Brahmapuranamu    Chapters   

అథ త్రింశదధికద్విశతతమో7ధ్యాయః

వ్యాసమునిసంవాదే మహాప్రళయవర్ణనమ్‌

మునయ ఊచుః

అస్మాభి స్తు శ్రుతం వ్యాస యత్త్వయా సముదాహృతమ్‌ ప్రాదుర్భా నాశ్రితం పుణ్యం మాయా విష్ణోశ్చ దుర్విదా || 1

శ్రోతుమిచ్ఛామహే త్వత్తో యథావ దుపసంహృతిమ్‌ | మహాప్రళయ సంజ్ఞాం చ కల్పాంతే చ మహామునే || 2

ఓ వ్యాసా! ఎఱుగశక్యము కాని విష్ణుమాయా తత్త్వము నీవలన వింటిమి. కల్పాంతమున జరుగు మహాప్రళయమున సృష్ట్యువ సంహారమును వినగోరుచున్నాము. అని మునులు వ్యాసునడిగిరి.

వ్యాస ఉవాచ

శ్రూయతాం బో మునిశ్రేష్ఠా యథావ దనుసంహృతి | కల్పాంతే ప్రాకృతే చైవ ప్రళ##యే జాయతే యథా || 3

అహోరాత్రం పితౄణాం తు మాసోబ్దం త్రిదివౌకసామ్‌ | చతుర్యుగనహన్రంతు బ్రహ్మణోహర్ద్విజోత్తమాః || 4

కృతం త్రేతా ద్వాపరం చ కలి శ్చేతి చతుర్యుగమ్‌ | దేవైర్వర్షసహసై#్ర స్తు త ద్ద్వాదశభి రుచ్యతేః 5

చతుర్యుగ ణ్యశేషాణి పదృశాని స్వరూపతః | ఆద్యం కృతయుగం ప్రోక్తం మునయోంత్యంతథా కలిమ్‌ || 6

ఆద్యే కృతయుగే నర్గో బ్రహ్మణా క్రియతే యతః | క్రియతే చోపసంహార స్తథాంతేపి కలౌ యుగే || 7

ప్రాకృతప్రళయమున సృష్ట్యుప సంహారము జరుగు విధము వినుడు. మానవుల మాసము పితరులకునను నంవత్సరము దేవతలకును ఒక ఆహోరాత్రముగును. కృతము త్రేతాద్వాపరముకలి అను చతుర్యుగము బ్రహ్మకు ఒక పగలు. ఇది దేవతల పండ్రెండువేల సంవత్సరములకు సమానము, కల్పాదియందలి కృతయుగమున సృష్టియు కల్పాంతము నందలి కలియుగమున ఉపసంహారము-ప్రళయమును జరగును.

మునయ ఊచుః

కలేః స్వరూపం భగ న్విన్తరా ద్వక్తు మర్హసి | ధర్మశ్చతుష్పాద్బగవా న్యస్మి న్వైకల్యమృచ్ఛతి || 8

ధర్మము నాలుగుపాదములతోనడువక వైకల్యమునొందు కలియుగస్వరూపము వినగోరెదమని మునులనిరి.

వ్యాసఉవాచ

కలిస్వరూపం భో విప్రా య త్పృచ్ఛద్ధం మమానఘాః | నిబోధధ్వం సమాసేన వర్తతే య న్మహత్తరమ్‌ || 9

వర్ణాశ్రమాచరవతీ ప్రవృత్తి ర్న కలౌ నృణామ్‌ | న సమఋగ్వజుర్వేద వినిష్పాదన హైతుకీ || 10

వివాహా న కలౌ ధర్మా న శిష్యా గురుసంస్థితాః | న పుత్రా ధార్మికాశ్చైవ న చ వహ్నిక్రియాక్రమః || 11

యత్రతత్రకులే జాతో బలీ సర్వేశ్వరః కలౌ | సర్వేభ్య ఏవర్ణేభ్యో నరాః కన్యోపిజీవినః || 12

యేన తేనైవ యోగేన ద్విజాతి ర్దీక్షతః కలౌ | యైవ సైవ చ విప్రేంద్రాః ప్రాయశ్చిత్తక్రియా కలౌ || 13

సర్వమేవ కలౌ శాస్త్రం యస్య య ద్వచనం ద్విజాః | దేవతాశ్చ కలౌ సర్వాః సర్వః ప్రర్వస్య చా ೭೭శ్రమః || 14

ఉపవాస స్తథా೭೭యాసో విత్తోత్సర్గ స్తథా కలౌ | ధర్మో యథాభిరుచితై రనుష్ఠానై రనుష్ఠితః || 15

విత్తేన భవితా పుంసాం స్వల్పే నైవ మదః కలౌ | స్త్రీణాం రూపమదశ్చైవ కేశై రేవ భవిష్యతి || 16

సువర్ణమణిరత్నాదౌ వస్త్రే చాపక్షయం గతే | కలౌ స్త్రియో భవిష్యంతి తదా కేశై రలంకృతాః || 17

పరిత్యక్ష్యంతి భర్తారం విత్తహీనం తథా స్త్రియః | భర్తా భవిష్యతి కలౌ విత్తవా నేవ యోషితామ్‌ || 18

యో యో దదాతి బహుళం స స స్మామీ తదా నృణామ్‌ | స్మామిత్వహేతు సంబంధో భవితా భజన స్తదా || 19

గృహాంతా ద్రవ్యసంఘాతా ద్రవ్యాంతా తథా మతిః | అర్థా శ్చా థోపభోగాంతా భవిష్యంతి తదా కలౌ || 20

కలియుగమున నరులు ఋగ్యజుః సామవేదములుప్రమాణముగా వర్ణాశ్రమాచారధర్మములయందు ప్రవర్తించరు. వివాహములు ధర్మములు ఉండవు. శిష్యులు గురువులనాదరించరు. పుత్రులు తమ ధర్మమును పాటించరు. అగ్నిహోత్రాది క్రియలు ఉండవు. ఏకులమున పుట్టినవాడైనను బలమున్నచో సర్వేశ్వరుడైపాలకుడగును. అన్ని వర్ణములందును జనులు తమ కుమార్తెలమూలమున ధనమార్జింతురు. విప్రులు తమకుతోచిన ఏదోయొక విధానమున యాగదీక్షను వహింతురు. తమకుతోచిన విధానమున ప్రాయశ్చిత్తములు చేయుదురు. ఎవరుఏదిచెప్పిన అదేశాస్త్రము. అందరును అందరకును దేవతలే. అందరకును అన్నియు బ్రహ్మచర్యాది ఆశ్రమములే. తమకు ఏది ఇష్టమై అనుష్ఠించినచో వారికి అదియే ఉపవాసము. అదేతపస్సు అదేదానము. కొంచెము ధనమన్నను మదము ఎచ్చును. బంగారమణులు రత్నములు అన్నియు నశించగా స్త్రీలకు కేశములే అలంకారమునకు సౌందర్యమునకు కారణమైయుండును. స్త్రీలు ధనవంతునే భర్తగా గ్రహింతురు. ధనహీనుడగు భర్తను వదలుదురు. సేవకులు తమకు ఎక్కువధనముఇచ్చిన వానినే యజమానునిగా గ్రహింతురు. తనమునకు గృహములే ప్రధానోపయోగము - తెలివియున్నందులకు ధనమూర్జించుటయే ప్రధానోపయోగము - అస్తియున్నందులకు సుఖములే ప్రధానోపయోగము. అని కలియుగజనులు భావింతురు. స్త్రియః కలౌ భవిష్యంతి న్వైరిణ్యో లలితస్వృహాః | అన్యాయా వాప్తవిత్తేషు పురుషేషు స్పృహాళవః || 21

అభ్యర్థితోపి సుహృదా స్వార్థహానిం తు మానవః | పణస్యార్ధార్ధమాత్రేపి కరిష్యంతి తదా ద్విజాః || 22

సదాసపౌరుషం చేతో భావి విప్ర తదా కలౌ | క్షీరప్రదాన సంబంధి భాతి గోషు చ గౌరవమ్‌ || 23

అనావృష్టిభయా త్ర్పాయః ప్రజాః క్షుద్బయకాతరాః | భవిష్యంతి తదా సర్వా గగనాస క్తదృష్టయః || 24

మూలవర్ణ ఫలాహారా స్తాపసా ఇవ మానవాః | ఆత్మానాం ఘాతయిష్యంతి తదా 7

వృష్ట్యాభిదుఃఖితాః || 25

దుర్భిక్ష మేవ సతతం సదా క్లేశ మనీశ్వరాః | ప్రాప్స్యంతి వ్యాహతముఖం ప్రమదాన్మానవా కలౌ || 26

అస్నాత భోజినో నాగ్ని దేవతాతిథి పూజనమ్‌ | కరిష్యంతి కలౌ ప్రాప్తే న చ పిండోదక క్రియామ్‌ || 27

లోలుపా హ్రస్వ దేహాశ్చ బహ్వన్నాదనతత్పరాః | బహుప్రజా ల్పభాగ్యాశ్చ భవిష్యంతి కలౌ స్త్రియః || 28

ఉభాభ్యా మథ పాణిభ్యాం శిరఃకుండూయనం స్త్రియః | కుర్వత్యో గురు భర్తౄనా మాజ్ఞాం భేత్స్యం త్యనావృతాః || 29

స్వపోషణపరాః క్రుద్ధా దేహసంస్కార వర్జితాః | పరుషానృత భాషిణ్యో భవిష్యంతి కలౌ స్త్రియః || 30

దుఃశీలా దుష్టశీలేషు కుర్వంత్యః సతతం స్పృహామ్‌ | ఆసద్వృత్తా భవిష్యంతి పురుషేషు కులాంగనాః || 31

కలియుగమున స్త్రీలు స్వేచ్ఛాప్రవృత్తి-విలాసములయందు వాంఛ కలిగియుందురు. అన్యాయముగా ధనమార్జించినపురుషులను వాంఛింతురు. మిత్రులుకూడ ఎంత వేడినను మానవులు అల్పముగాకూడ తమ ధనమును వదలుటకు ఇష్టపడరు. మనస్సు ఎప్పుడును లౌకికమైన పురుషార్ఠములను సాధించుటయందేయుండును. పాలెక్కువగాఇచ్చుటనుబట్టి యేగోవులపై గౌరవము. జనులు తరచుగా అనావృష్టికి గుఱియై ఆకలిచే బాధనొందురు ఆకాశమువైపు వానకై చూచు చుందురు. వేళ్ళు పండ్లు ఆకులు తినుచు తమ్ముతాము చంపుకొని చుందురు. కఱువులతో పడరానిబాధలు పడుచు తట్టుకొనలేక సుఖములులేక ఉందురు. స్నానముచేయకయే ఆహారము తిందురు. అగ్నిని దేవతలను అంధులను పూజింతురు. పిండోదకాది పితృక్రియలు చేయరు. స్త్రీలు వివయసుఖవాంఛ చిన్నదేహము అధికాహారము తినుట ఎక్కువసంతానము తక్కువ భాగ్యము కలవారగుదురు. వారు రెండుచేతులతో తలగోకికొందురు. దేహమును నిండుగాకప్పుకొనకయుందురు. పెద్దలయొక్క భర్తయొక్క అజ్ఞమీరుదురు. తమపొట్ట నింపుకొనుచు కోపసలై దేహసంస్కారములేక అసత్యములు పరుషములు మాటాడుచుందురు. దుఃశీలము కలిగి దుఃశీలురగు పురుషులయందు ఆసక్తి దుష్ర్పవర్తనము కలిగియుందురు.

వేదాదానం కరిష్యంతి బాడవా శ్చ తథావ్రతాః | గృహస్థా శ్చ స హోష్యంతి న దాన్యం త్యుచితా న్యపి || 32

భ##వేయు ర్వన వాసా వై గ్రామ్యాహార పరిగ్రహాః | భిక్షవ శ్చాపి పుత్రా హి న్నేహ సంబంధయంత్రాకాః || 33

అరక్షితారొ హర్తారః శుల్కవ్యాజేన పార్థివాః | హారిణో జనవిత్తానాం సంప్రాప్తే చ కలౌయుగే || 34

యో యోశ్వరథనాగాఢ్యః స స రాజా భవిష్యతి | య శ్చ య శ్చాబలః సర్వః స స భృత్యః కలౌ యుగే || 35

వైశ్యాః కృషివణిజ్యాది సంత్యజ్య నిజకర్మ యత్‌ | శూద్రవృత్యా భవిష్యంతి కారుకర్మోప జీవినః || 36

భైక్ష్యవ్రతా స్తథా శూద్రాః ప్రప్రజ్యాలింగినోధమాః | పాఖండసంశ్రయాం వృత్తి మాశ్రయిష్యం త్యసంస్కృతాః || 37

దుర్భిక్షకరపీడాభి రతీవోపద్రుతా జనాః | గోధూమా న్నయవా న్నాద్యా న్దేశా న్యాన్యంతి దుఃఖితాః || 38

వేదమార్గే ప్రలీనే చ పాఖండాఢ్యే తతో జనే | అధర్మవృధ్యా లోకానా మల్పమాయు ర్బశిష్యతి || 39

అశాస్త్రవిహితం ఘోరం తప్యమానేషు వై తపః | నరేషు నృపదోషేణ బాలమృత్యు ర్భవిష్యతి || 40

భవిత్రీ యోషితాం సూతిః పంచషట్పప్తవార్షికీ | నవాష్టదశ వర్షాణాం మనుష్యాణాం తథా కలౌ || 41

పలితోద్గమ శ్చ భవితా తదా ద్వాదశ వార్షికః | న జీవిష్యతి వై కశ్చ త్కలౌ వర్షాణి వింశతిమ్‌ || 42

అల్ప ప్రజ్ఞా వృథాలింగా దుష్టాంతః కరణాఃకలౌ | యత స్తతో వినశ్యంతి కాలే నాల్పేన మానవాః || 43

యదా యదా హి పాఖండ వృత్తి రత్రోపలక్ష్యతే | తదా తదా కలే ర్వృద్ధి రనుమేయా విచక్షణౖః|| 44

బ్రాహ్మణులు ఉపవనయనములేక యే వేదాధ్యయనముచేయుదురు. గృహస్థులు హోమములు తగినట్లు దానములు చేయరు. యతులు అడవులలో నివసించుచు మొఱటైన ఆహారముతినుచు పుత్రాది స్వజనముపై ప్రీతి కలిగియుందురు. ప్రభువులు ప్రజలను కాపాడకపోగా పన్నులనుపేరుతో ప్రజల ధనమును హరించుచుందురు. అశ్వరథ గజములు ఉన్న వాడేరాజు; బలహీనుడే సేవకుడు. వైశ్యులుకృషి వాణిజ్యమువంటి తమ వృత్తలు విడిచి వడ్రంగము మొదలగుపనులతో శూద్రవృత్తితో జీవింతురు. శూద్రులు అధములై సంన్యాసివేషముతోనుండి ధర్మములు సంస్కారములులేక భిక్షావృత్తితో యతివలె జీవింతురు. జనులు కఱపువలన పన్నులవలన బాధలుపడలేక గోధుమలు యవలు ఆహారముగాతిసు దేశములకు పాఱిపోదురు. లోకమున వేదమార్గము నశించి అవైదిక ప్రవర్తనపెరిగి అధర్మమెక్కువై నందున జనులు అల్పాయువులగుదురు. శాస్త్ర విహితములుకాని ఘోరతపస్సులచేయు జనులను రాజు దండించకపోవుటచే రాజదోషమువలన వసివారు మరణింతురు. ఎనిమిది తొమ్మిది పది ఏండ్ల మగవారివలన ఐదాఱడేండ్ల స్త్రీలకు కాన్పులు అగును. పండ్రెండేండ్లకంటె పైబడి చాల తక్కువమంది జీవింతురు. తక్కువ తెలివి వ్యర్థముగా వేషముధరించుట దుష్టమగు అంతః కరణము కలిగి జనులు అల్పవయస్సుననే మరణింతురు.

ప్రారంభా శ్చా పసీదంతి యదా ధర్మకృతాం నృణామ్‌ | తదానుమేయం ప్రాధాన్యం కలే ర్విప్రా విచక్షణౖః || 45

యదా యదా న యజ్ఞానా మీశ్వరః పురోషోత్తమః | ఇజ్యతే పురుషై ర్యజ్ఞై స్తదా జ్ఞేయం కలే ర్బలమ్‌ || 46

న ప్రీతి ర్వేద వాదేషు పాఖండేషు యదా రతిః | కలే ర్వృద్ధి స్తదా ప్రాజ్ఞై రనుమేయా ద్విజోత్తమాః || 47

కలౌ జగత్పతిం విష్ణుం సర్వస్రష్టార మీశ్వరమ్‌ | నార్చయిష్యంతి భోవిప్రాః పాఖండోపహతా నరాః || 48

కిం దేవైః కిం ద్విజై ర్వేదైః కిం శౌచే నాంబుజ న్మ నా | ఇత్యేవం ప్రలపి ష్యంతి పాఖండోపహతానరాః || 49

అల్పవృష్టిశ్చ వర్జస్యః స్వల్పం సస్యఫలం తథా | ఫలం తథాల్పసారం చ విప్రాః ప్రాప్తే కలౌయుగే || 51

జానుప్రాయాణి వస్త్రాణి శమీప్రాయా మహీరుహాః | శూద్రప్రాయా స్తథా వర్నా భవిష్యంతి కలౌ యుగే || 52

అణుప్రాయాణి ధాన్యాని అజప్రాయం తథా పయః | భవిష్యతి కలౌ ప్రాప్త ఔశీరం చానులేపనమ్‌ || 53

శ్వశ్రూశ్వశురభూయిష్ఠా గురవశ్చ నృణాం కలౌ | శాలాద్యా హారిభార్యా శ్చ సుహృదో మునిసత్తమాః || 54

కస్య మాతా పితా కస్య యదా కర్మాత్మకః పుమాన్‌ | ఇతి చోదాహరిష్యంతి శ్వశు రానుగతా నరాః || 55

వాజ్మనః కాయజై ర్దోషై రభిభూతాః పునః పునః | నరాః పాపా న్యనుదినం కరిష్యం త్యల్పమేధసః || 56

విఃపత్యానా మశైచానాం నిర్‌హ్రీకాణాం తథా ద్విజాః | యద్య ద్దుఃఖాయ తత్పర్వం కలికాలౌ భవిష్యతి || 57

నిఃస్వాధ్యాయవషట్కారే స్వధాస్వాహా వివర్జితే | తదా ప్రవిరలో విప్రః కశ్చిల్లోకే భవిష్యతి || 58

త త్రాల్పే నైవ కాలేన పుణ్యస్కంధ మనుత్తమమ్‌ | కరోతి యః కృతయుగే క్రియతే తపసా హి యః || 59

వైదిక మార్గము ననుసరించి వారికి హాని కలిగినప్పడెల్ల అధర్మము పెరుగునని ఎఱుగవలెను. అప్పుడే కలి విజృంభించును. ధర్మము నాచరించువారి ప్రయత్నములు నెఱవేరకుండును. వేదవాదములందు ఆసక్తి తగ్గును. నరులు ఆవైదికుల ప్రభావమునకు లోబడుటచే సర్వస్రష్ట - సర్వేశ్వరుడగు విష్ణుని అర్చింపకుందురు. వేదములతోను బ్రాహ్మణులతోను దేవతలతోను నీటితో పవిత్రత సంపాదించుటతోను పనియేమి? అని పలుకుచుందురు. వానలు ఎక్కువగా కురియవు. పంటలు ఎక్కువగా పండవు. పండ్లలో సారమెక్కువగా ఉండదు. అణుప్రాయమగు ధాన్యము. మేకపాలకు ప్రాముఖ్యము. వట్టివేళ్ళ గంధము పూసికొనుట అధికమగును. నరులకు అత్తమామలే గురువులుగా మిత్త్రులేముని శ్రేష్ఠులుగా అగుదురు. నరులు మామగారలు చెప్పినది వినుచు మానవుడు తనపని తాను చేసికొనునపుడు ఎవరికి ఎవరు తండ్రి? ఎవరు తల్లి? ఎవరు కుమారుడు? అందురు. అల్పప్రజ్ఞ కలవారై వాజ్మనఃకాయిక దోషములకు వశులై అనుదినమును పాపముల చేయుచుందురు. సత్యము శౌచము సిగ్గు వీనిని విడిచినవారికి కలుగవలసిన దుఃఖములన్నియు కలిగి జనులు బాధలు పడుదురు. స్వాధ్యాయము స్వధాస్వాహవషట్కారములు లోపించును. సరియగు బ్రాహ్మణులు అరుదుగా నుందురు. కృతయుగమున దీర్ఘకాలము తపస్సుచేసి సాధించిన పుణ్యస్కంధమును కలియుగములో అల్పకాలములోనే సాధించికొందురు.

మునయ ఊచుః

కస్మి న్కాలేల్పకో ధర్మో దదాతి సుమహాఫలమ్‌ | పక్తు మర్హ న్యశేషేణ శ్రోతుం వాంఛా ప్రవర్తతేః 60

ఏకాలములో అల్పధర్మము నాచరించినను అధిక పుణ్యఫలము కలుగునో తెలుపుమని వ్యాసుని మునులండిగిరి.

వ్యాస ఉవాచ

ధన్యే కలౌ భ##వే ద్విప్రా స్త్వల్పక్లేశై ర్మహాఫలమ్‌ | తథా భ##వేతాం స్త్రీ శూద్రౌ ధన్యౌ చాన్య న్నిబోధతః || 61

యత్కృతే దశభి ర్వర్షై స్త్రేతాయాం హాయనేన తత్‌ | ద్వాపరే తచ్చ మానేన ఆహోరాత్రేణ తత్కలౌ || 62

తపసో బ్రహ్మచర్యస్య జపాదేశ్చ ఫలం ద్విజాః | ప్రాప్నోతి పురుష స్తేన కలౌ సాధ్వితి భాషితుమ్‌ || 63

ధ్యాయ స్కృతే యజ స్యజ్ఞై స్త్రేతాయాం ద్వాపరేర్చయన్‌ | యదాప్నోతి క తదాప్నోతిలౌ సంకీర్త్య కేశవమ్‌ || 64

ధర్మోత్కర్ష మతీ వాత్ర ప్రాప్నోతి పురుషః కలౌ | స్వల్పాయాసేన ధర్మజ్ఞా స్తేన తుష్టోన్మ్యహం కలౌ || 65

వ్రతచర్యాపరై ర్గ్రాహ్యా వేదాః పూర్వం ద్విజాతిభిః | తతస్తు ధర్మసంప్రాపై#్త ర్యష్టవ్యం విధివ ద్ధనైః || 66

వృథా కథా వృథా భోజ్యం పృథా స్వం చ ద్విజన్మనామ్‌ | పతనాయ తథా భావ్యం తైస్తు సంయతిభిః సహ || 67

అసమ్య క్కారణ దోషా న్తేషాం సర్వేషు వస్తుషు | భోజ్యపేయాదికం చైషాం నేచ్ఛాప్రాప్తికరం ద్విజాః || 68

సారతంత్ర్యా త్సమన్తేషు తేషాం కార్యేషు వైతతః | లోకా న్ల్కే శేన మహతా యజంతి వినయాన్వితాః || 69

ద్విజశుశ్రూషణ నైవ పాక యజ్ఞాధికారవాన్‌ | నిజం జయతి వైలోకం శూద్రో ధన్యతర స్తతః || 70

భక్ష్యాభ##క్ష్యేషు నాత్రా స్తి యేషాం పాపేషు వాయతః | నియయో మునిశార్దూలా స్తేనాసౌ సాధ్వి తీరితమ్‌ || 71

స్వధర్మ స్యావిరోధేన సరై ర్లభ్యం ధనం సదా | ప్రతిపాదనీయం పాత్రేషు యష్టవ్యం చ యథావిధి || 72

తస్యార్జనే మహా న్ల్కేశః పాలనేచ ద్విజో త్తమాః | తథా స ద్వినియోగాయ విజ్ఞేయం గహనం నృణామ్‌ || 73

ఏభి రన్యై స్తథా క్లేశై ః పురుషా ద్విజసత్తమాః | నిజాంజయంతి వై లోకా న్ర్పాజాపత్యాదికా న్క్రమాత్‌ || 74

యోషి చ్ఛుశ్రూషణా ద్భర్తుః కర్మణా మనసా గిరా | ఏత ద్విషయ మాప్నోతి త త్సాలోక్యంయతోద్విజాః || 75

నాతిక్లేశేన మహతా తా నేవ పురుషో యథా | తృతీయం వ్యాహృతం తేన మయా సాధ్వితి యోషితః || 76

ఏత ద్వః కథితం విప్రా య న్నిమిత్త మిహా೭೭గతాః |

త త్పృచ్ఛధ్వం యథాకామ మహం వక్ష్యామి వః స్ఫుటమ్‌ || 77

అల్పే నైవ ప్రయత్నేన ధర్మః సిధ్యతి వై కలౌ | నరై రాత్మగుణాంభోభిః క్షాళి తాఖిల కిల్చిషైః || 78

శూద్రై శ్చ ద్విజశుశ్రూషా తత్పరై ర్ముని సత్తమాః | తథా స్త్రీభి రనాయాసా త్పతిశుశ్రూష యైవ హి || 79

తత స్త్రితయ మప్యేత న్మమ ధన్యతమం మతమ్‌ | ధర్మ సంరాధనే క్లేశో ద్విజాతీనాం కృతాదిషు || 80

తథా స్వల్పేన తపసా సిద్ధిం యాస్యంతి మానవాః | ధన్యా ధర్మం చరిష్యంతి యుగాంతే మునిసత్తమాః || 81

భవద్భి ర్య దభిప్రేతం త దేత త్కథితం మయా | ఆవృష్టే నాపి ధర్మజ్ఞాః కిమస్య త్ర్కియతాం ద్విజాః || 82

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే వ్యాసర్షి సంవాదే భవిష్య కథనంనామ త్రింశ దధిక ద్విశతతమోధ్యాయః.

ఓ విప్రులారా! ధన్యమగు అల్పక్లేశముతో తపస్సు చేసినను మహాఫలము లభించును. ఈ విషయములో స్త్రీలును శూద్రులును మఱియు ధన్యులు. కృతయుగమున పండ్రెండేండ్లు తపస్సు చేయుటచే కలుగు ఫలితము త్రేతాయుగమున ఒక సంవత్సరము ద్వాపరమున ఒక మాసము కలిలొ ఒక అహోరాత్రముతోనే కలుగును. తపస్సు బ్రహ్మచర్యము జపము మొదలగువాని ఫలము కలియుగములో ఇట్లు నరుడు అల్పశ్రమముతేనే పొందగలడు. అంతేకాక కృతయుగమున ధ్యానముచేత త్రేతలో యజ్ఞములచేత ద్వాపరములో అర్చనముచేత కలుగు ఫలము కలియుగమున కేశవ సంకీర్తనముతోనే కలుగును. బ్రాహ్మణులు కలియుగమున ఉపనయనము చేసికొని వేదవ్రతము లనుష్ఠించుచు వేదాధ్యయనము చేయవలెను. తరువాత ధర్మానుసారముగ సంపాదించిన ధనముతో విధానము ననుసరించి యజ్ఞములు చేయవలెను. వ్యర్థముగా భాషించుట - భుజించుట - ధనమార్జించుట బ్రాహ్మణులు పతితులు అగుటకు హేతువగును. కనుక విప్రులు ఆయా విషయములలో నిగ్రహముకలిగి ఉండవలెను. వారు ఏ విషయముల నైనను సరిగా చేయకపోవుట దోషకరము. భోజ్యములను తినుట పానీయములను త్రావుటవలన ద్విజులకు కోరికలు నెరవేరవు. జనులును అట్టి బ్రాహ్మణులకు అధీనులై అన్ని కార్యములయందును ప్రవర్తించినచో వారు ఎంతో శ్రమకు ఓర్చి వినయవంతులై జనులచే ఆయా యజ్ఞాదులను చేయింతురు. శూద్రుడు బ్రాహ్మణులను సేవించుచున్నచో పాకయజ్ఞమునకు అధికరాము కలిగి తాను సాధింపదగిన ఉత్తమలోకములన సాధించుకొనును. త్రికరణములతో పతిసేవ చేయుటవలన స్త్రీలు తన భర్తతోపాటు అతడు పుణ్యములు చేసి సాధించిన లోకములకేగి సుఖింతురు.

ఓ బ్రామ్మణులారా ! మీరు ఏ విషయము తెలియగోరి ఇక్కడకు వచ్చితిరో అది తెలిపితిని. ఇంకను ఏమి కావలయునో అడుగుడు.

ఇది శ్రీ మహాపురాణమున ఆదిబ్రాహ్మమున వ్యాసఋసిసంవాదమున భవిష్యకథనము అను రెండువందలముప్పదవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters