Brahmapuranamu    Chapters   

అథత్రయోవింశత్యధిక ద్విశతతమో7ధ్యాయః

సంకరజాతి లక్షణ వర్ణనమ్‌

మునయ ఊచుః

సర్వజ్ఞస్త్వం మహాభాగ సర్వభూతహితే రతః |భూతం భవ్యం భవిష్యంచ న తే7 స్త్యవిదితం మునే || 1

కర్మణా కేన వర్ణానా మధమా జాయతే గతిః | ఉత్తమాచ భ##వేత్కేన బ్రూహి తేషాం మహామతే || 2

శూద్రస్తు కర్మణా కేన బ్రాహ్మణత్వం చ గచ్చతి | శ్రోతుమిచ్ఛా మహే కేన బ్రాహ్మణః శూద్రతామియాత్‌ || 3

వ్యాస ఉవాచ

హిమవచ్చిఖరే రమ్యే నానాధాతు విభూషితే నానాద్రుమలతాకీర్ణే నానాశ్చర్య సమన్వితే || 4

తత్ర స్థితం మహాదేవం త్రిపురఘ్నం త్రిలోచనమ్‌ | శైలరాజసుతా దేవీ ప్రణిపత్య సురేశ్వరమ్‌ || 5

ఇమం ప్రశ్నం పురా విప్రా అపృచ్చచ్చారు లోచనా | తదహం సంప్రవక్ష్యామి శృణుధ్వం మమ సత్తమాః || 6

ఉమోవాచ

భగవన్భగనేత్రఘ్న పూష్ణో దంతవినాశన | దక్షక్రతుహర త్ర్యక్షసంశయోమే మహానయమ్‌ || 7

చాతుర్వర్ణ్యం భగవతా పూర్వం సృష్టం స్వయం భువా | కేన కర్మవిపాకేనవైశ్యోగచ్ఛతి శూద్రతామ్‌ || 8

వైశ్యో వాక్షత్రియః కేన ద్విజో వాక్షత్రియో భ##వేత్‌ | ప్రతిలోమే కథం దేవ శక్యో ధర్మోనివర్తితుమ్‌ || 9

కేన వా కర్మణా విప్రః శూద్రయోనౌ ప్రజాయతే | క్షత్రియః శూద్రతామేతి కేన వాకర్మణా ప్రభో || 10

ఏతం మేసంశయం దేవ వద భూతపతే7నఘ | త్రయోవర్ణాః ప్రకృత్యేహ కథం బ్రాహ్మణ్య మాప్నుయుః || 11

మునులు మహానుభావ ! నీవు సర్వజ్ఞుడవు. మఱియు సర్వభూత హితాభిలాషినవి. భూతభవిష్యవర్తమానములు నీకు గరతలామలకములు. ఏకర్మచే నటచే వర్ణముల కధమ స్థితివచ్చును? ఉత్తమస్థితియుంగల్గు నానతిమ్ము. శూద్రుడే కర్మమాచరించి బ్రాహ్మణత్వ మందును. వినగోరెదమన వ్యాసభగవానులిట్లనిరి.

హిమగిరి శిఖరి మందాసీనుడైయున్న మహాదేవుం ద్రిలోచనుని శైలరాజతనయ మ్రొక్కియిట్లదేప్రశ్నమడిగినది. ఓ భగనేత్రనాశన! పూషదంతవినాశన! దక్షక్రతుహర ! బ్రహ్మమున్నుచాతుర్వర్ణ్యధర్మములనడిగెను. ఏకర్మవిపాకముచే బ్రాహ్మణాదులు క్షత్రియాది జన్మములందుదురు. ఈ అనులోమ విలోమ వర్ణసాంకర్యమెట్లు గలుగునో నాసంశయ వారింపుమన శివుండిట్లనియె.

శివ ఉవాచ

బ్రాహ్మణ్యందేవి దుష్ప్రాపం నిసర్గాద్ర్బాహ్మణః శుభే | క్షత్రియో వైశ్య శూద్రౌవా నిసర్గాదితి మే మతిః || 12

కర్మణా దుష్కృతేనేహ స్థానాద్ర్బశ్యతి సద్విజః | శ్రేష్టం వర్ణమనుప్రాప్య తస్మాదాక్షిప్య తేపునః || 13

స్థితో బ్రాహ్మణ ధర్మేణ బ్రహ్మణ్యముపజీపతి | క్షత్త్రియోవా7 థవై శ్యోవా బ్రహ్మభూయం సగచ్చతి || 14

యశ్చ విప్రత్వ ముత్సృజ్యక్షత్ర ధర్మాన్ని షేవతే | బ్రాహ్మణ్యాత్స పరిభ్రష్టః క్షత్త్రయోనౌ ప్రజాయతే || 15

వైశ్యకర్మ చ యో విప్రో లోభమోహవ్యపాశ్రయః | బ్రాహ్మణ్యం దుర్లభం ప్రాప్య కరోత్సల్పమతిః సదాః || 16

సద్విజో వైశ్యతామేతి వైశ్యో వా శూద్రతామియాత్‌ | స్వధర్మాత్ర్పచ్యుతో విప్రస్తతః శూద్రత్వమాప్నుయాత్‌ | 17

తత్రాసౌ నిరయం ప్రాప్తో వర్ణభ్రష్టో బహిష్కృతః | బహ్మలోకాత్ర్పరి భ్రష్టః శూద్రయోనౌ ప్రజాయతే || 18

క్షత్రియో వా మహాభాగే వైశ్యో వా ధర్మచారిణి | స్వాని కర్మాణ్యపాకృత్య శూద్రకర్మణిషేవతే || 19

స్వస్థానాత్స పరిభ్రష్టో వర్ణసంకరతాం గతః | బ్రాహ్మణః క్షత్త్రియో వైశ్యః శూద్రత్వం యాతి తాదృశః || 20

దేవి! బ్రాహ్మణ్యము దుర్లభము. బ్రహ్మణ క్షత్రియ వైశ్యశూద్రులుస్వభావముచేత నేర్పడిరని నాతలంపు. తరువాత దుష్కర్మమొనరించి సహజసిద్దమైన బ్రాహ్మణ్యము నుండి దిగజారును. బ్రాహ్మణుడు మొదలయినవారు తమ స్వధర్మమందుండిరేని బ్రాహ్మణ్యమును పరమావధిగ బడయుదురు. ఎవ్వడు విప్రధర్మము విడిచి క్షత్రియధర్మము నాచరించు నతడు విప్రత్వము గోల్పోయి క్షత్రియ యోనింజనించును. ఇట్లే వైశ్యాది వర్ణములందును స్వధర్మపరిత్యాగము చేసినవాడు జనించును. శూద్రత్వ ముదాక పతనమైన విప్రుడు బ్రహ్మలోక భ్రష్టుడై వర్ణసాంకర్యమందును.

యస్తు శూద్రః స్వధర్మేణ జ్ఞాన విజ్ఞానవాంఛుచిః | ధర్మజ్ఞో ధర్మనిరతః సధర్మపలమశ్నుతే || 21

ఇదం చైవాపరం దేవి బ్రహ్మణా సముదాహృతమ్‌ ఆధ్యాత్మం నైష్టికి సిద్ది ర్దర్మకామైర్నషేవ్యతే || 22

ఉగ్రాన్నం గర్హితం దేవి గణాణ్నం శ్రాద్ద సూతకమ్‌ |మూష్టాన్నం నైవ భోక్తవ్యం శూద్రాన్నం నై వవాక్వచిత్‌ || 23

శూద్రాన్నం గర్హితం దేవి సదా దేవై ర్మహాత్మభిః | పితామహా ముఖోత్స్పృష్టం ప్రమాణమితి మేమతిః || 24

శూద్రాన్నేనాశేషేణ జఠరే మ్రియతే ద్విజః | అహితాగ్ని స్తథా యజ్వా స శూద్రగతి భాగ్భవేత్‌ || 25

తేన శూద్రాన్న శేషేణ బ్రహ్మస్థానాదపాకృతః | బ్రాహ్మణః శూద్రతామేతి నాస్తితత్ర విచారణా || 26

యస్యాన్నేనావశేషేణ జఠరే మ్రియతే ద్విజః | తాంతాం యోనిం ప్రజేద్విప్రో యస్యాన్నము పజీవతి || 27

బ్రహ్మణత్వం సుఖం ప్రాప్య దుర్లభం యో7వమన్యతే | అభోజ్యాన్నాని వా7శ్నాతి సద్విజత్వాత్పతేత వైః || 28

సురాపో బ్రహ్మహా స్తేయీ చౌరౌ భగ్నవ్రతో7శుచిః | స్వాధ్యాయ వర్జితః పాపోలుబ్దో నైకృతికః శఠః || 29

అవ్రతీ వృషలీ భర్తా కుండాశీ సోమ విక్రయీ | విహీనసేవీ విప్రో హిపతతే బ్రహ్మయోనితః || 30

గురుతల్పీ గురుద్వేషీ గురుకుత్సారతిశ్చయః | బ్రహ్మద్విడ్వా7పి పతతి బ్రాహ్మణో బ్రహ్మయోనితః || 31

ఏభిస్తు కర్మభి ర్దేవి శుభై రాచరితై స్తథా | శూద్రో బ్రాహ్మణతాం గచ్చే ద్వైశ్యః క్షత్రియతాం వ్రజేత్‌ || 32

శూద్రః కర్మాణి సర్వాణి యథాన్యాయంయథావిధి | సర్వాతిథ్యముపాతిష్టన్‌ శేషాన్న కృత భోజనః || 33

శుశ్రూషాం పరిచర్యాం యో జ్యేష్ట వర్ణే ప్రయత్నతః | కుర్యాదవిమనాః శ్రేష్ఠః సతతం సత్పథే స్థితః || 34

దేవద్విజాతి సత్కర్తా సర్వాతిథ్య కృతవ్రతః | ఋతుకాలాభిగామి నియతో నియతాశనః || 35

దక్షః శిష్టజనాన్వేషీ శేషాన్న కృత భోజనః | వృథా మాంసం న భుంజీత శూద్రో వైశ్యత్వమృచ్చతి || 36

శూద్రుడు స్వధర్మముచే జ్ఞానవిజ్ఞానములనంది శుచియై ధర్మజ్ఞుడై ధర్మనిరత్తుడై స్వదర్మఫలమువడయును. అనగా క్రమముగ ఉన్నత వర్ణములందు జన్మించి బ్రహ్మత్వ సిద్దనిగూడ నందును. మున్ను బ్రహ్మాయుదాహరించిన అధ్యాత్మజ్ఞానము నిష్టాసిద్దిని ధర్మపరులెట్లు పొందుదురో యా విషయములివి. ఉగ్రాన్నము గణాన్నము శ్రాద్దాన్నము మైల అన్నము ముష్టాన్నము శూద్రాన్నము నెన్నడుం దినరాదు. ఇది బ్రహ్మముఖము నుండి వచ్చిన వాక్కుగాన (వేదము) పరమప్రమాణమని నా అభిప్రాయము.

శూద్రాన్నశేషము కడుపులోనుండగా చనిపోయిన ద్విజుడు అహితాగ్ని యజ్ఞ కర్తయు శూద్రడై పుట్టును. దానికి ప్రాయశ్చిత్తము గూడలేదు. ఏయేవర్ణములవారి యున్నము జఠరమందుండగా నెవ్వడు చనిపోవునో వాడు వాడా వర్ణములందు బుట్టును. అక్కడ విమర్శలేదు. దుర్లభ##మైన బ్రాహ్మణ జన్మమంది యభోజ్యాన్నములం దిన్నవాడో పతితుడై తీరునో బ్రాహ్మణుడు సురాపానము బ్రహ్మహత్య దొంగతనము వ్రతభంగము శౌచలపము స్వాధ్యాయలోపముసే లుబ్దుడైనైకృతికుడై శదుడై వ్రతదూరడై వృషలిని సంగమించి కుండాశనముసేసి సోమ మమ్మి నీచులసేవించి భ్రష్టుడగును. గురుతల్ప గుడు గురుద్వేషి గురువుల పరిహసించువాడు బ్రహ్మద్వేషి బ్రాహ్మణ్యపతితుడుగాను శూద్రుడు న్యాయముదప్పక యథావిధిగ స్వధర్మాచరణము సేసి అందరికిం దానతిథియై అందరిభుక్త శేషముందిన్నవాడు, వారికి శుశ్రూష పరిచర్య చేసినవాడు సన్మార్గమందు స్థిరుడైనవాడు దేవతల భూదేవులను బూజించినవాడు ఋతకాల స్త్రీసంగమము చేసిన వాడు నియతమయిన ఆహారముదిన్నవాడు.వృథా మాంసము తిననివాడు వైశ్యత్వముం బడయగలడు.

ఋతువాగనహం వాదీ నర్ద్వంద్వః | సామ కోవిదః | యజతే నిత్యయజ్ఞైశ్య స్వాధ్యాయ పరమః శుచిః || 37

దాంతో బ్రాహ్మణ సత్కర్తా సర్వవర్ణానసూయకః | గృహస్థ వ్రతమాతిష్టన్ద్వి కాలకృతభోజనః || 38

శేషాశీ విజితాహారో నిష్కామో నిరహంవదః | అగ్నిహోత్రముపాసీనో జుహ్వానశ్చ యథావిధి || 39

సర్వాతిథ్యముపాతిష్ఠన్‌ శేషాన్నకృత భోజనః | త్రేతాగ్ని మాత్రవిహితం వైశ్యో భవతి చ ద్విజః || 40

స వైశ్యః క్షత్రియకులే శుచిర్మహతి జాయతే | స వైశ్యః క్షత్రియోజాతో జన్మ ప్రభృతి సంస్కృతః || 41

ఉపనీతో వ్రతపరో ద్విజో భవతి సంస్కృతః | దదాతి యజతో యజ్ఞైః సమృద్దైరాప్త దక్షిణౖః || 42

అధీత్య స్వర్గమన్విచ్ఛం స్త్రేతాగ్నిశరణః సదా | అర్ద్రహస్తప్రదో నిత్యం ప్రజాధర్మేణ పాలయన్‌ || 43

సత్యః సత్యాని కురుతే నిత్యం యః శుద్దిదర్శనః | ధర్మదండేన నిర్దగ్దో ధర్మ కామార్థసాదకః || 44

యంత్రితః కార్యకరణౖః | షడ్భాగ కృతరక్షణః | గ్రామ్యధర్మాన్న సేవేత స్వచ్చందే నార్థకోవిదః || 45

ఋతుకాలే తు ధర్మాత్మా పత్నీ ముపాశ్రయేత్సదా | సదోపవాసీ నియతః స్వాధ్యాయ నిరతః శుచిః || 46

వహిష్కాంతరితేనిత్యం శయానో7స్తిసదాగృహే | సర్వాతిథ్యం త్రివర్ణస్యకుర్వాణః సమనాః సదా || 47

శూద్రాణాం చాన్నకామానాం నిత్యం సిద్దమితి బ్రువన్‌ | స్వార్థాద్వా యదివా కామాన్న కించిదుపలక్షయేత్‌ || 48

పీవృదేవాతిథికృతే సాధనం కురుతేచ యాత్‌ | స్వవేశ్మని యథాన్యాయ ముపాస్తే భైక్ష్య మేవ చ || 49

ద్వికాలమగ్నిహోత్రం చ జుహానో వై యథావిధి | గ్రోబ్రాహ్మణ హితార్థాయ రణ చాభిముఖోహతః || 50

త్రేతాగ్ని మంత్ర పూతేన సమావిశ్య ద్విజో భ##వేత్‌ | జ్ఞాన విజ్ఞానసంపన్నః సంస్కృతో వేదపారగః || 51

వైశ్యో భవతి ధర్మాత్మా క్షత్రియః స్వేన కర్మనా | ఏతైః కర్మఫలైర్దేవి న్యూనజాతి కులోద్భవః || 52

శూద్రో7ప్యాగమ సంపన్నో ద్విజో భవతి సంస్కృతః | బ్రాహ్మణో వా7ప్య సద్వృత్తః సర్వసంకర భోజనః || 53

ఋతవచనుడు అహంభావము లేనివాడు. సుఖదుఃఖాది ద్వంద్వముల కతీతుడు. సామనిపుణుడు బ్రహ్మయజ్ఞాది నిత్యయజ్ఞములు సేయువాడు స్వాధ్యాయపరుడు అచారశీలుడు ఇంద్రియముల నదిమినవాడు సత్కార్యకర్త సర్వవర్ణములయెడ నసూయ లేనివాడు గృహస్థవ్రతమూని రెండువేళల మాత్రమే భూజించుచు శిష్టశేషము యజ్ఞశేషము నారగించుచు నిష్కాముడు నిరహం మతి యథావిధికాలముగ హోమము సేయుచు నగ్న్యుపాసన సేయువాడు నర్వులకు నాతిథ్యమొసంగుచు శేషాన్నము మాత్రమే తాను భుజించు వాడునగు వైశ్యుడు త్రేతాగ్నిమాత్ర సంపాద్యమైన బ్రాహ్మణత్వములడుగ ఆ వైశ్యుడు తొలుత క్షత్రియుడై పుట్టి జన్మాది సంస్కారములు వొంది మంచి దక్షిణ నిచ్చి యజ్ఞములు సేయువారికి దానములు సేసి స్వర్గము కోరి అధ్యయనము సేసి త్రేతాగ్నిహోత్రియై ఎల్లపుడు తడిచేతితో దానములు సేయును. చేయు ఆరకుండ ధారాపూర్వకముగ (బహుదానములు చేయుచున్నమాట) ప్రజలను ధర్మమున బాలించుచు సత్యవచనుడై ఆచారవంతుడై సత్యము అయిన ధర్మములను జేయుచు ధర్మదండముచే దగ్దుండుగాక (రాజందఱిని దండించువాడయ్యును నాతనిపై శాస్త్రవిహిత ధర్మదండన మనునది యొకటియుండి యాతని నదుపులో పెట్టు చుండును. దానిచే రాజు దగ్ధుండు కాకపోవుట యనగా దానికి లోబడి ప్రజారక్షణ శిక్షణలు చేసి దానికి విదేయుడై యుందవలెనన్నమాట) ధర్మకామార్థములను మూడు పురు షార్థములను సాధించుచు కార్యములచే కార్యసాధనములచే నియమింపబడినవాడై ప్రజలవలన నాఱవవంతు మాత్రమే పన్ను గ్రహించువాడై స్వేచ్చగొని గ్రామ్యధర్మ ములను సేవింపక అర్థశాస్త్రము చక్కగ నెఱిగి ఋతుకాలమందు పత్నీసమావేశము నొంది (సదా బ్రహ్మచారియై) సదోపవాసియై (నియమిత భోజనములు రెండిటి నడుమ నెట్టి అల్పాహారములు గొనకుండువాడు సదోవవాసి) స్వాధ్యాయ నిరతుడై శుచియై గృహమంద యుండి మూడువర్ణములవారికిని అతిథ్యమిచ్చుచు మంచిమనసుతో నిత్యము నన్నమడుగు శూద్రులకు సిద్దవైయున్నది రండనుచు స్వార్థముచేకాని కామముచేగాని యేకొంచెమును జూడక కేవలము పిత్రదేవాతిథి నిమిత్తముగానే సాధనము సేయుచు దనయింటనే తాను భిక్షాన్నమును సేవించి ద్వికాలమగ్ని హోత్రములు సేయుచు గోబ్రాహ్మణ హితమునకై మాత్రమే ప్రవర్తించుచు యుద్దమందు వెన్నుజూపక యటం గూలియత్రేతాగ్ని మంత్రపూతమయిన ఉపాధితో శరీరమింకోకటి ప్రవేశించి ద్విజుడగును. అప్పుడు జ్ఞానవిజ్ఞాన సంపన్నుడై వేదపారగుడై సుసంస్కృతుడై వైశ్యుడిట్టి క్షత్రియత్వమును బడయును. శూద్రుడును అగమ విధానముచే (వైదికప్రక్రియతో గాదు) సంస్కారములనంది ద్విజుడగును.

స బ్రాహ్మణ్యం సముత్సృజ్య శూద్రోభవతి తాదృశః | కర్మభిః శుచిభిర్దేవి శుధ్దాత్మా విజితేంద్రియః || 54

శూద్రో7పి ద్విజవత్సేవ్య ఇతి బ్రహ్మా7బ్రవీత్స్వయమ్‌ | స్వభావకర్మనా చైవ యశ్చశూద్రో7ధితిష్టతి || 55

విశుద్దః స ద్విజాతిభ్యో విజ్ఞేయ ఇతి మేమతిః | న యోని ర్నాపి సంస్కారో న శ్రుతిర్న చ సంతతిః || 56

కారణాని ద్విజత్వప్య వృత్తమేవ తుకారణమ్‌ | సర్వో7యం బ్రాహ్మణో లోకే వృత్తేన తు విధీయతే || 57

వృత్తే స్థితశ్చ శూద్రో7పి బ్రాహ్మణత్వం చ గచ్చతి | బ్రహ్మ స్వభావః సుశ్రోణి సమః సర్వత్ర మేమతః || 58

నిర్గుణం నిర్మలం బ్రహ్మయత్ర తిష్టతి స ద్విజః | ఏతే యేనిమలా దేవిః స్థానాభావనిదర్శకాః || 59

స్వయం చ వరదేనోక్తా బ్రహ్మణా సృజతా ప్రజాః | బ్రహ్మణో హి మహత్షేత్రం లోకే చరతి పాదవత్‌ || 60

యత్తత్ర బీజం పతతి సా కృషి | ప్రేత్య భావినీ | సంతుష్టేన సదా భావ్యం సత్పథా లంబినా సదా || 61

బ్రాహ్మం హి మార్గమాక్రమ్య వర్తితవ్యం బుభూషతా | సంహితాధ్యాయినా భావ్యం గృహే వై గృహమేధినా || 62

నిత్యం స్వాధ్యాయ యుక్తేన న ఛాధ్యయన జీవినా | ఏవంభూతో హియోవిప్రః సతతం సత్పథే స్థితః || 63

అహితాగ్ని రధీయానో బ్రహ్మభూయాయ కల్పతే | బ్రాహ్మణ్యందేవి సంప్రాప్య రక్షితవ్యం యతాత్మనా || 64

యోనిప్రతి గ్రహాదానైః కర్మభిశ్చశుచిస్మితే | ఏతత్తే గుహ్యమాఖ్యాతం యథా శూద్రో భ##వేద్విజః || 65

బ్రాహ్మణో వా చ్యుతో ధర్మా ద్యథా శూద్రత్వ మాప్నుయాత్‌ || 65

ఇతి శ్రీ మహాపురాణ అది బ్రహ్మే ఉమా మహేశ్వర సంవాదే సంకర జాతి లక్షణ వర్ణనంనామ త్రయో వింశత్యధిక ద్విశతతమో7ధ్యాయః

బ్రాహ్మణుడుడేయగుగాక అసద్వృత్తముచే సర్వసంకర భోజనముచే బ్రాహ్మ ణ్యముం గోల్పోయి శూద్రత్వ మందును. శుచికర్మాచరణముచే దేవీకటాక్షముచే మనస్సు శుద్దినంది జితేంద్రియుడైన శూద్రుడును ద్విజుని యట్లసేవింపదగినవాడని బ్రహ్మస్వ యముగ బల్కెను. స్వభాకర్మచేత శూద్రుడు ప్రవర్తించునేని అతడు ద్విజులకంటెను. విశుద్దుడని నాతలంపు. యోనికాదు (జన్మకాదు) సంస్కారము కాదు శ్రుతి కాదు సంతానము గాదు. ద్విజత్వమునకు కారణము కేవలము వృత్తమే (నడవడియే). బ్రాహ్మణుడను నీ సర్వజాతియు లోకమందు వృత్తముననుసరించి విధింపబడును. వృత్తముననున్న శూద్రుడుగూడ బ్రాహ్మణత్వముందును. ఓ రమణి! బ్రహ్మస్వభావ మునగా సర్వత్ర సమత్వమని నాతలంపు. నిర్గుణము నిర్మలమునైన బ్రహ్మ యెవ్వనియం దుండు నతడు ద్విజుడు (బ్రహ్మవిషయక జ్ఞానము కలవాడన్నమాట) ఇట్టి పవిత్రులు ఒక స్థానము ఒక అధికారము ననిలేని యొక విలక్షణస్థితికి నిదర్శనమైయుందురు. ప్రజాసృష్టి సేయు బ్రహ్మయే స్వయముగా నిట్లుసెప్పెను. బ్రహ్మపదార్థము యొక్క మహాక్షేత్రము పాదములచే నీలోకమందు బ్రాహ్మణరూపమున సంచారము సేయు చున్నది. అక్కడపడిన విత్తనము ఈ కృషి (వ్యవసాయము) పరమందు ఫలవంతమ గును. నిత్యసంతుష్టుడై బ్రాహ్మమార్గము ననుసరించి సంహితాధ్యయనము నిత్యము సేయుచు గృహమందుత్తము గృహస్థై నిత్యము స్వాధ్యాయమే బ్రతుకుగా వేదాధ్యయన ముచే సంపాదనసేసి బ్రతుకక యుండు విప్రుడు నిత్యసన్మార్గవర్తి అహితాగ్ని అధ్యయన పుడునైన విప్రుడు బ్రహ్మభావమున కర్హుడగును. బ్రహ్మాణ్యము వీడక మనసు నియమిం చుకొని దానిం జన్మకారణమైన సహజద్విజత్వము. చేతను సత్ర్పతి గ్రహముచేత దానముల చేయుటచేతను విహిత కర్మాచరణములచేతను గాపాడుకొనవలయును. ఇది చాల గుహ్యమైన విషయము. శూద్రుడు ద్విజుడు కాగలవిధానము ద్విజుడు ధర్మచ్యుతి నొంది శూద్రుడగురీతియు నీకు దెల్పితిని.

ఇది శ్రీ బ్రహ్మపురాణమునందు ఉమామహేశ్వరసంవాదమున సంకరజాతిలక్షణవర్ణనమను రెండువందల యిరవది మూడవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters