Brahmapuranamu    Chapters   

అథత్రయస్త్రింశదధికద్విశతతమో7ధ్యాయః

ప్రాకృతలయ నిరూపణమ్‌

వ్యాస ఉవాచ

సప్తర్షిస్థాన మాక్రమ్య స్థితేంభసి ద్విజో త్తమాః | ఏకార్ణవం భవత్యేత త్త్రైలోక్య

మఖిలం తతః || 1

అథ విఃశ్వాసజో విష్ణో ర్వాయుస్తా న్జలదాం స్తతః | నాశం నయతి భో విప్రా వర్షణామధికం

శతమ్‌ || 2

సర్వభూతమయోచింత్యో భగవాన్భూత భావనః | అనాదిరాది ర్విశ్వస్య పీత్వా

వాయుమశేషతః || 3

ఏకార్ణవే తతస్తస్మిన్‌ శేషశయ్యా స్థితః ప్రభుః | బ్రహ్మరూపధరః శేతే భగవా నాది

కృద్ధరిః|| 4

జనలోకగతైః సిద్ధైః సనకాద్యైరభిష్టుతః | బ్రహ్మలోకగతై శ్చైవ చింత్యమానో

ముముక్షుభిః || 5

ఆత్మమాయామయీం దివ్యాం యోగనిద్రాం సమాస్థితః | ఆత్మానం వాసుదేవాఖ్యం చింతయన్పరమేశ్వరః || 6

ఏష నైమిత్తికో నామ విప్రేంద్రాః ప్రతిసంచరః | నిమిత్తం తత్ర యచ్ఛేతే బ్రహ్మరూపధరో హరిః || 7

యదా జాగర్తి సర్వాత్మా స తదా చేష్టతే జగత్‌ | నిమీలత్యేతదఖిలం మాయాశయ్యాశ##యేచ్యుతే || 8

పద్మయోనే ర్దినం యత్తు చతుర్యుగ సహస్రవత్‌ | ఏకార్ణవకృతే లోకే తావతీ రాత్రిరుచ్యతే || 9

తతః ప్రబుద్ధో రాత్ర్యంతే పునః సృష్టిం కరోత్యజః | బ్రహ్మస్వరూపధృగ్విష్ణు ర్యథా వః కథితం పురా || 10

ఇత్యేష కల్ప సంహార అంతర ప్రలయో ద్విజాః | నైమిత్తికో వః కథితః శృణుధ్వం ప్రాకృతం పరమ్‌ || 11

నైమిత్తిక ప్రాకృత ప్రళయకథనము

వ్యాసుడిట్లు మునులతో పలికెను: ఓ బ్రాహ్మణోత్తములారా! ఈ ప్రళయ మేఘములు వర్షించుటచే కలిగిన జలము సప్తమహర్షులుండు స్థానము వరకు వ్యాపింపగా ఈ త్రైలోక్యమంతయు ఏక సముద్రమగును. విష్ణువంతట తన నిట్టూర్పు వాయువుతోనే నూరేండ్లకు పైబడిన కాలవ్యవధిలో నశింపజేయును. సర్వ భూతమయుడును ఊహింప నలవి కానివాడు భూతములనన్నిటిని సృష్టించువాడు అదిలేకయు లోకమునకు అదియగు విష్ణుభగవానుడు వాయువునంతటిని పూర్తిగా పీల్చివేసి బ్రహ్మరూపమును ధరించి ఆఏకార్ణవమున శేషశయ్యపై పరుండును. అప్పుడతనిని జనలోకమందలి సనకాది సిద్ధులు బ్రహ్మలోకమునందలివారు స్తుతించుచుందురు. మోక్షము కోరినవారు ధ్యానించుచుందురు. ఆ పరమేశ్వరుడు వాసుదేవుడను తన స్వరూపమును చింతించుచు తన స్వమాయారూపయగు యోగనిద్ర నాశ్రయించి యుండును. ప్రళయాంతమున హరి సృష్టికి నిమిత్తకారణుడుగా బ్రహ్మ రూపము ధరించి శయనించియుండుటచే దీనికి నైమిత్తిక ప్రళయమనిపేరు. వేయి చతుర్యుగముల పరిమాణముకల బ్రహ్మదేవుని పగటి వలెనే అతని రాత్రియు అంతే పరిమాణముకలది. అంత కాలము గడచిన తరువాత విష్ణువు మరల బ్రహ్మయొక్క రూపముతో సృష్టిని ఆరంభించును. ఇట్లు ఓ విప్రులారా! మీకు నైమిత్తిక ప్రళయ విధము తెలిపితిని. ఇక ప్రాకృతప్రళయము తెలిపెదను వినుడు.

అవృష్ట్యగ్న్యాదిభిః సమ్యక్కృతే శయ్యాలయే ద్విజాః | సమస్తేష్వేవ లోకేషు పాతాళేష్వభిలేషు చ || 12

మహదాదే ర్వికారస్య విశేషాత్తత్ర సంక్షయే | కృష్ణేచ్ఛాకారితే న్ప్రవృత్తే ప్రతిసంచరే || 13

అపో గ్రసంతి వై పూర్వం భూమేర్గంధాదికం గుణమ్‌ | ఆత్తగంధా తతో భూమిః ప్రలయాయ ప్రకల్పతే || 14

ప్రనష్టే గంధ తన్మాత్రే భవత్యుర్వీ జలాత్మికా | అపస్తదా ప్రవృత్తా స్తు వేగవత్యోమహాస్వనాః || 15

సర్వ మాపూరయంతీదం తిష్ఠంతి విచరంతి చ | సలిలేనై వోర్మిమతా లోకాలోకాః సమంతతః || 16

అపామపి గుణో యస్తు జ్యోతిషా పీయతే తు సః | నశ్యంత్యాపః సుతప్తాశ్చ రసతన్మాత్ర సంక్షయాత్‌ || 17

తతశ్చా೭೭పోమృతరసా జ్యోతిష్ట్వం ప్రాప్నువంతి వై | అగ్న్యవస్థే తు సలిలే తేజసా సర్వతో వృతే || 18

స చాగ్ని ః సర్వతో వ్యాప్య ఆదత్తే తజ్జలం తదా |

సర్వమాపూ రయత్యగ్ని స్తదా జగదిదం శ##నైః || 19

అర్చిభిః సంతతే తస్మిం స్తిర్యగూర్ధ్వ మధ స్తథా | జ్యోతిషోపి పరం రూపం వాయురత్తి ప్రభాకరమ్‌ || 20

ప్రలీనే చ తతస్తస్మి న్వాయు భూతేభిలాత్మకే | ప్రనష్టే రూపతన్మాత్రే కృతరూపో విభావసుః || 21

ప్రశామ్యతి తదా జ్యోతి ర్వాయుర్దోధూయతే మహాన్‌ | నిరాలోకే తదా లోకే వాయు సంస్థే చ తేజసి || 22

తతః ప్రలయమాసాద్య వాయు సంభవ మాత్మనః | ఊర్ధ్వం చ వాయుస్తిర్యక్చ దోధవీతి దిశో దశ || 23

వాయోస్త్వపి గుణం స్పర్శ మాకాశం గ్రసతే తతః | ప్రశామ్యతి తదా వాయుః ఖం తు తిష్ఠత్యనావృతమ్‌ || 24

ఆరూపమరసస్పర్శ మగంధవ దమూర్తిమత్‌ | సర్వమాపూరయచ్చైవ సుమహత్ర్పకాశ##తే || 25

పరి మండలత స్తత్తు ఆకాశం శబ్దలక్షణమ్‌ | శబ్దమాత్రం తథా೭೭కాశం సర్వమావృత్యతిష్ఠతి || 26

తతః శబ్దగుణం తస్య భూతాది ర్గ్రసతే పునః | భూతేంద్రియేషు యుగప ద్భూతాదౌ సంస్థితేషు పై || 27

అభిమానాత్మకో హ్యేష భూతాది స్తామసః స్మృతః | భూతాదిం గ్రసతే చాపి మహాబుద్ధి ర్విచక్షణా || 28

ఉర్వీ మహాంశ్చ జగతః ప్రాంతేంతర్బాహ్యత స్తథా | ఏవం సప్తమహాబుద్ధిః క్రమాత్ర్పకృతయ స్తథా || 29

ప్రత్యా హారైస్తు తాః సర్వాః ప్రవిశంతి పరస్పరమ్‌ | యేనేద మావృతం సర్వ మండ మప్సు ప్రలీయతే || 30

సప్తద్వీప సముద్రాంతం సప్తలోకం సపర్వతమ్‌ | ఉదకావరణం హ్యత్ర జ్యోతిషా పీయతే తు తత్‌ || 31

జ్యోతిర్వా¸° లయం యాతి యాత్యాకాశే సమీరణః | ఆకాశం చైవ భూతాది ర్గ్రసతే తం తథా మహాన్‌ || 32

మహాంతమేభిః సహితం ప్రకృతి ర్గ్రసతే ద్విజాః | గుణసామ్య మనుద్రిక్త మన్యూనం చ ద్విజోత్తమాః || 33

అనావృష్టి అగ్ని మొదలగు ఉపద్రవములతో భూలోక పాతాళాది లోకములందలి ఉపరి తలమునగల పదార్థములన్నియు మొదట నశించును. తరువాత విష్ణుని ఇచ్ఛకు లోబడి మహాదాది ప్రకృతి వికారములన్నియు నశించును. ఇదే ప్రాకృతప్రళయము. దాని క్రమమిది. మొదట జలము పృధివియొక్క గంధగుణమును హరించును. అంతట పృథివియు జలరూపము ధరించును. అపుడవి మహాధ్వనితో మహావేగమున ప్రవహించి లోకాలోక పర్వతమువరకు నిండిపోవును. అంతట అగ్నితత్త్వము జలమును దానిలోని రస తన్మాత్రను హరించును. అంతట జలము జలరూపము వదలి అగ్నిగానగును. అపుడీజలమంతయు పృథివిలేక జలములేక కేవల మగ్నిజ్వాలలతో నిండియుండును. అంతటవాయువు అగ్నియొక్క విశేషగుణమగు రూపతన్మాత్రను హరించును. అప్పుడు అగ్నియంతయు అగ్నిత్వమును కోల్పోయి వాయువుగానగును. ప్రపంచమంతయు వాయువుమాత్రమే అయి అది పదిదెసల వీచుచుండును. అంతలో అకాశము వాయువు యొక్క విశేషగుణమగు స్పర్శ తన్మాత్రను తనలోనికి లయము చేసికొనుటచే వాయువు వాయువుగా నుండక లయము నొందుటచే అంతటను ఆకాశము కేవల శూన్యతత్త్వము మాత్రము-ఉండును. అంతలో ఆకాశముయొక్క విశేషగుణమగు శబ్దతన్మాత్రను భూతాది తత్త్వము తనలో లయమొందించుకొనును. అదియు మహత్తత్త్వము నందును - అదియు ప్రకృతి యందును లయమునొందును. అదియే త్రిగుణముల సామ్యావస్థ. అనగా అప్పుడు సత్త్వర జన్తమో గుణములలో ఏయొక్కటియు ఎక్కువగ ఉద్రేకింపక మూడును సమస్థితిలో నుండును.

ప్రోచ్యతే ప్రకృతిర్హేతుః ప్రధానం కారణం వరమ్‌ | ఇత్యేషా ప్రకృతిః సర్వా ప్యక్తా వ్యక్త స్వరూపిణీ || 34

వ్యక్త స్వరూపమవ్యక్తే తస్యాం విప్రాః ప్రలీయతే | ఏకః శుద్ధోక్షరో నిత్యః సర్వవ్యాపీ తథా పునః || 35

సోవ్యంశః సర్వభూతస్య ద్విజేంద్రాః పరమాత్మనః | నశ్యంతి సర్వా యత్రా పి నామజాత్యాది కల్పనాః || 36

సత్తామాత్రాత్మకే జ్ఞేయే జ్ఞానాత్మన్యాత్మనః పరే | న బ్రహ్మ తత్పరం ధామ పరమాత్మా పరేశ్వరః || 37

స విష్ణుః సర్వమేవేదం యతో నా೭೭వర్తతే పునః | ప్రకృతిర్యా మయా೭೭ఖ్యాతా వ్యక్తా వ్యక్త స్వరూపిణీ ||

పురుషశ్చాప్యుభావేతౌ లీయేతే పరమాత్మని | పరమాత్మా చ సర్వేషా మాధారః పరమేశ్వరః || 39

విష్ణునామ్నా న వేదేషు వేదాంతేషు చ గీయతే | పవ్రృత్తం చ వివృత్తం చ ద్వివిధ కర్మ వైదికమ్‌ || 40

తాభ్యా ముభాభ్యాం పురుషై ర్యజ్ఞమూర్తిః స ఇజ్యతే | ఋగ్యజుఃసామభి ర్మార్గ్రైః ప్రవృత్తై రిజ్యతే హ్యసౌ || 41

యజ్ఞేశ్వరో యజ్ఞపుమా స్పురుషైః పురుషోత్తమః | జ్ఞానాత్మా జ్ఞానయోగేన జ్ఞానమూర్తిః స ఇజ్యతే || 42

నివృతైర్యోగమార్గైశ్చ విష్ణుర్ముక్తిఫలప్రదః | హ్రస్వదీర్ఘప్లుతైర్యత్తు కించిద్వ స్త్వభిధీయతే || 43

యచ్చ వాచా మవిషయ స్తత్సర్వం విష్ణురవ్యయః | వ్యక్తః స ఏవ మప్యక్తః స ఏవ పురుషోవ్యయః || 44

పరమాత్మా చ విశ్వాత్మా విశ్వరూపధరో హరిః | వ్యక్తావ్యక్తాత్మికా తస్మి న్ర్పకృతిః సా విలీయతే || 45

పురుషశ్చాపి భో విప్రా యస్తదవ్యాకృతాత్మని | ద్విపరార్ధాత్మకః కాలః కథితో యో మమా ద్విజాః || 46

తదహస్తవ్య విప్రేంద్రా విష్ణోరీశస్య కథ్యతే | వ్యక్తేతు ప్రకృతౌ లీనే ప్రకృత్యాం పురుషే తథా || 47

తత్రా೭೭స్థితే విశా తస్య తత్ర్పమాణా తపోధనాః | నై వాహస్తస్య చ నిశా నిత్యస్య పరమాత్మనః || 48

ఉపచారత్తథా ప్యేత త్తస్యేశస్య తు కథ్యతే | ఇత్యేష మునిశార్దూలాః కథితః ప్రాకృతో లయః || 49

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే ప్రాకృతలయనిరూపణం నామ త్రయస్త్రంశదధిక ద్విశతతమోధ్యాయః.

ఈ ప్రకృతినే ప్రధానహేతువు పరమ కారణము అనియు వ్యవహరింతురు. ఇది వ్యక్త-అవ్యక్త-స్పష్ట-అస్పష్ట స్వరూపము కలది. ఈ వ్యక్తావ్యక్తతత్త్వము అవ్యక్తత్త్వములో లయమునందును. ఆ అవ్యక్తమే అక్షరము - నాశము లేనిది-నిత్యము-సర్వవ్యాపియై యుండును. అదియు సర్వభూతాత్మకుడగు పరమాత్మయొక్క అంశ##మే. సత్తామాత్ర- జ్ఞానమాత్ర-సత్‌-చిత్‌-రూపుడును అన్నితత్త్వములకంటె గొప్పవాడును అగు ఆపరమాత్మునందే ఈ ప్రాపంచిక వ్యవహారమునకు సంబంధించిన నామము-జాతి- మొదలగు కల్పనలన్నియు లయము పొందును. ఆ తత్త్వమే బ్రహ్మము-పరంధామము పరమాత్మ - పరమేశ్వరుడు విష్ణువు అనబడును. అతనిని చేరినవారు మరల జన్మలోనికిరారు. వ్యక్తా వ్యక్త స్వరూపయగు ప్రకృతియు అవ్యక్తరూపుడు అక్షరుడును - పురుషుడును ఈ రెండును పరమాత్మయందు లయ మగును. అయనయే అన్నితత్త్వములకును అశ్రయమగుచోటు. అతడు విష్ణువను పేరుతో వేదముల-వేదాంతముల-యందు గానము చేయబడుచున్నాడు. వేదోక్తమగు కర్మలు ప్రవృత్తి ప్రధానములు నివృత్తిప్రధానములు అని రెండు విధములు. ఋగ్యజుః సామవేదానుసారియగు మార్గమున యజ్ఞేశ్వరుడుగా యజ్ఞపురుషుడుగా పరమాత్మనారాధించుట ప్రవృత్తి మార్గము. జ్ఞానమూర్తి - చిద్రూపుడు - అగు ఆయనను జ్ఞానయోగమున ఉపాసించుట నివృత్తి మార్గము. ఆయన తత్త్వము వాక్కులకు అందరానిది. ద్విపరార్ధపరిమితిగల కాలము విష్ణువునకు ఒక పగలు - అంతే ఆయనకు రాత్రి పరిమాణమును. ఇదికూడ లోకసామ్యమునుబట్టి చెప్పుటయేకాని ఆపరమాత్మునకు పగలును రాత్రియు అనునవి లేవు. ఓ ఋషులారా! ఈ చెప్పినది ప్రాకృతలయస్వరూపము.

ఇది శ్రీమహాపురాణమున ఆదిబ్రాహ్మమున వ్యాసఋషి సంవాదమున ప్రాకృతలయ నిరూపణము అను రెండువందల ముప్పదిమూడవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters