Brahmapuranamu    Chapters   

అథచతుర్వింశత్యధికద్విశతతమో7ధ్యాయః

ఉమా మహేశ్వర సంవాదే మానవానాముత్తమగతిప్రాప్తి వర్ణనమ్‌

ఉమోవాచ

భగవన్సర్వభూతేశ సురాసురనమస్కృత | ధర్మాధర్మే నృణాం దేవం బ్రూహి మే సంశయం విభో || 1

కర్మణా మనసా వాచా త్రివిధై ర్దేహినః సదా | బధ్యంతే బంధనైః కైర్వా ముచ్యంతే వాధ కథం వద || 2

కేన శీలేన వై దేవ కర్మణా కీదృశేన వా | సమాచారైర్గుణౖః కైర్వాః స్వర్గం యాంతీహమానవాః || 3

ధర్మనిరూపణము

పార్వతి ఇట్లు పలికెను.

సర్వప్రాణులకు ఈశుడవును దేవతలచేతను రాక్షసులచేతను నమస్కరింపబడు ఓ భగవాన్‌ ! శివా! మానవుల ధర్మాధర్మములను నాకు తెలిపి సంశయము తీర్చుము. మానవులు మానసికములు వాచికములు శారీరకములు అగు ఏత్రివిధకర్మ బంధములచే బంధింపబడుదురు? ఎట్లువిడుడల పొందుదురు? ఓదేవా ! ఏశీలముచే ఎటువంటి కర్మచే ఏఆచరణములచే గుణములచే వారు స్వర్గము పోందుదురు?

శివ ఉవాచ

దేవి ధర్మార్థ తత్త్వజ్ఞే ధర్మనిత్య ఉమే సదా | సర్వ ప్రాణహితఃప్రశ్నః శ్రూయతాం బుద్ది వర్ధనః || 4

సత్య ధర్మరతాః శాంతాః సర్వలింగ వివర్జతాః | నాధర్మేణ సధర్మేణ బధ్యంతే చిన్న సంశయాః || 5

ప్రళయోత్పత్తి తత్త్వజ్ఞాః సర్వజ్ఞాఃసర్వదర్శినః | వీతరాగా విముచ్యంతే పురుషాః కర్మ బంధనైః || 6

కర్మణా మనసా వాచా యే న హింసంతి కించన | యే న మజ్జంతి కిస్మింశ్చత్తే న బధ్నంతి కర్మభిః || 7

ప్రాణాతిపాతా ద్విరతాః శీలవంతో దయాన్వితాః | తుల్య ద్వేష్య ప్రియాదాంతాముచ్యంతే కర్మబంధనై ః || 8

సర్వభూతదయావంతో విశ్వాస్యాః సర్వజంతుషు | తక్త్యహింస్ర సమాచారా స్తే సరాః స్వర్గగామినః || 9

పరస్వనిర్మమావిత్యం పరదార వివర్జతాః | ధర్మలబ్ధార్థ భోక్తార స్తే నరాః స్వర్గగామినః || 10

మాతృవత్స్వసృవచ్చైవ నిత్యం దుహితృవచ్చయే| పరదారేషు వర్తంతే తే సరాః స్వర్గగామినః || 11

స్వదార నిరతాయే చ ఋతుకాలాభిగామినః | అగ్రామ్య సుఖభోగాశ్చ తే నరాః స్వర్గగామినః || 12

సైన్యాన్ని వృత్తాః సతతం సంతుష్టాః స్వధనేన చ | స్వభాగ్యాన్యుపజీవంతి తే నరాః స్వర్గగామినః || 13

పరదారేషు యే నిత్యం చారిత్రావృతలోచనాః | జితేంద్రియాః శీలపరాస్తే నరాః స్వర్గగామినః || 14

ఏష దైవకృతో మార్గః నేవితవ్యః సదా సరైః అకషాయ కృతశ్చైవ మార్గః సేవ్యః సదా బుధైః || 15

అవృథాపకృతశ్చైవ మార్గః సేవ్యః సదా బుధైః | దానకర్మతపోయుక్తః శీలశౌచదయాత్మకః ||

స్వర్గమార్గమభీష్సద్బిర్నసేవ్యస్త్వత ఉత్తరః || 16

శివుడు ఇట్లు పలికెను:

ధర్మతత్త్వమును ఎఱిగి నిరతము దానియందే ఉండు ఓదేవి! సర్వప్రాణులకు హితకరమై బుద్దినివృద్ది చేయు నీ ప్రశ్నమునకు సమాధానము చెప్పెదను. వినుము: సత్యధర్మములందు అసక్తులై శాంతులై అన్ని బాహ్యలక్షణములను వదలి సంశయ రహితులగు వారు బంధనములకు లోబడుదురు. అట్టివారు ప్రపంచోత్పత్తి ప్రళయముల తత్త్వముతెలిసి సర్వజ్ఞలై కోరికలు లేక కర్మబంధములనుండి ముక్తిపొందుదురు. త్రికరణములతో ఏ ప్రాణిని హింసించక దేనియందు అసక్తి నొందనివారు దయకలిగి ప్రాణిహింసచేయక సత్‌శీలము ప్రియాప్రియములయందు సమబుద్దికకలిగి సర్వప్రాణు లకు విశ్వసనీయులై ఇంద్రియనిగ్రహము కలిగినవారు కర్మలచే బంధింపబడరు. స్వర్గము ను పొందుదురు. ఇతరుల ధనముల యందు దారలయందు అసక్తిలేక వారిని తల్లిగా చెల్లెలుగా తలచుచు తన భార్యను ఋతుకాలమున మాత్రమే మొరటుసుఖమునకు కాక ధర్మమునకై కలియుచు ధర్మముచే ఆర్జించిన దానితో జీవించుచు తృప్తినొందంచు దొంగతనములేక సత్ర్పవర్తనము ఇంద్రి యజయము కలవారు స్వర్గము నొందుదురు. వ్యర్థముగా ఏ ప్రాణికి అపకారముచేయక మనస్సున మాలిన్యములేక దానము సత్కర్మము తపస్సుశీలము శుచిత్వము దయకలిగి జీవించు ఈ మార్గము దైవము నిర్ణయించినది. వివేకముకలిగి దీనినే మానవుడు అనుసరించ వలెను.

ఉమోవాచ

వాచా తు బధ్యతే యేన ముచ్యతే హ్యథవా పునః | తాని కర్మాణి భో దేవ వద భూతపతే7నఘ || 17

పూజ్యుడవగు దేవ! భూతపతీ ! బంధమునకు కాని ముక్తికి కాని హేతువులగు కర్మలను తెలపుము.

శివ ఉవాచ

ఆత్మహేతోః పరార్థే వా ఆధర్మాశ్రిత మేవ చ | యే మృషా న వదంతీహ తే నరాః స్వర్గగామినః || 18

వృత్త్యర్థం ధర్మహేతోర్వా కామకారాత్తథైవచ | అనృతం యే న భాషంతే తే నరాః స్వర్గగామినః || 19

శ్లక్షాం వాణీం స్వచ్చవర్ణాం మధురాం పాపవర్జితామ్‌ | స్వగతేనాభి భాషంతే తేనరాః స్వర్గగామినః || 20

పరుషం యే న భాషంతే కటుకం నిష్టురం తథా | నపైశున్యరతాః సంతస్తే నరాః స్వర్గగామినః || 21

పిశునం న ప్రభాషంతే మిత్రభేదకరం తథా | పరపీడాకరం చైవ తే నరాః స్వర్గగామినః || 22

యే వర్జయంతి పరుషం పరద్రోహం చ మానవాః | సర్వభూత సమాదాంతస్తే సరాః స్వర్గగామినః || 23

శఠప్రలాపా ద్విరతా విరుద్ద పరివర్జకాః | సౌమ్య ప్రలాపినో నిత్యం తే నరాః స్వర్గగామినః || 24

న కోపాద్వ్యాహరంతే వాచం హృదయ దారిణీమ్‌ | శాంతిం విందతి యే క్రుద్దా స్తే నరాః స్వర్గగామినః || 25

ఏష వాణీకృతో దేవి ధర్మః సేవ్యః సదా నరైః శుభసత్యక గుణౖర్నిత్యం వర్జనీయ మృషా బుధైః || 26

తన కొఱకేకాని పరులకొఱకేకాని జీవనమునకేకాని ధర్మమునకైకాని తన స్వేచ్ఛచేకాని అసత్యము పలుకరాదు. పరుషము కటువు నిష్టురము కొండెములు మిత్రభేదము కలిగించునది ఇతరులకు బాధ ద్రోహమును కలిగించునది అగుమాట పలుకక మృదువై స్వచ్చవర్ణములు కలిగి పాపములేక తీయనైన పలుకులు అంతఃకరణశుద్దిగా కోపము లేక మనోహరముగా పలుకువారు స్వర్గమును పొందుదురు. వాచికమగు ధర్మస్వరూపము ఇది.

ఉమోవాచ

మనసా బధ్యతే యేన కర్మణా పురుష సదా | తన్మే బ్రూహి మహాభాగ దేవదేవ పినాకధృక్‌ || 27

ఓమహాభాగా!దేవదేవా!పినాక ధారీ! పురుషుని బంధించు మానసిక కర్మలను తెలుపుము.

మహేశ్వర ఉవాచ

మానసేనేహ ధర్మేణ సంయుక్తాః పురుషాః సదా | స్వర్గం గచ్ఛంతి కల్యాణి తన్మే కీర్తయతః శృణు || 28

దుష్ప్రణీతేన మనసా దుష్ప్రణీతాంతరాకృతిః | నరో బధ్యేత యేనేహ శృణు వా తం శుభాననే || 29

అరణ్య విజనే న్యస్తం పరస్వం దృశ్యతే యదా | మనసా7పి న గృహ్ణంతి తే నరాః స్వర్గగామినః || 30

తథైవ పరదారాన్యే కామవృత్తా రహోగతాః | మనసా7పి న హింసంతి తే నరాః

స్వర్గగామినః || 31

శత్రుం మిత్రం చ యే నిత్యం తుల్యేన మనసా నరాః | భజంతి మైత్రం సంగమ్య తే నరాః స్వర్గగామినః || 32

శ్రుతవంతో దయావంతః శుచయః సత్యసంగరాః | సై#్వరర్థైః పరిసంతుష్టా స్తే నరాః స్వర్గగామినః || 33

అవైరా యే త్వనాయాసా మైత్ర చిత్తరతాః సదా | సర్వభూతదయావంత స్తే నరాః స్వర్గగామినః || 34

జ్ఞాతవంతః క్రియావంత| క్షమావంతః సుహృత్ప్రియాః | ధర్మాధర్మవిదో నిత్యం తే నరాః స్వర్గగామినః || 35

శుభనా మశుభానాం చ కర్మణాం ఫలసంచయే | నిరాకాంక్షాశ్చ యే దేవి తే నరాః స్వర్గగామినః || 36

పాపోపేతా న్వర్జయంతి దేవద్విజపరాః సదా | సముత్థాన మనుప్రాప్తా స్తే నరాః స్వర్గగామినః || 37

శుభైః కర్మఫలైర్దేవి మయైతే పరికీర్తితాః | స్వర్గమార్గ పరా భూయః కిం త్వం శ్రోతుమిహేచ్ఛసి || 38

మానవుని స్వర్గలోకగతికి సాధనమగు మానసిక ధర్మములు చెప్పెదను వినుము. అతడు మనస్సును చెడుదానినిగా చేసిన కర్మచే బద్ధుడగును. అరణ్యమున నిర్జనప్రదేశమున పరధనము కనబడినను గ్రహించతలచక ఏకాంతమున లభించినను పరదారల కోరక - శత్రులను మిత్రులను సమముగా మైత్రితో చూచుచు వేదశాస్త్రాధ్య యనము దయ శౌచము సత్యముకలిగి తమ ధనముతో తృప్తులై ఏప్రాణియందు దయయేకాని వైరము లేనివారు స్వర్గమును పొందుదురు. జ్ఞానము సత్కర్మలు ఓర్పు మంచిమనస్సు కలవారిపై ప్రీతి ధర్మాధర్మ జ్ఞానము కలిగి తామాచరించు శుభ-అశుభ- కర్మలలో వేనియొక్క ఫలమునందును కోరికలులేక జీవించువారు స్వర్గము నొందుదురు. ఈచెప్పిన మానసిక పాపములను విడిచి దేవబ్రాహ్మణభక్తికలిగి నిత్యము సత్కర్మల యందు ప్రయత్నపరులయి యుండువారు స్వర్గము పొందుదురు. మానసిక సత్కర్మలు నీకు తెలిపితివి. మఱి ఏమి వినగోరెదవు?

ఉమోవాచ

మహాన్మే సంశయః కశ్చిన్మర్త్యాస్ప్రతి మహేశ్వర | తస్మాత్త్వం నిపుణనాద్య మమ వ్యాఖయాతుమర్హసి || 39

కేనా77యుర్లభ##తే దీర్ఘం కర్మణా పురుషః ప్రభో | తపసా వా7పి దేవేశ కేనా7యుర్లభ##తే మహత్‌ ః 40

క్షీణాయుః కేన భవతి కర్మణా భువి మానసః | విపాకం కర్మణాం దేవ వక్తుమర్హస్యనిందిత || 41

అపరే చ్చ మహాభాగ్యా మందభాగ్యా స్తథా పరే | ఆకులీనాః కులీనాశ్చ సంభవంతి తథా పరే || 42

దుర్దర్శాః కేచిదాభాంతి నరాః కాష్ఠమయాఇవ | ప్రియదర్శాస్తథా చాన్యే దర్శనాదేవ మానవాః || 43

దుష్ప్రజ్ఞాః కేచిదాభాంతి కేచిదాభాంతి పండితాః | మహాప్రజ్ఞా స్తథా చాన్యే జ్ఞాన విజ్ఞాన భావినః || 44

అల్పవాచా స్తథా కేచి న్మహావాచా స్తథా పరే | దృశ్యంతే పురుషా దేవ తతో వ్యాఖయా తుమర్హసి || 45

ఓమహేశ్వరా! మానవుల విషయమున నాకొక సంశయము కలదు. మీరు దానిని వివరించి తీర్చవలయును. ఏ కర్మచే ఏతపస్సుచే దీర్ఘాయువు లభించును? ఏకర్మచే ఆయువు క్షీణించును? కర్మవిపాకము ఎట్టిది? కొందఱు మహాభాగ్యముకలవారు మఱికొందరు మందభాగ్యులు అగుటకు కొందరు గొప్పకులమున మఱికొందరు తక్కువ కులమున పుట్టుటకు కొందఱు కొయ్యబొమ్మలవలె కురూపులు మఱికొందరు అందగాండ్రు కొందఱు. ప్రజ్ఞాహీనులు మఱికొందఱు మహాప్రజ్ఞకల పండితులు జ్ఞానవిజ్ఞానవం తులు కొందఱు అల్పవాక్కుకలవారు మఱికొందఱు గొప్పవాక్పాటవము కలవారు ఐ కనబడుటకు హేతువును తామునాకు వివరించవలయును.

శివఉవాచ

హంత తే7హం ప్రవక్ష్యామి దేవి కర్మఫలోదయమ్‌ | మర్త్యలోకే నరః సర్వో యేన స్వం ఫలమశ్నుతే || 46

ప్రాణాతి పాతీ యోగీంద్రో దండహస్తో నరః సదా | నిత్యముద్యతశస్త్రశ్చ హంతి భూతగణాన్నరః || 47

నిర్దయః సర్వభూతేభ్యో నిత్యముద్వేగకారకః | అపి కీటపతంగానా మశరణ్యః సునిర్ఘృణః || 48

ఏవంభూతో నరోదేవి నిరయం ప్రతిపద్యతే | విపరీతస్తు ధర్మాత్మా స్వరూపజేణాభిజాయతే || 49

నిరయం యాతి హింసాత్మా యాతి స్వర్గమహింసకః | యాతనాం నిరయే రౌద్రాం సకృచ్ఛ్రాం లభ##తే నరః || 50

యః కశ్చిన్నిర యాత్తస్మా త్సము త్తరతి కర్హిచిత్‌ | మానుష్యం లభ##తే వా7పి హీనాయుస్తత్ర జాయతే || 51

పాపేన కర్మణా దేవి యుక్తో హింసాదిభిర్యుతః|అహితం సర్వభూతానాం హీనాయురు పజాయతే || 52

శుభేన కర్మణా దేవి ప్రౌణిఘాతవివర్జితః | నిక్షిప్తశస్త్రో నిర్దండో న హింసతి కదాచన || 52

న ఘాత యతి నో హంతి ఘ్నంతం నై వానుమోదతే | సర్వభూతేషు సస్నేహో యథా77 త్మని తథా పరే || 54

ఈదృశః పురుషో నిత్యం దేవి దేవత్వమశ్నుతే | ఉపపన్నాన్సుఖాన్భోగాన్‌ సదా7శ్నాతి ముదాయుతః || 55

అథచేన్మానుషే లోకే కదాచిదుపపద్యతే | ఏష దీర్ఘాయుషాం మార్గః సువృత్తానాం సుకర్మణామ్‌ ||

ప్రాణిహింసావిమోక్షేణ బ్రహ్మణా సముదీరితః || 56

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే ఉమామహేశ్వర సంవాదే ధర్మనిరూపణం నామ

చతుర్వింశత్యధిక ద్విశతతమో7ధ్యాయః.

దేవీ! మర్త్యలోకమున ప్రతిమానవుడును తనకర్మకు తగినట్లు ఫలమును పొందువిధమును చెప్పెదనువినుము. యోగీంద్రుడే ఐనను ఎప్పుడును చేతిలోదండము ను ఆయుధములను ధరించి ప్రాణిసమూహముల ప్రాణముల హింసించుచు వాటిపై దయలేక వానికి భయమే కలిగించుచు కీటకములను పక్షులకు కూడ రక్షణనీయనివాడు నరకము పొందును. ఇట్టి ఏహింసను చేయనివాడు స్వర్గము పొందును. అట్టి ధర్మాత్ముడు స్వస్వరూపముతోనే ఉండును. హింసకుడునరకమున భయంకరము క్లేశ ములతో కూడినదియు అగు యాతనను పొంది ఎట్లోదానినుండి బయటపడిన తరువాత కూడ మానవుడై జన్మించినను క్షీణాయువగును. పాపకర్మలు చేయుచు ప్రాణులను హింసించుచు వానికి అహితుడగుటయే ఆయుఃక్షయమునకు హేతువు. శుభకర్మల ఆచరించుచు ఆయుధము ధరించక ఏప్రాణిని దండించక హింసించక ఏప్రాణిని తానై చంపక చంపింపక చంపువారిని అనుమోదించక తనయందు వలెనే ఇతర ప్రాణియందు భావము కలిగి ప్రాణులయందు స్నేహము కలనరుడు దేవత్వమును పొందును. సముచితములగు సుఖముంను అనుభవించి స్వర్గమున సంతోషమును పొందును. ఒకప్పుడు ఒట్టి వాడు మానవుడై జన్మించినను దీర్ఘాయుడగును. ప్రాణిహింసను విడుచుటయే దీర్ఘాయువును పొందుటకు మార్గమని బ్రహ్మ విధించెను.

ఇది శ్రీమహాపురాణమగు ఆదిబ్రహ్మమున ఉమామహేశ్వరసంవాదమున ధర్మనిరూపణ మను రెండువందల ఇరువదినాలుగవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters