Brahmapuranamu    Chapters   

అథద్వావింశత్యధికద్విశతతమో7ధ్యాయః

వర్ణాశ్రమధర్మవర్ణనమ్‌.

మునయ ఊచుః

శ్రోతు మిచ్ఛామమే బ్రహ్మ స్వర్ణధర్మా న్విశేషతః | చతురాశ్రమధర్మాంశ్చ ద్విజవర్య బ్రవీహితాన్‌ || 1

వ్యాస ఉవాచ

బ్రాహ్మణ క్షత్రియవిశాం శూద్రాణాం చ యథాక్రమమ్‌ | శృణుధ్యం సంయతాభూత్వా వర్ణధర్మాన్మయోదితాన్‌ || 2

దయాదానతపోదేవ యజ్ఞ స్వాధాయతత్పరైః | నిత్యోదకీ భ##వేద్విప్రః కుర్యాచ్చాగ్నిపరిగ్రహమ్‌ || 3

వ్యత్త్యర్థం యాజయేత్త్వన్యాన్ద్విజానధ్యాపయే త్తథా | కుర్యాత్ర్పతి గ్రహాదానం యజ్ఞార్థం జ్ఞానతో ద్విజాః || 4

సర్వలోకహితం కుర్యా న్నాహితం కస్యచిద్ద్విర్ఛవేద్ద్విజాః | మైత్రీ సమ స్తసత్త్వేషు బ్రాహ్మణస్యోత్తమం ధనమ్‌ || 5

గవి రత్నే చ పారక్యే పమబుద్ధిర్భవే ద్ద్విజః | బుతా వభిగమః పత్న్యాం శస్యతే చా7స్య భోద్విజా || 6

దానానిదద్యా దిచ్ఛాతో ద్విజేభ్యః క్షత్రియో7పిహి| యజేచ్చ వివిధైర్యజ్ఞై రధీయీత చ బోద్విజాః || 7

శస్త్రాజీవో మహీరక్షా ప్రవరా తస్య జీవికా | తస్యాపి ప్రథమే కల్పే పృథివీ పరిపాలనమ్‌ || 8

ధరిత్రీపాలనే నైవ కృతకృత్యా నరాధిపాః | భవంతి నృపతేరక్షా యతో యజ్ఞాది కర్మణామ్‌ || 9

దుష్టానాంశాననా ద్రాజా శిష్టానాం పరిపాలనాత్‌ | ప్రాప్నో త్యభిమాతా న్లోకా స్వర్ణసంస్థాపకో నృపః || 10

పాశుపాల్యం వణిజ్యాం చ కృషిం చ మునిసత్తమాః | వై శ్యాయ జీవికాం బ్రహ్మా దదౌ లోకపితామహః || 11

తస్యా ప్యధ్యయనం యజ్ఞోదానం ధర్మశ్చ శస్యతే | నిత్యనైమి త్తికాదీనామనుష్టానం చ కర్మణామ్‌ || 12

ద్విజాతిసంశ్రయం కర్మ తదర్థం తేనపోషణమ్‌ | క్రయవిక్రజైర్వా7పి ధనైః కారుభ##వైస్తు వా || 13

దానం దద్యాశ్చ శూద్రో7పి పాకయజ్ఞైర్యజేత చ | పిత్ర్యాదికం చ వై సర్వం శూద్రః కుర్వీత తేనవై || 14

భృత్యాదిభరణార్థాయ సర్వేషాం చ పరిగ్రహః | ఋతుకాలాభిగమనం స్వదారేషు ద్విజోత్తమాః || 15

దయా సమస్తభూతేషు తితిక్షా నాతిమానితా | సత్యం శౌచమనాయాసో మంగళం ప్రియవాదితా || 16

మైత్రీ చై వాస్పృహా తద్వదకార్పణ్యం ద్విజోత్తమాః | ఆనసూయాచ సామాన్యా వర్ణానాం కథితాగుణాః || 17

ఆశ్రమాణాం చ సర్వేషామేతే సామాన్యలక్షణాః | గుణా స్తథో పధర్మాశ్చ విప్రాదీనామిమే ద్విజాః || 18

క్షాత్రం కర్మ ద్విజస్యోక్తం వైశ్యకర్మ తథా77పది | రాజన్యస్య చ వైశ్యోక్తం శూద్రకర్మాణి చైతయోః || 19

సామర్ధ్యే సతి త్యాజ్యముభాభ్యా మపి చ ద్విజాః | తదేవా77పది కర్తవ్యం న కుర్యాత్కర్మ సంకరమ్‌ || 20

ఇత్యేతే కథితా విప్రా వర్ణధర్మా మయా7ద్యవై | ధర్మమాశ్రమిణాం సమ్యగ్భ్రువతో7పి నిబోధత || 21

మునులడుగ వర్ణ ధర్మములను నాల్గాశ్రమ ధర్మములు వ్యాసభగవాను డిట్లానతిచ్చెను.

బ్రాహ్మణునికి దానము దయ తపస్సు దేవ పిత్రదేవతా¸్ఞుములు స్వాధ్యాయము ప్రధాన ధర్మములు. నిత్యోదకి(స్నానాదులతో చలికి వెఱువక) త్రిషవణస్నాననిరతుడు కావలెను. అగ్నులను ఉపాసింపవలెను. జీవనము కొఱకై యితరులచేత యజ్ఞములు సేయింప వచ్చును. శిష్యులకు వేదములు చెప్పవలెను. యజ్ఞనిమిత్తముగా దెలిసి (పాత్రాపాత్ర వివేకముతో) ప్రతిగ్రహము సేయవచ్చును. బ్రాహ్మణునికి జెప్పబడిన షట్కర్మలలో ప్రతిగ్రహము (దానము పట్టుట) కూడ విహితమయి యున్నది. సర్వలోకమునకు హితమే చేయవలెను గాని యహితము సేయరాదు. సర్వభూతములతో మైత్రి బ్రాహ్మణుని కుత్తమధనము. ఋతుసమయమందే భార్యాభిగమనము దీనికి బ్రశంసాపాత్రము.

క్షత్రియుడు మనఃస్పూర్తిగ ద్విజులకు దానముల యజ్ఞములు వేదాధ్యయనము చేయనగును. జగద్రక్షణకై అస్త్రము పట్టి జీవించుట క్షత్రియుని ధర్మము. భూపాలనము కూడ ప్రధానధర్మము. దాననే రాజులు కృతార్థులు. యజ్ఞాదిరక్షణము రాజు ధర్మము. దుష్టులను శిక్షించుట శిష్టులను రక్షించుట వర్ణధర్మవ్యవస్థ చేయుటవలన రాజభీష్ట పుణ్యలోకగామి యగును.

పశుపాలనము వాణిజ్యము కృషి (వ్యవసాయము) వైశ్యునివృత్తిగా (జీవికగా) బ్రహ్మ యొసంగెను.అతనికి గూడ అధ్యయనము యజ్ఞము దానము ధర్మము అనునవి నిత్య నైమిత్తిక కర్మానుష్టానములు బ్రాహ్మణ పురస్సరముగా కర్మాచరణము విహితము. అందులకే బ్రహ్మణులను బోషించుట అందుకొరకే క్రయవిక్రయ వ్యాపారము వడ్రంగము వైశ్యునికి విహితములు. శూద్రుడు దానము లీయవలెను. పాకయజ్ఞములు సేయవలెను. పాకయజ్ఞము చేతనే పితరుల నర్చించుట మొదలగు నర్వకర్మాచరణము విహితము. నౌకరులను భరించుటకు సర్వపరిగ్రహములు సేయవచ్చును. ఋతుకాలాభిగమన మందఱికిని సామాన్యధర్మము, అంతేకాదు సర్వభూతదయ ఓరిమి దురభిమానములేమి శౌచము అనాయాసము మంగళకార్యచరణము ప్రియముగా మాట్లాడుట. సర్వులతో మైత్రి దురాశ లేకుండుట ఇవి యన్ని వర్ణములకు అన్ని యాశ్రమములవారికిని సాధారణ లక్షణములు. ఇవిగాక బ్రాహ్మణాదులకు ఈ క్రింది ఉపధర్మములు(అపద్ధర్మము లన్నమాట) కూడ చెప్పబడినవి. అపద్ధర్మముగా (జీవనము గడువనపుడు) బ్రాహ్మణుడు క్షేత్రధర్మమును క్షత్రియుడు వైశ్యధర్మమును వైశ్యుడు శూద్రవిహిత కర్మమును జేయవచ్చును. వైశ్యశూద్రులు సమర్థులై యుండి యీ స్వధర్మములను విడువరాదు. అపద్ధర్మములో కూడ వారికిది త్యాజ్యముగాదు. కర్మసాంకర్యము మాత్రమెన్నడును జేయగూడదు. ఇవివర్ణధర్మములు సెప్పితిని.ఇక నాశ్రమధర్మములం దెల్పెద నెఱింగికొనుము.

బాలః కృతోపనయనో వేదాహరణతత్పరః | గురోర్గేహే వసన్విప్రా బ్రహ్మచారీ సమాహితః || 22

శౌచాచారరత స్తత్రకార్యం శుశ్రూషణం గురోః | వ్రతాని చరతా గ్రహ్యో వేదశ్చ కతబుద్ధినా || 23

ఉభే సంద్యే రవిం విప్రా స్తథై వాగ్నిం సమాహితః | ఉపతిష్టేత్తథా కుర్యాద్గురోరప్యభి వాదనమ్‌ || 24

స్థితే తిష్టేద్ర్వజేద్యాతి నీచై రాసీత చా7సితే | శిష్యో గురౌ ద్విజశ్రేష్టాః ప్రతికూలం చ సంత్యజేత్‌ || 25

తేనైవోక్తం పఠేద్వేదం నాన్యచిత్తః | పురస్థితః | అనుజ్ఞాతం చ భిక్షాన్నమశ్నీ యాద్గురుణా తతః || 26

అవగాహేదపః పూర్వమాచార్యేణావగాహితాః | సమిజ్జలాదికం చాస్య కల్పకల్ప ముపానయేత్‌ || 27

గృహీతగ్రాహ్యవేదశ్చ తతో7నుజ్ఞామవాప్యవై | గార్హస్థ్యమావసేత్రాజ్ఞో నిష్పన్న గురు నిష్కృతిః || 28

బాలుడుపనీతుడై వేదధ్యయన తత్పరుడై గురుగృహమందు వసించుచు బ్రహ్మచారియై యుండవలెను. సదాచారమం దభిలాషగొని గురుశుశ్రూష చేయవలెను. (శూశ్రూష-వినవలెనను కోరిక అనగా గురువు చెప్పినట్లు వినుటయనగా నా ప్రకారము నడుచుట) వ్రతములం జేయవలెను.(అనగా బ్రహ్మచర్య నియమములను బాటింపవలెను.) మనసు నిల్పి (అవధానము గొని) వేదము నేర్చుకోవలెను. మది కుదురుపరచికొని యుభయసంధ్యలందు నగ్నికార్య మొనరించి గురున కభివానము సేయనగును. గురువు నిలువబడిన తాను నిలువబడి నడచిన వెంటనడచి యాయనకు క్రిందుగ కూర్చుండవలెను. గురునకు బ్రతికూలమైన పని వదలిపెట్టవలెను. ఆయనతో వేదము పఠింపవలెను. అతని కెదురుగా గూర్చుండి వేరుతలపు గొనకుండవలెను. అపై భిక్షాన్నము తెచ్చికొని గురునకు నివేదించి తదనుమతిం దానది తినవలెను. గురువు దిగి స్నానము సేసిన తరువాత నీతీర్థమందు దాను దిగి స్నానము సేయవలెను. సమిధులు తీర్థమును నీయనకై ప్రతికల్పము(అవసరమైనపుడెల్ల) దేవలయము. వేదములు సదివిన తరువాత గురుదక్షిణ సమర్పించి ప్రాజ్ఞుడై గార్హస్థ్యమందు బ్రవేశింపవలెను.

విధినావా7ప్త దారస్తు ధనంప్రాప్య స్వకర్మణా | గృహస్థ కార్యమఖిలం కుర్యాద్విప్రాః స్వశక్తితః || 29

నిర్వాపేణ పితౄనర్చ్య యజ్ఞైర్దేవాం స్తథా7తిథీన్‌ | అన్నైర్మునీం శ్చ స్వాధ్యాయైరపత్యేన ప్రజాపతిమ్‌ || 30

బలికర్మణాతుభూతాని వాక్సత్యేనాఖిలం జగత్‌ | ప్రాప్నోతి లోకాన్పురుషో నిజకర్మసమార్జితాన్‌ || 31

భిక్షాభుజశ్చ యే కేచిత్పరివాడ్ర్బహ్మచారిణః | తే7ప్యత్ర ప్రతితిష్ఠంతి గార్హస్థ్యం తేన వై పరమ్‌ || 32

వేదాహరణకార్యేణ తీర్థస్నానాయ చ ద్విజా ః | అటంతి వసుధాం విప్రాః పృథివీ దర్శనాయ చ || 33

అనికేతా హ్యనాహారా యే తు సాయం గృహాస్తుతే | లేషాం గృహస్థః సతతం ప్రతిష్టా యోనిరుచ్యతే || 34

లేషాం స్వాగతదానాని వక్వవ్యం మధురం సదా | గృహాగతానాం దద్యాశ్చ శయనాసన భోజనమ్‌ || 35

అతిథిర్యస్య భగ్నాశో గృహాత్ర్పతి నివర్తతే | సదత్త్వా దుష్కృతం తసై#్మ పుణ్యమాదాయగచ్ఛతి || 36

అవజ్ఞాన మహంకారో దంభశ్చాపి గృహే తతః | పరివాదోప ఘాతౌ చ పారుష్యం చ స శస్యతే || 37

యశ్చ సమ్యక్కరోత్యేవం గృహస్థః పరమం విధిమ్‌ | సర్వబంధవినిర్ముక్తో లోకానాప్నోతి చోత్తమమ్‌ || 38

శక్తికొలది గృహస్థు సేయనగు కార్యమెల్ల జేయవలెను. పితృదేవతలను నిర్వాపముచే (తర్పణములచే) దేవతలను నతిథులను యజ్ఞములచే మునుల నన్నదానము స్వాధ్యాయములచే సంతతిచేత బ్రజాపతిని బలికర్మచే భూతములను సత్యవచనముచే నెల్లజగమ్మును నర్చించి పురుషుడు తాజేసిన యీ పుణ్యకర్మ ప్రభావమున బుణ్యలోకములనందును. భిక్షాన్న భోజనులగు సన్యానులు బ్రాహ్మచారులు మఱియుంగలవారు యీ గృహమునెడ(గృహస్థునెడ) నిలుతురుగావున గార్హస్థ్యము. పరమాశ్రమధర్మము. వేదమలు నేర్చుకొనుపనితో తీర్థస్థానము కొరకు పృథివీదర్శనము కొఱకు ద్విజులు వసుధపై సంచార మొనరింతురు. ఇల్లులేక ఆహారము లేక సాయంకాలమం దెవరిండ్లకు వత్తురెవ్వరు. వారికి గృహస్థులు నిలువనీడ యని చెప్పబడినాడు. అతడు వారికి మధురాతి మధుర భాషణముల స్వాగతంబు పలుకవలె. (అయ్యా! దయసేయుడనవలయును) ఆ మీద దానములు సేయగోరు(అన్ని దానాదులు) ఇంటికేగుదెంచిన వారికి పరుండంగూరుచుండ తిన శయనాసన భోజనాదులం గూర్పవలయును. భగ్నాశుడై యతిథి యెవ్వని యిలు వదిలిపోవునో యా యతిథి తన పాపమాయింటి యయమానికిచ్చి వాని పుణ్యమం గొనిపోవును. ఈసడింపు అహంకారము డాంబికము నింద ఉపఘాత పారుష్యము గృహికి తగదు. గృహస్థీ యుత్తమధర్మము పాటించి సర్వబంధముక్తుడై యుత్తమ లోకములం బడయును.

వయః పరిణతౌ విప్రాః | కృతకృత్యో గృహాశ్రమీ |పుత్రైషు భార్యాం నిక్షిప్య వనం గచ్ఛేత్సహైవ వా || 39

వర్ణమూల ఫలాహారః | కేశశ్మశ్రుజటాధరః | భూమిశాయీ భ##వేత్తత్ర మునిః సర్వాతిథిర్ద్విజాః || 40

చర్మకాశకుశైః కుర్యా త్పరిధానో త్తరీయకే | తద్వ త్రిషవణం స్నానం శస్తమస్య ద్విజో త్తమాః || 41

దేవతాభ్యర్చనం హోమః సర్వాభ్యాగత పూజనమ్‌ | భిక్షా బలిప్రదానం తు శస్తమస్య ప్రశస్యతే || 42

వన్యస్నేహేన గాత్రాణా మభ్యంగశ్చాపి శస్యతే | తపస్యా తస్య విప్రేంద్రాః శీతోష్ణాది సహిష్ణుతా || 43

యస్త్వేతా నియతశ్చర్యా వానప్రస్థశ్చరేన్మునిః | స దహత్యగ్ని వద్దోషాన్‌ జయేల్లోకాంశ్చ శాశ్వతాన్‌ || 44

వయస్సు పండినతఱి గృహాశ్రమి కృతకృత్యుడై భార్యను ఋత్రుల కప్పగించి వనమేగవలెను. ఆమెతోనైన నేగవచ్చును. రాలినయాకులు దుంపలు రాలినపండ్లు దినుచు జుట్టు గడ్డము జటలు వెంచికొని నేలం బరుండుచునట మునియై సర్వులకుం దాన యతిథియై యుండవలయును. చర్మములు రెల్లు దర్భలతో నల్లినవానిం గట్టుకొనవలెను. పైని వేసికొనవలెను. తప్పక త్రిషవణ స్నానము సేయవలెను. దేవతార్చనము హోమము సర్వాభ్యాగతపూజ భిక్ష బలిప్రదానము నీ వానప్రస్థునకు ప్రశస్తమని చెప్పబడినది. అడవినూనెలతో నభ్యంగస్నానమును వీనికి బ్రశస్తము. శీతోష్ణాది ద్వంద్వసహనము తపస్సునకు నీ నియమములం బూని వానప్రస్థుడు చరింపవలెను. అట్టి పుణ్యుడు అగ్ని యట్లెల్ల దోషములం దహించి శాశ్వత పుణ్యలోకములంద గలడు.

చతుర్థశ్చా77శ్రమో భిక్షోః ప్రోచ్యతే యో మనీషిభిః | తస్య స్వరూపం గదతో బుధ్యధ్యం మమసత్తమాః ||

పుత్రద్రవ్యకళ##త్రేషు త్యజేత్స్నేహం ద్విజోత్తమాః | చతుర్థమాశ్రమస్థానం గచ్ఛేన్నిర్దూత మత్సరః || 46

త్రైవర్ణికాం స్త్యజేత్సర్వానారంభాన్ద్విజసత్తమాః | మిత్రాదిషు నమో మైత్రః సమస్తేప్వేవ జంతుషు || 47

జరాయుజాండజాదీనాం వాఙ్మనః కర్మభిః క్వచిత్‌ | యుక్తః కుర్వీత న ద్రోహం సర్వసంగాశ్చ వర్జయేత్‌ || 48

ఏకరాత్ర స్థితిర్గ్రామే పంచరాత్ర స్ధితిః పురే | తథా ప్రీతిర్న తిర్యక్షు ద్వేషో వా నాస్య జాయలే || 49

ప్రాణయాత్రా నిమిత్తంచ వ్యంగారే7భుక్తవజ్జనే | కాలే ప్రశస్తవర్ణానాం భిక్షార్థీ పర్యటేద్దృహాన్‌ || 50

అలాభే న విషాదీస్యా ల్లాభే నైవ చ హర్షయేత్‌ | ప్రాణయాత్రికమాత్రః స్యాన్మాత్రా సంగాద్వినిర్గతః || 51

అతిపూజిత లాభాంస్తు జుగుప్యాం చైవ సర్వతః | అతిపూజిత లాభై స్తు యతిర్ముక్తో7పి బధ్యతే || 52

కామః క్రోధ స్తథా దర్పో లోభమోహాదయశ్చయే | తాంస్తు దోషాన్పరిత్యజ్య పరివ్నాణ్నిర్మమో భ##వేత్‌ || 53

అభయం సర్వస్తత్త్వేభ్యో దత్త్వా యశ్చరతే మహీమ్‌ | తస్య దేహాద్విముక్తస్య భయం నోత్పద్యలేక్వచిత్‌ || 54

కృత్వా7గ్నిహోత్రం స్వశరీర సంస్థం శరీరమగ్నిం స్వముఖే జుహోతి |

విప్రస్తు భిక్షోపగతై హవిర్భిశ్చితాగ్నినా స ప్రజతి స్మ లోకాన్‌ || 55

మోక్షాశ్రమం యశ్చరతే యధోక్తం శుచిశ్చ సంకల్పిత బుద్దియుక్తః ||

అనింధనం జ్యోతిరివ ప్రశాంతం స బ్రహ్మలోకం వ్రజతి ద్విజాతిః || 56

ఇతి శ్రీ మహాపురాణ ఆదిబ్రాహ్మే వ్యాసర్షిసంవాదే వర్ణాశ్రమధర్మవర్ణనంనామ ద్వావింశత్యధికద్వి శతతమో7ధ్యాయః

చతుర్థాశ్రమము భిక్షువునకు సంబంధించినది. సన్న్యాసమును పేరనగు నా యాశ్రమధర్మముం దెల్పెద నెరింగి కొనుడు. కలత్రపుత్ర దనాదులందు స్నేహములం బాయవలెను. మాత్సర్యమేమాత్రము నుండరాదు. త్రైవర్ణిక ధర్మములం గర్మల నన్నింటిని విడువవలెను. మిత్రాదుల మైత్రుడు సముడునై యెల్లభూతములందు నట్లుండవలెను. జరాయుజములు(మావివలన బుట్టినవి) అండజములు(పక్షులు) స్వేదజములు(చెమటవలన బుట్టు క్రిములు) ఉద్భిజ్జములు (విత్తునుండి పుట్టు వృక్షాదులు) నగు వీనియందెందును త్రికరణములచే నెట్టి ద్రోహము సేయరాదు. సర్వసంగములు వీడవలెను. ఒకయూర నొక్క రాత్రి పురమం దైదురాత్రులు మాత్రమే యుండవలెను. పశుపక్ష్యాదులందు ప్రీతిద్వేషమును వీనికుండదు. ప్రాణయాత్రా నిమిత్తముగనే నిప్పులార్పుకొని జనములు భుజించిన తర్వాత ప్రశస్తవర్ణములు వాండ్లకడ భిక్షాటనముసేయవలెను. భిక్ష దొరకనిచో విషాదపడరాదు. దొఠకిన హర్షపడరాదు. ప్రాణయాత్రమాత్ర మాత్రాకాలనంగముగొని వెడలిపోవలెను. మితిమీరిన పూజ లాభముల నెల్లడను సహించుకొనవలెను. కామము క్రోధము దర్పము లోభము మోహము మొదలగు దోషములను వీడి నాది నేనను భావము లేక (నిర్మముడు నిరహంకురుడై) యుండవలెను. వానికి దేహమును వదలునపుడును భయము కలుగదు. తన మేనిలోని యగ్నిని తన ముఖమున నగ్నిహోత్రమాచరించి అనగా తనలోనున్న జఠరాగ్నియందు వైశ్వానరాగ్నియందు హవిస్సుగా పంచాహుతుల రూపమున నాహారమును హోమద్రవ్యముగా వేల్చి అదిగూడ భిక్షారూపమున దెచ్చికొన్నదానినే హోమముసేసి చితాగ్నులైనవారియొక్క లోకముల కాతడేగును. అగ్నిచయనము సేసిన వారేగు లోకములందు నన్నమాట) ఇదంతయు వివిదిషాది సంన్య్నాసులన్నమాట. ఇక మోక్షాశ్రమ సన్యాసియో (విద్వత్సనన్య్నాసి యన్నమాట) యథోక్త విధానమున నాశ్రమధర్మము నిర్వహించి సంకల్పిత బుద్ధితో ననింధనమయిన జ్యోతివలె (కట్టెలులేని నిప్పువలె) ప్రశాంతమయిన యా బ్రహ్మలోకమును బొందును. ద్విజులకు మాత్రమే యీ యాశ్రముము సెప్పబడినది.

ఇది శ్రీ బ్రహ్మపుఠాణమందు వర్ణాశ్రమధర్మ వర్ణనమను రెండువందల ఇరువది రెండవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters