Brahmapuranamu    Chapters   

అథ షడ్వింశత్యధికద్విశతతమో7ధ్యాయః

ముని-మహేశ్వక సంవాదే వాసుదేవమహియమర్ణనమ్‌

వ్యాసఉవాచ

శ్రుత్వైవం సా జగన్మాతా భర్తు ర్వచన మాదితః | హృష్టా బభూవ సుప్రీతా విస్మితా చ తదా ద్విజాః 1

యే తత్రా77స న్మునివరా స్త్రిపురారేః సమీపతః | తీర్థయాత్రా ప్రసంగేన గతా స్తస్మి న్గిరౌ ద్విజాః 2

తే7పి సంపూజ్య తం దేవం శూలపాణిం ప్రణమ్యచ | పప్రచ్ఛుః సంశయం చైవ లోకానాం హితకామ్యయా 3

శివప్రోక్తమైన జన్మరాహిత్యోపాయము

ఇట్లు పరమేశ్వరుడు చెప్పిన విషయము అంతయువిని జగన్మాత హర్షమును ప్రీతిని ఆశ్చర్యమును పొందెను. ఆసమయములో శిపుని సమీపమున ఉన్న మునివరులును తీర్థయాత్రాప్రసంగమున అచటికివచ్చి చేరియున్న ద్విజులును శివుని సంపూజించి నమస్కరించి లోకముల హితమునుకోరి తమకుగల సంశయమును ప్రశ్నించిరి.

మునయఊచుః

త్రిలోచన నమస్తే7స్తు దక్షక్రతువినాశన | పృచ్ఛామ స్త్వాం జగన్నాథ సంశయం హృది సంస్థితమ్‌ || 4

సంసారే7స్మిన్మహాఘోరే భైరవే లోమహర్షణ | భ్రమంతి సుచిరం కాలం పురుషాశ్చాల్పమేధసః 5

యేనోపాయేన ముచ్యంతే జన్మసంసార బంధనాత్‌ | బ్రూహి త చ్ఛ్రోతుమిచ్ఛామః పరం కౌతూహలం హి నః || 6

ఓత్రిలోచనా! దక్షయజ్ఞ వినాశనా! జగన్నాథా ! మాహృదయమందున్న సంశయమును అడుగుచున్నాము. మహాఘోరమయి భయంకరమయి గగుర్పాటుకలిగించు ఈసంసారములో అల్పప్రజ్ఞ కలవారగు మానవులు ఎంతో కాలము జన్మావృత్తి పొందుచున్నారు. వీరు జన్మసంసారముల బంధమునుండి విడుదల పొందు ఉపాయమును వినగోరుచున్నాము చెప్పుము.

మహేశ్వరఉవాచ

కర్మపాశ నిబద్ధానాం నరాణాం దుఃఖభాగినామ్‌ | నాన్యోపాయం ప్రపశ్యామి వాసుదేవా త్పరం ద్విజాః 7

యే పూజయంతి తం దేవం శంఖచక్ర గదాధరమ్‌ | వాజ్మసః కర్మభిః సమ్య క్తే యాంతి పరమాం గతిమ్‌ || 8

కిం తేషాం జీవితే నేహ పశువచ్ఛేష్టితేన చ | యేషాం న ప్రవణం చిత్తం వాసుదేవే జగన్మయే || 9

ఓబ్రాహ్మణులారా! కర్మపాశములచే బద్ధులయి దుఃఖములను అనుభవించుచున్న మానవులకు వాసుదేవుడు తప్ప వేరు ఉపాయములేదు. శంఖచక్ర గదాధరుడగు ఆదేవుని మనోవాక్కర్మలతో లెస్సగా పూజించువారు మోక్షమును పొందుదురు. జగద్రూపుడగు వాసుదేవుని వైపునకు మరలియుండని మనస్సు కలవారు పశువులవలెనే ఆహారనిద్రాది చేష్టలతో ఈలోకమున జీవించుటవలన ప్రయోజనము ఏమున్నది?

ఋషయఊచుః

పినాకి న్భగనేత్రఘ్న సర్వలోక నమస్కృత | మాహాత్మ్యం వాసుదేవస్య శ్రోతుమిచ్ఛామ శంకర|| 10

ఓపినాకధారీ! భగుడను ఆదిత్యుని నేత్రము పోగొట్టినవాడవు సర్వలోకముల నమస్కృతులనందుకొను వాడవు అగు శంకరా! వాసుదేవుని మాహాత్మ్యమును వినగోరుచున్నాము.

మహేశ్వరఉవాచ

పితామహా దపి వరః శాశ్వతః పురుషో హరిః | కృష్ణో జాంబూనదాభాసో వ్యభ్రే సూర్య ఇ వోదితః || 11

దశబాహు ర్మహాతేజా దేవతారినిషూదనః | శ్రీవత్సాంకో హృషీకేశః సర్వదైవత పూజకః 12

బ్రహ్మా త స్యోదరభవ స్త స్యాహం చ శిరోభవః | శిరోరుహేభ్యో జ్యోతీంషి రోమభ్యశ్చ సురాసురాః || 13

ఋషయో దేహసంభూతా స్తస్య లోకాశ్చ శాశ్వతాః | పితామహగృహం సాక్షా త్సర్వదేవగృహం చ సః || 14

సో7స్యాః పృథివ్యాః కృత్స్నాయాః స్రష్టా త్రిభువనేశ్వరః| సంహర్తా చైవ భూతానాం స్థావరస్య చరస్య చ || 15

స హి దేవదేవః సాక్షా ద్దేవనాథః పరంతపః | నర్వజ్ఞః సర్వసంస్రష్టా సర్వగః సర్వతోముఖః 16

న తస్మా త్పరమం భూతం త్రిషు లోకేషు కించన | సనాతనో మహాభాగో గోవింద ఇతి విశ్రుతః || 17

స సర్వా న్పార్థివా న్సంఖ్యే ఘాతయిష్యతి మానదః | సురకార్యార్థముత్పన్నో మానుష్యం వపురాస్థితః || 18

న హి దేవగణాః శక్తా స్త్రివిక్రమ వినాకృతాః | భువనే దేవకార్యాణి కర్తుం నాయకవర్జితాః || 19

నాయకః సర్వభూతానాం సర్వభూత నమస్కృతః | ఏతస్య దేవనాథస్య కార్యస్య చ పరస్య చ || 20

బ్రహ్మభూతస్య సతతం బ్రహ్మర్షి శరణస్య చ | బ్రహ్మావపతి నాభిస్థః శరీరే7హం చ సంస్థితః 21

సర్వాః సుఖం సంస్థితాశ్చ శరీరే తస్య దేవతాః | స దేవః పుండరీకాక్షః శ్రీగర్భః శ్రీసహోషితః || 22

శార్జఞ చక్రాయుధః ఖడ్గీ సర్వనాగరిపుధ్వజః | ఉత్తమేన సుశీలేన శౌచేన చ దమేన చ || 23

పరాక్రమేణ వీర్యేణ వపుషా దర్శనేన చ | ఆరోహణ ప్రమాణన వీర్యేణార్జవ సంపదా || 24

అనృశంస్యేన రూపేణ బలేన చ సమన్వితః | అసై#్త్రః సముదితః సర్వైర్దివ్యైరద్బుతదర్శనైః || 25

యోగమాయా పహస్రాక్షో విరూపాక్షో మహామనాః | వాచా మిత్ర జనశ్లాఘీ జ్ఞాతి బంధుజనప్రియః || 26

క్షమావాం శ్చా నహంవాదీ స దేవో బ్రహ్మదాయకః | భయహర్తా భయార్తానాం మిత్రానంద వివర్ధనః || 27

శరణ్యం సర్వభూతానాం దీనానాం పాలనే రతః | శ్రుతవానథ సంపన్నః సర్వభూత నమస్కృతః || 28

సమాశ్రితానా ముపకృ చ్ఛత్రూణాం భయకృత్తథా | నీతిజ్ఞో నీతిసంపన్నో బ్రహ్మవాదీ జితేంద్రియః || 29

బ్రహ్మకంటెను మేలగువాడు శాశ్వతుడగు పురుషుడు హరి. అతడే కృష్ణుడు. మేఘములులేని ఆకాశమున ఉదయించిన సూర్యునివలె బంగారు కాంతితో ప్రకాశించువాడు. పదిబాహువులు మహాతేజస్సుకలిగి రాక్షససంహారియయి శ్రీవత్సమను మచ్చతోకూడి విషయేంద్రియములకు అధిపతియై సర్వదేవతా సమూహమునకు ప్రభువగువాడు. అతని ఉదరమునుండి బ్రహ్మ శిరస్సునుండి నేను జన్మంచితిమి. శిరోజములనుండి జ్యోతిస్సులు రోమములనుండి దేవదానవులు దేహమునుండి ఋషులు శాశ్వతములగు లోకములు జనించినవి. అతడుసాక్షాత్‌ బ్రహ్మకునుసర్వలోకములకునుగృహము. ఈపృథివినిఅంతటిని సృష్టించువాడు-త్రిలోకములకు ఈశ్వరుడు-రక్షకుడు. చరాచరభూతముల సంహరించువాడు. తానే దేవతలకును దేవుడు-రక్షకుడు. పరుల తపింపజేయువాడు. సర్వజ్ఞుడు సర్వము సృష్టించువాడు అంతట ఉండువాడు. అన్నివైపులకు ముఖములు కలవాడు. మూడులోకములందును అతనికంటె మేలగుతత్త్వము ఏదియులేదు. సనాతనుడు-ఎల్లప్పుడు ఉండువాడు. మహాభాగుడు-గోవిందుడు-సర్వధర్మరక్షకుడు అని ప్రసిద్ధి కలవాడు. మహామానవంతుడగు ఆ వాసుదేవుడు దేవకార్యార్థమై మానవదేహము ధరించి యుద్ధమున రాజులనందఱను సంహరించును. ఈత్రివిక్రముడు లేనిదే ఈలోకమున దేవతలును తమ కార్యములను నెరవేర్చుకొనజాలరు. అతడు సర్వభూతముల నమస్కారముల నందుకొను సర్వభూతనాయకుడు. ఆతనికి నాయకులు ఎవరునులేరు. దేవతలకు రక్షకుడు కార్యజగద్రూపుడు పరబ్రహ్మతత్త్వరూపుడు బ్రహ్మర్షులను శరణ్యుడు అగు అతనినాభియందు బ్రహ్మ శరీరమునందు నేను అందఱుదేవతలును సుఖముగా ఉన్నాడు. ఆదేవుడు పద్మనేత్రుడు. లక్ష్మి తనగర్భమందున్నవాడు-లక్ష్మితో కూడియుండువాడు-శార్‌జ్గము చక్రము ఖడ్గము గరుడధ్వజము కలిగి ఉత్తమమగు సుశీలము శౌచము బహిరింద్రియ నిగ్రహము పరాక్రమము వీర్యము దేహసౌందర్యము చక్కని ఆకృతి ఎత్తుసరి ఋజుస్వభావసంపద సౌమ్యత రూపము బలము కలవాడు. ఆశ్చర్యకరమగు రూపములుకల సర్వదివ్యాస్త్రములుకలవాడు. యోగమాయచే వేయికన్నులు విరూపములగు కన్నులుకలవాడు. ఉన్నతమనస్సుకలవాడు. వాక్కుతో తన మిత్రజనులమెచ్చువాడు. జ్ఞాతులకును బంధుజనులకును ప్రియుడు. క్షమాగుణము కలవాడు. అహంకారములేనివాడు. బ్రహ్మత్వమును ఇచ్చువాడు. భయముచే భాధనొందువారి భయమును పోగొట్టువాడు. మిత్రుల ఆనందమును వృద్ధి చేయువాడు. సర్వభూతములకు శరణ్యుడు. దీనుల పాలించుటయందు ఆసక్తుడు. వేదశాస్త్రముల అధ్యయనము యోగ్యత కలవాడు. ఆశ్రితులకు రక్షకుడు. శత్రుభయంకరుడు. నీతితత్త్వమును ఎఱిగి ఆచరించువాడు. వేదవేదాంగతత్త్వము ప్రవచించువాడు. ఇంద్రియముల జయించినవాడు.

భవార్థమేవ దేవానాం బుద్ధ్యా పరమయా యుతః | ప్రాజాపత్యే శుభేమార్గే మానవే ధర్మసంస్కృతే || 30

సముత్పత్స్యతి గోవిందో మనో ర్వంశే మహాత్మనః| అంశో నామ మనోః పుత్రో హ్యంతర్ధామా తతః పరమ్‌ || 31

అంతర్ధామ్నో హవిర్ధామా ప్రజాపతి రవిందితః | ప్రాచీనబర్హి ర్భవితా హవిర్ధామ్నః సుతో ద్విజాః || 32

తస్య ప్రచేతఃప్రముఖా భవిష్యంతి దశా77త్మజాః | ప్రాచేతసస్తథా దక్షో భవితేహ ప్రజాపతిః 33

దాక్షాయణ్య స్తథా77దిత్యో మను రాదిత్యత స్తతః | మనోశ్చ వంశజ ఇలా సుద్యుమ్న శ్చ భవిష్యతి|| 34

బుధాత్ఫురూరవాశ్చాపి తస్మా దాయు ర్భవిష్యతి | నహుషో భవితా తస్మా ద్యయాతి స్తస్య చా77త్మజః || 35

యదు స్తస్మా న్మహాసత్త్వః క్రోష్టా తాస్మా ద్భవిష్యతి | క్రోష్టు శ్చైవ మహాన్పుత్రో వృజినీవా న్భవిష్యతి || 36

వృజినీవకశ్చ భవితా ఉషద్గు రపరాజితః | ఉషద్గోర్భవితా పుత్రః శూరశ్చిత్రరథ స్తథా|| 37

తస్య త్వవరజః పుత్రః శూరో నామ భవిష్యతి | తేషాం విఖ్యాత వీర్యాణాం చారిత్ర గుణశాలినామ్‌ || 38

యజ్వినాం చ విశుద్ధానాం వంశే బ్రాహ్మణ సత్తమాః| స శూరః క్షత్త్రియశ్రేష్ఠో మహావీర్యో మహాయశాః || 39

స్వవంశవిస్తారకరం జనయిష్యతి మానదమ్‌ | వసుదేవమితి ఖ్యాతం పుత్ర మానక దుందుభిమ్‌ || 40

తస్య పుత్ర శ్చతుర్బాహు ర్వాసుదేవో భవిష్యతి | దాతా బ్రాహ్మణ సత్కర్తా బ్రహ్మభూతో ద్విజప్రియః || 41

రాజ్ఞో బద్ధా న్స సర్వన్వై మోక్షయిష్యతి యాదవః | జరాసంధం తు రాజానాం నిర్జిత్య గిరిగహ్వరే || 42

సర్వపార్థివ రత్నాఢ్యో భవిష్యతి స వీర్యవాన్‌ | పృథివ్యా మ ప్రతిహతో వీర్యేణాపి భవిష్యతి || 43

విక్రమేణ చ సంపన్నః సర్వపార్థివ పార్థివః | శూరః సంహననో భూతో ద్వారకాయాం వస స్స్రభుః || 44

పాలయిష్యతి గాం దేవీం వి నిర్జిత్య సురాసురాన్‌ | తం భవంతః సమాసాద్య బ్రాహ్మణౖ రర్హణౖ ర్వరైః || 45

అర్చయంతు యథాన్యాయం బ్రహ్మాణమివశాశ్వతమ్‌ | యో హిం మాం ద్రష్టుమిచ్ఛేత బ్రహ్మాణం చ పితామహమ్‌

ద్రష్టవ్యస్తేన భగవా న్వాసుదేవః ప్రతాపవాన్‌ | దృష్టే తస్మిన్నహం దృష్టో న మే7త్రాస్తి విచారణా || 47

పితామహో వాసుదేవ ఇతి విత్త తపోధనాః స యస్య పుండరీకాక్షః ప్రీతియుక్తో భవిష్యతి || 48

తస్య దేవగణః ప్రీతో బ్రహ్మపూర్వో భవిష్యతి| య స్తుతం మానవో లోకే సంశ్రయిష్యతి కేశవమ్‌ || 49

తస్యకీర్తి ర్యశ శ్చైవ స్వర్గ శ్చైవ భవిష్యతి | ధర్మాణాం దేశికః సాక్షా ద్భవిష్యతి స ధర్మవాన్‌ || 50

ధర్మవిద్భిః స దేవేశో నమస్కార్యః సదా7చ్యుతః | ధర్మ ఏవ సదా హి స్యా దస్మి న్నభ్యర్చితే విభౌ|| 51

దేవతల మేలుకొఱకే ఆవాసుదేవుడు ఉత్తమ బుద్ధిశాలియై ధర్మముచే సంస్కరింపబడినను ప్రజాపతి యొక్క శుభమార్గమున మహాత్ముడగు మనువు వంశమున జన్మించును. మనువునకు అంశుడు అతనికి అంతర్ధాముడు అతనికి పూజ్యుడగు హవిర్ధాముడను ప్రజాపతి అతనికి ప్రాచీన బర్హిజనింతురు. అతనికి ప్రచేతనుడు మొదలగు పదిమంది కుమారులు పుట్టుదురు. వారిలో ప్రచేతసుని కుమారుడగు దక్షుడు ప్రజాపతి యగును. దక్షుని పుత్త్రికలు దాక్షాయణులను నక్షత్రములు. ఆదిత్యుని కుమారుడు వైవస్వతమనువు. ఈవైవస్వతమను వంశమున ఇల అనునామెయు సుద్యుమ్నుడును జన్మింతురు. ఇలాకుమారుడు బుధుడు. ఆతనికి పురూరవసుడు ఆతనికి ఆయువు అతనికి నహుషుడు అతనికి యయాతి అతనికి యదువు అతనికి మహాబలశాలియగు క్రోష్ట అతనికి వృజినీకాన్‌ అతనికి పరాజయమునే ఎఱుగనివీరుడగు ఉషంగుడు అతనికి శూరుడగ్గుచిత్రరథుడు అతనికి కడసారి కుమారుడుగా శూరుడనువాడు కలుగును. ప్రసిద్ధమగు వీర్యముకలిగి సత్ప్రవర్తనము సద్గుణములు కలిగి యజ్ఞముల నాచరించిన పవిత్రుల వంశమున జన్మించిన క్షత్రియశ్రేష్ఠుడు మహావీర్యము మహాయశస్సుకల ఆశూరుడను నతడు తన వంశమును విస్తరింపజేయువాడును అభిమానశాలియు వసుదేవుడని ప్రసిద్ధిపొందినవాడును ఆగు ఆనకదుందుభిని కుమారునిగా పొందును. అతనికి కుమారుడు చతుర్బాహుడగు వాసుదేవుడు. యదువంశసంజాతుడగు అతడు దాత-బ్రాహ్మణుల నాదరించువాడు-బ్రాహ్మణులకు ప్రీతిపాత్రుడు బ్రాహ్మణులయందు ప్రీతికలవాడు. గిరివజ్రమునందలి మగధరాజగు జరాసంధుని అతడు జయించి అతనిచే బద్ధులై యున్న రాజులను అందఱను విడిపించును. పృథివియందే తనకెదుఱులేని వీర్యవంతుడగు ఆవాసుదేవుడు-శ్రీకృష్ణుడు సమస్తరాజశ్రేష్ఠులచే ఆశ్రయింపబడును. సమస్తరాజులకు రాజై విక్రమము కలిగి శూరునకు ఉండదగిన దృడదేహనిర్మాణము కలిగి ఆప్రభువు ద్వారకయందు వసించుచు చెడుమనస్సుకలవారగు శత్రువుల జయించి భూదేవిని పాలించును. మీరు అతనిని ఆశ్రయించి బ్రాహ్మణులకు చేయదగిన మేలైనపూజలతో శాశ్వతుడగు పరబ్రహ్మమునువలె శాస్త్రన్యాయానుసారము అర్చింతురు. లోకపితామహుడగు బ్రహ్మను నన్నును దర్శింపగోరువారు ప్రతాపవంతుడును భగవానుడునగు వాసుదేవుని దర్శింపవలెను. అతనిని దర్శించుట నన్ను దర్శంచుటయే. అందుసందేహము లేదు. బ్రహ్మయు వాసుదేవుడే అని ఓతపోధనులారా! తెలిసికొనుడు. పుండరీకాక్షుడగు వాసుదేవకృష్ణునకు ఎవరిపై ప్రీతికలుగునో వారివిషయమున బ్రహ్మదిదేవతలందఱు ప్రీతులగుదురు. శ్రీకృష్ణుని ఆశ్రయించిన మానవునకు కీర్తియు స్వర్గమును లభించును. ధార్మికుడు అగువాసుదేవుడే ఇతరులకు సర్వధర్మములనుపదేశించువాడగును. ధర్మము ఎఱిగిన వారెల్లరును దేవతలకు ప్రభువు అచ్యుతుడు-తన్నాశ్రయించినవారిని అధోగతికి పోరీయనివాడు-అగు వాసుదేవుని నమస్కరింపవలెను. విభుడగు ఆశ్రీకష్ణుని ఆసక్తితో అర్చించినచో ధర్మమే లభించును.

స హి దేవో మహాతేజాః ప్రజాహితచికీర్షయా | ధర్మార్థం పురుషవ్యఘ్ర ఋషఙకోటీః ససర్జ చ || 52

తాః సృష్టా స్తేన విధినా పర్వతే గంధమాదనే | సనత్కుమారప్రముఖా స్తిష్ఠంతి తపసా 7న్వితాః || 53

తస్మా త్స వాగ్మీ ధర్మజ్ఞో నమస్యో ద్విజపుంగవాః | వందితో హి స వందేత మానితో మానయీత చ || 54

దృష్టః పశ్యేదహరహః సంశ్రితః ప్రతిసంశ్రయేత్‌ | అర్చిత శ్చార్చయే న్నిత్యం స దేవో ద్విజసత్తమాః || 55

ఏవం తస్యా నవద్యస్య విష్ణోర్వై పరమం తపః | ఆదిదేవస్య మహతః సజ్జనాచరితం సదా || 56

భువనే7భ్యర్చితో నిత్యం దేవై రపి సనాతనః | అభ##యే నానురూపేణ ప్రపద్య త మనువ్రతాః || 57

కర్మణా మనసా వాచా స నమస్యో ద్విజైః సదా| యత్నవద్భి రుపాస్థాయ ద్రష్టవ్యో దేవకీ సుతః || 58

ఏష వై విహితో మార్గో మయా వై మునిసత్తమాః | తం దృష్ట్వా సర్వదేవేశం దృష్టాః స్యుః సురసత్తమాః ||

మహావరాహం తం దేవం సర్వలోకపితామహమ్‌ | ఆహం చైవ నమస్యామి నిత్య మేవ జగత్పతిమ్‌ || 60

తత్ర చ త్రితయం దృష్టం భవిష్యతి న సంశయః | సమస్తా హి వయం దేవా స్తస్య దేహే వసామహే || 61

తసై#్యవ చాగ్రజో భ్రాతా సితాద్రినిచయ ప్రభః | హలీ బల ఇతి ఖ్యాతో భవిష్యతి ధరాధరః|| 62

త్రిశిరా స్తస్య దేవస్య దృష్టో7నంత ఇతి ప్రభోః | సువర్ణో యస్య వీర్యేణ కశ్యప స్యా77త్మజో బలీ|| 63

అంతం నైవాశకద్ద్రష్టుం దేవస్య పరమాత్మనః | స చ శేషో విచరతే పరమయా వై ముదా యుతః || 64

అంత ర్వసతి భోగేన పరిరభ్య వసుంధరామ్‌ | య ఏష విష్ణుః సో7నంతో భగవా న్వసుధాధరః || 65

యో రామః స హృషీకే శో7యుతః సర్వధరాధరః| తా వుభౌ పురుషవ్యాఫ్ర° దివ్యౌ దివ్యపరాక్రమౌ || 66

ద్రష్టవ్యౌ మాననీ¸° చ చక్రలాంగలధారిణౌ | ఏష వో7నుగ్రహఃప్రోక్తో మయా పుణ్య స్తపోధనాః ||

తద్భవంతో యదుశ్రేష్ఠం పూజయేయుః ప్రయత్నతః|| 67

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే ఋషిమహేశ్వరసంవాదే వాసుదేవమహిమవర్ణనంనామ షడ్వింశత్యధికద్విశతతమో7ధ్యాయః.

మహాతేజస్సు కలవాడును పురుషశ్రేష్ఠుడును అగు ఆ వాసుడేవుడు ప్రజల హితమును కోరి ధర్మమును ఉద్ధరించుటకై ఋషులను సృష్టించెను. సనత్కుమారుడు మొదలగు ఆ ఋషులు తపోవంతులై గంధమాదన పర్వతమున నున్నురు. అందువలన ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! ధర్మజ్ఞుడును ధర్మప్రవచన సామర్ద్యము కలవాడును అగు ఆవాసుదేవుని నమస్కరించినచో అతడును వారిని నమస్కరించును. అట్లే తన్నాదరించినవారిని తానాదరించును. తన్ను దర్శించినవారిని తాను దర్శించును. తన్నాశ్రయించినవారిని తానాశ్రయించును. తన్నర్చించినవారిని తానర్చించును. ఇట్లు మానవలోకమున సజ్జనులు దోషరహితుడు సద్గుణశాలి ఆదిదేవుడు పూజ్యుడునగు విష్ణుని విషయమున తపమాచరింతురు. సనాతనుడు-శాశ్వతుడు-అగు ఆదేవుని దేవతలును అర్చింతురు. తమకు తగిన అభయముతో-శరణాగతితో-ఆయనను అనుష్ఠించుచు ద్విజులు మొదలగువారు త్రికరణములతో నమస్కరించుచు యత్నపూర్వకముగా దర్శనము చేసికొనవలెను. ఓ మునిశ్రేష్ఠులారా! నేను వ్యవస్థచేసిన మార్గము ఇది. సర్వదేవులకు ఈశుడగు ఆ వాసుదేవుని దర్శించినచో సర్వదేవశ్రేష్ఠులను దర్శించినట్లే. మహావరాహరూపుడు సర్వలోకసృష్టికర్త జగములకు రక్షకుడు అగు ఆ వాసుదేవుని నేనును నిత్యము నమస్కరించుచుందును. నేను మొదలుగా సమస్త దేవతలును ఆయన దేహమున వసింతుము. కనుక ఆయన దర్శనముచే త్రిమూర్తుల దర్శనము జరుగును. ఆ వాసుదేవుని అన్న వెండికొండల కాంతి వంటి కాంతి కలిగి హలి-హలము ధరించినవాడు-బలుడు అని ప్రసిద్ధుడై భూమిని రక్షించును. అతడు సహస్ర శిరస్కుడగు శేషుడే. దేవుడును ప్రభువును పరమాత్మరూపుడు నగు అతని అంతమును కశ్యపుని కుమారుడును బలశాలయునగు గరుడుడును తన వీర్యముతో చూడజాలకపోవుటచే అతడు అనంతుడు అనబడెను. ఆ శేషుడే సంతోషముతో కూడి భూమ్యంతర్భాగమున భూమిని చుట్టుకొని తన పడగలతో భూమిని ధరించుచు చరించుచు వసించుచున్నాడు. ఆ విష్ణువే ఈ యనంతుడు. అట్లే సర్వధరాధరుడగు హృషీకేశుడగు వాసుదేవకృష్ణుడే ఈ బలరాముడు. ఈ పురుషశ్రేష్ఠు లిరువురును దివ్యులు దివ్య పరాక్రమము కలవారు. చక్రమును నాగలిని ధరించిన ఈ ఇరువురను మీరు నర్చించి పూజించవలెను. ఓ తపోధనులారా! మీకు నేను తెలుపుచున్న అనుగ్రహము ఇదియే. కనుక మీరు ప్రయత్నపూర్వకముగా ఆ యదుశ్రేష్ఠుని పూజించవలెను.

ఇది శ్రీ మహాపురాణమగు ఆది బ్రాహ్మామున ఋషి మహేశ్వరసంవాదమున రెండువందలిరువది ఆఱవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters