసయోగేన ముచ్యతే నాత్ర సంశయః || 27

న చ పద్మాసనాద్యోగో న నాసాగ్రనిరీక్షణాత్‌ | మనసశ్చేంద్రియాణాం చ సంయోగో యోగ ఉచ్యతే || 28

ఏవం మయా మునిశ్రేష్టా యోగః ప్రోక్తో విముక్తిదః | సంసారమోక్ష హేతుశ్చ కిమస్యచ్ర్చోతు మిచ్చథ || 29

లోమహర్షణ ఉవాచ

శ్రుత్వా తే వచనం తస్య సాధు సాద్వితి చాబ్రువన్‌ | వ్యాసం ప్రశస్య సంపూజ్య పునః ప్రష్టుం సముద్యతాః ||

ఇతి శ్రీ మహాపురాణ ఆదిబ్రాహ్మే వ్యాసర్షి సంవాదే యోగాభ్యాస నిరూపణంనామ

పంచత్రింశదధిక ద్విశతతమోధ్యాయః

ఆశ్రమములో జనులులేనిచోట రహస్య స్థానమున శబ్దము వినబడనిచోట నిర్భయముచోట కొండమీద శూన్యగృహమున శుచిస్థానమున అందమైనచోట ఏకాంతస్థానమున దేవాలయమున రాత్రియొక్క మొదటిజామున చివరి జామున పగలు ప్రాతఃకాలమున మధ్యాహ్నమున యోగసాధన చేయతగును. తగిన ఆహారమును మితముగా భుజించుచు ఇంద్రియములజయించి సుఖమును నిశ్చలమునునై ఎక్కువ ఎత్తునుకాని రమ్యమైన ఆసనమున ప్రాజ్ముఖుడై కూర్చుండవలెను. నత్యవచనుడు శుచి తగినంత నిద్రకలవాడు క్రోధము జయించినవాడు సర్వభూతములకు హితమును కోరువాడు చలి వేడి మొదలగు అన్నిద్వంద్వముల సహించువాడు మనసున నిబ్బరము కలవాడు శరీరము పాదములు శిరస్సు సమముగా నుంచినవాడు కావలెను. హస్తములను నాభిపైనిలిపి శాంతుడై పద్మాసనమున నుండవలెను. మౌనియై దృష్టిని ముక్కు కొనపైనిలిపి ప్రాణాయమముచేయవలెను. జ్ఞానేంద్రియముల నైదింటిని మనస్సుతోకూడ హృదయములోనికి ఉపసంహరించవలెను. మునియై ప్రణవమును దీర్ఘముగా పూనికతో ఉచ్చరించుచు మిగుల నిశ్చలుడై తమోగుణ వ్యాపారము రజోగుణము చేతను రజోగుణ వ్యాపారమును సత్యగుణముచేతను కప్పివేసి కన్నులు మూసికొని నిర్మల శాంతస్థితిలో నుండవలెను. ఇట్లు హృదమగుహయందు దాగినవాడును సర్వ వ్యాపియు నిరంజనుడును అగు పురుషోత్తముని తన చిత్తమున అను సంధానము చేయవలెను. జ్ఞాన కర్మేంద్రియములను భూతములను మొదట క్షేత్రజ్ఞుడు అగు జీవచైతన్యమునందును తరువాత ఆ క్షేత్రజ్ఞుని పరమాత్మ తత్త్వమునందును అను సంధానము చేయవలెను. సహజ చంచలమగు మనస్సు బాహ్య విషయ సుఖములను వదలి పరమాత్మునిచేరినవానికి యోగసిద్ది నిశ్చయముగా కలుగును. చిత్తము విషయములపైకిపోక బ్రహ్మమునందు లయమొందినచో యోగసమాధి ఫలమును సిద్దింపజేయుటచే సాధకుడు పరమపదమును పొందును. యోగసాధకుని చిత్తము ఏకర్మాచరణమునందును ఆసక్తినొందక ఆనందమును పొందినప్పుడు యోగసాధకుడు మోక్షసిద్ది నొందును. ఏ కోరికలనులేక అన్నిటిని ప్రీతికరమైనవానినిగానే చూచుచు పరతత్త్వము తప్ప మిగిలినదంతయు అనిత్యమని ఎఱుగనిదే మోక్షము సిద్ధింపదు. యోగసాధకుడు వైరాగ్యముతో నుండవలెను. ఇంద్రియసుఖముల సేవింపరాదు. యోగమునభ్యసింపవలెను. పద్మాసముతో కూర్చుండుట నాసాగ్రమున దృష్టినిలుపుట మాత్రమున యోగసిద్ధి కలుగదు. మనస్సు ఇంద్రియములు కలిసి లయము నొందుటయే యోగము.

ఓ ముని శ్రేష్ఠులారా! సంసారమోక్షసాధనమగు యోగప్రకారమును తెలిపితిని. మఱి యేమి వినగోరుదురి ఆడుగుడు.

ఇది శ్రీ మహాపురానమున ఆదిబ్రాహ్మమున వ్యాసఋషి సంవాదమమున యోగాభ్యాస నిరూపణమును రెండువందలముప్పదిఐదవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters